X
    Categories: చర్మ సౌందర్యం

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్

 ఎవరో చెప్పినట్లు “మానవుడు ఎది తినాలనిపిస్తే అదే తినొచ్చు” పెద్దలు చెప్పినట్లు మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొవడం ఎంతో అవసరం.దే విధంగా మనం తీసుకునే ఆహారం మన శరీరంలో అనేక మార్పులకు కారణం కావచ్చు, ఈ మార్పులు తిరగ దోడటానికి వీలులేనవిగా ఉండవచ్చును, ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి  చుట్టుపక్కల వాతావరణము, సూర్య కాంతి,కాలుష్యము ఇలాంటి ఎన్నో  వాటి నుండి మనల్ని రక్షించే మన శరీర  బాహ్య భాగము అయిన మన చర్మం వీటి వల్ల తిరగ దోడటానికి వీలులేని ఇబ్బందులని ఎదుర్కునే ప్రమాదం ఉంది.

మన శరీర ఆక్రుతిలోని మార్పులకు శరీరంలోని తేమ శాతం తక్కువగా ఉండటం ఒక కారణం అందువలన  మన చర్మ సం రక్షణ కై ఎంతో జాగ్రత్త వహించాలి.  మంచి ఆహారం తెసుకోవడమే  కాకుండా  అది మన శరీర తత్వానికి సరియైనదో  కాదో తెలుసుకోవాలి. అయితే , బదులుగా ఖరీదైన చికిత్సలు మునిగిపోవడం కంటే  కొన్ని సాధారణ గృహ చిట్కాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. మీ చర్మం యొక్క భద్రత కోసం ఈ సాధారణ మరియు సులభంగా ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్” ల గురించి తెలుసుకుందాం.

 

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మం కోసం ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్ “

  •  2 టేబుల్ స్పూన్ ల పాలు , 1\2 టేబుల్ స్పూన్ తేనెని విటమిన్ ఏ నూనెను కలిపి మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి. 10 నిమిషాలు తర్వాత చల్లటి  నీటితో కడగండి.  విటమిన్  ‘ ఏ’  చర్మంలో ఉన్న మచ్చలను మరియు ముడతలను  తగ్గించుటలో  సహాయపడుతుంది
  •  అరటి పండుని గుజ్జుగా చేసి ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.10 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.అరటి పండు మన చర్మాన్ని గట్టిపరచి మ్రుదువైన కోమలత్వాన్ని ఇస్తుంది.రెండు  టేబుల్ స్పూన్ ల పెరుగుని నిమ్మ రసంతో కలిపి మంచి ఫలితాల కోసం రోజూ చేయండి. 
  • తాజా కలబంద వేరా జెల్ / రసం తో మీ ముఖాన్ని మర్దనా చేసినచో కలబందలో ఉన్న ఔషద లక్షణాలవల్ల చెర్మం గట్టిపడి ఏ విధమైన చర్మ వ్యాదులు వ్యాపించకుండా సహాయ పడుతుంది.
  • ఒక గిన్నె లో ఒక అవెకాడో పండు గుజ్జు తీసుకుని దానికి అదనపు పచ్చి ఆలివ్ నూనె 2 స్పూన్స్ జోడించండి. ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి. 30 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.
  • గులాబి నీటిలో గంధం పొడిని కలిపి, ఈ పైన సూచించినవన్నీ చేయడం వల్ల  మీరు మంచి తేజోవంతమైన, మ్రుదువైన చర్మాన్ని పొందుతారు,
  • దీనితో పాటు రోజుకి 8 గ్లాసులు నీరు తాగితే చెర్మంలొ తేమ తత్వం పెరిగి చర్మం పొడిబారకుండా చెర్మ వ్యాదులకు దూరంగా పటుత్వంతో  ఉంటుంది

 

ముందుగా మీ చెర్మానికి క్రీం లేదా లోషన్ ని పట్టించి క్రమం తప్పకుండా ఈ చిట్కాలు  పాటిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చును 

విజయ్ :