Posted on

Telugu face packs for glowing skin – ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్

ఆయుర్వేదం అనేది అన్ని వ్యాధులు మరియు చర్మ సమస్యలకు సహజ వైద్యం యొక్క పురాతన ఔషధ వ్యవస్థలలో ఒకటి. ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులు సహజ మూలికలు, పండ్లు, కూరగాయల ఏక్సట్రాక్ట్స్ తో తయారు చేస్తారు. అవి ముఖం, చర్మం మరియు జుట్టు సంరక్షణ కొరకు సున్నితంగా పనిచేస్తాయి.

ప్రతి స్త్రీ ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా, మన శరీరం యొక్క ఇతర భాగాలతో పోల్చినప్పుడు ముఖానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మం ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే ముడతలతో మరియు నల్లని మచ్చలతో బాధపడుతున్నారు. అందుకు కారణం హానికరమైన కాస్మెటిక్స్ ని ఉపయోగించటమే.

కానీ, ఆయుర్వేద చికిత్సల ద్వారా మీరు మీ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు. మన ఇంటిలో మరియు పరిసరాలలో కనిపించే సహజ పదార్ధాలు మెరిసే చర్మాన్ని పొందేందుకు సహాయపడతాయి. ప్రకాశవంతమైన చర్మం కొరకు సహజ పదార్థాలతో ఫేస్ ప్యాక్ లను తయారు చేయవచ్చు.

ఈ పద్ధతుల ద్వారా ఫలితాలను పొందేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఇవి శాశ్వత ఫలితాలను అందిస్తాయి. క్రింద చెప్పినటువంటి ఫేస్ ప్యాక్ లలో మీ చర్మానికి సరిపడే ఫేస్ ప్యాక్ ని ఎంచుకొని క్రమం తప్పకుండా ఉపయోగించి అందమైన ప్రకాశవంతమైన సహజ చర్మాన్ని పొందండి.

ప్రకాశవంతమైన చర్మం మరియు ముఖం కోసం కోసం ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్

మ్యారిగోల్డ్ ఫేస్ ప్యాక్

బంతి పువ్వు అని పిలవబడే మేరిగోల్డ్ పుష్పం మీ తోటలో సులభంగా లభిస్తుంది. ఈ పువ్వులు భారత మహిళలు దైవ ఆరాధన కొరకు అధికంగా ఉపయోగిస్తారు. కనుక, ఈ పువ్వులు దుకాణంలో అలాగే తోటలో చాలా సులభంగా లభిస్తుంది. కొన్ని తాజా బంతిపువ్వులను తీసుకొచ్చి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంత పచ్చి పాలను, తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి సువాసన కలిగి ఉండటం మాత్రమే కాదు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంలోని మొటిమలను మరియు జిడ్డును తొలగిస్తుంది. దీన్ని వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి. జిడ్డు చర్మం ఉన్న వారికీ ఈ ప్యాక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

శనగ పిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్

కొంత శనగ పిండి మరియు చిటిక పసుపుని ఒక బౌల్ లో వేసుకొని ఈ మిశ్రమాన్ని డైల్యూట్ చేసేందుకు కొంత పాలు లేదా నీటిని ఉపయోగించండి. ఈ ప్యాక్ ని చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

చదనం లేదా గంధం ఫేస్ మాస్క్

చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి గంధంను ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. గతంలో ప్రజలు గంధపు చెక్క యొక్క సారం పొందడానికి ఒక రఫ్ సర్ఫేస్ పై రుద్దేవారు. కానీ నేడు శాండిల్ వుడ్ పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు ఈ పొడిని మీరు ఉపయోగించవచ్చు. ఒకటి లేదా రెండు స్పూన్ గంధపు పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాల తర్వాత నీటితో కడగండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖంపై మొటిమలు తగ్గుతాయి మరియు ముఖంలో కాంతి పెరుగుతుంది. స్కిన్ సాప్ట్ గా అవుతుంది. వారంలో 3 లేదా 4 సార్లు ఉపయోగిస్తే మరింత బెటర్ రిజల్ట్ పొందుతారు.

అందమైన చర్మం కోసం సుగంధ ప్యాక్

కొన్ని సహజ పదార్ధాలతో ఈ ప్యాక్ ని తయారు చేయవచ్చు. ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక స్పూన్ లావెండర్ నూనె, ఒక స్పూన్ గంధపు పొడి, రెండు టేబుల్ స్పూన్లు శనగ పిండి, చిటిక పసుపు పొడి, తగినంత వెన్న లేదా తాజా క్రీము లేదా రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి ముఖంపై రాసి బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మరియు చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా అవుతుంది.

తేనె మరియు లెమన్ ఫేస్ ప్యాక్

తేనె మరియు నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంలో మరియు చర్మాన్ని తేలికపరచడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ తీసుకుని దీనికి అర చెంచ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్‌లై చేయాలి. ముఖంలో కళ్లకు తప్పా మిగిలిన భాగాలపై అప్‌లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరే వరకు ఆగి 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది.

హెర్బల్ ఫేస్ మాస్క్

కొద్దిగా శనగ పిండి, చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. దీనికి పచ్చి పాలు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం మొత్తం అప్‌లై చేసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా ప్రకాశవంతంగా అవుతుంది. ఇది స్కిన్ టాన్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించేందుకు సహాయపడుతుంది.

ఆయుర్వేద స్క్రబ్

ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు గంధపు పొడిని మిక్స్ చేయాలి. దీనికి అర చెంచా పాలను మరియు ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, తగినంత రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ఆయుర్వేద స్క్రబ్ తో వారంలో ఒకటి లేదా రెండు సార్లు ముఖాన్ని స్క్రబ్ చేయాలి.

అత్తి పండు మరియు గుమ్మడికాయ ఫేస్ ప్యాక్

అత్తి పండులో ఆల్ఫా హైడ్రో ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. రెండు అత్తి పండ్లను మరియు 2 ముక్కల గుమ్మడికాయను మృదువైన పేస్ట్ చేయండి. ఇందులో కొన్ని చుక్కల బాదం నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై రాసి బాగా ఆరిన తరువాత నీటితో కడగండి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా చర్మ సంరక్షణంకు కూడా సహాయపడుతుంది. ఆరెంజ్ ఫేస్ పాక్స్ వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మంపై ఉన్న ట్యాన్, నల్లని మచ్చలు, జిడ్డు తొలగించటానికి చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి.

 • ఒక స్పూన్ ఆరెంజ్ రసంలో అర స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ మంచి ఫలితం కనపడుతుంది.
 • రెండు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ సోర్ క్రీం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది.
 • మూడు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ మజ్జిగ, రెండు స్పూన్ శనగ పిండి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద డిటానింగ్ ప్యాక్

కలబంద చర్మంపై టాన్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ కలబంద జెల్ మరియు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాలు ఉంచి కడగాలి.

ఫుల్లర్స్ ఎర్త్ మరియు కలబంద జెల్

రెండు లేదా మూడు టీ స్పూన్ల అలో వెరా జెల్ ని తీసుకొని 1 టీ స్పూన్  ఫుల్లర్స్ ఎర్త్ మట్టిని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

కలబంద లేకపోతే ఫుల్లర్స్ ఎర్త్ ని రెండు స్పూన్ రోజ్ వాటర్ తో కూడా కలిపి అప్‌లై చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

స్పష్టమైన చర్మం కోసం గూస్బెర్రీ

గూస్బెర్రీ చర్మపు రంధ్రాలను చిన్నగా చేసి నల్లని మచ్చలను తొలగిస్తుంది. రెండు లేదా మూడు గూస్బెర్రీలను మాష్ చేయి ఒక స్పూన్ తాజా పెరుగు మరియు ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత కడగాలి.

పుదీనా

పుదీనా చర్మంపై ఉన్న మచ్చలను మరియు పింపుల్స్ ను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కొన్ని పుదీనా ఆకులను నలిపి వాటి రసాన్ని పిండి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

జిడ్డు చర్మం కోసం మెంతులు

మెంతులు చర్మం యొక్క సేబాషియస్ గ్లాండ్స్ ని నియంత్రించడం ద్వారా జిడ్డును తగ్గిస్తుంది. కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి రోజ్ వాటర్ మరియు పుదీనా ఆకులతో కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత కడగండి.

నువ్వుల గింజలు మరియు పసుపు ఫేస్ ప్యాక్

సెసెమీ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్యాక్ చర్మంపై ఉన్న మొటిమలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల నువ్వుల నూనె, కొన్ని చుక్కల ఆపిల్ సీడర్ వినిగర్ మరియు నీటిని కలిపి ప్యాక్ ని తయారు చేయండి. ఈ ప్యాక్ ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి.

వేప మరియు తేనె ఫేస్ ప్యాక్

మొటిమలను తొలగించి ఆరోగ్యమైన ప్రకాశవంతమైన చర్మం కొరకు వేప ఫేస్ ప్యాక్ ఉత్తమ ఎంపిక. వేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. వేప ఆకులు, తేనె మరియు పసుపు యొక్క పేస్ట్ తో ఫేస్ ప్యాక్ ని తయారు చేయండి మరియు చర్మంపై రాసి 15-20 నిమిషాల తరువాత కడగండి.

Posted on

Foot blisters tips in Telugu – పాదాల పై బ్లిస్టర్స్ ని క్యూర్ చేసేందుకు హోం రెమెడీస్

బ్లిస్టర్స్ అంటే ఏమిటి?

బ్లిస్టర్స్ శరీరంపై ఒక చిన్న బొబ్బలా ఏర్పడుతుంది. వీటిని పొక్కు అని కూడా అంటారు. ఈ బుడగల యొక్క పరిమాణం మారుతూ ఉంటాయి మరియు వివిధ కారణాల వలన సంభవిస్తాయి. స్కిన్ బర్న్, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా దోమ కాటు వలన సంభవించవచ్చు. ఏర్పడిన స్థానాన్ని బట్టి, పొక్కు రోజువారీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పాదాలలో పొక్కును కలిగి ఉంటే నడవటానికి, వ్యాయామం, లేదా దీర్ఘకాలం పాటు నిలబడటానికి కష్టంగా ఉంటుంది.

బొబ్బలు సాధారణంగా పాదాలమీద అభివృద్ధి చెందుతాయి. వీటి వలన కలిగే అసౌకర్యం నుండి ఉపశమనం పొందేందుకు అనేక గృహ చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు ఉపశమనం కలిగించి పునరావృతమయ్యే బొబ్బల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పాదాలపై బొబ్బలు రావటానికి కారణాలు

మీ పాదాలపై బొబ్బలు ఉన్నట్లయితే అందుకు ప్రధాన కారణం ఘర్షణ కావచ్చు. ఎక్కువ సమయం నడవటం లేదా నిలబడటం వలన హీల్స్, అరికాలు మరియు కాలి వేలపై ఒత్తిడి పెరుగుతుంది. వీటి కారణంగా బ్లిస్టర్స్ ఏర్పడతాయి.

అయితే, దీర్ఘకాలం నడిచిన లేదా నిలబడి వున్న ప్రతి ఒక్కరికి బొబ్బలు ఏర్పడవు. అనేక సందర్భాల్లో, ఈ ద్రవంతో నిండిన పొక్కులు సరిగ్గా ఫిట్ అవ్వని బూట్లు వలన ఏర్పడుతుంది. చాలా లూస్ గా లేదా చాలా టైట్ గా ఉండే షూస్ వేసుకోవటం వలన ఘర్షణకు దారితీస్తుంది మరియు దాని ఫలితంగా చర్మంపై పొక్కు ఏర్పడుతుంది.

అధిక తేమ లేదా చెమట బ్లిస్టర్స్ ఏర్పడటానికి కారణం కావచ్చు. స్వెట్ ఫోర్స్ మూసుకుపోయినప్పుడు చిన్న బొబ్బలు ఏర్పడతాయి. చలి కాలంలో ఇది సాధారణంగా అధికంగా ఏర్పడుతుంది.

సన్ బర్న్ వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. పాదాలపై బొబ్బలు ఏర్పడటానికి ఇతర కారణాలు

 • ఫ్రాస్ట్-బైట్
 • అలెర్జీ ప్రతిచర్య
 • రసాయన ఎక్స్పోజర్ (కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్లు)
 • ఫంగల్ ఇన్ఫెక్షన్లు
 • చికెన్ పాక్స్
 • బాక్టీరియా సంక్రమణ
 • హెర్పెస్
 • డైసిడ్రిటిక్ తామర

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?

ఘర్షణ వల్ల కలిగే పొక్కు సాధారణంగా కొన్ని రోజుల్లో గృహ చికిత్సలతో పరిష్కరించబడుతుంది.

దురదృష్టవశాత్తు, కొన్ని బొబ్బలు గృహ చికిత్సలకు స్పందించవు. కాలక్రమేణా మరింత తీవ్రం అవుతాయి. పొక్కు తీవ్ర నొప్పికి కారణమైతే లేదా వాటి వలన నడవడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని చూడండి. బ్లిస్టర్స్ తో పాటు జ్వరం, వికారం లేదా చలి వంటి సంకేతాలు ఉన్నట్లయితే ఇది సంక్రమణంకు ఒక సంకేతం కనుక డాక్టర్ను సంప్రదించాలి.

మీ వైద్యుడు ఒక శుభ్రమైన సూదిని ఉపయోగించి పొక్కును శుభ్రం చేస్తారు. సంక్రమణ వలన కలిగినట్లయితే కారణాన్ని తెలుసుకునేందుకు వారు ద్రవం యొక్క నమూనాను పరిశీలించవచ్చు.

బొబ్బలను నివారించేందుకు మరియు క్యూర్ చేసేందుకు కొన్ని గృహ నివారణలు

ఒక డియోడ్రన్ట్ ఉపయోగించండి

మీ బూట్లు లేదా చెప్పులను ధరించే ముందు, మీ పాదాలపై డియోడ్రన్ట్ ని రాయండి ఎందుకంటే ఇది మీ పాదాలను తేమగా ఉంచుతుంది. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స, ఇది బొబ్బలు బారిన పడకుండా మీ కాళ్లను కాపాడుతుంది.

బ్యాండేజ్ ని ఉపయోగించండి

పొక్కు ఏర్పడిన చోటుపై బ్యాండేజ్ ని ఉపయోగించవచ్చు. ఇది ఘర్షణను తగ్గిస్తుంది. ఘర్షణ వలన బొబ్బలు మరింత తీవ్రమవుతాయి. కనుక బ్యాండేజ్ వేసినట్లయితే ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి మురికి మరియు ఘర్షణకు పొక్కు గురవకుండా సురక్షితంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక పాన్ లో వేడి నీటిలో మూడు గ్రీన్ టీ బాగ్స్ వేసి, కొంత బేకింగ్ సోడాను కలిపి ఆపై నీరు చల్లబడిన తర్వాత బొబ్బలు ఏర్పడిన పదాలను కొంత సేపు ఈ నీటిలో ఉంచండి. ఇలా క్రమంగా చేస్తుండటం వలన కొన్ని రోజుల్లో బ్లిస్టర్స్ క్యూర్ అవుతాయి. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స మరియు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదు.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కనుక ఇది బ్లిస్టర్స్ ఉబ్బకుండా ఉండేందుకు మరియు ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఒక పెద్ద వెస్సల్ లోని నీటిలో అర కప్పు వినిగర్ ని కలిపి కాళ్లను కొద్ది సేపు అందులో నానపెట్టండి. ఆ తరువాత పూర్తిగా తడి లేకుండా మెత్తని టవల్ తో తుడవండి. ఇలా క్రమంగా చేయటం వలన బ్లిస్టర్స్ నయమవుతాయి.

విటమిన్ ఇ

విటమిన్ ఇ ఆయింట్మెంట్ లేదా క్రీములను బొబ్బలపై రాయండి లేదా విటమిన్ ఇ గుళిక యొక్క చుక్కలను నేరుగా పొక్కుపై రాయండి. ఇది వెంటనే ఉపశమనం ఇస్తుంది మరియు మార్కెట్లో సులభంగా లభిస్తుంది.

కాస్టర్ ఆయిల్

ఇది చాలా సమర్థవంతమైన గృహ చికిత్స. రాత్రి పడుకునే ముందు కాస్టర్ ఆయిల్ని మీ చేతులపై మరియు పాదాలపై రాయండి. ఇది మీ చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు బొబ్బలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ ఆయిల్ ని దరఖాస్తు చేయటం వలన ఇదివరకే ఉన్న బొబ్బలు సులభంగా ఎండిపోతాయి. మంచి ఫలితాల కోసం, కాస్టర్ ఆయిల్ మరియు ఆపిల్ సీడర్ వినిగర్ల మిశ్రమంను ఉపయోగించండి.

విచ్ హాజెల్

ఒక పతిని విచ్ హాజెల్ ద్రవంలో ముంచి బ్లిస్టర్స్ పై రాయండి. ఇది మీ బొబ్బలను బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది మరియు బొబ్బలు ఎండిపోయేలా చేస్తుంది. అంతే కాదు ఇది దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

కలబంద

కలబంద లో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయి. కలబంద జెల్ ని డైరెక్ట్ గా పొక్కుపై రాయండి. ఇది రెడ్నస్ ని తగ్గించి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

బ్లిస్టర్స్ ని తెరిచి ఉంచండి

మీరు స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నట్లయితే బొబ్బల్ని తెరిచి ఉంచాలని వైద్యులు సూచించారు. ఇది మీ బొబ్బలు త్వరగా ఎండిపోవుటకు సహాయపడుతుంది.

ఇంట్లోనే పొక్కును శుభ్రపరచేందుకు పాటించాల్సిన చర్యలు

 • మొదట వెచ్చని నీరు మరియు యాంటీ బాక్టీరియల్ సబ్బుతో మీ చేతులను కడగాలి.
 • పత్తిని ఉపయోగించి ఒక శుభ్రమైన సూదిని రబ్బింగ్ ఆల్కహాల్ తో శుభ్రపరచండి.
 • తరువాత యాంటీ సెప్టిక్ తో పొక్కును శుభ్రపరచండి.
 • సూదితో పొక్కు లో ఒక చిన్న పంక్చర్ చేయండి.
 • పొక్కు నుండి ద్రవం పూర్తిగా తొలగించండి.
 • ఆ తరువాత పొక్కు పై యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ లేదా క్రీమ్ ను వర్తించండి.
 • ఇప్పడు బ్లిస్టర్ ఉన్న చోటుపై ఒక శుభ్రమైన బ్యాండేజ్ ని వేయండి.
 • ప్రతిరోజూ బ్లిస్టర్ ని శుభ్రపరచి యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ ని రాయండి. బ్లిస్టర్ పూర్తిగా పొడిబారే వరకు బ్యాండేజ్ వేసి ఉంచండి.