Posted on

Best oral care tips in Telugu – ఆరోగ్యమైన దంతాలు కావాలంటే?

ఆకర్షణీయమైన నవ్వుకు మిలమిల మెరిసే పళ్ళు మరింత అందాన్నిస్తాయి. ముఖంలో పళ్ళు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. తళ తళలాడే పళ్ళు కావాలని అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందుకే  ప్రొద్దున్నే పళ్ళను గట్టిగా తోముతుంటారు. పళ్ళని చాలా గట్టిగా తోమడంవల్ల పంటిపై ఉండే ‘ఎనామిల్’ అరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని పళ్ళమీద గట్టిగా బ్రష్ చేయకూడదు కానీ, పళ్ళ మధ్య ఇరుక్కున్న చిన్నిచిన్ని ముక్కలు పోయేలా సున్నితంగా బ్రష్ చేయాలి. ఆరోగ్యవంతమైన దంతాలకోసం కొన్ని జాగ్రత్తలను మీకోసం అందిస్తున్నాం. అవేంతో చూద్దామా?

పళ్ళు తోమే విధానం

బ్రష్‌ని నోట్లో ఒక పక్కగా పోనిచ్చి, పళ్ళపై గుండ్రంగా బ్రష్ చేయాలి. అంటే పై దంతాల్ని చిగుళ్ళపై నించి క్రిందికి కింది దంతాల్ని చిగుళ్ల కింద నించి పైకి బ్రష్ చేసుకోవాలి. పళ్ళ బయట శుభ్రం చేసినట్లే పళ్ళ వెనుక భాగం, నమిలే భాగం కూడా బ్రష్‌తో శుభ్రం చేయాలి.

పళ్ళ కోసం చెయ్యాల్సినవి

1. గరుకు బ్రష్‌లతో పళ్ళను తోమడం వల్ల చిగుళ్ళు అరిగిపోయే ప్రమాదముంది. మెత్తటి కుచ్చులున్న బ్రష్‌లనే వాడాలి.

2. రకరకాల టూత్ పేస్టులని వాడడం మంచిది కాదు.టూత్‌పేష్ట్‌ని బ్రష్ కుచ్చుల్లోకి చొచ్చుకు పోయేలా వేసుకోవాలి. గరుకుగా ఉండే పొడులతో కూడా పళ్ళను తోమడం మంచిది కాదు.

3. పళ్ళ పొడితో తోముకోదలిస్తే పొడుం మెత్తగా వుండేట్లు చూసుకోవాలి. గరుకుపొడితో తోమితే పళ్ళ ఎనామిల్ దెబ్బతినవచ్చు. పళ్ళతో పాటు, చిగుళ్ళను కూడా మర్దన చేస్తూ తోమాలి.

4. కొందరు బ్రష్‌లని ఆరు నెలలకి పైగా కూడా వాడుతుంటారు. అంతకాలం బ్రష్ పాడవకుండా ఉన్నదీ అంటే వాళ్ళు బ్రష్‌ని సరిగ్గా వాడనట్టని అర్థం. కుచ్చులు నలిగిపోయిన బ్రష్‌తో పళ్ళని తోముకోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు బ్రష్లను మార్చాలి. ఎదైన తిన్నప్పుడు నోటిని పుక్కిలించుకోవాలి.

5. ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి పడుకొనబొయె ముందు రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చెయాలి. ఊదయం అందం కొసం, రాత్రి ఆరొగ్యం కొసం

ప్లాసింగ్ పధ్ధతి

పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తొలగించడానికి ‘ప్లాసింగ్’ అనే పద్ధతి ఎంతగానో తోడ్పడుతుంది. ‘డెంటల్ ప్లాస్’ (నైలాన్ దారం)ని పళ్ళ మధ్యకి పోనిచ్చి రెండు ప్రక్కలా దారాన్ని పట్టుకొని అటూ, ఇటూ కదిలిస్తే పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలు బయటికి వచ్చేస్తాయి. ఇలా ప్లాసింగ్ చేసేటప్పుడు చిగుళ్ళు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం.

చేయకూడనివి

పిన్నులు, సూదులు, అగ్గిపుల్లలు లాంటి వాటితో పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తీయడం మంచిది కాదు. ఇలా చేయడంవల్ల పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి. ఏర్పడిన సందుల్లో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కుని దంత వ్యాధులు వచ్చే అవకాశముంది.

Posted on

Abortion causes and treatment tips in Telugu – గర్భస్రావం నుండీ బయటపడాలంటే?

మాతృత్వం స్త్రీకి ఓ అమ్ముల్యమైన వరం. తల్లి అయిన దగ్గర నుందీ ఆ బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ ప్రసవ వేదనకు సైతం సంసిధ్ధమవుతుందా స్త్రీ. కాని బిడ్డ గురించి ఎన్నో కలలు కన్న స్త్రీకి అవే కల్లలవుతాయని తెలిసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. మళ్ళి తను మాములు మనిషవ్వటానికి బహుశా చాలా ఏళ్ళు పట్టవచ్చు. స్త్రీకి గర్భ ధారణ ఎంత సహజంగా జరుగుతుందో అంతే సహజంగా కొన్ని కారణాల వల్ల గర్భ స్రావం జరిగే అవకాశాలున్నాయి. వాటి గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదని చెప్పవచ్చు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణాలున్నాయి.

పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు పరిశీలించాలి.

గర్భ స్రావానికి కారణాలు

1. 19 నుంచి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.

2. కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్‌.

3. పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.

4. ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.

5. అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోం, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు.

రక్తం గడ్డకట్టడంలో లేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

ఈ సమస్యకు పరిష్కారం

1. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్‌ చేయొచ్చు. 2. అబార్షన్‌ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

3. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

4. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.

5. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి.

Posted on

Telugu remedies for the skin and face care – మీ సౌందర్యానికి..

ఆడవారికి అందం అన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. అదీ నేటి కాలం స్త్రీలకు సౌందర్యోపాసన ఎక్కువే. అందుకే ఒకనాడులేని బ్యూటీపార్లర్లు ఈనాడు ఎక్కువైనాయి. ఎన్ని వచ్చినా అవి కూడా మొదట మనం పరిరక్షించుకునే దాన్ని బట్టి అందం నిలుస్తుందని చెబుతాయి.

కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి అంగసౌష్టవం ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది సహజసిధ్ధమైన సౌందర్యం. సహజసిధ్ధమైన అందాన్ని పెంచుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.అవెంటో ఇప్పుడు చూద్దామా..!

1. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.

2. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

4. బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

6. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.

7. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.

8. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

9. బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.

10. బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.

11. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

12. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.