మీ కడుపులో మంటగా ఉంటుందా, “గ్యాస్ ప్రాబ్లం”(acidity)తో బాధపడుతున్నారా?

Acidityప్రస్తుత సమాజంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఈ “యసిడిటి”తో బాధపడుతున్నారు, అయితే ఈ సమస్య రోజు రోజుకూ ఎక్కువై పోతుంది, దీనిని నియంత్రించక పోతే ఎంతో ప్రమాదం.

ఇది సహజంగా ఎక్కువ కారం, మషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మన కడుపులో వీటి ప్రబావం ఎక్కువయ్యి మంటకు దారితీసే “యాసిడ్”లను విడుదల చేస్తుంది.

 

కొన్ని అనువైన, తేలికైన పద్దతులతో మీ ఈ సమస్యని తరిమేయండి ఇలా..

Caffeine ఉండే పానీయాలను తీసుకోకపోవడం మంచిది, అంతేకాకుండా ప్రొటీన్లతో కూడిన పానీయములు తీసుకోవడం ఎంతో అవసరం.

రోజు వారి జీవితంలో ఒక గ్లాసు గోరు వెచ్చని మంచి నీరు తీసుకోవడం అవసరం.

 

అరటి పండ్లు, పుచ్చకాయ, దోసకాయ ఇవి ఈ సమస్య నుంచి విముక్తుల్ని చేస్తాయి, రోజూ తీసుకునె ఆహరంలో ఇవి అన్ని కలిపి తీసుకోవడం, పుచ్చకయ రసం ఎక్కువగా తాగడం వల్ల మీ కడుపు చల్లబడి, ఈ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కొబ్బరినీరు, మీ జీర్ణ వ్యవస్తను కొబ్బరికాయ ఎంతగానో రక్షిస్తుంది, ఎప్పుడైన ఈ సమస్యతో బాధపడుతుంటే కొబ్బరి నీరు తీసుకోండి మంచి ప్రభావం చూపిస్తుంది

 

రోజూ తీసుకునే ఆహారంతో పాలను కూడా తీసుకోవడం వల్ల మంచి ఉపసమనం లబిస్తుంది.

2-3 గంటల వ్యవదిలో కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

ఒకవేళ మీకు కారంతో, మషాలాతో కూడినవి తినాలనిపించినా, వాటికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

రోజూ భోజనం చేసిన తరువాత గోరు వెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి తీసుకుంటే ఎంతో మంచిది.

 

ఈ సమస్యకు పరిష్కారాలు చుద్దామా:

 

లవంగాలు:

2-3 లవంగాలు తీసుకొని రోజూ తినండి, దాని వల్ల వాటిలో ఉండే రసం మీ ఈ సమస్యని దూరం చేస్తుంది.

 

బెల్లం:

రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఈ సమస్యనుంచి విముక్తి పొందవచ్చు, ఈ చిట్కా మధుమేహం లేని వారికి మాత్రమే.

 

పెరుగు:

పెరుగు, కొత్తిమీర, దొసకాయతో చేసిన మిశ్రమం తీసుకుంటే ఈ సమస్యనుంచి మంచి ఉపసమనం లబిస్తుంది.

 

తులసి ఆకులు:

తులసి ఆకులలో మంచి ఔషధ లక్షణాలు కలవు, అయితే అవి తినడం వల్ల, లేదా వాటిని చిన్న చిన్న ముక్కలుగ చేసి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేస్తుంది.

 

మజ్జిగ:

మీరు రోజు మజ్జిగ తాగేటప్పుడు అందులో 1\4 స్పూన్ మిరియాలు పొడి కలిపి తీసుకుంటే, ఈ సమస్య నుంచి మంచి ఫలితం లబిస్తుంది.

 

పుదీనా:

మీ జీర్ణ సమస్యలనుండి, ఈ గ్యాస్ సమస్యనుంచి విముక్తి కోసం మీరు పుదీన ఆకుల రసాన్ని తీసుకుంటే ఎంతో మంచిది.

 

పాలు:

రోజు వారి జీవితంలో పాలు ఎక్కువగా తీసుకుంటే వాటిలో ఉండే Calcium కంటెంట్ మిమ్మల్ని ఈ సమస్యనుంచి కాపాడుతుంది.

 

వెనిలా ఐస్ క్రీమ్:

వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మంచి ఫలితం పొందవచ్చు.

NO COMMENTS