Posted on

How to make Suji ka halwa in Telugu – సుజి కా హల్వా రెసిపీ

భారత దేశంలో ముఖ్యంగా పండుగ సమయాలలో సాంప్రదాయకంగా దేవునికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసుకునే తీపి పదార్థం ‘సుజి కా హల్వా’. దీనిని గోధుమ రవ (సెమోలినా) తో చేస్తారు కనుక ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. మరి ఎంతో సులువైన ఆరోగ్యకరమైన సుజి హల్వా ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నీళ్లు – 500 మిల్లీ లీటర్లు
  • పంచదార – 1 కప్పు
  • నెయ్యి – 1 కప్పు
  • సుజి/సెమోలినా – 2 కప్పులు
  • తరిగిన బాదాం
  • ఎండు ద్రాక్షలు/ కిస్‌మిస్
  • తరిగిన జీడిపప్పులు

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 500 మిల్లీ లీటర్ల నీళ్లు, 250 గ్రాములు లేదా 1 కప్పు పంచదార వేసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • ఈ చక్కెర పాగు చల్లారిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ లో 1 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తరువాత అందులో 2 కప్పుల సుజి ని వేసి దోరగా వేయించుకోవాలి.
  • సుజి గోల్డెన్‌ బ్రౌన్ రంగుకు వచ్చిన తరువాత అందులో తరిగిన బాదాం, కొన్ని కిస్‌మిస్, కొన్ని జీడిపప్పులు వేసి కలుపుతూ 2 నిమిషాలు దోరగా వేయించాలి.
  • ఇప్పుడు అందులో సిద్ధం చేసి ఉంచుకున్న చక్కెర పాగుని చేర్చుకొని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
  • దీన్ని బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్‌స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన ‘సుజి కా హల్వా’ రెడీ!
Posted on

Bengali sweet sandesh recipe in Telugu – సందేష్ బెంగాలీ స్వీట్ రెసిపీ

ఎంతో ప్రసిద్ధమైన సులభమైన బెంగాలీ స్వీట్స్ లో ‘సందేష్ బెంగాలీ స్వీట్’ కూడా ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైన తీపి పదార్థం. మధ్యయుగ బెంగాలీ సాహిత్యాలలో ముఖ్యంగా ‘క్రితిబాస్ రామాయణం’లో సందేష్ అనే తీపి వంటకం ప్రస్తావించబడిందని చెప్తున్నారు. మరి ఎంతో ప్రాచీనమైన రుచికరమైన ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు

  • పాలు – 1 లీటర్
  • నిమ్మరసం
  • కుంకుమ పువ్వు
  • షుగర్ పౌడర్ – 1 కప్పు
  • ఇలాచీ పౌడర్
  • పిస్తా

తయారీ విధానం

  • ఒక ప్యాన్ లో 1 లీటర్ పాలను పోసి మరిగించాలి.
  • పాలను గెట్టిగా చేసేందుకు నిమ్మకాయని పిండి కొంత నిమ్మరసాన్ని పాలలో చేర్చండి.
  • పాలు విరిగిన తరువాత ఒక శుభ్రమైన క్లాత్ తో నీటిని వడగట్టండి.
  • పాలలోని నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలిపి కుంకుమ పువ్వు, 1 కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో వేసుకొని 5 నిమిషాల పాటు దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి చిన్న చిన్న రౌండ్స్ చేసి వాటిపై పిస్తా తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తియ్యని సందేష్ బెంగాలీ స్వీట్ రెడీ!
Posted on

Watermelon milkshake recipe in Telugu – వాటర్ మెలాన్ మిల్క్ షేక్ రెసిపీ

ఎండా కాలం వేడిని తట్టుకొనే ఒక ఉత్తమ మార్గం ఫ్రూట్‌ జ్యూస్ మరియు చల్లని మిల్క్ షేక్స్ ని తాగటం. అందులోనూ వాటర్ మెలాన్ మనల్ని ఎంతో హైడ్రేటడ్ గా ఉంచుతుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఎంతో సులభమైన రుచికరమైన వాటర్ మెలాన్ మిల్క్ షేక్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • వెన్నిలా ఐస్ క్రీం -100 గ్రాములు
  • వాటర్ మెలాన్ – 1 కప్పు
  • పాలు – 1/4 కప్పు
  • ఐస్ క్యూబ్స్ – 2
  • పంచదార – 4 టీ స్పూన్
  • చక్కెర సాన్ఫ్

తయారీ విధానం

  • మిక్సీ జార్ లో 100 గ్రాముల వెన్నిలా ఐస్ క్రీం, 1 కప్పు చిన్నగా తరిగిన వాటర్ మిలాన్ ముక్కలు, 1/4 కప్పు పాలు, 2 ఐస్ క్యూబ్స్, ఆ తరువాత 4 టీ స్పూన్ పంచదార వేసి మిక్సీ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ ని ఒక గ్లాస్ లో పోసుకొని కొద్దిగా వెన్నిలా ఐస్ క్రీం ని చేర్చి, చక్కెర సాన్ఫ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో చల్లని, తియ్యని వాటర్ మెలోన్ మిల్క్ షేక్ తయారు!