Posted on

Telugu wedding saree designs- అద్భుతమైన పెళ్లి చీరల డిజైన్స్

భారతదేశంలో వేలాదిమంది మహిళలలో, సారి సాంప్రదాయ రూపంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. అంతేగాక భారతదేశంలో కూడా విదేశీయులు భారత మార్కెట్ నుండి చీరలను కొనుగోలు చేయాలనే కోరిక కలిగి ఉన్నారు. ప్రతి స్త్రీ చీర ధరించిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. ఏ మతం మరియు రంగు ఉన్నప్పటికీ, ప్రతి మహిళ యొక్క శరీరం రూపొందించడంలో చీరలు మద్దతు ఇస్తాయి.

అద్భుతమైన పెళ్లి చీరల డిజైన్ కలెక్షన్లు

వివాహ చీరలు / చీరలు రకాలు

Types of wedding saris

Designer Lehenga Style Sareeసాంప్రదాయ క్రిమ్సన్ భారీ పెళ్లి చీరలు

Traditional crimson heavy bridal sarisదక్షిణ భారతీయ వివాహ చీరలు

Beauty of blushing Indian bride

 

Beauty of blushing Indian bride

Beauty of blushing Indian bride

పెళ్లి సారిలతో ఫోటోజెనిక్ లుక్

Photogenic look with wedding sarees

ఆధునాతన డిజైనర్ చీరలు

Trendy designer sareesలెహెంగా శైలి వివాహ చీరలు

 

Lehenga style wedding sareesబెంగాలీ వివాహ బెనారసి చీరలు/వివాహ చీరలు

Bengali wedding benarasi sarees

 

Bengali wedding benarasi sarees1

పైన చూపించిన చూడముచ్చటైన వివిధ చీరలు సమాజంలోని వివిధ సాంప్రదాయ వర్గాలు మరియు వారి ప్రాధాన్యతల చేత అనుసరించబడ్డాయి. మీరు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతున్నట్లయితే ప్రపంచం నలుమూలలా వందలాది ప్రజలు చేత అనుసరించబడుతున్న చీరలు, మార్కెట్లో లభ్యమయ్యే పెళ్లి చీరలమీద వివిధ రకాల ఐడియాలను అవి మీకు అందించగలవు. మీరు మీ వివాహసమయంలో ఈ చీరలలో ఎదో ఒకటి ధరించిన తరువాత మీరు ఒక మహా రాణిలా వెలిగిపోతారు. పవిత్రమైన ఈ వేడుకలో మీ బ్యూటీషియన్ ని అధికమైన సౌందర్య లేపనాలు అద్దడం లేదా ఐ షాడో తో అదనపు మేకప్ చేయవద్దని అడగండి. ఇలా చేయడం వలన మీ చీర యొక్క అందం లేదా మీ ఆభరణ సోయగాల సహజ అందం బయటకు తీసుకుని రాలేకపోవచ్చు.

భారతీయ వధువు అందమైన అలంకారం

భారతీయ వధువుని దివి నుండి దిగి వచ్చిన దేవకన్యగా అనునయిస్తారు. కాబట్టి మీరు ప్రాధాన్యతను అనుసరించి ఎంబ్రాయిడరీ గానీ జరీ గానీ ఎంచుకోవచ్చు. అంతేకాకుండా మీరు జరీ దారపు పనితనంతో ప్రత్యేక నాణ్యత కలిగిన బనారస్ చీరలను కూడా ఎంచుకోవచ్చు. కొంతమంది చాల స్వల్పముగా జరీ వర్కును కోరుకుంటే మరికొందరు పూర్తి చీర మొత్తం జరీ థ్రెడ్ వర్కును కోరుకుంటారు. మీరు ఎలా కోరుకున్నప్పటికీ తయారీ దారులు మరియు డిజైనర్లు ఎల్లప్పుడూ మీకు మరింత ఉన్నతంగా ఇవ్వడానికి సిద్దంగా ఉంటారు.

సిల్కు చీరలు కూడా మార్కెట్టులో గొప్ప డిమాండును కలిగి ఉన్నాయి. ఈ భారీ వర్కుతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఉంటాయి. మీరు బంగార వర్ణపు దారాలతో దాని మీదగా జరీ డిజైన్లను కలిగిన సిల్క్ శారీలను కూడా ఆర్డరు చేయవచ్చు. మీ అద్భుతమైన వివాహ వస్త్రములు మీ పెళ్లి క్షణాలను మరింత సోయగాలతో అలరాడిస్తాయి.

పెళ్లి చీరలతో ఫోటో జెనిక్ ఆకర్షణ

మీరు పెళ్లి చీరలను ఎంచుకునే సమయంలో కొన్ని నిర్దిష్ట అంశాలని పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది మీ జీవతంలో సంభవించే ఒకే ఒక మధురమైన క్షణం. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోయే క్షణాలు.అటువంటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే అంశాలలో ఫోటోలు ఒకటి. కాబట్టి ఫోటోలను కూడా ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని శారీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.మీ వివాహం జరిగిన పది సంవత్సరాల తరువాత ఒకసారి మీ పెళ్లి నాటి ఫోటో ఆల్బమ్ వైపు ఒక లుక్కేయండి. మీ పెళ్లి నాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకోవడానికి అది ఎంతో బాగుంటుంది. అందువలన మంచి ఫోటోలకోసం ముందుగానే జాగ్రత్త పడటం చాల ముఖ్యమైనది. మీ పెళ్ళి వేడుకలో ప్రతీ సందర్బం ఫ్రేములో తప్పనిసరిగా చూసేందుకు చక్కగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో మీ చర్మపు రంగుని అనుసరిస్తూ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు తెల్లని ఛాయను కలిగిన వారు అయితే లైట్ లేదా బ్రైట్ గా లేదా డార్క్ గా ఉండే శారీలను ఎంచుకోవచ్చు. మీరు చామన ఛాయా లేదా నల్లగా ఉంటే నీలం, గోధుమ రంగు, ముదురు ఎరుపు మొదలైన రంగులని ఎంచుకోవచ్చు.

ఆధునాత డిజైన్ల శారీలు

మీ పెళ్లి వేడుకకు గాను అధునాతనమైన డిజైన్ల కలిగిన మోడళ్ళ మీద కూడా ఒక లుక్కేయొచ్చు. అలాంటి సందర్భంలో అధునాతన పెళ్లి చీరలు కూడా మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఆ రోజు మీ జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోవాలంటే మీరు వీటిలో ఒక మంచి దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ పెళ్లి వేడుకలో వరుడు సరికొత్త లుక్ లో మిమ్మల్ని చూసాక మీ నుండి చూపుని మరల్చలేరు.

శారీ ధరించడంలో సౌలభ్యం కొరకు

మీరు అధునాతన సాంప్రదాయ రూపాన్ని పొందడానికి మార్కెట్టులో లభ్యమయ్యే లహెంగా శారీ లను కూడా ఎంచుకోవచ్చు. భారతీయ చీరలను కట్టుకోవాలని కొందరు ఆధునిక మహిళలకు కోరిక ఉన్నప్పటికీ వారు సరిగా కట్టుకోలేరు. అందువలన తయారీ దారులు ఈ సందర్బాన్ని అర్ధం చేసుకుని ఇది వరకే మడతలు మరియు కుట్లు వేయబడినట్లుగా ఒక నిర్దిష్ట పద్దతిలో శారీలను తయారు చేస్తున్నారు. మీరు దీనిని సులభంగా మీ శరీరానికి చుట్టుకుని వివాహ వేడుకలో అదిరిపోయే లుక్ తో ఆకర్షించవచ్చు. అంతే కాకుండా మీ పెళ్లి వేడుకకు ముస్తాబుల సమయంలో చీరకట్టుకోవడానికి అయ్యే సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది మరియు మీరు దీనిని ఇతరుల సహాయం లేకపోయినా కూడా ధరించగలుగుతారు. చాలా సందర్బాలలో వరుడు, వధువు చీర ధరించి సిద్దమయ్యి వచ్చేవరకు చాలా సేపు పెళ్లి పందిటిలో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇది సాధారణంగా వధువు చాలా సార్లు చీరను సరిగా కట్టుకోలేకపోవడం మళ్ళీ తిరిగి కట్టడం వలన సంభవిస్తూ ఉంటుంది. కానీ ఈ ట్రెండీ శారీలతో వరుడు అంతసేపు వేచి ఉండాల్సిన అవసరం రాదు.కాబట్టి అతను త్వరగా ఆమెని వివాహం చేసుకుని మరింత త్వరగా ఆమెను అంతులేని మధుర జీవిత విహారానికి తీసుకెళతాడు.

పెళ్లి చీరలతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి

చీరలు భారతీయ పురాతన వైదిక సంప్రదాయాల స్పూర్తితో ప్రారంభమయ్యి అవి స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తూ అందంగా మరియు నిండుగా భారతీయ స్త్రీలను నిలుపుతున్నాయి. వేద కాలంలోని స్త్రీలు స్వల్ప డిజైన్లతో చీరలను ధరించేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. ప్రజలు భారీ వర్కు కలిగిన శారీలకు అధికంగా మొగ్గు చూపిస్తున్నారు.

నేడు సమకాలీన వివిధ వెరైటీల చీరలు కుందనలు మరియు మీనాకారి పనితనంతో ఎంతో అందంగా ఉంటున్నాయి.అంతే కాకుండా మీరు జర్దోసి, మరియు మిర్రర్ పనితనాన్ని కూడా ఈ చీరలలో పొంద గలరు. సరిపడే శారీని ఎంచుకోవడం పూర్తిగా మీ కోరిక మేరకే వదిలేస్తున్నాం. మీరు ఆన్లైన్ లో లభించే వివిధ వెరైటీ శారీల మీద కూడా ఒక లుక్కేయొచ్చు. అలాగే నేరుగా మార్కెట్టు లో లభించే డిజైనర్ పెళ్లి చీరలను వ్యక్తిగత డిమాండుల మీద తీసుకోవడం మరింత మంచిది.

కొందరు సాంప్రదాయ సిల్కు శారీలను వివాహ వేడుకకు ఇష్టపడతారు. మీరు మీ కొత్త జీవిత భాగస్వామితో సుధీర్ఘ ప్రయాణం కొనసాగించాబోతున్నారు.కాబట్టి మీరు ఎంచుకునే శారీ మీ కొత్త జీవిత ప్రారంభానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ విషయంలో మీకు అంత అవగాహనా లేనట్లయితే ఒక అనుభవస్తులైన డిజైనర్ సలహాలను తీసుకోండి. మీకు సరిపడే మంచి డిజైనర్ పెళ్లి చీరను ఎంచుకోవడానికి సలహాలను ఆన్లైన్ గార్మెంట్స్ స్టోర్ ఏజెంట్లను అడగవచ్చు. డిజైనర్ పెళ్లి చీరలు వివిధ శరీర ఆకృతులు మరియు ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఎంతో ఆకర్షనీయంగా ఉంటాయి.

Posted on

Telugu tips for long hair – జుట్టు పెరగడానికి చిట్కాలు

ప్రతీ మహిళ పొడవాటి, అందమైన కురులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో కొన్ని రకాల జుట్టు సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది, అలాగే జుట్టు పూర్తిగా పెరగకుండా ఆగిపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా మంది మార్కెట్లలో దొరికే రసాయనాలు మరియు కాస్మెటిక్స్ వంటివి వాడి మరింత బాధకు గురవుతున్నారు. కానీ సహజ సిద్ధమైన చిట్కాలతో ఇంట్లోనే మనము ఈ జుట్టు రాలే సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

పొడవాటి, జారువాలే జుట్టు కావాలనే కోరిక మీలో ఉంటే, అప్పుడు మీరు చేయవలసినదల్లా జుట్టుకి మంచి పోషణ కలిపించడమే. అందమైన కురుల కోసం ఆహార అలవాట్లను మార్చుకోవడమే కాకుండా బాహ్యంగా కూడా కొంత రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొడవాటి, ధృడమైన కురులను పొందడానికి కొన్ని గృహ చిట్కాలు ఇలా ఉన్నాయి.

జుట్టు పొడవుగా పెరుగుటకు సహజ గృహ చిట్కాలు

త్వరిత జుట్టు పెరుగుదలకు ఆవాల పొడితో హెయిర్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, ఒక గుడ్డు, కొన్ని చుక్కల నీటిని జోడించి బాగా కలపండి. ఆ పేస్టుని ముఖ్యంగా మీ తల పై భాగ చర్మానికి అలాగే మీ జుట్టు మొత్తానికి పట్టించండి. ఒక షవర్ కేప్ పెట్టుకుని 20 నుండి 30 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రపరుచుకోండి. ఆవాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది కనుక ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారించుటకు ఆముదము

జుట్టు పెరుగుదలకు ఆముదము ఒక మంచి ఎంపిక. ఆముదం నూనెని జుట్టుకి బాగా పట్టించి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యని ఆపవచ్చు. ఆముదం నూనెని మరొక పద్ధతిలో కూడా వాడవచ్చు. బాదం నూనెలో ఆముదం నూనెని కలిపి మాడుకి బాగా మసాజ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యే కాకుండా పల్చని జుట్టు, బట్ట తల వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.

మృదువైన కురులకి మెంతులు

మెంతులని ఉపయోగించి మీ జుట్టు పరిమానముని పెంచుకోండి. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోండి. మీ మాడుకి మరియు జుట్టుకి ఈ పేస్టుని పట్టించి 30 నుండి 40 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రం చేసుకోండి. ఇదే పద్ధతిని నెలల వారీగా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. ఇలా చేయడం వలన కురులు మెరుస్తూ మృదువుగా మారుతాయి.

విటమిన్లతో జుట్టు పరిమాణము పెంచడం ఎలా?

జుట్టుకి బాహ్యంగా హెయిర్ ప్యాక్ లు, మసాజ్ లు వంటివి చేయడంతో పాటుగా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, కేరెట్లు మరియు పెరుగు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎక్కువగా నూనె పదార్ధాలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. ఆహారపు నిర్వహణ చూడటానికి సులువుగా ఉంటుంది. కానీ దానిని పధ్ధతి ప్రకారం పాటించి ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలను ఇస్తుంది.

A, C మరియు E విటమిన్లు ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే కురులు మృదువుగా, జారువాలేలా పెరుగుతాయి. ఫోలిక్ ఆసిడ్ మరియు బయోటిన్ మాత్రలను తీసుకుంటే జుట్టు స్ట్రెయిట్ గా ఉంటుంది. కానీ మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మరియు మీ జుట్టుకు వాడే మందులను గురుంచి ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకోండి.

జుట్టు పెరుగుదలకు లోతైన కండీషనింగ్

జుట్టుకి మంచి పోషణ కలిపించడానికి బోల్డన్ని చిట్కాలు ఉన్నాయి. మీ జుట్టుకి పోషణ అందించడానికి ఆలివ్ నూనె, గుడ్డు, తేనె వంటివి వాడి చూడండి. జుట్టుకి కండీషనింగ్ చేయడం వలన మీరు ఆరోగ్యవంతమైన, పొడవాటి, మెరిసే జుట్టుని పొందుతారు.

జుట్టు రాలే సమస్యకు కొబ్బరి నూనె చికిత్స

పలు రకాల జుట్టు సమస్యలకు కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ గృహ చికిత్సగా ఎప్పటి నుండో పేరుగాంచింది. మీ జుట్టు పెరుగుదల చాలా తక్కువగా ఉంటే, సహజంగా పొందిన కొబ్బరి నూనెతో మాడుకి మరియు మొత్తం కురులకి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునే ముందు కొబ్బరి నూనెని కాసేపు వేడి చేసి రాసుకుంటే మరింత అద్భుతంగా పనిచేస్తుంది. మీ చేతి వ్రేళ్ళను ఉపయోగించి మీ జుట్టు పై భాగానికి కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేసుకోండి.

జుట్టు పెరుగుదలకు కురులను ముందుకు వాల్చటం

కొన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వాటిలో ఒక పధ్ధతి కురులను ముందుకు వాల్చడం. ఇలా చేయడం వలన తల పై భాగ చర్మం మీద రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కనుక రోజులో 2 నుండి 3 సార్లు ఇలా జుట్టుని ముందుకి వాల్చి కనీసం 30 సెకనులు అలా ఉంచి తిరిగి జుట్టుని వెనక్కి వేయండి.

జుట్టు పరిమాణము పెంచడానికి గుడ్డు

గుడ్డు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. అది మీ జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ముఖంగా గుడ్డులోని పచ్చ సొన జుట్టు పెరుగుదలకు మరియు దాని పోషకానికి చాలా అవసరం. ఇందుకోసం ఒక గుడ్డుని తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకోండి.  దానికి ఒక చెంచా ఆలివ్ నూనె మరియు సగం చెక్క నిమ్మరసాన్ని జోడించండి. ఇప్పుడు వాటిని బాగా కలిపి మీ జుట్టుకి, మాడుకి పట్టించండి. జుట్టు ఆరెంతవరకూ కాసేపు ఉంచి అప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పచ్చి గుడ్డు వాడటం వలన కాస్త వాసన రావొచ్చు అందుకని తేలికపాటి షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోండి.

Posted on

Telugu health tips for acidity – అసిడిటీని తగ్గించడానికి గృహ చిట్కాలు?

అసిడిటీ అంటే పొట్ట యొక్క ఎగువ భాగంలో అసౌకర్యం లేదా నొప్పి కలగడం. ఇది సాధారణంగా భోజనం తీసుకున్న వెంటనే సంభవిస్తుంది. దీనివలన ఆకలిని కోల్పోవడం జరిగుతుంది. దానితో పాటుగా త్రేనుపులు రావడం మరియు అపానవాయువులు వంటివి ఏర్పడతాయి. మలబద్ధకం లేదా అతిసారం లక్షణాల చేత నోటిలో ఆమ్ల రుచితో కడుపు గడబిడగా ఉంటుంది.

అసిడిటీ అనేది నేడు ఎంతో మందికి సర్వ సాధారణ సమస్యగా ఉంది. ప్రస్తుతం కడుపులో ఉన్న ఆమ్లాలు పైకి ఎగబ్రాకి ఆహార వాహికకు చేరి తిరిగి వెనక్కి గుంజుకొనునట్టి స్థితిగా ఎంతో మంది ఈ సమస్యను కలిగి ఉన్నారు. ఇది ఛాతి స్థానంలో మంటతో కూడిన బాధకు కారణమవుతుంది. ఇవి అసిడిటీని గుర్తించడానికి ముఖ్యమైన సూచికలుగా చెప్పవచ్చు. ఆహార మార్గంలో పుల్లటి భావన కలగుతూ ఉంటుంది. అసిడిటీ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఇది ఎన్నో ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. నిర్లక్ష్యం చేయడం వలన ఆహార వాహిక యొక్క ముఖద్వారాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.

అసిడిటీకి కారణాలు

కడుపు యొక్క కవాటము సరిగా పనిచేయకపోతే ఆమ్లాలు కడుపు నుండి తిరిగి వెనక్కి నోటి వరకు చేరుకొని అసిడిటీ చోటు చేసుకుంటుంది. అధిక బరువు, భోజనం తర్వాత వెంటనే నిద్రపోవడం, ఎక్కువగా తినడం, వేయించిన ఆహారాలు తినడం, ఎక్కువగా మద్యం సేవించడం, ఒత్తిడి మరియు గర్భం వంటివి ఈ సమస్యకు దారితీసే ప్రధాన కారణాలు.

అసిడిటీ నుండి తక్షణ ఉపశమనం

అసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇంటిలో పెద్దలచే అందించబడిన అనేక చిట్కాలు ఉన్నాయి. అందులో కొన్ని చిట్కాలు:

  • ఒక అర గ్లాసు కలబంద రసాన్ని తాగడం.
  • ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సెడార్ ను నీటితో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం అందిస్తుంది.
  • ఒక అర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవడం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

అసిడిటీ చికిత్సకు గృహ నివారణలు

సోంపు

అసిడిటీ వలన ఛాతిలో సంభవించే మంటని తగ్గించడానికి సోంపు ఎంతో ఉపయోగకారిగా పని చేస్తుంది. అజీర్తి మరియు బాధని నివారించడానికి సోంపు మరింత పటిష్టంగా పోరాడుతుంది. సోంపు టీ గా చేసుకుని సేవించడం వలన హృదయ ప్రాంతంలో మంటని నివారించడంతో పాటుగా అజీర్తి మరియు కడుపు ఉబ్బరాన్ని క్రమంగా అదుపు చేస్తుంది. మీరు అజీర్ణం మరియు సంబంధిత సమస్యలను నివారించడానికి భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపు నమలడం ద్వారా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు.

దాల్చిన చెక్క

మనం సాధారణంగా ఉపయోగించే సుగంధాల్లో దాల్చిన చెక్క ఒకటి. దీనిని ఆమ్ల వ్యతిరేక లక్షణాలు గల సహజ వనరుగా పేర్కొనవచ్చు. శరీరంలో శోషణ స్థాయిలు మరియు జీర్ణక్రియ రేటును మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ఒక ఇంచు పరిమాణ దాల్చిన చెక్కని కొంత నీటిలో పది నిముషాల పాటూ మరిగించి ఆ నీటిని రోజు వారీగా సేవించడం వలన ప్రేగులలో ఉండే ఇన్ఫెక్షనన్లు నివారించబడి జీర్ణ వ్యవస్థ మెరుగు పరచబడుతుంది.

ఉల్లి రసం

ఈ నివారణా మార్గం నిజంగా అద్భుతమైనది. ఉల్లి రసం యాసిడ్ లతో పోరాడి నివారించే గృహ చిట్కాలలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఉల్లిపాయలు ఇన్సులిన్ ను కలిగి ఉండటంలో పేరుగాంచాయి. ఈ జీర్ణ సంబంధ పీచు పదార్ధాలు మానవ ప్రేగులలోని ఆరోగ్యకరమైన బాక్టీరియా మంచి ఆహార పంపిణీ దారులుగా పెర్కొనబడతాయి. తద్వారా ఈ ఆరోగ్యకరమైన బాక్టీరియా అభివృద్ధి జీర్ణ వ్యవస్థని మెరుగు పరిచి అసిడిటీ నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కలబంద రసం

అలోవేరా అసిడిటీ సంబంధిత సమస్యల నివారణలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు మీ అసిడిటీ సమస్యని శాశ్వతంగా నివారించుకోవాలని భావిస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా ప్రతీ రోజు మీ భోజననానికి ముందు కలబంద రసాన్ని సేవించాలి.

క్యాబేజీ రసం

అసిడిటీ నివారణలో ఉపయోగపడే సహజ ఉపకరనముగా నేడు మార్కెట్లో క్యాబేజీ ఎంతో విరివిగా లభించే అత్యంత ముఖ్యమైన కూరగాయ. మీరు క్యాబేజీని ముక్కలుగా తరిగి మిక్సర్ లో వేసి రసం తీసి ప్రతీరోజు సేవించడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.

లంకణం

కొన్ని సందర్బాలలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక నిర్ధిష్ట సమయం లంకణం కొనసాగించడం వలన అసిడిటీ సమస్య నుండి మంచి ఫలితాలను పొందడం గమనించడం జరుగుతోంది. మరొక మార్గం పూర్తి రోజులో కేవలం పరిమిత ఆహారాన్ని తీసుకోవడం. ఘన పదార్ధాలను దూరంగా పెట్టడం అసిడిటీ సమస్యను నివారించడంలో ఉపయోగకరినిగా ఉంటుంది. ఒక వేల మీరు మరింత ఆకలితో ఉన్నట్లయిట్టే పండ్ల రసం లేదా పండ్లను తీసుకోవడం మంచిది.

తేనె

తేనె ప్రతి ఇంటిలో తప్పని సరిగా ఉండాల్సిన ఒక సహజ ఔషదమనే చెప్పాలి. తేనె కొన్ని విలువైన ఔషద లక్షణాలను కలిగి ఉన్నది. ఇది ఆహారకోశం యొక్క గోడల లైనింగ్ ను ధృడ పరుస్తుంది. ఇందుకోసం మీరు ప్రతీ రోజు నిద్రపోవడానికి ముందు రెండు టీ స్పూన్ల తేనె తీసుకోవాలి.

అల్లం

కొంచెం అల్లం తీసుకుని దాని నుండి రసాన్ని సేకరించి దానిలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలిపి సేవించడం ఎంతో ఉపకారినిగా ఉంటుంది.

బొప్పాయి

బొప్పాయిని భోజనం తర్వాత తీసుకోవడం జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ పాపెయిన్ ప్రోటీన్లను కరిగించడంలో సహాయపడుతుంది.

అసిడిటీ నివారణలో ఆయుర్వేద గృహ మార్గాలు

అరటి పండ్లు

అరటి పండ్లలో ఉండే పొటాషియం యాసిడ్ ఉత్పత్తిని పరిమితి చేస్తుంది మరియు అధిక శ్లేష్మమును క్రమబద్దీకరించి హానికరమైన ప్రభావాల నుండి రక్షణ కల్పిసుంది. అరటి పండులోని పీచుపదార్ధాలు మలబద్ధకాన్ని నివారించడంలోను మరియు అసిడిటీని నివారించడంలో మంచి ఉపకారిగా ఉంటుంది.

తులసి

తులసి ఆకులు పొట్టలోని శేష్మ ఉత్పత్తిలో సహాయపడతాయి. ఇవి పొట్టలో ఏర్పడే హానికర రసాయనాల నుండి రక్షణ కల్పించే వాటిగా పెర్కొనబడతాయి. కొన్ని తులసి ఆకులు ప్రతిరోజూ క్రమంగా తీసుకోవడం వలన ఎగువ ఉదరంలో మంటని మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలను పొందుతారు.

ఉసిరి

ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఉసిరి కఫము మరియు పిత్త దోషాలను శాంతపరుచుటలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఉసిరి కాల్షియమ్ వనరులను పుష్కలంగా కలిగి ఉంది. ఇది ఆహార వాహిక గోడల యొక్క పాడయిన లైనింగును బాగుచేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఉసిరి పౌడర్ ని రోజుకి రెండు సార్లు తీసుకోండి.

బెల్లం

అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి భోజనం తరువాత ఒక చిన్న బెల్లం ముక్కని సేవించండి.

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వలన తక్షణమే శరీర వ్యవస్థ చల్లర్చబడి ఛాతిలో మంటని మరియు అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

దానిమ్మ

దానిమ్మ పండ్ల రసము కూడా ఛాతిలో మంట మరియు అసిడిటీ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది.

అలాగే గుమ్మడికాయ, వెల్లుల్లి, పసుపు, పుచ్చకాయ, దోసకాయ, మజ్జిగా వంటివి అసిడిటీని నివారించడంలో మంచి సహాయకారులుగా ఉండటంతో పాటూ అజీర్తి, ఛాతిలో మంట మరియు ఇతర ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడానికి జీర్ణ వ్యవస్థ అభివృద్ధికి అద్భుతంగా పనిచేస్తాయి.