ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు.

tomato face packs

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు  గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి.  టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ రక్షణకై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

  • సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం టమాట “ఫేస్ ప్యాక్స్”……  . మీరు చేయవలసిందల్లా  ముందుగా కొన్ని టమాటాలు తీస్కొండి, గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి,  మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.
  •   గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.
  •  మి ముఖాన్ని నల్లమచ్చలు  ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే, శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
  •  మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.
  •  బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని 2 Tbsp పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.

NO COMMENTS