
స్త్రీలకు గర్భం ధరించడం ఒక వరం. ప్రతి గర్భిణీ ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కలగచ్చు, థైరాయిడ్ సమస్య అందులో ఒకటి. థైరాయిడ్ ని ‘అవటుగ్రంథి’ మరియు ‘కాకళగ్రంథి’ అని అంటారు.
థైరాయిడ్ గ్రంథులు జీవక్రియను సమతుల్యంగా ఉంచేందుకు కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఈ గ్రంథులు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? మీ మెడలో ఆడమ్స్ ఆపిల్ క్రింద ఒక సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు ఎక్కువగా పనిచేయటం లేదా సరిగ్గా పనిచేయక పోవటం వలన సమస్యలు కలగవచ్చు.
థైరాయిడ్ గురించి కొన్ని వివరాలను చూద్దాం
థైరాయిడ్ గ్రంథులు కొన్ని సార్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరి కొన్ని సార్లు చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే ‘ హైపర్ థైరాయిడిజం’ అని అంటారు. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే ‘హైపో థైరాయిడిజం’ అని అంటారు.
గర్భిణి స్త్రీలు తెలుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మీకు ప్రసవించే శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యా కలగకుండా చూసుకోవచ్చు. ఇందుకు మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి. మీ వైద్యుడు సూచించిన మందులను సరైన సమయాలకు వేసుకోవటం మర్చిపోకూడదు.
గర్భిణి స్త్రీలలో థైరాయిడ్ యొక్క ముఖ్యత్వం
శిశువు యొక్క మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ యొక్క పెరుగుదల మీ థైరాయిడ్ హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ‘ప్లాసెంటా’ మూలంగా శిశువుకు కావలసిన హార్మోన్లు మీ నుండి సరఫరా అవుతుంది.18-20 వారాల తరువాత మీ శిశువు యొక్క థైరాయిడ్ పని చేయటం మొదలుపెడుతుంది.
థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ కావటానికి లేదా తక్కువ కావటానికి కారణం ‘ఈస్ట్రోజెన్‘ మరియు ‘హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్‘ (HCG) అనే రెండు హార్మోన్లు. మీరు కొద్దిగా అధిక బరువు ఉన్నట్లయితే మీ గర్భధారణ సమయంలో థైరాయిడ్ పెరుగుతుంది. కానీ ఈ మార్పులను కనుక్కోవటం మీ వైద్యులకు అంత సులువు కాదు. ఎందుకంటే, థైరాయిడ్ రుగ్మత వలన మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ వలన కూడా థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు కలుగుతుంది. కావున కొన్ని లక్షణాలను బట్టే ఈ సమస్యను కనుక్కోగలుగుతారు.
థైరాయిడ్ యొక్క లక్షణాలను చూద్దాం
హైపర్ థైరాయిడిజం
నీరసంగా ఉండటం, హృదయ స్పందన వేగంగా ఉండటం మరియు క్రమంగా లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టక పోవటం, ఎక్కువ దిగులుగా ఉండటం, బరువు తగ్గటం లేదా ఎక్కటం, వాంతులు లేదా తీవ్రమైన వికారం కలగటం, వణుకు పుట్టడం వంటి లక్షణాలను చూపుతుంది.
హైపో థైరాయిడిజం
బరువు పెరగటం, తీవ్రమైన అలసట కలగటం, ఏకాగ్రత లేక పోవటం లేదా విషయాలను తొందరగా మరిచిపోవటం, మలబద్ధకం, చలిని తట్టుకోలేక పోవటం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను చూపుతుంది.
గర్భధారణ సమయంలో థైరాయిడ్ వ్యాధికి కారణాలు ఏమిటి?
హైపర్ థైరాయిడిజం కలగటానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్. శరీరంలో ‘గ్రేవ్స్ వ్యాధి‘ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కలిగినప్పుడు ‘థైరాయిడ్ – స్టిములేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI)’ అనే ‘యాంటీ బాడీ‘ ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
హైపో థైరాయిడిజం కలగటానికి కారణం ‘హషిమోటోస్ థైరాయిడిటిస్‘ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీని వలన మీ థైరాయిడ్‌కు కావలసిన కణాలు అందకుండా పోతుంది. కావున తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధికి ఎలా చికిత్స చేయాలి?
ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించ వచ్చు.
మీకు హైపర్ థైరాయిడిజం ఉందని గుర్తించబడితే, సమస్యను పరిష్కరించడానికి యాంటీ థైరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి. హైపో థైరాయిడిజం ను T4 హార్మోన్లకు సమానమైన ‘లెవోథైరోక్సిన్’ తో చికిత్స చేయవచ్చు.
ఈ ఆర్టికల్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి మరియు పై చెప్పబడిన ఏదైనా లక్షణాలు మీలో కనపడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండండి.