థైరాయిడ్ సమస్యా..? – Thyroid tips in Telugu

ఈ మధ్యా చిన్నా పెద్దా అని తేడాలేకుండా వస్తున్న సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వచ్చిందని తెలియగానే ఎంతో సతమతమవుతున్నారు కూడా. ఇది వచ్చిన దగ్గర నుండీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య గురించి సమగ్రంగా తెలుసుకుంటే మంచిది. అవేంటో తెల్సుసుకుందామా..!

థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. జీవితాంతం మందులు వేయాల్సి వస్తుందని భయపడుతుంటారు. నిజానికి థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వస్తే దాని మొత్తం జీవక్రియలపై పడుతుంది.

థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యమైన జీవక్రియల నిర్వహణలో థైరాయిడ్ గ్రంథి కీలకపాత్ర పోషిస్తుంది.

థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే మొత్తం జీవక్రియలపైనే ప్రభావం పడుతుంది. అధిక బరువు, డిప్రెషన్, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. గుండె జబ్బులు, యాంగ్జైటీ, హెయిర్‌లాస్, శృంగార సమస్యలు, సంతానలేమి, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ పనితీరులో తేడా ఉందని తేలినట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలో రెండు రకాలుంటాయి.

హైపోథైరాయిడిజమ్ : థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

హైపర్‌థైరాయిడిజమ్ : థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

లక్షణాలు

అలసట : 8 నుంచి 10 గంటలు పడుకున్నా అలసటగా ఉంటుంది. సాయంత్రంకల్లా అలసిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం చేయలేరు. ఏ కొంచెం చిన్న పనిచేసినా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది.

Subscribe to Blog via Email

Join 9,491 other subscribers

బరువులో తేడా : ఆకస్మికంగా బరువు పెరగడం లేదా ఎంతకీ బరువు తగ్గకోపోవడం హైపోథైరాయిడిజమ్‌ను సూచిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటున్నా ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం హైపర్‌థైరాయిడిజమ్‌ను సూచిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, తొందరగా కోపం రావడం, చిన్న విషయాలకే భయపడటం, టెన్షన్‌కి గురికావడం జరుగుతుంది.

సంతానలేమి : హైపోథైరాయిడిజమ్‌లో ఋతుస్రావం అధికంగా, ఎక్కువసార్లు అవుతుంది. హైపర్‌థైరాయిడిజమ్‌లో ఋతుస్రావం తక్కువగా, చాలా రోజులకు ఒకసారి అవుతుంది.

జుట్టు, చర్మం : జుట్టు రాలిపోవడం, పొడిబారినట్లుగా ఉండటం, జుట్టు పగలడం, చర్మం పొడిబారి దురద పెట్టడం జరుగుతుంది. మెడ భాగంలో అసౌకర్యంగా ఉండటం, మాటలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కండరాలు, జాయింట్ పెయిన్స్, పిక్కలు పట్టడం వంటివి కూడా ఉంటాయి. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

రక్తపరీక్షలు

థైరాయిడ్ సమస్య వున్నవాళ్ళు టి3, టి4, టిఎస్‌హెచ్ హార్మోన్ లెవెల్స్‌ను తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయాలి. ఈ పరీక్షా ఫలితాలను బట్టి వైద్యుడిని సంప్రదించాలి.