Posted on

Aloo methi paratha recipe in Telugu – ఆలూ మేతి పరాతా రెసిపీ

ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫన్ లేదా డిన్నర్ సమయంలోనైనా సరే ఎంతో సులువుగా తొందరగా ఆకలిని తీర్చే ఒక ఆహారం ‘ఆలూ మేతి పరాతా’. ఎంతో రుచికరమైన ఈ న్యుట్రీషియస్ పరాతాను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి- 1 కప్పు
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • నూనె
  • బంగాళదుంపలు – 3
  • తరిగిన పచ్చి మిర్చులు – 2
  • కసూరి మేతి – 1 టీ స్పూన్
  • చాట్ మసాలా – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • జీరా – 1 టీ స్పూన్
  • మెంతి ఆకులు – 1 కప్పు
  • అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా -1 టీ స్పూన్
  • బట్టర్ – 2 టీ స్పూన్లు

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • పరాతా యొక్క స్టఫింగ్ ని తయారుచేయడానికి ముందుగా 3 బంగాళదుంపలను కుక్కర్లో ఉడకబెట్టి తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • ఆ తరువాత అందులో చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చులు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె పోసుకొని 1 టీ స్పూన్ జీరా, 1 కప్పు మేతి ఆకులు, వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • పై మిశ్రమంలో మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని దోరగా వేయించి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తయారు చేసి ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీ కర్రతో చిన్నగా తిక్కి మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అన్ని వైపులా పిండితో కవర్ చేసి పరాతా లా తిక్కుకోవాలి.
  • స్టవ్ పై ప్యాన్ ఉంచి బట్టర్ రాసి ప్యాన్ వేడెక్కిన తరువాత పరాతాను రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేలా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ మేతి పరాతా రెడీ!
Posted on

Egg kabab / Egg kebab recipe in Telugu – ఎగ్ కబాబ్ రెసిపీ

ఎగ్ కబాబ్ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్. రుచి మాత్రమే కాదండి, ఇందులోని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గుడ్లలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఎన్నో ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అటువంటి ఇంగ్రీడియంట్ తో ఎంతో రుచికరమైన ఎగ్ కబాబ్ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 1/4 కప్పు
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • బంగాళదుంపలు – 3
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • కొట్టిన గుడ్లు – 2
  • బ్రెడ్ క్రమ్బ్స్
  • ఉడికించిన గుడ్లు – 5
  • జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 1/2 కప్పు
  • తురిమిన మోజరెల్లా చీస్ – 1/4 కప్పు

తయారీ విధానం

  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి అందులో 1 కప్పు నూనె పోసుకొని, నూనె వేడయ్యాక 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
  • ఆ తరువాత ఉడికించి మ్యాష్ చేసుకున్న 3 బంగాళదుంపలను, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2  టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1/2 కప్పు తరిగిన కొత్తిమీర, 1/4 కప్పు తరిగిన మోజరెల్లా చీస్ వేసి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకుంటే కబాబ్ కి కావలసిన మిశ్రమం తయారవుతుంది.
  • ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అందులో ఉడికించిన గుడ్డుని ఉంచి చుట్టూ ఈ మిశ్రమం కవర్ అయ్యేలా స్టఫ్ చేసుకోవాలి.
  • అలా 5 స్టఫ్ చేసుకున్న కబాబ్ లను సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆ కబాబ్లను కొట్టిన గుడ్లలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రమ్స్ లో ముంచి ఫ్రై చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రై చేసేందుకు ఒక ప్యాన్ ని ఉంచి 1 కప్పు నూనెని అందులో పోయాలి.
  • నూనె బాగా వేడెక్కిన తరువాత సిద్ధంగా ఉంచుకున్న కబాబ్ లను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి ఎగ్ కబాబ్ రెడీ!
Posted on

Aloo ka bartha / Aloo ka bharta recipe in Telugu – ఆలూ కా భర్తా రెసిపీ

చపాతీ లేదా పూరికి ఎన్నో రకాల సైడ్ డిషెస్ ని తయారు చేసుకోవచ్చు. అందులోను బంగాళదుంపలతో చేసే సైడ్ డిషెస్ నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధం.

బంగాళదుంపలు వర్షం పొడుగునా అందుబాటులో ఉంటాయి కనుక వాటితో ఎన్నో రకాల వంటలను ఏ సీజన్‌లోనైనా తయారు చేసుకోవచ్చు. మరి వాటితో ఎంతో సులువైన, రుచికరమైన ‘ఆలూ కా భర్తా’ సైడ్ డిష్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • నూనె – 2 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • ఎండు మిరపకాయలు – 1
  • తరిగిన వెల్లుల్లి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 1/2 కప్పు

తయారీ విధానం

  • ముందుగా మూడు బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 ఎండు మిరపకాయ, 1/2 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • తరిగిన కొత్తిమీర కూడ వేసి కలుపుకోవాలి.
  • అన్ని పదార్థాలనూ దోరగా వేయించిన తరువాత మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ కా భర్తా రెడీ!