Posted on

Telugu tips for cracked heels – పాదాల పగుళ్లు తొలగించటానికి ఉత్తమ హోమ్ రెమెడీస్

అందమైన పాదం అంటే ఎలాంటి పగుళ్లు మరియు నల్లని మచ్చలు లేని పాదమే. కానీ అలాంటి పాదం సులభంగా సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి రోజు మనం మన పాదాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటాము కానీ వాటి పై ఎలాంటి జాగ్రత్తలు లేదా కేర్ తీసుకోము. పాదాల విషయంలో మనకు ఎక్కువ బాధ కలిగించేదే పగుళ్లు. ఇవి ప్రారంభంలో చూసేందుకు వికారంగా ఉంటుంది మరి వీటి యొక్క తీవ్రత పెరిగే కొద్ది నొప్పి కూడా పెరుగుతుంది. పాదాలలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి వీటి యొక్క కారణాలు వీటిని నివారించే పద్దతులను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పాదాలలో పగుళ్లు రావటానికి కారణాలు

కాళ్ల వెనుక మడమ భాగంలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.

 • పొడి గాలి, సరైన కేర్ తీసుకోక పోవటం, సమతుల్యమైన ఆహారం లేకపోవటం, వృద్ధాప్యం, దీర్ఘకాలం పాటు నిలబడి ఉండటం మరియు సరైన బూట్‌లను ధరించక పోవటం.
 • తామర, ఆనికాయ, థైరాయిడ్ మరియు డయాబెటీస్ వంటి కొన్ని వ్యాధుల వలన కూడా పగుళ్లు ఏర్పడతాయి.
 • స్థూలకాయం వలన పాదాలపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి.
 • చలి కాలంలో తగిన తేమ పదార్థాలు చర్మంలో లేకపోవటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.
 • వృధాప్యంలో శరీరంలోని నేచురల్ ఆయిల్స్ తగ్గిపోవటం వలన పగుళ్లు ఏర్పడవచ్చు.
 • ఎక్కువ సమయం పాదాలను నీటిలో ఉంచటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.

పగుళ్ల యొక్క లక్షణాలు

 • చర్మం దురదగా ఉండటం, రెడ్నెస్, వాపు మరియు పీలింగ్.
 • మడమ చుట్టూ చర్మం రఫ్ గా కఠినంగా ఉంటుంది.
 • మొదటి దశలోనే చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి లోతైన పగుళ్లు, రక్తస్రావం మరియు తీవ్ర నొప్పికి దారితీస్తుంది.

పగుళ్లు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు

పగుళ్ల యొక్క కారణాలు తెలుసుకుంటే సులభంగా వాటిని అవాయిడ్ చేయవచ్చు.

 • డ్రై స్కిన్ ఉన్నవారికి ఉదాహరణకు, వారి పాదాలను తేమగా ఉంచడానికి వేర్వేరు చర్యలను ప్రయత్నించాలి. సహజ నూనెలు మరియు క్రీం తో పాదాలను మాయిశ్చర్ చేసుకోవాలి. ఈ ఉత్పత్తులలో ఆల్కహాల్ మరియు చికాకు కలిగించే రసాయనాలు లేకుండా ఉండాలి.
 • పాదాలను తేలికపాటి సబ్బుతో మాత్రమే కడగాలి, తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ వాడాలి.
 • నీరు పుష్కలంగా త్రాగటం వలన చర్మం యొక్క మాయిశ్చర్ లెవెల్స్ బాలన్స్ అవుతుంది మరియు పగుళ్లు ఏర్పడకుండా సున్నితంగా ఉంటుంది.

పాదాల పగుళ్లను తొలగించేందుకు హోం రెమెడీస్

 1. కూరగాయల నూనెలతో మసాజ్ : ఆలివ్ నూనె, సెసెమ్ ఆయిల్, ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె వంటి నూనెలను ఉపయోగించవచ్చు. ముందుగా వెచ్చని సబ్బు నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ప్యూమిస్ స్టోన్ తో బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక నూనెని అప్‌లై చేసి కొంత సేపు బాగా మసాజ్ చేయాలి. ఆ తరువాత సాక్స్ ని తొడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ రెగ్యులర్గా చేయటం వలన పగుళ్లు నయమవుతాయి.
 2. నిమ్మకాయ, ఉప్పు, గ్లిసరిన్, రోజ్ వాటర్ ఫుట్ మాస్క్ : మొదటి దశలో ఉన్న పగుళ్లను క్యూర్ చేసేందుకు ఇది ఒక ఉత్తమ రెమెడీ. ముందుగా వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్ మరియు రోజ్ వాటర్ ని వేసి బాగా కలపాలి. పాదాలను ఈ వెచ్చని నీటిలో కొంత సేపు సోక్ చేయాలి. పాదాలను బాగా స్క్రబ్ చేసి డ్రై స్కిన్ ని తొలగించాలి. ఇప్పుడు థిక్ గ్లిసరిన్ మరియు నిమ్మరసం ని కలిపి పాదాలపై రాసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం చల్లని నీటితో పాదాలను కడగాలి.
 3. పండ్లతో మసాజ్ : బాగా మాగిన అరటి పండు లేదా బొప్పాయి పండును మాష్ చేసి పగిలిన పాదాలపై రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమంగా చేయటం వలన పాదాలకు కావలసిన తేమ పదార్థం అందుతుంది మరియు పగుళ్లు తగ్గుతాయి.
 4. బియ్యం పిండి : ఎక్స్‌ఫోలియేటింగ్‌ స్క్రబ్‌గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడిబారి, పగిలిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి క్రాక్స్ ని సరిచేస్తుంది. బియ్యం పిండికి కొన్ని చుక్కల తేనె, ఆపిల్ సీడర్ వినిగర్‌ ని చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. పాదాల మీద పగుళ్లు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చాలి. గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె రాసి సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ మరియు ఆవాల నూనె : పగుళ్లు పెద్దవై బాధపెడుతూ ఉంటే ప్యారాఫిన్‌ వ్యాక్స్‌తో తక్షణ ఉపశమనం లభిస్తుంది. పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేవరకు వేడి చేసి పూర్తిగా చల్లార్చాలి. రాత్రి పడుకునేముందు పాదాలను వెచ్చని నీటిలో కొంత సేపు నానపెట్టి ఆ తరువాత పగుళ్ల లోపలికి వెళ్లే విధంగా ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్‌లై చేసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా రెండు వారాలు చేయటం వలన పగుళ్ల నుండి ఉపశమనం పొందుతారు.
 6. వేపాకుతో : యాంటీ ఫంగల్‌ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది. గుప్పెడు వేపాకుకు ఒక స్పూన్ పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్‌లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దించాలి.
 7. గోరింటాకు : గోరింటాకును బాగా రుబ్బుకొని పగుళ్లు ఉన్న చోట రాసి ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.
 8. ఆలోవీరా జెల్ : పాదాల మడమ భాగంలోని పగుళ్లను తగించడంలో కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడుక్కొని ఆలోవీరా జెల్ ను పాదాలకు పట్టించడం ద్వార కాళ్ల పగుళ్లను తగ్గించడమే కాకుండా మృదువైన పాదాలను పొందవచ్చు.
Posted on

Telugu remedies for muscle cramps – కండరాల నొప్పిని నివారించే హోం రెమెడీస్

ప్రస్తుత కాలంలో కండరాల నొప్పి ప్రతి ఒక్కరికి వచ్చే ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది ప్రధానంగా యువకులలో లేదా వృద్ధులలో అధికంగా సంభవిస్తుంది. కొన్నిసార్లు కండరాల నొప్పి భారీ వ్యాయామం వలన కలగచ్చు లేదా అధిక సమయం ఒకే పొజిషన్ లో కూర్చొని ఉండటం లేదా నిలబడి ఉండటం వలన కాళ్లు, చేతులు లేదా వెన్నెముక కండరాలలో నొప్పి పుట్టవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో కండరాల నొప్పిని అనుభవించే ఉంటారు. ముఖ్యంగా రన్నర్, అథ్లెట్లు లేదా సైక్లిస్టుల వంటి క్రీడాకారులకు ఇది ఒక సాధారణ సమస్య. వారి చేతి, కాళ్లు, వీపు, కడుపు మరియు ఇతర భాగాలలో కండరాల నొప్పి ఏర్పడుతుంది. ఇది కాకుండా ఒత్తిడి లేదా చిన్న దెబ్బల వలన కూడా కండరాలలో నొప్పి పుడుతుంది.

కండరాలలో తిమ్మిరి

కండరాల క్రామ్ప్స్ అనగా తిమ్మిరి అకస్మాత్తుగా వివిధ కండరాలలో సంభవించే అసంకల్పిత సంకోచాలు. ఈ సంకోచాలు చాలా బాధాకరమైనవి మరియు వివిధ కండరాల సమూహాలను ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా కాళ్ల వెనుక భాగంలో, తొడ వెనుక భాగం మరియు ముందు భాగాలలో క్రామ్ప్స్ ఏర్పడవచ్చు. అంతేకాదు ఉదరం, చేతులు, మరియు పాదాలలో కూడా తిమ్మిరి ఏర్పడవచ్చు.

నిద్రలో ఉన్నప్పుడు తిమ్మిరి ఏర్పడితే వాటి యొక్క తీవ్రమైన నొప్పి వలన మీరు నడవలేక పోతారు. ఆకస్మిక మరియు పదునైన క్రామ్ప్స్ యొక్క ప్రభావం కొన్ని సెకండ్స్ నుండి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కండరాల నొప్పి యొక్క అత్యంత సాధారణ లక్షణం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కండరాలు ఉబ్బడం కూడా జరుగుతుంది.

కండరాలలో తిమ్మిరి ఏర్పడటానికి కారణాలు

కండరాల తిమ్మిరికి అనేక కారణాలున్నాయి. కొన్ని తిమ్మిరి మీ కండరాల మితిమీరిన వాడుక వలన వస్తుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఇది అధికంగా సంభవిస్తుంది.

కండరాలలో గాయాలు మరియు నిర్జలీకరణ కూడా తిమ్మిరిని ప్రేరేపించగలవు. కాల్షియం, పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి కండరాల ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు తక్కువ స్థాయిలో ఉండటం వలన కూడా తిమ్మిరి ఏర్పడుతుంది.

మీ కాళ్లు మరియు పాదాలకు తక్కువ రక్త సరఫరా అవ్వటం వలన మీరు వ్యాయామం లేదా భౌతిక పనులు చేసేటప్పుడు క్రామ్ప్స్ ఏర్పడవచ్చు.

కొన్ని సందర్భాల్లో వైద్య పరిస్థితులు కూడా కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. ఉదాహరణకు: మద్యం సేవించటం, గర్భిణిగా ఉన్నప్పుడు, మూత్రపిండ వైఫల్యం మరియు హైపో థైరాయిడిజం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరికి గృహ చికిత్స

మజిల్స్ లో కలిగే నొప్పి మరియు క్రామ్ప్స్ ని తగ్గించేందుకు కొన్ని ఉత్తమ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని అనుసరించటం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. తరచూ నొప్పి పుట్టడం, క్రామ్ప్స్ యొక్క వాపు తగ్గక పోవడం, దీర్ఘకాలిక నొప్పి వంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించటం మంచిది. కానీ ఇటు వంటి సందర్భాల్లో కూడా ఈ హోమ్ రెమెడీస్ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. మరి వాటి వివరాలను చూద్దాం.

 1. ఎప్సోమ్ సాల్ట్స్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు ఎప్సోమ్ సాల్ట్స్ ఒక మంచి రెమెడీ. వెచ్చని నీటిలో ఒక కప్పు ఎప్సోమ్ సాల్ట్స్ ని వేసుకొని బాగా కలపాలి. ఈ నీటిలో ఒక నాప్‌కిన్ లేదా టవల్ ని ముంచి నొప్పిగా ఉన్న ప్రాంతంపై కంప్రెస్ చేయండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయటం వలన క్రమంగా నొప్పి తగ్గుతుంది. గమనిక : ఈ ప్రక్రియకు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చాలా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది. మీకు గుండె వ్యాధి, బిపి లేదా డయాబెటిస్ వండి వ్యాధులు ఉన్నట్లయితే ఈ ట్రీట్‌మెంట్ చేయ కూడదు. వేరే మార్గాలను ప్రయత్నించండి.
 2. చల్లని లేదా వేడి కంప్రెస్ : వెచ్చని నీటితో స్నానం చేయటం వలన మీ కండరాలు రిలాక్స్ అవ్వటంతో నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. వెచ్చని నీటి వలన మీకు మంట కలుగుతున్నట్లయితే చల్లని నీటితో లేదా ఐస్ ప్యాక్ తో నొప్పిగా ఉన్న చోటు పై కంప్రెస్ చేయండి. ఐస్ కంప్రెస్ చేసేటప్పుడు ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించకుండా ఒక క్లాత్ లో చుట్టి ఒత్తిడిని పెట్టవచ్చు. ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించినట్లయితే నొప్పి ప్రభావం అధికరించవచ్చు. ఈ పద్దతులను రెగ్యులర్గా పాటించటం వలన క్రమంగా నొప్పి తగ్గటం మీరు గమనించవచ్చు.
 3. ఆపిల్ సీడర్ వినిగర్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు వినిగర్ ఒక ఉత్తమమైన మందు. ఒక గ్లాస్ నీటిలో 1-2 స్పూన్ ల వినిగర్ ని కలుపుకొని త్రాగండి. లేదా వినిగర్ ని డైరెక్ట్ గా నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి మసాజ్ చేయండి. ఇది కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
 4. ఎసెన్షియల్ ఆయిల్ : కండరాల నొప్పిని తొలగించడంలో ఎసెన్షియల్ ఆయిల్ చాలా ప్రభావితమైన నూనె. వీటి యొక్క సమ్మేళనం కండరాల నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్, మార్జోరం, డీప్ బ్లూ, బేసిల్, రోమన్ వంటి సమ్మేళనాలు ఉపయోగించండి. ఈ నూనెలను నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి కొంత సేపు మర్దన చేయండి. ఇలా ప్రతి రోజూ 2-3 వారాల పాటు రాయటం వలన మంచి ఉపశమనం పొందుతారు.
 5. పసుపు పేస్ట్ : పసుపులో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 6. బాదం ఆయిల్ మరియు గార్లిక్ ఆయిల్ : ఇక టీస్పూన్ గార్లిక్ మరియు ఒక టీస్పూన్ బాదం ఆయిల్ ను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. నొప్పి ఉన్న మరియు సలుపు వున్న కండరల ప్రాంతంలో అప్‌లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మజిల్ పెయిన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 7. ఆముదం : ఆముదం నూనెని వేడి చేసి కాటన్ ప్యాడ్ మీద వేసి నొప్పి ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తూ సున్నితమైన మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.
 8. యూకలిప్టస్ ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ : కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ మరియు కొద్దిగా రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి సలుపు వున్న కండరాల మీద మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 9. హార్స్ చెస్ట్ నట్ : కండరాల యొక్క నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించడంలో మరియు కండరాల గాయాలను మాన్పడంలో ఈ మూలిక సహాయపడుతుంది. వీటిలో ఎసిన్ అనే నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటితో తయారు చేసిన జ్యూస్ ని అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.
 10. లైమ్ లీవ్స్ పౌడర్ మరియు తేనె : నిమ్మ ఆకులను పేస్ట్ లేదా పౌడర్ చేసి దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి నొప్పి మరియు సలుపు ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తే తక్షణం వాపు మరియు నొప్పి తగ్గిస్తుంది.
 11. ఉల్లిపాయ పేస్ట్ : ఉల్లిపాయను పేస్ట్ చేసి మందపాటి కాటన్ క్లాత్ లో వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులా కట్టుకోవడం వల్ల త్వరగా వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 12. పార్ల్సీ : పార్ల్సేను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో నేరుగా అప్‌లై చేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. కండరాల వాపు మరియు నొప్పిని నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 13. థైమ్ ఆయిల్ : కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ ను నీటిలో వేసి మిక్స్ చేసి ఈ నీటితో కండరాల నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. థైమ్ ఆయిల్ కు కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి కూడా మసాజ్ చేసుకోవచ్చు.
 14. కొంత ఎత్తులో ఉంచాలి : గాయం అయిన లేదా కండరాల పట్టివేతకు గురైనప్పుడు ఆ భాగం కొంత ఎత్తులో ఉండే విధంగా కాళ్ల క్రింద పిల్లో(దిండు)ను అమర్చు కోవడం ఉత్తమం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరిని నివారించేందుకు ఉత్తమ ఆహారం

కండరాల నొప్పిని క్రమంగా తగ్గించేందుకు కొన్ని ఉత్తమమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో చేర్చుకోవటం వలన కండరాల నొప్పిని అవాయిడ్ చేయవచ్చు మరియు ఇదివరకే నొప్పి ఉన్నట్లయితే క్రమంగా నొప్పి తగ్గటానికి కూడా సహాయ పడుతుంది.

 1. దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలు బాగా ప్రసిద్ధి చెందిన మసాలా దినుసులు. ఇందులో అనాల్జేసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు హీలింగ్ లక్షణాలు ఉండటం వలన ఇది కండరాల నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ వెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఒక స్పూన్ తేనె కలిపి త్రాగటం వలన నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అంతే కాదు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
 2. అరటి పండ్లు : అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు పొటాషియం చాలా అవసరం. పొటాషియం యొక్క లోపం వలన కూడా కండరాలలో నొప్పి పుట్టవచ్చు. ప్రతిరోజూ 3-4 అరటి పండ్లను తినటం వలన మీ శరీరానికి కావలసిన పొటాషియం ని అందించగలుగుతారు. ఇది క్రమంగా నొప్పి మరియు క్రామ్ప్స్ ని పూర్తిగా తొలగిస్తుంది.
 3. విటమిన్లు : శరీరం ఫిట్ గా ఉంచేందుకు విటమిన్లు కీలక పాత్రను వహిస్తాయి. విటమిన్ బి1, ఇ మరియు డి యొక్క లోపం వలన కండరాలు డామేజ్ అవటం, బలహీనం కావటం మరియు నొప్పి ఏర్పడుతుంది. మీ కడుపు నొప్పి మరియు క్రామ్ప్స్ ని నిరోధించడానికి మీ రోజువారీ ఆహారంలో అన్ని ముఖ్యమైన పోషకాలనూ చేర్చుకోవడం చాలా అవసరం. మీ ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలను అందించే పదార్థాలను ముఖ్యంగా విటమిన్లను చేర్చుకున్నారని నిర్ధారించుకోండి.
 4. మెగ్నీషియం : మీ శరీరం లో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉంటే కండరాల నొప్పి లేదా క్రామ్ప్స్ కలగచ్చు. ఇందుకొరకు చాలామంది మెగ్నీషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటారు. కానీ మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం. అవిసె గింజలు, పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, నల్ల బీన్స్, కోకో పౌడర్, జీడి పప్పులు మరియు స్విస్ ఛార్డ్ వంటి మార్కెట్లో లభించే అనేక పదార్థాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని మీ డైట్లో చేర్చుకోండి.
  • బీన్స్ మరియు పప్పు ధాన్యాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు వండిన పప్పు ధాన్యాలలో, 71 mg మెగ్నీషియం కలిగి ఉంటే, ఒక కప్పు వండిన బ్లాక్ బీన్స్ లో అంతకు రెట్టింపు (120 mg) మెగ్నీషియం ఉంటుంది. అంతేకాక, వాటిలో ఋతు స్రావ సమయంలో కలిగే నొప్పులను తగ్గించడానికి సహాయపడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
  • పప్పు ధాన్యాల వలే, గింజలు మరియు విత్తనాలలో కూడా మెగ్నీషియం నిలువలు అధికంగా ఉంటాయి. 1 ఔన్స్ (28.3 g) కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలలో 37 mg మెగ్నీషియం ఉంటుంది. 1 ఔన్స్ కాల్చిన బాదం గింజలలో మెగ్నీషియం పరిమాణం రెట్టింపుగా ఉంటుంది. ఇతర గింజలలో కూడా కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. కనుక మీ ఆహారంలో వీటిని తప్పకుండా భాగంగా చేసుకోండి.
  • పాలకూర మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలలో, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో వాటిని భాగం చేరుకోవడం వలన కండరాల నొప్పిని నిరోధించడానికి సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఋతు క్రమ సమయంలో కలిగే నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.
 5. బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ : చాలా కొంత మందికి మాత్రమే మొలాసిస్ గురించి తెలుసు. ఇందులో మెగ్నీషియం స్థాయి చాలా అధికంగా ఉంటుంది. కండరాల నొప్పికి ఇది ఒక గొప్ప నివారిణి. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ ని ఒక కప్పు కాఫీ లో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి. రెండు వారాలలో నొప్పిలోని మార్పుని మీరు చూడగలుగుతారు.
 6. కొబ్బరి నూనె : కొబ్బరి ఒక న్యూట్రిషన్ ఆహారం. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనె కండరాల నొప్పిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు వంటలో 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని ఉపయోగించటం వలన మజిల్ పెయిన్‌ క్రమంగా తగ్గుతుంది.
 7. అల్లం : మజిల్ పెయిన్ నివారించు కోవడంలో అల్లం సహాయపడుతుంది. ఇది సోర్ మజిల్స్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అల్లంలో జింజరోల్స్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ నొప్పిని తగ్గిస్తుంది. కనుక కండరాల నొప్పితో బాధపడుతున్న వారు అల్లం టీ ని రెగ్యులర్గా త్రాగండి. మీ ఆహారంలో కూడా అల్లం ను చేర్చుకోండి.
 8. దానిమ్మ : దానిమ్మలో వివిధ రకాల హీలింగ్ పవర్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మజిల్ డ్యామేజ్ ను నివారిస్తాయి. ఇంకా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దాంతో కండరాల నొప్పి తగ్గించుకోవచ్చు.
 9. బ్లూ బెర్రీస్ : బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైటో కెమికల్స్ మజిల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు ఎలాజిక్ యాసిడ్స్ కండరాల సలుపును తగ్గిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
 10. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల లో క్రామ్ప్స్ కి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
 11. చెర్రీస్ : చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ కండరాలు పునరుత్తేజం పొందుతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఒక గ్లాసు చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల నెప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని నివారించవచ్చు.
 12. బొప్పాయి : తక్షణ శక్తి పొందటానికి బొప్పాయి సహాయపడుతుంది. కేవలం ఒక్క బొప్పాయిలో పొటాషియం 16% అనగా 781 mg ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగు వంటి ప్రోటీన్ సహిత పదార్ధంతో పాటుగా తీసుకున్నప్పుడు ఇది ఎలెక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తూ కండరాలలో కలిగే ఇబ్బందులను సరిచేస్తుంది.
 13. గుడ్లు : ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్డులో కండరాల నిర్మాణానికి అవసరమైన ల్యూసిన్అనే అమైనో ఆమ్లం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. సెలీనియం మరియు ల్యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున గుడ్లు శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.
 14. పాలు : తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులలో ఎముకల యొక్క ఆరోగ్యానికి చాలా అవసరమైన కాల్షియం నిల్వలు అధికంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం అత్యవసరం. ఇది కనుక లోపిస్తే కండరాలలో నొప్పులు అధికంగా కలుగుతాయి. అందువలన, మీరు సహజ పద్ధతులలో కండరాల నొప్పిని తగ్గించాలనుకుంటే పాలు మరియు పెరుగును తీసుకోండి.
 15. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల క్రామ్ప్స్ నుండి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.