మెరిసే చర్మం కోసం సహజ పద్దతులతో కూడిన జాగ్రత్తలు

glowing skin care

ఈ ఆదునిక ప్రపంచంలో అందాన్ని కాడుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మార్కెట్లో దొరికే ఎన్నో వస్తువుల్ని కొనుగోలు చేసి వాడుట వల్ల మన అందానికి వచ్చే ఫలితం ఎమీ లేకపోగా మన జేబులు ఖాళీ ఔతున్నాయి. ఎందుకంత ఖర్చు పెట్టడం, మీరు సరిగ్గా గమనిస్తే , మన ఇంట్లోనే ఖర్చు లేకుండా మన అందాన్ని కాపాడుకునేవి ఎన్నో ఉన్నాయి, ఇవి ఎంతో సహజమైనవి మరియు ఆరోగ్యానికి, చెర్మానికి హాని కలిగించనివి. ఖర్చు లేకుండా మీ చర్మ రక్షణ కై ఈ 10 సూత్రాలు పాటించండి

 

మీ చర్మ రక్షణకై ఉత్తమమైన 10 సూత్రాలు ఇవే:

  •  కొంచెం వెనిగర్, కొంచెం నీరు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ భాగానికి పట్టించి కాసేపటి తరువాత మెత్తని గుడతో కాని, లేదా కాటన్ తో తుడిస్తె మంచి ఫలితాన్నిస్తుంది
  • రోజ్ వాటర్ లో కర్పూరాన్ని కలిపి మెత్తని గుడ్డతో ముఖాన్ని రోజుకి 3-4 సార్లు తుడుచుకుంటే మంచి ఉపయోగం ఉంతుంది
  •  ఇంకా తేలికైన చిట్కా ఎమిటంటే  నిమ్మ రసాన్ని మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  •  4 Tbsp రోజ్ వాటర్ లో 1\3 Tbsp పటికను, 100గ్రాం గ్లిసరిన్, బాగా కలిపి ముఖానికి పట్టించి  10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం  చేసుకోవాలి.
  •  కీరా దోసకాయని  తీసుకుని అర కప్పు పెరుగులో కలిపి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  •  ఆపిల్ ని ఒక 1 Tbsp తేనె తో కలిపి మీ ముఖానికి పట్టించి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
  •  చమోమిలే టీ బ్యాగ్ ని 100మి నీటిలో వేడి చేసి ముఖంపై ఆ నీటిని రాసుకుని 20 నిమిషాల తరువాత చలని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా ఉంటుంది.
  •  మీ ముఖాన్ని ముందుగా శుబ్రం చేసుకుని  కోడి గుడ్డు లోని తెల్ల సొనని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి
  •  1\4 Tbsp నూనెలో 1\4 XXX నిమ్మ రసం, 1 Tbsp తేనె  కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి వెచ్చనినీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  •  1 Tbsp పాలు, 1 Tbsp తేనె, 1 కోడి గుడ్డు కలిపి మీ ముఖానికి పట్టించి 10-15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.

NO COMMENTS