Posted on

కరోనా వైరస్ – Coronavirus in Telugu

కరో’ నా…ప్రపంచాన్నే గడ…గడ…వణికిస్తోంది…ఆ వైరస్…ఆక్సిజన్ పీల్చే మనిషి…నేడు గాలి పిల్చాలంటే భయాందోళనలకు గురి అవుతున్నాడు. ఆ వైరసే…నోవెల్ కరోనా…వ్యక్తులు ముఖాముఖీ అయినప్పుడు కరచాలనం చేసుకోవటం, ఆప్తులు కనిపించినప్పుడు ఆలింగనం చేసుకోవటం సర్వసాధారణం…కానీ వాటన్నింటికి స్వస్తి పలికేలా చేసింది…కోవిడ్-19వ్యాధి….సంఘ జీవిగా మెలిగే మానవుని ఉనికిని…మనుగడను ప్రశ్నర్ధకం చేసిన నోవెల్ కరోనా వైరస్ పై తెలుగు టిప్స్ ప్రత్యేక కథనం…మా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం…చూసేద్దామా…

అస్సలు నోవెల్ కరోనా వైరస్ జననం ఎక్కడ?

కరోనా వైరస్‌ను 1937లో గుర్తించారు. లాటిన్‌ భాషలో కరోనా అంటే క్రౌన్‌ అని అర్ధం. క్రౌన్‌ లేదా, హేలో ఆకారంలో వైరస్‌ ఉండటం వల్ల దీనికి ఆపేరు పెట్టారు. ఈ వైరస్‌ ఎక్కువగా కోళ్లు, చుంచుఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిళాల ఊపిరితిత్తుల వ్యాధులకు కరోనా వైరస్‌ కారణమవుతోంది. SARS-COV-2 అనే నోవెల్ కరోనావైరస్ అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకు వ్యాపించింది, వాషింగ్టన్ స్టేట్ కి తిరిగి రాకముందు చైనాలోని ఊహాన్ ప్రయాణించిన 35 ఏళ్ల వ్యక్తితో సంబంధం ఉన్న మొదటి US కేసు. అతనికి జనవరి 20, 2020 న వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. అప్పటి నుండి, వైరస్ (ఇది COVID-19 వ్యాధికి కారణమవుతుంది) అనేక రాష్ట్రాలకు వ్యాపించింది, ఇప్పటికి ప్రతిరోజూ కొత్త కేసులు బయటపడుతున్నాయి. అనంతరం యుఎస్‌లో సుమారు 1,663 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది, అయినప్పటికీ చాలా మంది కేసులు గుర్తించబడలేదు. నివేదించబడిన కేసులలో, 40 మంది మరణించారు, వాషింగ్టన్ , కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూజెర్సీ, జార్జియా మరియు దక్షిణ డకోటా లో మరణించారు. (ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 128,000 కేసులు నిర్ధారించబడ్డాయి, 4,720 మంది మరణించారు.)

కరోనా ఎలా వృద్ధి చెందిందంటే?

కాలక్రమేణా కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ వచ్చింది.అనేక రకాల కరోనా వైరస్ రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కరోనా వైరస్‌లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూ ఫీవర్‌ వంటి స్వల్ప కాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960లో గుర్తించారు. కాలక్రమేణా ఈవైరస్‌ల్లో పలు మార్పులు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యూమన్‌ కరోనా వైరస్‌లను గుర్తించారు. వీటినే 229 ఈ – ఆల్ఫాకరోనా వైరస్, ఓసీ 43, బీటా కరోనా వైరస్, హెచ్‌కేయూ 1 బీటా కరోనా వైరస్, సార్స్‌ కరోనా వైరస్, మెర్స్‌ కరోనా వైరస్, నోవెల్‌ కరోనా వైరస్‌లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహన్‌ నగరంలో విజంభిస్తున్న వైరస్‌ను ‘నావల్‌ కరోనా వైరస్‌’గా గుర్తించారు.

కరోనా వైరస్ లు ఎన్ని రకాలు?

మనుషులపై ప్రభావం చూపించే ఈ వైరస్‌లు ఆరు రకాలు :
1) సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌- సీఓవీ)
2) మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ)
3)హ్యూమన్‌ కరోనా వైరస్‌ హెచ్‌కేయూ 1
4) హ్యూమన్‌ కరోనా వైరస్‌ ఓసీ 43
5) హ్యూమన్‌ కరోనా వైరస్‌ ఎన్‌ఎల్‌ 63
6) హ్యూమన్‌ కరోనా వైరస్‌ 229 ఈ

మానవునిపై కరోనా వైరస్ ఎలా దాడి చేస్తుందంటే?

కరోనా వైరస్‌ మానవుల్లో ఊర్ధ్వ శ్వాసకోశ వ్యాధులకు (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌), జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వైరస్‌సోకిన వారిలో జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. సీతాకాలంలో, వేసవి కాలం ప్రారంభంలో ఎక్కువగా ఈవైరస్‌ సోకుతోంది. కొందరిలో బ్యాక్టీరియల్‌ బ్రాంకైటీస్, న్యూమోనియాకు ఈవైరస్‌ కారణమై ప్రాణాంతకమవుతోంది.

కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించటం ఎలా?

నోవెల్ కరోనా వైరస్ సోకితే ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారిలో, క్యాన్సర్, ఎయిడ్స్‌ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్‌ వాడిన వారిలో, ఊపిరి తిత్తుల వ్యాధుల బాధితుల్లో, చిన్న పిల్లల్లో, వద్ధుల్లో, గర్భిణుల్లో ఎక్కువగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

కరోనా సోకకుండా ఉండాలంటే?

కరోనా వైరస్ పట్ల భయాందోళనలు చెందకుండా కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇందుకుగాను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోటికి అడ్డంగా చేతి రుమాలు ఉంచాలి. మాస్క్‌లు ధరించాలి. అనారోగ్యంతో లేదా దగ్గు, జలుబుతో ముక్కు కారటం వంటి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగకుండా ఉంటే మంచిది. ప్రత్యక్షంగా జంతువులతో అత్యంత దగ్గరగా ఉండటం వల్ల సమస్యలు తెలెత్తవచ్చు. అనారోగ్యంతో ఉంటే ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం.

Posted on

టాన్సిల్స్ సమస్యకు నివారణా మార్గాలు – Telugu tips to treat tonsils

ఏదైనా తినాలంటే గుటక వేయలేకపోవటం, గొంతు ప్రదేశంలో వాచి చెప్పలేనంత నొప్పి రావటం.. ఇవే టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ గొంతులో వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కడైనా రావచ్చు. ఇవి రెండూ ఒకే రకానికి చెందినవే అని చెప్పవచ్చు. అయితే టాన్సిల్స్‌ జీవితాంతం అలాగే ఉంటాయి. వయస్సు పరిణామ క్రమంలో వీటి సైజు కొంత వరకూ తగ్గే అవకాశం ఉండొచ్చు అని చేప్పవచ్చు. కానీ పూర్తిగా తగ్గిపోతాయని రూఢీగా చేప్పలేము.

టాన్సిల్స్

టాన్సిల్స్‌ విషయానికొస్తే సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ఇది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలు స్కూళ్లల్లోనో కలిసి ఆడుతున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి బాక్టీరియా, వైరస్‌ల వంటివి సులభంగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదేవిధంగా ‘స్రెప్టోకాకస్‌’ అనే బాక్టీరియా వల్ల గొంతు నొప్పితో ఈ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా టాన్సిల్స్‌కు ఇన్ఫ్‌క్షన్లు వస్తే, ఆ ఇన్ఫెక్షన్‌ గొంతు నుండి శరీరంలోని ఇతర భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. అందుకే టాన్సిల్స్‌ను నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు.

అడినాయిడ్స్

అడినాయిడ్స్‌ విషయానికి వస్తే చిన్న వయస్సులో మొదలయ్యి, 12-13 ఏళ్ల వయసు వచ్చేసరికి మెల్లమెల్లగా కుంచించుకుపోతాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అడినాయిడ్స్‌ సమస్య చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడినాయిడ్స్‌ వాపు వల్ల ముక్కు నుంచి చెవి వరకూ ఉండే గొట్టం మూసుకుపోయి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కర్ణబేరి వెనుక నీరు చేరి, చెవి ఇన్ఫెక్షన్స్‌, వినికిడి లోపం వంటి పెద్ద సమస్యలు చెలరేగుతాయి. ఎదిగే వయస్సులో పిల్లలకూ తరచూ ఈ చెవి ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటే వారికి మాటలు రావడం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సమస్య మరింత ఎక్కువగా బాధిస్తుంటే తగిన వైద్య సలహా మేరకు సర్జరీ ద్వారా తొలగించడమే మంచిదని తాజా అధ్యయనాల వెల్లడిస్తున్నాయి.

టాన్సిలైటిస్‌ గొంతునొప్పి ముఖ్యం

టాన్సిల్స్‌ వాపులో తీవ్రమైన గొంతునొప్పి, గుటక మింగుతుంటే నొప్పి రావచ్చు. టాన్సిల్స్‌ ఎర్రగా వాచి కనబడతుంటాయి. జ్వరం ఉండొచ్చు.‘టాన్సిలైటిస్‌’ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే మెడ దగ్గర-దవడల కింద ఉండే లింఫ్‌ గ్రంథుల వాచి బిళ్లకట్టినట్టు ఉండొచ్చు. ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా గొంతు మారే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్‌ ముదిరితే టాన్సిల్స్‌ మీద, కొండనాలుక మీద చీము తెల్లగా కనబడుతుంటుంది. చాలాసార్లు టాన్సిల్స్‌తో పాటు అడినాయిడ్స్‌ కూడా ప్రభావితం కావచ్చు. రెండూ విడివిడిగా కూడా రావచ్చు.

టాన్సిల్స్ను గుర్తించేదెలా?

1. టాన్సిల్స్‌ వాపు, ఇన్ఫెక్షన్‌ బాహాటంగా కనబడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదిపుల్లతో స్రావాలను సేకరించి, కల్చర్‌ పరీక్ష ద్వారా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నదీ గుర్తిస్తారు.
2. అడినాయిడ్స్‌ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు అనిపిస్తే ముఖాన్ని పక్కకు ఉంచి ఎక్స్‌రే తీస్తారు. అడినాయిడ్‌ ఉబ్బితే.. ముక్కు వెనక ఉండే శ్వాసమార్గం మూసుకున్నట్టు కనిపిస్తుంది. లేదా అద్దంలోగానీ, ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపీ ద్వారాగానీ అడినాయిడ్స్‌ను చూడొచ్చు.

టాన్సిల్స్ కు సహజసిధ్ధ ఆయుర్వేద చికిత్స

చింత విత్తనం

మనకు చింతపండులో వుండే చింత విత్తనం దీనిపై అద్భుతంగా పనిచేస్తుంది. చింత విత్తనాన్ని బండ, లేదా సానరాయి మీద గంధం వచ్చేలా అరగదీయాలి. వచ్చిన గంధాన్ని గొతుక్రింద టాంసిల్స్ వాసి చేతికి తగిలే భాగమ్లో పట్టీలాగా వేయాలి. అలాగే ఒక పుల్లకు దూదిచుట్టి ,దానితో గంధాన్ని తీసుకుని నోరుతెరవమని చెప్పి టాంసిల్స్ కు తగిలేలా పూయాలి. ఇలా రోజుకు నాలుగైదుసారులు టాంసిల్స్ కు పూయాలి . వారము రోజులు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజురోజుకు ఫలితాలు మనకు తెలుస్తుంటాయికనుక మరికొన్ని రోజులు పట్టినా విడవకుండా వాడాలి. మనపెద్దలిచ్చిన వైద్యమిది. దీనివల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

అల్లోపతి చికిత్స?

టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ వాచి ఇన్‌ఫెక్షన్‌కు గురైన వెంటనే యాంటీబయాటిక్స్‌ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతునొప్పి తగ్గేందుకు పారాసిటమాల్‌ వంటివి వైద్యులు ఇస్తారు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రం అవుతుంటే పెన్సిలిన్‌, అమాక్సిసిసిలిన్‌, కోఅమాక్సిక్లావ్‌ వంటి యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. వీటితో 5-6 రోజుల్లోనే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్నా,ఇదే సమస్య మళ్లీమళ్లీ పురావృతం అయ్యి వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమో వైద్యులు పరిశీలిస్తారు.

సర్జరీ ఎవరికి అవసరం?

1. తరచూ టాన్సిల్స్‌, అడినాయిడ్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారికి సర్జరీ అవసరమవుతుంది.ఏడాదికి మూడు సార్ల కంటే ఎక్కువగా దీంతో బాధపడుతుంటే సర్జరీ చెయ్యొచ్చని అమెరికా చెవిముక్కుగొంతు వైద్యుల సంఘం చెబుతోంది.
2. ఏడాదికి ఐదు, అంతకంటే ఎక్కువసార్లు వస్తుంటే సర్జరీ చెయ్యొచ్చని బ్రిటీషు వైద్యుల సంఘం సూచిస్తోంది.
3. ఏడాదికి 3-5 కంటే ఎక్కువసార్లు ఇన్‌ఫెక్షన్‌ వచ్చేవారికి టాన్సిల్స్‌ తొలగించే ఆపరేషన్‌ టాన్సిలెక్టమీ చెయ్యటం మేలు. తరచుగా జలుబు, ముక్కుదిబ్బడ, గురక, నిద్రలో అవరోధం వంటి అడినాయిడ్స్‌ వాపు లక్షణాలుంటే అడినాయిడ్‌తో పాటు టాన్సిల్స్‌ను కూడా తొలగిస్తారు. అలాగే ఏడాదికి 2-3 సార్లే అయినా బాధలు మరీ తీవ్రంగా వేధిస్తున్న వారికీ సర్జరీ చెయ్యాల్సి రావచ్చని వైద్యులు చేబుతున్నారు.

సంప్రదాయ పద్ధతి

టాన్సిల్స్‌ను తొలగించటానికి సంప్రదాయంగా ‘డైసెక్షన్‌ అండ్‌ స్నేర్‌’ పద్ధతి అనుసరిస్తారు. దీనిలో సాధారణ పరికరాలతోనే (కోల్డ్‌ స్టీల్‌) టాన్సిల్స్‌ను తొలగిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్‌, కోబ్లేషన్‌, డిబ్రైడర్‌ వంటి రకరకాల పరికరాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో నొప్పి-రక్తస్రావం వంటివి తక్కువని చెబుతుంటారు. కానీ వాస్తవానికి వైద్యపరమైన అధ్యయనాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో చేసే సర్జరీనే మెరుగ్గా ఉంటోందని గుర్తించారు.
సంప్రదాయ పరికరాలతో చేసే సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువ, నొప్పి తక్కువ, మత్తు ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా కొందరిలో సర్జరీ తర్వాత 5-7 రోజుల్లో రక్తస్రావమయ్యే అవకాశముంటుంది. సర్జరీ తర్వాత సమస్యలూ తక్కువగానే ఉంటున్నాయి. అడినాయిడ్స్‌ సర్జరీ కూడా- కోబ్లేషన్‌, మైక్రోడిబ్రైడర్‌, లేజర్‌ ప్రక్రియల ద్వారా చెయ్యొచ్చు. కానీ సంప్రదాయ పరికరాలతో (అడినాయిడ్‌ క్యూరెట్‌) చేసే పద్ధతే మెరుగని గుర్తించటం జరిగింది. దీంతో సర్జరీ చాలా కొద్ది సమయంలో పూర్తయిపోతుంది.

టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారపదార్ధలు

1. ఆకుకూర

ఉడికించిన గ్రీన్ ఫీలీవెజిటెబుల్స్, ఆకుకూరలు వంటివి థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు బాగా ఉడికించి ఆరసంలో పెప్పర్ పౌడర్ వేసి గోరువెచ్చగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు గొంతునొప్పిని నివారిస్తుంది.

2.బంగాళదుంప

గొంతు నొప్పి నివారణకు చక్కగా పని చేసే వాటిలో ఇది మరొక ఆరోగ్యకరమైన పదార్ధం. బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి, గరిటతో మెత్తగా చిదిమితే సరిపోతుంది.

3.అల్లం

టాన్సిల్స్ తగ్గించడానికి, గొంతు ఇన్ఫెక్షన్ కు ఇది మంచి గృహ చిట్క. గొంతునొప్పికి తక్షణ ఉపశమనం పొందడానికి కొద్దిగా తేనెలో అల్లం పౌడర్ లేదా అల్లం చూర్ణాన్ని కలుపుకొని సేవించాలి.

4. తేనె, నిమ్మ

టాన్సిల్ తగ్గించడానికి మరో మంచి గృహ చిట్క. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో, తగినంత తేనె, నిమ్మరసాన్ని కలుపుకుని త్రాగాలి.

5. ఇడ్లీ

సాధారణంగా ఉన్న ఇడ్లీ చాలా ఆరోగ్యకరం. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండే ఇడ్లీని తినవచ్చు. సాంబార్, పచ్చడి వంటివి వాడకపోవడమే చాలా మంచిది.

6. పెరుగు

టాన్సిల్స్ ఉన్నప్పుడు చాలా మంది పెరుగు తినకూడదని దురాభిప్రాయం ఉంది. పెరుగు సాఫ్ట్ పుడ్ మ్రింగడానికి చాలా సులభంగా ఉంటుంది. గొంతునొప్పి మరియు దురద, గొంతు వాపు వంటివి నివారించడానికి అతి చల్లగా ఉండే పెరుగును తీసుకోకూడదు.

7. ఉడికించిన అన్నం

ఉడికించిన అన్నం మెత్తగా ఉండటమే కాకుండా మ్రింగడానికి సులభంగా ఉంటుంది. స్పైసీ రైస్ ప్రిపేర్ చేయడం కంటే ప్లెయిన్ రైస్ తినడం మంచిది. మరీ ప్లెయిన్ గా తినడం ఎలా అనుకొంటే టాన్సిల్స్ నివారణకు ఉపయోగపడే మసాలా దినుసులు(చెక్క, లవంగం వంటివి)కలుపుకోవచ్చు.

టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. పాలు, పసుపు

రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటూ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.

2. ఉప్పు

టాన్సిల్స్ వల్ల వచ్చే నొప్పిని నియంత్రించటానికి ఉప్పు చక్కటి ఔషధం. కప్పు వేడి నీళ్లలో ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

3. పసుపు

టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో పసుపు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. చెక్క

ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి రోజూ రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గొంతులో వేధించే నొప్పి, వాపు కూడా తగ్గిపోతాయి.

5. నిమ్మరసం

టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.

6. మిరియాలు

ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.

7. తులసి

తులసి ఒక యాంటి ఇంఫ్లమటరీ గుణాలు ఉన్నది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేశాక 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు తీసుకుంటే టాన్సిల్స్ తగ్గి మంచి ఫలితం ఉంటుంది.

Posted on

కాన్సర్ కాటేస్తానంటోంది – Non vegetarian food causes cancer in telugu

వేటమాంసం, ప్రాసెస్ మాంసాలు అతిగా తినటం వల్ల గుండె రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్తూలకాయం వస్తుందనీ చాలా కాలంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వీటివల్ల రకరకాల కాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ ఓ ) చెబుతున్నదేమిటంటే పాశ్చాత్య దేశాలలో 30 శాతం కాన్సర్లు రావటానికి అక్కడి ఆహారపు అలవాట్లకు సంబంధం ఉందట. ఇక మన దేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా 20 శాతం కాన్సర్లకు , మనం తినే ఆహారానికీ లింకు ఉందట. మాంసం తినటం మానేసిన వారికి కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిన్నట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
ఆరు నెలల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది.అందులో ఒక జాబితాని సిధ్ధం చేశారు. ప్రమాదకరమైన కాన్సర్ కారకాల పేర్లతో కూడిన గ్రూప్-1 లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక కాన్సర్ తెచ్చే అవకాశం ఉన్న ఆహార పదార్ధాల పేర్లతో కూడిన గ్రూప్-2ఎ లో రెడ్ మీట్(వేట మాంసాన్ని) పేర్కొన్నారు. గొడ్డు మాంసం, పంది మాంసం, పెయ్య దూడ మాంసం, గొర్రె మాంసం వంటివి రెడ్ మీట్ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తీసుకోవటం వల్లే మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినటం వల్ల ఏటా కాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రతి రోజూ తింటే

అతి సర్వత్రా వర్జయత్- దేనిలోనైనా అతి పనికిరాదు అన్న చందంలో మాంసం తినే విషయంలో కూడా ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతిరోజూ మాంసం తినే వారికి పెద్ద ప్రేగు కాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. అదీ ఈ రిస్క్ 3 రెట్లు ఎక్కువ అంటోంది హార్వార్డ్ విశ్వవిద్యాలయం. దీనికి కారణాలు అన్వేషిస్తే-మాంసంలో పీచు పదార్ధం కానీ, సమ్రక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు, పైపెచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెస్సింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్నోగ్రతల్లో వండుతున్నప్పుడు కాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్(హెచ్సీఏ) పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్(పీఏహెచ్) ఏర్పడతాయి. అవి కాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. ప్రాసెడ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల వక్షోజ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇలాంటి కాన్సర్లు కూడా..
గొడ్డు మాంసం, పందిమాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసెస్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

ప్రోసెస్డ్ మాంసంతో పురీషణాల కాన్సర్

ఇటీవలి కాలంలో పురీషణాల క్యాన్సర్(కోలో రెక్టల్ క్యాన్సర్)ఎక్కువ అవుతుంది. ప్రోసెస్డ్ మాంసం అతిగా తీసుకున్నా, అతిగా ఉడికించినా మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే మాంసం పాడవకుండా ఉండటానికి సహజంగా కానీ, కృత్రిమంగా కాని, నైట్రేట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్ధాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్ధాలని ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినటం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది.

గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే

నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించటం(గ్రిల్డ్ మాంసం), కాలచటం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్(పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్ లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడిపెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్ లు వస్తాయి. దాంతో ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఉంది.

అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్

కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్ధాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్ధాలు, తినటం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్తీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాలలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే మాంసం, పాల ఉత్పత్తుల ద్వార అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అయితే మాంసాహారం తక్కువ కావటం వల్ల విటమిన్-బి-12, విటమిన్-ది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి.

Posted on

శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతున్నారా? – Premature ejaculation tips in Telugu

భాగస్వామి అసంతృప్తపు చూపులు..ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి..ఓవైపు బాధ..మరోవైపు ఈ సమస్య నుంచీ అధిగమించటం ఎలా? అన్న సంధిగ్ధ స్థితి..సెక్స్ లో పాల్గోనే సమయంలో హఠాత్తుగా స్కలనమైపోతుంది..ఏంటీ ఈ సమస్య అని తలపై చెయ్యి పెట్టి బాధతో నిస్సహాయస్థితి..ఈ సమస్య పేరే శీఘ్ర స్కలనం..
ఈ సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన మగవారిలో ప్రారంభమవుతుంది. ఈ సమస్య వల్ల వివాహ జీవితం, కుటుంబ జీవితం నాశనం అవుతాయి. ఈ సమస్య తో బాధపడే మగవారు విపరీతమైన విసుగుదల, వారిపై వారికి కోపం, విరక్తితో జీవిస్తుంటారు. చాలా మంది ఈ సమస్య వల్ల ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాగే చాలా ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్య ఏ ఒక్కరికోదో కాదు. చాలా మందిలో ఈ సమస్య నెలకొని ఉంది. దీనికి పూర్తిగా మీరు కారణం కాదు. కానీ కొన్ని రకాల విధానాలు అంటే టెక్నిక్స్ ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడే వెంటనే ఈ సమస్య నుంచీ బయటపడలేరు. కొన్ని విధానాల్ని పాటిస్తే మీరు చక్కటి సెక్స్ జీవితాన్ని అనుభవించవచ్చు. కాకపోతే ఈ విధానాలను పాటించే క్రమంలో మీకు ఈ సమస్య కొన్ని వారాలలో లేదా కొన్ని నెలల వ్యవధిలోసరి అవ్వవచ్చు. కానీ, ఈ సమస్యను అధిగమించాలంటే మీ భాగస్వామి సహాయసహకారాలు ఎంతో అవసరం. మీ సమస్య గురించి మీ భాగస్వామికి అర్ధం అయ్యేలా వివరించాల్సిన బాధ్యత మీదే. మీ భాగస్వామి మిమ్మల్ని అర్ధం చేసుకుని సెక్స్ లో మీకు సహకరిస్తే మెల్ల మెల్లగా మీకు ఈ శీఘ్ర స్కలన సమస్య తీరిపోతుంది. లేదా మీ సెక్స్ జీవితం పూర్తిగా దుర్భరమైపోతుంది.
సాధారణంగా భాగస్వామి సెక్స్ లో మంచి ఒత్తిడి తో కూడిన సెక్స్ ని అలాగే సంభోగంలో పూర్తి సంతృప్తిని ఆశిస్తుంది. కానీ ఎవరైతే వారి భాగస్వామి సంతృప్తిని అంటే దీనినే భావప్రాప్తి అంటారు పొందరో వారు ఎంతో అసహనంగా ఉంటారు. అంతేకాక ఆడవారికి భావప్రాప్తి జరుగకుండా మగవారు శీఘ్ర స్కలనం చేసుకుంటారో వారి భాగస్వామికి సంతృప్తి ఉండదు. ఇటువంటి సమస్య ఉన్నపుడు మీ సెక్స్ సమస్యల్ని వైద్యునితో చెప్పేందుకు వెనుకాడరాదు. ఈ శీఘ్ర స్కలన సమస్య వృధ్ధులలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫాస్ట్ జనరేషన్ లో కూడా అలవాట్లు, ఆహారవిధానాల వల్ల ఇప్పుడు ఇది తక్కువ వయస్సులోను తలెత్తుతోంది. కానీ నిరుత్సాహపడవద్దు. కొన్ని మార్గాల ద్వారా మీరు ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు. ఆ చికిత్సా విధానాలు మీ ఇంటనే ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా మీకోసం తెలుగు టిప్స్ అందిస్తోంది. అవెంటో చూద్దామా..
శీఘ్ర స్ఖలన సమస్యకు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే పురుషులు శీఘ్ర స్కలనం సమస్యను అధిగమించి, తన మహిళా భాగస్వామికి తగిన సంతృప్తిని అందించే విధంగా రతిక్రీడను కొనసాగించగలరు. కామోద్రేకానికి భంగం కలగకుండా శీఘ్ర స్కలనం జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఆక్యుపంచర్

దీనినే సూది చికిత్సా అని తెలుగులో అంటారు. అంటే సమస్యను విస్లేషించి దాని మూలాల వరకూ పరిష్కారం దొరికేలా చికిత్స అందించటం అన్నమాట. ఈ చికిత్స శీఘ్ర స్కలన సమస్య నుంచి అధిగమించటానికి చాలా మంచిది. కాకపోతే ఈ చికిత్స తీసుకునేందుకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి. అవేంటో  తెలుసుకుందాం:
1. నిల్వ ఉంచిన పదార్ధాలను తినకూడదు. అలాగే చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినకూడదు.
2. మధ్యపానానికి స్వస్తి పలకండి.
3. పొగ త్రాగటం, డ్రగ్స్ తీసుకోవటం పూర్తిగా మాని వేయాలి.
4. కెఫైన్ పదార్ధాలను దూరంగా ఉంచండి. ప్రత్యేకంగా కాఫీ.
5. మీరు రోజూ రకరకాల పండ్లను అలాగే కూరగాయని తినాలి.
6. శీఘ్ర స్కలన సమస్య పోవాలంటే మినరల్స్ ప్రధాన పాత్రని పోషిస్తాయి. కాబట్టి మినరల్స్ ఉన్న ఫుడ్ మీరు తీసుకోవాలి. చేపలలో మినరల్స్ బాగ ఉంటాయి కాబట్టి చేపలు ఎక్కువగా తినాలి.

శీఘ్ర స్కలన సమస్యకు కొన్ని గృహ చిట్కాలు (Telugu remedies for premature ejaculation)

1.ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు: ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు మీ శీఘ్ర స్కలన సమస్యను తొలగిస్తాయి. వీటిని మీరు బాగా గుజ్జుగా చేసి నీటిలో కలుపుకుని తాగితే చక్కగా ఈ సమస్య నయం అవుతుంది. అంతేకాదు మీరు తెల్ల ఉల్లిపాయల్ని, రోజూ వాడే ఉల్లిపాయని కూడా వాడవచ్చు.
2.అశ్వగంధ: అశ్వగంధ శీఘ్రస్కలన సమస్యకు మంచి మందు. ఇది ఆయుర్వేదం లో చాలా విశిష్టమైన గుణాలు ఉన్న మందు. కానీ దీనిని వాడేముందు వైద్యుని సలహా ఎంతో అవసరం. వైద్యుని సలహా మేరకే దీనిని వాడాలి. ఈ హెర్బ్ మీ సామర్ధ్యాన్ని బాగా పెంచుతుంది. అలాగే ఆర్గాన్లను పెంచుతుంది.
3. అల్లం, తేనె: అల్లం మరియు తేనె మీ శీఘ్ర స్కలన సమస్యను నివారించగలవు. అల్లం రక్త ప్రసరణను సరిచేస్తుంది. అలాగే తేనె ఒక మంచి నిరోధకంగా పనిచేస్తుంది. రోజూ 1/2 టేబుల్ స్పూన్ అల్లం అలాగే తేనె పడుకునే ముందు తాగి పడుకుంటే మీ సెక్స్ జీవితం ఎంతో మెరుగుపడుతుంది. ఇవి వెంటనే ఫలితాల్ని ఇవ్వవు కానీ మెల్లగా వీటి పని తీరు గమనించవచ్చు.
4. వెల్లుల్లి: మరో సహజసిధ్ధమైన మందు వెల్లుల్లి. ఇది మీ రక్త ప్రసరణను చక్కగా జరిగేలా చేస్తుంది. అంతేకాక మీ శరీరానికి వేడిమి కలిగిస్తుంది. రోజూ 3-4 వెల్లుల్లి రెబ్బల్నితీసుకుని వాటిని ఆవు పాలతో వేసి వేడి చేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ లోనికి వచ్చాక వీటిని తీసుకుని మీరు నమలాలి. ఇలా రోజూ చేస్తే ఎంతో మంచిది.
5.మీరు ఒక హాఫ్ బోయిల్డ్ గుడ్డు ను తీసుకుని దానికి క్యారెట్ ముక్కల్ని కలిపి దానికి తేనె 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. ఇలా 3 నెలల పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. తర్వాత మెల్లగా గుడ్డును దీనిలో వాడటం తగ్గించేయాలి.
6.శీఘ్ర స్కలన సమస్యకు అస్పారగస్(asparagus) చక్కగా నిరోధకంగా పనిచేయగలదు. మీరు రోజూ ఈ అస్పారగస్ వేర్లను తీసుకుని వాటిని పాలల్లో వేసి కలుపుని తాగాలి. లేదా వీటి పవ్డర్(powder) వేసుకుని తాగాలి. లేదా పాలల్లో ఈ అస్పారగస్ వేళ్ళను బాగా ఉడికించుకుని ఆ మిశ్రమా రసాన్ని వేసుకున్న తర్వాత వేర్లను పారేసి తాగాలి. ఈ పాలను రోజుకి రెండు సార్లు తాగాలి.
ఈ ఆక్యుపంచర్ విధానం చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ విధానం అనుసారం ఎక్కడైతే సమస్య ప్రారంభానికి మూలాలు ఉన్నాయో వాటిని తీసివేస్తే చాలు. కానీ కొన్ని హార్మోన్ల లోపం, అలాగే అంగ స్థంభన సమస్యలు కూడా కారణం కావచ్చు.

బెండకాయ

బెండకాయ రోజు వారీ వంటల్లో సాధారణంగా ఉండే కాయగూర. అయితే ఇది శీఘ్ర స్కలన సమస్యను కూడా దూరం చేస్తుందనేది నిజం. మార్కెట్లో బెండకాయల powder సాధారణంగా దొరుకుతుంది. ఈ పవ్డర్ ను రోజూ వాడితే ఎంతో మంచిది. దీనిని వేడి నీటిలో లేదా సుగర్ తో కలిపి రోజూ తాగటం ఎంతో మంచిది. అయితే దీన్ని తీసుకోవటం వల్ల మీకు ఏరకమైన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. లేదా రోజువారీ ఆహారంలో తీసుకున్నా మంచిదే.

క్యారెట్స్

క్యారెట్స్ శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. క్యారెట్ ఒక్క ఈ సమస్యకే కాదు, మరేన్నో సమస్యలను దూరం చేసేదిగా ఉంది. చాలామంది వారి శరీర చర్మ సౌందర్యం కోసం వీటిని వాడుతుంటారు. అంతేకాక ఈ క్యారెట్స్ సగం ఉడికిన అంటే హాఫ్ బాయిల్డ్ గుడ్డుతో కలిపి 3 టేబుల్ స్పూన్స్ తేనె కలిపి తాగితే ఈ సమస్య చక్కగా పరిష్కారమవుతుంది.

శీఘ్ర స్కలనాన్ని నివారించేందుకు వాడకూడని పదార్ధాలు

పైన తెలిపిన డైట్స్ ఒక్క ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కే పరిమితం కాదు అలాగే ఇంకో రకంగా మీ శీఘ్ర స్కలన సమస్య నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగపడతాయి. మీ శరీరానికి మినరల్స్ కాకుండా అలాగే విటమిన్స్, జింక్, క్యాల్షియం, సెలీనియం, ఐరన్ కూడా మీ శరీరంలో ఎక్కువగా ఉండాలి. అలాగే ఫోలిక్ యాసిడ్స్ మీ రక్త ప్రసరణను పెంచుతాయి. కానీ ఇవి ఎక్కువ ఉండే పదార్ధాలను మోతాదుకు మించి తీసుకోవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే డయేరియా వచ్చే అవకాశం కూడా ఉండి.

శీఘ్ర స్కలన సమస్యను నివారించేందుకు చేయాల్సిన వ్యాయామం (Telugu exercises to treat quick discharge)

ఇంకో ప్రధానమైన విషయమేమంటే మీరు శీఘ్ర స్కలన సమస్య నుంచీ బయటపడాలంటే మీ శరీరం ఎప్పుడూ దృఢంగా ఆరోగ్యంగా ఉంటే ఈ సమస్య తలెత్తదు. అందుచేత రోజూ వ్యాయామం మీ శరీరానికి ఎంతో అవసరం. మీ బాగస్వామి మీకు వీర్య స్కలనం త్వరగా అయిపోతే సంతృప్తి చెందదు. ఎవరైన తమ సెక్స్ జీవితం నిర్జీవంగా నాశనం అవ్వటం కోరుకోరు. దీనికోసం శరీరం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం కొన్ని వ్యాయామాలు చేయటం మంచిది. అవేంటో చూద్దామా..!

బలంగా శ్వాస తీసుకోవటం

ఈ విధానం సహజసిధ్ధంగా శీఘ్రంగా స్కలనమవ్వకుండా ఉండేలా చేస్తుంది. అయితే ఇది టెన్షన్ ను పోగొట్టి నెమ్మదితన్నాన్ని అలవరుస్తుంది. హార్ట్ బీట్ ను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల సెక్స్ సమయంలో టెన్షన్ లేకుండా ఉంటుంది. బలంగా శ్వాసించటం చేసేప్పుడు బలంగా శ్వాస తీసుకుని 5 సెకనుల పాటు ఆపాలి. ఇలా చేయటం దాదాపు 5 నిముషాలపాటు చేస్తే చక్కని ఫలితాలుంటాయి. ఈ విధానం మీరు సంభోగ సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

స్క్వీజ్ మెథడ్

ఈ విధానం సంభోగ సమయం ఇరువురు చేయాలి. మీ భాగస్వామి అంగాన్నీ స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు స్కలన స్థాయికి చేరుకున్న వెంటనే ఆగి మరలా సెక్స్ చేసే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మీరు ఒక్కరే అయినా చేసుకోవచ్చు. లేదా మీ భాగస్వామి అయిన చేయవచ్చు. ఈ విధానం వల్ల ఇరువురూ ఆనందించవచ్చు.

హస్తప్రయోగ విధానం

మీరు ఈ విధానాన్ని ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకంటే మీపై మీకే నిగ్రహ శక్తి ఎంతో అవసరం. ఈ విధానంలో మీరు హస్తప్రయోగం చేసుకునే సమయంలో మధ్య..మధ్యలో..హస్త ప్రయోగం ఆపి అలాగే మరలా హస్తప్రయోగం చేసుకుంటూ ఇలా స్కలన స్థాయికి చేరుకున్న ప్రతిసారి ఇలా చేస్తే చక్కగా  మీరు సెక్స్ లో కూడా ఎక్కువ సేపు సెక్స్ చేస్తూ కాసేపు ఆగి అలాగే మరలా సెక్స్ చేసే కంట్రోల్ ను పొందుతారు. ఇలా చేస్తే మీకు మీపైన ఒక గ్రిప్ వస్తుంది.

కేగల్ ఎక్సెర్సైజెస్

ఈ కేగల్ ఎక్సెర్సైజెస్ లో భాగంగా ఉండే ఆపి మరలా చేసే విధానం ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మగవారిలో పెల్విక్ రీజన్ అంటే తెలుగులో కటి ప్రాంతాన్ని మెరుగు పరిస్తే ఆడవారిలో పబోకోకీజియస్(pubococcygeus) కండరాలను మెరుగుపరుస్తుంది. అలాగే శీఘ్ర స్కలన సమస్యను అధిగమించాలంటే ఈ కెగల్ ఎక్సర్సైజెస్ ఎంతగానో సహాయపడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఈ స్కలనం ఒక నరంలో నుంచీ జరుగుతుంది. అయితే మీకు ఆ నరం ఏదో తెలియకపోతే మీరు యూరిన్ కు వెళ్ళినప్పుడు యూరిన్ మధ్య మధ్యలో ఆపి ఆపి చేసినట్ట్లయితే మీకు తెలుస్తుంది. పబోకోకీజియస్ నరం ఈ ప్రక్రియను చేస్తుంది. ఈ విధానాన్ని చేసేప్పుడు ఆ వ్యక్తి తన తొడలను, పొత్తికడుపును, పిరుదలనూ వాడరాదు. ఈ నియంత్రణా విధానాన్ని రోజూ చేస్తూ ఉండాలి. ఈ విధానాన్ని రోజుకు మూడు సెట్స్ గా చేయాలి. అంటే 10 సెకనులు గ్యాప్ సెట్ కి ఒకసారి తీసుకోవాలి.

తాంత్రిక విధానాలు

ఈ తాంత్రిక విధానాలు శీఘ్ర స్కలన సమస్యను నివారించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాక ఇవి మత పరంగా వివరిచబడినవే. అంతేకాక వీటిని అవలంబించటం వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. సెక్స్ సంభోగం జరిపే సమయంలో భాగస్వామితో స్కలానికి చేరువైనప్పుడు ఆ సమయం లో వెంటనే అంగాన్ని బయటకు తీసివేయాలి. అలా తీసిన వెన్టనే ఆ వ్యక్తి గడ్డాన్ని చెస్ట్ భాగంలో ఉంచుకోవాలి. అప్పుడు వెంటనే బలమైన శ్వాస తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల సెక్స్ సంభోగంలో రతి క్రీడ పై పట్టు వచినట్లే.

ప్రోమిసెంట్

ఇది నూతనంగా, అత్యాధునికంగా వచ్చిన మెడిసిన్. దీనిని ఈ మధ్యే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఆమోదించింది. ఇది శీఘ్ర స్కలను సమస్యను నుంచీ దూరం చేస్తుంది. సంభోగానికి 10 నిముషాల ముందు ఈ మందు అంగానికి రాసుకోవాలి. ఇది చర్మంలోనికి కలిసిపోతుంది. దీనివల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉండవు. సెక్స్ చేసే సమయమూ పెరిగే అవకాశం ఉంది. ఈ మందులు కేవలం శీఘ్ర స్కలన సమస్యను తీర్చేవే కానీ వీటి వాడకం మాత్రం కేవలం డాక్టరు సలహా మేరకే వాడాలి.

వివిధ రకాలైన మందులు

చాలామంది శీఘ్ర స్కలన సమస్యతో బాధపడకపోయినప్పటికీ కొన్ని ఒత్తిడుల వల్ల కూడా సెక్స్ లైఫ్ లో ఇబ్బందులెదుర్కొంటారు. కానీ ఇలాంటి సమయాల్లో మీకు కొన్ని రకాల మందులు ఉన్నాయి. అవేంటంటే జోలోఫ్ట్, ప్రొజాక్ మందులు వాడవచ్చు. ఇవి వాడేముందు మాత్రం డాక్టరు సలహా తీసుకోవాలి. ఈ మందుల్ని పడుకునే ముందు కొన్ని గంటల ముందు వేసుకుంటే చాలు. ఇవి శీఘ్ర స్కలన సమస్యను తీర్చటమే కాదు సెక్స్ పై కూడా చక్కగా పనిచేస్తాయి.

బెంజొకైన్ కూడిన కండోంలు

ఈ కండోంలు శీఘ్ర స్కలనాన్ని నియంత్రించే అంటే క్లైమేక్స్ కంట్రోల్ కండోంలు అంటారు. ఈ కండోం ప్రత్యేకత ఏన్టంటే మీ సెక్స్ యాక్టివిటీని పెంచుతుంది. దాదాపు మీరు సెక్స్ చేసేపుడు ఎప్పుడైతే మీరు క్లైమ్యాక్స్ చేరుకుంటారో అక్కడి నుంచి మరలా ఒక 5 నిముషాల వ్యవధిని ఈ కండోం పెంచుతుంది. దీనిలో ఉన్న బెంజొకైన్ అంగంపై పనిచేయటం వల్ల ఈ శీఘ్ర స్కలన సమస్యను తీరుస్తుంది. అంతేకాక మీరు సెక్స్ చేయకపోయినా మీరు హస్తప్రయోగం చేసుకునేప్పుడు ఈ కండోమ్ను ధరించి ప్రయత్నిస్తే శీఘ్ర స్కలన సమస్య నుంచీ మీరు మిమ్మల్ని బయటపదేందుకు మీకై మీరు ప్రాక్టీస్ చేయవచ్చు.

వ్యూహాత్మక ఒత్తిడి కలిగించటం

అవును..సెక్స్ లో పాల్గొనేప్పుడు ఈ వ్యూహాన్ని అనుసరించటం ఎంతో మంచిది. సెక్స్ సమయంలో మీరు ఈ విధానాన్ని అవలంబిస్తే చాలా ఉత్తమం. దీనిలో మొదటిది సెక్స్ చేసే సమయంలో పెరీనియం అనే అంగాన్ని ప్రెస్ చేస్తూ సెక్స్ చేయాలి. ఈ అంగాన్నే తెలుగులో మూలాధారము – ఉప స్థేంద్రియమునకు గుద ద్వారమునకు మధ్య గల ప్రదేశము అని అంటారు. ఇది ప్రోస్టేజ్ గ్రంధి వరకూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు శీఘ్ర స్కలనం కాకుండా ఉంటుంది.

ఆతృతను తగ్గించుకోవటం

సెక్స్ అనగానే చాలా మందిలో ఎంతో ఆతృత పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ యాక్టివిటీని చక్కగా అనుభవించాలని ఉంటుంది. కానీ ఈ ఆతృతే చాలావరకూ ఈ శీఘ్ర స్కలన సమస్య కు గురి అయ్యేలా చేస్తుంది. ఏదో చేయాలన్న తొందరలో చివరకు ఏమీ చెయ్యలేదన్న బాధ వేధిస్తుంది. కాబట్టి చక్కగా సెక్స్ ని వ్యూహాత్మకంగా, మీ భాగస్వామిపై ప్రేమతో చేయండి.

భిన్నంగా ఆలోచించటం

సెక్స్ చేసేందుకు భిన్నంగా ఆలోచించండి. ఎందుకంటే ఆతృత తో కూడిన ఆలోచనలు శీఘ్ర స్కలనానికి దగ్గర చేస్తే భిన్నంగా అలోచిస్తే మీ సెక్స్ లైఫ్ బాగుంటుంది.

బ్రేకులు ఇవ్వడం

తొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలకు కూడా అసంతృప్తి కలుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే సంభోగ వేగంపై దానిపై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడంపై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగండి. అంటే, కాస్తా బ్రేకులు వేయాలన్న మాట.

ఫోర్‌ప్లే

స్త్రీపురుషులు ఇద్దరు ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంభోగ క్రియను ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

లైంగిక క్రియను నియంత్రించడం

పైన ఉండి సెక్స్ చేసే వ్యక్తికి సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంభోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్ది రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ మహిళా భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.

భాగస్వామి అంగీకారంతో మాత్రమే

ఇద్దరి అంగీకారం మేరకు, అంటే ఇద్దరికి భావప్రాప్తి కలిగిందని అనుకున్నప్పుడు రతిక్రీడను విరమించడానికి స్కలనం జరిగేలా చూసుకోవాలి. రతిక్రీడ జరుపుతూనే ఆమెను మాటల్లోకి దించి ఎలా చేయాలి, ఎంత సేపు కావాలి, ఇంకా కావాలా అంటూ అడుగుతూ వెళ్లండి. ఆమె సమాధానాలను బట్టి రతిక్రీడను మీ నియంత్రణలో ఉంచుకోండి. దీనివల్ల ఇరువురు ఒకేసారి భావప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.

వివిధ భంగిమలను ప్రయత్నించండి

మీరు సెక్స్ లో పాల్గొనేప్పుడు సాధారణంగా మగవారే పైన ఉండి సెక్స్ చేస్తారు. దీని వల్ల ఈకువ ఉద్రేకానికి కూడా మీరే గురి అవుతారు. రతి క్రీడ జరిగే సమయంలో మీ పెన్నిస్ ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడి కి గురి అయితే మీ గ్లాండ్స్ కి బాగా ఒత్తిడి కలిగి త్వరగా స్కలనం అయిపోతుంది. కాబట్టి మీరు దీనిని తొలగించుకునేందుకు మీరు పొజీషన్స్ మారుస్తూ ఉండాలి. దీని వల్ల సెక్స్ ఎక్కువసేపు చేయగలుగుతారు. మీ పర్ట్నర్ కూడా అనందించగలరు. రతిక్రీడలో మీరు కింద ఉండి..మీ పార్ట్నర్ పైన ఉంటే అప్పుడు మీరు ఒక కొత్త అనుభూతిని అలాగే ఒత్తిడి లేని సెక్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ పొజీషన్ ఎంత బాగుంటుందో మీరే అనుభవించవచ్చు. ఈ పొజీషన్ అన్ని భంగిమల కంటే టాప్ అని ఎప్పటికీ కూడా చెప్పవచ్చు. ఒకసారి ప్రయతించి చూడండి. ఈ పోజీషన్లో మీ భాగస్వామి ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. అంతేకాక ఈ భంగిమలో సెక్స్ చేసేప్పుడు వక్షోజాలను మీరు ఒత్తిడికి గురిచేస్తే ఎంతో బాగుంటుంది. ఇరువురూ ఆనందించగలరు. అంతేకాక పక్క పక్కనే పడుకునే పొజీషన్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు యాంత్రికమైన, ప్రమాదకరమైన భంగిమల్ని ప్రయత్నించవద్దు. ఎందుకంటే అవి మీ అంగాన్ని దెబ్బ తీయవచ్చు.

మెల్లగా రతి క్రీడ జరుపటం

ఆలస్యం అమృతం విషం అనే సామెతను కాక నిదానమే ప్రధానం అనే సామెతను మీరు ఇక్కడ పాటించాలి. ఎంతసేపటిలో త్వరగా పూర్తి చేద్దామా.. అన్న అలోచనకు స్వస్తి పలకండి. మెల్లగా సెక్స్ మొదలు పెట్టి అధరామృతాన్ని గ్రోలుతూ, వక్షోజాలను చూషిస్తూ, ఒకరినొకరు ఉద్రేకపరచుకుంటూ, చుంబనాలతో ఆనదించండి. అంతేకాక ఫోర్ప్లే కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి. ఓరల్ సెక్స్ చేస్తే చాలా వరకూ ఇరువురూ ఆనందించవచ్చు. అయితే ఇరువురూ సమ్మతము ఇక్కడ అవసరం. రతిక్రీడలో ఎంతో ఓపన్ గా ఉంటే అంతగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకరినొకరు సహకరించుకుంటూ సెక్స్ ని ఎంజాయ్ చేయండి.

ట్రైనింగ్ మరియు ఎక్సర్సైజెస్

పబోకొసిజియస్ గ్రంధిని బలోపేతం అయ్యేలా అలాగే నియంత్రించుకునేలా ప్రయత్నించండి. సెక్స్ లో ఈ గ్రంధి చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇందుకు మీరు ఎప్పుడూ కేగల్ ఎక్సర్సీజెస్ ను చేయాలి. కేగల్ ఎక్సెర్సైజెస్ లో భాగం ఉండే ఆపి మరలా చేసే విధానం ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మగవారిలో పెల్విక్ రీజన్ అంటే తెలుగులో కటి ప్రాంతాన్ని మెరుగు పరిస్తే ఆడవారిలో పబోకోకీజియస్ కండరాలను మెరుగుపరుస్తుంది. అలాగే శీఘ్ర స్కలన సమస్యను అధిగమించాలంటే ఈ కెగల్ ఎక్సర్సైజెస్ ఎంతగానో సహాయపడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి చిట్కాలను పాటించటం వల్ల మీకు శీఘ్ర స్కలన సమస్య దూరం అవుతుంది. అలాగే సెక్స్ లైఫ్ ను బాగా ఆనందించగలరు. మీరే కాదు మీ భాగస్వామి కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

Posted on

మీ చర్మం పై టాన్ ను తొలగించాలంటే? – Tan removal tips in Telugu

సూర్యుని కాంతికి చర్మం కందిపోయి పాడయిపోవటం చాలా మందికి కలిగే సమస్య. ఇది చర్మాన్ని డార్క్ గా చేయటమే కాకుండా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిలో ముఖ్యంగా చర్మంపై ప్యాచులు పడటం, ర్యాషెస్ రావటం, చర్మం సాగుదలకు గురి అవ్వటం లాంటివి జరుగుతాయి. అంతేకాక ఇది మీ చర్మాన్ని డార్క్ గానూ, మీ చర్మం నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఈ రోజుల్లో సన్ టాన్(Sun tan) నుండి రక్షణ పొందుటకు అనేక కాస్మటిక్ ప్రొడక్ట్స్ మరియు బ్లీచింగ్ విధానాలు వచ్చినవి. కాని అవి వాడటం వలన చర్మానికి చాల హానికరం. సహజమైన చిట్కాలను వాడటం వలన శరీరానికి ఎటువంటి హాని కలుగకుండా సన్ టాన్(Sun tan) ని తొలగించవచ్చు.

సన్ టాన్ రావడానికి గల కారణాలు (Telugu causes for sun tan)

సన్ టాన్(Sun tan) రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలను ఎక్కువగా వాడటం వలన లేక రసాయనాల దగ్గర పని చేయడం వలన కూడా సన్ టాన్ వస్తుంది. UV కిరణాలు శరీరం మీద పడటం వలన కూడా సన్ టాన్ వస్తుంది. ఎక్కువగా ఆటలు ఆడేవారికి మరియు కలుషిత వాతావరణంలో తిరిగేవారికి సన్ టాన్(Sun tan) సంభవిస్తుంది. బయటనుండి వచ్చిన తరువాత స్నానం చేయకుండా శరీరం మీద అశ్రద్ధ చేస్తే సన్ టాన్ వచ్చే అవకాశం ఉంది.

మహిళలందరికీ ఒక శుభవార్త మీరు గృహ చిట్కాలను పాటించడం ద్వారా మీ సన్ టాన్(Sun tan) ను తొలగించవచ్చు. కొన్ని చిట్కాలు సూచనలు క్రింద ఇవ్వబడినవి.

సన్ టాన్ ను తొలగించుటకు ఇంటి చిట్కాలు (Telugu remedies for sun tan)

బెకింగ్ సోడా

బెకింగ్ సోడాని ఉపయోగించి సన్ టాన్(Sun tan) ని ఎలా తొలగించాలి అంటే? దీనిని నీటితో కలిపి పేస్టు తయారు చేసి మీ చేతులకి మరియు ఎక్కడైతే సన్ టాన్ ఉందో అక్కడ రాయడం వలన మీకు సన్ టాన్ పోయి మీ సహజ చర్మం మీకు లభిస్తుంది. ఇలా రోజు విడిచి రోజు చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్

ఉత్తమమైన చిట్కాను ఉపయోగించి సన్ టాన్(Sun tan) ను తొలగించడం ఎలానో మీకు తెలుసా? సమాన పరిణామాలలో వెనిగర్ని మరియు నీటిని ఒక బౌల్లోకి తీసుకొని కలపాలి. మీ చేతులను ఆ బౌల్లో 5 నుంచి 10 నిమిషములు ఉంచి తీసిన తరువాత చల్లని నీటితో చేతులను కడగాలి. మీకు మంచి ఫలితం వచ్చేవరకు ఇలా రోజు చేయడం మంచిది.

పెరుగు మరియు శనగపిండి

పెరుగు, శనగపిండి మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ప్రతీ పదార్ధం యొక్క పరిమాణాలు ఒక్కటేలా ఉండాలి. ఈ పేస్టుని సన్ టాన్ ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే దానిని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది సన్ టాన్ ని తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది.

పసుపు మరియు పచ్చి పాలు

పాలల్లో పసుపు మరియు నిమ్మరసం కలిపి టాన్ ఉన్నచోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే చల్లని నీటితో కడగాలి. ఇలా ముఖానికి అప్లై చేయటం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.

అలానే మీరు సన్ టాన్(Sun tan) ఉన్నచోట కొబ్బరి నీటిని అప్లై చేసి ఆరిన తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి

మీకు బొప్పాయితో టాన్(Tan) చర్మాన్ని వదిలించుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలిగిందా? బొప్పాయి గుజ్జు కూడా సన్ టాన్ ను పోగొట్టుటలో సహకరిస్తుంది. బొప్పాయి గిజ్జుని తీసుకొని ఎక్కడైతే టాన్ స్కిన్ ఉందో అక్కడ 10-15 నిమిషములపాటు మసాజ్ చేసి, 10-15 నిమిషముల తరువాత ఆరిన ఫీలింగ్ కలిగితే చల్లని నీటితో కడగాలి.

ముల్తాని మట్టి మరియు సొరకాయ

మనకు సొరకాయ మార్కెట్లో చాల సులువుగా లభిస్తుంది. సొరకాయ గుజ్జుని తీసుకొని దానిలోకి ముల్తాని మట్టిని కలిపి పేస్టు తయారు చేసి దానిని సన్ టాన్(Sun tan) ఉన్నచోట ముఖము, మెడ మరియు చేతులకు అప్లై చేయాలి. చల్లని నీటితో కడిగిన తరువాత ఫలితాన్ని మీరు గమనించవచ్చు.

ఇలానే కాకుండా సూర్యరశ్మి మీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవడం వలన కూడా మీకు టాన్ స్కిన్ రాకుండా ఉంటుంది. 10.00 నుంచి 4.00 గంటల మధ్యలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ ఆ సమయంలో బయటకు వెళ్ళవలసి వస్తే మీరు SRF గుర్తు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ని వాడవచ్చు. అలనే మీ మీద సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు గ్లౌస్ మరియు ముఖానికి మాస్క్ వేసుకోవడం మంచిది.

పైన్ఆపిల్ మరియు బొప్పాయి

పైన్ఆపిల్ మరియు బొప్పాయిని పేస్టులా చేసి ముఖము మరియు నుదిటిపై అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. మార్కెట్లో లభించే టాన్ క్రీమ్స్ వాడటం కన్నా ఈ పేస్టు వాడటం చాల ఉత్తమం. ఇది వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మీ ముఖము మరియు నుదిటి మీద ఉండే టాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతున్నది.

అలోవేర, టమాటో మరియు కందిపప్పు

ఇది ఒక ఉత్తమమైన పేస్ ప్యాక్, దీని వలన మీరు మీ శరీరం మీద వచ్చిన సన్ టాన్ ను తొలగించవచ్చు. మన ఇంట్లో ఉండే కందిపప్పు సన్ టాన్ ని తొలగించే ఒక ఉత్తమమైన పదార్ధం. కందిపప్పుని 15 నిమిషములపాటు నానపెట్టి మిక్సర్ సహాయంతో పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టులో అలోవేర గుజ్జును మరియు టమాటో గుజ్జును కలపాలి. పేస్టును ముఖానికి మరియు మెడకి మసాజ్ చేస్తూ రాయాలి. 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

వోట్ మీల్ మరియు మజ్జిగ

వోట్ మీల్ చర్మం మీద బ్లాక్ హెడ్స్ని తొలగించడానికి మరియు మజ్జిగ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడుతున్నవి. 2 టేబుల్ స్పూనుల వోట్ మీల్స్ మరియు 3 టేబుల్ స్పూనుల మజ్జిగను తీసుకొని పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి మరియు శరీరానికి అప్లై చేసి చేతులను వృత్తాకారంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నారింజ రసం మరియు పెరుగు

నారింజలో C విటమిన్ ఎక్కువగా ఉండటం వలన చర్మం మీద టాన్ ను తొలగించి వృధ్ధాప్య చాయలను తొందరగా రాకుండా చేస్తుంది. పెరుగు సహజంగా బ్లీచింగ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ నారింజ రసం మరియు ఒక స్పూన్ పెరుగు తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నిమ్మరసం మరియు పంచదార

నిమ్మరసం తీసి దానిలోకి పంచదార కలపవలెను. దీనిని ముఖానికి రాస్తూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన టాన్ చర్మం పోయి మంచి చర్మం ఏర్పడుతుంది. కొన్ని వారాలలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిని ఉపయోగించడం వలన మీ చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. టాన్ ని తొలగించడానికి ఇది ఒక సాధారణమైన పరిహారం.

బంగాళదుంప మరియు నిమ్మరసం

బంగాలదుంపను ఆహారంగా తీసుకోవడం చర్మానికి లాభదాయకం. దీనిలో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉండటమే కాకుండా పీచు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచి చర్మ మీద వచ్చే మంటను పోగొడుతుంది. అలానే చర్మాన్ని నున్నగా చేస్తుంది. బంగాళదుంప మరియు నిమ్మరసంతో పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 40 నిమిషముల తరువాత నీటితో కడగవలెను.

స్ట్రాబెర్రి మరియు పాల మీగడ

స్ట్రాబెర్రి చర్మ సౌందర్యాన్ని పెంచి నల్ల మచ్చలను మరియు సన్ టాన్ ని తొలగించడానికి సహకరిస్తుంది. 4 స్ట్రాబెర్రిల చూర్ణాన్ని మరియు 2 టేబుల్ స్పూనుల పాల మీగడను తీసుకొని ముఖము మీద అప్లై చేసి 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

పాల పొడి, తేనే మరియు బాదం ఆయిల్

పాల పొడి సన్ టాన్ ని తగ్గించి, చర్మాన్ని శుభ్రపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. 2 టేబుల్ స్పూనుల పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు కొంచెం బాదం ఆయిల్ తీసుకొని పేస్టు తయారు చేయాలి. పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

కుంకుమ పువ్వు మరియు తాజా మీగడ

కుంకుమ పువ్వుతో పేస్ ప్యాక్ తయారు చేయడం చాలా పురాతన పద్ధతి. ఇది చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశించేటట్లు చేసి మొటిమలను, మచ్చలను, సన్ టాన్ ను తొలగించుటకు ఉపయోగపడుతున్నది. చిటికెడు కుంకుమపువ్వు మరియు 2 టేబుల్ స్పూనుల మీగడ తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత ప్యాక్ ఆరితే నీటితో కడగాలి.

వోట్ మీల్ మరియు అలోవేర

ఇంట్లో వండుకునే ఆరోగ్యకరమైన వంటకాలలో వోట్ మీల్ వంటకం ఒకటి. వోట్ మీల్ని ఉపయోగించి ఒక అధ్బుతమైన ఫేస్ ప్యాక్ ని తయారు చేయవచ్చు. అలోవేర కూడా టాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ అలోవేర జెల్ మరియు 2 టేబుల్ స్పూనుల వోట్ మీల్ తీసుకొని పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని కొంచెం సేపు అలానే ఉంచి తరువాత ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేస్తుంటే మీకు మృదువైన స్పర్శ కలుగుతుంది. ఇది చర్మ కణాలను ఉత్తేజ పరుచుటకు తోడ్పడుతుంది.

క్యాబేజి ఆకు

క్యాబేజి ఆకులు సన్ టాన్ ని తొలగిస్తాయి అని చాలా తక్కువ మంది విని ఉంటారు. ఇది చాల అరుదుగా చేసే చిట్కా, కాని ఒకసారి వాడటం మొదలుపెట్టక ఫలితాన్ని మీరు గమనించ గలరు. రెండు క్యాబేజి పెద్ద ఆకులను తీసుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచి బాగా చల్లగా అయిన తరువాత తీసి ముఖము పైన పెట్టుకొని 20 నిమిషములపాటు రిలాక్సగా పడుకోవాలి. మళ్ళి ఇలానే రెండు ఆకులను తీసుకొని చేయండి. ఇలా చేయడం వలన సన్ టాన్ నుంచి తొందరగా విముఖ్తి కలుగుతుంది.

బాదం మరియు పాలు

బాదం ఒక ఆరోగ్యకరమైన గింజ, అలానే ఇది చర్మానికి చాలా మంచిది. బాదం మరియు పాల కలయిక చాల అధ్బుతమైన కలయిక. ఇది చర్మం మీద నల్ల మచ్చలను పోగొట్టి, చర్మం ప్రకశవంతంగా ఉండేటట్లు చేస్తుంది. 4-5 బాదం తీసుకొని రాత్రి అంత నీటిలో నానపెట్టాలి. ఉదయాన్నే బాదంలో 2 టేబుల్ స్పూనుల పాలు పోసి పేస్టు తయారు చేయాలి. వృత్తాకారంగా చేతులతో మసాజ్ చేస్తూ పేస్టుని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

పైన్ఆపిల్ మరియు తేనే

పైన్ఆపిల్ చాల మంచి రుచికరమైన ఆహరం, చాల మందికి ఇది ఇష్టమైన పండు. ఇప్పడు మీరు పైన్ఆపిల్ చర్మానికి ఎంత ఉపయోగాపడుతుందో తెలుసుకుంటున్నారు. ఇది చర్మం మీద మచ్చలను దూరం చేసి, చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. పైన్ఆపిల్లో ఎక్కువ శాతం విటమిన్ C ఉండటం వలన చర్మం మీద ముడతలు రాకుండా చేసి యవ్వనమైన చర్మాన్ని మీకు ఇస్తుంది. పైన్ఆపిల్ గుజ్జును తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మీరు మీ చర్మంలో వచ్చిన కాంతిని గమనించవచ్చు.

నిమ్మ, గులాబీ, దోస

నిమ్మ, గులాబీ, దోస ఇవి మీ చర్మం పై టాన్ ను చాలా చక్కగా తొలగిస్తాయి. ఈ మూడింటినీ సమ పాళ్ళల్లో ఒక బౌల్ లో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. మీ ముఖానికే కాక మీ మెడ వరకూ పెట్టుకోండి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మ రసం సన్ టాన్ ను తొలగిస్తుంది. ఇక రోజ్ వాటర్, దోస చర్మం మృదువుగా మారేలా చేస్తాయి.

తేనె, నిమ్మ ఫేస్ ప్యాక్

తేనె, నిమ్మ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై టాన్ తొలగించేందుకు ఉపయోగపడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకూ వేసుకోవాలి. ప్రత్యేకంగా చర్మం కంది మచ్చలు ఏర్పడిన చోట తప్పకుండా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. నిమ్మ ఒక సహజసిధ్ధ బ్లీచింగ్ అయితే, తేనె చర్మాన్నిమృదువుగా చేస్తుంది. చర్మం చక్కగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు కేవలం మీ దాహాన్ని తీర్చటమే కాదు మీ ముఖంపై ఉన్న టాన్ మచ్చల్ని తొలగిస్తుంది. మీ చర్మాన్ని సూర్య కాంతి నుంచీ కందిపోకుండా చూస్తుంది. మీరు రోజూ కనక మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు రాసుకోవటం వల్ల ఎంతో మంచిది. దీని వల్ల మీరు రోజు రోజుకీ చక్కగా ఫైర్ గా తయారవుతారు.

టొమాటో, నిమ్మ రసం, పెరుగు ఫేస్ ప్యాక్

2 టేబుల్ స్పూన్స్ టొమాటో గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ చర్మం ఎక్కడైతే బాగా కంది మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ రాసుకోండి. 25-30 నిముషాలు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మీ చర్మం చక్కగా తయారవ్వటమేకాక మీ చర్మం పిగ్మెంటేషన్ కు గురి కాకుండా చేస్తుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే దీనిలో టొమాటో ఉండటం వల్ల కాస్త దురద గా అనిపిస్తుంది. కాసేపటికి మామూలు అవుతుంది.

పసుపు, నిమ్మ రసం

4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక బౌల్ వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలపై రాసుకోవాలి. 30 నిముషాలు ఆరాక వాష్ చేసుకోవాలి. మీ చర్మం చక్కగా తెల్లగా చేస్తుంది. నిమ్మ బ్లీచ్ గా ఉపయోగపడితే, పసుపు యాంటీబయటిక్ గా ఉపయోగపడుతుంది.

గింజలు మరియు ఆయిల్స్ మిశ్రమం

4 టెబుల్ స్పూన్స్ నువ్వుల గింజల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి ముఖానికి రాసుకోవాలి. తర్వాత స్క్రబ్ గా శనగపిండిని వాడాలి. ఇది మీ చర్మంపై అద్భుతాన్నిచేస్తుంది. మృత చర్మాన్ని తొలగిస్తుంది. దీనిని రోజూ వాడితే మీ చర్మం పై చక్కగా పని చేస్తుంది.

బొప్పాయి, పాలు

బొప్పాయి గుజ్జును, పాలు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలలో రాసుకోవాలి. పూర్తిగా ఆరేంత వరకూ ఆగి తర్వాత వాష్ చేసుకుని చూడండి. ఎంతో అద్భుతమైన ఫలితాల్ని చూస్తారు.

బంగాళదుంపల్ని వాడండి

బంగాళాదుంప చర్మంపై చక్కగా పని చేస్తుంది. స్లైసెస్ గా కోసుకుని ముఖంపై రాసుకోవటం వల్ల టాన్ అయిన చోట మళ్ళి చర్మం సరి అవుతుంది. కొద్ది నిముషాలు ఉండి తర్వాత వాష్ చేసుకోండి. తర్వాత మీరే చుసుకోండి తేడాని. మీరు బంగాళాదుంప జ్యూస్ ని కూడా రాసుకోవచ్చు. ఈ రసానికి నిమ్మ రసం కాస్త కలుపుకుని రాసుకుంటే మంచిది. మంచి ఫలితాలుంటాయి.

పాలు, కుంకుమ పువ్వు

ఈ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది మెలనిన్ సింథెసిస్ ను తగ్గిస్తుంది. మెలనిన్ సింథెసిస్ వల్ల టాన్ ఎక్కువగా అవుతుంది. 4-5 తంతువుల కేసర్ ను పాలల్లో 30 నిముషాలపాటూ నానపెట్టుకోవాలి. ఈ సొల్యూషన్ ని 5 నిముషాలపాటు ముఖం పై ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

పాలు, దోస, నిమ్మ

మీకు కనక ఈ సమస్య ఎక్కువగా ఉంటే వీటి వాడకం వల్ల చక్కగా తగ్గిపోతుంది. ఫ్రెష్ దోస జ్యూస్ ను తీసుకుని 1 టేబుల్ స్పూన్ దోస జ్యూస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పాలు, 3-4 నిమ్మ రసం చుక్కల్ని కలుపుకోవాలి. 5 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత చల్లని వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ముల్తాని మట్టి, రోజ్ వాటర్

ముల్తాని మట్టి సహజసిధ్ధమైన మూలికలతో నిండి ఉంటుంది. ఇది మీ ముఖం మీద ఉన్న టాన్ ను సమర్ధవంతంగా తొలగిస్తుంది. రోజ్ వాటర్ మీ ముఖం చక్కగా ప్రకాశవంతంగా జీవంతో కూడి ఉండేలా చేస్తుంది. ఒకవేల మీది పొడి చర్మం అయితే మీ చర్మం చక్కగా ఆయిలీ తత్వాన్ని చక్కగా అలవడేలా చేస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ ముల్తాని మట్టిని రోజ్ వాటర్ లో నానపెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్నిముఖానికి రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది చక్కని ఫలితాల్ని ఇస్తుంది.

సన్ టాన్ వలన హానికరమైన ప్రభావం

సూర్యరశ్మి ఎక్కువగా మీ శరీరానికి తగలటం, దాని వలన UV కిరణాలు మీ చర్మం మీద పడటం ద్వారా సన్ టాన్ ఏర్పడుతుంది. సన్ టాన్ ఎక్కువగా ముఖానికి, మెడకు, చేతులకు మరియు కాళ్ళకు వస్తుంది. దీనివలన మీ చర్మం మీద మొటిమలు, మచ్చలు, ముడతలు ఏర్పడి అనేక రకముల చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. ఇది చివరకు కాన్సర్ కు కారణం అవుతుంది.

మెడ మీద సన్ టాన్ ని తొలగించుట (Telugu tips to remove sun tan from neck)

మీకు నల్లటి మెడ ఉండటం వలన ఇబ్బంది పడుతున్నారా? మెడ మీద నల్ల రంగు రావడానికి గల కారణం సూర్యరశ్మి మరియు కాలుష్యం. సన్ టాన్ ఎక్కువగా బయటకు కనిపించే శరీరం దగ్గర వస్తుంది మొఖము, మెడ, కాళ్లు మరియు చేతులు మొదలగువాటి మీద వస్తుంది. క్రింద మెడ మీద వచ్చే టాన్ ని తొలగించడానికి చిట్కాలు ఇవ్వబడినవి.

దోసకాయ రసం, పసుపు మరియు నిమ్మరసం

ఇది ఒక ప్రత్యేకమైన ప్యాక్ ఎందుకంటే పసుపులో యాంటిసెప్టిక్ లక్షణాలు ఉన్నవి. అలానే దోసకాయలో క్లీనింగ్ ఏజెంట్ మరియు నిమ్మలో సిట్రిక్ ఆసిడ్ గుణములను కలిగి ఉన్నవి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, దోసకాయ రసం మరియు నిమ్మరసం తీసుకొని ప్యాక్ తయారు చేసి, టాన్ ఉన్న మెడకు అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

నిమ్మకాయ

నిమ్మకాయ సహజంగా బ్లీచ్ గా పనిచేస్తుంది అలానే దీనిలో కొత్త చర్మ కణాలను ఉత్తేజపరిచే శక్తి ఉంది. నిమ్మకాయ ముక్కతో మెడ మీద రుద్దుతూ ఉండాలి. లేకుంటే నిమ్మరసాన్ని గులాబీ నీటిని కలిపి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మెడ మీద టాన్ తొలగుతుంది. ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

కొబ్బరినూనె

మనం మన పూర్వికులు చెప్పే మాటలను పట్టించుకోవడం లేదు, వారు ఆయిల్ని రోజూ జుట్టుకు మరియు తలకు అప్లై చేయమని చెప్తుంటారు. ఈ ఆయిల్ టాన్ ని తొలగించడంలో అలానే చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి చాలా బాగా పని చేస్తుంది. టాన్ స్కిన్ని పోగొట్టడానికి రోజు మెడ మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. సహజంగా వచ్చిన కొబ్బరి నూనెను వాడటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఎటువంటి ఎలర్జీలు రావు. మీరు రోజు మీ శరీరం మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన సన్ టాన్ తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

పంచదార మరియు ఆయిల్

దీనిని మీరు మీ సొంతగా తయారు చేసుకోవచ్చు. చాల సులువైన పదార్ధాలతో దీనిని తయారు చేయవచ్చు. ఒక స్పూన్ పంచదార, 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీస్కోవాలి, అవసరం అనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా కలపవచ్చు. దీనిని మీ మెడకు మరియు ముఖానికి చేతులతో అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 2-3 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన టాన్ స్కిన్ పోయి చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.

Posted on

పొత్తికడుపుపై వెంట్రుకలు పోవాలంటే చిట్కాలు – Telugu tips to remove abdominal hair

పొత్తి కడుపుపై వెంట్రుకలు ఆడవారికీ, మగవారికీ సాధారణమైన సమస్య. మగవారిలో ఈ వృధ్ధి ఎక్కువ శాతంలో ఉంటుంది. అయితే ఈ సమస్యని మగవారు అంతగా పట్టించుకోరు. కానీ ఆడవారులోనూ ఈ పెరుగుదల ఎక్కువగనే ఉన్నా, ఆడవారు మాత్రం దీని నుంచీ బయటపడాలనుకుంటారు. కానీ కొందరు ఆడవారు మగవారిలా వీటిని తీసెయ్యకుండా అలాగే వదిలేస్తారు. దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. ఆడవారిలో పొత్తికడుపై ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రత్యేకంగా వారు స్విం సూట్స్, బికినీలు వేసుకోవాలంటే అప్పుడు పొత్తికడుపు కనపడుతుంది కాబట్టి అప్పుడు ఈ వెంట్రుకలు కనిపించే అవకాశం ఉంది.
ఇది సాధారణమైనది కాదు., అయితే ఈ సమస్యను పూర్థిగా నివారించటానికి కొన్ని శాశ్వతమైన మార్గాలు, లేదా వీటి వృధ్ధి ఎక్కువ జరగకుండా కొన్ని మార్గాలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సమస్య కొన్ని తాత్కాలికమైన మార్గాల ద్వారా తీరవచ్చు. షేవింగ్, వాక్సింగ్ మరియు బ్లీచింగ్. ఈ మార్గాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కొన్ని సహజసిధ్ధ మార్గాల ద్వారా వీటిని తొలగించటం వల్ల మీ చర్మానికి హాని కలగకుండా ఉండటమే కాక ఆడవారి నడుము పాడవకుండా ఉంటుంది.
ఈ ఫాస్ట్ లైఫ్లో లేసర్ థెరపీ మరియు ఎలెక్ట్రోలసిస్ ఉన్నాయి. అయితే ఈ రెండు చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉన్నవి. అంతేకాక చాలా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి.
ఈ పొత్తికడుపు పై వెంట్రుకలు అటు ఆడవారికీ, మగవారికీ ఇద్దరికీ పెద్ద చిక్కు వీడని సమస్య. అయితే మగవారు సున్నితంగా ఈ సమస్య నుంచీ తొలగిపోతే ఆడవారు మాత్రం చాలా ఇబ్బందిగానూ, ఎంతో న్యూన్యతా భావంతోనూ కుమిలిపోతుంటారు. మంచి ఆకర్షణీయమైన చీర తొడిగినప్పుడు ఈ వెంట్రుకలు కనపడుతుంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతారు. ఈ సమస్య రోజువారీ జీవితంలో సహజం. అయితే రోజూ బ్యూటీ పార్లర్ కి లేదా స్పాకి వెళ్ళాలంటే అది రోజూ సాధ్యం కాని పని. కాబట్టి సహజసిధ్ధమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం. మరి ఖర్చుతో కూడిన చికిత్సలు చర్మానికే కాదు శరీరం పై కూడా ప్రభావం చూపుతాయి. ఇక్కడ కొన్ని చర్మ సంబంధితమైన టిప్స్ ని మీకందిస్తున్నాం ప్రత్యేకంగా తెలుగు టిప్స్ ద్వారా మీకోసం

క్షవరం చేసుకోవటం

చాలావరకూ పొత్తికడుపు భాగంలో వెంట్రుకలు చాలా దలసరిగా ఉంటాయి. వీటిని తీయటం చాలా కష్టమే. కాబట్టి వీటిని షేవెర్ తో తొలగించటం మేలు. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు చాలా గట్టిగా అవుతాయని కొందరు అంటారు. ఇలాగే చేస్తు ఉంటే చివరికి చర్మం కూడా చాలా గట్టి పడిపోతుందని చెబుతారు. కానీ ఇదే రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ ఇలా రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ మీ చర్మం షేవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మెత్తగా ఉండటమే కాకుండా మరలా వెంట్రుకలు పెరిగేందుకు సమయం పడుతుంది.

బ్లీచింగ్

కొందరు స్త్రీలలో పొత్తికడుపు కింద అంతగా వెంట్రుకలు ఉండవు. వీళ్ళు ఒకరకంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాంటి తక్కువ వెంట్రుకలు ఉండే స్త్రిలు బ్లీచ్ వాడి తొలగించుకోవచ్చు. మీరు మంచి సున్నితమైన బ్లీచ్ లు వాడటం ఎంతో మంచిది.

వెంట్రుకలు వదిలించే క్రీముల్ని వాడండి

మీ చర్మాన్నే కాకుండా మీ సమయాన్ని అలాగే మీకు ఇబ్బందిని కలిగించని వాటిల్ని వాడండి. మీరు మీ వెంట్రుకల్ని తొలగించుకునేందుకు మార్కెట్లో చాల రకాలైన క్రీములు ఉన్నాయి. గతంలో అంటే 10 సంవత్సరాల క్రితం ఈ క్రీములు కాస్త హానిని కలిగించేవి. అయితే ప్రస్తుతం ఉన్న క్రీములు అంతగా హాని కలిగించేవి కాదు. వీటిని వాడటం మంచిదే. కాకపోతే మీరె మీ చర్మానికి ఎలర్జీ రాకుండా అంటే మీ చర్మానికి పడే క్రీముని మీరే ఎంచుకోవాలి.

వ్యాక్స్

మీకు అవసరమైన ప్రతిసారీ మీరు వ్యాక్స్ కోసం పార్లర్ కి వెళ్ళల్సిన అవసరం లేదు. మీకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్స్ న్యారో పీసులు బయట దొరుకుతున్నాయి. కాబట్టి మీరు వాటిని వాడవచ్చు. వాటిని సున్నితంగా చింపండి తర్వాత వాటిని వేడి చేయండి. తర్వాత . ఈ విధానం మీ పొత్తికడుపు ప్రాంతానికైతే అది సున్నితంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ చేతులకు, కాళ్ళకూ చేసుకోరాదు.

ట్వీజింగ్

దీనినే తెలుగులో చిమటా అని అంటారు. కొన్ని చోట్ల అంటే శరీరంలో కొన్ని భాగాలో మిగతా భాగాల కంటే తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. అటువంటి చోట సున్నితంగా చిమటా వేసుకుంటే చాలు. దీనివల్ల తక్కువగా ఉన్న చోట చిమటా వేసుకుంటే చాలు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ అందం కోసం దీనిని వాడవచ్చు.

సహజసిధ్ధమైన మార్గాలు

మీకు రసాయన క్రీముల్ని వాడటం ఇష్టం లేకపోతే మీరు కొన్ని సహజసిధ్ధమైన మార్గాల్ని మీ కిచెన్ లొని పదార్ధ్ధల్నే వాడవచ్చు.
కొంచేం పసుపు తీసుకుని దానికి కొంచెం శనగపిండిని కేవలం ఒక టేబుల్ స్పూన్స్ మాత్రమే రెండిటినీ వేసి కలుపుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని పాలతోను లేక నీటితోను కలుపుకోవచ్చు.. తర్వాత మీ పొత్తికడుపు పై ఉన్న వెంట్రుకలకు రాసి తర్వాత అవి పోయేలా తీసేయ్యాలి. ఈ సహజసిధ్ధమైన టిప్స్ మీకు ఇబ్బంది లేకుండా తొలగిస్తాయి.
శనగపిండిని, పసుపును మిక్స్ చేసుకోండి. తర్వాత దీనికి పాలు లేదా నీటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి,శరీరానికీ రాసుకోండి. తర్వాత అది ఆరిపోయిన తర్వాత రబ్ చేయండి మీ ముఖం పై, మీ శరీరం పై ఉన్న వెంట్రుకలు తొలగుతాయి.
అగ్ని శిల ను రోజూ స్ననానికి ముందు రాసుకోండి. అది ఒక స్క్రబ్ లా పని చేసి మీ శరీరంపై ఉన్న అవాంచిత రోమాల్ని తొలగిస్తుంది.
రోజూ మంచి ఆహారాన్ని తీసుకోండి. మీ శరీర బరువు తక్కువగా ఉన్న లేక కొవ్వు ఎక్కువగా ఉన్నా మీ శరీరం పై అవాంచిత రోమాలు వస్తాయి. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకోండి. పాలు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆహారపదార్ధ్ధాలు కూడా తినటం మంచిది.

అవాంచిత రోమాలు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

బొప్పాయి

బొప్పాయి అవాంచిత రోమాల పెరుగుదలను నివారించటమే కాక వీటిని తొలగిస్తుంది. బొప్పాయిను ఉపయోగించి శాశ్వతంగా అవాంచిత రోమాల్ని తొలగించుకోవచ్చు.
బొప్పయిను పేస్ట్ చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలొవేరా జెల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనిని రాసుకుని 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
బొప్పయి పేస్ట్గా చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలోవేరా జెల్, ఆవాల నూనె పేస్ట్ చేసుకుని రాసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని వాష్ చేసుకోవాలి.

పసుపు

అవాంచిత రోమాలను ఇది ఒక తేలికైన మార్గం. పసుపు తీసుకుని దానిలో పాలు కలుపుకోవాలి. తర్వాత దీనిని పొత్తికడుపు పై రాసుకోవాలి. కాసేపు ఆరిపోయేంత వరకు ఉంచుకుని తర్వాత వేడినీటితో కడుగుకోవాలి. ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే దీనికి శనగపిండిని కలుపుకోవాలి.

సుగర్-నిమ్మ మిశ్రమం

పంచదార, నిమ్మ కలుపుకుని రాసుకుంటే చక్కగా పనిచేస్తాయి. నిమ్మ ఒక బ్లీచ్ గా పని చేస్తుంది. పంచదార, నిమ్మ రసం, వాటర్ ను కలిపి పొత్తికడుపు పై రాసుకోవాలి. ఇందులో గమనించాల్సిన విషయమేమంటే వెంట్రుకలు పెరిగే దిశకు రాసుకోవాలి. 15 నిముషాలపాటు ఉంచుకుని తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సుగర్, నిమ్మ, తేనె మిశ్రమం

ఇది ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. అన్నీ సహజసిధ్ధమైనవి కావటంతో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనె ను వేడి చేసుకుని దానికి సుగర్, నిమ్మను కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత పొత్తికడుపుపై మొక్కజొన్న గంజి పవ్డర్ ను రాసుకోవాలి. ఈ వెచ్చటి మిశ్రమాన్ని పొట్ట భాగంపై వెంట్రుకలు అభివృధ్ధి కి వ్యతిరేక దిశగా చాకు సాయంతో లేక గరిటిలాంటి దానితో రాసుకోవాలి. వెంటనే దానిపై గుడ్డను కప్పాలి. తర్వాత వాక్సింగ్ చేసే విధంగా చూసుకోవాలి. తర్వాత వెంట్రుకలు అభివృధ్ధి అయ్యే దిశకు వ్యతిరేక దిశలో ఆ గుడ్డను బలంగా లాగాలి. కస్త నొప్పిగా ఉన్న ఓర్చుకుంటే ఆ వెంట్రుకలన్నీ శుభ్రం అవుతాయి.

గుడ్డు మాస్క్

గుడ్డు లోని తెల్ల సొన అలాగే దానికి సుగర్, మొక్కజొన్న గంజి పిండిని కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. తర్వాత దానిని అప్లై చేసుకోవాలి. మెల్లగా ఆ మాస్క్ ని తీసివేయాలి. ఈ మాస్క్ కి ఆ వెంట్రుకలు వచ్చేస్తాయి.

బంగాళదుంప, పప్పు

బంగాళదుంప ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. దీనితో పాటు పెసరపప్పు కలుపుకోవాలి. పప్పు ను కలుపుకోవటం వల్ల మీ వెంట్రుకలు తొలగించబడతాయి. ఈ పేస్ట్ చేసుకోవాలంటే రాత్రి అంతా పెసరపప్పుని నానపెట్టుకుని ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేస్తుకోవాలి. దీనికి తేనె, నిమ్మరసాన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిని అబ్డోమినల్ పై రాసుకోవాలి. తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత వేళ్ళతో రబ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరచుకోవాలి.

అరటి, ఓట్మీల్

అరటిపండు డ్రై స్కిన్ పై వెంట్రుకల్ని తొలగించేందుకు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అరటి పండు ,ఓట్మీల్ ను కలిపి రాసుకుంటే తేలికగా వెంట్రుకలు తొలగిపోతాయి.

సుగర్, మొల్లాసెస్

సుగర్, నిమ్మ, మొల్లాసెస్ అవాంచిత రోమాల చికిత్సకు సరియైన చికిత్సా విధానం. ఇవి చక్కగా పనిచేస్తాయి. ముందుగా మైక్రోవేవ్ లో వేడి చేసుకోవాలి. దానిలో మొల్లాసెస్ ను కలిపి, తర్వాత సుగర్ బాగా కరిగిపోయాక దానిలో నిమ్మరసాన్ని వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. తర్వాత పొత్తి కడుపుపై అప్ప్లై చేసుకుని, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశగా తీసివేయాలి. ఇలా అవాంచిత రోమాలు తొలగిపోతాయి.

Posted on

వక్షోజాల పరిమాణం పెరగాలంటే – Breast enhancement tips in Telugu

చాలా మంది ఆడవాళ్ళు ప్రత్యేకంగా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు వారి వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని తమ వక్షోజ సంపద వృధ్ధి జరగాలంటే ఏం చేయాలి అని సతమతమవుతుంటారు. దీనికి కారణం వారిలో ఈస్ట్రోజన్ శాతం తక్కువగా ఉందని అర్ధం. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు వక్షోజాలు చక్కగా వృధ్ధి చెందాలంటే ఈ ఈస్ట్రోజన్ చాలా  ముఖ్యం. చాలా మంది ఆడవాళ్ళల్లో సెక్స్ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల వారి సెక్స్ జీవితం చాలా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇందుకు కారణం ఆడవారిలో ఉందే ఈస్టోజన్ శాతం తక్కువగా ఉండటమే..!  అస్సలు ఈస్టోజన్ మోతాదు ఎందుకు తగ్గిపోతుంది? ఈస్టోజన్ కొన్ని హార్మోన్ల సముదాయం. ఇది సెక్సువల్ హార్మోన్స్ అభివృధ్ధి అయ్యేలా చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అండాశయంలో ఉత్పత్తి అవ్వటమే కాక అడ్రెనల్ గ్రంధులు, కొవ్వు సెల్ల్స్ లో కూడా ఉత్పత్తి అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ లో ఈస్టోజన్ గర్భాశయ లైనింగ్ ను అభివృధిని నియంత్రిస్తుంది. ఒకవేల ఆడవారిలో అండం ఉత్పత్తి కాకపోతే ఈస్ట్రోజన్ క్రమక్రమంగా తగ్గిపోయి మెన్స్ట్రువల్ సైకల్ మొదలవుతుంది. ఈస్ట్రోజన్ ఎముకల అభివృధ్ధికి తోడ్పడుతుంది. ఇది విటమిన్-డి, కాల్షియం, ఇతరాల తో పని చేస్తుంది. ఇవి శరీర అభివృధ్ధిలో భగంగా ఎముకల విరుగుదల అలాగే పునర్ణిర్మానం అయ్యేలా చేస్తాయి. ఈస్ట్రోజన్ ఆడవారిలో మొత్తం రక్తప్రసరణ లో ఉంటుంది. ఇది అభివృధ్ధిపై మాత్రమే కాదు అలాగే జీవక్రియపై, సెక్సువల్ ఫంక్షన్, అత్యవసర చర్యలు, కణజాల ప్రక్రియ, పునరుత్పత్తి, ఆహర ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజన్ కొవ్వు స్థాయిలను, ఎముకల అభివృధ్ధిని సంతులనాన్ని పర్యవేక్షితుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. పిందం పెరుగుదల సమయాలలో పరిపక్వతను, అలాగే మాయ అంటే ప్లసంటా ప్రక్రియను సరి చేస్తుంది. ఈ సమయంలో వక్షోజాలలో కూడా మార్పు వస్తుంది. ఈ గర్భిణీ సమయంలో అదీ మొనోపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోయి బాగా ఆడవారిలో సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల ఆడవారిలో మూర్త సంబంధ సమస్యలు, వక్షోజాలలో నొప్పి మొదలైనవి ఏర్పడతాయి.

కాయగూరలు మరియు చిక్కుళ్ళు లో ఈస్ట్రోజన్ పుష్కలం

బీట్రూట్, క్యారెట్, దోస, బఠాణీలు, పీప్పెర్, బంగాళాదుంపలు, గుమ్మడికాయ, స్క్వాష్, వెల్లుల్లి, చిలగడదుంప, రెడ్ బీన్స్, సోయా బీన్స్ మొదలగునవి.

ఈరన్ స్థాయిలు సోయ బీన్స్ లో అధిక శాతంలో ఉంటాయి. సోడియం, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సోయాబీన్స్ ను ఒక స్నాక్ లా వాడాలి. మీరు అలా తినలేకపోతే సలాడ్లోనో, సూప్లోనూ తినండి.

పండ్లు, మూలికలు

ఈస్టోజన్ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. టొమాటోస్, యాపిల్, చెర్రీస్, రేగు, దానిమ్మ, బొప్పాయి, రెవల్చిని.
మూలికల్లో ఫెన్నెల్ విత్తనాలు, సొంపు, పార్స్లే మొదలగునవి.

విత్తనాలు మరియు దెయిరీ

నువ్వుల గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, గుడ్డ్లు.
నువ్వుల గింజలో మినరల్స్, ఫైబర్ బాగా ఉంటాయి. నువ్వుల గింజలు, నువ్వుల నూనె రెండింటిలో ఫైటోఈస్ట్రోజన్లు బాగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ లో ఈస్ట్రోజన్ పుష్కలం

డ్రై ఫ్రూట్స్ లో చాలా ఎక్కువగా ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ. వీటిలో డేట్స్, ప్రూన్స్, అప్రికోట్స్. డ్రై ఫ్రూట్స్ లో ఫైటో ఈస్ట్రోజన్స్ బాగా ఉండటం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుతుంది.

సోయా ఫుడ్స్

సోయా బీన్స్ లో పూర్తిస్థాయిలో ఈస్ట్రోజన్ స్థాయిలు చాలా ఎక్కువ. ఆడవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారంలో ఇవి ఎక్కువగా ఉంటే చాలా మంచిది. సోయా బీన్స్ లో నుంచీ సోయా నూనె, సోయా నూడిల్స్, సోయా వెచ్చని కోర, సోయా పాలు, సోయా గోధుమ పిండి, సోయ పెరుగు, సోయా డైరి చీజ్.

టోఫు

దీనినే బీన్ పెరుగు అని కూడా అంటారు. దీనిలో సోయ పాలు ఉండటం వల్ల చక్కగా పోషకాలు ఉంటాయి. వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతీ ద్రవ ఆహారంలో ఈ టోఫును వేసుకోవాలి. ఇది శరీరం లో హార్మోన్స్ ను అభివృధ్ధి చేస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఈస్ట్రోజన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది కాలేయం పనితీరుని సంరక్షిస్తాయి. పొడి చర్మాన్ని నివారిస్తుంది. సోరియాసిస్ ను నివారిస్తాయి. ఎక్జెమాని నివారిస్తాయి. రకరకాల కాన్సర్ లను, గుండె పోటును రాకుండా చేస్తాయి. అవిసె గింజల్లో ఇంకో ప్రత్యేకత ఎంటంటే ఆస్థమాని నివారిస్తుంది.

అల్ఫాల్ఫా

మీరు మీ ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ఆహారంలో ఖచ్చితంగా ఈ ఆల్ఫాల్ఫా ని కూడా కలిపి వాడాలి. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ మీ హార్మోన్ల పెరుగుదలని పెంచుతాయి. వీటిలో చాలా ఎక్కువ శాతంలో ఈస్ట్రోజన్ ఉంటుంది. అంతేకాక సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎమీ ఉండవు. కొలెస్టరాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది.

హ్యూమస్

దీనిని తెలుగులో క్రుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు అని అంటారు. మరిగించిన లేదా ముద్ద చేసిన శనగలు అంటే వీటినే చిక్పీస్ అంటారు. వీటిలో ఈస్ట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల హ్యూమస్ లో దాదాపు 993 ఎం.సి.గి ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి.

టెంపే

ఇది సోయా బీన్స్ నుంచీ వచ్చినది. దీనిలో ఎవైతే ప్రోటీన్స్ , మినరల్స్ కలిగి ఉంటాయో ఆ ఐరన్,మెగ్నీషియం దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని వారం లో కొన్ని సార్లు తినండి. మీ ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుంది.

ఊక ధాన్యం

దీని వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే దీనిలో పుష్కలంగా ఫైటో ఈస్ట్రోజన్ విలువలు ఎక్కువ. అంతేకాక ఇది శరీరం లోని హార్మోన్లను అభివృధ్ధి చేయటమేకాక ఫైబర్ కంటెంట్ ని పెంచుతుంది.
సహజసిధ్ధంగా ఈస్టోజన్ స్థాయిల్ని సోయా, బార్లీ, శనగలు, మెంతులు ఇలా ఎక్కువగా పెంచుతాయి. అలాగే కొన్ని ఆహారపదార్ధాలైన పుట్టగొడుగులు, యాపిల్స్, క్యారెట్, కాలిఫ్లవర్, దోస, సన్ ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, బీన్స్, రెడ్ బీన్స్, టొమాటో, ఆలివ్స్, పసుపు, నేవీ బీన్స్, మొదలగునవి. వీటిని ఒక క్రమ పధ్ధతిలో చక్కగా తీసుకోవాలి.

మీ ఆహారంలో ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకునే దిశగా

మీ ఆహార నియమాలలో ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకునే దిశగా ప్రయత్నించాలి. రోజూ 50 నుంచీ 60 మిల్లి గ్రాముల ఈస్ట్రోజన్ అందే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. రోజూ మీ ఆహార దినచర్య లో ఒక టేబుల్ స్పూన్ సోయా పెరుగు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఎప్పుడు ఈస్ట్రోజన్ ఆహరం తినకూడదంటే

ఆడవాళ్ళు మెనోపాజ్ లో ఉన్నపుడు, ప్రీ మెన్శ్త్రువల్ సిండ్రోం(పీ.ఎం.ఎస్)వల్ల నొప్పి వచ్చినప్పుడు, లేదా రొమ్ము క్యాన్సర్ బయటపడినప్పుడు, అండాశయ తిత్తి, కంతి సమయాల్లో మత్రం ఈస్ట్రోజన్ ఫుడ్ మానాలి. ఎందుకంటే దీని వల్ల అవి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని పదార్ధాలు ఈస్ట్రోజన్ స్థాయిల్ని నివారిస్తాయి. అవేంటంటే క్యాబేజీ, బ్రోకోలి, చెర్రీస్, గ్రీన్ బీన్స్, పుచ్చకాయ, ఉల్లి, బేరి, పైన్ ఆపిల్, తెల్ల అన్నం, తెల్ల గోధుమ పిండి, కర్రపెండలం.

estrogen_rich_foods

Posted on

ఎర్రని అందమైన పెదవుల్ని పొందాలంటే? – Telugu tips for red lips

గులాబీ పెదవులుంటే ఆ అందమే వేరు. పెదవులు ఎంత అందంగా ఉంటే అతివలకు అంత అందం. గులాబీ రంగు పెదాలు..కావాలని ప్రతీ మగువ కోరుకుంటుంది. ఇది ఓ రకంగా అందాన్నే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. లేలేత పెదవులు ముఖంలో ఓ సున్నితమైన అంగమే. పెదవులు నూనె గ్రంధులు లేని ప్రదేశం. కాబట్టి వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా పెదవులు డార్క్ గా ఉండటానికి కారణం సూర్యుని యూవి కిరణాలు, ధూమపానం, అలెర్జీలు, హార్మోన్ల అసమానతలు కారణాలు గా చెప్పవచ్చు.
పెదవులు గులాబీ రంగులో ఉండేందుకు కొన్ని లిప్ బాల్మ్ లు, లిప్ స్టిక్స్ ఉన్నాయి కానీ అవి మీ పెదవులకు హాని కలిగిచవచ్చు. కానీ కొన్ని గృహ సంబంధమైన స్క్రబ్స్ వలన మీ పెదవులు చక్కగా గులాబీ రంగులో ఆరోగ్యంగా ఉంటాయి.
చక్కని గులాబీ రంగుతో కూడిన మృదువైన పెదవులు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం, మన దైనందన దినచర్య, కఠినమైన పరిస్థితులు సరియైన జాగ్రత్తలు తీసుకోలేనంతగా మనల్ని ప్రభావితం చేస్తాయి.
అస్సలు పెదవులు నిస్సారంగా ఎలా తయారవుతాయి? కానీ కొన్ని కారణాల వల్ల పెదవులు పొడిగా, మృదుత్వం లేకుండా, నిస్సారంగా తయారవుతాయి. వాటిలో కొన్ని ఏమిటంటే సూర్యకిరణాలవల్ల, ధూమపానం, మధ్యపానం, ఎక్కువగా పెదవుల్ని చప్పరించటం, శరీరం లో వేడిమి, విటమిన్ల లోపం, కొవ్వు ఆంల విడుదల ఇవేకాక మందుల వాడకం వల్ల కూడా పెదవులు డార్క్ గా తయారవుతాయి.
ఇక సందేహం ఎందుకు రండి చక్కని గులాబీ రంగులను పొందేందుకు తెలుగు టిప్స్ మీకు అందిస్తొంది..ఈ ఆర్టికల్ లో..ఇక ఏ రకమైన ఇబ్బందులూ రాకుండా కొన్ని రకాల గృహ చిట్కాలను తెలుసుకుందాం.. అవేంటో చూద్దామా..!

గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని రకాల సహజసిధ్ధ గృహ చిట్కాలు (Telugu beauty tips to get pink rose lips)

క్రీం మరియు కుంకుమ

1 టేబుల్ స్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ పాల క్రీం, కొంచెం కుంకుమను కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని మీ పెదవులకు రాసుకోంది. తర్వాత ఒక కాటన్ బాల్ తో తుడుచుకోవాలి.

పాలు మరియు గులాబీ రేకులు

1 టేబుల్ స్పూన్ పాలు అలాగే కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని పాలల్లో బాగా గులాబీ రేకుల్ని పాలల్లో గులాబీ రంగు క్రష్ చేయాలి. తర్వాత దీనిని ఫ్రిజ్ లో చల్లగా అయ్యేంత వరుకూ ఉంచాలి. తర్వాత దానిని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పవ్డర్ వేసి పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవాలి. 10- 15 నిముషాలు అలాగే ఉంచుకుని పొడి దూదితో తుడుచుకోవాలి. దీనివల్ల మీ పెదవులు గులాబీ రంగుతో, మృదువుగా, ప్రకాశవంతంగా మారతాయి.
అలాగే పాలల్లో గులాబీ రేకుల్ని బాగా మిక్స్ చేసి తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవచ్చు. అలాగే పాలకు బదులు మీరు గ్లిసరిన్ కూడా వాడవచ్చు.

బీట్రూట్ తో పాల క్రీం

బీట్రూట్ తో పాల క్రీం ను కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. లేద దానిమ్మను కూడా క్రీం తో కలిపి మిశ్రమం గా చేసి పెదవులకు వేసుకుంటే అది చక్కటి మృదువైన పెదవుల్ని ఇస్తుంది. పగిలిన పెదవులు సైతం మారి చక్కటి గులాబీ రంగు పెదవులుగా మారతాయి.

తేనె మరియు నిమ్మ

తేనె చక్కటి అన్ని రకాల చర్మాలకూ పడే పదార్ధం. దీనిని మీ పెదవుల సమ్రక్షణకు కూడా వాడవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ తేనె అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. తర్వాత మీ పెదవులకు వేసుకోవాలి. కొంత సమయం అయ్యక చల్లటి నీటితో కడుగుకోవాలి. తర్వాత మీ జీవం లేని పాలిన పెదాలు గులాబీ రంగులోనికి మారటం గుర్తించవచ్చు.

టొమాటో మరియు పాల క్రీం

మిల్క్ క్రీం లో టొమాటో పేస్ట్ ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవాలి.
చక్కని గులాబీ రంగు పెదవుల పొందాలంటే నెయ్యి లేదా వెన్న లేదా కుంకుమలు సహజ సిధ్ధమైన చికిత్సా మార్గాలు.
చక్కని పెదవులకోసం ఆయుర్వేదంలో టిప్స్ ఉన్నాయి. దానిలో ప్రధానమైనది ఎండు ద్రాక్షాలని రాత్రి అంతా నాన పెట్టి ఉదయాన్నే పరగడుపుతో తింటే పెదవులు ఎంతో చక్కగా మారతాయి.

క్యారెట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ లాగే క్యారెట్ జ్యూస్ కూడా మీ పెదవులను చక్కగా మారుస్తుంది. ఒక క్యారెట్ ను తీసుకుని దానిని గుజ్జుగా చేసి ఆ రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచిది. మీ పెదవులు పొడిబారినప్పుడల్లా ఈ జ్యూస్ ను రాసుకుంటే చక్కటి మృదువైన, గులాబీ పెదవులు మీ సొంతం అవుతాయి.

దోస ముక్కలు

దోస ముక్కల్ని మీ పెదవులకు రాసుకుంటే ఎంతో బాగా పని చేస్తాయి. ఇవి చర్మం పైనే కాదు చక్కటి పింక్ పెదవుల్ని మీ సొంతం చేస్తాయి. కొన్ని నిముషాలపాటు పెదవులపై రాస్తే ఎంతో మంచిది. దోస ముక్కల్ని ఇలా ఎక్కువ సార్లు రాస్తూ ఉంటే త్వరగా మీకు ఫలితం కనిపిస్తుంది.

ఆరెంజ్ తొక్కలు

ఆరెంజ్ తొక్కలు తీసి పారేస్తున్నారా? అయితే ఆగండి ఇకపై అలా చేయకండి ఎందుకంటే ఇవి మీ పెదవుల మృదుత్వాన్ని పెంచుతాయి. అంతేకాక మీ డార్క్ పెదవుల్ని మార్చి ప్రకాశవంతంగా చేస్తాయి. మీ పెదవులపై వాటిని రెండు నిముషాల పాటు మస్సాజ్ చేసుకోండి..తర్వాత ఫలితాల్ని మీరే చూడండి.

ఆలివ్ ఆయిల్

ఆయిల్స్ మంచి గులాబీ రంగు పెదవుల్ని పొందేలా చేస్తాయి. మంచి గులాబీ రంగు పెదవుల కోసం ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మ ను కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఇది ఒక బాల్మ్ లా రోజూ మీరు రాసుకోవచ్చు.

మింట్ జ్యూస్

మింట్ జ్యూస్ తో పాటు రోస్ వాటర్ ను కలిపి రాసుకుంటే మీ పెదవులు కొత్త రూపు పొందుతాయి. మింట్ జ్యూస్ ఎక్కువ మోతాదు కాకుండా చూసుకోవాలి..ఎందుకంటే అది వేడి చేసే ప్రమాదముంది.

సుగర్ స్క్రబ్

మీ పెదవులకు సుగర్ మరియు వెన్న కలిపి రాసుకుంటే ఎంతో మంచి ఫలితాలొస్తాయి. సుగర్ మీ చర్మం పై ఉన్న మృత కణాల్ని తీసి వేయగా.. వెన్న మీ పెదవులకు కొత్త జీవాన్ని ఇచ్చి మృదువుగా చేస్తుంది.

పసుపు స్క్రబ్

ముందుగా పసుపు తీసుకుని దానితో పాటు పాలు కలిపి మిశ్రమం గా చేసుకుని తర్వాత దానిని ఒక మెత్తటి బ్రష్ తో మస్సాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకుని పొడి టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత సహజసిధమైన లిప్ బాల్మ్ రాయాలి.

నిమ్మ

నిమ్మలో చాలా రకాలైన సహజసిధ్ధ రసాయనాలు ఉన్నాయి. ఇది సహజ సిధ్ధమైన బ్లీచ్. ఇది పెదవులపై ఎంతో చక్కగా పనిచేస్తుంది. రోజూ తాజా నిమ్మకాయను తీసుకుని రాత్రి నిద్రపోయే ముందు మస్సాజ్ చేసుకోవాలి.

రస్ప్బెర్రీ

వీటిలో చాలా ఎక్కువ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. కాబట్టి మీ పెదవుల ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. వీటి వల్ల మీ పెదవులు చాలా ఆకర్షణీయంగా కనపడతాయి. కొన్ని రస్ప్బెర్రిలను తీసుకుని వీటితో పాటు అలోవేరా, తేనె కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత మస్సాజ్ చేసుకుని ఆ తర్వాత 10 నిముషాలకు శుభ్రం చేసుకోవాలి.

సహజసిధ్ధ గృహ తరహా లిప్ బాల్మ్

ఒక స్ట్రాబెర్రి పబ్ ని తయారు చేసుకుని దానిలో పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి. ఇది చక్కటి గులాబీ పెదవులుగా మారుస్తుంది.
1. తేనె, ఆల్మండ్, సుగర్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని 10 నిముషాల పాటు మస్సాజ్ చేసుకోవాలి.
2. కొత్తిమీర, క్యారెట్ జ్యూస్, మింట్ జ్యూస్ కలిపి రాసుకుంటే ఎంతో మంచిది.
3. రోజూ మీగడ ను రాసుకోండి. పాలు కాచిన తర్వాత దానిపై వచ్చే మీగడ మీ పెదవులకు రాసుకుంటే ఎంతో సున్నితంగా,మృదువుగా మారతాయి.
4. పచ్చి బంగాళ దుంప ముక్కల్ని పెదవులకు రాసుకుంటే డార్క్ గా ఉన్న పెదవులు రంగు మారి ప్రకాశవంతంగా తయారవుతాయి.
గులాబీ పెదవుల కోసం పెదవుల వ్యాయామాలు:
1. రోజూ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు చక్కగా మస్సాజ్ చేసుకోండి. దీనివల్ల మీకు విటమిన్-ఇ దొరుకుతుంది.
2. సున్నితంగా మీ పెదవుల్ని పై దిశగా మస్సాజ్ చేసుకోండి.
3. చూపుడు వేలితో పెదవులపై క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ లఒ మస్సాజ్ చేసుకోవాలి.
4. మీ చూపుడు వేలితో పై దిశగా అలాగే కింది దిశగా కదుపుతూ మస్సాజ్ చేసుకోండి.
5. మీ పెదవుల్ని పొడి దూదితో తుడుచుకుని లిప్ బాల్మ్ ని వేసుకోండి. అది సూర్యుని వేడిమి నుంచీ కాపాడుతుంది.
ఇంకో చివరి అలాగే ముఖ్యమైన విషయమేమంటే ఎక్కువగా మంచి నీరు ఎంత తీసుకుంటే మీ పెదవులు అంతగా బాగుంటాయి.

మరిన్ని టిప్స్

పొడిబారటం మొదలైతే మీ పెదవులు పాడైపోతాయి. అలా జరుగకుండా ఉండాలంటే మీరు ఆల్మండ్ ఆయిల్, సహజసిధ్ధ మైనంతో రుద్దుట, క్యాడిల్లాక్ మైనపు వ్యాక్స్, గ్లిసరిన్, విటమిన్-ఇ ను వాడాలి.
పొడిబారిన పెదవులు చాలా నిస్సారంగానూ, పాలిపోయీ కనపడతాయి. శరీరం లోనీ వేడిమి వల్ల కూడా పెదవులు పొడిబారిపోతాయి. కాబట్టి శరీర వేడిమిని అదుపులో ఉంచుకోవాలి.
రోజూ పెదవులకు సహజసిధమైన బ్లీచ్ ఎంతో అవసరం. సుగర్, వెన్న లతో కూడిన బ్లీచ్ ఎంతో చక్కగా పనిచేస్తుంది.
కొన్ని రకాలైన డార్క్ కలర్ లిప్స్టిక్స్ ని వాడకండి. అంతేకాక కొన్ని లిప్స్టిక్స్ లో టాక్సిన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ రసాయనాల వేడి మీ పెదవులపై పడే అవకాశముంది. కాబట్టి అటువంటి వాటిని వాడకపోవటం మంచిది.
ధూమపానం వల్ల పెదవులు నల్లగా మారతాయి. సహజమైన రంగుని కోల్పోతాయి. కాబట్టి పొగ త్రాగటం మానేయ్యాలి.
సూర్య కిరణాల వల్ల కూడా పెదవులు పొడిబారి డార్క్ గా తయారవుతాయి. దీనికి కారణం అధికంగా మెలామైన్ ఉండటమే. ఇందుకోసం జాగ్రత్తపడేందుకు బాల్మ్ వాడటమే.
కృత్రిమమైన కాస్మెటిక్స్ రసాయన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి దానిమ్మ, బీట్రూట్ కలిసిన ప్రోడక్ట్లు లాంటివి వాడటం మంచిది.
మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి.విటమిన్ సి ఉండటం వల్ల మీ పెదవులు పిగ్మెంటేషన్ కు గురికావు.
క్లోరినేటెడ్ వాటర్ కూడా పెదవుల పిగ్మెంటేషన్ కు కారణం. కాబట్టి ఈ నీటిని వాడరాదు.
ఆయిల్ ను రాసుకుని రాత్రి అంతా ఉంచుకుంటే ఎంతో మంచిది.
ఆల్మండ్ ఆయిల్ ను అలాగే కొబ్బరి నూనె ను సమపాళ్ళల్లో కలిపి రోజూ 2 వారాల పాటూ రాసుకుంటే మంచి ఫలితముంటుంది.
రోజూ పెదవులకు మీగడని అలాగే కుంకుమని రాసుకోండి.
ఒక మెత్తని బ్రెస్సిల్స్ ఉన్న బ్రష్ తీసుకుని చక్కగా పెదవులపై మస్సాజ్ చేసుకోండి. దీనివల్ల మృత చర్మం పోతుంది.
ఇక ఐస్ క్యూబ్స్ ని తీసుకుని వాటితో పెదవులపై మస్సాజ్ చేసుకుంటే ఎంతో మంచిది.
లవ్వంగ నూనె తో మస్సాజ్ చేసుకుంటే మంచి పెదవులుగా పింక్ పెదవులుగా మారేలా చేస్తుంది.

ఆహారం

మీరు తీసుకునే ఆహారం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో పొందే విటమిన్లే చాలావరకూ మీ శరీరాన్ని, అలాగే మీ పెదవులను కాపాడతాయి. చక్కని పెదవుల కోసం పాలు, గుడ్లు, వెన్న, పచ్చని కూరగాయలని ఆహారంగా తీసుకోవాలి. మామూలుగా పెదవులు డార్క్ గా ఉండటానికి కారణం సూర్య కిరణాల తాకిడి వల్ల, ధూమపానం, మధ్యపానం, వంశపారంపర్యత కారణాలు కావచ్చు.

గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని మార్గాలు

రోజూ తీసుకునే జాగ్రత్తలే మన పెదవులు చక్కగా గులాబీ రంగులో మారతాయి. రోజూ పెదవులు శుభ్రపరచుకోవటం అనేది ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది. పెదవులపై ఉండే దుమ్ము ఏప్పటికప్పుడు శుభ్రపరచుకోవటమే మొదటి ముఖ్యమైన పని. రోజూ పెదవులను మస్సాజ్ చేసుకోవటం వల్ల మృత చర్మం పోతుంది. దీనికోసం ఒక టూత్ బ్రష్ తో రోజూ ఇలా రబ్ చేసుకోవాలి. అంతేకాక గులాబీ రేకులు, తేనె, పాలు, దోసకాయ తో పేస్ట్ చేసుకోవాలి. విటమిన్-ఇ ఉన్న లిప్ బాల్మ్ లను మాత్రమే సంరక్షణ కొరకు వాడాలి.

గులాబీ పెదవులకోసం గృహ చిట్కాలు

బీట్రూట్ జ్యూస్

ఇది సహజసిధ్ధమైనది. మీ పెదవులు చక్కటి గులాబీ రంగులో ఉండేందుకు చక్కగా తోడ్పడుతుంది. బీట్రూట్ జ్యూస్ ని రోజూ ఉదయం, సాయంత్రం పెదవులకు రాసుకోవాలి.

క్యారెట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ మాదిరిగానే ఈ క్యారెట్ జ్యూస్ మీ పెదవులను చక్కగా గులాబీ రంగులోనికి తెస్తుంది. ఒక క్యారెట్ ను తీసుకుని దానిని గ్రైండ్ చేసి ఆ రసాన్ని కాటన్ బాల్ తో రాసుకోవాలి.

గులాబీలు

గులాబీలు పెదవుల రంగు మార్చటానికి ఒక చక్కని మంచి ఏజెంట్స్. వీటిని గ్రైండ్ చేసుకుని ఆ రసాన్ని రాసుకుంటే చక్కగా ప్రకాశిస్తాయి.

దోస

దోస మీ పెదవులకు ఒక కొత్త కాంతిని తెస్తుంది. అంతేకాక రోజూ ఆ దోస ముక్కలతో మస్సాజ్ చేసుకుంటే మంచి రంగు తో మెరుస్తాయి.

ఆరెంజ్ తొక్కలు

ఆరెంజ్ తొక్కలు తీసి పవ్డర్ చేసుకోవాలి. ఈ పవ్డర్ లో పాలు కలుపుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ పెదవుల మృదుత్వాన్ని పెంచుతాయి. అంతేకాక మీ డార్క్ పెదవుల్ని మార్చి ప్రకాశవంతంగా చేస్తాయి. మీ పెదవులపై వాటిని రెండు నిముషాల పాటు మస్సాజ్ చేసుకోండి. తర్వాత 5 నిముషాలపాటు ఎండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి.

విటమిన్-ఇ

పెదవులు బాగా ఉండాలంటే ముందుగా శరీరం వేడి ఉండకూడదు. అలా ఉండకుండా ఉండేందుకు విటమిన్ -ఈ క్యాప్సుల్స్ రూపం లో దొరుకుతాయి. వాటిని రోజూ వాడాలి.

మీగడ

మీ పెదవులు మృదువుగా ప్రకాశవంతంగా ఉండాలంటే మీగడా రాసుకోవటం మంచిది. దీనితో పాటుగా గులాబీ రేకుల్ని వేసుకుని తర్వాత ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని 20 నిముషాలపాటు ఉంచుకుని తర్వాత శుభ్రపరచుకోవాలి.

గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని టిప్స్

1. పొగ తాగటం వల్ల మీ పెదవులు నల్లగా మారిపోతాయి. కాబట్టి దీనిని మానేయాలి.
2. కాఫీ, టీ లు తాగటం వల్ల మీ పెదవులు నల్లగా మారతాయి. కాబట్టి కెఫిన్ వాడకం తగ్గించాలి.
3. యూవీ రేస్ మీ పెదవులని నల్లగా మారుస్తాయి. కాబట్టి దీనికి గానూ మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
4. ఎప్పుడూ పెదవుల్ని చప్పరించుకోవటం వల్ల మీ పెదవులు పొడిబారిపోయి నల్లగా మారతాయి కాబట్టి ఆ అలవాటుని మానుకోవాలి.
5. మీ పెదవులు బాగా ప్రకాశవంతంగా, కాంతివంతంగా, గులాబీ రంగులో ఉండాలంటే మంచి విటమిన్లు, మినరల్స్ బాగా తీసుకోవాలి. కాబట్టి పండ్లు, కూరగాయలు తింటే పెదవులు ఆరోగ్యకరంగా ఉంటాయి.

Posted on

Sex stamina tips for men in Telugu – మగవారిలో సెక్స్ సామర్ధ్యం పెరగాలంటే..

సెక్స్ అనేది ఒక దృగ్విషయం. అటు శరీరం, ఇటు మనస్సు సంతృప్తిని చెందాలంటే ఇదీ ఒక ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఈ సెక్స్ అనేది బలవంతం గా చేసేది కాదు. అలాగే సంభోగం జరిపే సమయంలో అసంతృప్తి మిగిలిస్తే కూడా భాగస్వామిని నిరుత్సాహపడవచ్చు.

మగవారిలో సెక్స్ సామర్ధ్యం ఎక్కువగా ఉంటేనే భాగస్వామిని సంభోగ సమయంలో సంతృప్తి పెట్టవచ్చు. సంభోగ సమయంలో స్త్రీని సంతృప్తి పరచక పోవటం జరుగుతుంటుంది. దీనికి కారణం పని ఒత్తిడి వల్ల అలసట, చిరాకులే కారణాలు. చాలా మంది మగవారు తమ సెక్స్ సమస్యల్ని వెల్లిబుచ్చలేరు.

ఈ సమస్యల గురించి వారి భాగస్వామితో మాట్లాడేందుకు సాహసించరు..ఇష్టపడరు. ఆఖరికి బెడ్ మీద భాగస్వామితో సంభోగించే సమయంలో ఈ ఆందోళన, అసంపూర్ణ సెక్స్ సామర్ధ్యం వల్ల చెడు పరిణామాల్ని ఎదుర్కొనేలా చేస్తుంది.

చేప పిల్లకు ఈత నేర్పల్సిన అవసరం లేనట్టే అలాగే సెక్స్ చేసే విధానాలు కూడా ఏ మానవునికీ నేర్పాల్సిన ఆవశ్యకత లేదు. సెక్స్ అనేది ప్రతీ మానవునిలో సహజసిధ్ధంగా ఉద్భవించేదే. ప్రతీ జంటా తమ భాగస్వామితో వారి వారి ఇష్టాలను బట్టి సెక్స్ సంభోగం చేస్తుంటారు.

అలాగే మీరు 40 ఏళ్ళ కన్నెలో స్పందన చూడలేరు. కొన్ని సార్లు టీనేజర్లలో కూడా సెక్స్ పట్ల ఆసక్తి తక్కువగా ఉండటం కూడా చూడవచ్చు. కానీ నేడు సెక్స్ సామర్ధ్యం పెంచుకునేందుకు చాలా రకాల విధానాలు ఉనాయి.

సెక్స్ సామర్ధ్యం తక్కువగా ఉండటానికి కారణాలు

నేడు చాలామంది మగవారు వారి సెక్స్ సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల సతమతమవుతున్నారు. సెక్స్ సంభోగంలో మరవారి పాత్ర ఎక్కూవగా ఉంటుంది. ఈ సమయంలో భాగస్వామిని అసంతృప్తికి లోను చేయటం వల్ల భార్యభర్తల గొడవలే కాక గృహ కలహాలు ఏర్పడతాయి. అస్సలు ఈ సామర్ధ్యం ఎందుకు తగ్గుతుంది? దీనికి గల కారణాలేంటి? మగవారిలో సెక్స్ సామర్ధ్యం తగ్గటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!

అనారోగ్య ఆహార అలవాట్లు

ఆహారం ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అదీ కాక అనారోగ్యమైన ఆహారం, ఎక్కువ శాతంలో జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల మీ సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతుంది.

అధికంగా మందులు వాడటం

చాలామంది మగవారు ఎక్కువగా మందులు వాడుతుంటారు. ఇలా మందులు వాడేవారు సంభోగం జరిపే సమయంలో త్వరగా నీరసించిపోతారు, చమటలు పట్టేస్తాయి. సెక్స్ పై ఈ మందులు దుష్ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని మందులు సెక్స్ సామర్యాన్ని అంటే అంగస్తంభన, స్కలనం బాగా జరిగేలా చూస్తాయి. కాని ఇవి తాత్కాలికమే, రాను రానూ భవిష్యత్ లో పూర్తి స్థయిలో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

మధ్యపానం మరియు ధూమపానం

అతిగా మధ్యపానం మరియు ధూమపానం చేయటం వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం త్వరగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి మీ వీర్య కణాల్ని నాశనం చేస్తాయి.

వ్యాయామం చేయకపోవటం

వ్యాయామం చేయటం వల్ల మీ రక్త ప్రసరణ బాగా జరిగి చక్కటి శక్తి సామర్ధ్యాలు మీరు పొందుతారు.

స్వయం కృతాపరాధం

చాలావరకూ మగవారు తమ భాగస్వాముల్ని నిర్లక్షం చేస్తుంటారు. దీని వల్ల వారి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం నాశనమవుతాయి. అంతేకాక ఇలా ఉంటే ఆందోళన, ఒత్తిడి పెరిగి శీగ్ర స్కలన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. రాను వయస్సు పైబడే కొద్ది మరిన్ని సెక్స్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఆందోళన మరియు స్ట్రెస్

సాధారణంగా మగవారు రోజూ ఉండే పని ఒత్తిళ్ళతో సతమతమవుతుంటారు. అంతేకాక ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో వాటి వల్ల చాలా ఆందోళన, ఒత్తిడి ఎదుర్కోంటున్నారు.

సెక్స్ సామర్ధ్యం పెరిగేందుకు టిప్స్

గజ్జ కండరాలను చాచటం

చాలా మంది రాత్రి సంభోగం వల్ల గజ్జ కండరాల్లో నొప్పితో బాగా బాధ పడుతుంటారు. ఇందుకోసం మీరు కండరాలను స్ట్రెచ్ చేయటం వల్ల చక్కగా ఆ నొప్పి తగ్గుతుంది. దీని వల్ల మీ సెక్స్ సామర్ధ్యం చక్కగా పెరుగుతుంది.

మానసికంగా దృష్టిని కేంద్రీకరించటం

సెక్స్ చేయాలని నిజమైన ఆసక్తి మీకు ఉండేలా చూసుకోండి. మీ దృష్టి మీ కోరిక మీద పెట్టండి. మీకే మనస్సులో నిజమైన కాంక్ష ఉంటే ఇక దానిని ఎవరూ పాడుచేయలేరు. ఈ సమయంలో మీ ఆందోళనలన్నీ తొలగించుకొండి. మీ భాగస్వమి తో బెడ్ పై ఎలా ఉండాలో అది మాత్రమే మీ మనసులో ఉంచుకోండి.

చేతి కండరాల వ్యాయామం

మీ చేతి కండరాల వ్యాయామం సెక్స్ లో చాలా ప్రధమైన పాత్రని పోషిస్తుంది. ఎందుకంటే మీరు సెక్స్ చేసేప్పుడు మీ పై శరీర భాగమే ఎక్కువ పాత్రని పోషిస్తుంది. మీ చేతి కండరాలకు ఎంత శక్తి ఉంటే అది మీ సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతుంది.

చాలా మంది వారి చేతి కండరాల్లో శక్తి లేక ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. అంతేకాక ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిచాలి అదేంటంటే సెక్స్ చేసేప్పుడు మీ భాగస్వామి పై పూర్తిగా మీ బరువు ఉంచితే సెక్స్ సంభోగం సరిగ్గా జరుగదు.

అదే మీ చేతుల మీదే మీరు ఉండి మీ శరీరాన్ని వాల్చకుండా సెక్స్ చేస్తే మీరు అదేవిధంగా మీ భాగస్వామి ఇద్దరూ సెక్స్ అనుభూతిని పొందవచ్చు. కాబట్టి చేతి కండరాల ఎక్సెర్సైస్ ఖచ్చితంగా చేయాలి.

రక్తప్రసరణ అధికం చేసుకోవటం

రక్తప్రసరణ ఎక్కువగా ఉండే ప్రదేశమేదైన చక్కగా పనిచేస్తుంది.  ఏ వయాగ్రా వాడకుండానే మీరు చక్కగా సెక్స్ సామర్ధ్యం పొందటం కోసం రక్తప్రసరణ అధికంగా అయ్యేలా చేసుకోవచ్చు.

అది ఎలాగంటే మీ గజ్జ మధ్య కండరాన్ని రోజూ మస్సాజ్ చేసుకోవటం వల్ల మీ సెక్స్ సామర్ధ్యం చక్కగా పెరుగుతుంది. దీనివల్ల చక్కగా రక్తప్రసరణ అవ్వటేమే కాక సెక్స్ కోరిక అధికమవుతుంది.

ఉదర కండరాల వశ్యత

సిక్స్ ప్యాకో లేక 12 ప్యాకో ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది కదు..అవును నిజమే..కానీ ఫ్యామిలీ ప్యాక్ కాదు. ఫ్యామిలీ ప్యాక్ అయితే మీరే ఇబ్బంది పడతారు. సెక్స్ సామర్ధ్యం చక్కగా పెరగాలంటే మీ ఉదర కండరాలు చక్కగా ఉంటేనే ఆ ఆనందాన్ని, తృప్తిని పొందవచ్చు.

కాబట్టి పొట్ట భాగంలోని అలాగే కింది అబ్డోమినల్ కండరాలు చక్కగా ఉంటే మీ సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది. అంతేకాక మీ గజ్జని చక్కగా సంభోగం సమయంలో ముందుకు కదపటం అలాగే కాసేపటికి వదిలేయటం చేస్తే మంచిది. ఇది మంచి ఎక్సెర్సైస్. ఇలా చేయటం వల్ల మీ భాగస్వామితో సెక్స్ చేసేప్పుడు ఆకస్మికంగా ఆపే ఇబ్బంది రాదు.

హస్తప్రయోగం

నిజానికి, హస్తప్రయోగం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మరి హస్తప్రయోగం వల్ల పొందే అనుభూతి చాలా ఎక్కువ. ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది.

డోపమైన్, ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ సెక్స్ ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయంలో చేసే హస్తప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక ఎక్సెర్సైస్ గా కూడ ఉపయోగమైనదే. ఇలా చేయటం వల్ల మీ సెక్స్ సంభోగం సమయంలో మీపై మీకు నియంత్రణ ఉంటుంది.

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే అనేది సెక్స్లో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. దాదాపు ఆడవారు రతి సమయంలో ఈ ఫోర్ ప్లే ని కోరుకోవటం, అలాగే ఎక్కువ సమయం ఫోర్ ప్లేపై ఆశక్తి చూపుతారు. ఈ ఫోర్ ప్లేయ్ చేసెప్పుడు చుబనాలతో, రొమాంటిక్ మాటలతో రెచ్చగొట్టుకుంటూ ఈ ఫోర్ ప్లే చేస్తే మీ భాగస్వామి ఒక మధురానుభూతిని పొందుతుంది.

ల్యూబ్రికేషన్

సెక్స్ సమయంలో ల్యూబ్రికేషన్ ఉంటే సెక్స్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయవచ్చు. ల్యూబ్రికేషన్ ఉండటం వల్ల మీరు మీ బెడ్ టైం ని పొడిగించుకోవచ్చు. ల్యూబ్రికేషన్లు నీటి ఆధారితమైన వాటినే వాడాలి. ఆయిల్ సంబంధితమైనవి వాడటం అంత మంచిది కాదు.

శ్వాస

సెక్స్ సమయంలో శ్వాస చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. శ్వాసని చక్కగా మెల్లగా శ్వాసించాలి. ఇలా చేయటం వల్ల స్ట్రెస్, ఆందోళన, ఆయాసం రాకుండా ఉంటుంది. అంతేకాక శ్వాస వేగం ఎక్కువగా అయితే శీఘ్ర స్కలనం అయ్యే ప్రమాదమూ ఉంది.

బరువు

చాలా మంది మగవాళ్ళల్లో ఈ సమస్య ఉంది. బరువుపై వారికి నియంత్రణ లేదు. అందుచేత సెక్స్ లోనూ చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. కాబట్టి అధిక బరువు మంచిది కాదు.

కేగల్ పీసీ ఎక్సెర్సైసెస్

ఈ వ్యాయామ పధ్ధతులు మీ సంసార జీవితాన్ని మరింత మెరుగుపడేలా, సెక్స్ సామర్ధ్యం పెరిగేలా చేస్తాయి. అంతేకాక కటి కండరాల వ్యాయామం కూడా మీ సెక్స్ సామర్ధ్యానికి ఎంతో మంచిది.

ఈ ఎక్సెర్సైస్ చేసేందుకు మంచి పధ్ధతి ఏంటంటే మూత్ర విసర్జన చేసేప్పుడు మూత్రాన్ని నిలిపి నిలిపి పోయటం వల్ల ఈ కటి కండరాల ఎక్సెర్సైస్ చక్కగా పూర్తి అవుతుంది. అంతేకాక సెక్స్ సామర్ధ్యం చాలా వరకు పెరుగుతుంది.

ఎరుపు రంగు

ఎరుపు రంగుతో సెక్స్ సామర్ధ్యం ఏంటీ? అనుకుంటున్నారా? అవును ఇది నిజమే.. ఎరుపు రంగుతో మీ సెక్స్ వాంఛ్ఛ పెరుగుతుంది. మీ బెడ్ రూంలో చాలావరకూ అన్నీ అంటే క్లాత్స్, బల్బ్, గోడలు, ఫుడ్స్, బెడ్ షీట్స్ అన్నీ దాదాపు ఎరుపు రంగులో ఉంటే మగ, ఆడ వారు చాలా ఇష్టాన్ని చూపుతారు. వారిలో శృంగార వాంఛ పెరుగుతుంది.

మగవారిలో సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే ఆహార పదార్ధాలు

ముడి గుల్లలు(oysters)

వీటిని తినటం వల్ల సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ స్థాయిలో జింక్ ఉంటుంది. అలాగే ఇవి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ని ప్రేరేపిస్తాయి. ఇది సెక్స్ సామర్ధ్యం పెంచటంతో పాటు, సెక్స్ వాంఛ్ఛని ఎక్కువ చేస్తుంది.

పుచ్చకాయ

ఇది సహజసిధమైన రసాయనాలతో కూడి ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల మీ శరీరానికి ఆక్సీజన్ బాగా అందుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో మస్తిష్క వ్యవస్థని ప్రేరేపించే యూఫోరియా ఉంటుంది.

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే 3 మార్గాలు

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే 3 రకాల మార్గాలు  ఉన్నాయి.

మొదటిది ఏంటంటే అది నిదానంగా చేయటం. సెక్స్ అనేది ఎప్పుడూ ఫాస్ట్ గా ఖంగారుగా చేయకూడదు. మీరు మెల్లగా సెక్స్ స్టోక్స్ ఇవ్వటం మంచిది.

మీ కదలికలు మెల్ల మెల్లగా స్టిమ్యులేట్ చేసేలా ఉండాలి. మీరు సెక్స్ చేసేప్పుడు మెల్ల మెల్లగా మీ పార్టనర్ వెనుక భాగాన పట్టుకుని స్టోక్స్ ఇవ్వాలి. పెనెట్రేషన్ మృదువుగా అలాగే మెల్లగా ఉండాలి.

ఈ రకంగా సెక్స్ చేయటం వల్ల ఇటు మీకు అలాగే అటు మీ పార్టనర్ కీ ప్రపంచం పై విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది.

1. ఇంకో ముఖ్యమైన తేడా ఎంటంటే మీరు సెక్స్ చేసేటప్పుడు 7 మరియు 9 టెక్నిక్ ని అనుసరించటం మంచిది. ఈ టెక్నిక్ ఎంటంటే సెక్స్ చేసే సమయంలో 7 ఫాస్ట్ స్ట్రోక్స్, 9 స్లో స్టోక్స్ ఇవ్వాలి. ఇలా పూర్తిగా సెక్స్ మొత్తం ఒక దాని తర్వాత ఒకటి ఇస్తూ అల్టెర్నేటివ్ గా చేయాలి. ఇలా చేయటం వల్ల మీ భాగస్వామి ఎక్కువ అనుభూతి పొందుతుంది.

2. ఇంకో పధతి ఏంటంటే మీరు సెక్స్ చేసేటప్పుడు మీరు ఒక పోజ్ లోనే చెయ్యకూడదు. రకరకాల భంగిమల్ని వాడుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మీరు మీ భాగస్వామి ఎంతో సంతృప్తిని పొందుతారు.

అంతేకాక మీకు వీర్య స్కలనం జరిగే సమయానికి ఓరల్ సెక్స్ కి అలాగే ఇంకా ఏదో సెక్స్ పోజ్ కి  మీ పార్టనర్ ని మార్చటం వల్ల మీకు వెంటనే స్కలనం అవ్వకుండా ఉంటుంది. అంతేకాక మీరు రకరకాల సెక్స్ యాంగిల్స్ ని ఎంజాయ్ చేసినట్లు ఫీల్ అవుతారు.

3. ఇంకో పధతి ఏంటంటే ఎక్కువ సేపు మీరు సెక్స్ చేయటం కూడా మంచిది కాదు. సెక్స్ మధ్యలో మీరు కొన్ని బ్రేక్స్ తీసుకోవటం మంచిది. మీరు ఎప్పుడైతే మీరు మీ స్కలన స్థాయికి చేరుకుంటారని మీకు అనిపిస్తుందో అప్పుడు సెక్స్ ఆపండి. వెంటనే ఆ ఆపిన సమయాన్ని ఫోర్ప్లే తో భర్తీ చేయండి.

కొన్ని సెక్స్ విషయాల్ని, రొమాంటిక్ మాటల్నీ పార్టనర్ తో పంచుకోండి. ఒకసారి మీకు ఆ సెన్సేషన్ తగ్గింది అనుకున్నప్పుడు ఆ తర్వాత రెండవ సంభోగానికి మీరు రెడీ అవుతారు.

 మీ సెక్స్ సామర్ధ్యం పెరగటానికి మరిన్ని మార్గాలు

మీరు ఎక్కువసేపు బెడ్ పైన ఉండటం అంటే ఎక్కువ గడపటం వల్ల మీరు  కోరుకునే సెక్స్ ని ఆస్వాదించగలరు.

మీరు సెక్స్ కు ఉపక్రమించే ముందు ఖచ్చితంగా ల్యూబ్రికేషన్ ను వాడటం మంచిది. ఎందుకంటే మీరు సెక్స్ లో ఎక్కువ సేపు ఉండగలరు. లేకపోతే ఒరుసుకుపోవటం, గాయాలవ్వటం లాంటివీ జరుగుతాయి. అందువల్ల మీరు మంచి ల్యుబ్రికేషన్ వాడాలి.

మీరు సెక్స్ ని ఎక్కువసేపు ఆస్వాదించాలంటే బెడ్ మీద అదీ ఎక్కువసేపు గడపాలనుకుంటే ఫోర్ ప్లే చేయటం ఉత్తమం. దీని వల్ల మీ పార్టనర్ ఎక్కువ సంతృప్తి చెన్దుతుంది.

ఫోర్ ప్లే అనేది సెక్స్ లో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. దాదాపు ఆడవారు రతి సమయంలో ఈ ఫోర్ ప్లే ని కోరుకోవటం ఎక్కువ సమయం ఫోర్ ప్లేపై ఆశక్తి చూపుతారు. ఈ ఫోర్ ప్లేయ్ చేసెటప్పుడు చుంబనాలతో, రొమాంటిక్ మాటలతో రెచ్చగొట్టుకుంటూ ఈ ఫోర్ ప్లే చేస్తే చాలా మంచిది.

మీకు మంచి సెక్స్ కావాలనుకుంటే మీరు దానిని బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు మీరు సెక్స్ నిపుణుడిగా తయారు చేసుకోవాలి. అప్పుడే మీ సామర్ధ్యం పెరిగి ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేయగలరు.

హస్త ప్రయోగాన్ని ప్రయత్నిచండి. హస్తప్రయోగం వల్ల పొందే అనుభూతి చాలా ఎక్కువ. ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది.

మీ సెక్స్ సామర్ధ్యం పెరగాలంటే కటి కండరాల మస్సాజ్ ఎంతో అవసరం. పెల్విక్ మజిల్స్ బాగా శక్తివంతంగా ఉంటే అంత మీరు సెక్స్ ని బెడ్ పై ఆస్వాదించవచ్చు.

మీ సెక్స్ సామర్ధ్యం బాగా పెరగాలంటే మీరు స్క్వాట్స్ అంటే గొంతు కూర్చుండు అనే వ్యాయామ పధ్ధతిని చేయండి. దీని వల్ల మీ సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది. ఇంకా బాగా ఫలితం కనిపించాలంటే ఒక కాలి మీద చేయటం మంచిది.

మీ సెక్స్ సామర్ధ్యం పెరగాలంటే మరో ఎక్సెర్సైస్ బెంచ్ స్ట్రెట్చ్ ఎక్సెర్సైస్ చేయవచ్చు. ఇది చేయటానికి ముందు మీరు ఒక బెంచ్ మీద పడుకోవాలి. తర్వాత మీ వెంకభాగమంతా అలాగే ఆనుకుని ఉండాలి.

తర్వాత మీ చేతుల్ని బల్ల మీద కింద అంచాలి, ఇందుకోసం మీ భుజాలపై మీద బరువును ఉంచాలి. తర్వాత మీ పొజీషన్ వొంపుగా ఉండాలి. ఈ వర్క్ అవుట్ లో మీ భుజాలపై ఎక్కువ భారం పడుతుంది. ఈ విధానం చాలా మంచిది.

Posted on

గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి సమస్యకి చిట్కాలు – Telugu tips for pregnant women

గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల గర్భిణీ స్త్రీలలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతీ త్రైమాసికానికీ నిద్ర లేమి సవాళ్ళను గర్భిణుల ముందు నిలుస్తాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ప్రతీ త్రైమాసికానికి కొన్ని నిద్రలేమి మార్పులు వస్తాయని చెప్పటం జరిగింది. అంతేకాక 78 శాతం గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది. వాటిని ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం మీ తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో చూద్దామా..!
గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య. గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసము అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి.

మొదటి త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1. తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూం కి వెళ్ళాల్సివస్తుంది.
2. ప్రెగ్నెన్సీలో నిద్రించే సమయంలో అంతరాయాలు ఏర్పడటం వల్ల శారీరకంగా, మానసికంగా స్ట్రెస్ ఏర్పడటం జరుగుతుంది.
3. పగటి పూట ఎక్కువగా నిద్రించటం.

రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1.రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య దాదాపూ చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఒకటేలా ఉంటుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రాకపోవటం దీనికి కారణం పిండం రోజు రోజుకీ వృధ్ధి చెందటం. పిండం పెరగటం వల్ల ఇది బ్లాడెర్ పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించనివ్వకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్తితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది.

మూడవ త్రైమాసికంలో నిద్రలేమి సమస్య

ఈ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు చాలా నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కొంటారు.
1. క్రమక్రమంగా బొడ్డు పెరుగుదల వల్ల అసౌకర్యంగా ఉండటం.
2. గుండెల్లో మంట, కాళ్ళ తిమ్మిర్లు, సైనుస్ రద్దీ.
3. రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావటం ఎందుకంటే బిడ్డ కదలికల వల్ల ఆ ఒత్తిడి బ్లాడెర్ పై పడి తరచుగా మూత్రం వస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర పట్టేందుకు కొన్ని టిప్స్

కొన్ని టిప్స్ వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కాని మరీ మీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే మీ డాక్టరుని సంప్రదించటం మంచిది.

అదనంగా పిల్లోస్ వాడటం

ప్రెగ్నెన్సి సమయంలో మీరు వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది. పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి. దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా బోడీ కి సరిపడే పిల్లోలని వాడటం మంచిది.

పొష్టికాహారం

ఒక గ్లాస్ పాలు త్రాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి. అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్ ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి.

ఆయాసం

కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్త్మ లేదా హైపెర్థైరాయిడిజం సమస్యతో సతమతమవుతుంటారు.

గురక పెట్టడం

గర్భిణీ స్తీలకు సహజంగా ముక్కులోని రంద్రాలు ఉబ్బటం వల్ల ఎక్కువగా బిగ్గరగా గురక తీస్తుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 30 శాతం ఈ సమస్యకు గురి అవుతున్నారు.

విశ్రాంతి పొందే మార్గాలు

విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సు కి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.

వ్యాయామం

ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వ్యాయామం చేయటం ఎంతో మంచిది. వ్యాయామం చేయటం వల్ల మీ శరీరానికి, మనస్సుకి ఉల్లసం, ఉత్తేజం వస్తాయి. అంతేకాక ఒత్తిడి తొలగుతుంది. ఆరోగ్యకరంగ మాత్రమే వ్యాయామం చేయాలి. అధిక వ్యాయామం చెయకూడదు. డాక్టరు సలహా మేరకే ఈ వ్యాయమం చేయటం మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అంటే 4 గంటల ముందు మాత్రం వ్యాయామం అసలు చేయరాదు.

నిద్ర

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రించే సమయంలో ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

వేరే మందుల వాడకం

ప్రెగ్నెన్సీ సమయంలో వేరే మందులు వాడటం మంచిది కాదు. ఇవి మీ బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అంతేకాక కొన్ని మందులు అంటే యాంటీ బయాటిక్స్, హెర్బల్ ప్రాడక్ట్లు వాడటం అంత మంచిది కాదు. మీరు ఏ మందులు వేసుకోవాలన్నా మీ డాక్టరుని సంప్రదించి మాత్రమే వేసుకోవాలి.