X
    Categories: ఫేస్ ప్యాక్స్

మీ చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు ఫేస్ప్యాక్స్

చాలా మంది ఆడవారు వారి చర్మం తెల్లగా, కాంతివంతంగా ఉండాలని చాల విధమైన క్రీముల్ని, ప్రాడక్టుల్ని వాడుతుంటారు కానీ తెలియని విషయమేంటంటే అవి మీ చర్మానికి హాని తలపెడతాయని అలాగే చర్మం ముదిబారిపోయేలా చేస్తాయన్నది నిజం. వీటివల్ల చర్మం మృత చర్మంగా తయారవుతుంది. అంతేకాక వాటిలోని రసాయనాలు చర్మంపై దుష్ఫలితాల్ని చూపిస్తాయి. చర్మం కొన్ని రోజుల్లో చక్కగా తెల్లగా వచ్చినా కానీ కొన్ని రోజులకు కాంతి విహీనమైపొతుంది. అంతేకాక చర్మం రంగు తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే వాతావరణం, కాలుష్యం, చర్మానికి తగినంతా ఆక్సీజన్ సరిపోకపొవటం వాటి వల్ల చర్మం కాంతి విహీనమైపోతుంది. ఇక ఇంకో ప్రధాన కారణంగా స్ట్రెస్ అని కూడా చెప్పవచ్చు. అది మానసికంగా కావొచ్చు లేదా శారీరక ఆందోళన కావచ్చు. అలాగే కాలుష్యం వల్ల కలిగే దుమ్ము ధూళి, సూర్య కాంతి వల్ల వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. చర్మం కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల కూడా ఇలా జరుగ వచ్చు.
సాధారణంగా నేచురల్ స్కిన్ ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకోవటం సహజం. అయితే రంగు ఉండే వ్యక్తులకు అన్ని రకాల రంగులూ నప్పుతాయి. కానీ కాస్త రంగు తక్కువగా ఉండేవారికి కొన్ని మాత్రమే నప్పుతాయి. అయితే మన అందరికీ పుట్టుకతో పూర్తిగా చక్కటి కలర్ రాకపోవచ్చు. కాకపోతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలావరకూ మంచి రంగును తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా క్రీముల్లో బ్లీచ్ అలాగే స్తెరాయిడ్లు కలిసి ఉంటాయి. ఇవి మీ చర్మానికి హాని చేకూరుస్తాయి. కాబట్టి కొన్ని గృహ చిట్కాలను పాటించటం ద్వారా మీ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకోవచ్చు. కొన్ని క్రీములు వాడటం వల్ల వాటి రసాయన ప్రభావం చర్మాన్ని నాశనం చేస్తాయి. అయితే కొన్ని ఫేస్ప్యాక్స్ మీ కిచెన్ లోనే ఉన్నాయి. అవేంటో చూద్దామా..

చర్మసౌందర్యానికి గృహ సంబంధ సహజసిధ్ధ ఫేస్ప్యాక్స్

1.టీ నీరు
2.బియ్యం పిండి
3.తేనె
ఒక సగం టేబుల్ స్పూన్ తేనెను ఒక కప్పు టే నీరు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండితో కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని చక్కగా ముఖానికి పట్టించి మస్సాజ్ చేసుకోవాలి. మస్సాజ్ స్ట్రోక్ లను జాగ్రత్తగా ఇవ్వాలి. తర్వాత 15-20 నిముషాల పాటు ఉంచుకున్న తర్వాత నెమ్మదిగా ఆ ఫేస్ మాస్క్ ను జాగ్రత్తగా తీసేయ్యాలి. అలాగే స్చ్రబ్ చేస్తూ తీయాలి. ఎందుకంటే ముఖం మీద ఉన్న మృత చర్మం కూడా వచ్చెలా చూడాలి.
అయితే బియాపు పిండి మంచి స్క్రబ్బర్ గా పని చేస్తుంది. అలాగే తేనె చర్మ సౌందర్యానికి కాంతివంతం చేయటంలో తోడ్పడుతుంది.

పసుపు ప్యాక్

1.పసుపు
2.నిమ్మరసం
3.శనగ పిండి
4.పాలు
ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ పాలు ఒక బౌల్ లో వేసుకుని దానితో పాటూ, ఒక సగం టేబుల్ స్పూన్ నిమ్మరసం, సగం టేబుల్ స్పూన్స్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ శనగ పిండిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగుగా కలుపుని ముఖానికి వేసుకోవాలి. తర్వాత 15 నిముషాలు అలాగే ఉంచుకోవాలి. అది ఆరిపోయాక తర్వాత మమూలు నీటితో కడుగుకోవాలి. అలాగే కాటన్ తో మాత్రమే తుడుచుకోవాలి.

పాలు, తేనె ఫేస్ప్యాక్

1.పాలు
2.తేనె
3.నిమ్మరసం
ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలను కలుపుకోవాలి. వీటిని జాగ్రత్తగా మిశ్రమం గా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి రాసుకోవాలి. తర్వాత 15 నిముషాలు పాటూ వదిలేయాలి. తర్వాత మామూలు నీటితో కడుగుకోవాలి.

పెరుగు, ఓట్ మీల్ ప్యాక్

1.ఓట్ మీల్
2.పెరుగు
3.టొమోటొ
ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని,ఒక టేబుల్ స్పూన్ టొమోటొ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్ కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. తర్వాత 15-20 నిముషాలు ఉంచుకోవాలి. తర్వాత మామూలు నీటితో వాష్ చేసుకోవాలి. మెల్లగా రబ్ చేసుకుంటే ఓట్మీల్ వల్ల మీ మృత చర్మం ఊడిపోతుంది.

బంగాళాదుంప గుజ్జు ఫేస్ప్యాక్

బంగాళా దుంపా చాలా వాటికి ఔషధం. ఎందుకంటే దీనిలో విటమిన్-సి బాగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని చక్కగా నిలబెడుతుంది. బంగాళా దుంప గుజ్జు తీసుకుని ముఖానికి రాసుకోండి. అలాగే ఎండేంత వరకూ ఉంచుకోండి. 30 నిముషాల తర్వాత కడుగుకోండి. ఇలా రోజూ చేస్తే చాలా వరకూ మీ చర్మం మారుతుంది.
పెరుగులో మిల్డ్ బ్లీచింగ్ ఉంటుంది. అంతేకాక ఇది మంచి మోయిస్చరైజర్ గా పని చేస్తుంది. ఓట్మీల్ మీ చర్మంపై ఎంతో పనిచేస్తుంది. ఇది చర్మం పై ఉన్న మృత కణాలపై పని చేసి అద్భుత కృత్యాల్ని చేస్తుంది. టొమోటో ఒక మంచి రక్తస్రావ నివారిణిగా పని చేస్తుంది. దీని వల్ల ముఖం మీద రక్త ప్రసరణ బాగా పని చేసేలా చేస్తుంది. దీనిని వారానికి ఒకసారి వేసుకుంటే మంచిది.

ఆల్మండ్ ఆయిల్ ఫేస్ప్యాక్

ఆల్మండ్ ఆయిల్ తో రోజూ మీ ముఖాన్ని మస్సాజ్ చేసుకోవాలి. అయితే ఆయిల్ ను కొద్దిగా వేడి చేసుకుని రాసుకుంటే మంచి ఫలితముంటుంది. అలాగే చాలా సేపు ఈ ఆయిల్ తో మర్ధనా చేసుకుంటే ఎంతో మంచిది. అంతేకాక కొన్ని ఆల్మండ్ గింజల్ని తీసుకుని వాటిని రాత్రి అంతా నీటిలో నానపెట్టుకుని తెల్లవారు పొద్దున్నే గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించాలి. తర్వాత 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

పుదీన ఆకుల ఫేస్ప్యాక్

పుదీన ఆకులు రిఫ్రెష్ చేయటంలో మంచి పాత్రని పోషిస్తాయి. ఈ ఆకులు సహజ సిధ్ధమైన చర్మాన్ని మళ్ళీ వచ్చేలా చేస్తాయి. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకున్న తర్వాత ముఖానికి పెట్టుకోవాలి దీని వల్ల సన్ బర్న్స్, ఇతరత్రాలు పోతాయి.

అరటిపండు ఫేస్ప్యాక్

అరటిపండు చర్మపు సౌందర్యాన్ని ఇనుమడించేలా చేస్తుంది. ఒక అరటిపండు ను తీసుకుని దానికి తేనెను కలిపి ఫేస్ ప్యాక్ గా చేసుకుని పెట్టుకోవాలి. అంతేకాక దీనితో పాటు పెరుగును కూడా కలుపుకోవాలి. ముఖానికి పెట్టుకుని 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

పొడి నారింజల పీల్స్ ఫేస్ప్యాక్

ముందు నారింజ పీల్స్ ను తీసుకుని వాటిని ఎండబెట్టుకోవాలి. లేదా మార్కెట్లో నారింజ పీల్స్ పౌడర్ దొరుకుతుంది. ఏదైనా తీసుకుని వాటిని లేదా పౌడర్ ను తీసుకుని దానికి పెరుగు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గట్టిగా ప్యాక్ పట్టేందుకు ఉపయోగపడుతుంది. 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి.

గంధం పవుడర్

గంధం పవుడర్ లేదా చందనాన్ని తీసుకుని దానిని ఫేస్ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత కాసేపటికి వాష్ చేసుకోవాలి. ఆ ఫలితాల్ని మీరు చూడవచ్చు.

సహజసిధ్ధ పదార్ధ్ధలతో ఫేస్ప్యాక్

సహజసిధ్ధమైన పదార్ధాలైన పాలు,తేనె, పెరుగు, పండ్లు లాంటివి కూడా సహజసిధ్ధ ఫేస్ప్యాక్లుగా ఉపయోగించవచ్చు. ఇవి మీ స్కిన్ టోన్ ని బాగ మెరుగుపరుస్తాయి.

కుంకుమ, పాలు ప్యాక్

కుంకుమ, పాలు కలిసిన మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో పాలు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కుంకుమ వేసి దానిని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఆరిపోయాక 2 నిముషాలు మస్సాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొటిమలు అలాగే మచ్చల్ని పోగొడుతుంది. మొత్తం 15 నిముషాలు ఆగాక వాష్ చేసుకోవాలి.
బంగాళా దుంప, నిమ్మ ప్యాక్:
బంగాళాదుంప మొటిమలకు, మచ్చల్ని తొలగించగలదు. అంతేకాక ఇది ఆయిల్ స్కిన్ పై చాలా చక్కగా పని చేస్తుంది. నల్లటి వలయాల్ని పోగొడుతుంది. ఒక బంగాళాదుంప జ్యూస్ కు ఒక నిమ్మకాయను పిండి దానిని ఫేస్ప్య్హాక్ గా చేసుకుని పట్టించాలి. 20 నిముషాలు ఉంచుకున్నాక వాష్ చేసుకోవాలి.

పెరుగు, ఓట్స్ ప్యాక్

ఓట్స్ పిగ్మెంటేషన్ అలగే మొటిమలపై, మచ్చలపై ఫభావవంతంగా పని చేస్తాయి. అంతేకాక ఇది మంచి అత్యుత్తమమైన స్క్రబ్బర్ గా ఉపయోగపడుతుంది. పెరుగును దీనికి కలిపి ఆ మిశ్రమాన్ని ప్యాక్ గా వేసుకోవాలి. మస్సాజ్ సర్క్యులర్ పొజిషన్ లొ 2 నిముషాలు చేసుకుంటే మచ్చలు పోతాయి.

ఆరంజ్ పీల్ గంధపుపొడి ప్యాక్

ఆరెంజ్ విటమిన్- సి ని కలిగి ఉండటమే కాక ఇది చాలా కాల్షియంని కలిగి ఉంటుంది. ఇది చర్మం పై దాడి చేసే వాటిల్ని దూరంగా ఉంచుతుంది. చాల స్కిన్ సమస్యలకూ అలాగే లోతైన నల్లని వలయాలపై పనిచేస్తుంది. ఇది మంచి ట్రీట్మెంట్. ఒక బౌల్ లో ఆరంజ్ పీల్ అలాగే గంధంపొడి మిశ్రమంగా చేసుకుని ముఖానికి వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

స్ట్రాబెర్రీస్, తేనె ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ చర్మ సౌందర్యాన్ని ఇనుమడించలగల మంచి ప్యాక్. ఇది అన్ని వయస్సుల వారికీ నప్పుతుంది. కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకుని వాటికి పాలు కలుపుకుని దానిలో కొంచెం తేనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ గా వేస్తే మంచిది. 20 నిముషాలు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.
వేడి నీటితో మస్సాజ్ చేసుకోవాలి.

అక్రోట్లు, పాల క్రీం ప్యాక్

అక్రోట్లను తీసుకుని దానిలో పాల క్రీం లేదా మలాఇ ని వేసుకుని ఫేస్ప్యాక్ గా వేసుకోవాలి. ఇది చర్మం లోని సెల్స్ ని శుద్ది చేస్తుంది. అలాగే ఏజింగ్ సమస్యను తీరుస్తుంది.

ఫెయిర్ స్కిన్ కొరకు నివారణామార్గాలు

అలోవేరా

అలోవేరా ప్రతీ ఇంట్లో ఉండే మొక్కే. అలాగే చాలా రకాలైన చర్మ సమస్యలు, చర్మ సౌందర్యానికీ చాలా ఉపయోగపడుతుంది. అలోవేరా గెల్ రాసుకోవటం వాల్ల చర్మం పై ఉన్న పిగ్మెంటేషన్ సమస్యలు, మొటిమలు, మచ్చలపై పని చేస్తుంది.
అలోవేరా గెల్ ను తీసుకుని ముఖానికి రాసుకుని తర్వాత 30 నిముషాలకు వాష్ చేసుకోవాలి.

బొప్పాయి ఫేస్ప్యాక్

బొప్పాయి ఫేస్ప్యాక్ చాల చక్కగా చర్మం పై పనిచేస్తుంది. బొప్పాయి తినటం కూడా ఎంతో మంచిది. బొప్పాయిని మొఖానికి రాసుకుంటే ఎన్నో విధాలుగా చర్మం కాంతివంతంగా ఉండేలా చెస్తుంది. బొప్పాయిని మొఖానికి రాసుకుని తర్వాత 20 నిముషాలకు చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. తర్వాత మీ చర్మం మేరవటం మీరే చూడవచ్చు.

దోస ఫేస్ ప్యాక్

దోస ప్రతీ రెసిపీలో ప్రధానమైన ప్రాత్రను పోషిస్తోంది. దోస ముక్కల్ని గుండ్రంగా కోసుకుని చర్మం పై గుండ్రంగా రాసుకుంటే అది చాలా వరకూ పీలుస్తుంది. దోస గుజ్జును తీసుకుని ముఖానికి రాసుకుని తర్వాత ఆరిపోయాక చల్లని నీటితో వాష్ చేసుకోవాలి.

రోస్ పేటల్, పాలు ఫేస్ప్యాక్

రోస్ వాటర్ చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. చర్మ సౌదర్యం పై చక్కగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా నిగారింపుగా చేస్తుంది. రోస్ పేటల్ ను తీసుకుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత కాటన్ బాల్స్ తో ముఖానికి రాసుకోవాలి.
లేదా మీరు రోస్ పేటల్స్ ను తీసుకుని పొడిపరచి తర్వాత వాటికి 2 టేబుల్ స్పూన్స్ పాలను కలుపుకొని మీ ముఖానికి పెట్టుకోవాలి. తర్వాత అద్భుతమైన ఫలితాల్ని మీరు చూడవచ్చు.

కుమార్‌చంద్ :