Posted on

Telugu tips for scalp pimples / acne – స్కాల్ప్ పింపుల్స్ చికిత్సకు హోమ్ రెమెడీస్

మనం సాధారణంగా ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారిని ఎందరినో చూస్తూ ఉంటాము. వాటిని తొలగించేందుకు నేచురల్ హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. మరి ఈ పింపుల్స్ తలపై స్కాల్ప్ లో కూడా వస్తుందంటే మీరు నమ్మగలరా? అవును, కొందరికి మొటిమలు స్కాల్ప్ లో కూడా ఏర్పడతాయి. ముఖంపై వస్తేనే ఎంతో చిరాకుగా ఉంటుంది, మేరీ స్కాల్ప్ పై వస్తే? స్కాల్ప్ ఎర్రగా మారటంతో పాటు చిరాకుగా, నొప్పిగా మరియు గోకుతూ ఉండాలని అనిపిస్తుంది.

మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే తగిన చికిత్సలు మరియు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్టికల్లో స్కాల్ప్ పై మొటిమలు రావటానికి కారణాలేంటి, తగిన డైట్ మరియు హోమ్ రెమిడీస్ ని చూద్దాం.

స్కాల్ప్ పై పింపుల్స్ రావటానికి కారణాలు

పింపుల్స్ యొక్క అత్యంత సాధారణ కారణాలు చర్మంలో అధిక ఆయిల్ ఉత్పత్తి కావటం, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు మరియు చర్మంపై పేరుకుపోయిన మురికి. వీటి వలన ముందుగా స్కాల్ప్ పై బాయిల్స్ లా ఏర్పడి పింపుల్స్ గా మారుతాయి.

చనిపోయిన చర్మ కణాలు మరియు సీబం చర్మాన్ని తడిగా ఉంచినప్పుడు బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశిస్తుంది. ఇందువలన చర్మ కణాలు రంధ్రాల నుండి బయటకు పోలేవు, ఇవి వివిధ రకాలైన మొటిమలకు దారి తీస్తుంది. మొటిమలు చాలా వరకు తీవ్రమైన బాక్టీరియాలు కలిగి ఉంటాయి.

చర్మ రంధ్రాలు మూసుకుపోవటానికి  ముఖ్య కారణాలు

  • హెయిర్ స్ప్రే లేదా జెల్ వంటి హెయిర్ ప్రాడక్ట్స్.
  • రెగ్యులర్గా తల స్నానం చేయకపోవటం వలన పేరుకుపోయి మురికి.
  • వ్యాయామం చేసిన తర్వాత చాలా సమయం మీ జుట్టుని కడగకుండా ఉండటం.
  • స్కాల్ప్ పై అధిక ఫ్రిక్షన్ కలిగించేటువంటి టోపీలు లేదా తలపాగాలు వాడటం.

స్కాల్ప్ పై మొటిమలను మరియు బాయిల్స్ ను నివారించడానికి గృహ నివారణలు

మెంతులు మరియు మెంతాకులు

ఈ రెండింటి లో మొటిమలను తొలగించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. స్కాల్ప్ పై మొటిమలను తగ్గించేందుకు కూడా ఈ పదార్థాలను ఉపయోగించవచ్చు.

మెంతాకులను ఉపయోగిస్తున్నట్లయితే కొంత నీటిని జోడించి ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ మొటిమల పై రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

మెంతులను ఉపయోగిస్తున్నట్లయితే కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పింపుల్స్ పై రాసి 30 నుండి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక సారి లేదా రెండు సార్లు ఈ రెమెడీని ఉపయోగించటం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఆలీ వేరా మరియు పుదీనా ఆకులు

ఈ రెండు పదార్థాలు చర్మ మొటిమలు మరియు బాయిల్స్ ని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పదిహేను పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి. నీటి శాతం 15% తగ్గే వరకు ఉడికించండి. తరువాత, కలబంద జెల్ ను ఈ పుదీనా నీటిలో కలపండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాలని స్కాల్ప్ పై రాయండి. ఈ మిశ్రమాన్ని రాయగానే చర్మంపై చల్లని అనుభూతిని పొందుతారు. ఇలా ప్రతి రోజూ చేయటం వలన ఒకటి లేదా రెండు వారాల్లో ఫలితాలను చూస్తారు.

అల్లం

అల్లంను చిన్న ముక్కలుగా కోసి వాటి నుండి రసం తీసి స్కాల్ప్ పై మొటిమలను నివారించేందుకు ఉపయోగించవచ్చు. అల్లంలో బ్యాక్టీరియాతో పోరాడే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కనుక స్కాల్ప్ పై మొటిమలు చాలా వేగంగా నయమవుతాయి.

బేకింగ్ సోడా

స్కాల్ప్ పై మొటిమలను తగ్గించే మరో మూల వస్తువు బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను కొంత నీటిలో కలిపి స్కాల్ప్ పై రాసి కొంత సేపు మసాజ్ చేసి ఆరిన తరువాత నీటితో శుభ్రం చేయండి. స్కాల్ప్ పై ఉన్న చర్మ రంధ్రాలు జిడ్డు, మురికి మరియు చనిపోయిన చర్మ కణాలచే మూసుకుపోవటం వలన పింపుల్స్ ఏర్పడ్తాయి. బేకింగ్ సోడా ఉపయోగించటం వలన రంధ్రాలు శుభ్రం అవుతాయి మరియు పింపుల్స్ క్యూర్ అవుతాయి.

తేనె మరియు పుల్లని పెరుగు

తేనె మరియు పెరుగును సమాన మొత్తాల్లో కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమలపై రాయాలి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. తేనె మరియు పెరుగు స్కాల్ప్ లోని తేమ పదార్థాన్ని బాలన్స్ చేస్తుంది. ఈ పదార్థాలను ఎంచుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో లభించే మాములు తేనె కాకుండా ఒరిజినల్ తేనెని ఉపయోగించాలి. అలాగే మార్కెట్ లో లభించే తియ్యని పెరుగు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న పుల్లని పెరుగును ఉపయోగించండి.

పసుపు

మొండి మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో పసుపు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కొబ్బరి నూనెని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది స్కాల్ప్ లోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది మరియు జుట్టు ఫాలికల్స్ కు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది చర్మంపై మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో మరియు హెయిర్ ఫాలికల్స్ ని శుభ్రపరచటంలో ఉపయోగపడుతుంది. తల స్నానం చేసిన తరువాత ఒక స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని వెచ్చని నీటిలో కలిపి స్కాల్ప్ ని శుభ్రపరచండి. ఇలా చేయటం వలన ఆపిల్ సీడర్ వినిగర్ స్కాల్ప్ పై ఉన్న బాక్టీరియా మరియు క్రిములతో పోరాడుతుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని వాడండి.

ఆపిల్ సీడర్ వినిగర్ మీ జుట్టును కలుషితాల నుండి కాపాడుతుంది. స్కాల్ప్ లోకి చొచ్చుకుపోయి మొటిమలకు కారణం అయిన బాక్టీరియా మరియు అధిక జిడ్డును తొలగిస్తుంది.

కలబంద

కలబంద లో యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద ఆకు నుండి జెల్ ని తీసి స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి. జెల్ ఆరే వరకు అనగా 15-20 నిమిషాల వరకు ఉంచి ఆ తరువాత వెచ్చని నీటితో కడగండి. వట్టి కలబంద జెల్ కు బదులుగా అర స్పూన్ జెల్ ని 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కలిపి కూడా ఉపయోగించవచ్చు.

వేపాకు

ఈ సహజ హర్బ్ యొక్క అద్భుతమైన లక్షణాలు తామర, సోరియాసిస్, రింగ్ వార్మ్స్ మరియు మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ పరిస్థితులతో సహా అనేక చర్మ మరియు జుట్టు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో క్రిమినాశక మరియు యాంటీ బయాటిక్ లక్షణాలు మొటిమలను వేగంగా మరియు సమర్థవంతంగా నయం చేయటానికి సహాయపడుతుంది.

కొన్ని వేపాకులను నీటిలో వేసి ఉడికించి ఆ తరువాత నున్నటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఆ తరువాత మీ చర్మం యొక్క ప్రభావిత ప్రాంతాలలో ఈ పేస్ట్ ని రాసి 10-15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

మరో విధంగా కూడా వేపను ఉపయోగించవచ్చు. వేపాకు నూనెని కొంత కొబ్బరి నూనెని కలిపి మీ స్కాల్ప్ పై మసాజ్ చేయండి. ఆ తరువాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

తేనె మరియు దాల్చిన చెక్క

ఒక స్పూన్ దాచిన చెక్క పొడిలో రెండు స్పూన్ తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసి మీ స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాయండి. వీలైతే కొన్ని చుక్కల ఆర్గన్ ఆయిల్ ని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమం బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

తేనె లో యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి మరియు ఇది చర్మంలోని తేమను బాలన్స్ చేస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియాని నాశనం చేసి పింపుల్స్ రాకుండా నివారిస్తుంది.

బొప్పాయి పల్ప్

బొప్పాయిని ముక్కలుగా కోసుకొని మిక్సీ లో వేసి నున్నటి గుజ్జులా చేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు మరియు కావల్సినంత తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాసి 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

బొప్పాయి స్కాల్ప్ లోని జిడ్డును మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మీ స్కాల్ప్ లోపలి వరకు చొచ్చుకుపోయి వాపు మరియు మచ్చలను తొలగిస్తుంది.

జాజికాయ పొడి

ఒక జాజికాయను పొడి చేసి, ఈ పౌడర్ లో నాలుగు టేబుల్ స్పూన్ల పాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న బాయిల్స్ మరియు పింపుల్స్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

వెల్లుల్లి

ఒక చిన్న వెల్లుల్లిని మాష్ చేసి స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై కొన్ని సెకండ్స్ రాయండి. ఇది పింపుల్స్ వలన కలిగే నొప్పి నుండి కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణం అయినా ఫాక్టర్స్ తో పోరాడుతుంది. టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ నూనెని సమాన మొత్తాలలో కలపండి. స్కాల్ప్ పై రాసి మసాజ్ చేయండి. ఒక గంట లేదా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

లావెండర్ నూనె

దురదగా ఉండే స్కాల్ప్ మరియు మొటిమల నుండి ఉపశమనం పొందేందుకు లావెండర్ ఆయిల్ సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ లావెండర్ ఆయిల్ ని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు 3-4 టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్ తో కలపాలి. ఈ మూడు పదార్ధాలను బాగా కలిపి స్కాల్ప్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

టమోటా

బాగా పండిన టమోటాతో మీ స్కాల్ప్ పై కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తరువాత ఒక గంట సేపు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. ఇది చాలా సింపుల్ రెమిడి అయినప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

స్కాల్ప్ పై మొటిమలు రాకుండా నివారించేందుకు కొన్ని చిట్కాలు

  • రోజ్ వాటర్ : మొటిమల వలన కలిగే నొప్పి మరియు దురద నుండి తక్షణ ఉపశమనం కోసం రోజ్ వాటర్ ని ఉపయోగించవచ్చు.
  • ఎక్కువ జిడ్డుగా ఉండే హెయిర్ ప్రాడక్ట్స్ ని ఉపయోగించకండి. ఎందుకంటే ఇవి చర్మపు రంధ్రాలను మూసి అధిక మురికి మరియు డెడ్ సెల్స్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
  • వీలైనంత వరకు హెయిర్ జెల్, వాక్స్ మరియు హెయిర్ స్ప్రే ను ఉపయోగించకూడదు.
  • రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం వలన స్కాల్ప్ పై మురికి మరియు చెమట పేరుకు పోతుంది. కనుక క్రమం తప్పకుండా తల స్నానం చేయాలి.
  • అధిక మాయిశ్చర్ మరియు జిడ్డు వలనే పింపుల్స్ ఏర్పడ్తాయి. కనుక తల స్నానం చేసిన తరువాత తేమను పూర్తిగా తుడిచి స్కాల్ప్ ని ఎప్పుడు డ్రై గా ఉంచుకోవాలి.

స్కాల్ప్ మొటిమల కొరకు డైట్ పరిమితులు

స్కాల్ప్ పై మొటిమలు ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు తగిన డైట్ ప్లాన్ కూడా అవసరం.

అవాయిడ్ చేయాల్సినవి

  • అధిక ఆయిల్ గల ఫుడ్స్ ని తీసుకున్నట్లయితే అధిక సీబం ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు. కనుక వీటిని సరైన మోతాదులలో తీసుకోవాలి.
  • మొటిమలు అధికంగా జిడ్డు చర్మం ఉన్న వారికే వస్తుంది. కనుక జిడ్డును తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి డైట్ ని ప్లాన్ చేసుకోవడం అవసరం.
  • ముఖ్యంగా పిజ్జా లాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, ఇందులోని అధిక చీస్ మరియు ఆయిల్స్ చర్మాన్ని మరింత జిడ్డుగా చేసి పింపుల్స్ అధికరించడానికి కారణం అవుతుంది.
  • పాల ఉత్పత్తులను తీసుకొనేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. ఆర్గానిక్ పాల ఉత్పత్తులనే ఉపయోగించాలి.

స్కాల్ప్ పై పింపుల్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • ప్రూనే : ఇందులో అధిక ఐరన్ ఉండటం వలన జుట్టుని మెరుగు పరుస్తుంది.
  • గ్రీన్ టీ : ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలీఫెనోల్స్ అధికంగా ఉండటం వలన డాండ్రఫ్ మరియు పింపుల్స్ ని నివారించేందుకు సహాయపడుతుంది.
  • క్యారట్లు : ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపరచటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది మీ జుట్టుని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.
  • సాల్మన్ : ఈ చేపలో విటమిన్ డి మరియు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ మరియు జుట్టుని హైడ్రేట్ చేస్తుంది.
Posted on

Skin tightening face packs in Telugu – స్కిన్‌ టైటనింగ్ ఫేస్ ప్యాక్స్

చర్మ సంరక్షణ పద్ధతిలో స్కిన్‌ టైటనింగ్ ఒక ముఖ్యమైన భాగం. ఇందుకొరకు మన ఇంట్లోనే లభించే పదార్థాలతో అద్భుతమైన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. ఈ పాక్స్ ని రెగ్యులర్గా వాడటం వలన చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది.

మన ఇంటిలోనే సులభంగా లభించే పదార్ధాలతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లను ఈ ఆర్టికల్ లో వివరించాము. ఇవి మీ చర్మాన్ని టైట్ గా, మృదువు గా మరియు ప్రకాశవంతంగా అయ్యేందుకు సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్గా వాడి మంచి ఫలితాలను పొందండి.

గమనిక : మీకు జిడ్డు చర్మం అయితే, క్రింద చెప్పినటువంటి ప్యాక్ లలో ఆయిల్స్ ని అవాయిడ్ చేయండి.

మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ లను రాసుకున్నప్పుడు డ్రై అయ్యే వరకు ముఖాన్ని కదలించకుండా రిలాక్స్ అవ్వండి.

ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

గుడ్డును పగలగొట్టి అందులోని తెల్లసొన మాత్రమే ముఖంపై రాయండి. బాగా ఆరే వరకు ఉంచి వెచ్చని నీటితో కడగండి. ఈ ప్యాక్ చాలా సులభమైనది కనుక మీరు ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు, అధిక సమయం కూడా అవసరం లేదు.

ఎగ్ వైట్ మరియు పుల్లర్స్ ఎర్త్/ముల్తాని మట్టి ప్యాక్

ఒక గుడ్డు లోని తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, కొన్ని చుక్కల గ్లిజరిన్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని ఒక బౌల్లో వేసుకొని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖం పై రాసి 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత వెచ్చని నీటితో కడగండి.

మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే గ్లిజరిన్ వాడకుండా మిగతా పదార్థాలతో ప్యాక్ ని సిద్ధం చేసి ఉపయోగించండి. అలాగే చాలా డ్రై చర్మం అయితే ముల్తాని మట్టి ని అవాయిడ్ చేయండి. ఇది అధిక జిడ్డును మరియు సన్ టాన్ ని తొలగిస్తుంది.

క్యాబేజీ మరియు బియ్యం పిండి ఫేస్ ప్యాక్

2 లేదా 3 క్యాబేజీ ఆకులను బాగా రుబ్బి మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ ని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నుండి 20 నిమిషాలు ఉంచండి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

క్యాబేజీ ముడతల్ని తగ్గిస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. బాదం నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మీకు జిడ్డు చర్మం అయితే ఆయిల్ ని కలప వద్దు.

క్యాబేజీ మరియు పెరుగు ఫేస్ ప్యాక్

2 లేదా 3 క్యాబేజీ ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల ఆల్మండ్ లేదా ఆలివ్ ఆయిల్ ని వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నుండి 25 నిమిషాల పాటు ఉంచాలి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

పాలు తో ఫేస్ మాస్క్

అర కప్పు పాల పొడిలో కావల్సినంత నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. ఆ తరువాత వెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ ని 2 లేదా 3 సార్లు వాడగానే మీ చర్మం మృదువుగా మారటం గమనించవచ్చు.

బనానా మాస్క్

బాగా పండిన మీడియం సైజ్ అరటి పండును గుజ్జులా చేసి ముఖం మరియు మెడ భాగాలపై రాయండి. 15 – 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. ఈ ప్యాక్ ని ఇంకా ప్రభావితంగా చేయటానికి ఇందులో కొంత తేనె మరియు పెరుగు కూడా చేర్చుకోవచ్చు. అరటి పండు మీ చర్మానికి కావలసిన మాయిశ్చర్ ను అందించటం ద్వారా చర్మాన్ని మృదువుగా మరియు బిగుతుగా చేస్తుంది.

పెరుగు తో ఫేస్ మాస్క్

వట్టి పెరుగును కూడా ఫేస్ ప్యాక్ లా వాడవచ్చు. కావల్సినంత పెరుగును ముఖంపై రాసి, కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. పెరుగు మీ చర్మానికి పునరుత్తేజాన్ని అందిస్తుంది. చర్మపు రంధ్రాలను శుభ్ర పరిచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

పెరుగు, ఆరంజ్ మరియు కలబంద జెల్

ఒక ఆరంజ్ పండు ముక్క లోని 1/4th భాగం మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను కూడా పెరుగులో కలిపి పై చెప్పిన విధంగా ఉపయోగించవచ్చు.

మయోన్నైస్ ఫేస్ మాస్క్

హోల్ ఎగ్ మయోన్నైస్ ని ముఖంపై రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తరువాత 20 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడగండి. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచి స్మూత్ గా చేస్తుంది.  

వోట్మీల్ ఫేస్ ప్యాక్

అర కప్పు వెచ్చని నీటిలో 1/3 కప్పు వోట్మీల్ ని వేసి 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక ఎగ్ వైట్ వేసి మిక్సీ లో బాగా బ్లెండ్ చేయాలి. ఒక చక్కని పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 10-15 నిమిషాల పాటు ఉంచి వెచ్చని నీటితో కడగండి. ఈ మాస్క్ మీ చర్మంలోని మురికి, టాక్సిన్స్ మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగించి మృదువుగా మరియు బిగుతుగా చేస్తుంది.

శనగ పిండి ఫేస్ ప్యాక్

ఒక బౌల్లో శనగ పిండి, ఎగ్ వైట్ మరియు ముల్తాని మట్టిని మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై మరియు మెడపై అప్‌లై చేసి మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.

బియ్యం పిండి మరియు పాలతో ఫేస్ ప్యాక్

2-3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో 2 స్పూన్ పాలు కలిపి ఒక పేస్ట్ లా చేసుకోవాలి.  ఈ ప్యాక్ ని ముఖంపై రాసి 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి సాగిన చర్మంను టైట్ చేస్తుంది దాంతో యవ్వనంగా కనబడతారు. బియ్యం పిండిలో కొద్దిగా పాలు మిక్స్ చేయడం వల్ల చర్మానికి మరింత గ్లో వస్తుంది. చర్మం యొక్క కాంతి మెరగవుతుంది ఇంకా డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోతాయి.

ఓట్స్ అండ్ పెరుగు ప్యాక్

2-3 స్పూన్ ఓట్స్ పొడిని రెండు స్పూన్ పెరుగులో వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి 5 నిమిషాలు సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. ఈ ప్యాక్ మీ చర్మంను ఎక్స్-ఫ్లోయేట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్‌ సెల్స్ ను నివారిస్తుంది. పెరుగు చర్మానికి పోషణ అందిస్తుంది మరియు చర్మం మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి మరియు నిమ్మరసం

2-3 ముక్కల బొప్పాయి మరియు 2 స్పూన్ నిమ్మరసం ను స్మాష్ చేసి ముఖం పై అప్‌లై చేయాలి. బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. ఇది మీ చర్మంను సాఫ్ట్ గా చేస్తుంది మరియు యంగ్ అండ్ గ్లోయింగ్ గా మార్చుతుంది. ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్స్ మరియు పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోతాయి.

Posted on

Swine flu tips in Telugu – స్వైన్ ఫ్లూ – లక్షణాలు, కారణాలు మరియు నివారణ పద్ధతులు

స్వైన్ ఫ్లూ ని H1N1 ఫ్లూ మరియు స్వైన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిని స్వైన్ ఫ్లూ అని పిలవడానికి కారణం, ఇది గతంలో పందులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవారికి సోకేది. కానీ కొంత కాలానికి పందులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అంటువ్యాధివలే సోకడం ప్రారంభమైంది. ఇటీవలే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యాప్తి చెందింది. మరి ఈ వ్యాధి యొక్క కారణాలు, లక్షణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?

స్వైన్ ఇన్ఫ్లుఎంజా అనేది H1N1 అని పిలవబడే ఇన్ఫ్లుఎంజా టైప్ A వైరస్ వలన కలిగే ఒక అంటువ్యాధి. ఇది సాధారణంగా పందులలో కనబడే వైరస్. గతంలో ఈ వ్యాధి పందులలో మరియు వాటి చుట్టూ అధిక సమయం గడిపే వ్యక్తులలో మాత్రమే కలిగేది. కానీ 2009లో, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందటం ప్రారంభమైంది.

స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు

H1N1 వైరస్ శ్వాస అనారోగ్యాన్ని కలిగిస్తుంది మరియు ఇది ఒక అంటువ్యాధి. H1N1 యొక్క లక్షణాలు కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి మరియు క్రింద చెప్పినటువంటి మరి కొన్ని లక్షణాలు కలిగి ఉండవచ్చు.

  • జ్వరం
  • ఒళ్లు నొప్పులు
  • ఆకలి లేకపోవటం
  • దగ్గు
  • గొంతు మంట
  • తలనొప్పి
  • అలసట
  • రన్నింగ్‌ నోస్
  • కళ్లలో ఇర్రిటేషన్
  • వాంతులు, వికారం, మరియు అతిసారం

స్వైన్ ఫ్లూ కారణాలు మరియు సోకే విధానాలు

స్వైన్ ఫ్లూ అనేది పైన తెలిపినట్లు ఇన్ఫ్లుఎంజా వైరస్ యొక్క ఒక రకం వలన సంభవిస్తుంది. ఇది సాధారణంగా పందులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ ఇటీవలే ఈ వైరస్ సోకిన వ్యక్తుల నుండి మరొక వ్యక్తికి కూడా సోకుతోంది. స్వైన్ ఫ్లూ రావటానికి పంది మాంసం తినటం కారణం కాదు. మీరు మాంసంను శుభ్రంగా కడగటం మరియు పూర్తిగా వండటం చాలా ముఖ్యం.

ఈ వ్యాధి సలైవా మరియు శ్లేష్మ కణాల ద్వారా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు మరియు జెర్మ్స్ ఉన్న సర్ఫేస్ ని తాకిన తర్వాత, కళ్ళు లేదా ముక్కును తాకడం ద్వారా ప్రజలలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

స్వైన్ ఫ్లూ అధికంగా ఎవరికి సోకుతుంది?

  • గర్భిణి స్త్రీలకు
  • 5 ఏళ్ళ లోపు ఉన్న పసిపిల్లలకు
  • 65 ఏళ్ళ పైగా ఉన్న వృద్దులకు
  • ఆస్త్మా తో భాధ పడుతున్నవారికి
  • దీర్ఘకాలిక ఆస్పిరిన్ థెరపీని పొందుతున్న 19 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలకు మరియు పిల్లలకు
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రజలకు (AIDS వంటి వ్యాధి కారణంగా)
  • మరియు డయాబెటిస్స్ ఉన్న వారికి ఈ వైరస్ సులభంగా సోకే అవకాశాలు ఎక్కువ.

స్వైన్ ఫ్లూ నిర్ధారణ

మీ డాక్టర్ మీ శరీరం నుండి సాంపుల్ ఫ్లూయిడ్ ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. వైరస్ యొక్క నిర్దిష్ట రకాన్ని గుర్తించడానికి వివిధ జన్యు మరియు ప్రయోగశాల పద్ధతులను ఉపయోగిస్తారు.

స్వైన్ ఫ్లూ చికిత్స

స్వైన్ ఫ్లూ వలన వైద్య సమస్యలు అభివృద్ధి అయ్యేటట్లు ఉంటేనే తప్పా సాధారణంగా ఈ ఫ్లూ కొరకు అధిక వైద్య చికిత్స అవసరం ఉండదు. మీరు చేయాల్సిందల్లా స్వైన్ ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు మరియు H1N1 ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే. వైద్యులు ఇందుకు తగిన యాంటీ వైరల్ డ్రగ్స్ ను సిఫార్సు చేస్తారు.

స్వైన్ ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం పొందుటకు

స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలను నిర్వహించే పద్ధతులు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి:

  • అధిక విశ్రాంతి తీసుకోండి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు ఇన్ఫెక్షన్ పై పోరాడటానికి మరియు తగిన దృష్టి సారించడానికి సహాయపడుతుంది.
  • నిర్జలీకరణాన్ని నిరోధించడానికి నీటిని మరియు ఇతర ద్రవ పదార్ధాలను పుష్కలంగా త్రాగాలి. సూప్ మరియు ఫల రసాలు కోల్పోయిన మీ పోషకాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.

స్వైన్ ఫ్లూ యొక్క తీవ్రమైన కేసులు ప్రాణాంతకం కావచ్చు. HIV లేదా AIDS వంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వారిలో చాలా ప్రమాదకరమైన కేసులుగా మారుతాయి. స్వైన్ ఫ్లూ ఉన్న సాధారణ వ్యక్తుల్లో అధికశాతం మంది నివారణ పొంది సాధారణ జీవనమును సాగించవచ్చు.

స్వైన్ ఫ్లూ నివారించే పద్ధతులు

స్వైన్ ఫ్లూ నివారించడానికి ఉత్తమమైన మార్గం ప్రతి సంవత్సరం ఫ్లూ టీకాలు వేయించుకోవటం. స్వైన్ ఫ్లూ నివారించడానికి మరి కొన్ని ఇతర సులభమైన మార్గాలు:

  • తరచుగా సబ్బుతో చేతులు శుభ్రపరచడం.
  • టెలిఫోన్స్ మరియు టాబ్లెట్ వంటి ఉపరితలాల మీద వైరస్ జీవించగలదు, కనుక వీటిని తాకిన వెంటనే మీ ముక్కు, నోరు, లేదా కళ్లను తాకకుండా ఉండటం.
  • మీరు అనారోగ్యానికి గురైనట్లయితే పని లేదా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం.
  • మీరు ఉన్న ప్రదేశంలో స్వైన్ ఫ్లూ అధికంగా ఉన్నట్లయితే పెద్ద సమావేశాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం.

స్వైన్ ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు మరియు స్వైన్ ఫ్లూ ని నివారించేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • గుడ్లు, చేప, పాలు, బీన్స్, నట్స్, సీడ్స్ మరియు సోయా ఆధారిత ఆహారాల వంటి ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలను ప్రతి రోజూ కనీసం 3 సార్లు తీసుకోవటం వలన స్వైన్ ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
  • నారింజ రంగు పండ్లు మరియు కూరగాయలు (క్యారట్లు, గుమ్మడికాయలు, ఆప్రికాట్లు మరియు మామిడి) మరియు ఆకుపచ్చ కూరగాయలు (పాలకూర, బ్రోకలీ మరియు క్యాబేజీ). ఈ ఆహారాలలోని విటమిన్ ఎ శ్వాస పొరలను బలపరుస్తుంది.
  • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు – మిరియాలు, బచ్చలి కూర, సిట్రస్ పండ్లు, బెర్రీలు, మరియు బటానీలు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి.
  • గుడ్లు మరియు సీ ఫుడ్ (ముఖ్యంగా పీతలు, గుల్లలు మరియు సార్డినెస్), ఇవి స్వైన్ ఫ్లూ సంక్రమణంతో పోరాడటానికి యాంటీ బాడీస్ ని ఏర్పరచటానికి సహాయపడుతుంది.
  • స్వైన్ ఫ్లూ కి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ని నిర్మించే తృణధాన్యాలు మరియు గుమ్మడికాయ విత్తనాలు.
  • యాపిల్స్, బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు – వాటిలో అధిక ఐరన్ ఉంటుంది.
  • లవంగం మరియు వెల్లుల్లి – ఇవి స్వైన్ ఫ్లూకు వ్యతిరేకంగా మరొక రక్షణ.
  • మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి విటమిన్ సి ఒక ముఖ్యమైన పోషకాహారం. మీరు ఫ్లూ కలిగి ఉండగా విటమిన్ సి రిచ్ పండ్లను అల్పాహారంగా తీసుకోండి. స్ట్రా బెర్రీస్, టొమాటోలు, మరియు సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
  • పెరుగు గొంతు ఉపశమనానికి సహాయపడుతుంది మరియు మీ రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. పెరుగులో ప్రోటీన్ కూడా ఉంది. కాని చక్కెర కలపని పెరుగును తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.
  • హైడ్రాటెడ్ గా ఉండటానికి అధిక మొత్తంలో నీరు, హెర్బల్ టీ, తేనె మరియు నిమ్మ టీ మరియు 100 శాతం స్వచ్ఛమైన ఫల రసాలు.

రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు స్వైన్ ఫ్లూ నివారించడానికి మీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు చేర్చడానికి తక్షణ చర్య తీసుకోండి.

స్వైన్ ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు నివారించాల్సిన ఆహార పదార్థాలు

ఫ్లూ తో బాధపడుతున్న సమయంలో ఏ ఆహార పదార్థాలను నివారించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీరు ఫ్లూ వ్యాధికి గురైనప్పుడు, క్రింద వాటిని నివారించండి:

  • మద్యం – ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది మరియు నిర్జలీకరణానికి కారణమవుతుంది.
  • కాఫీ, బ్లాక్ టీ మరియు సోడా వంటి పానీయాలు మీ శరీరాన్ని మరింత డిహైడ్రాట్ చేయగలవు.
  • గట్టిగా ఉండే జంక్ ఫుడ్స్ – చిప్స్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు దగ్గు మరియు గొంతు నొప్పిని అధికరిస్తుంది.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు –  ప్రాసెస్ చేసిన ఆహారాలలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని మరింత పెంచడాన్ని పూర్తి పోషక ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కనుక ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా నివారించాలి.

స్వైన్ ఫ్లూ నివారించడానికి అత్యుత్తమ హోం రెమెడీస్

తులసి ఆకులు

ప్రతి రోజు ఉదయం ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇది గొంతు మరియు ఊపిరితిత్తులను క్లియర్ గా ఉంచుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తిని బలపరచి అంటువ్యాధులు రాకుండా సహాయపడుతుంది.

గిలొఐ

దీనిని వైద్య పరంగా టినోస్పోర కార్డిఫోలియా అని అంటారు. సాధారణంగా ఈ మొక్క అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది. ఒక అడుగు పొడవు గల గిలొఐ కొమ్మ మరియు 5-6 తులసి ఆకులను తీసుకొని 15-20 నిమిషాలు నీటిలో మరిగించి రుచి కోసం కొంత నల్ల మిరియాలు, ఉప్పు కలపండి. ఈ నీరు వెచ్చగా అయిన తరువాత వడగట్టి తాగాలి. ఇది మీ రోగనిరోధక శక్తి కొరకు అద్భుతంగా పని చేస్తుంది. ఈ మొక్క అందుబాటులో లేకపోతే, హందార్ద్ లేదా ప్రోసెస్ చేసిన గిలొఐ పొడిని పొందవచ్చు. ఈ కషాయంను రోజుకు ఒకసారి త్రాగాలి.

కర్పూరం

కర్పూరంను నెలలో ఒక్క సారి కాని రెండు సార్లు కాని తీసుకోవాలి. దీనిని పెద్ద వాళ్ళు నీటితో పాటు మింగవచ్చు. పిల్లలకు దీనిని తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి బంగాళదుంపల గుజ్జుతో లేదా అరటితో పాటు తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్పూరాన్ని ప్రతిరోజూ తీసుకోకూడదు. కానీ ప్రతి సీజన్లో ఒకసారి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

వెల్లుల్లి

ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరు వెచ్చని నీటితో పాటు మింగాలి. వెల్లుల్లి కూడా మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

గోరు వెచ్చని పాలు

పాల అలర్జీ లేని వారు, ప్రతి రోజు రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పసుపును కలుపుకొని త్రాగాలి.

కలబంద

సాధారణంగా కలబంద అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ అలీ వేరా జెల్ ని నీటిలో కలుపుకొని త్రాగితే మన చర్మం మరియు కీళ్ల నొప్పుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

వేప

వేపలో ప్రత్యేకమైన గాలి శుద్ధి లక్షణాలు ఉంటాయి. అన్ని రకాల ఫ్లూ తో సహా, గాలి ద్వారా వచ్చే అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజూ 3-5 తాజా వేప ఆకులను నమిలితే రక్తం శుద్ది అవుతుంది.

విటమిన్ సి

సిట్రస్ పండ్లు,ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆమ్లా (భారత ఉన్నత జాతి పండు రకము) రసంను తీసుకోవాలి.

ప్రతి రోజు ప్రాణాయామం చేయండి

ప్రతి రోజు ఉదయం రెగ్యులర్ గా జాగింగ్ లేదా వాకింగ్ చేస్తే గొంతు మరియు ఊపిరితిత్తులను మంచి స్థితిలో ఉంచటానికి సహాయం చేస్తుంది. ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల మీద దాడి చేయకుండా మరియు అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా మీ శరీరం యొక్క ప్రతిఘటన అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.

Posted on

Telugu tips for weakness – బలహీనతకు/వీక్నెస్ ఉత్తమ హోమ్ రెమిడీస్

కొందరు ఎటువంటి కారణం లేకుండా నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. ఉదయాన్నే నిద్ర నుండి లేచినప్పుడు, శారీరక బలం లేకపోవటం వలన బలహీనంగా భావిస్తారు. ఇలా ఉండటంవలన రోజువారీ ఆక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొన లేరు. కొన్ని నిమిషాలు పని చేసిన వెంటనే చాలా మందంగా, నిదానమైన అలసటతో బాధపడతారు.

మీరు కొన్ని వైద్య పరిస్థితులు లేదా శస్త్రచికిత్స నుండి తిరిగి వచ్చి ఉంటే, బలహీనంగా అనిపించవచ్చు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ప్రజలు చాలా బలహీనంగా ఉంటారు. అటువంటి వీక్నెస్ నుండి మునుపటి జీవనశైలిని తిరిగి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. వైద్యులు ఇటువంటి అలసటను తొలగించి బలాన్ని పెంచటానికి టానిక్స్, విటమిన్స్ మరియు ఖనిజాల వివిధ రకాల మందులను సూచిస్తారు. కానీ, అటువంటి  ఔషధాలను వాడకూడదనుకుంటే మీ నీరసాన్ని తొలగించే మరి కొన్ని విధానాలు ఉన్నాయి. అవే మన హోమ్ రెమెడీస్. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ఆర్టికల్ లో మన వీక్ నెస్ ను తొలగించే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి చూద్దాం రండి.

బలహీనతకు గృహ నివారణలు

వివిధ పండ్లు మరియు కూరగాయలలోని అవసరమైన పోషకాల ద్వారా మీ శరీరానికి కావలసిన శక్తిని అందించవచ్చు. ఈ క్రింద చెప్పినవి కొన్ని గృహ నివారణలు :

జిన్సెంగ్

సాంప్రదాయ ఔషధం లో జిన్సెంగ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి మరియు బలహీనంగా ఉన్నప్పుడు శక్తి స్థాయులను పెంచేందుకు సహాయపడుతుంది. ఈ హెర్బ్ యొక్క కామింగ్ మరియు సూతింగ్ లక్షణాలవలన ఇది మీ నరాలలో కూడా ప్రశాంతతను నింపేందుకు సహాయపడుతుంది, అంటే మీ నరాలను రిలాక్స్ చేస్తుంది.

జిన్సెంగ్ను ఉపయోగించడానికి, ముందుగా వీటి వేర్లను సన్నటి ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత సన్నటి మంటలో 3 కప్పుల నీటిలో ఈ వేర్ల యొక్క 8-10 ముక్కలను వేసి 15 నిముషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత వడగట్టి కొంత తేనెని కలుపుకోండి. వేడి చల్లారిన తరువాత త్రాగండి. ఇలా రోజుకు 1 లేదా 3 కప్పుల టీ త్రాగితే కావలసిన బలాన్ని పొందుతారు.

గమనిక: మీకు అధిక రక్తపోటు అనగా బీపీ ( బ్లడ్ ప్రెషర్ ) ఉన్నట్లయితే ఈ రెమెడీని వాడవద్దు. దయచేసి వేరే మార్గాలను ప్రయత్నించండి.

మ్యాంగోస్

మామిడి పండు చాలా తియ్యగా మరియు జ్యుసీగా ఉంటుంది. ఇది ఒక ఉష్ణ మండల పండు. ఇందులో ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కావలసిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ లు మరియు ఖనిజాలు చాలా ఉన్నాయి. ఇవి మెగ్నీషియం, కాపర్, పొటాషియం మరియు ఆహార ఫైబర్ యొక్క మంచి మూలం. శరీరంలోని ఆర్ బిసి స్థాయిని పెంచడం ద్వారా రక్తహీనత వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో మామిడి లోని ఐరన్ కంటెంట్ సహాయపడుతుంది. ఇందులో స్టార్చ్ కూడా ఉంటుంది, ఇది చక్కెరగా మారి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు శక్తిని పెంచడానికి ఒక గ్లాస్ మామిడి మిల్క్ షేక్‌ను త్రాగండి. మీరు మామిడి పండుని ముడిగా కూడా తినవచ్చు లేదా కొంత తేనె, సాఫ్రాన్ మరియు ఏలకుల పొడిని జోడించి తీసుకోవచ్చు.

కాఫీ

కాఫీ ఒక ఎనర్జిటిక్ డ్రింక్ గా ఉపయోగించబడుతోంది మరియు మెదడును ఉత్సాహ పరిచేందుకు సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మోడరేట్ గా ఈ పానీయం తాగటం వలన ఎటువంటి హానీ లేదు. కాఫీ శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడానికి మరియు ఓర్పు, దృష్టి మరియు నొప్పిని తట్టుకునే శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గమనిక : రోజుకు రెండు కప్పులకన్నా ఎక్కువ కాఫీ ని త్రాగకూడదు. ఎందుకంటే అధిక కాఫీ త్రాగటం వలన నిద్ర లేమి మరియు ఆతురత యొక్క రిస్క్ పెరుగుతుంది.

బాదాం

విటమిన్ ఇ అధికంగా ఉండే నట్స్ లో బాదాం ప్రధానమైనది. దీన్ని తీసుకోవటం వలన సుదీర్ఘకాలం శక్తివంతంగా ఉండొచ్చు. శరీరంలోని కొవ్వు,  కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్‌లను కన్వర్ట్ చేయడంలో సహాయపడే మెగ్నీషియం కూడా బాదాం లో అధిక మోతాదులలో ఉంటుంది. మెగ్నీషియం యొక్క తేలికపాటి లోపం కూడా నిస్సత్తువకు కారణం అవుతుంది. ఆల్మండ్ లో మెగ్నీషియం అధికంగా ఉన్నందున ఇది  సహజంగా మీ బలహీనతను నిర్మూలిస్తుంది.

కొన్ని బాదాంలను నీటిలో వేసి రాత్రంతా నానపెట్టి ఉదయం వట్టి కడుపుతో తినండి. మీరు సుదూర ప్రయాణానికి వెళ్తునట్లయితే కావలసిన బలాన్ని మైంటైన్ చేసేందుకు దోరగా వేయించిన కొన్ని బాదాంలను ప్యాక్ చేసి తీసుకుని వెళ్ళండి. వీటిని అపుడప్పుడు తినండి.

భారతీయ గూస్బెర్రీ

భారతీయ గూస్బెర్రీ అనగా ఉసిరికాయలు. ఇది ఒక అద్భుతమైన సహజ పదార్ధం. ఇది మీ చర్మానికి మరియు జుట్టుకు చాలా మంచిది. ఎన్నో సంవత్సరాలుగా చర్మం మరియు వెంట్రుకలను ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచుకునేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఐరన్, ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నందున, మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను సులభంగా బలపరుస్తాయి మరియు ఇందుమూలంగా మీరు బలహీనత నుండి విముక్తి పొందవచ్చు. మీరు తాజా భారతీయ గూస్బెర్రీ రసంను త్రాగండి, ఇది చాలా పుల్లగా ఉన్నట్లనిపిస్తే ఒక స్పూన్ తేనెని జోడించవచ్చు. రోజుకు రెండు నుండి మూడు సార్లు ఈ జ్యూస్ ని త్రాగితే మీరు సులభంగా శక్తిని పొందుతారు.

లికోరైస్

ప్రకృతి నుండి మరొక అద్భుతమైన మూలిక సారం లికోరైస్. ఇది మీ శరీర బలహీనత యొక్క వివిధ లక్షణాలతో పోరాడుతుందని నిరూపించబడింది. ఈ మూలికను తీసుకున్న వెంటనే మీ శరీరంలోని అడ్రినల్ హార్మోన్లను పెంపొందిస్తుంది మరియు మీ జీవక్రియను ప్రేరేపిస్తుంది.

ఒక టీ స్పూన్ పొడిచేసిన లికోరైస్ ను ఒక గ్లాస్ వెచ్చని పాలలో కలపండి. రెండు టేబుల్ స్పూన్ తేనెని కూడా కలిపి త్రాగండి. రోజుకు రెండుసార్లు ఈ మిశ్రమాన్ని త్రాగితే మీ శరీరానికి కావలసిన శక్తిని పొందుతారు.

పాలు

పాలు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో సమాన మోతాదులలో శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయి. రాత్రి వేళలో మీకు ఆహారం తినాలని అనిపించకపోతే ఒక గ్లాస్ పలు త్రాగితే చాలు. మీ శరీరంలో భారీ బ్లడ్ లాస్ లేదా కట్స్ ఉన్నట్లయితే పాలను త్రాగమని సలహా ఇస్తారు ఎందుకంటే ఇది బ్లడ్ ను రీప్లేస్ చేసి శక్తిని పెంచుతుంది. పాలలో ఉండే విటమిన్ బి కండరాలు మరియు ఎముకలను ఎల్లప్పుడూ బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొంత మందికి పాల యొక్క బలమైన వాసన నచ్చదు. అటువంటి వారు, వారికి నచ్చిన ఫ్లేవర్ పొడిని పాలలో కలుపుకొని త్రాగవచ్చు. లేకపోతే ఒక చిటికె పసుపు మరియు ఒక స్పూన్ తేనె కలుపుకొని త్రాగండి. మీరు మీ శరీరంలో అధిక బ్లడ్ లాస్ తో బాధపడుతున్న సమయంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది.

అరటి పండు

శరీరంలోని బలహీనతను తగ్గించడంలో చక్కెర సహాయపడుతుంది. అరటి పండులో సహజ గ్లూకోజ్ మరియు చక్కెర ఉన్నందున, ఇది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అరటి పండులో మన శరీరానికి కావలసిన శక్తిని అందించే పొటాషియం కూడా ఉంది. ప్రతి రోజు అరటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపొందుతుంది.

నారింజ రసం

బలహీనత నుండి దూరంగా ఉండేందుకు సహాయ పడటంలో పండ్ల రసాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరెంజ్ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందున ఇది మన శరీరానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. బలహీనతను నివారించేందుకు రెగ్యులర్గా నారింజ రసంను త్రాగండి.

స్ట్రాబెర్రీలు

ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచడానికి తక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది ఒకటి. కణజాలంను రిపేర్ చేయడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. మీరు క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలను తినడం వలన మీ శరీరం ఫ్రీ రాడికల్స్ దాడి నుండి రక్షింపబడుతుంది. ఇందులో మీరు ఆరోగ్యంగా ఉండటానికి సరైన మోతాదులలో మాంగనీస్ మరియు ఫైబర్ ఉంటుంది. మీరు బలహీనంగా ఉన్నట్లు భావించినప్పుడు స్ట్రాబెర్రీ ఫల రసాన్ని త్రాగవచ్చు.

గుడ్లు

ఈ రోజుల్లో అందరి ఇంటిలో గుడ్లు స్టోర్ చేసుకొని ఉంటారు. గుడ్డలో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన సులభంగా జీర్ణం అవుతుంది. వీటిని ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. మీరు నీరసంగా ఉన్నట్లు భావించినప్పుడు గుడ్డు తినటం వలన ఫిట్ మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీ బలాన్ని తిరిగి పొందేందుకు ప్రతిరోజు మీరు ఉడికించిన గుడ్డును తినవచ్చు.

వార్మ్ అప్ వ్యాయామం

కొన్నిసార్లు మీ శరీరంలోని అన్ని చోట్లలో తగిన ఎనర్జీ ఉండదు, ముఖ్యంగా భుజాలు, చేతులు, కాళ్లు మొదలైన చోట్లు. సరైన ఫిసికల్ వర్క్స్ చేయకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. కనుక బలాన్ని తిరిగి పొందేందుకు కొన్ని సులభమైన మరియు వార్మ్ అప్ వ్యాయామాలను చేయండి. ఇది మీ స్టామినాని కూడా పెంచుతుంది.

తులసి

తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు తులసి టీ తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం చేయడంతో బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.

ఒక కప్పు నీటిలో తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి త్రాగండి. కావాలంటే కొంత తేనె కూడా చేర్చుకోవచ్చు. వట్టి తులసిని ప్రతి రోజూ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

కొబ్బరి నూనె

వంటలో మామూలు నూనెలకు బదులుగా కొబ్బరి నూనెని ఉపయోగించటం వలన ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎఫెక్టివ్ గా శరీర బరువును తగ్గిస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఇది వీక్ నెస్ ను కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గించి శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కొబ్బరి నూనెని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది మరియు ఎనర్జీ లెవల్స్ పెరగడంతో వీక్ నెస్ తగ్గుతుంది.

Posted on

Cancer tips in Telugu – కాన్సర్ యొక్క రకాలు, లక్షణాలు మరియు వాటి కారణాలు

మానవుల్లో గుండె పోటు తర్వాత ప్రాణాంతకరమైన ప్రధాన వ్యాధి ‘క్యాన్సర్‘. ఆధునిక కాలంలో టెక్నాలజీ మరియు సైన్స్ అభివృద్ది ద్వారా క్యాన్సర్ నయమవుతుంది. కానీ, ఈ ఘోరమైన వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రాధమిక దశలో నిర్ధారణ అయినట్లయితే ఈ వ్యాధిని సులభంగా క్యూర్ చేయవచ్చు. భవిష్యత్తులో వినాశకరమైన ప్రభావాలకు దారితీసే క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలను తరచుగా ప్రజలు పట్టించుకోరు. కనుక వీటి గురించి పూర్తిగా తెలుసుకోవటం వలన ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు మరియు వైద్య సంరక్షణ పొందవచ్చు. మరి ఈ వ్యాసంలో క్యాన్సర్ ఎన్ని రకాలు, వాటి లక్షణాలు మరియు వాటి కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యాన్సర్ అంటే ఏమిటి?

క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ అసాధారణ సెల్స్ ని క్యాన్సర్ కణాలు, ప్రాణాంతక కణాలు, లేదా కణితి కణాలు అని పిలుస్తారు. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలలోకి చొరబాట్లు చేయగలవు. క్యాన్సర్ మానవులకు మాత్రమే పరిమితం కాదు; జంతువులు మరియు ఇతర జీవులకు కూడా క్యాన్సర్ వస్తుంది. శరీరంలో దెబ్బతిన్న ఒక్క కణం మరణించక పోవడం మరియు క్యాన్సర్ కణాలుగా మారడం మరియు అనియంత్రిత విభజన ద్వారా క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేస్తుంది.

క్యాన్సర్ కణాలు ఎలా వస్తాయి?

శరీరం కొన్ని మిలియన్ల కణాలతో రూపొందించబడింది. ఎముకలు, కండరాలు, చర్మం మరియు రక్తం వంటి వివిధ భాగాలలో వివిధ ప్రత్యేక సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ లో న్యూక్లియస్ DNA అని పిలవబడే రసాయనం నుండి తయారు చేయబడిన వేలాది జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు కణాల విధులను నియంత్రిస్తాయి. శరీరంలో అన్ని రకాలైన కణాలూ విభజించటం ద్వారా ఎప్పటికప్పుడు గుణిస్తాయి. పాత కణాలు దెబ్బతినడంతో, వాటిని భర్తీ చేయడానికి కొత్త కణాలు ఏర్పడతాయి. కొన్ని సెల్స్ సాధారణంగా వేగంగా గుణించాలి.

కొన్నిసార్లు ఒక కణం అబ్‌నార్మల్ గా మారుతుంది. కణంలో ఒక జన్యువు (లేదా అంతకన్నా ఎక్కువ) దెబ్బతినడం వలన ఈ అసాధారణ సంభవిస్తుంది. అసాధారణమైన సెల్ విభజించడం ద్వారా వాటి సంఖ్య అధికరిస్తుంది. అసలైన అసాధారణ కణాల నుండి అసాధారణమైన కణాలు బోలెడంతగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అనారోగ్య కణాల సమూహం ఏర్పడుతుంది. ఈ కణాల సమూహం పెద్దగా అయినట్లయితే దీన్ని ‘కణితి’ ఆంగ్లంలో ‘ట్యూమర్’ అని పిలుస్తారు.

కాన్సర్ యొక్క రకాలు

ప్రధానంగా కాన్సర్ నాలుగు రకాలు

  • కార్సినోమా (Carcinoma) : కార్సినోమా అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ మరియు, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు ఉదాహరణకు : క్షీర గ్రంథులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85% కార్సినోమా రకానికి చెందినవి.
  • సార్కోమా (Sarcoma) : ఇవి సంయోజక(కనక్టివ్) కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి కూడా ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2% ఉంటాయి.
  • లూకీమియా (Leukemia) : గ్రీకు భాషలో ‘లూకోస్‌’ అంటే ‘తెలుపు’, ‘ఈమియా’ అంటే ‘రక్తానికి సంబంధించిన’. కనుక ‘లూకీమియా’ అంటే ‘తెల్ల రక్తం’ అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థి మజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ‘ద్రవరూప కంతి’ అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4% ఉంటాయి.
  • లింఫోమా (Lymphoma) : ఇవి ప్లీహం, శోషరస గ్రంథులలోని తెల్ల రక్త కణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4% ఉంటాయి.

ట్యూమర్లు రకాలు

  • మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors) : ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో ఇవి ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
  • బినైన్ ట్యూమర్లు (Benign tumors) : ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.

శరీర భాగాలలో కాన్సర్ మరియు వాటి లక్షణాలు

కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్ లు ఉన్నాయి. అయినప్పటికీ గర్భాశయం, రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తులు, పేగులు, ఎముకలు మరియు రక్తం లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. వీటి గురించిన వివరాలను చూద్దాం.

గర్భాశయంలో కాన్సర్

గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ (గర్భాశయ ముఖద్వారం) యొక్క కణజాలంలో చోటుచేసుకునే కేన్సర్‌ను ‘సర్వైకల్ కేన్సర్’ లెదా ‘గర్భాశయ ముఖద్వార క్యాన్సర్’ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొదట్లో ఎలాంటి లక్షణాలనూ చూపకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్ట్‌ల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPP) ఇన్‌ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం.

సర్వైకల్ కేన్సర్ ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. గణనీయంగా ముందుగానే నిరోధించగల వ్యాధి ఇది అని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి.

వీటి లక్షణాలు

  • గర్భాశయ కాన్సర్ తో బాధపడే స్త్రీలకు అసాధారణ యోని రక్తస్రావం ఉంటుంది.
  • గర్భాశయ కాన్సర్ మరో లక్షణం వేజైనల్ డిశ్చార్జ్ అధికమవ్వడం. అది కూడా దుర్వాసనతో, చిక్కగా, శ్లేష్మంగా ఉంటుంది. ప్రతిసారీ మీరు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి మీ అసాధారణ వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పాలి.
  • సాధారణ ఋతు చక్ర సమయంలో పెల్విక్ నొప్పి ఉండదు. ఈ గర్భాశయ కాన్సర్ లక్షణాలు కొన్ని గంటలపాటు ఉండవచ్చు, దీనివల్ల నిస్తేజంగా ఉన్న నొప్పులు ఎక్కువ కావచ్చు, అధిక పోటుతో, తక్కువగా లేదా తీవ్రంగా ఉండవచ్చు.
  • పిత్తాశయంలో నొప్పి లేదా మూత్రవిసర్జన సమయంలో నొప్పి గర్భాశయ కాన్సర్ కి కారణం కావచ్చు. కాన్సర్ పిత్తాశయానికి విస్తరించిన తరువాత సాధారణంగా ఈ గర్భాశయ కాన్సర్ లక్షణం కనిపిస్తుంది.
  • సాధారణ ఋతుచక్ర సమయంలో, సెక్స్ తరువాత రక్తస్రావం కావడం గర్భాశయ కాన్సర్ లక్షణాలుగా గుర్తించవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌

ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్ని క్యాన్సర్ల లానే శరీరం యొక్క ప్రాధమిక విభాగానికి చెందినది. ఊపిరితిత్తుల యొక్క ప్రధాన విధి గాలి పీల్చడం మరియు గాలి వదలడం. ఊపిరితిత్తుల ద్వారా, కార్బన్డయాక్సైడ్ రక్త ప్రవాహంలో నుండి తొలగించబడుతుంది మరియు ఆక్సిజన్ రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. కుడి ఊపిరితిత్తులలో మూడు భాగాలు ఉన్నాయి, ఎడమ ఊపిరితిత్తి రెండు భాగాలుగా విభజించబడింది. ఊపిరితిత్తులు మరియు ఛాతీ గోడ కణజాలంలు సున్నితమైన పొరతో కప్పబడి ఉంటాయి. ఊపిరితిత్తుల యొక్క ఏ భాగానికైనా ఈ క్యాన్సర్ రావచ్చు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90%-95% ఎపిథీలియల్ కణాలు, పెద్ద మరియు చిన్న వాయుమార్గాల(బ్రోంకి మరియు బ్రోన్కియోల్స్) లో ఏర్పడతాయి. ఈ కారణంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను కొన్నిసార్లు ‘బ్రోన్చోజెనిక్ క్యాన్సర్’ లేదా ‘బ్రోన్చోజెనిక్ కార్సినోమా’ అని పిలుస్తారు.

ఈ క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో ఈ క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.

వీటి లక్షణాలు

  • ఎవరైన దీర్ఘకాలం పాటు దగ్గుతుంటే అది చలికి, వాతావరణంలో మార్పులతో మరింత తీవ్రమైతే అది లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.
  • శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఒళ్లు నొప్పులు రావడం సహాజం, కానీ తరచూ పరిస్థితి ఇలా ఉంటే లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి. ముఖ్యంగా, ఛాతీ, భుజాలు, వెన్నెముక, నొప్పులు ఎక్కువగా కలిగి ఉంటే, ఇది లంగ్ క్యాన్సర్ కు దారితీస్తుంది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. నాడీ వ్యవస్థమీద ఒత్తిడి పెంచుతుంది.
  • పొగ త్రాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురి అవుతుంటే అది లంగ్ క్యాన్సర్ లక్షణంగా గుర్తించాలి. మీరు రెగ్యులర్ గా స్మోక్ చేస్తే , దాని వల్ల అలసట, డిప్రెషన్, హఠాత్తుగా బరువు తగ్గడం, మోకాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఫిజిషియన్ ను సంప్రదించండి.
  • తరచూ మీరు అనారోగ్యానికి గురి అవుతుంటే, ట్రీట్‌మెంట్ తీసుకొన్నా సమస్య అలాగే వుంటే, లంగ్ క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్లు గుర్తించాలి.
  • నిద్రపోయే సమయంలో శ్వాస ద్వారా ఈల వేసే సౌండ్ రావడం, లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటైన నిద్ర లేమి సమస్యకు గురిచేస్తుంది.

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్ రొమ్ములో పాల నాళాలలోని అంతర్భాగంలో మొదలౌతుంది. తమ్మెల వంటి లాబ్యూలలో వస్తే దానిని లాబ్యులార్ కార్సినోమా అని, గొట్టాలవంటి నాళాలలో వస్తే డక్టల్ కార్సినోమా అని అంటారు.

రొమ్ము క్యాన్సర్ ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ అని రెండు రూపాలలో ఉంటుంది. ఇన్వేసివ్ అంటే క్యాన్సర్ కణాలు విచ్ఛిత్తి చెంది చుట్టు పక్కలున్న ఇతర అవయవాలకు సోకడం. నాన్ ఇన్వేసివ్ అంటే క్యాన్సర్ కణాలు విచ్ఛిత్తి చెందకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటాయి. ఈ స్థితిని ప్రీక్యాన్సర్ స్థితి అని కూడా అంటారు. అంటే కణాలు విచ్ఛిత్తి జరగనప్పటికి, భవిష్యత్తులో ఇన్వేసివ్ గా మారవచ్చు.

రొమ్ము క్యాన్సర్ బాహ్యలక్షణాలు

  • రొమ్ములో గడ్డలు
  • ఛంకలో లేదా రొమ్ములో నొప్పి. సాధారణంగా రుతుచక్రంలో వచ్చే నొప్పికాదు ఇది.
  • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
  • చన్నుల మీద లేదా చుట్టు పుండు పడడం
  • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
  • ఛంకలలో వాపు
  • చన్నుల నుండి ద్రవం కారడం
  • రొమ్ము చర్మం కమిలిపోయి ఉండడం
  • చన్నుల రూపంలో మార్పు, లోపలికి ముడుచుకుపోవడం
  • రొమ్ము పరిమాణం, ఆకారం మారిపోవడం
  • చనుమొన పైన, రొమ్ము చర్మం పైన పొలుసులుగా ఏర్పడడం

కేవలం బాహ్య లక్షణాలను బట్టి రొమ్ము క్యాన్సర్ ను నిర్ణయించలేము. వైద్యుల సూచనలు, సంప్రదింపులు, వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న క్యాన్సర్ మరణాలలో రొమ్ము క్యాన్సర్ మరణాలు ఎక్కువని, అందులోనూ స్త్రీలలో అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అందుచేత 35 సంవత్సరాలు పైబడ్డ ప్రతి మహిళా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణా పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ క్యాన్సర్ అధికంగా స్త్రీలలో వచ్చినప్పటికీ పురుషులలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పెద్ద ప్రేగు / కోలన్ క్యాన్సర్

పెద్ద ప్రేగులో పురీష ద్వారము(పెద్ద ప్రేగు చివరి భాగంలో ఆంగ్లంలో ఇంటెస్టైన్/కోలన్) లో అసాధారణ సంఖ్యలో సెల్స్ పెరగడం మూలంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. మొదటగా పెద్ద ప్రేగు, మలద్వారంలో లోపలి పొర నుంచి మొదలయ్యి, అన్ని కణజాలాల పొరలకు వ్యాపిస్తుంది. అసాధారణ కణాలు, కొత్త పాలిప్ గడ్డలు పెద్ద ప్రేగు క్యాన్సర్ గా మారటానికి 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. చర్మ సంబంధమైన క్యాన్సర్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్త్రీ, పురుషుల్లో అధిక శాతం మంది పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గురవుతున్నారు.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సలహా ప్రకారం 50 ఏళ్ళ వయస్సు నుంచి క్రమంగా ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి, అలాగే కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు తప్పక డాక్టర్ ను సంప్రదించాలి.

వీటి లక్షణాలు

  • మల విసర్జన సమయంలో రక్తం కనిపించడం.
  • మల విసర్జన సమయంలో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మల విసర్జన సాధారణంగా కలగక పోవడం.
  • ఊహించని విధంగా శరీర బరువు తగ్గిపోవడం.
  • పెద్ద ప్రేగు కాన్సర్తో బాధపడుతున్న వారిలో అతిసారం యొక్క అదే లక్షణాలను గమనించవచ్చు. రెండు రోజుల పాటు అతిసారం ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సందర్శించంది.
  • ఎవరికైనా ప్రేగులు వాచి మలమూత్రాలకి ఇబ్బంది అవుతుంటే లేదా టైప్ 2 డయాబెటిస్ ఉంటే, వారికి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

వృషణాల / టెస్టిక్యూలర్ క్యాన్సర్

టెస్టికులర్ క్యాన్సర్ అనేది కేవలం మగవారికే వస్తుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగమైన వృషణాలలో వచ్చే కేన్సర్. వృషణాల్లోని ఆరోగ్యకరమైన సెల్స్ లో మార్పుల వలన ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ రెండు వృషణాలకూ సోకవచ్చు.

వీటి లక్షణాలు

  • వృషణాల్లో వాపు రావడం, వాటిని ముట్టుకుంటే నొప్పి కలగడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
  • మీరు వెన్నునొప్పి లేదా కడుపునొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు టెస్టిక్యూలర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని సూచన.
  • కొందరిలో వృషణాల దగ్గర ఒక చిన్న గడ్డ ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. మొదట చిన్న బఠాణీ గింజ పరిమాణంలో ఇది ఏర్పడుతుంది. తర్వాత కాస్త పెద్దగా మారుతుంది. అయితే ఇది అస్సలు నొప్పి కలిగించదు. కానీ మీకు ఇలాంటి గడ్డ ఏర్పడితే మాత్రం వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ఎందుకంటే అది క్యాన్సర్ కు కారణం కావచ్చు.
  • కొందరిలో స్క్రోటం పెరిగిపోతుంది. ఇది టెస్టిక్యూలర్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. అక్కడ బాగా నొప్పి ఏర్పడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
  • స్క్రోటం లో జిగురుగా ఉండే ద్రావణం వస్తుంటే మీరు జాగ్రత్తపడాలి. వారం రోజుల పాటు ఇలా జరుగుతుంటే మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
  • వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలను నిపుల్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ చను మొనలు కాస్త పెరగడం టెస్టిక్యూలర్ క్యాన్సర్ కు సూచన.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం, కాళ్లు వాపునకు గురికావడం వంటివి రక్తం గడ్డ కట్టడం వల్ల ఏర్పడుతుంటాయి.
  • వృషణాల సంబంధించిన ఇన్ఫెక్షన్ ను ‘ఆర్కిటిస్’ అని పిలుస్తారు. వృషణాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్స్ తో మీరు బాధపడుతున్నట్లయితే మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

హెమటూరియా

మీ మూత్రంలో రక్తం కనపడడాన్ని వైద్య పరంగా హెమటూరియా అని పిలుస్తారు. ఈ రకమైన సమస్యకు వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులు మరియు వ్యాధులు కారణం కావచ్చు. మూత్రపిండంలో రాళ్లు, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వంటి కారణాల వలన మూత్రంతో రక్తం యొక్క విసర్జన జరగచ్చు. ఇది ఒక వ్యక్తి యొక్క మూత్రపిండాలు లేదా మూత్రాశయం లో క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతం కావచ్చు. కనుక మీ మూత్రంలో రక్తం వచినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

గొంతు క్యాన్సర్

గొంతు క్యాన్సర్ (క్యాన్సర్ స్వరపేటిక, లేదా స్వరపేటిక కార్సినోమా) అనేది, గొంతులో (స్వరపేటికలో) ఏర్పడే ఒక మాలిగ్నెంట్ ట్యూమర్. ఇది చాలా కారణాల వలన కలుగుతుంది, ముఖ్యంగా పొగ తాగేవారిలో మరియు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది తల భాగంలో, మెడ ప్రాంతంలో ముఖ్యంగా స్వరపేటికలో కలగచ్చు. గొంతు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే రేడియోథెరపీ ,మరియు శస్త్ర చికిత్స ద్వారా తగ్గించవచ్చు.

వీటి లక్షణాలు

  • గొంతు బొంగురు పోవుటం లేదా గొంతు మారటం వంటి లక్షణాలను గొంతు క్యాన్సర్ కలిగే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు.
  • గొంతులో అసౌకర్యం, గొంతులో ఎదో చేరినట్టుగా అనిపించటం, గొంతులో ముద్దగా అనిపించటం, గొంతులో గాయాలు, దగ్గు, వాసన మరియు రక్తంతో కూడిన ఉమ్మి, దగ్గినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గొంతు క్యాన్సర్’గా తెలుపవచ్చు.

చర్మ క్యాన్సర్

మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. చర్మ కణాలు అన్ని శరీర అవయవాల లాగానే రెండు రకాల పొరలతో నిర్మింపబడ్డాయి. అవి ‘డేర్మిస్’ మరియు ‘ఎపిడేర్మిస్’. ఈ పొరలలో ఉండే కణాలు విభజింపబడి అనిశ్చితంగా పెరగడాన్ని ‘మాలిగ్నెంట్ క్యాన్సర్’ అంటారు.

చాలా రకాల చర్మ క్యాన్సర్స్ ఉన్నాయి అందులో ‘మూలకణ’ క్యాన్సర్, ‘పొలుసుల కణ’ క్యాన్సర్, ‘మెలనిన్ కణాల’ క్యాన్సర్ ముఖ్యమైనవి. మిగిలిన చర్మ క్యాన్సర్’లు ఎక్కువగా స్వేద రంధ్రాలు మరియు వెంట్రుకల ఫాలికిల్స్లో మొదలవుతాయి.

మూలకణ కాన్సర్

పూర్తి నాన్-మెలనోమా కాన్సర్ రకాలలో, 70 శాతం మూలకణ కాన్సర్ వస్తుంది. ఈ రకమైన క్యాన్సర్ కలిగినప్పుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి తెలుసుకుందాం.

  • ఇది సాధారణంగా మెడ, తల మరియు శరీరంపై భాగాలలో వస్తుంది.
  • చర్మంపైన పొలుసులుగా ఉడిపోతూ, చర్మం పొడిగా మారి, లేత లేదా ప్రకాశవంతమైన గులాభి రంగు మచ్చలు లేదా ఒక ముద్దగా ఏర్పడుతుంది.
  • ఈ రకమైన క్యాన్సర్ రక్తస్రావాన్ని ఏర్పరచి చర్మం మొత్తం వ్యాపించి చర్మ కణాలని నాశనం చేస్తుంది. ఆ రకమైన మూలచర్మ క్యాన్సర్ చాలా కష్టతరం మరియు దీన్ని అరికట్టడం చాలా కష్టం.
  • మూలకణ చర్మ కాన్సర్ ఎటువంటి వ్యాధి లక్షణాలను బహిర్గత పరచదు. కారణం, నెమ్మదిగా చర్మం పైన వ్యాపిస్తూ, వివిధ రకాల శరీర అవయవాలకి వ్యాపిస్తుంది. ఈ రకమైన చర్మ క్యాన్సర్’ను తొందరగా గుర్తించి, చికిత్స చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఎక్కువగా, చర్మం లోపలి వరకు పెరిగినట్లయితే, పూర్తిగా చర్మకణాలని నాశనం చేస్తుంది.

పొలుసుల కణ క్యాన్సర్

మొత్తం నాన్-మెలనోమా చర్మ కాన్సర్’లలో ఇది 30 శాతం వస్తుంది. ఈ రకమైన చర్మ క్యాన్సర్ కొన్ని రకాల లక్షణాలను బహిర్గత పరుస్తాయి అవి:

  • ఇది సాధారణంగా శరీరంపైన వివిధ రకాల భాగాలలో కనపడుతుంది. ముఖ్యంగా ఈ రకమైన చర్మ క్యాన్సర్ సూర్య కాంతికి బహిర్గతం అయ్యే మెడ, తల, ముంజేతులు, క్రింద కాళ్లు మరియు చేతుల పైన కలుగుతాయి.
  • ఇది చూడటానికి ఒక గాయంలా కనపడుతుంది, అభివృద్ది చెందే సమయంలో ఇది నయమవటం చాలా కష్టం.
  • ఇది చర్మం పైన మందంగా ఏర్పడి, ఎర్రటి పొలుసులుగా ఉడిపోతుంది.
  • ఈ రకమైన చర్మ క్యాన్సర్ మృదువుగా ఉంటుంది.

మెలనోమా / మెలనిన్ కణాల క్యాన్సర్

ఈ రకం చాలా అరుదుగా కనపడే చర్మ క్యాన్సర్ మరియు చాలా ప్రమాదకరమైనది. దీని లక్షణాలు :

  • ఇది ఒకటి కంటే ఎక్కువ రంగులను కలిగి ఉంటుంది – ఎరుపు, నలుపు, గోధుమ, లేత బూడిద రంగు మరియు తెలుపు రంగులో ఉంటాయి.
  • ఇవి వివిధ రకాల రంగు, పరిమాణం మరియు ఆకారంలో మారుతూ కనపడుతుంది.

గమనిక : మూల కణాల చర్మ క్యాన్సర్, పొలుసుల కణ క్యాన్సర్ లేదా మెలనిన్ కణాల క్యాన్సర్ ప్రభావం ఎక్కువ అయిన తరువాత వాటిని తగ్గించటం చాలా కష్టం.

అన్నవాహిక కేన్సర్‌

అన్నవాహిక కేన్సర్‌ ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరంలో వచ్చే కేన్సర్‌లలో ఇది ఐదవది. ఎక్కువ వచ్చే కేన్సర్‌ దీనిలో రెండు రకాలుగా ఉంటుంది. అన్నవాహిక పైభాగాలలో వచ్చేది ‘స్క్వామస్‌సెల్‌’ కేన్సర్‌. అన్నవాహిక కింది భాగంలో వచ్చేది అడినో కేన్సర్‌. ఇది అల్సర్‌లలాగా చుట్టూరా పాకుతూ పొడవుగా కూడా కనిపిస్తుంది.

దీనికి కచ్చితమైన కారణమంటూ చెప్పడం కష్టం. అయితే, మద్యపానం సేవించేవారిలో, పొగతాగే వారిలో ఎక్కువ. కారం, మసాలా దినుసులు వాడే వారిలో, అన్నవాహికలో అవరోధమున్న వారిలో, ఎక్కువ రేడియేషన్‌కు గురైన వారిలో, ఎక్కువ వేడిగల కాఫీ, టీలు తీసుకొనేవారిలో విటమిన్‌- ఎ, జింకు, మాలిబ్డినం లోపమున్న వారిలో ఎక్కువగా కన్పిస్తుంది.

వీటి లక్షణాలు

  • ఆరంభంలో గట్టి పదార్థం మింగడానికి కష్టంగా ఉంటుంది.
  • తర్వాత ద్రవ పదార్థాలు మింగడానికి కష్టంగా ఉంటుంది.
  • త్వరగా బరువు కోల్పోవడం, ఛాతిలో నొప్పి, స్వరం క్షీణించడం, నోట్లో నుండి రక్తంతో కూడిన వాంతి, అధికంగా రక్తంలో కాల్షియం వుండటం.

క్యాన్సర్ కారణాలు ఏమిటి?

క్యాన్సర్లకు స్పష్టమైన కారణాలు లేవు. అయినప్పటికీ, మీ కణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలు అసాధారణంగా మారడం వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్ రావటానికి కొన్ని ప్రధాన కారణాలను తెలుసుకుందాం. వీటికి దూరంగా ఉండటం వలన కొన్ని రకాల క్యాన్సర్ మనకు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

ప్రమాద కారకాలు

పొగాకు

మీరు పొగ తీసుకునే వ్యక్తి అయితే మీ శరీరంలో ఊపిరితిత్తుల, నోరు, గొంతు, అన్నవాహిక, మూత్రాశయం మరియు ప్యాంక్రియాస్ యొక్క క్యాన్సర్‌ను అభివృద్ధి చేయటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ధూమపానం అన్ని క్యాన్సర్లకూ కారణమవుతుంది. పొగతాగడం ఎక్కువ ప్రమాదం. మీరు ధూమపానాన్ని ఆపివేస్తే, క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది.

వయసు

కాలానుగుణంగా కణాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, దెబ్బతిన్న కణాలను రిపేరు చేసే సామర్థ్యాన్ని మరియు అసాధారణ కణాలను నాశనం చేసే రోగనిరోధక వ్యవస్థ వయస్సుతో తక్కువ సమర్ధంగా మారవచ్చు. కాబట్టి, చివరికి ఒక దెబ్బతిన్న కణం క్యాన్సర్‌ కి కారణం కావచ్చు. చాలా మంది వృద్ధులలో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

జీవనశైలి

ఆహారం మరియు జీవనశైలి కారకాల వలన క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఉదాహరణకు మీరు పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ తీసుకుంటే, క్యాన్సర్లు అభివృద్ధి చెందే ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆహారాలలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి మరియు అనామ్లజనకాలు అనే రసాయనాలను కలిగి ఉంటాయి. రోజుకు కనీసం ఐదు సార్లు, కూరగాయలను ఆహారంగా తినాలి.

మాంసం

మాంసం తినడం (గొడ్డు మాంసం, పంది మాంసం మరియు గొర్రె వంటివి) ప్రేగు క్యాన్సర్ మరియు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని బలమైన సాక్ష్యం ఉంది.

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేయబడిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది, ముఖ్యంగా ప్రేగు క్యాన్సర్. ప్రాసెస్ చేయబడిన మాంసం అంటే లవణ, క్యూర్, కిణ్వ ప్రక్రియ లేదా ఇతర ప్రక్రియల ద్వారా మార్చబడిన మాంసం. ఉదాహరణకు : బేకన్, సలామి, చోరిజో, పెప్పరోని మరియు అన్ని రకాల హామ్.

మద్యం సేవించడం

కొన్ని క్యాన్సర్‌లను రెగ్యులర్ వ్యాయామం లేకపోవడం లేదా చాలా మద్యం తాగడం ద్వారా పెరుగుతుంది.

ఊబకాయం

గర్భాశయ క్యాన్సర్, ప్రేగు, ఎసోఫాగస్, ప్యాంక్రియాస్, మూత్రపిండము, కాలేయం, కడుపు, అండాశయం, థైరాయిడ్, మైలోమా సహా క్యాన్సర్లు, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులలో సర్వసాధారణమైందని తేలింది.

రేడియేషన్

రేడియేషన్ అనేది క్యాన్సర్. ఉదాహరణకు, రేడియో ధార్మిక పదార్ధాలు మరియు అణు పడద్రోగాలకు గురికావడం వలన ల్యుకేమియా మరియు ఇతర క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా ఎక్కువ సూర్యరశ్మి (UVA మరియు UVB నుండి రేడియేషన్) చర్మ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇన్ఫెక్షన్

కొన్ని జర్మ్స్ (వైరస్లు మరియు బ్యాక్టీరియా) కొన్ని క్యాన్సర్లకు కారణమవుతాయి. ఉదాహరణకు, హెపటైటిస్ బి వైరస్ లేదా హెపటైటిస్ సి వైరస్‌తో నిరంతర సంక్రమణ ఉన్న వ్యక్తులలో కాలేయం యొక్క క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. మరొక ఉదాహరణ మానవ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. మరో ఉదాహరణ, హెల్కాబాక్టర్ పిలోరి అని పిలిచే ఒక బాక్టీరియా కడుపు క్యాన్సర్‌ను కలిగించవచ్చు.

రోగనిరోధక వ్యవస్థ

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులలో క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

జన్యు అలంకరణ

కొన్ని క్యాన్సర్లకు బలమైన జన్యుపరమైన లింక్ ఉంది. ఉదాహరణకు, కొన్ని కణాలు బాల్యంలో అసహజ జన్యువు లేదా జన్యువుల క్యాన్సర్‌కి దారితీస్తాయి, ఇవి అసాధారణమైనవి మరియు క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. ఇతర రకాల క్యాన్సర్లకు కొన్ని స్పష్టమైన జన్యు కారకం ఉండవచ్చు.