Posted on

Rasmalai sweet recipe in Telugu – రసమలై రెసిపీ

ఏ పండుగ సమయంలోనైనా ఏ ప్రత్యేక సందర్బాలలోనైనా ప్రతి ఒక్కరూ ఇష్ట పడేది తీపి పదార్థాలనే. అందులోనూ పాలతో తయారు చేసే స్వీట్స్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధి చెంది ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో కూడా ప్రతి చోటా అందుబాటులో ఉండే స్వీట్ రసమలై. మరి ఈ స్వీట్ ని ఎంతో సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పాలు – 2 లీటర్లు
  • పంచదారా – 1 బౌల్
  • నిమ్మరసం
  • బాదాం
  • పిస్తా
  • ఏలక్కల పొడి – 1 టేబుల్ స్పూన్
  • జీడీ పప్పులు/ కాజు
  • నీళ్లు

తయారీ విధానం

  • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 లీటర్ పాలను పోసి, అందులో 1/2 కప్పు నిమ్మరసం వేసి బాగా వేడి చేస్తే పాలు విరిగిపోతుంది.
  • పాలు పూర్తిగా విగిరిన తరువాత నీటిని ఫిల్టర్ చేసేందుకు ఒక శుభ్రమైన క్లాత్ తో వడగట్టాలి.
  • విరిగిన పాలలో నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • చక్కెర కరిగిన తరువాత సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ రౌండ్స్ ని వేసి 5 నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి.
  • మరో ప్యాన్ లో 1 లీటర్ పాలు పోసుకొని సన్నటి మంటలో పాలను 30 నిమిషాల పాటు మరిగించాలి.
  • ఆ తరువాత పాలలో 1/2 కప్పు పంచదార, తరిగిన బాదాం, తరిగిన పిస్తా, తరిగిన కాజులు, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందే ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ ముక్కలను పాలలో వేసుకుంటే ఎంతో తియ్యని రుచికరమైన రసమలై రెడీ!
Posted on

Paneer fried rice recipe in Telugu – పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

ఎంతో వేగవంతమైన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్ ‘ఫ్రైడ్ రైస్’. డిన్నర్ కి హోటల్ వెళ్లిన ప్రతి సారి పిల్లలు ఎంతో ఇష్టంగా కోరుకునే ‘పన్నీర్ ఫ్రైడ్ రైస్’ ని ఇంట్లోనే ఎంతో సులువుగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపి కి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • టమోటా కెచప్ – 1 టేబుల్ స్పూన్
  • సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  • మైదా – 1 కప్పు
  • కట్ చేసుకున్న పన్నీర్ – 1 కప్పు
  • తరిగిన గ్రీన్ కాప్సికం – 1 కప్పు
  • తరిగిన క్యారట్ – 1 కప్పు
  • వెల్లుల్లి ముక్కలు
  • నూనె
  • స్వీట్ కార్న్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్
  • వినిగర్ – 1 చిటికెడు
  • ఉడికించిన బియ్యం – 1 కప్పు
  • స్ప్రింగ్ ఆనియన్
  • తరిగిన బీన్స్ – 1 కప్పు

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 టీ స్పూన్ టమోటా కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ సొయా సాస్, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో పన్నీర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె వేసుకొని, అందులో ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసి పక్కన పట్టుకోవాలి.
  • అదే ప్యాన్ లో మరో 2 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
  • తరువాత అందులో 1 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం,  1 కప్పు తరిగిన క్యారట్, 1  కప్పు తరిగిన బీన్స్ వేసి దోరగా వేయించుకోవాలి.
  • వెజిటేబుల్స్ ని దోరగా వేయించిన తరువాత 2 టీ స్పూన్ స్వీట్ కార్న్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ సొయా సాస్ వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు కలుపుకొని వండిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో 1 టీ స్పూన్ వినిగర్ కూడా వేసి కలుపుకోవాలి.
  • ఆ తరువాత ఇంతకు ముందు ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ని వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ!
Posted on

Chicken boneless curry in Telugu – చికెన్ బోన్ లెస్ కరీ రెసిపీ

బోన్ లెస్ చికెన్ ఫ్రై ని ఇష్టపడని వారంటూ ఉండరు. లంచ్ సమయంలో మన మీల్స్ కి మరింత రుచిని చేకూర్చే సైడ్ కొరకైనా, సడన్ డిన్నర్ పార్టీ ప్లాన్ చేసిన సమయంలోనైనా బోన్ లెస్ చికెన్ కరీని ఎంతో తక్కువ సమయంలో సులభంగా చేసుకోవచ్చు. మరి మీ కొరకు ఒక సులభమైన ఇండియన్ చికెన్ బోన్ లెస్ కరీ రెసిపీని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె
  • గుడ్లు – 2
  • పెరుగు – 1 కప్పు
  • కార్న్ ఫ్లార్ (జొన్న పిండి) – 1 కప్పు
  • సోయా సాస్
  • ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • బోన్ లెస్ చికెన్ – 500 గ్రాములు
  • వెల్లుల్లి ముక్కలు
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • తరిగిన పచ్చి మిర్చీలు
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకులు
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • మజ్జిగ – 1/2 కప్పు

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక బౌల్ లో 500 గ్రాముల బోన్ లెస్ చికెన్, కొద్దిగా మజ్జిగ, 1/2 కప్పు కార్న్ ఫ్లార్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నూనె, రెండు కొట్టిన గుడ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అలా కలిపిన మిశ్రమాన్ని 1 గంట సేపు ఊరనివ్వాలి.
  • ఆ తరువాత ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి డీప్ ఫ్రై కి తగినంత నూనెని పోసుకొని బోన్ లెస్ చికెన్ మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • మరో ప్యాన్ ని స్టవ్ పై ఉంచి 2 టీ స్పూన్ నూనె, కొన్ని వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, కొన్ని తరిగిన పచ్చి మిర్చీలు, కొన్ని కరివేపాకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు మరియు సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • బాగా ఫ్రై అయిన తరువాత 1 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బోన్ లెస్ చికెన్ ని ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే! దీనిపై కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ బోన్ లెస్ కరీ రెడీ!
Posted on

Onion pakoda / pakora curry recipe in Telugu – ఆనియన్ పకోడా కరీ / ఉల్లిపాయ పకోడా కరీ రెసిపీ

చపాతీ లేదా పూరీకి ఎన్నో రకాల సైడ్ డిషెస్ ని తినే ఉంటాము. ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేని సమయంలో, కేవలం ఉల్లిపాయలతో మాత్రమే చేసుకునే అతి సులువైన సైడ్ డిష్ ఆనియన్ పకోడా కరీ. ఇందులో కేవలం రెండే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. ఎంతో తక్కువ సమయంలో రుచికరమైన చపాతీ సైడ్ డిష్ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె
  • పెరుగు
  • ఉప్పు
  • కరివేపాకులు
  • పచ్చి మిర్చీలు
  • జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • శనగ పిండి
  • తరిగిన ఉల్లిపాయలు

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక బౌల్ లో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు శనగ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనెని పోసుకోవాలి.
  • పై చెప్పిన విధంగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ శనగ పిండి మిశ్రమాన్ని పకోడీ వలే వేసి డీప్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్ లో మరో కప్పు శనగ పిండి, 1/2 స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • మరియు అందులో 3 టీ స్పూన్ పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ఒక ఫ్యాన్ ఉంచి, 2 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులు, కొన్ని పచ్చి మిర్చీలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ప్యాన్ లోని పదార్థాలు వేగిన తరువాత మనం ఇంతకు మునుపు కలిపి ఉంచుకున్న శనగ పిండి మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ప్యాన్ లో పోసుకోవాలి.
  • ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి.
  • పిండి బాగా ఉడుకుతుండగా మనం మునుపే సిద్ధం చేసి ఉంచుకున్న పకోడీలను ఇందులో వేసుకొని ఉడికించాలి.
  • అంతేనండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆనియన్ పకోడా కరీ రెడీ!