మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

కొందరికి మూత్రానికి వెళ్తే మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బంది ఈ సమస్యలకు కారణం మీకు మూత్ర పిండాల సమస్య మొదలైదని అర్ధం. మనం చేసే అశ్రధ్ధ వల్లే ఈ సమస్య తెలెత్తుతుంది. మనం ఆచరించే అలవాట్లూ ఆహారమే వీటిపై ప్రభవం చూపిస్తాయి. మన మూత్రపిందాలు బాగుండాలతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు. అవేంటో చూద్దమా..

1. మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.

2. బ్లాక్ బీన్స్ మీ కిడ్నీల ఆరోగ్యానికి బ్లాక్ బీన్స్ తినటం మంచిది. వీటిలో ఫాస్ఫరస్ అతి తక్కువ అందువలన అవి కిడ్నీ లకు మంచిది.

3. తరచుగా మూత్రం పోయండి రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి నిండి ఉందాలి.

4. నల్ల రంగు బెర్రీ లు దట్టమైన రంగులు కల ఆహారాలు సాధారణంగా మీ కిడ్నీలకు మంచిది. బ్లూ బెర్రీ లు, బ్లాక్ బెర్రీ లు, క్రాన్ బెర్రీ లు సిట్రస్ జాతికి చెంది అధిక అంటి ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి.

5. కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.

6. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.

7. కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.

8. సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.

9. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.

10. మూత్రము ను ఆపు కొనవద్దు కొంతమందికి మూత్రంను ఎక్కువ సమయం ఆపుకొనే అలవాటు వుంటుంది ఇది చెడు అలవాతు. అది మీ కిడ్నీ లపై ఒత్తిడి కలిగిస్తుంది.

11. మస్టర్డ్ గ్రీన్స్ ఆకు కూరలో విటమిన్ కె అధికం. ఇది కిడ్నీ లకు బ్లడ్ సరఫరా అధికం చేస్తుంది.

12. కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం ఎంతో మంచిది. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.

13. రెడ్ కేబెజ్ మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మీ కిడ్నీలు వేగంగా చెడిపోయే అవకాశం వుంది. కేబెజ్ వంటి ఆకు కూరలు కిడ్నీల డామేజ్ ని అరికడతాయి

14. మీ కిడ్నీ లు సరిగ్గా మీ హిప్ ల పైన వీపు దిగువ భాగంలో వుంటాయి. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యామాలు చేస్తే, కిడ్నీలు సవ్యంగా పని చేసే అవకాశం వుంటుంది .

15. అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక విశ్రాంతి తీసుకోండి.

16. యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.