Posted on

Winter skincare tips to get smooth and soft skin in Telugu – శీతాకాలంలో అందమైన మరియు మృదువైన చర్మం కోసం తగు జాగ్రత్తలు తీసుకుందామా

చల్లని చలి కాలంలో మీ అందమైన చర్మంకు ఎన్నో ఇబ్బందులు,మిగిలిన కాలాల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది, ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోయి, ఒక్కో సారి పగిలిపోవడం,లేదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. కంగారుపడవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిబారకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి.

 • హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది, దీనిని అదిగమించడానికి, మీ శరీరంలో నీరు, మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే పదార్దాలని వాడటం మంచిది.
 • మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే, అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే, చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది, అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో సహకరిస్తుంది.
 • ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది, దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి, కాళ్ళు, చేతులకు పట్టిస్తే, అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.
 • మీ వంటి సబ్బులో క్రిమిసం హారిక లక్షణాలు ఉన్న, లేదా మీరు తీసుకునే మాయిశ్చరైజర్ లో ఆల్కహాల్ కలిగి ఉన్నా,వాటిని వాడటం మంచిది కాదు.
 • వేడి నీళ్ళతో స్నానాలు చేయరాదు,ఎందుకంటే ఈ వేడి నీటి వల్ల మీ చర్మం ఇంకా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
 • గోరు వెచ్చని నీటితో చేయడం మంచిది అంతేకాకుండా ఎక్కువసేపు స్నానం చేయడం అంత మంచిది కాదు.

ఈ చలి కాలంలో వేసుకోవాల్సిన దుస్తులు

మీరు దరించే బట్టలలో కూడా మీ ఆరోగ్యం దాగి ఉంటుంది,అందుకే ముఖ్యంగా కాటన్ తో, ఉన్నితో తయారు చేసిన బట్టలు,మీ శరీరం అంతా వ్యాపించి మిమ్మల్ని ఈ సమస్య నుండి రక్షించేవే వేసుకోవడం మంచిది.

ఈ చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది,వెచ్చదనం కోసం ఎండలో నిలబడతారు,దాని వల్ల చర్మం మరింత పొడి బారిపొయే ప్రమాదం ఉంది.

ఈ చలిలో తగినంతవరకూ బయటకు వెళ్ళకపోవడం ఎంతో మంచిది,ఒకవేళ వెళ్ళ వలసి వస్తే స్వెటర్ లేదా జాకెట్ ను వేసుకుని వెళ్ళడం శ్రేయస్కరం.

చలికాలంలో ఆహార నియమాలు

మీరు వేసుకునే దుస్తులే కాదు, తీసుకునే ఆహారం కూడా మిమ్మల్ని ఈ సమస్య నుంచి కాపాడడంలో ఎంతగానో సహకరిస్తుంది, ముఖ్యంగా విటమిన్లు A, C మరియు E సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ తీసుకుంటే మీ చర్మం యొక్క్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మీ శరీరన్ని చలి తీవ్రతనుండి,పొడి బారకుండా కాపాడడానికి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.

అవిసె గింజలు, అక్రోట్లను, సాల్మొన్, లవంగాలు, సోయాబీన్స్, ఆకుకూరలు వంటి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Posted on

Best tips to control diabetes in Telugu – మీకు బీపీ(బ్లడ్ ప్రెషర్)ఉందా?

వినడానికి విచిత్రంగా అనిపించినా, చెప్పడానికి చమత్కారంగా ఉన్న ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి వారి ఇంట్లో,తినే ఆహారంలో ఉప్పుని ఉపయోగించడలేదు,ఎందుకంటే ఉప్పుని అదికంగా ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్తితి వస్తుంది, రక్తపోటు, గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది,ఒక్కో సారి ప్రాణంపొయే పరిస్తితి కూడా ఉంటుంది,అయితే ఈ అన్నిటి పరిణామాల వల్ల ఉప్పుని వాడటం మానేసి రుచి లేని ఆహరం తినేకన్నా,దానికి తగిన ప్రత్యామ్నాయాలు వెతకడం మంచిది.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

1. ఉప్పు బదులు వెల్లుల్లి పొడి ఉపయోగిస్తే రుచికరమైన ఆహారం తినవచ్చు.

2.రుచికరమైన, సువాసనబరితమైన ఆహారం కోసం, ఉప్పు బదులు పొడి చేసిన మిరియాలు ఉపయోగించండి.

3.సోయా ఉప్పు కూడా మీ ఆహారంలో ఉపయోగించవచ్చు, ఇందులో మామూలు ఉప్పుకన్నా సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది.

4.మీ ఉప్పు బదులు “ఉల్లి పొడిని ఉపయోగించవచ్చు”.ఇది ఎంతో రుచికరమైన ఆహరం ఇవ్వడంలో సహాయపడుతుంది.

5.తాజా నిమ్మరసం కూడ మీ ఉప్పుకి ప్రత్యామ్నయంగా ఉపయోగించుకోవచ్చు.

6.నిమ్మరసాన్ని సోడాకు బదులు నీటిలో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

7.బాగా వేయించిన వెల్లుల్లిని తినడంలో కూడ మీరు ఉప్పుకి ప్రత్యమ్నయంగా అనుకోవచ్చు.

8.సన్ఫ్లవర్ విత్తనాలు కూడా మీ ఆహారంలో ఉప్పుకి ప్రత్యామ్నయంగా ఉపయోగపడతాయి.

9. మీరు సలాడ్స్ తీసుకునేటప్పుదు ఆవాలు లేదా ఊరగాయ రసం కలిపి తీసుకుంటే ఉప్పుకు మంచి ప్రత్యామ్నయంగా ఉపయోగపడుతుంది.

10. స్వీట్స్ మీ వంటలలో అద్బుతాల్ని చేస్తాయి,ముఖ్యంగా చికెన్లో నారింజ జూస్ కలిపి వండితే ఉప్పువేసుకోవలసిన అవసరం ఉండదు.

Posted on

Weight loss tips in Telugu – అదిక బరువును ఎలా తగ్గించుకోవాలి

స్థూలకాయం అనగా అధిక బరువు కలిగి ఉండడం,ఈ సమస్య ఈ కాలంలో వయస్సుతో సంబందం లేకుండా అందరిని ఇబ్బందిపెడుతుంది,అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ ఉద్యోగులకు ఎక్కువగా స్థూలకాయం వస్తుంది,ఎందుకంటే వారి ఉరుకుల పరుగుల జీవితంలో,పని ఒత్తిడిలో సరియైన ఆహార నియమాలు పాటించడం మానేసి, ఇష్టం వచ్చినట్లు,ఏది కావాలంటే అది,ఎప్పుడు కావాలంటే అప్పుడు,ఎక్కడ కావాలంటే అక్కడ,జుంక్ ఫుడ్ తింటూ,ఏవిదమైన వ్యాయామం చేయకపోవడం వల్ల,వారి ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల దీనికి గురివుతున్నారు.

అదిక బరువును ఎలా తగ్గించుకోవాలి (weight loss tips in Telugu)

 1. రోజూ కనీసం 30 నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.
 2. ద్రవం రూపంలో ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి,ప్రత్యేకంగా “గ్రీన్ టీ” రోజుకు కనీసం 2 సార్లు అయినా తీసుకుంటే ఎంతో మంచిది, ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్దాలను కరిగిస్తుంది.
 3. ఒకవేళ మీకు మంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ,ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీశరీరంలో కొవ్వు పెరిగే ప్రమాదం ఎక్కువా.
 4. మీ రోజువారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహరం అంటే పాలు, మజ్జిగ ఎల ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
 5. మీరు తీసుకునే ఆహారంలో “చక్కెర నిల్వలు” ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం ఎంత అవసరం,ఎందుకంటే ఈ చక్కెర నిల్వలు అధిక బరువుకి దారి తీస్తాయి.
 6. అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది, ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.
 7. మీ ఆహారం తీసుకునే పద్దతిని మార్చుకోండి, ఒకవేళ మీరు రోజుకి 3 సార్లు ఆహరం తీసుకుంటున్న్నట్లైతే దానికి నాలుగు సార్లుగా కొంచెం కొంచెం తీసుకోండి.
 8. మీ అధిక బరువు తగ్గించుకోవడానికి వారంలో కనీసం 3 కోడి గుడ్లు అయినా తీసుకోవడం మంచిది,ఎందుకంటే ఈ కోడి గుడ్లలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
 9. సాద్యమైనంత వరకూ ఆకలి వేస్తేనే ఆహారం తీసుకోండి,అంతేకాకుండ ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేని సమయంలో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మీరు అధిక బరువుకు గురి అయ్యే ప్రమాదం ఉంది.
 10. రోజూ వ్యాయామం చేయండి,అలా చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు తగ్గి మీ బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి,వీలుంటే “యోగా” చేయడం ఎంతో శ్రేయస్కరం.
 11. మీరు సరియైన సమయాల్లో నిద్రపోతే మీలోని జీవక్రియ రేటు పెరిగి,మీ అదిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
 12. మీ రోజు వారి ఆహారంలో “సూప్స్” తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
 13. మీ ఆహారంలో చీజ్, నెయ్యి మరియు వెన్న ఎలాంటి కొవ్వుని కలిగించే పదార్దాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల మీ బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
 14. నూనెతో చేసిన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు,మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.
 15. బంగాళ దుంపలలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువుకు గురి చేసే ప్రమాదం ఉంది.

బరువు తగ్గించే ద్రవాలు(డ్రింక్స్)

 1. రోజూ కాఫీ తాగడం వల్ల అందుకో ఉండే కెఫిన్ మీ బరువుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే ఇందులో కోకో మరియు కోలా గింజలు కలుపుకుంటే మంచి ప్రబావం చూపిస్తాయి.
 2. ఆపిల్ పళ్లరసం వినెగార్,తేనె,చల్లని నీరు కలిపి తీసుకుంటే మీకు మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించడమే కాకుండా మీ జీర్ణ సమస్యలకి మంచి ఫలితం లబిస్తుంది.
 3. నిమ్మ,నారింజ వంటి సిట్రస్ పండ్లు జ్యూస్ రోజూ తీసుకుంటే మీ అధిక బరువు సమస్యను తరిమేయవచ్చు.
Posted on

How to relieve from cold and cough tips in Telugu – జలుబు, దగ్గు తగ్గలంటే ఇలా చెయ్యండి

శీతాకాలం అంటే చాలు, చలితో పాటు అనేక సమస్యలు కూడా మనల్ని పట్టి పీడిస్తాయి, అందులో జలుబు,దగ్గు ఇవి రెండూ వద్దన్నా మనల్ని వదలకుండా చలితో పాటూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అయితే ఇది అందరికీ దాదాపుగా ఉండే సమస్యే అందువల్ల, మందులు తీసుకుంటే సరిపోతుంది, కాని ఆ మందుల వల్ల దుష్ప్రబావాలు కలిగే ప్రమాదం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనం కోసం సహజమైన పద్దతులు తెలుసుకుందామా…

 • కొంచెం పసుపు,అల్లం పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే,ఇది వేడితనాన్ని పెంచి, మీ దగ్గుని తగ్గించడమే కాకుండా మీ శరీరంలోని నొప్పులని,తలపోటుని తగ్గిస్తుంది.
 • మీకు బాగా జలుబు చేసి, మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారా అయితే వేడి నీటి యొక్క ఆవిరి పీల్చడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం లబిస్తుంది.
 • ఈ జలుబువల్ల మీ గొంతు నొప్పితో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అయితే, కొంచెం గోరు వెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకును పుక్కిలించి ఊస్తే,త్వరిత ఉపశమనం కలుగుతుంది.
 • ఈ జలుబు నుంచి త్వరిత ఉపశమనం కోసం,వేడి పదార్దాలు ఎక్కువ తీసుకోవాలి, టీ,కాఫీ,వెచ్చటి కాక్టైల్స్, గోరు వెచ్చగా కాసిన మంచి నీరు తీసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
 • జలుబు వల్ల మీ గొంతులో సమస్యగా ఉంటే టీతో పాటు అందులో తులసి ఆకులు,మిరియాలు,అల్లం పొడి కలిపి తీసుకుంటే త్వరిత ఉపసమనం లబిస్తుంది.

ఈ పై సూచించిన వాటితో పాటు మీ జలుబు,దగ్గు,మరియు గొంతు సమస్యలు పోవాలంటే “చవన్ ప్రాష్(Chavanpraash)”,”ఉసిరి ములబ్బ(Mulabba)” తీసుకుంటే వీటిలో ఉండే “Vitamin C”మిమ్మల్ని ఈ సమస్యలనుండి
కాపాడుతుంది.

Posted on

Breast reduction tips for women in Telugu – శస్త్రచికిత్స లేకుండా అధికంగా ఉన్న “చాతి భాగమును(బ్రెస్ట్)” ని తగ్గించుకోవడం ఎలా?

అందానికి మారుపేరు అయిన అమ్మయిలు, ఎన్నో రకముల ఇబ్బందులు పడుతూ ఉంటారు,అందులో ఆరోగ్య సమస్యలు కొన్ని అయితే, మరికొన్ని శారీరక సమస్యలు, అందులో అధిక చాతి భాగం(బ్రెస్ట్) కలిగి ఉన్న స్త్రీలు అందరికి ఆకర్షితులై, ఆకతాయుల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు నలిగిపోతూ, ఎన్నో ఆటు, పోట్లు అనుభవిస్తూ, ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అంతేకాకుండా శారీరకంగా కూడా అధిక భరువు కలిగిన చాతి వల్ల నడుము, భుజాలు, మెడ ప్రాంతంలో నొప్పితో బాదపడుతూ ఉంటారు.

ఈ అధికమైన చాతి కలిగి ఉండడం వల్ల మీరు మీకు నచ్చినవి,అందమైన దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అంతే కాకుండా ఇది మీ సౌందర్యం పై కూడా ప్రబావం చూపించి మీరు సరదాగ, బయటకు వెళ్ళాలన్నా, షాపింగ్ కి వెళ్ళాలన్న,ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే, ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది, అలానే మీ చేతి సమస్యను దూరం చేసి మీరు కూడా అందరిలా సరిసమానమైన చాతితో ఉండాలంటే శస్త్రచికిత్స లేకుండా, మీ ఇంట్లోనే సహజ పద్దతులు కొన్ని ఉన్నాయి, అవి ఎంటో చూసేద్దామా.

రొమ్ము పరిమాణం తగ్గించడానికి సహజ మార్గాలు

మీ శరీర బరువుని “BMI” ప్రకారం ఉండేలా చూసుకోండి

మీ శరీర బరువుని మీ వయస్సు ప్రకారం ఎంత ఉండాలో అంతే ఉండేలా చూసుకోవాలి, ఒకవేళ ఎక్కువ ఉన్నట్లైతే తగ్గించుకోవడానికి పళ్ళు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, ఆకు కూరలు,గింజలు తీసుకోవాలి, అలాకాకుండా బాగా వేయించిన ఆహారం, తీపి ఎక్కువగా ఉండే పదార్దాలు తీసుకోవడం మంచిది కాదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి మాత్రలు(మెడిసన్)

మీ ఈ చాతి సమస్య నుండి విముక్తి పొందడానికి అనేక మూలికలతో తయరు చేసిన మాత్రలు లభిస్తాయి. అయితే, ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ఏరకమైన దుష్ప్రబావాలు కలగకుండా కాపాడతాయి.ఇవి మీ చాతి పరిమాణాన్ని తగ్గించడంలో ఎన్నో అద్భుతాలు చేస్తాయి అనడంలో సందేహం లేదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి లోషన్స్ మరియు ఔషద పదార్దాలు

మీ చాతిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి, అధిక బరువుని తగ్గించుకోవడానికి అనేక లోషన్స్ మరియు ఔషద పదార్దాలు ఎన్నో ఉన్నాయి,మీరు చేయవలసిందల్ల అవి మీ చాతి భాగం పై రాసుకుని,మసాజ్ చేసుకుంటే మీ చాతి పరిమాణం తగ్గి, మంచి ఆకారం లబిస్తుంది.

సరిగ్గా సరిపొయే బ్రా

మీ చాతి పరిమాణాన్ని రక్షించుకోవడంలో మీరు వేసుకునే బ్రాలు సరియైనవిగా, మీ చాతికి సరిగ్గా సరిపోయేవి తీసుకోవాలి, అలా వేసుకుంటే దాదాపుగా ఒక కప్పు పరిమాణం తగ్గి, మీ చాతి భాగం అందమైన ఆకారంతో కనపడుతుంది.

రొమ్ము తగ్గింపు వ్యాయామాలు

ఖచ్చితంగా అనేక రొమ్ము తగ్గింపు వ్యాయామాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి బోటింగ్, జాగింగ్, చురుకైన వాకింగ్,సైక్లింగ్ ఇలా చేస్తే మీ చాతి పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

మీ శరీరాకృతిని చూసి ఆందోళన చెందకుండా ఈ పై సూచించిన వన్నీ ఉపయాగించి ఆనందంగా, ప్రశాంతంగా జీవించండి.

Posted on

Best food tips for the infants in Telugu – మీ పిల్లల ఆరోగ్యము,ఆహార నియమాలు(పద్దతులు)

చిట్టి పొట్టి చిన్నారులనుంచి, తప్పటడుగులు వేస్తూ చాక్లెట్ తినే పిల్లలవరకూ వారి తల్లిదండ్రులలో ఉండే ఒకే ఒక్క ఆవేదన పిల్లల ఆహారము,వారి సం రక్షణ, అయితే,పిల్లలు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు వారి అహారం పొషకపదార్దాలతో సరి సమానంగా ఉండాలి, తక్కువ కాకుండా, అలా అని ఎక్కువ కాకుండా సరిచూసుకోవాలి. సాద్యమైనంత వరకూ తల్లి పాలు తగ్గించి, పొషకపదార్దాలు నిండిన ఆహారం అందించడం ఎంతో అవసరం, అయితే ఇక్కడ సూచించిన నియమాలు మీ పిల్లల ఎదుగుదలకు, అరోగ్య సం రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మొదటి 4 నెలలు,ఆహార నియమాలు:

పుట్టిన వెంటనే మొదటి 3 వారాలు పాలు 1/2 నుంచి 1oz,4 ఒజ్ వరకు ఇవ్వవచ్చు, ఇలా 2-3 గంటలకు ఒకసారి అలా రోజుకి 8 సార్లు ఇవ్వవచ్చు .
మొదటీ 3 వారాల నుంచి 4 నెలలు వరకు:
4-6 oz పాలను ఇవ్వాలి అలా 4 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 6 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో వారి జీర్ణ అవయవాలు ఎదిగే సమ్యయం కాబట్టి,తల్లి పాలు, లేదా పోత పాలు మత్రమే ఇవ్వాలి.

4 నెలలు నుంచి 6 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
5-7oz, పాలను ఇవ్వాలి అలా 5 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 5 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో కొద్ది కొద్దిగా ద్రవం రూపంలో బలాన్ని చేకూర్చే ఆహారం, అంటే మెత్తగా కలిపి, లేదా నీటిలో నానబెట్టి,స్పూనుతో పట్టించాలి,

6 నెలలు నుంచి 9 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
7-8 oz, పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
చిన్నారులు తింటున్నారు కదా అని ఎక్కువశాతం పెట్టకుండా కొంచెం, కొంచెం గా పప్పు,పండ్లు,మెత్తగా ముక్కలు చేసి తినిపించాలి.
ఇలా రోజుకి 2-3 సార్లు,3-9 స్పూన్లు తినిపించవచ్చు.
ముందుగా, మెల్లగా ఒక స్పూన్ పండ్లు, లేదా పండ్ల రసం పట్టించాలి, అలా అలా మెల్లగా1\4 కాప్పు,1\2కప్పు పెంచుతూ రోజుకు 2-3 సార్లు ఇవ్వడం మంచిది.
పండ్లలో అరటి పండు,ఆపిల్,అవకాడో పండు, దానిమ్మ,ఉడికించిన క్యారెట్,ఇలా తినిపించవచ్చు.

9 నెలలు నుంచి 12 నెలల వరకు,ఆహార నియమాలు:

7-8 oz పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో మరికొన్ని పదార్దాలను అలవాటు చేయాలి, అవి ఏమిటంటే,వెన్న,”ప్రొటీన్లు కలిగిన ఆహారం” ,పండ్లు,చిన్న చిన్న కూరగాయలు ,ఇలా తినిపించడం మంచిది.
ఒక కప్పుతో పండ్ల రసములు ఇవ్వడం ఎంతో మంచిది.
Posted on

Banana face packs & masks for all skin tones in Telugu – మీ చర్మ సౌందర్యం కోసం అరటి పండ్లు చెప్పే తీపి కబుర్లు(బనానా ఫేస్ ప్యాక్స్)

ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పండు అంటే ఎంతో మందికి ఇష్టం, అయితే ఇదే అరటి పండు, మీ చర్మ రక్షణలో కూడా ఉపయోగపడుతుంది అంటే నమ్మగలరా, ఇంకెందుకు సందేహం, రండి ఆ ఉపయోగాలు,వాటి ప్రయోగాలు తెలుసుకుందాం:
వివిధ రకముల “బనానా ఫేస్ ప్యాక్స్”:

1.అవకాడో, బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అవెకాడో పండు గుజ్జు , 1 / 2 అరటిగుజ్జు
ఈ మిశ్రమాన్ని కలిపి, ఒక పేస్ట్ లాగా అయిన తరువాత దానిని మీ ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత మీ ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి.

2.బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అరటిగుజ్జు
మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి,తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి.ఎలా చేస్తే మీ ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా
మారుతుంది.

3.బనానా,తేనె ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 టేబుల్ స్పూన్ తేనె
ఈ పై మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి పట్టించి ఒక 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి,తరువాత ఒక మెత్తటి గుడ్డతో మీ ముఖాన్ని తుడుచుకుంటే మంచి కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది.

4.మోటిమలు యొక్క చికిత్సకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1 అరటి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మచ్చ రహితమైన, మొటిమ రహితమైన చర్మం మీ సోంతం అవుతుంది.

5.పొడి చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు,1/2 గిన్నె ఉడికించిన ఓట్మీల్,1 స్పూన్ చక్కెర,1 గుడ్డు(గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

6.జిడ్డుగల చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: గుజ్జు 1/2 అరటి, 1 స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు.
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది

7.ముడతలు పడ్డ మీ చర్మాన్ని రక్షించుకునేందుకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి:1/2 అరటి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి,ఎలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ప్రాభావం చూపిస్తుంది.

8.బనానా,పాలు ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 స్పూన్ తేనె, 1స్పూన్ పాలు:
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది

9.బనానా,ఓట్మీల్ ఫేస్ ప్యాక్:

1\2 గిన్నెలో ఓట్మీల్ , 1 స్పూన్ తేనె, 1/2 అరటి గుజ్జు, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
Posted on

Health benefits of eating apples in Telugu – ఆపిల్ వల్ల కలిగే ఉపయోగాలెన్నో???

అందరికీ సుపరిచితం అయిన ఈ పండు గురించి ఎక్కువగా వర్ణించవలసిన అవసరం లేదు, కాని ఈ ఆపిల్ తీసుకోవడంవల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది,ఇది మీకు మంచి పోషకాలు సమకూర్చి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అయితే శాస్త్రవేత్తలు దీని పై అనేక ప్రయోజనాలపై అద్యయనం చేస్తున్నారు,ఇది రోజు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టార్లు సూచిస్తున్నారు, అయితే మన అరోగ్యానికి ఆపిల్ వేసే మంత్రం ఏమిటో చుసేద్దామ.

1.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆపిల్ ను క్రమంతప్పకుండా తీసుకుంటే, మీ ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాకుండా, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది, ముఖ్యంగా ఈ ఆపిల్ లో ” పెక్టిన్”అనే పదార్దం పుష్కలంగా కలిగి ఉంది, ఇది మన శరీరంలోని కొవ్వు పదార్దాలను నిర్మూలించడంలో
సహయపడడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

2అధిక రక్త పోటును తగ్గిస్తుంది:

మీరు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే గుండె వ్యాధులు మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ, అయితే రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే “మినరల్స్”,”పొటాషియం”,మీ రక్త పోటును తగ్గించుటలో సహాయపడుతుంది.

3.మెదడుకు సంబందించి వ్యాదులను తగ్గిస్తుంది:

ఒక అధ్యయనంలో ఈ ఆపిల్ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల మీ మెదడుకు సంబందించిన వ్యాదులను అరికట్టడమే కాకుండా మీ మెడదును సం రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఈ అధ్యయనంలో దీనిని ఒక “ఎలుక”పై ప్రయోగించారు,రోజూ ఎలుకకి ఆపిల్ జ్యూస్
పట్టించడం ద్వారా సాదరణ ఆహారం కన్నా ఈ ఆపిల్ లో “న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్” అధిక స్థాయిలలో ఉంది అని నిరూపించబడింది.

4.పెద్దప్రేగు కాన్సర్ నివారణలో:

మన కడుపులో ఉండే పేగులు సరిగా లేకపోతే అది మనకు “జీవన్మరణ” సమస్యే అవుతుంది, అయితే ఈ ఆపిల్ ని రోజు తీసుకోవడం ద్వారా, ఈ సమస్యలో మారణాన్ని జయించి జీవాన్ని కొనసాగిస్తారు,ఆపిల్ లోని “ఫైబర్”లక్షణాలు మీ కడుపులో ఉండే క్యాన్సర్ తో పోరాడి మిమ్మల్ని
దాని బారి నుండి రక్షిస్తుంది.

5.మీ గుండెను రక్షిస్తుంది:

సామాన్యంగా మన రక్త కణాలు, రక్త ప్రసరణ సరిగా లేదంటే దానికి సాకులు(కారణాలు) వెతుక్కోనవసరం లేదు, అందుకంటే దానికి కారణం సరియైన, పొషకమైన ఆహారం తీసుకోకపోవడమే. అయితే వీటన్నిటికి ఈ ఆపిల్ తో సమాధానం ఇవ్వండి, రోజు ఆపిల్ తీసుకోండి, మీ గుండె
జబ్బులను నయం చేసుకోండి.

6.ఆస్తమాని తగ్గిస్తుంది:

ఆపిల్లో ఉన్న “ఫైటో కెమికల్స్” పదార్దాలు “ఫ్లవనోయిడ్స్”,”ఫినోలిక్ యాసిడ్” మీ శ్వాస సంబందిత వ్యాదులనుండి రక్షించడంలో ఎంతగానో సహాయ పడుతుంది,అంతే కాకుండా ఈ దీనిని(ఆపిల్) రోజూ తీసుకుంటే “ఆస్తమాని” జయించవచ్చు.

7.ఎముక రక్షణకు సహాయపడుతుంది:

మీ యముకల రక్షణలో కూడ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది,దీనిలో ఉన్న “ఫోలోరిడ్జిన్”మీ ఎముకల సమస్యను తరిమికొడుతుంది,అంతే కాకుండా మీ ఎముకలను గట్టిగా, దృడంగా చేస్తుంది. ఇది పెద్దవారు, చిన్నవారనే కాదు,అందరు తీసుకోవచ్చు.
అందుకే పాతదే అయిన మళ్ళీ చెప్పేది ఒక్కటే “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”
Posted on

Home remedies to control the hair fall, hair loss in Telugu – మీ జుట్టు ఊడిపోతుందా?మీ అందమైన జుట్టు రక్షణకు సహజమైన చిట్కాలు చుద్దామా

అనేక ఏళ్ళుగా ఎందరో, కాదు కాదు దాదాపుగా అందరూ ఎదుర్కునే ఏకైక సమస్య ఈ జుట్టు ఊడిపోవడం, అసలు జుట్టు ఊడిపోవడం అనేది మనం అనుకునే అంత పెద్ద సమస్య కాదు అనుకోవడానికి లేదు, ఇది సాధారణంగా ఒత్తిడి వల్ల,సరియైన ఆహరం తీసుకోకపోవడం వల్ల, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం, వంశపారంపర్య, కాలుష్యం ఎలా అనేక సమస్యల వల్ల ఈ సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. దీనిని అత్యంత పొషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా,సరియైన జుట్టు సంరక్షణ పదార్దాలు అంటే, నూనే లాంటివి వాడడం ద్వారా నిర్మూలించవచ్చు.

 • కొబ్బరి, మీ జుట్టు సం రక్షణలో అన్నిటికంటే, మొదటిగా, మరియు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోబ్బరి గురించే, దీనిలో ఉత్పన్న లక్షణాలు మీ జుట్టుని ఊడిపోకుండా కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి, అయితే కొబ్బరి కాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి రుబ్బితే
  అందులో ఉండే కొబ్బరి పాలు, మీ జుట్టు రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
 • రాత్రి పడుకునే ముందు మీ జుట్టు కు జొజోబా ఆయిల్ పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచి ప్రభావం చూపిస్తుంది.
 • ఒక్కోసారి తగినంత పోషక ప్రోటీన్లు లేకపోవడం కారణంగా మీ జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది,అందుకే ఈ పోషక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం,రోజు వారి ఆహారంలో “హైడ్రోక్లోరిక్ ఆమ్లం టాబ్లెట్(Hydrochloric Acid)” ఒకటి
  తీసుకోవడం మంచిది.
 • ఒక కోడి గుడ్డు తీసుకుని దానిలోని తెల్ల సొనని ఆలీవ్ ఆయిల్ లో కలిపి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించాలి,20నిమిషాల తరువాత చల్లని నీటితో,షాంపూతో తల స్నానం చేస్తే గుడ్డులో అదికంగా ఉండే సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్ మీ జుట్టుకు పట్టి మంచి ప్రబావం
  చూపిస్తాయి.
 • ఉసిరి మీ జుట్టుని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇందులో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్(Anti Oxidents)”,”Vitamin C”మీ జుట్టుకి బలాన్ని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.2 స్పూన్లు ఉసిరి పొడి, 2 స్పూన్లు నిమ్మ రసం కలిపి మీ జుట్టికి పట్టించి
  20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
 • మీ ఇంట్లో దొరికే పదార్దాలలో తేనె,ఆలీవ్ నూనె,దాల్చిన చెక్క కలిపిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
 • ఒక కోడి గుడ్డు తీసుకుని,దానిలోని సోనను,గోరింటాకు పొడిని,కొంచెం పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి కాసేపటి తరువాత వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
 • మీకు తెల్ల జుట్టు పెరగ కుండా ఉండాలన్న,జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, మందార పువ్వులు తీసుకుని పొడిగా చేసి అందులో కొబ్బరి నూనె కలిపి, ఆ పేస్ట్ ని మీ తలకు పట్టించి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఉపసమనం
  కలుగుతుంది.
 • 10-12 గోరింట ఆకులు తీసుకుని, ఆవాల నూనెలో కలిపి, మరగ పెట్టాలి,తరువాత ఈ మిశ్రమంలో ఆకులన్ని తొలగించి, దానిని ఒక సీసాలో ఉంచుకుని రోజూ మీ సాధారణ నూనెలా ఉపయోగించుకుంటే మంచిది.