మీకు బీపీ(బ్లడ్ ప్రెషర్)ఉందా??దాని అరికట్టడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా అయితే చూసేద్దాం రండి.

diabetes

వినడానికి విచిత్రంగా అనిపించినా, చెప్పడానికి చమత్కారంగా ఉన్న ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి వారి ఇంట్లో,తినే ఆహారంలో ఉప్పుని ఉపయోగించడలేదు,ఎందుకంటే ఉప్పుని అదికంగా ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్తితి వస్తుంది, రక్తపోటు ,
గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది,ఒక్కో సారి ప్రాణంపొయే పరిస్తితి కూడా ఉంటుంది,అయితే ఈ అన్నిటి పరిణామాల వల్ల ఉప్పుని వాడటం మానేసి రుచి లేని ఆహరం తినేకన్నా,దానికి తగిన ప్రత్యామ్నాయాలు వెతకడం మంచిది.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:
1. ఉప్పు బదులు వెల్లుల్లి పొడి ఉపయోగిస్తే రుచికరమైన ఆహారం తినవచ్చు.
2.రుచికరమైన, సువాసనబరితమైన ఆహారం కోసం, ఉప్పు బదులు పొడి చేసిన మిరియాలు ఉపయోగించండి.
3.సోయా ఉప్పు కూడా మీ ఆహారంలో ఉపయోగించవచ్చు, ఇందులో మామూలు ఉప్పుకన్నా సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది.
4.మీ ఉప్పు బదులు “ఉల్లి పొడిని ఉపయోగించవచ్చు”.ఇది ఎంతో రుచికరమైన ఆహరం ఇవ్వడంలో సహాయపడుతుంది.
5.తాజా నిమ్మరసం కూడ మీ ఉప్పుకి ప్రత్యామ్నయంగా ఉపయోగించుకోవచ్చు.
6.నిమ్మరసాన్ని సోడాకు బదులు నీటిలో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
7.బాగా వేయించిన వెల్లుల్లిని తినడంలో కూడ మీరు ఉప్పుకి ప్రత్యమ్నయంగా అనుకోవచ్చు.
8.సన్ఫ్లవర్ విత్తనాలు కూడా మీ ఆహారంలో ఉప్పుకి ప్రత్యామ్నయంగా ఉపయోగపడతాయి.
9. మీరు సలాడ్స్ తీసుకునేటప్పుదు ఆవాలు లేదా ఊరగాయ రసం కలిపి తీసుకుంటే ఉప్పుకు మంచి ప్రత్యామ్నయంగా ఉపయోగపడుతుంది.
10. స్వీట్స్ మీ వంటలలో అద్బుతాల్ని చేస్తాయి,ముఖ్యంగా చికెన్లో నారింజ జూస్ కలిపి వండితే ఉప్పువేసుకోవలసిన అవసరం ఉండదు.