
శరీరం యొక్క పెరుగుదలకు మరియు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ చాలా అవసరం. మన శరీరంలో తగిన మోతాదులలో ఉండవలసిన మినరల్స్ లో పొటాషియం ముఖ్యమైనది. కొంత మంది పొటాషియం లాంటి అవసరమైన మినరల్స్ కన్నా సోడియం ఎక్కువగా తీసుకుంటారు. దాని వలన మీ బీపీ పెరుగుతుంది. సోడియంను తక్కువగా తీసుకుంటే గుండె ప్రమాదాలు రాకుండా ఉంటుంది. పొటాషియం ఒక అద్భుతమైన మినరల్. ఇది మీ శరీరంలోని రక్త కణాలను ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాలనుండి కాపాడుతుంది. ఏ ఒక్క మినరల్స్ ని అయినా కావల్సినంత మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవటం మంచిదికాదు.
పొటాషియం వలన లాభాలు, లోపం యొక్క లక్షణాలు మరియు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఈ వ్యాసంలో చూద్దాం.
మనకు పొటాషియం ఎందుకు అవసరం?
మన శరీరానికి ప్రతిరోజూ 2500 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. ఇది రక్తపోటు(బీపీ), ఎముకల బలం, గుండె కార్యాచరణ మరియు కండరాల యొక్క కార్యాచరణలలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. దీని లోపం వలన పై చెప్పిన విషయాలలో మీరు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు.
పొటాషియం లోపాల లక్షణాలు
- నిర్జలీకరణముతో(డీహైడ్రేషన్) పాటు అధిక చెమట పుట్టడం.
- చేతులు, కాళ్లు తిమ్మిరి ఎక్కడం మరియు దురదగా ఉండటం.
- హృదయ స్పందన ఇర్రెగులర్ గా ఉండటం.
- తరచుగా శరీరంలో అలసట మరియు బలహీనత కలగటం.
- భ్రాంతి( హాలుసినేషన్) లేదా ఊహాత్మక సంకేతాలు.
- వాంతులు లేదా వికారం కలగటం.
- తరచూ దప్పికగా ఉండటం.
- తరచుగా మూత్ర విసర్జన రావటం.
- తక్కువ రక్తపోటు(లో బీపీ).
- మూర్ఛపోవటం.
- సుదీర్ఘ కాలపు డిప్రెషన్.
- ఈటింగ్ డిసార్డర్, లిబిడో, డీహెడ్రల్, కండరాలలో సమస్యలు మరియు ఇతర ప్రమాదాలు కలగచ్చు.
పొటాషియం రిచ్ ఫుడ్స్
పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టమోటా, హనీడ్యూ పుచ్చకాయ, పాలు, నారింజపండు, పాలకూర, బీన్స్, ఖర్జూరం, బంగాళదుంప, నేరేడుపండు మరియు కర్బూజాలలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
బీట్ రూట్ ఆకులు
మనం సాధారణంగా బీట్ రూట్ దుంపలను తిని వీటి ఆకులను విసిరేస్తారు. కానీ, ఈ బీట్ రూట్ ఆకులలో పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇవి కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.
పెరుగు
పెరుగును ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు లేదా దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు. దీనిని మీ రోజూ ఆహారాలలో చేర్చుకోవటం వలన కావల్సినంత పొటాషియం శరీరానికి లభిస్తుంది. పెరుగు రెండు రుచులలో ఉంటుంది, పుల్లని పెరుగు మరియు తీపి పెరుగు. తియ్యని పెరుగులో పొటాషియం తక్కువగా మరియు పుల్లని పెరుగులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
పండ్లు
ఈ పళ్ళను రోజూ తినడం వలన మీ ఎముకలు ధృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున ఇది మీ పళ్ళకు కూడా బలాన్ని ఇస్తుంది.
మొలాసిస్
మొలాసిస్ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఒక ఆహార పదార్థం. ఇది చూసేందుకు తేనెలా ఉంటుంది, దీనిని చక్కెరకు బదులుగా వాడుతారు. ఇది చక్కెరకంటే ఆరోగ్యకరమైనది మరియు ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాల్షియం మరియు ఐరన్ యొక్క లోపాలు ఉన్నవారు కూడా మొలాసిస్ తీసుకోవటం చాలా మంచిది.
సోయ్ బీన్స్
ఇవి రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి, ఒకటి ప్రాసెస్ చేయకుండా పచ్చి సోయ్ బీన్స్, ఇంకో రకం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన సోయ్ బీన్స్. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ప్రాసెస్ చేయని సోయ్ బీన్స్ మరింత ప్రయోజనకరమైనది. అర కప్పు ఉడకబెట్టిన సోయ్ బీన్స్‌లో 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
వైట్ బీన్స్
తెల్లని బీన్స్ అరుదైనవి అయినప్పటికీ, ప్రస్తుతం సూపర్ మాల్స్ మరియు పెద్ద కూరగాయల మార్కెట్లో లభిస్తాయి. వీటిని బాగా ఉడికించి ఉప్పు కలుపుకొని తినవచ్చు, లేదా మీరు తయారు చేసే కూరగాయల కూరల్లో వీటిని జోడించవచ్చు.
పొటాషియం యొక్క ప్రయోజనాలు
బ్రెయిన్ హెల్త్
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అన్ని వయస్సుల వారూ తినాలి. మీ మెదడుకు ఇది చాలా అవసరం. మెదడు చురుకుగా ఉండేందుకు మరియు దృష్టి దీర్ఘంగా మరియు స్థిరంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
శరీరంలో ద్రవం సంతులన
మన శరీరానికి కావలసిన ద్రవాలు లభించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పొటాషియం ఉన్న ఆహారాలను రోజూ తినడం వలన ఈ సమస్య రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఒత్తిడి
ఈ కాలంలో ఎక్కువ పనుల వలన మరియు ఎక్కువ ఉద్రిక్తత వలన ఒత్తిడి పెరుగుతుంది. పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.
శరీర జీవక్రియ
మనం ఆరోగ్యంగా ఉండటానికి శరీరం యొక్క జీవక్రియను అధికరించటం చాలా అవసరం లేకపోతే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పొటాషియం జీవక్రియను అధికరించి శరీరం యొక్క శక్తిని అధికరిస్తుంది.