Posted on

How to make kids sleep properly in Telugu – మీ పిల్లలు సరిగా నిద్ర పోవాలంటే ?

చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని పిల్లల్ని బుజ్జగించేదుకు తల్లిదండ్రులు నానా పాట్లూ పడటం మామూలే. అయితే ఏదో బలమైన కారణాలు ఉన్నప్పుడు నసపెట్టి మారాం చేసే  పిల్లలతో చిక్కు లేదు. కానీ అలవాటుగా నస పెట్టే పిల్లలందరినీ జాగర్తగా గమనిస్తే నస ప్రవర్తనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటి కారణం పెంపకంలో లోపం కాగా రెండవ కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.

తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పిల్లల్ని అతిగా గారాభం చెయ్యటం, మరీ సున్నితంగా పెంచటం వల్ల వారికి మొండితనం అలవాటు అవుతుంది. ఇలా పెరిగే పిల్లలకు పట్టు విడుపులు అలవాటు కావు, కుటుంబం మొత్తానికి తనే కేంద్రం అనే భావన వారిలో నాటుకు పోతుంది. దాంతో తాము ఆడింది ఆటగా పాడింది పాటగా అనుకుంటారు. వారు కోరింది సమకూర్చి పెడితే, లేదా చెప్పినట్టు పెద్ద వారు నడుడుచుకుంటే సరేకానీ లేకుంటే రచ్చకు మల్లుకుంటారు. ఇలా సమకూర్చి పెట్టటం అన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు వీలు పడక పోవచ్చు. అలాంటప్పుడు సాధించుకునే మనస్తత్వం అలవడుతున్న పిల్లలు పేచీకి దిగుతారు. అనుకున్నది సాధించు కోవటానికి తల్లిదండ్రుల మెడలు వంచ టానికి వారికి ఉన్న ఒకే ఒక దారి నస పెట్టడం జరుగుతుంది.

పిల్లల ఎదుగుదలను తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగిన పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కన పడుతుంది. అయితే తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.ఎవరు

 

ఎంతసేపు నిద్ర పోవాలనే దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ, నాలుగేళ్ల నుండి పదేళ్ల మధ్యన ఉంటే పిల్లలకు కావల్సిన సరాసరి నిద్ర పోయే వేళలు ఇలా ఉండాలి.

చిన్న పిల్లలు అంటే 4-5 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటల 30 నిమిషాలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 5-8 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 8-10 ఏళ్ళ వయసు పిల్లలు –  10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.

నిద్ర కొరవడితే పిల్లల మనసు నిలకడగా లేక పోవటం వల్ల ఏ పని మీదా ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్ద వారిలో ఉన్నట్టే మంపుగా ఉంటుంది. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవ్వన్నీ నిద్ర సరిగా లేనందు వల్ల పిల్లలందరిలో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలు అయితే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. చిన్న పిల్లలు అయితే కొంత మంది మందంగా ఉంటారు. చీటికి మాటికి ఏడుస్తూ నస పెడు తుంటారు. కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోంచాల్సింది బిడ్డకు నిద్ర చాల లేదని, ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది.

ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరి లోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలా మంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్ర పోరు. సెలవుల్లో అయితే ఫరవా లేదు. కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే నిద్రలేపి పంపాల్సి వుంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర చాలదు.పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటాన్ని వైద్య పరిభాషలో ‘బెడ్ రొటీన్స్’ అంటారు. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, స్నానం చేయించటం, పడక దుస్తులు తొడగటం లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి.

పడక మీదకు చేరానే బొమ్మల పుస్తకాలు తిరగెయ్యటం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమం మారకుండా ప్రతి రోజూ చేయించాలి. ఈ మొత్తం ప్రహసనం కనీసం అర గంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించటం వల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి వారికి తెలియ కుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయటం వల్ల వారిలో నిద్ర వేళలు గట్టి పడతాయి. కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడ వచ్చు.

1.వయస్సుకు తగ్గట్టు పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి

2.సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి.

3.సెలవుల్లో పిల్లలు నిద్ర వేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవటానికి కనీసం వారం రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.

4. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్ర వేళకు అర గంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయటం నిలిపేయాలి.

5.సాయంత్రాలలో, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగర్తలు పాటించాలి. సాయం కాలం తరువాత చాకోలేట్లు కోలా డ్రింకులు తాగనీయ వద్దు. వీటిలో ఉండే కీఫిన్ రోజువారీ నిద్రను చెడ గొడుతుంది.

6.పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలు నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి

Posted on

Health benefits of tulsi or basil leaves in Telugu – మీ ఆరోగ్యానికి తులసి..

ఒకనాడు తెల్లారితే కౌసల్యా సుప్రజా రామ..అన్న సుప్రభాతంతో పాటు మహిళలు తులసి కోట చుట్టూ తిరగటం మనం చూసే వాళ్ళం. కానీ మారుతున్న జనరేషన్లో దీని ప్రాధాన్యం తెలియకుండా పోయిందంటే అతిశయొక్తి కాదేమో. కాని తులసికి ఉన్న ఔషద గుణాలు దేనికీ ఉండవనే చెప్పవచ్చు. అందుకే మన సంస్కృతిలో ప్రతి ఇంట్లో తులసి కోట ఉండేది. అది ఈ మధ్య కనుమరుగవుతోంది. తులసి మన ఆరోగ్యానికి ఏమి ఇస్తుందో తెలుసుకుందామా..

తులసి ఆకు సర్వరోగ నివారిణి. తులసి ఆకులు రుచికి చేదుగా, వగరుగా ఉన్నప్పటికీ అగ్నిప్రదీపకం. గుండెకు బలాన్నిస్తుంది. అంతేకాదు ఇది చాల సుగంధభరితమైనది. తన చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది.

సూర్యోదయానికి ముందే దీని సేవనం ప్రయోజనకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మన పెద్దలు కుడా చెఫ్తుంటారు. తులసిలో శ్రీతులసి, కృష్ణతులసి అనే రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలోనూ సమానమైన ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులు, వేర్లు, విత్తనాలు అన్నింటిలోనూ ఒక్కో ఔషధ గుణం ఉన్నది. దీని ఆకులలో ఉన్న సుగంధం క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.

తులసీ దళాలను నీటిలో వేస్తే నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు నాశనమవుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు పెద్ద స్పూన్ పరిమాణంలో తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను నమలవచ్చు. ఇంటిచుట్టూ తులసి మొక్కల ఉంటే దోమల బాధ ఉండదు.

1. గొంతునొప్పి, స్వరం సరిగా పలుకని సమయంలో కొంచెం నీళ్లలో తులసి ఆకులను వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిపట్టాలి. నీళ్లు వెచ్చగా ఉన్నప్పుడే చేయాలి.

2. పైత్యం, అలర్జీ లేదా ఏదైనా పురుగు కొరికినప్పుడు తులసి రసాన్ని రాయాలి. రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగించాలి. తులసి ఆకులలో చెమటపట్టించే గుణం ఉంది. అందుకే అన్నిరకాల జ్వరాలలోను తులసి రసాన్ని తేనెతో కలిసి నాలుగు గంటలకు ఒకసారి ఇస్తారు.

3. లివర్ సమస్య ఉన్నటువంటి వారికి తులసి ఆకుల కషాయం చాలా మంచిది

4. మూత్రవిసర్జనలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెరతోపాటు తీసుకోవాలి.

5. తులసి విత్తనాలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టి బాగా పిసికి, వడగట్టి తాగాలి. గజ్జి మొదలైన చర్మవ్యాధులలో దురద ఎక్కువగా ఉంటే తులసి ఆకుల రసాన్ని రాసి తులసి కషాయాన్ని తాగించాలి.

మన ఆరోగ్యానికి ఓ మంచి ఔషధంగా పనిచేసే తులసిని మీ ఇంట్లో ఈ రోజే నాటండి. చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోండి.

Posted on

Telugu tips for cough & cold – జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

వాతావరణం మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పు మొదలై ఎంతో సతమతమయ్యేలా చేస్తాయి. వీటి రాకతో మన శరీరం అంతా కంపించిపోయి అటు మింగలేక బయటకు కక్కలేక అన్న చందంలో పరిస్థితి మారుతుంది. అందుకే వీటిని అంటు వ్యాధులంటారు. వీటి నివారణకు మనం తీసుకునే ఆహారంలో స్వల్పంగా మార్పులు చేసి తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనం పొందవచ్చు.

అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మీరు కాపాడుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక ప్రాథమిక జాగ్రత్త.

1.జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.

2.వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.

3. పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.

4. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.

5. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

6. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.

7. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.

8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి.

9. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి.

10.సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.

11.పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.

12.మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

13.మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను ఆరగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Posted on

Home remedies for the skin problems in winter in Telugu – శీతాకాలంలో చర్మ పరిరక్షణకు గృహ చిట్కాలు..

గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

 

1. పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.
2. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.
3. పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. ఒకవేళ మీరు మాస్క్ వేసుకుంటే పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.
5. అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.
6.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
7.కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
8.కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
Posted on

Telugu tips to get the smooth, soft and beautiful hands – మీ చేతులు మృదువుగా ఉండాలంటే?

ఆడవారి చేతులు ఎంతో నాజూకుగా, మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. అవే చేతులు ఎన్నో పనులను చేస్తాయి. వాటిలో ఇంట్లో చేసే పనులు ప్రధానమైనవి. ఈ పనులలో ముఖ్యంగా బట్టలు ఉతకటం. ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే చేతులు బట్టలు ఉతికేటప్పుడు పాడయ్యే అవకాశముంది. స్త్రీ మణుల చేతి సౌందర్యం కోసం ఈ శీర్షికలో కొన్ని జాగ్రత్తలు మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూసేద్దమా..!
1. బట్టలు ఉతికేటప్పుడు సోప్స్ డిటర్జంట్ ల మూలంగా చేతులకి   హాని కలిగే అవకాశం ఉంది . హాని కలగకుండా ఉండాలంటే చేతులకి రక్షణగా గ్లోవ్స్ వాడుకోవడం మంచిది .
2. బ్యూటి హాండ్స్ గ్లిజరిన్ , ఆలివ్ నూనె లేక నిమ్మరసం కలిపి చేతులకి రాసుకుంటూ  ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి.
3. మోచేతుల వద్ద నలుపుగాని ఉంటే నిమ్మ చెక్క రుద్దిన నలుపు పోతుంది.
4. పాత్రలు తోమే సమయంలో బంగారం ఉంగరం వ్రేలిన ఉంచుకోరాదు . ఉంచిన అది అరుగుతుంది . ముత్యమైనా షేపులే మారగలవు  . బగారపు గాజుల్ని మణికట్టు సమీపంలో గుడ్డ కట్టుకోవడం వలన అరగుదల కాపాడగలం . అంతేకాక మెరుపు ను కాపాడగలిగిన మీ చేతిన అందము పెరగగలదు.
5. ఎక్కువ వేడి గలవి కానీ, అతి శీతల పదార్దములు కానీ చేతులతో తాకటం మంచిది కాదు.
6. రాత్రి పడుకోబోయే ముందు వాజలేరైన్ కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమం చేతులకి మర్దనా చేసిన తెల్లవారేసరికి మీ చేతులు మృదువుగా మల్లెపువులవలె మెత్తగా ఉండగలవు.
7. బట్టలు ఉతకటం పూర్తియ్యాక వెంటనే చేతులకి వెనిగర్ గానీ , నిమ్మరసం గానీ కలిపి నీటితో శుభ్రపరుచుకోవాలి . ఎవైన మరకలు అంటినా పోతాయి.
8. రోమాలు పెరిగే దిశలో కోల్డ్ వాక్స్ రాసి మందపాటి గుడ్డతో రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో గట్టిగా రుద్దిన వెంట్రుకలు ఉడివస్తాయి . తర్వాత కోల్డ్ క్రీం తో మాలిష్ చేసుకోవడం మంచిది.
9.  కొద్దిగా నిమ్మరసం కొంచెం పంచదార కలిపి చేతులకి పట్టించి మర్దనా చేసుకుంటే  చేతులకుండే బిరుసుతనం  పోతుంది.
10. మీ చేతులను 5  నిముషాలు  గోరువెచ్చని నీటిలో ఉంచిన మృదువుగా , నాజూకుగా ఉంటాయి .