Posted on

Vegetable fried rice recipe in Telugu – వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

డిన్నర్‌కి హోటల్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ఆర్డర్ చేసే డిష్ ‘ఫ్రైడ్ రైస్’. అది ఎంతో కష్టమైన డిష్ మరియు ఇంట్లో చేసుకోడం కుదరదని చాలా మంది అభిప్రాయం. కానీ నిజానికి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో డిన్నర్ పార్టీ సమయంలో ఎంతమందికైనా తొందరగా చేయగల డిషస్ లో ఇది కూడా ఒకటి. మరి ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నెయ్యి – 3 స్పూన్
  • వెల్లుల్లి ముక్కలు – 6
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • పచ్చి బఠానీలు – 1/2 కప్పు
  • తరిగిన ఎల్లో కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన బీన్స్ – 1/2 కప్పు
  • తరిగిన రెడ్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన గ్రీన్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన క్యారట్  – 1/2 కప్పు
  • ఉప్పు
  • అన్నం
  • బ్లాక్ పెప్పర్ పౌడర్ – 1 స్పూన్
  • సొయా సాస్ – 1 స్పూన్

తయారీ విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 3 స్పూన్ల నెయ్యి వేసికొని, నెయ్యి బాగా కరిగిన తరువాత 6 వెల్లుల్లి ముక్కలను, 1 తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు తరిగిన ఎల్లో కాప్సికం, 1/2 కప్పు తరిగిన బీన్స్, 1/2 కప్పు తరిగిన రెడ్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన క్యారట్ వేసుకొని 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ 2 నిముషాలు ఫ్రై చేయాలి.
  • మూత వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి.
  • ఆ తరువాత ఉడికించిన బియ్యం అనగా అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సొయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అవసరమైతే కావల్సినంత ఉప్పుని కూడా చేర్చుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే ఎంతో రుచికరమైన ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ తయారు!
Posted on

Aloo egg curry recipe in Telugu – ఆలూ ఎగ్ కరీ రెసిపీ

ప్రతి ఒక్కరికి సులువుగా లభించే బంగాళదుంపలు మరియు గుడ్లను ఉపయోగించి ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. వీటితో తయారు చేసే గ్రేవీ రుచితోపాటు పూర్తి న్యూట్రిషన్ ని కూడా అందిస్తుంది. చపాతీ, పూరి, రోటి లేదా పరోటాకు సైడ్ డిష్ కొరకు ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీని’ ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె
  • గుడ్లు – 3
  • ఉప్పు
  • జీరా – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 2 చిటికెలు
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • తరిగిన టమోటాలు – 1 కప్పు
  • బంగాళదుంపలు
  • అల్లం మరియు వెల్లుల్లి
  • మిరపకాయ – 1
  • కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా 3 గుడ్లను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ పై ఫ్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ల నూనె, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
  • ఆ తరువాత అందులో కొద్దిగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలపాటు దోరగా వేయించుకోవాలి.
  • అందులో 2 చిటికెల పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • తరువాత 1 కప్పు తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • టమోటాలు బాగా కుక్ అయ్యాక అందులో 100 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా వేసి బాగా కలుపుకోవాలి.
  • పై మిశ్రమం బాగా ఉడుకుతున్న సమయంలో కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
  • మరోసారి 100 మిల్లీ లీటర్ల నీటిని పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉరికించాలి.
  • ఆ తరువాత అందులో 1 తరిగిన మిరపకాయలు, కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేడుకొని బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
  • మరోసారి తగినన్ని నీళ్లు (50 మిల్లి లీటర్లు) పోసి 2 నిమిషాలు వేయించి, మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీ’ రెడీ!
Posted on

How to make potato tawa in Telugu – పొటాటో తవా / ఆలూ కే నాన్ రెసిపీ

బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇంకా డిన్నర్, ఏ సమయంలోనైనా బంగాళదుంపలతో ఎన్నో రుచికరమైన వంటలను చేసుకోవచ్చు. సడన్ గా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, లేదా మీ కొరకు తొందరగా ఏదైనా స్నాక్స్ ని చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఈజీ అండ్ క్విక్ పొటాటో తవా రెసిపీ ని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 2
  • నిమ్మరసం – 1 టేబుల్స్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెలుల్లి పేస్ట్ – 1 టేబుల్స్ స్పూన్
  • నూనె
  • పసుపు పొడి – 1 టేబుల్స్ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి తోలు తీసి, చిన్న చిన్న రౌండ్ స్లైసస్ గా కట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
  • నీళ్లు బాగా ఉడుకుతుండగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి బంగాళదుంపలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ వేసి అన్ని స్లైసస్ పై సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక తవా ఉంచి 4 స్పూన్ల నూనెని రాసి బంగాళదుంప స్లైసస్ ని రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే, ఎంతో రుచికరమైన పొటాటో తవా రెడీ!