ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అన్నింటికంటే మనందరికీ కావల్సిన అత్యంత గొప్ప వరం ఆరోగ్యం. ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము. అవి ఎంటో తెలుసుకుందామా..

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందవచ్చు.

2. రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. రోజూ ఒకగంట వాకింగ్‌ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు.

3. అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి.

4. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనాలలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి.

5. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.

6. ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి.

7. నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి.

8. బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి.