ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్‌) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.
ఆస్థమా వల్ల వచ్చే ఇబ్బందులు:
1. ఆస్థమా ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
2. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
3. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కాలుష్యం ప్రభావం:
1. ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
2. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్‌ స్టవ్‌ వాడడం వలన, వేపుడులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు
3. అలాగే గాలిలోకి పార్టి క్యులేట్‌ మెటీరియల్స్‌, రసాయనాలు, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, ఓజోన్‌ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు.
4. ఇంట్లో వాడే ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌, అయోనైజర్స్‌, జిరా క్స్‌ యంత్రాలు, ఎయిర్‌ క్లీనర్స్‌, ఫిల్టర్స్‌, ప్యూరిఫయర్స్‌ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.
5. డీజిల్‌ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్‌ మేటర్‌, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, సల్ఫర్‌ డై ఆకై్సడ్‌, సీసం పొగ లు, కార్బన్‌ మోనాకై్సడ్‌ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్‌, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్‌, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
6. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్‌ వే రీమోడలింగ్‌ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్‌ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగ్గుతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.
ఆస్థమాలో రకాలు…
ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్‌ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్‌ రెసిస్టెంట్‌ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.
జాగ్రత్తలు…
1. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి.
2. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
3. ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు.
4. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్‌ క్లీనర్స్‌ వాడుకోవడం మంచిది. ఇంట్లఒ బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది.
5. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.