Posted on

Yogurt face packs & masks – చర్మ సౌందర్యానికి పెరుగు తో ఫేస్ మాస్క్ మరియు ఫేస్ ప్యాక్

భారత దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆరోగ్యమైన ఆహార పదార్థాలలో పెరుగు కూడా ఒకటి. పెరుగు ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆహార పదార్థం. మార్కెట్ లో లభించే తియ్యని పెరుగు కంటే ఇంట్లో తయారు చేసుకునే పుల్లని పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వంద గ్రాముల పెరుగు లో 2000 కేలరీల ఎనర్జీ ఉంటుంది. అంతే కాదు పెరుగుని చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. మరి పెరుగును ఉపయోగించటం వలన చర్మానికి కలిగే మేలు మరియు ఈ పదార్థాన్ని ఉపయోగించి మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మరియు మాస్క్ వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పెరుగు యొక్క స్కిన్ కేర్ బెనిఫిట్స్

పెరుగు అనేక చర్మ సమస్యలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఇది జిడ్డు చర్మం, పొడి చర్మం, సెన్సిటివ్ చర్మం, అన్ని రకాల చర్మం కల వారికీ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్, జింక్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నందున ఇది చర్మం మీద ఎన్నో అద్భుతాలను చేస్తుంది.

  • చర్మం పై ఉన్న టాన్ ని తొలగిస్తుంది. చర్మం యొక్క రంగుని మెరుగు పరుస్తుంది.
  • చర్మ రంధ్రాలను శుభ్రపరచి ఆక్టివేట్ చేస్తుంది.
  • ముఖంపై ఉండే ఏజ్ స్పాట్స్ ని తొలగిస్తుంది కనుక ఇది ఒక యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియెంట్.
  • చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
  • ఇది చర్మాన్ని అద్భుతంగా కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది.
  • ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
  • పెరుగు గ్రేట్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. పెరుగు లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్‌ సెల్స్ ను తొలగిస్తుంది.
  • పెరుగు ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యేందుకు సహాయ పడుతుంది.
  • చర్మ సమస్యలకు మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను పెరుగు నాశనం చేస్తుంది.
  • జిడ్డు చర్మం ఉన్న వారిలో ఆయిల్ ప్రొడక్షన్ ను నియంత్రిస్తుంది.
  • పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, ప్యాథోజెనిక్, బ్యాక్టీరియా ను నాశనం చేసి చర్మం కాంతివంతంగా మెరుస్తుండేట్లు చేసి రేడియంట్ స్కిన్‌ ని అందిస్తుంది.
  • పెరుగు కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది.
  • ఎండ వేడికి కమిలిన చర్మాన్ని క్యూర్ చేసి స్మూత్ గా చేస్తుంది. అంతే కాదు చర్మం పై ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది మరియు చర్మంలో నేచురల్ ఆయిల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఇంట్లోనే తయారు చేసుకునే పెరుగు ఫేస్ ప్యాక్ మరియు ఫేస్ మాస్క్

పెరుగు వళ్ళ కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నాం కదా. మరి పెరుగుని ఉపయోగించి మన ఇంట్లో సులభంగా లభించే పదార్థాలను జోడించి తయారు చేసుకునే కొన్ని ఫేస్ మాస్క్ మరియు ప్యాక్స్ ని చూద్దాం.

  1. పెరుగు – శనగ పిండి ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 3 టేబుల్ స్పూన్ శనగ పిండి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం పై అప్‌లై చేసి 15-20 నిముషాలు అలాగే ఉంచాలి. 20 నిముషాల తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇది పొడి చర్మం ఉన్న వారికి ఉత్తమమైన ప్యాక్. ఈ ప్యాక్ చర్మానికి ఇన్స్టంట్ గ్లో ని అందిస్తుంది. అంతే కాదు క్రమంగా రాసుకుంటే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది.
  2. ఆలివ్ ఆయిల్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 2-3 టేబుల్ ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం పై అప్‌లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోండి. పెరుగు లోని లాక్టిక్ ఆసిడ్ చర్మంపై ఉండే ముడతల్ని మొటిమల్ని తొలగిస్తుంది.
  3. ఆరంజ్ పీల్ పొడి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 4 టేబుల్ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్ ఆరంజ్ పీల్ పొడి లేదా లెమన్ పీల్ పొడి వేసి కావల్సినంత నీటిని కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. పెరుగు మరియు ఆరంజ్ యొక్క మిశ్రమం చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. క్రమంగా ఈ ప్యాక్ ని వాడటం వలన చర్మం యొక్క రంగు మెరుగవుతుంది.
  4. ముల్తానీ మట్టి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి 1 స్పూన్ నిమ్మరసం కలిపి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖం పై రాసి 10 నిమిషాల తరువాత నీటితో కడగండి. ముల్తానీ మట్టి స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం యొక్క జిడ్డు మరియు డెడ్ సెల్స్ ని తొలగించి మచ్చలను తగ్గిస్తుంది.
  5. నిమ్మ – తేనె – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ముఖం మరియు మెడ పై రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్రపరచి ఇన్స్టంట్ గ్లో ని అందిస్తుంది.
  6. గోధుమ ఊక – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 2 స్పూన్ పెరుగు 1 స్పూన్ గోధుమ ఊక కలిపి ముఖం పై రాసి 20 నిమిషాల తరువాత స్క్రబ్ చేస్తూ నీటితో శుభ్రం చేయాలి. గోధుమ ఊక ఒక అద్బుతమైన ఎక్స్ ఫ్లోయేటర్. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా వాడటం వలన డెడ్ స్కిన్‌ ని మరియు పిగ్మెంటేషన్ ని క్యూర్ చేస్తుంది. పొడి చర్మం ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్.
  7. దాల్చిన చెక్క – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క 2 స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. దాల్చిన చెక్క చర్మానికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది. ఫైన్ లైన్ ని నివారిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మొటిమలను తొలగిస్తుంది. పెరుగుతో కలిపి వాడినట్లయితే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
  8. పెరుగు – తేనె ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో పెరుగు మరియు తేనె ని సమాన మోతాదులలో కలిపి ముఖం పై రాసి 10 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో కడగండి. ఇది అన్ని రకాల చర్మానికి తగిన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ని వేసుకోవటం వలన చర్మం యవ్వనంగా గ్లో అవుతుంది.
  9. పసుపు – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. రెండూ మిక్స్ అయిన తర్వాత ముఖానికి అప్‌లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే డార్క్ స్పాట్స్ పూర్తిగా తొలగిపోతాయి.
  10. పెరుగు – టమోటా ఫేస్ ప్యాక్ : రెండు స్పూన్ పెరుగు మరియు 2 స్పూన్ టమోటా జ్యూస్ ని కలిపి ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని వారాలు చేయటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం యొక్క రంగు మెరుగవుతుంది. పెరుగు లో కలిపిన టమోటా నేచురల్ బ్లీచ్ లా పని చేస్తుంది.
  11. బియ్యం పిండి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగు ఒక టీ స్పూన్ తేనె ని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15-20 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచి 20 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో మొటిమల సమస్య తగ్గుతుంది.
  12. గంధపు పొడి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 1 స్పూన్ గంధపు పొడి 2 స్పూన్ పెరుగు కలిపి ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది అన్ని రకాల చర్మానికి అనుకూలమైన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ని వాడటం వలన చర్మం ప్రకాశవంతంగా అవుతుంది.
  13. తులసి ఆకులు – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక పిడికెడు తులసి ఆకులను బాగా నూరి పేస్ట్ చేసుకొని అందులో కొంత పెరుగుని కలిపి ముఖం పై రాయాలి. రాసిన 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. తులసి చర్మం పై ఉండే మొటిమలను తొలగిస్తుంది. ఇది మొటిమలను కలిగించే బాక్టీరియాతో పోరాడుతుంది. తులసి యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.
  14. దోసకాయ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగును ఒక టీ స్పూన్ దోసకాయ పేస్ట్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో డెడ్ సెల్స్ తగ్గిస్తుంది.
  15. పెరుగు – కలబంద ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో రెండు టీ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్‌లై చేయాలి. 10 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేయండి. ఇది చర్మం పై ఉండే డెడ్ సెల్స్ ని తొలగించి ఇన్ స్టంట్ గ్లో ని అందిస్తుంది.
  16. పెరుగు – ఫ్లాక్ సీడ్స్ ఫేస్ ప్యాక్ : ఒక బౌల్లో నీళ్ళు పోసి అందులో ఫ్లాక్ సీడ్స్ ను (అవిసె గింజలను) 6-7 గంటలు నానబెట్టాలి. మరుసటి రోజున వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో రెండు స్పూన్ల పెరుగు మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకొని 10-15 నిముషాలు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటే పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.
  17. ఓట్ మీల్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తరువాత 20 నిముషాలు ఉంచి మంచి ఫేషియల్ క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి ట్రై చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.
  18. పెరుగు – ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ : ఒక గుడ్డులోని వైట్ ను బౌల్లో తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఫ్రెష్ పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేషియల్ ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక సారి ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల యంగర్ లుక్ ను మీ సొంతం చేసుకుంటారు.
  19. కోకనట్ మిల్క్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంలోని డార్క్ స్పాట్స్ మీద అప్‌లై చేయాలి. 15-20 నిముషాలు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను రోజూ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.
Posted on

Telugu tips to balance breast size during breast feeding? – శిశువుకు తల్లి పాలు ఇచ్చే సమయంలో రొమ్ము సైజ్ ని బాలన్స్ చేయటం ఎలా?

ప్రతి స్త్రీ తన రొమ్ముల యొక్క సైజ్ సరైన పరిమాణంలో ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే, అందమైన శారీరక ఆకారం పొందేందుకు ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇందుకు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. మరి పిల్లలు పుట్టగానే బాధ్యతలు పేరుగుతాయి. శిశువు యొక్క ఆహారం, కంఫర్ట్ మరియు నిద్ర గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో ఒక ముఖ్యమైన బాధ్యత శిశువుకు సరైన ఆహారాన్ని అందించటం. తల్లి పాలు ఇవ్వటం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. తల్లి పాలను ఇవ్వటం వలన శిశువుకు మాత్రమే కాదు తల్లి యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి తల్లి పాలు ఇచ్చే సమయంలో రొమ్ముల యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎంత ఎక్కువగా తల్లి పాలు ఇస్తారో దానికి తగినట్లు ఎక్కువ పాలు పేరుకొని పరిమాణం కూడా పెద్దగా అవుతుంది.

మొదట్లో తల్లి పాలు ఇచ్చే విధానం తెలియనప్పటికీ క్రమంగా అలవాటుపడి సులభంగా శిశువుకు పాలు ఇస్తారు. ఈ పద్దతిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తల్లి పాలను ఇవ్వటంతో పాటు సరైన బ్రెస్ట్ సైజు ని కూడా మైన్టైన్ చేయవచ్చు. మరి తల్లి పాలు ఇచ్చే సమయంలో రొమ్ముల యొక్క సైజ్ ను బాలన్స్ చేస్తూ పాలు ఎలా ఇవ్వాలి అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు రొమ్ములను బాలన్స్ చేయటం ఎలా?

  1. తక్కువ పాలు ఉన్న రొమ్ము నుండి ప్రారంభించండి : తక్కువ పాలు ఉన్న రొమ్ము నుండి పాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. తక్కువ పాలు ఉన్న వైపు మొదట ఇవ్వటం వలన శిశువు మొత్తం పాలు తాగటం వలన అటువైపు ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. మీ శిశువు మొత్తం పాలను త్రాగిందని మీరు ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఎంత త్రాగితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. కనుక మొదట తక్కువ పాలు ఉన్న వైపు నుండి ప్రారంభించండి. క్రమంగా రెండు రొమ్ముల యొక్క పరిమాణం సమానంగా అవుతుంది.
  2. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఇరువైపుల రొమ్ము పాలనూ అందించండి : ఒకే పక్కన పాలను ఇవ్వటం వలన చన్ను నొప్పి పుడుతుంది. కనుక రెండు రొమ్ముల్లోనూ మారుస్తూ పాలను ఇవ్వాలి. ఒక వైపు పాలు పూర్తవగానే మరో వైపు పాలను మీరు పంప్ చేయకూడదు. మీ శిశువే పాలను త్రాగగలరు. కనుక ఇరువైపులా మారుస్తూ పాలు ఇవ్వండి. ఏదైనా ఒక వైపు తక్కువ పాలు త్రాగినట్లయితే అటువైపు తక్కువ పాలు ఉత్పత్తి అయితే సరిపోతుందని సూచన.
  3. 15 -20 నిమిషాలు పాలు ఇవ్వండి : మీ శిశువుకు 15-20 నిమిషాల పాటు పాలు ఇవ్వటం అలవాటు చేయాలి. ఇలా చేయటం వలన తల్లికి శారీరక బలహీత కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చన్ను నొప్పి కూడా కలగదు. అంతే కాదు మొదటి 15 నిమిషాలు అందించే పాలలోనే అధిక శాతం పోషకాలు ఉంటాయి. కనుక ఇది శిశువు యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది.
  4. బ్రెస్ట్ సైజ్ ని పెంచటం : తల్లి పాలు ఇచ్చే సమయంలో మాములుగా రొమ్ముల యొక్క పరిమాణం పెరుగుతుంది. కానీ కొందరికి మునుపటి లానే చిన్నగానే ఉంటుంది. మరి వాటి పరిమాణంను పెంచటం ఎలా? ఇందుకు ఒకటే మార్గం ఎక్కువగా తల్లి పాలను ఇవ్వడం. ఏ వైపు రొమ్ము చిన్నగా ఉందని అనిపిస్తుందో అటువైపు రొమ్ము పాలను ముందుగా శిశువుకు అందించండి. ఆ తరువాత మరో రొమ్ము పాలను ఇవ్వండి. ఇలా చేయటం వలన మొతటి వైపు పూర్తి పాలు డ్రైన్ అయిపోతుంది. దీని ఫలితంగా అటువైపు అధిక పాలు ఉత్పత్తి అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే, ఎంత ఎక్కువగా శిశువు పాలను త్రాగుతారో అంత వేగంగా మరియు అంత అధికంగా పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇలా సహజంగా బ్రెస్ట్ యొక్క పరిమాణం పెరుగుతుంది.

వైద్యులు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ నే సిఫారసు చేస్తారు. ఎందుకంటే ముందుగానే చెప్పినట్లు ఇది శిశువుకు కావలసిన పోషకాలను అందిస్తుంది అలాగే తల్లి యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది. తల్లి పాలలో ఉండే పోషకాలు మనం కొనే ప్యాకెట్ పాలలో ఉండవు. కొన్ని కారణాల వాళ్ళ కొందరు తల్లి పాలను ఇవ్వలేక పోవచ్చు. ఉదాహరణకు : ఇన్వర్టెడ్ నిపిల్స్, తగినంత పాల ఉత్పత్తి లేకపోవటం మొదలైన కారణాలు. తగినంత పాల ఉత్పత్తి లేకపోతే, ఏ రొమ్ములో తక్కువ పాలు ఉత్పత్తి అవుతుందో ఆ రొమ్ము పాలను ముందుగా అందించండి. క్రమంగా పాల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఒకే వైపు రొమ్ము పాలను ఇవ్వటం వలన అటువైపు మాత్రమే పాల ఉత్పత్తి అధికరించి ఓవర్ ఫ్లో అవుతుంది.

మరి ఈ చిట్కాలను పాటించి మీ శిశువు ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని మరియు మీ శారీరక ఆకృతిని కూడా కాపాడుకోండి.

Posted on

Best pedicure tips in Telugu – మహిళలకు ఉత్తమ పెడిక్యూర్ చిట్కాలు

స్త్రీలు అందంగా కనపడేందుకు ఎన్నో రకాల బ్యూటీ కేర్ తీసుకుంటారు. కురులు కొరకు, ముఖం కొరకు, చర్మం పై మచ్చల కొరకు, పింపుల్స్ ఇంకా మానిక్యూర్ మరియు పెడిక్యూర్ వంటివి. ఇది ఒక రకంగా మంచిదే. అందంతో పాటు ఈ జాగ్రత్తల వలన శరీరం శుభ్రంగా విషపదార్థాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ కెమికల్స్ ఉండే ప్రాడక్ట్స్ కాకుండా నేచురల్ గా లభించే పదార్థాలతో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఇక ఈ ఆర్టికల్ లో మనం పెడిక్యూర్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాము. మనం చేతి వేళ్ళు, గోర్లు మాత్రమే కాకుండా పాదాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజూ మనం మన పాదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. మరి అటువంటప్పుడు కళ్లలో తొందరగా మురికి, దుమ్ము, ధూళి పేరుకు పోతుంది. మరి షూస్ వేసుకునే అలవాటు ఉన్నట్లయితే ఎక్కువ గంటలు షూస్ వేసుకోవటం వలన పాదాలలో చెమట పుట్టి దుర్వాసన కలుగుతుంది. పెడిక్యూర్ చేయటం వలన పాదాలు శుభ్రంగా అందంగా అవుతుంది. చలికాలంలో పెడిక్యూర్ చేసుకోవటం చాలా ముఖ్యం. చలికాలంలో మనం ఎక్కువగా షూస్ ని ఉపయోగిస్తాము, అంతే కాదు చర్మం కూడా పొడిబారిపోతుంది. పెడిక్యూర్ చేయటం వలన చర్మం లోని మాయిశ్చర్ లెవెల్స్ బాలన్స్ అవుతాయి. కొన్ని బేసిక్ పెడిక్యూర్ టిప్స్ ని తెలుసుకుని వాటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెడిక్యూర్ అంటే ఏమిటి?

పెడిక్యూర్ అనేది ఒక లాటిన్ పదం. పెడి అంటే పాదం అని, క్యూర్ అంటే జాగ్రత్తలు తీసుకోవటం అని అర్థం. ఇది మీ పాదాలకు మరియు గొర్లకు తీసుకునే జాగ్రత్తలు. పెడిక్యూర్ పాదాలకు మరియు గొర్లకు ఎలాంటి సమస్యా రాకుండా కాపాడుతుంది. గోర్లను కత్తిరించటం, చనిపోయిన చర్మ కణాలను తొలగించటం మరియు పాదాలను మసాజ్ చేయటం ఇందులోని ప్రాసెస్.

పెడిక్యూర్ రకాలు

పెడిక్యూర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు పార్లర్ కి వెళ్లినట్లయితే ప్రతి ఒక్క పార్లర్ లో అనేక రకాల పెడిక్యూర్ చేస్తారు. కానీ పెడిక్యూర్ చేసే పద్దతిని బట్టి మూడు రకాలు:

  1. మినీ పెడిక్యూర్ : ఈ పెడిక్యూర్ లో పాదాలను నానపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం గోర్లను కత్తిరించి షేప్ చేసి నైల్ పాలిష్ ని రాసుకోవాలి.
  2. రెగ్యులర్ పెడిక్యూర్ : ఈ పద్దతిలో పాదాలను నానపెట్టి, స్క్రబ్ చేసి, గోర్లను కత్తిరించి షేప్ చేసి పాలిష్ వేయాలి.
  3. ఫ్రెంచ్ పెడిక్యూర్ : రెగ్యులర్ పెడిక్యూర్ చేసిన తరువాత నైల్ పాలిష్ వేసేటప్పుడు ముందుగా పింక్ రంగు పాలిష్ వేసి టిప్స్ లో వైట్ నైల్ పాలిష్ వేయాలి. ఇలా వేయటం వలన పాదాలు మరింత అందంగా కనబడతాయి.
  4. మరి కొన్ని రకాల పెడిక్యూర్ : ఐస్ క్రీం పెడిక్యూర్, స్టోన్ పెడిక్యూర్, పారాఫిన్ పెడిక్యూర్, చాకొలేట్ పెడిక్యూర్ ఇంకా ఎన్నో…

ఉత్తమ పెడిక్యూర్ చేసుకొనే పద్దతి

  1. కావలసిన పదార్థాలు : పెడిక్యూర్ చేసేందుకు క్రింద చెప్పినటువంటి వస్తువులను రెడీ గా ఉంచుకోవాలి. నైల్ పాలిష్ రిమూవర్, క్యూటికల్ ఆయిల్, టవల్, పెద్ద గిన్నె, ఫుట్ స్క్రబ్, నెయిల్ క్లిప్పర్, హ్యాండ్ టవెల్, బేస్ కోట్, ఫుట్ లోషన్ మొదలైనవి.
  2. నైల్ పోలిష్ రిమూవర్ : నెయిల్ పాలిష్ ని వేసుకున్న తరువాత దాన్ని తొలగించటం చాలా మంది మర్చిపోతారు. కొన్ని రోజుల తరువాత అక్కడక్కడ నైల్ పోలిష్ ఉండిపోతుంది. వాటిని తొలగించేందుకు ఒక పత్తిని రిమూవర్ లో ముంచి గోర్లపై రుద్దండి. నాన్ అసిటోన్ రిమూవర్ కి బదులుగా అసిటోన్ రిమూవర్ ని ఉపయోగించటం వలన గోరులకు ఎలాంటి హానీ కలగదు.
  3. పాదాలను నానపెట్టడం : ఒక పెద్ద గిన్నెలో వెచ్చని నీటిని పోసి కొంత ఉప్పుని కలిపి ఆ నీటిలో మీ పాదాలను నానపెట్టండి. ఇలా చేయటం వలన మీ పాదాలలోని నొప్పి తగ్గుతుంది. అలా 20-30 నిమిషాలు నానపెట్టిన తరువాత టవల్ తో పాదాలను మృదువుగా తుడవాలి.
  4. క్యూటికల్ ఆయిల్ : పాదాలను వెచ్చని నీటి నుండి తీసిన వెంటనే మీరు చేయాల్సిన తదుపరి విషయం క్యూటికల్ ఆయిల్ ని రాయటం. పాదాలపై ముఖ్యంగా గోరులపై రాసి ఒక వుడెన్ స్టిక్ తో మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన గోరు చుట్టూ ఉండే చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు.
  5. స్క్రబ్ : ఆయిల్ తో గోరులపై ఉన్న డెడ్ సెల్స్ ని తొలగించిన తరువాత స్క్రబ్ ని ఉపయోగించి పాదాలు మరియు కాళ్లను మసాజ్ చేయాలి. గ్రానులర్ ఫుట్ స్క్రబ్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మోకాలి నుండి పాదాల వరకు స్క్రబ్ ని రాసి మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన కాళ్లు మరియు పాదాలలో మాయిశ్చర్ బాలన్స్ అవుతుంది. చర్మం పొడిగా ఉండే ప్రాతంలో అధిక ఒత్తిడితో మసాజ్ చేయండి.
  6. నెయిల్స్ ని ఫైల్ చేయటం మరియు హైడ్రేట్ చేయటం : ఫైలింగ్ అంటే గోర్లను కత్తిరించి షేప్ చేయటం. స్క్రబ్ చేసిన తరువాత పాదాలను వెచ్చని నీటితో కడిగి టవల్ తో తుడవాలి. పాదాలలో మాయిశ్చర్ ఇంకా ఉండగానే గోర్లను కత్తిరించి షేప్ చేసుకోవాలి. షేప్ చేసేటప్పుడు గోరుల సైడ్స్ నుంచి ప్రారంభించండి. ఫైలింగ్ చేసిన తరువాత కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ని గోరులపై అప్‌లై చేయండి. ఇలా చేయటంవలన గోరులు మృదువుగా హైడ్రాటెడ్ గా ఉంటాయి. ఆ తరువాత కావాలంటే నైల్ పాలిష్ ని వేసుకోవచ్చు లేదా అలాగే వదిలేయొచ్చు.

బేసిక్ పెడిక్యూర్ కోసం టిప్స్

  • పెడిక్యూర్ ప్రారంభించే ముందు, ఇదివరకే ఉన్న నైల్ పాలిష్ ని రిమూవర్ తో పూర్తిగా తొలగించాలి.
  • మంచి క్వాలిటీ ఉన్న రిమూవర్ ని ఉపయోగించండి. లేకపోతే నెయిల్స్ పొడిబారిపోతాయి. పైన చెప్పినట్లు అసిటోన్ రిమూవర్ ని ఉపయోగించండి.
  • పాదాలను నీటిలో నానబెట్టేటప్పుడు ఎక్కువ వేడిగా ఉండే నీటిని ఉపయోగించ కూడదు. గోరు వెచ్చని నీటిలోనే నానపెట్టాలి. పాదాలు మృదువుగా అయ్యాయని మీకు అనిపించే వరకు అనగా 4-5 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు నానపెట్టవచ్చు. మీ పాదాల యొక్క చర్మాన్ని బట్టి ఎంతసేపు నీటిలో వుంచాలో మీరే డిసైడ్ చేసుకోండి.
  • బాగా నానిన తరువాత ముఖ్యమైన భాగం డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించటం. గోర్ల చుట్టూ ఉన్న డెడ్ సెల్స్ మాత్రమే కాదు అరి పాదాలలో ఉండే కఠినమైన డెడ్ సెల్స్ ని కూడా తొలగించాలి. ఇందుకు మీరు ప్యూమిస్ స్టోన్ ని ఉపయోగించటం మంచిది. నీటిలో నానపెట్టడం వలన చర్మం మృదువుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో డెడ్ సెల్స్ ని తొలగించటం చాలా సులభం. అంతే కాదు ప్యూమిస్ స్టోన్ తో రుద్దటం వలన మురికి మరియు మలినాలు కూడా తొలగిపోతాయి.
  • మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే సెపెరేట్ గా ఒక పర్సనల్ ప్యూమిస్ స్టోన్ ని ఉపయోగించండి.
  • స్క్రబ్ చేసిన తరువాత రోస్ వాటర్ మరియు ముల్తాని మట్టిని కలిపి పాదాల పై పూర్తిగా రాసి 10-15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. పేస్ ప్యాక్ లానే పాదాలకు గ్లో అందించే ప్యాక్ ఇది.
  • ఆ తరువాత మీ చర్మాన్ని మాయిశ్చర్ చేయటానికి మైల్డ్ మాయిశ్చరైజర్ ని ఉపయోగించండి.
  • చివరిగా నైల్ పాలిష్ రాసిన తరువాత గోరులను చల్లని నీటిలో ముంచటం వలన పాలిష్ తొందరగా ఆరిపోతుంది.
  • చలి కాలంలో పాదాలను మొయిశ్చరైస్ చేయడానికి ఆలివ్ ఆయిల్ ని తరచూ రాస్తూ ఉండండి.