Posted on

Telugu tips to make hips smaller – హిప్ సైజ్ ని తగ్గించటం ఎలా? – వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్

స్త్రీలు అందంగా కనపడాలంటే ఆకర్షణీయమైన ముఖ సౌందర్యంతో పాటు అందమైన ఆకారం కూడా ఉండాలి. ఇటీవల కాలంలో జీరో సైజ్ అని వినే ఉంటాము. అలాంటి ఆకారం పొందేందుకు ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటాము. అందులో ఒక భాగమే ఈ హిప్ సైజుని తగ్గించటం.

మన ముందు జనరేషన్లో మన అమ్మ మరియు అమ్మమ్మ పనులు ఎక్కువ చేసేవారు కాబట్టి ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా ఆరోగ్యంగా మరియు మంచి శారీరక ఆకారంతో ఉండేవారు. కానీ కాలం మారే కొద్ది జీవన శైలిలో మార్పులు ఏర్పడటం వలన ఆరోగ్యము మరియు శారీరక ఫిట్‌నెస్ కూడా తగ్గిపోయింది.

ప్రస్తుత కాలంలో ముఖ్యంగా అమ్మాయిలు మోడ్రన్ దుస్తులు వేసుకోవాలని ఆశపడతారు. కానీ సరైన ఫిట్‌నెస్ లేకపోతే కొన్ని దుస్తులను ధరించ లేరు. ముఖ్యంగా సన్నటి నడుము ఉండాల్సిందే. మరి సన్నటి నడుమును పొందటం ఎలా? ఆహార పద్దతులను మార్చుకుంటే సరిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆహారంలో మార్పులు అవసరమే, కానీ కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే మంచి ఆకారంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

శరీరంలో ఎలాంటి మార్పులను పొందాలన్నా సరైన ఆహారం అనగా సరైన డైట్, వ్యాయామం, జీవనశైలిలో కొన్ని మార్పులు మరియు కొన్ని హోమ్ రెమెడీస్ ని పాటించక తప్పదు. మరి నాజూకైన నడుమును పొందేందుకు మీరు చేయాల్సిన వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్ ని ఈ ఆర్టికల్ లో చూద్దాం.

నాజూకైన నడుమును పొందేందుకు వ్యాయామాలు

 1. స్క్వాట్స్ : సరైన ఆకృతి గల నడుమును పొందేందుకు స్క్వాట్స్ ఒక మంచి వ్యాయామం. మీ పాదాలను భుజాల వెడల్పు దూరంలో ఉంచి మోకాళ్లను వంచండి. ఇలా చేసేటప్పుడు మీ చేతులను జోడించి ఛాతికి దగ్గరగా ఉంచండి. ఈ పొజిషన్లో 2 సెకండ్లు ఉండి నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇలా 5 సార్లు చేసి కొంత గ్యాప్ తీసుకొని మల్లి చేయాలి. ఇలా 3 సెట్స్ గా చేయాలి.
 2. వన్ లెగ్ స్క్వాట్స్ : పిస్తోల్ స్క్వాట్స్ అని కూడా పిలువబడే వన్ లెగ్ స్క్వాట్స్ హిప్ కండరాలను టోన్ చేయడానికి చాలా ప్రభావితమైనది. అయితే కొత్తగా వ్యాయామం చేయటం ప్రారంభించిన వారికి ఇది సాధ్యం కాదు. కనుక కొన్ని రోజుల తరువాత ఈ వ్యాయామాన్ని ప్రయత్నించండి. నేరుగా మీ కాళ్లపై నిలబడి మీ చేతులు ముందుకు చాచి ఒక కాలిని నేరుగా చెప్పండి. ఇప్పుడు మీరు నిలబడి వున్న కాలిని వీలైనంత వరకు వంచండి మరియు నడుమును కొద్దిగా వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించండి. ఇలా కొన్ని సెకండ్స్ బాలన్స్ చేయండి. తిరిగి స్ట్రెయిట్ పొజిషన్‌కి  వచ్చి ఇదే పద్దతిని మరో కాలుతో ప్రయత్నించండి. ఇలా మూడు సార్లు చేసి గ్యాప్ తీసుకొని మల్లీ రిపీట్ చేయాలి. మొదట్లో కనీసం 3 సెట్లు, ప్రతి సెట్లో 3 సార్లు చేయండి. క్రమంగా నంబర్ ఆఫ్ సెట్స్ ని పెంచుకోండి.
 3. ఫార్వర్డ్ లంగ్స్ : మీ తొడ మరియు నడుము లోని కండరాలను టోన్ చేసేందుకు ఇది ఒక మంచి వ్యాయామం. మీ కాళ్లపై నేరుగా నిలబడి ఒక పాదంను ముందుకు పెట్టి మోకాలు రెండింటినీ నెమ్మదిగా వంచాలి. మీ వెన్నెముకను నేరుగా ఉంచి అలా 5 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇదే విధంగా మరో కాలును కూడా ముందుకు పెట్టి ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. ఇలా 5 సార్లు చేసి గ్యాప్ తీసుకొని మరో 5 సార్లు చేయాలి. మొత్తం 4 సెట్లుగా చేయటం ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 4. సైడ్ లంగ్స్ : ఈ వ్యాయామం కూడా మీ నడుము మరియు తొడ కండరాలను టోన్ చేసి కొవ్వును తగ్గిస్తుంది. కాళ్లను వెడల్పుగా ఉంచి నేరుగా నిలబడండి. ఇప్పుడు ఒక మోకాలిని వంచి ఒక వైపు శరీరాన్ని మొత్తం వీలైనంతగా స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్స్ బాలన్స్ చేసి ఆ తరువాత మరో వైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా 5 సార్లు 4 సెట్స్ గా ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 5. సైడ్ స్టెప్ అప్ : ఈ వ్యాయామం చేయటానికి ఒక ఎతైన మరియు బరువైన బెంచ్ కావాలి. బెంచు యొక్క ఎత్తు మీకు తగట్టుగా అమర్చుకోవచ్చు. మీకు ఎడమ వైపు బెంచ్ ని ఉంచి వ్యాయామం ప్రారంభించండి. ఎడమ కాలిని బెంచ్ మీద ఉంచి శరీరాన్ని పైకి లేపి మరో కాలిని గాలిలో ఉంచి 2 సెకండ్స్ బాలన్స్ చేయండి. ఆ తరువాత తిరిగి నార్మల్ పొజిషన్‌కి రండి. ఇప్పుడు ఇలాగే కుడి కాలితో కూడా చేయాలి.
 6. సైడ్ ప్లాంక్ : సైడ్ ప్లాంక్ పొజిషన్లో పడుకొని ఒక కాలిని మాత్రం మెల్లగా పైకి లేపి 2 సెకండ్స్ తరువాత స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఇలా 6-8 సార్లు చేసిన తరువాత మరో వైపు తిరిగి ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి.
 7. కార్డియో వ్యాయామాలు : కార్డియో వ్యాయామాలు చేయటం వలన మంచి ఆకారం మరియు సరైన రూపంను పొందుతారు. ఇది స్వయంచాలకంగా మీ నడుము ట్రిమ్ అవటానికి సహాయం చేస్తుంది. ప్రతి రోజు 20-30 నిమిషాల వరకు కార్డియో వ్యాయామాలను చేయండి.
 8. రన్నింగ్ : రన్నింగ్ కూడా ఒక మంచి వ్యాయామం. ఈ వ్యాయామం మీ శరీరం మొత్తం ఉన్న కొవ్వును తగ్గించి కాళ్లు మరియు నడుము కండరాలను టోన్ చేస్తుంది.
 9. సైక్లింగ్ : మీ హిప్ లోని అదనపు కొవ్వును కరగించటానికి మరియు కండరాలను టోన్ చేయడానికి సైక్లింగ్ చాలా ప్రభావితమైన వ్యాయామం.

మరి కొన్ని వ్యాయామాలు

 • నిటారుగా నిలబడి రెండు కిలోల వెయిట్స్‌ ని చేతుల్లోకి తీసుకొని, కుడి మరియు ఎడమ వైపుకి శరీరాన్ని వంచాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.
 • వెల్లకిలా పడుకొని రెండు కాళ్లనూ వంచి పైకి లేపాలి. పొట్టను లోపలికి పీల్చి చేతులు రెండు గాల్లోకి లేపి 20 అంకెలు లెక్కపెట్టి రిలాక్స్‌ అవ్వాలి.
 • ముందు చెప్పిన భంగిమలోనే ఉండి కాళ్లని, చేతుల్ని మడిచి కుడి మోచేయి, ఎడమ మోకాలిని తాకేలా వంగాలి. ఇలా రెండో వైపు కూడా చేయాలి.
 • ట్విస్టర్‌ మీద నిలబడి సాధ్యమైనంత మేరకు శరీరాన్ని అటూ, ఇటూ తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు శరీర కిందిభాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇలా 50 రిపిటిషన్స్‌ చేయాలి.

గమనిక : వ్యాయామాలను మొదటి సారి ప్రయత్నించే వారు తగిన గైడెన్స్ తో ప్రారంభించాలి. ప్రతి వ్యాయామం యొక్క పొజిషన్స్ మరియు విధానాలను పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాతే చేయాలి.

సన్కని నడుము కొరకు హోమ్ రెమెడీస్

 1. ఆపిల్ సీడర్ వినిగర్ : ఆపిల్ సీడర్ వినిగర్ స్మూత్ మరియు సిల్కీ హెయిర్ కోసం ఉపయోగిస్తారని అందరికి తెలుసు. కానీ ఇది శరీరంలోని కొవ్వును తగ్గించటానికి కూడా ఉపయోగపడుతుంది. ఆపిల్ సీడర్ వినిగర్ తో 20 నుంచి 30 నిముషాల పాటు మీ నడుముపై మసాజ్ చేయండి. వట్టి ఆపిల్ సీడర్ వినిగర్ కాకుండా కొంత ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో 1 స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ను కలిపి ఉపయోగించవచ్చు. మసాజ్ చేసిన తరువాత ఒక హాట్ ప్యాక్ ని అప్‌లై చేసి శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.
 2. బ్రౌన్ షుగర్ తో కాఫీ : కాఫీ శరీరంలోని కొవ్వుని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్‌ ని మెరుగు పరుస్తుంది. తద్వారా ఇది నడుము సన్నగా అవ్వటానికి సహాయపడుతుంది. రెండు స్పూన్ కాఫీ ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ మరియు ఒక స్పూన్ తేనెని కలిపి ఒక స్క్రబ్ ని తయారు చేయాలి. ఈ స్క్రబ్ తో మీ నడుం భాగంపై 6-8 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 10 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగండి. ఇలా వారానికి 4-5 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 3. సీ సాల్ట్ మరియు కొబ్బరి నూనె : సీ సాల్ట్ లో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఉప్పుని కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది కొవ్వును కరిగించి కండరాలను టోన్ చేస్తుంది. రెండు స్పూన్ కొబ్బరి నూనె మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి ఈ మిశ్రమంతో చర్మంపై 15 నిముషాల పాటు మసాజ్ చేయండి. తరువాత వేడి నీటి టవల్‌తో హాట్ కంప్రెస్ చేయండి. మరొక 10 నిముషాల తరువాత నీటితో కడిగి శుభ్రం చేయండి.

నడుము చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ కరిగించటానికి బెస్ట్ ఫుడ్స్ / విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్

 1. నిమ్మ మరియు తేనె : ఒక గ్లాస్ వెచ్చని నీటిలో ఒక నిమ్మరసం మరియు రెండు స్పూన్ తేనె వేసి బాగా కలిపి త్రాగాలి. ఇది ఉదయం వట్టి కడుపుతో త్రాగితే మంచి ఫలితాలను ఇస్తుంది.
 2. అల్లం : అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అనారోగ్య సమస్యలనే కాదు, అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే పొట్టలో పిహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెటబాలిక్ రేట్ ని పెంచడానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకొని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి వడకట్టి తాగాలి.
 3. ఓట్స్ బ్రాన్ : ఓట్స్ బ్రాన్ లో 18 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ లో ఓట్స్ బ్రాన్ కలిపి ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. ఇది చెడు కొవ్వును తొలగిస్తుంది.
 4. స్వీట్ పొటాటో : స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. దాంతో ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. కనుక దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేర్చుకోండి.
 5. గోధుమ : నడుము చుట్టు పేరుకున్న కొవ్వును కరిగించుకోడానికి గోధుమ సహాయపడుతుంది. తృణధాన్యాలతో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి.
 6. బ్లాక్ రైస్ : బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా మరియు షుగర్స్ తక్కువగా ఉంటుంది. కనుక ఫ్యాట్ ని కరిగించటానికి సహాయపడుతుంది.
 7. వైట్ టీ : వైట్ టీ లిపోలిసిస్ ను పెంచుతుంది. ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది. కొవ్వు చేరడానికి కారణమయ్యే ఫ్యాట్ సెల్స్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంతో కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది.
 8. బ్లాక్ బీన్స్ : బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వుని కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
 9. అవొకాడో : అవొకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవొకాడో ని సలాడ్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
 10. చిక్ పీస్ : ఇందులో ప్రోటీన్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పాస్తాలో కంటే ఇందులో ఫైబర్ నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. కొవ్వును తగ్గించి కండరాలను బిల్డ్ చేయడంలో ఇది ఒక బెస్ట్ డైట్ గా పనిచేస్తుంది.
 11. పచ్చి బఠానీలు : ఇవి క్రంచీ స్నాక్స్. ఒక కప్పు పచ్చి బఠానీలలో 7 గ్రాముల ప్రోటీన్స్, 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. స్నాక్స్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది.
 12. డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువుని తగ్గిస్తుంది. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువ.
 13. బాదంలు : బాదంలలో డైటరీ ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు బాదంలో 20 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఇంకా వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్స్ అధికం.
 14. గ్రేప్ ఫ్రూట్ : గ్రేప్ ఫ్రూట్ బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో్ ఫైటో కెమికల్స్ అధికంగా ఉన్నాయి.
 15. చియా సీడ్స్ : చియా సీడ్స్ లో ఉండే ప్రోటీన్ ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉండే ఫీలింగ్ ను కలిగిస్తుంది. దాంతో వేరే ఇతర ఆహారాలు తినకుండా కంట్రోల్ చేస్తుంది.
 16. హాట్ పెప్పర్ : హాట్ పెప్పర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 25 శాతం మెటబాలిజం రేటు పంచుతుంది ఇది శరీరంలో క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. తక్కువ ఆకలిని కలిగిస్తుంది.
 17. సెలరీ : ఫ్యాట్ టమ్మీని కరిగించి నడుము నాజూగ్గా మార్చే ఆహారాల్లో సెలరీ ఒకటి. దీన్ని తప్పనిసరిగా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాల్సిందే. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో పాటు ఫిట్ గా చేస్తుంది. ఇది ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
 18. పెరుగు : మీరు విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాల్సిన వాటిలో మరో హెల్తీ ఫుడ్ పెరుగు. దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని, రెగ్యులర్ గా తినాలి. ఫ్లేవర్డ్ యోగర్ట్ ను నివారించి, నేచురల్ గా ఇంట్లో తయారు చేసుకొన్న పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విస్ట్ లైన్ తగ్గుతుంది.

ఆహారం మరియు జీవన శైలిలో చేయాల్సిన కొన్ని మార్పులు

 • కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే బంగాళదుంపలు, తీపి పదార్ధాలు, తెల్లటి పిండి తో చేసిన లేదా రిఫైన్ చేసిన బ్రెడ్, పాస్తా వంటివి తినకండి.
 • ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచేందుకు వీలైనంతవరకు రైస్ వంటి కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించండి. కార్బోహైడ్రేట్లు ఆరోగ్యమైన బరువు వున్నంతవరకు మంచివే. కాని పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు తగ్గించాల్సిందే.
 • తాజా కూరగాయలు అధికంగా తినండి.
 • పండ్లు, బెర్రీల వంటివి తినండి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లే మీకు సరిపోతాయి.
 • గుడ్లు, పప్పులు, లీన్ మీట్, చేప, చికెన్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తినండి.
 • ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె తో వేయించిన కూరలు, చికెన్, ఫిష్ వంటివి తినండి.
 • కొబ్బరి నూనె, ఒమేగా 3 ఉండే చేప నూనె ఉపయోగించండి.
 • ఆఫీస్ లో లేదా అపార్ట్‌మెంట్లలో ఉన్నట్లయితే లిఫ్ట్ కి బదులుగా స్టైర్ కేస్ ని ఉపయోగించండి.
 • మీరు తీసుకునే కేలరీల మొత్తం కనిష్ట స్థాయిలో ఉండాలి. కనుక ఎంత మోతాదులలో తింటున్నారని గమనించండి. అధిక కేలరీలను తీసుకున్నట్లయితే వ్యాయామాల ద్వారా వాటిని కరిగించాలి.
 • ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం చాలా ముఖ్యం. నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే తక్కువ కేలరీలు ఉన్న పదార్థాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలి.
 • మీ శరీరం నుండి టాక్సిన్స్ మరియు కొవ్వును ఫ్లష్ చేయటానికి ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని త్రాగాలి.
 • రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని డైటీషియన్లు అంటున్నారు.
 • కొవ్వు నియంత్రణలో విటమిన్ డి పాత్ర  చాలా కీలకం. విటమిన్ డి తగ్గితే కొవ్వు కరగడం జరగని పని. కాబట్టి ఉదయాన్నే కొంత సేపు సూర్యరశ్మి తగిలే విధంగా వాకింగ్, సైక్లింగ్, యోగా, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
 • నిద్రలేమి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశాలున్నందున రాత్రి పూట వీలైనంత త్వరగా నిద్ర పోవాలి.