గర్భ స్రావ మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలు & పరిణామాలు

సాధారణంగా గర్భ స్రావ మాత్రలు మందుల షాపుల్లో అమ్ముతారు. ఈ మాత్రల్ని ఒక వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఉంటే లేదా లేకపోయినా కొనుగోలుచేయవచ్చు. కానీ వీటి వాడుక వల్ల కలిగే పరిణామాల గురించి అలాగే ఈ పిల్స్ గురించిన కొన్ని విషయాల గురించి తెలుగు టిప్స్ మీకోసం అందిస్తుంది..ఇక ఈ ఆర్టికల్ చదవండి.
సాధారణంగా గర్భ స్రావ మాత్రలు అవాంచిత గర్భాన్ని తొలగించుకోవటానికి సులువైన మార్గం. తేలికైన మార్గాల్లో ఒకటైన ఈ మాత్రల వాడకం పై ఎందరో ఆడవారికి ఎన్నో అనుమానాలున్నాయ్. అయితే వీటిని నివృత్తి చేసుకునే అవకాశం మాత్రం కాస్త తక్కువే. ప్రధానమైన విషయమేమంటే ఈ మాత్రలు వాడటం వల్ల కేవలం 2 నెలల్లోనే గర్బ స్వావం అవ్వటం పూర్తి అవుతుంది. అయితే చాల వరకూ ఈ మాత్రలు ఎఫ్.డి.ఏ ఆమోదం పొందినవే. కాని ఈ మాత్రలు ఒక్కో రకంగా ఒక్కొక్కరిపై పని చేస్తాయి.

ఇబ్బందులు

 • అదిక రక్తస్రావం
 • తలనొప్పి
 • వికారం
 • డయేరియా
 • కడుపు తిమ్మిరి
 • వాంతులు

మాత్రలు వాడే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

 • గర్బ స్రావం సవ్యంగా జరిగే సమయంలో ఈ మాత్రల రసాయన ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రభావమే గర్భ స్రావం తేలికాగా సునాయాసంగా జరిగేలా చేస్తాయ్. కొన్నిసార్లు ఈ గర్భ స్రావం వికటించే అవకాశాలూ ఉన్నాయ్.
 • ఇవి చాలా తేలిగా మార్కేట్లో అందుబాటులో దొరికినా డాక్టరును సంప్రదించనిదే వీటి వాడకం అంత మంచిది కాదు.
 • మీ డాక్టరు కు మీకు ఏ మాత్రలు ఇస్తే పనిచేస్తాయో తెలుస్తుంది ఎందుకంటే మీ శరీరానికి ఏం పని చేస్తాయో తెలుసు కాబట్టి ముందు గానే వాటి దుష్ప్రభావాలని ఊహించగలరు.
 • ఆస్తమా, డయాబెటిస్, అనేమియా తదితర వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలు వాడరాదు. అంతేకాక హెచ్.ఐ.వి ఉన్నవారు అలాగే బాగా పొగ త్రాగేవారు అస్సలు వాడరాదు.
 • చాలావరకూ గర్భ స్రావ మాత్రల వల్ల ఇబ్బంది లేదు. కాని వీటిపై ఆడవారికి ముందుగానే అవగాహన ఉండటాం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ మాత్రల వాడకం వల్ల కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు అధిక రక్త స్రావం జరిగితే అప్పుదే వెంటనే డాక్టరు వద్దకు వెళ్ళితేనే అది ఆగే అవకాశం ఉంది. అదీ ఒక నిపుణుని వల్లే సాధ్యం.
  ఒక్కోసారి ఈ ప్రక్రియ వికటిస్తే మీ గర్భ స్రావ ప్రక్రియ సగంలోనే ఆగిపోయి అవి కడుపులోనే మిగిలిపోయి ఇంఫెక్షన్స్ వచ్చే అవకాశాలెన్నో ఉన్నాయి.
  కొన్నిసార్లు మీకు తీవ్రమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది తగ్గేందుకు డాక్టరు కన్సల్టేషన్ ఎంతో అవసరం.
  కొన్నిసార్లు ఫాలోపియన్ ట్యూబ్ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే కాలంలో పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం ఉంటుంది.

ముందు జాగ్రత్తలు

నివారణ నివారణ కంటే ఉత్తమం అన్న చందాన ఈ సామెతా అన్ని సందర్భాలల్లో వర్తిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి వీటి వాడకం ప్రమాదాలకు తెరతీస్తే ఇంకా తరువాతి కాలంలో మరాల గర్భం ధరించటానికి ఎన్నో ఇబ్బందులెదుర్కోవలసి ఉంటుంది. ఎన్నో పరిణామాలు దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళు శారీరికంగా మానసికంగా ఎంతో వత్తిడికి గురికావాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త అలాగే ముందు చూపు చాలా అవసరం.
చివరిగా మంచి సూచన ఏంటంటే డాక్టరును సంప్రదిస్తేనే ఎంతో ఉత్తమమన్నది అభిప్రాయం. దీనివల్ల ఆడవారు శారీరికంగా మానసికంగా ఇబ్బందులెదుర్కోకుండా ఉండవచ్చు. మాత్రలు వాడే ముందు డాక్టరును సంప్రదిస్తే మేలు, దీని వల్ల ఇతర మార్గాలను వారు సూచించే అవకాశం ఉంది. ఈ మార్గాల్లో గర్భస్రావం కాస్త ఆలశ్యం అయినా ఫలితాలు మాత్రం బాగుంటాయి.