బోద కళ్ళు–సమస్యలు– వాటి సహజ నివారణములు

          

puffy eyes                


 

బోద కళ్ళు మరియు కంటి కింద కుంగిపోయిన చర్మం మనకు ఎంతో బాధని మరియు మనపై మనకు వికారంతో పాటు అసహ్యాన్ని కలిగిస్తాయి, ముఖ్యంగా అవి ఎవరికీ కనపడకుండా దాచుకొవాలని ఎంతో ప్రయత్నిస్తారు,  ఈ సమస్యకు కారణం మరియు దోషి ఎవరంటే మన వయస్సు అనే చెప్పుకోవాలి.అదే మన అందం పాలిట శత్రువుగా మారి మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. యవ్వనంలొ ఉన్నప్పుడు మన శరీరం ఎంతో గట్టిగా ఉండి,ఎంతో పోరాట పటిమను చూపిస్తుంది, కానీ కాలానుగుణంగా మన శరీరంలొ వచ్చే మార్పుల్లో ఈ బోద కళ్ళ సమస్య ఒకటి

Sleeveless Blouse designs

 ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి 

 సరియైన, పౌస్టికమైన  ఆహారం తీసుకోకపొవడం, నిద్ర లేమి,  మీ నిద్ర అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, మరియు మరెన్నో ఈ  సమస్యకు కారణాలు

 మీ రిఫ్రిజిరేటర్ నుండి:

దోసకాయ అనేది ఈ కంటి వాపులకి మరియు భోదకళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది,రిఫ్రిజిరేటర్ నుండి తీసిన దోసకాయ యొక్క చల్లదనం కంటి వాపుని తగ్గిస్తుంది , దోసకాయలో ఉన్న రక్తస్రావ నివారిణి రక్త నాళాలను బిగువుగా చేస్తుంది.గుడ్డు మరియు బంగాళదుంపలు కూడా  మీ  రిఫ్రిజిరేటర్ లొ దాచిపెట్టిన  నిధి వంటివే, ఇవి కూడా కళ్ళకు ఎంతొ ఉపయొగపడతాయి.

 మీ సింకు నుండి..

 ఉదయం ఈ హడావిడి, గజి బిజి జీవితంలో తయారు కావడానికి  30 నిమిషాలు మాత్రమే ఉన్న సమయంలో ఈ దోసకాయ ముక్కలు మరియు టీ సంచులు సహాయపడవు, ఈ సమయంలో చల్లటి నీళ్ళతొ మన మొహమును శుబ్రపరుచుకుంటె ఆ చల్లదనం మన రక్త నాళాలను బిగువుగా చేసి వాపును తగ్గించడంలో ఎంతో సహాయ పడుతుంది  .

Subscribe to Blog via Email

Join 9,405 other subscribers

 మీ మసాలా రాక్ నుండి:

మీ కళ్ళ వాపులకు ఉపసమనం కావాలి అనుకుంటే అది మీ ఇంట్లోనే దొరుకుతుంది, మీరు చేయవలసిందల్లా కొంచెం ఉప్పుని వెచ్చటి నీటిలొ కలిపి కాటన్ ప్యాడ్స్ తో కంటి రెప్పల పై శుభ్రం చేసుకుంటే అరగంట తరువాత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

  మీ రాక్ నుండి:

 మీరు ఎప్పుడైన టీస్పూన్లు మీ కళ్ల పై అద్భుతం చేయడం చూసార, వినడానికి, కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజమే, చల్లటి టీ స్పూన్లు మీ కళ్ళ వాపులను తగ్గిస్తాయి.

ఒక 2 టీ స్పూన్లు ఫ్రిజ్ లొ పెట్టి చల్లబడిన తర్వాత తీసి కంటి కింద ఉన్న వాపుల పై ఉంచుకోవాలి, ఒక స్పూన్ చల్లదనం తగ్గగానే మరొకటి పెట్టుకోవాలీ ఇలా చేస్తే కళ్ళు చల్లబడి ఎంతో ఉపసమనం పొందుతాయి .

 ఇవే కాకుండా ఇంకా మీ పరిసరాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ కళ్ళను గట్టిగా రుద్దవద్దు, మెల్లగా, మెత్తగా సరైన రోజూ మసాజు చేయడం  వల్ల కూడా కళ్ళను కాపాడుకోవచ్చు