సక్రమంగా పిరియడ్స్ రావటానికి గృహ చిట్కాలు

ఆడవారిలో చాలా రకాలైన మెన్సస్ సమస్యలు మీరు వినే ఉంటారు. ఈ సమస్యలు సాధారణంగా 14 ఏళ్ళ వయస్సు నుంచీ 50 ఏళ్ళ వయస్సు వరకూ బాధిస్తాయి. అందులోనూ రుతుక్రమం సరిగ్గా రాకపోవటానికి కారణాలు ఏంటంటే హార్మోన్స్ లోపం, ఆహరపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజ్ లాంటివి. మీరు కనక రుతుక్రమ సమస్యతో బాధపడుతుంటే దానిని ఒయిగొమెనోరియా అంటారు. కొందరు బాలికల్లో అలాగే కొందరు ఆడవారికీ పిరియడ్స్ 2 లేదా 3 నెలలకోసారి వస్తుంటాయి. ఇలా రావటం చాలా ప్రమాదకరం. అలాగే ఆడవారి శరీరానికి కూడా ప్రమాదమే. సాధారణంగా నిపుణుల చెప్పే ప్రకారమైతే ఆరోగ్యకరమైన ఆడవారికి 21 రోజుల నుంచీ 35 రోజులకు పిరియడ్స్ వస్తాయి. ఇలా సంవత్సరానికి 11 లేదా 13 పిరియడ్స్ వస్తాయి. కానీ తక్కువగా వస్తే అది చాలా సమస్యాత్మకమే. ఈ సమస్య నుంచీ మీరు బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలున్నాయి. అవేంటో చూద్దామా..
సాధారణంగా రుతుక్రమం సరిగ్గా రాని ఆడవారికి చాలా పొత్తికడుపు నొప్పి, వక్షోజాల్లో నొప్పి అలాగే రోజంటా ఎదో రకమైన సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. దీనినే మెన్సస్ సమస్య అంటారు. కాకపోతే రుతుక్రమ సమస్యలను ఒక్కో ఆడవారిలో ఒక్కోలా ఉంటాయి.

రుతుక్రమ సమస్యలకు గృహ చిట్కాలు

బొప్పాయి

బొప్పాయి రుతుక్రమ సమస్యలను దూరం చేస్తాయి. ఇది చాలా సమర్ధవంతంగా మీకు ఫైబర్ ను పెంచుతుంది. యోని గోడలను బలపరుస్తుంది. మోనోపాజ్లో ఉన్నప్పుడు ఇది చాలా చక్కగా అదీ రుతుక్రమాన్ని సరిచేస్తుంది. బొప్పాయిని తరచుగా మీరు వాడినట్లైతే ఆ తేడాని గమనించవచ్చు. కానీ మీరు పిరియడ్స్ లో ఉన్నప్పుడు మాత్రం మానేయాలి.

మర్రి వేర్లు

మర్రి వేర్లు రుతుక్రమాన్ని సరిచేయగలవు. మర్రి వేర్లను తీసుకోండి. అవి ఫ్రెష్ గా ఉంటేనే వాడండి. వాటిని తీసుకుని కాసేపు నీటిలో మరిగించండి. వచ్చినా రసానికి కాస్త ఆవు పాలు కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు తాగి పడుకోండి.

సోపు గింజలు

సోపు గింజల్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని దీనికి ఒక గ్లాస్ నీటిని తీసుకుని వాటిని నీటిలో కలిపి రాత్రంతా నాననివ్వాలి. తర్వాతిరోజు పొద్దున్నే ఆ గింజల్ని వడగట్టి ఆ రసాన్ని త్రాగండి. ఆ తేడాని మీరే గమనించవచ్చు. ఇలా రోజూ చేస్తే మంచిది.

ద్రాక్ష

ద్రాక్ష మీ రుతుక్రమాన్నీ సరిచేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ద్రాక్ష రక్తం శాతాన్ని పెంచగలదు. ద్రాక్ష జ్యూస్ రోజూ తీసుకుంటే ఎంతో మంచిది. అంతేకాక ద్రాక్ష రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఒక పార్ట్ అయ్యేలా చూసుకుంతే ఎంతో మంచిది. ఎక్కువగా తీసుకోకూడదు సుమా! దీని వల్ల విరోచనాలు అయ్యే ప్రమాదముంది.

కాకరకాయి

కాకర మీ రుతుక్రమాన్ని సరి చేయటానికి తోడ్పడుతుంది. కాకరకాయ జ్యూస్ చేసుకుని రోజూ త్రాగటం మంచిది. ఈ జ్యూస్ ను రోజుకి రెండు సార్లు త్రాగటం మంచిది.

పార్స్లీ ఆకులు

పార్స్లీ ఆకులు మంచిగా రుతుక్రమాన్ని సరిచేస్తాయి. ఈ ఆకులు మంచి హెర్బల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తాయి. అంతేకక ఇవి గృహ చిట్కాలలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. రోజూ వీటిని జ్యూస్ గా చేసుకుని త్రాగటం ఎంతో మంచిది.

ముల్లంగి

ముల్లంగి రుతుసమస్యలను తగ్గిస్తుంది. 2-3 ముల్లంగి తీసుకుని వాటిని గుజ్జుగా చేసుకుని ఒక గ్లాస్ మజ్జిగ కలుపుకుని రోజంతా సిప్ చేయటం వల్ల రుతు సమస్యలు తొలగుతాయి.

కొత్తిమీర

కొత్తిమీర ఆకుల్ని తీసుకుని ఆ డికార్షన్ ని రోజుకు 3 సార్లు తీసుకోవటం మంచిది. ఈ ఆకులు జ్యూస్ గా చేసుకుని త్రాగటం మంచిది. ఇవి మెన్స్ట్రల్ సమస్యల నుంచీ బయటపడేస్తాయి.

అంజీర్ పండు

4-5 అత్తిపండ్లను తీసుకోండి. వాటిని ఉడికించి ఆ రసాన్ని ఫిల్టర్ చేసి త్రాగండి. ఇలా రోజూ చేస్తే మెన్సస్ సమస్యలు తొలగుతాయి.

క్యారెట్

క్యారెట్ రక్త శాతాన్ని పెంచటమే కాదు మీ మెన్సస్ సమస్యల్ని తీసేస్తుంది. క్యారెట్ జ్యూస్ ను రోజూ త్రాగటం మంచిది. రోజూ డైట్లో భాగంగా తీసుకుంటే మంచిది.

అలోవేరా

అలోవేరా రుతుక్రమాన్ని సరిచేయటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. హార్మోస్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రుతుక్రమ సమస్యలకు ఒక మంచి గృహ చిట్కా. మీ గార్డెన్ లో నుంచీ కొన్ని అలోవేరా ఆకుల్ని తీసుకుని ఆ ఆకుల మధ్యలో ఉన్న జెల్ ను టేబుల్ స్పూన్ తేనెను కలిపి రోజూ బ్రేక్ఫాస్ట్ కి ముందు త్రాగటం ఎంతో మంచిది. ఇలా రోజూ 3 నెలల పాటూ చేస్తే సత్ఫలితాలను పొందవచ్చు.

చెరకు రసం

చెరకు రసం ఎంతో రుతుక్రమ సమస్యలకు మంచిది. రోజూ చెరకు రసం త్రాగటం వల్ల పిరియడ్స్ సరిగ్గా వస్తాయి.

అల్లం

అల్లం రుతుసమస్యలకు మంచి మందు. ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని తీసుకుని దానికి ఒక కప్పు నీటిని కలుపుకుని మరిగించి ఆ తర్వాత దానికి పంచదార కలుపుకుని మీల్స్ తర్వాత మూడు సార్లుగా త్రాగాలి. ఇలా ఒక నెలపాటు చేయటం వల్ల సత్ఫలితాలుంటాయి.

పసుపు, బెల్లం

ఇప్పటివరకూ పసుపు యాంటీబ్యాక్టీరియాగానే పనిచేస్తుందని మీరు వినే ఉంటారు. ఇది మెన్స్ట్రల్ ఫ్లో ని సరిచేస్తుంది. అంతేకాక దీనిలో ఉన్న తాపజనక ప్రక్రియ మెన్సస్ సరిగ్గా అయ్యేలా చేస్తుంది. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని దానికి బెల్లం లేదా తేనె లేదా పాలు కలుపుకుని త్రాగటం వల్ల మెన్సస్ సమస్యలు దూరమవుతాయి. కొన్ని వారాల పాటూ ఇలా చేయటం వల్ల సత్ఫలితాలుంటాయి.

దాల్చిన చెక్క

ఇది మెన్సస్ ప్రక్రియను సరిచేస్తుంది. అంతేకాక శరీరాంలో వేడిమి కలిగిస్తుంది. మెన్సస్ లో రక్తప్రసరణ చక్కగా చేస్తుంది. ఇది హైడ్రోక్సిచల్కొన్ ను కలిగి ఉండటం వల్ల ఇన్సులిన్ ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పవుడర్ ను తీసుకుని పాలల్లో కలుపుకుని త్రాగాలి.

నువ్వులు

మీరు నువ్వుల ప్రత్యేకతను గురించి వినే ఉంటారు. ప్రతీ వంటింట్లో దొరికేదే కానీ ఇది మెన్స్ట్రల్ సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తుంది. అంతేకాక హార్మోన్లను సమతుల్యంగా ఉంచీ మెన్స్ట్రల్ ప్రక్రియకు దోహదపడుతుంది. నువ్వుల్ని తీసుకుని వేయించుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుని పవుడర్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ కంటేనర్ లో జాగ్రత్త చేసుకోవాలి. రోజూ వీటిని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ తేనె తో తీసుకోవాలి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మీ మెన్స్ట్రల్ ప్రక్రియ ఇంకా మెరుగుపడాలంటే దానికి బెల్లన్ని కలుపుకుని వాడితే మరింత మంచిది.

సక్రమంగా మెన్సస్ రాకపోవాటానికి ప్రధాన కారణాలు

బరువు అత్యధికంగా తగ్గుట లేక పెరుగుట
అసమతుల్య ఆహారం
హర్మోన్స్ అసమతుల్యత
ఐబీయస్ (ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోం)
పీసీఓయస్ (పోలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోం)
మెనోపాజ్
డయాబెటిస్
అనీమియా
అప్పుడే గర్భధారణ జరగటం
గర్భస్రావం
టీబీ(ట్యూబర్క్లోసిస్)
పూర్వం ఈ మెన్సస్ సమస్యలకు అంతా మెడికేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సైన్స్, టెక్నోలజి పెరగటంతో ఇప్పుడు చాలా రకాల చికిత్సలు వచ్చేసాయి. అయితే గృహ చిట్కాలు ఏవిధమైన సమస్యల్ని తీసుకురావు కాబట్టి వీటిని వాడటం అంత ఇబ్బంది కాదు. కానీ ఏదిఏమైనా మీ డాక్టరును సంప్రదించటం ఎంతో మంచిది.

NO COMMENTS