Veg pasta recipe in Telugu – వెజ్ స్పైసీ పాస్తా రెసిపీ

దురుమ్ గోధుమ పిండితో తయారు చేయబడే ఒక ఇంగ్రీడియెంట్ పాస్తా. ఇది చాలా ఇటాలియన్ వంటకాలకు ప్రధానమైన పదార్థం. పాస్తా అనగానే ఇటాలియన్ రెసిపీస్ గుర్తొస్తాయి. పాస్తా లో లాంగ్ పాస్తా, షార్ట్ పాస్తా, ఎగ్ పాస్తా, ఫ్రెష్ పాస్తా మరియు అల్ ఫోర్నో పాస్తా లాంటి ఎన్నో రకాలు ఉన్నాయి. మరి మనకు అందుబాటులో ఉండే స్ప్రింగ్ పాస్తా తో ఈవినింగ్ స్నాక్స్ లేదా డిన్నర్ కి ఎంతో రుచికరమైన ‘వెజ్ స్పైసీ పాస్తా’ ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పాస్తా – 1 కప్పు
  • నూనె – 6 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • టమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ కాప్సికం – ¼ కప్పు
  • గ్రీన్ కాప్సికం – 1 కప్పు
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • తరిగిన క్యారట్ – ¼ కప్పు
  • టమాటో పురీ – 1 కప్పు
  • వెల్లుల్లి ముక్కలు – 2 స్పూన్

తయారు చేసే విధానం

  • స్టవ్ పై ఒక ఫ్యాన్ లో 1 కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ నూనె మరియు 1 కప్పు పాస్తా వేసి రెండు నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి.
  • పాస్తా కుక్ అవ్వగానే వాటిని వడగట్టి ఒక బౌల్ లోకి తీసుకోండి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ లో 4 టీ స్పూన్ నూనె, 2 – స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
  • వెలుల్లి ఫ్రై అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
  • జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసిన తరువాత 1 కప్పు టమాటో పురీ వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేయండి.
  • ఆ తరువాత, 1/4 కప్పు తరిగిన రెడ్ కాప్సికం, 1 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం మరియు 1/4 కప్పు తరిగిన క్యారట్ వేసి బాగా కలపండి.
  • అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి కుక్ చేయండి.
  • అన్ని పదార్థాలు బాగా ఫ్రై అయిన తరువాత ఉడికించిన పాస్తాను వేసి కలుపుకోవాలి.

అంతేనండి ఎంతో యమ్మీ ‘వెజ్ స్పైసీ పాస్తా’ రెడీ!