ముక్కు పోగు చేయించుకొనుట—తగు జాగ్రత్తలు

nose piercing


ముక్కు పోగు అనేది ఈ కాలం లో సాంప్రదాయము కన్నా ఎంతో గొప్పగా మరియు ముక్యమైనదిగా ఆడపిల్లలు భావిస్తున్నారు. తూర్పు ఆసియా దేశాలలో ముక్కు పోగు అనేది వారి సంప్రదాయం మరియు సంస్కృతిలో కలిగి ఉన్నప్పటికీ ఈప్పటి యువత దీనిని ఎంతో ఉత్సాహంతో అన్నిటికన్నా ఎక్కువగా భావిస్తున్నారు. ఎంత ఉత్సాహం ఉన్నపటికీ ఈ పద్దతి చాలా నొప్పితో కూడుకున్నది మరియు పూర్తిగా కోలుకొనుటకు 1 లేదా 2 వారాలు పదుతుంది.

 

ముక్కు పోగు కుట్టించుకొనుట మరియు తీసుకోవలసిన ముందు  జాగ్రత్తలు :

  •  ముక్కు పోగు కుట్టించుకొనుట ఎంతో అహ్లాదం లేదా తప్పనిసరి అయినఫ్పుడు కొన్ని చిట్కాలు పాటించడం  చాల అవసరం.
  •  ముక్కు పోగు కుట్టించుకునే ముందు  ఈ చిట్కాలు పాటించండి….. మధురానుభూతిని   పొందండి
  •  ముందుగా మీరూ Beautician దగ్గరకు కాని ముక్కు పోగు కుట్టుట బాగా తెలిసిన వారి వద్దకే వెళ్ళవలయును. అంతే కానీ తెలిసీ తెలియని వారితో, ఈ పద్దతి తెలియని వారితో చేయించుకొనుట మంచిది కాదు.
  •  ముక్కు పోగు కుట్టే సూది మరియు ఇతర పరికరములు శుబ్రమైనవో కావో, ముందుగానె చూసుకోవాలి . ఒకవేళ అవి శుబ్రపరచనిచో అంటువ్యాదులు సోకే ప్రమాదం ఉంటుంది.
  •  కుట్టించుకునే ముందే ముక్కు పుడకను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి, లేదంటే ఇబ్బందులు  తలెత్తే ప్రమాదం కలదు.
  •  ముక్కు పుడక కుట్టే సమయంలో కళాకారుడు తగు జాగ్రత్తలు, కొన్ని భద్రతా నియమాలు పాటించదం ఎంతో అవ్సరం, ముఖ్యంగా తను ధరించే చేతి తొడుగులు, ఉపయోగించే వస్త్రాలు, పరికరాలు ఎంతో శుబ్రమైనవిగా ఉండాలి.

 ముక్కు పోగు కుట్టించుకున్న తరువాత పాటించవలసిన  తగు జాగ్రత్తలు:

  •  ముక్కు పోగు కుట్టించుకున్న తరువాత నొప్పి తగ్గుటకు సాధారణంగా 8-10 రోజుల వరకు పడుతుంది.త్వరిత ఉపసమనం కోసం మరియు వేగవంతంగా నయంకావడానికి ఈ చిట్కాలు పాటించండి.
  •  ముక్కు పోగు రంద్ర భాగమును, చుట్టూ ఉన్న ప్రదేశమును  ప్రతీ రోజు స్నానం చేసే అప్పుడు శుబ్రపరుచుకోవలయును.
  •  క్రిమి సం హారక పదార్దాలు ఉపయోగించినచో ఏ విదమైన ఇన్ ఫెక్షన్  సోకకుండా కాపాడుతుంది.
  •  కుట్టిన ప్రాంతంలో శుభ్రం చేయడానికి ఏ కఠినమైన పదార్థం వాడకండి. మెత్తని టవల్,కాగితం, 100% పత్తి వస్త్రం ఇలాంటివి వాడతం ఎంతో శ్రేయస్కరం    
  •  కుట్టిన ప్రాంతంలో లావెండర్ తైలం ఉపయోగించితే నొప్పి మరియు ఎరుపుతనం  తగ్గించేందుకు సహాయం చేస్తుంది.
  •  “విటమిన్ B” మరియు  జింక్ తో కూడిన  మందులు వాదుట వలన నొప్పి త్వరగా తగ్గి మంచి మంచి మందులుగా ఉపయోగపడతాయి
  •  ఎంతో జాగ్రత్త వహించ వలయును లేదా చిన్న చిన్న బట్టల దారం పట్టడం ద్వారా ఎంతో నొప్పిని పొందుతారు
  •  కుట్టిన ప్రదేశంలో కొంచెం వేడితో కూడిన పదార్దాన్ని ఉంచినచో నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది .
  •  కుట్లు ఎక్కడా చెరగకుండా తగు జాగ్రత్తలు తేసుకోవడం ఎంతో అవసరం.
  •  కుట్లు త్వరగా తగ్గుటకు, వేడి నూనెలో కొంచెం పసుపు కలిపి పట్టించినచో, పసుపులో ఉన్న క్రిమి సంహారకత్వం నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.

NO COMMENTS