చర్మ పరిరక్షణకు.. – Telugu tips for skin care

ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

అందుకని…చర్మ సమస్యలు రాకుండా ఉందేదుకు కొన్ని చిట్కాలను మీకందిస్తున్నాం.

Sleeveless Blouse designs

1. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.

2. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.

3. తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.

4. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.

5. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

Subscribe to Blog via Email

Join 9,381 other subscribers

అతి మృదువైన చర్మం ముఖం మీద ఉంటుంది. ముఖానికి ఆవిరి ఎంత సేపు పెట్టుకోవాలో తెలియాలి. ఆవిరి పెట్టడం మంచిదని చాలామంది ఎక్కువసేపు పదుతుంటారు.ఇద్ ప్రమాదమే. ఈ సమస్య నుంచీ అధిగమించటం కోసం ఆవిరి ఎంతసేపు పెట్టుకోవాలో తెలుసుకోవాలి.

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

2. ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

4. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి.

5. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. చర్మతత్వం తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు.

6. పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి.