Potato and spring onion recipe in Telugu – ఆలూ స్ప్రింగ్ ఆనియన్ రెసిపీ

సంవత్సరం పొడుగునా మనకు అందుబాటులో ఉండే కూరగాయలలో ఒకటి బంగాళదుంప. దీనినే ఆలు అని కూడా అంటారు. బంగాళదుంప లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మరియు వాటితో ఎంతో రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు. భోజనం సమయంలో గాని రాత్రి డిన్నర్ కి చపాతీ లోకి గాని ఎంతో రుచిని చేకూర్చే మరియు ఎంతో సింపుల్ గా చేయగలిగే “ఆలూ స్ప్రింగ్ ఆనియన్” ని  ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 2 టీ స్పూన్
  • జీరా – 1 టీ స్పూన్
  • బంగాళదుంప – 1
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
  • గరం మసాలా పొడి – 1/2 టీ స్పూన్
  • స్ప్రింగ్ ఆనియన్ – 1 కప్పు
  • కొత్తిమీర

తయారు చేసే విధానం

  • ఒక ప్యాన్ ని స్టవ్ మీద ఉంచి అందులో 2 టీ స్పూన్ నూనె పోయాలి.
  • నూనె వేడయిన తరువాత ఒక టీ స్పూన్ జీరా, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఆలు ను వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి మరియు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి.
  • ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్ ని అందులో వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి.
  • ఇప్పుడు ఆ ప్యాన్ పై మూత వేసి 2 నిమిషాల పాటు కుక్ చేయాలి.
  • కుక్ అయిన తరువాత మరో నిమిషం పాటు ఫ్రై చేసి కొంత కొత్తిమీరని పైన చల్లండి.
  • అంతే ఎంతో రుచికరమైన ‘ఆలూ స్ప్రింగ్ ఆనియన్’ రెడీ.