Posted on

Fairness tips in Telugu – అందమైన చర్మాన్ని పొందడం ఎలా?

తెల్లని మేనిఛాయ పొందడం ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోరిక. కానీ, దురదృష్టవశాత్తు కొందరు ప్రజలు పుట్టుక తోనే నల్లని వర్ణాన్ని కలిగి ఉంటారు. మరి కొందరు అధికమైన సూర్య కాంతి ప్రభావం చేత వారి చర్మం నల్లబడి, ఉన్న ఛాయను కూడా కోల్పోతుంటారు. ప్రజల జీవన విధానం కూడా వారి మేని ఛాయ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజలు ఎండలోకి ఎక్కువగా వెళ్తూ ఉండటం వలన సూర్య కిరణాల ఒత్తిడికి చర్మం నల్లగా మారిపోతుంది.

మీ చర్మాన్ని కాంతివంతం చేసి అందంగా మార్చే ఎన్నో క్రీములు మీకు అందుబాటులో ఉండవచ్చు. కానీ అన్ని ఫెయిర్‌నెస్ క్రీములు మీ చర్మానికి మంచి చేయ లేకపోవచ్చు. మరి కొన్ని మీ చర్మాన్ని హానికరమైన నష్టాలకు గురిచేయవచ్చు కూడా. అయితే కొన్ని చిట్కాలతో వాటిలో మీ చర్మానికి స్నేహపూర్వక మైన వాటిని సులభంగా గుర్తించవచ్చు.

నల్లని మేని ఛాయతో ఎంతో మంది టీనేజర్లు ముఖ్యంగా అమ్మాయిలు తెల్లని చర్మాన్ని పొందడానికి తీవ్రమైన కోరికతో ఉన్నారు. వాళ్ళంతా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లని ఛాయని పొందడానికి అందానికి సంబంధించిన చిట్కాలు రెండు రకాలు అందులో ఒకటి సహజమైనవి, మరొకటి కాస్మేటిక్ విధానాలు. కాస్మేటిక్ విధానంతో చర్మాన్ని తెల్లగా మార్చుటకు మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

ఈ క్రీములు, లోషన్లు మరియు సబ్బులు కొన్ని రకాల చర్మాలకు హాని కలిగించే అవకాశాలు మెండుగా కలిగి ఉండవచ్చు. మరో వైపు సహజ చిట్కాలు పూర్తిగా గృహంలో అందుబాటులో లభించే పండ్లు, కూరగాయలు, మరియు ఇతర తినదగిన పదార్ధాలను కలిగి ఉంటాయి. ఈ సహజ చిట్కాలు చర్మ లక్షణాలతో సంబంధం లేకుండా అన్ని రకాల చర్మాలకు సరిపడుతుంది. ఇది ఏ విధమైన దుష్ప్రభాలు లేకుండా సహజ పద్ధతిలో లభించే చికిత్స. మొటిమలు సురక్షితంగా తొలగించడానికి మరియు చర్మ కాంతిని మెరుగు పరచడానికి చౌకగా లభించేవి సహజ చిట్కాలు.

ముఖ ఛాయని తెల్లగా మార్చుటకు చిట్కాలు

 • మీరు బయటకెళ్ళి వచ్చాక తప్పనిసరిగా మీ ముఖాన్ని వెంటనే కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మీ చర్మపు పొరలలోని దుమ్ము, ధూళి అంతా తొలగించబడుతుంది.
 • యాదృచ్చికంగా ఎంపిక చేయబడిన నాణ్యత లేని ఫేష్ వాష్ లకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మీ చర్మానికి సంబంధించిన చికాకులను కలిగించి హాని తలపెట్టగలవు.
 • మీరు మీ చర్మపు ఛాయను కోల్పోయినప్పుడు, చనిపోయిన చర్మ కణాలు మీ చర్మ పొరల్లో స్థావరాలని కలిగి ఉంటాయి. అందువలన మీ చర్మం నిస్తేజంగా మారి ఆకర్షణ రహితంగా మారుతుంది. దీనికి పరిష్కారంగా అటువంటి చనిపోయిన చర్మ పొరలను తొలగించడానికి వారానికి ఒకసారి ముఖానికి స్క్రబ్ లను ఉపయోగించడం మంచిది.
 • మీరు ఆకర్షనీయమైన చర్మం కోసం ఎదురు చూస్తున్న వారు అయితే మీరు ప్రతీ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి లేదా చల్లని పాలను తాగండి. ఇది మీ చర్మ శుద్ధికి మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతి వంతంగా మరియు ఆకర్షనీయంగా చేస్తుంది. పాలు ఒక సహజమైన చర్మ సంరక్షిత మరియు చర్మాన్ని కాంతివంతం చేయు ద్రావణం అని మనందరికీ తెలుసు.
 • అంతేకాకుండా మీరు స్వల్ప మొత్తంలో కొన్ని పాలను ఒక కప్పులో తీసుకుని ఒక కాటన్ బంతి తో నెమ్మదిగా మీ ముఖానికి రాసుకోండి. కాటన్ బంతిని పిండుతూ మీరు మీ ముఖం మీద రుద్దుతున్నప్పుడు తెల్లని పాలు నల్లగా మారి కిందకి జారుతూ ఉండటం మీరు గమనిస్తారు. దీని అర్ధం వాతావరణం లోని దుమ్ము, ధూళి మీ చర్మపు పొరల్ని ప్రభావితం చేసిందని తెలుస్తోంది. మీ చర్మాన్ని శుభ్ర పరచడంలో ఇది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు.
 • మీ అర చేతిలోకి ఒక గ్రాము శనగ పిండి తీసుకుని కొన్ని చుక్కల నీటిని అందులో వేయండి. పేస్టు లాగా దానిని కలపండి. ఈ ప్రత్యేకమైన పేస్టుని మీ తడి చర్మం మీద అప్లై చేయండి. కొన్ని నిముషాల పాటు వదిలేసి చల్లని నీటితో కడిగేసుకోండి.
 • చర్మాన్ని తెల్లగా మార్చుకునే తరుణంలో మరొక సహజ మార్గంగా బార్లీని ఉపయోగించండి. కొంత బార్లీ పిండిని తీసుకుని అందులో పేస్టుగా చేసేందుకు సరిపడా రోజ్ వాటర్ మరియు నిమ్మరసం ను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరడానికి కొంత సమయం ఇవ్వండి. ఆరిపోయాక చల్లని నీటితో కడిగేసుకోండి.
 • మీ ఇంటిలో బాదం అందుబాటులో ఉన్నట్లయితే వాటిని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గుండ చేసి అందులో 4 చెంచాల తాజా పాలను కలపండి. పొడిగా ఉన్న ముఖం మీద ఈ పేస్టుని రాసి ఆరనివ్వండి. చల్లని నీటితో దీనిని కడిగేసుకోండి.

కాంతివంతమైన చర్మ అందానికి గృహ చిట్కాలు

 • తేనె తెల్లని చర్మ కాంతిని అందించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. తేనె తీసుకుని వృత్తాకార కదలికలో మీ ముఖం మీద రోజుకి రెండు సార్లు నేరుగా రుద్దడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
 • కీరదోస అనేది తెల్లని చర్మ ఛాయని పొందడంలో పేరొందిన ఒక కూరగాయ. చర్మ ఛాయాని కాంతివంతంగా మార్చుకోవడానికి కీరదోస తీసుకోవడం లేదా కీరదోస గుజ్జు అప్లై చేసుకోవడం వంటివి రెండూ బాగా ఉపయోగపడతాయి. కీరదోస చర్మాన్ని చల్లబర్చడమే కాకుండా ముఖం మీద ఉన్న బ్లాక్‌హెడ్స్ ని తొలగిస్తుంది. కీరదోస ముక్కలను అలసిన కళ్ళ మీద ఉంచుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడంలో కూడా కీరదోస ఉపయోగపడుతుంది.
 • నిమ్మకాయ ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. మీరు ఆరు వారాలపాటు నిమ్మకాయ రసాన్ని ముఖానికి రుద్దడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు.
 • బొప్పాయి చర్మంకు తేజస్సును తేవడానికి ఉపయోగించే ఒక సాధారణ సమయోచిత ఔషధం. ముఖం మరియు చేతుల మీద పండిన బొప్పాయి పేస్ట్ ను పట్టించండి. దానిని ఒక గంట పాటు వదిలేసి ఆపై కడిగేయండి.
 • తులసి సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి మరియు చక్కని చర్మ రంగుని పునరుద్ధరించడానికి ఉత్తమ పరిష్కారంగా గుర్తించబడింది. తులసి ఆకులను ఒక చూర్ణం లాగా గ్రైండ్ చేసుకుని ముఖానికి పట్టించండి. కొన్ని నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.
 • గులాబీల నీళ్ళు చాలా తక్కువ వ్యవధిలో చర్మంకు గులాబీ రంగును ఇవ్వగలవని చెప్పబడింది. గులాబీ రేకులను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ నీటితో రోజుకు రెండు నుండి మూడు సార్లు ముఖాన్ని కడగాలి.
 • పసుపు చాలా మంది దక్షిణ భారత మహిళలు వారి చర్మ కాంతిని మెరుగు పరుచుచుకోవడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన గృహ పదార్ధము. ముఖం, చేతులు మరియు పాదాలకు ఒక పక్ష కాలము పాటు రోజుకి రెండుసార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
 • టమాటో రసం చర్మానికి వెలుగు ప్రసాదించడంతో పాటుగా చర్మానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. టమాటో గుజ్జుని ముఖానికి పట్టించడం వలన సులభంగా కాంతి వంతమైన చర్మాన్ని పొందవచ్చు.
 • గుడ్డు పచ్చసొన చర్మానికి ఉత్తమమైన పదార్థంగా పరిగణించబడుతుంది. ఒక గిన్నె లో గుడ్డు పచ్చసొన, తేనె మరియు పెరుగు మిశ్రమం సిద్ధం చేసుకుని ముఖానికి ప్యాక్ గా అప్లై చేసి ఆరనివ్వండి. తదుపరి చల్లటి నీటితో కడిగేయండి.
 • పాలు మరియు కుంకుమ పువ్వు పురాతన మహారాణులు తెల్లని చర్మం పొందడానికి ఉపయోగించే ఒక ఔషధ నివారణగా చెప్పవచ్చు. ఒక కప్పు పాలలో కుంకుమ పువ్వుని కలపండి. దానిని వలయాకారంలో ముఖం మీద మృదువుగా రుద్దండి.
 • నిమ్మరసం మరియు చక్కెర మిశ్రమం కొన్ని వారాలలో మృదువైన మరియు కాంతి వంతమైన చర్మాన్ని పొందడానికి ఒక సరియైన స్క్రబ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం మరియు చక్కెర మిశ్రమాన్ని చక్కెర కరిగేవరకు ముఖానికి మృదువుగా రుద్దండి.
 • ఎరుపు పప్పు మరియు బియ్యం కూడా తెల్లని ఛాయని పొందడానికి ఉపయోగించబడతాయి. ఎరుపు పప్పు మరియు బియ్యం లను సమ భాగాలుగా తీసుకుని నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
Posted on

Telugu tips to remove nipple hair – చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించడం ఎలా?

మహిళలు తమ అందం యొక్క అవసరాలకు సంబంధించి ప్రత్యేకంగా నిలవాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు.  స్త్రీ శరీరంలోని కొన్ని భాగాలు వారి స్త్రీత్వానికి నిదర్శనగా ఉంటూ పురుషులను ఆకర్షిస్తాయి. ఈ వైవిధ్యం పురుషులకు భిన్నంగా వారిని వేరు చేస్తూ ఉంటుంది. కేవలం చూడటానికి వైవిధ్యం కలిగిన చనుమొనలు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోనూ ఉంటాయి. స్త్రీలలో అధికంగా గుర్తించ దగిన భాగం వక్షోజాల మీదగా చనుమొనలు ఉంటాయి. పురుషులలో దీనికి భిన్నంగా సమతల ఛాతీ మీదగా ఈ చనుమొనలు ఉంటాయి.

చనుమొనల చుట్టూ అవాంచిత రోమాల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే అవాంచిత రోమాలను శరీరంలోని చంకలు, జననాంగాలు మరియు చనుమొనల చుట్టూ, మొదలైన వివిధ భాగాల నుండి సులభమైన కొన్ని ఉపాయాలతో తొలగించవచ్చు.

మహిళలు వారి చనుమొనల చుట్టూ అవాంచిత రోమాలను కలిగి ఉన్నట్లయితే తదుపరి వారి పురుషుల ప్రేమను చురగోనే సమయంలో ప్రతిగా చిరాకు కలిగించవచ్చు. అందువలన అటువంటి ప్రతికూల సందర్భం రాకుండా  ముందుగా ఈ కింది సులభమైన సూచనల ద్వారా మీ చనుమొనల చుట్టూ అవాంచిత రోమాలను తొలగించడం మంచిది.

చనుమొనల చుట్టూ అవాంచిత రోమాల తొలగింపుకు మార్గాలు

హెయిర్ రిమూవల్ క్రీములు

నేడు మార్కెట్టులో సులభంగా వివిధ రకాల హెయిర్ రిమూవర్ క్రీములు అందుబాటులో లభిస్తున్నాయి. వాటితో మీరు మీ చనుమొనల చుట్టూ కనిపించే అవాంచిత రోమాలను సులువుగా తొలగించే సాధనకు పూనుకోవచ్చు. మీరు ఈ హెయిర్ రిమూవర్ క్రీములని కొనుగోలు చేసే ముందు దాని బ్రాండ్ కు సంబంధించి ఒక వీక్షణ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మీరు ఉపయోగించాల్సిన అవయవము శరీరంలో అత్యంత సున్నితమైన భాగము. లోపభూయిష్ట ఉత్పత్తుల వలన ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

హెయిర్ రిమూవింగ్ క్రీముని తీసుకుని మీ చనుమొనల చుట్టూ ఉన్న అవాంచిత రోమాల మీదగా రాసి 5 నిముషాల పాటు వేచి ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా స్పాచులాను ఉపయోగించి క్రీమును తొలగించండి. మీరు మీ అవాంచిత రోమాలను కూడా దానితో తొలగించబడటం చూస్తారు.  

వాక్సింగ్

మీరు వాక్సింగ్ ప్రక్రియ విధానాన్ని సలూన్ కి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం చేతులు, కాళ్ళు, చంకలలో కూడా అవాంచిత రోమాలను తొలగించడానికి  ఉపయోగించబడుతుంది. మీరు ఈ విధానాన్ని మీ చనుమొనల మీద కూడా ఉపయోగించవచ్చు. మీరు పార్లర్ లో ఈ వాక్సింగ్ కొరకు సిగ్గు పడుతున్నట్లయితే ఇంట్లో కూడా ఈ విధానాన్ని చేసుకోవచ్చు. దీనికి మీకు కావలిసిందల్లా వాక్స్ మరియు ఒక కాటన్ వస్త్రం మాత్రమే. వాక్సును సరిపడా కరిగించి అవాంఛిత వెంట్రుకలు కలిగిన చోట్ల పూయండి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో చర్మానికి వస్త్రానికి మధ్య గాలి ఖాళీ లేనట్లుగా నొక్కి కప్పి ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా వస్త్రాన్ని లాగండి. దానితో పాటుగా తొలగించబడిన వెంట్రుకలు మీరు చూడ గలుగుతారు.

లేజర్ చికిత్స

అవాంఛిత రోమాల తొలగింపునకు మీరు లేజర్ చికిత్స గురించి వినే ఉంటారు. క్రీమ్ హెయిర్ రిమూవర్ అలాగే వాక్స్ వంటి వాటి వలె కాకుండా ఈ విధానం రొమ్ముల చుట్టూ ఉండే అవాంఛిత రోమాల తొలగింపునకు మరింత మెరుగు కలిగిన శాశ్వత పరిష్కార చికిత్సా విధానంగా పేర్కొనవచ్చు. ఇక్కడ నిపుణులు మీ శరీర భాగం నుండి అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించేందుకు ఒక కిరణమును ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా 2-3 పర్యాయాలు చికిత్సకు కూర్చోవాల్సి ఉంటుంది. అయితే ఫలితంగా ఇది మీకు పరిపూర్ణమైన రుజువుతో ఎన్నటికీ సమస్య పునరావృతం కాని విధంగా మీరు హామీ పొందగలుగుతారు.   

చక్కెర చికిత్స

ఎటువంటి కృత్రిమ రసాయనాలను ఉపయోగించకుండా సహజమైన పద్ధతిలో కూడా మీరు ఈ చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. దీని కొరకు మీరు ఒక చెంచా పంచదార తీసుకుని ఒక సన్నని మంట మీద కరిగించండి. అది కరిగిన తర్వాత మీరు అవాంఛిత రోమాలను తొలగించాలనుకునే ప్రదేశంలో అప్లై చేయండి. దీని మీదగా ఒక కాటన్ వస్త్రాన్ని నొక్కుతూ కవర్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా వస్త్రాన్ని వొలిచే క్రమంలో తొలగిస్తూ మార్పుని చూడండి.    

ఎలక్ట్రోలైసిస్ (విద్యుద్విశ్లేషణ)

ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియతో కూడా మీ చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. స్త్రీలు చంకలు, యోని, చేతులు మరియు కాళ్ళను క్షౌరము చేసేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మీరు చికిత్స గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎలక్ట్రోలైసిస్ నిపుణున్ని సంప్రదించగలరు. ఇది మీ చనుమొనల చుట్టూ ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి ఒక సురక్షితమైన మార్గం. నేడు   ఎలక్ట్రోలైసిస్ అనేది అన్ని రకాల చర్మ రకాలకు మరియు రోమాలకు సంబంధించి ప్రభావ వంతంగా పని చేసే ఒక సమర్ధవంతమైన విధానం. కానీ మీరు మీ సంరక్షణ కొరకు ఒక లైసెన్సు కలిగిన అనుభవజ్ఞులైన ఎలక్ట్రోలైసిస్ నిపుణులని సంప్రదించాలి. అలాగే ఎలక్ట్రోలైసిస్ వంటి వివిధ చికిత్సలను నిర్వహిస్తున్న పేరొందిన సంస్థలను కూడా మీరు సంప్రదించవచ్చు.  

దీనికోసం మీరు ఆన్లైన్ లో వివిధ రకాల వెబ్ సైట్లు మరియు వాటి సంస్థాగత నిర్మాణం, ప్రారంభించిన సంవత్సరం వంటి సామర్ధ్యపు పరిమితులను గురించి ఒక లుక్కేయొచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రోలైసిస్ ఏజెంట్ ను సంప్రదించి ఇందులోని లాభ నష్టాలను గురించి పూర్తి వివరాలను పొందగలరు. మీరు దానికి సంభంధించిన ప్రతీ అంశాన్ని క్షున్నంగా తెలుసుకోవడం వలన తర్వాత పశ్చాత్తాపం ఉండదు. నిర్ణయాన్ని తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులని కూడా  ఒకసారి సంప్రదించండి.