నోటి దుర్వాసనా?

ఎవరితోనైనా నోరు విప్పి మాట్లాడాలంటే భయం. నోటి నుంచీ దుర్ఘంధం వస్తోందేమోనన్న అభద్రతా భావం. రాను రాను ఈ సమస్యకు పరిష్కార మార్గాలు తాత్కాలికమైనవిగా కనిపించి వారిలో వారు ఆత్మన్యునతాభావాన్ని అలవరచుకునే అవకాశం ఉంది. చాలావరకూ నోటి దుర్వాసనతో బాధపడేవారు ఎక్కువే. ఈ సమస్య వల్ల సమాజంలో వారు మెసలటం కష్టమవుతోంది. ఈ సమస్య నుండీ బయటపడటానికి వాళ్ళు ఎంతో సతమతమవుతుంటారు. వారి కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవేంటో చూద్దామా..!

నోటి దుర్ఘంధానికి కారణాలు

1. సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం

2. అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.

3. మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.

తీసుకోవల్సిన జాగ్రత్తలు

1. అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిఖణ పాటించటం ఎంతో అవసరం.

2. రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.

3. ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.

4. భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.

5. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.