Posted on

Oily scalp and oily hair tips in Telugu – జిడ్డుగల జుట్టుకు పరిష్కారాలు, సహజమైన పద్దతులలో ఉత్తమమైన మార్గాలు

అందమైన జుట్టుకోసం అంతులేని మార్గాలు ఉన్న ఈ కాలంలో వారానికి 3-4 సార్లు తలస్నానం చేసినా ఎప్పుడైన మీ జుట్టు జిడ్డుగా మారిపోవడం గమనించారా, పోనీ అలా ఎందుకు అయిపొతుందో తెలుసుకున్నారా, ముఖ్యంగా, మీరు ప్రొద్దున్న చేసిన తలస్నానం మిమ్మల్ని ఎంతో ఫ్రెష్ గా ఉంచుతుంది, కాని సాయంత్రానికి అది మీ జుట్టిని వదిలేస్తుంది, దీనికి కారణం “శబం(Sebum)”అనే కొవ్వుతో కూడిన పదార్దం సరియైన రీతిలో ఉత్పత్తికాకపోవడమే.ఈ “శబం (Sebum)” వల్ల మన జుట్టు ఎంతో కోమలంగా, మరియు పొడిబారకుండా ఉంటుంది.

ఈ జిడ్డు గల జుట్టు వల్ల, మీ జుట్టుకే కాకుండా మీ చర్మానికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది.ఈ జుడ్డుగల జుట్టు 2 రకాలు, మొదటిది మీ జుట్టు యొక్క మొదలు భాగం నుంచి చివరి భాగం వరకు జిడ్డుగా ఉండడం, రెండొవది మీ జుట్టు మొదలు భాగం జిడ్డుగా ఉండి, చివరి భాగం పొడిబారిపోవడం. అయితే చింతించవలసిన అవసరం లేదు.

జిడ్డుగల జుట్టుని నిర్మూలించి, జుట్టుని రక్షించే మార్గాలు

1.రోజూ తలస్నానం చేసే అప్పుడు మీ షాంపూతో మీ జుట్టుని శుబ్రముగా రుద్దండి, దానివల్ల మీ జుట్టుకి పట్టిన దుమ్ము, ధూళి వదిలి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

2.మంచి “కండీషనర్” తయారు చేసుకోండి, కొంచెం కలబంద రసం, ఒక స్పూన్ ఆపిల్ కలిపిన వెనిగర్, నిమ్మరసం తీసుకుని మీ జుట్టు కి పట్టించి శుబ్రం చేసుకుంటే ఎంతో మంచిది

3. ప్రత్యేకంగా జిడ్డుగల జుట్టుతో పోరాడే షాంపూని వాడతం ఏంతో మంచిది,సాదారణంగా షాంపూలోని “PH” శాతం 4-7 వరకు ఉండగా, జిడ్డుగల జుట్టుకి, మరింత ఎక్కువ శాతం ఉండేది అవసరం.

4. మా షాంపూని మీరే తయారుచేసుకోండి, అందులో కొంచెం కలబంద రసం, 2 టేబుల్ స్పూన్లు నిమ్మ రసం కలిపి ఫ్రిజ్లో పెట్టి కావాల్సినపుడు ఉపయోగించుకోవచ్చు.

5. మీది జిడ్డుగల జుట్టు అయితే సాద్యమైనంత వరకు “కండీషనర్”లు వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే మీ జుట్టు చివరి భాగాలకు పట్టించి శుబ్రం చేసుకోవడం మంచిది.

6. మీరు ఎక్కువగా జుట్టు దువ్వుకునేవారైతే, మీకు జుట్టూ ఊడిపొయే ప్రమాదం ఎక్కువ, అందుకే తగ్గించి దువ్వుకోవడం మంచిది.

7. మీ జిడ్డుగల చర్మంతో పోరాడడానికి నిమ్మ సారం, టీ,పళ్లరసం,వినెగార్ ఎంతో ఉపయోగపడతాయి, కాని ఇవి వాడిన తరువాత మీ జుట్టుని చల్లని నీటితో శుబ్రం చేసుకోండి, లేదంటే వాటిలోని రసాయన తత్వం మీ జుట్టుకి హాని కలిగించే ప్రమాదం ఉంది.

8. కోడి గుడ్డు సొన తీసుకుని కొంచెం సున్నం కలిపి మీ జుట్టుకి పట్టించి శుబ్రం చేసుకుంటే, మంచి ప్రభావం చూపిస్తుంది.

 

ఇంకెందుకు ఆలోచన, పైన సూచించిన వాటిలో అన్నీ మన ఇంట్లో ఉండేవే, జుట్టు పై బెంగ పోవాలంటే ఒక్కసారి ట్రై చేసేయండి.

Posted on

Telugu tips for acidity / gastric problem – యసిడిటి / గ్యాస్ ప్రాబ్లం

ప్రస్తుత సమాజంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఈ “యసిడిటి”తో బాధపడుతున్నారు, అయితే ఈ సమస్య రోజు రోజుకూ ఎక్కువై పోతుంది, దీనిని నియంత్రించక పోతే ఎంతో ప్రమాదం. ఇది సహజంగా ఎక్కువ కారం, మషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మన కడుపులో వీటి ప్రబావం ఎక్కువయ్యి మంటకు దారితీసే “యాసిడ్”లను విడుదల చేస్తుంది.

కొన్ని అనువైన, తేలికైన పద్దతులతో మీ ఈ సమస్యని తరిమేయండి ఇలా..

Caffeine ఉండే పానీయాలను తీసుకోకపోవడం మంచిది, అంతేకాకుండా ప్రొటీన్లతో కూడిన పానీయములు తీసుకోవడం ఎంతో అవసరం.

రోజు వారి జీవితంలో ఒక గ్లాసు గోరు వెచ్చని మంచి నీరు తీసుకోవడం అవసరం.

అరటి పండ్లు, పుచ్చకాయ, దోసకాయ ఇవి ఈ సమస్య నుంచి విముక్తుల్ని చేస్తాయి, రోజూ తీసుకునె ఆహరంలో ఇవి అన్ని కలిపి తీసుకోవడం, పుచ్చకయ రసం ఎక్కువగా తాగడం వల్ల మీ కడుపు చల్లబడి, ఈ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కొబ్బరినీరు, మీ జీర్ణ వ్యవస్తను కొబ్బరికాయ ఎంతగానో రక్షిస్తుంది, ఎప్పుడైన ఈ సమస్యతో బాధపడుతుంటే కొబ్బరి నీరు తీసుకోండి మంచి ప్రభావం చూపిస్తుంది

రోజూ తీసుకునే ఆహారంతో పాలను కూడా తీసుకోవడం వల్ల మంచి ఉపసమనం లబిస్తుంది.

2-3 గంటల వ్యవదిలో కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

ఒకవేళ మీకు కారంతో, మషాలాతో కూడినవి తినాలనిపించినా, వాటికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

రోజూ భోజనం చేసిన తరువాత గోరు వెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి తీసుకుంటే ఎంతో మంచిది.

గ్యాస్ ప్రాబ్లం సమస్యకు పరిష్కారాలు చుద్దామా (Remedies for acidity / gastric problem)

లవంగాలు

2-3 లవంగాలు తీసుకొని రోజూ తినండి, దాని వల్ల వాటిలో ఉండే రసం మీ ఈ సమస్యని దూరం చేస్తుంది.

బెల్లం

రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఈ సమస్యనుంచి విముక్తి పొందవచ్చు, ఈ చిట్కా మధుమేహం లేని వారికి మాత్రమే.

పెరుగు

పెరుగు, కొత్తిమీర, దొసకాయతో చేసిన మిశ్రమం తీసుకుంటే ఈ సమస్యనుంచి మంచి ఉపసమనం లబిస్తుంది.

తులసి ఆకులు

తులసి ఆకులలో మంచి ఔషధ లక్షణాలు కలవు, అయితే అవి తినడం వల్ల, లేదా వాటిని చిన్న చిన్న ముక్కలుగ చేసి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేస్తుంది.

మజ్జిగ

మీరు రోజు మజ్జిగ తాగేటప్పుడు అందులో 1\4 స్పూన్ మిరియాలు పొడి కలిపి తీసుకుంటే, ఈ సమస్య నుంచి మంచి ఫలితం లబిస్తుంది.

పుదీనా

మీ జీర్ణ సమస్యలనుండి, ఈ గ్యాస్ సమస్యనుంచి విముక్తి కోసం మీరు పుదీన ఆకుల రసాన్ని తీసుకుంటే ఎంతో మంచిది.

పాలు

రోజు వారి జీవితంలో పాలు ఎక్కువగా తీసుకుంటే వాటిలో ఉండే Calcium కంటెంట్ మిమ్మల్ని ఈ సమస్యనుంచి కాపాడుతుంది.

వెనిలా ఐస్ క్రీమ్

వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మంచి ఫలితం పొందవచ్చు.

Posted on

Orange and lemon face pack for glowing skin in Telugu – మెరిసే చర్మం కోసం నారింజ, నిమ్మ తొక్కలతో “ఫేస్ ప్యాక్”

సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే…ఇలా

మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ C” మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.

ఈ “ఫేస్ ప్యాక్” ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుబ్రం చేసుకుంటే దానివల్ల మీ చర్మం లోని చనిపోయిన, అనవసరమైన కణాలు తొలగిపోతాయి.

 ఈ నారింజ, నిమ్మ తొక్కల పొడి తయరు చేసుకోవడం ఎలా?

నారింజ, మరియు నిమ్మ తొక్కలని తీసి కొన్ని రోజులు ఎండపెట్టాలి, అవి గట్టిగా అయిన తరువాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో ఉంచాలి.అలా మీరు “ఫేస్ ప్యాక్” తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు”

 ఉపయోగించుకోవడం ఎలా??

ఈ పొడిని, కొంచెం పెరుగు, నీటిలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చర్మంలోని జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే అందమైన చర్మం కలిగి, మృదువుగా మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.

ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమల నుంచి, నల్లని మచ్చలనుంచి, చర్మం ముడతలు పడకుండా ఎంతగానో సహాయపడుతుంది.

ఈ పొడిని ఎక్కువగా చేసుకుని ఉంచుకోవడం మంచిది, ఇది పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎండిపొయిన పండ్ల తొక్కలతో తయారుచేసింది .

ఈ పై మిశ్రమం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఒక్కసారి ఉపయోగించి చూడండి,

 

వేసవిలో నారింజ మరియూ తేనె “ఫేస్ ప్యాక్”

1/4 కప్పు తేనె

1 1/2 టేబుల్ స్పూన్ నారింజ

ఈ పై వన్నీ కలిపి మీ ముఖానికి పట్టించి 20-30 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

Posted on

Telugu tips for eye side wrinkles – కంటి పక్క చర్మం పై ముడతలా?

అందమైన చిరునవ్వంటే ఇష్టపడని వారుండరు, అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే అందరూ కోరుకుంటారు, కాని మీ అందమైన చిరునవ్వుకు మీ కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా, అదే ముడతలు పడ్డ చర్మంతో మిమ్మల్ని బాధిస్తున్నాయా, చింతించవలసిన అవసరం లేదు, సామాన్యంగా 40 ఏళ్ళ వయస్సులో మీ నవ్వుల చాటున ఈ ముడతలు వస్తున్నాయంటే అది మీ వయస్సు ప్రభావం వల్ల అనుకోవచ్చు, కాని ఇప్పటి కాలంలో 20 నుంచి 40 వరకూ, ఎక్కువగా 30 ఏళ్ళ వాళ్ళకు ఈ ఇబ్బంది వస్తుంది.

అసలు ఈ ఇబ్బందికి కారణాలేమిటి?పరిష్కరించడం ఎలా??

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

1. ఎక్కువగా నవ్వడం

2. ఎక్కువగా ఓర కంటితో చూడడం.

3. నిదురించే పద్దతి

ఈ పై సూచించిన 3 పనులు ఎక్కువగా చేయడం వల్ల మన చర్మం సాగి, ముడతలుగా, మారుతుంది.

నవ్వడం:

ప్రతీ ఒక్కరికీ నవ్వడం అనేది ఒక గొప్ప అదృష్టం, కాని ఎవరికి వారు సొంత శైలిలో నవ్వుతూ ఉంటారు, కొందరు నవ్వెటప్పుడు వారి కంటి పక్క చర్మ కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.అయితే దీనిని గుర్తించి నవ్వేటప్పుడు ఆ కండరాలను ఉపయోగించకుండా నవ్వడం ఎంతో మంచిది.

ఓర కంటితో చూడడం:

సమాన్యంగా మనం ఓర కంటితో చుస్తూ ఉంటాం, ముఖ్యంగా ఏదైన వెలుతురు మన ముఖంపై పడినప్పుడు, సుర్యకాంతికి ఎదురుపడినప్పుడు, మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన చర్మం పగిలి ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

నిదురించే పద్దతి:

మన నిదురించే పద్దతిలో కుడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది, అదే విదంగా, అదే పద్దతిలో ఈ సమస్యను పరిష్కరించే ప్రమాదం ఉంది.

అంటే, మనం నిదురించేఅప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే ఈ సమస్యనుంచి ఉపసమనం పొందవచ్చు. ముఖ్యంగా “యూ” ఆకారంలో ఉన్న దిండుని, లేదా పట్టు దిండుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉండవచ్చు.

ఈ సమస్యను అదిగమించడానికి చాలా మార్గాలున్నాయి అవి ఇవే:

మీకు ఈ సమస్య వస్తుందేమో అని భయపడుతున్నారా, అయితే ఈ పద్దతులు పాటిస్తే మీరు సంతోషంగా, ఏ చింతా లేకుండా ఉండవచ్చు.

ఎప్పటికప్పుడు మీ చర్మాన్ని శుబ్రం చేసుకోవడం, దుమ్ము దూళితో, మలినాలు కలిగి ఉన్న చర్మాన్ని

తీసివేసి సరికొత్త యవ్వనమైన చర్మం వచ్చేలా చేసుకోవడం అంతే కాకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మం కోసం మీ చర్మాన్ని శుబ్ర పరుచుకోవడం ఇలా చేయడం వల్ల మీ చర్మం లోని చనిపొయిన రక్త కణాలను తరిమేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఈ చర్మాన్ని శుబ్రం చేసుకునే పద్దతిలో “గ్లైసోలిక్ యాసిడ్(Glycolic Acid)” ను ఉపయోగిస్తే అది మీ మలినమైన చర్మాన్ని శుద్ది చేసి అందమైన, యవ్వనమైన సరికొత్త చర్మాన్ని ఇస్తుంది.

ఇలా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం వల్ల ఈ సమస్యను మీ దరి చేరకుండా కాపాడుతుంది.

Posted on

Okra health benefits in Telugu – ఆరోగ్యానికి బెండ. . .

 

సన్నగా అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకుగా కనిపించే బెండకాయలంటే ఇష్టపడనివారుండరేమో. . . విందుభోజనాల నుంచీ సాధారణ భోజనం వరకూ అన్నింటా కనిపించి ముద్దుగా ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అనిపించుకుంది. దీనిలో పీచు, కాల్షియం, పొటాషియం. . . వంటి వాటితో పాటు పండ్లలో ఉన్నట్లే యాంటీ ఆక్సీడెంట్లు బెండలో అధికం. ఏంటీ ఇంత ఉపోధ్ఘాతం అనుకుంటున్నారా. . !

బెండ ఆరోగ్యానికి ఎంతో అండ. ఇందుగలదు అందుగలదో అన్న సందేహం వలదు. . . ఎందెందు చూసినా అందందే కలదు అన్న చందంలో బెండ అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనిని భూగోళం అంతా పండిస్తున్నారు. దీనిలో ఉన్న పోషక విలువలు ఎలా అరోగ్యానికి ఉపయోగపడతాయో తెలుసుకుందామా. . .

బెండ తింటే తెలివి తేటలు పెరుగుతాయ్ నాన్నా. . తిను అని మన పెద్దవాళ్ళు కొసరి కొసరి బెండను తినిపిస్తారు. దానికి కారణం ఇందులో బీటాకెరోటిన్,  బి-కాంప్లెక్స్,  విటమిన్-సి,  ఐరన్,  పొటాషియం,  సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు బెండలో ఎక్కువ. అవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేస్తాయి. దీని వల్ల నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. దీన్ని తినటం వల్ల దిప్రెషన్ తగ్గుతుంది.

గర్భిణులకు ఇది మంచి ఆరోగ్యం. శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధి చెందుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లం చాలా ఉపయోగపడుతుంది.

అధికంగా ఉండే కాల్షియం , విటమిన్-సిల వల్ల బంధన కణజాలం,  ఎముకలు,  కీళ్ళు పనితీరు బాగుంటుంది.
కరగని పీచు ఎక్కువ. ఇది మలబధ్ధకానికి మన్చి మందు. చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది.

అధిక పీచు వల్ల దీని గ్లెయసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఈ పీచులోని పెక్టిన్ రక్తంలోని కొలెస్టాల్ సాతాని తగ్గిస్తుంది. అందుకే ఇది రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది. పొట్టలోని చక్కెర నిల్వల్ని పీల్చుకుంటుంది. ఇందువల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.

అల్సర్లతో బాధపడేవారు బెండ తరచూ వాడటం వల్ల అందులోని జిగురు జీర్ణకోశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
ఇక అందం విషయానికొస్తే బెండ చాలా మంచిది. దీనిని తినటం వల్ల చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొహం మీద మొటిమలు రాకుండా చేస్తుంది. జ్వరం, డయేరియా, కడుపులోనొప్పికి బెండ రసం మంచిగా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇలా గృహ వైద్యానికి బెండ అన్ని విధాలా పనిచేస్తుంది. ఇక ఆలస్యమెందుకు బెండ ను తినేద్దామా. . . మరి. . !

Posted on

Telugu tips for mind stability mental peace – మీలో అస్థిరతను తొలగించేందుకు కొన్ని మార్గాలు

 

అస్థిరత, చాంచల్యము, డోలాయమానము ఇది ఎక్కువగా యువతలో కనపడుతున్న, వినపడుతున్న పదాలు. పదాలు కొత్తగా ఉన్నా దీనిని ఇప్పుడు ఆగ్లంలో పిలుస్తున్న పదమయితే ఫ్రక్చువేషన్ అని పిలుస్తున్నారు. అయితే దీని ప్రభావం మానవునిపై ఉండబట్టే ఈనాడు దీని కింత ప్రధాన్యత సంతరింన్చుకుంది. ఈ లక్షణం ఎక్కువ అయితే ఆ వ్యక్తి రాక్షసుడిగా మారతాడు. ఈ లక్షణం పెరిగి పెద్దదై చివరికి తనను తను బాధ పెట్టుకొవటమో లేక పక్కవారిని బాధపెట్టటమో చేస్తాడు.

ఈ హెచ్చు తగ్గులు ఈ మార్పులు మనకు తెలియకుండానే మన దరి చేరతాయి.దీని వల్ల తీవ్ర అనారోగ్యాల పాలుకాక తప్పదు.కాబట్టి వాటిని నియంత్రిచుకోవటం ఎలా అనేది ఈ కాలంలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ అస్థిరత అనేది ఏర్పడే సమయంలో రక్తపోటు స్థాయి పెరిగిపోతుంది.నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది.ఆ సమయంలో ఏ పనీ, ఆలోచన కానీ చేయలేము.

ఈ సమస్యకు ఆడ మగ అన్న తేడాలయితే లేవు కానీ వారి రక్తపోటు స్థాయిలను బట్టి ఉంటుంది. మీ తల బరువుగా, భారంగా ఉండి, చేతులు లాగటం జరిగితే అది ఖచితంగా రక్తపోటు పెరిగినట్లే. అయితే ఒకనాడు ఉన్న పరిస్ఠితికి నేడు ఉన్న పరిస్థితికీ చాలా తేడాలున్నాయి. ఒకనాడు రక్తపోటంటే పెద్దలోనే వచ్చేది.కానీ ఈనాడు ఇది అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతోంది.

ఇలా అస్థిరత మీలో చోటు చేసుకున్నప్పుడు వెంటనే మీరు మీ చిటికిన వేలిని రెండు చెవుల్లోనూ లోపల ఉంచి అటూ ఇటూ కదుపుతూ ఉండాలి. ఈ ప్రక్రియను రెండు మూడు నిముషాలు ఉంచి తగ్గించుకోవాలి.తగాని పక్షంలో మరోసారి ఇలాగే చేయాలి.దీనినే యోగా పరిభాషలో అనులోమ్ విలోమ్ ప్రాణాయామా అని అంటారు.

శరీరంలో అస్థిరత చోటు చేసుకున్నప్పుడు ఎక్కువగా నీరు త్రాగాలి. ఇందువల్ల నరాల్లో రక్త ప్రసరణ జరిగి తగ్గుతుంది.
ఫ్రక్చువేట్ అవ్వటానికి కారణం మానవునిలో ఉన్న ఎలక్త్రో ఎన్సెఫలోగ్రం అని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక హైపెర్ టెన్షన్ లో వచ్చే దానిని ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ అని అంటారు.దీని కారణంగా తలనొప్పి, బూదరగా కనిపిచటమ్, నీరసంగా ఉండటం, తడబడటమ్ లాంటివి లక్షణాలు.

  • ఈ సమస్య ఆల్కహాలు త్రాగటం, ధూమపానం చేయటం, అతిగా ఒక విషయాన్ని ఆలోచించటం, మానసిక శారీరక ఒత్తిళ్ళు వలన ఇలా శరీరం అస్థిరతకు గురవుతుంది.
  • ఈ సమస్య నుంచీ బయటపడాలంటే ప్రొద్దున్నే యోగా చేయాలి.
  • నెమ్మదిగా స్థిమితంగా అలోచించాలి.
  • ఏ విషయానికీ ఒత్తిడి తీసుకొనరాదు.
  • చక్కటి ఆహార అలవాట్లు రోజూ అలవరచుకోవాలి.
  • ఎక్కువగా విదాకులు పొందినవారిలో, ఒన్తరిగా జీవించే వారిలో, రిటైర్డ్ అయిన వారిలో, నిరుద్యోగులలో, అంగవైకల్యం ఉన్న వారిలో ఎక్కువగా ఈ సమస్య కనపడుతోంది.
  • ఈ సమస్య నుంచీ బయటపడేందుకు వ్యాయామాన్ని అలవరచుకోవాలి, జీవిత లక్షాలను నిర్దేశించుకోవాలి.
  • కుటుంబ సభ్యుల, స్నేహితుల నున్చి చేయూత తీసుకోవాలి.
  • ఏదైనా నచ్చిన వాటిని ఆటలు, క్రీడలు అలవాటు చేసుకోవాలి.