Posted on

Homemade packs and masks for foot care in Telugu – ‘క్యా’రెట్ ప్యాక్

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 . క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.

4 . కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

6 . టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

Posted on

Beauty benefits of eating curry leaves in Telugu – కరివేపాకుతో అందం..!

చారులో కరివేపాకులా తీసేశారు అన్న సామెత వినే ఉంటారు. ఈ సామెతకు ఓ అర్ధం ఉంది. ఎవరైనా మన పట్ల నిర్లక్షంగా ప్రవర్తిస్తే వెంటనే చారులో కరివేపాకులా తీసేస్తున్నారని బాధపడతాం. ఈ పోలిక కు కారణం కరివేపాకును ఎంత శ్రధ్ధగా కూరల్లో, చారుల్లో వేస్తామో అంతే నిర్లక్షంగా తినేటప్పుడు దాన్ని తీసి పక్కనపెడతాం. కానీ కరివేపాకు చేసే మేళ్ళు ఏమిటో చాలా మందికి తెలియవు. అందానికి ఆరోగ్యానికీ కరివేపాకు మేలంటే అతిశయోక్తి కాదేమో. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

 కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది. తరచూ కరివేపాకు తింటే కళ్ళ ఆరోగ్యం ఇనుమడిస్తోంది.
1.ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు.

2.అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్‌ పెట్టవచ్చును.

3.అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది.

4.చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.

5.ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా తయారవుతుంది.

6.కరివేపాకుతో పేస్టు,మెహందీ – అర కప్పు , కరివేపాకు – అరకప్పు, మందారం ఆకులు – అర కప్పు, కుంకుడు కాయలు – అర కప్పు

పైన చెప్పిన వస్తువుల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిస్తుంది.