Posted on

Telugu tips to remove nipple hair – చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించడం ఎలా?

మహిళలు తమ అందం యొక్క అవసరాలకు సంబంధించి ప్రత్యేకంగా నిలవాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు.  స్త్రీ శరీరంలోని కొన్ని భాగాలు వారి స్త్రీత్వానికి నిదర్శనగా ఉంటూ పురుషులను ఆకర్షిస్తాయి. ఈ వైవిధ్యం పురుషులకు భిన్నంగా వారిని వేరు చేస్తూ ఉంటుంది. కేవలం చూడటానికి వైవిధ్యం కలిగిన చనుమొనలు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోనూ ఉంటాయి. స్త్రీలలో అధికంగా గుర్తించ దగిన భాగం వక్షోజాల మీదగా చనుమొనలు ఉంటాయి. పురుషులలో దీనికి భిన్నంగా సమతల ఛాతీ మీదగా ఈ చనుమొనలు ఉంటాయి.

చనుమొనల చుట్టూ అవాంచిత రోమాల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే అవాంచిత రోమాలను శరీరంలోని చంకలు, జననాంగాలు మరియు చనుమొనల చుట్టూ, మొదలైన వివిధ భాగాల నుండి సులభమైన కొన్ని ఉపాయాలతో తొలగించవచ్చు.

మహిళలు వారి చనుమొనల చుట్టూ అవాంచిత రోమాలను కలిగి ఉన్నట్లయితే తదుపరి వారి పురుషుల ప్రేమను చురగోనే సమయంలో ప్రతిగా చిరాకు కలిగించవచ్చు. అందువలన అటువంటి ప్రతికూల సందర్భం రాకుండా  ముందుగా ఈ కింది సులభమైన సూచనల ద్వారా మీ చనుమొనల చుట్టూ అవాంచిత రోమాలను తొలగించడం మంచిది.

చనుమొనల చుట్టూ అవాంచిత రోమాల తొలగింపుకు మార్గాలు

హెయిర్ రిమూవల్ క్రీములు

నేడు మార్కెట్టులో సులభంగా వివిధ రకాల హెయిర్ రిమూవర్ క్రీములు అందుబాటులో లభిస్తున్నాయి. వాటితో మీరు మీ చనుమొనల చుట్టూ కనిపించే అవాంచిత రోమాలను సులువుగా తొలగించే సాధనకు పూనుకోవచ్చు. మీరు ఈ హెయిర్ రిమూవర్ క్రీములని కొనుగోలు చేసే ముందు దాని బ్రాండ్ కు సంబంధించి ఒక వీక్షణ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మీరు ఉపయోగించాల్సిన అవయవము శరీరంలో అత్యంత సున్నితమైన భాగము. లోపభూయిష్ట ఉత్పత్తుల వలన ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

హెయిర్ రిమూవింగ్ క్రీముని తీసుకుని మీ చనుమొనల చుట్టూ ఉన్న అవాంచిత రోమాల మీదగా రాసి 5 నిముషాల పాటు వేచి ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా స్పాచులాను ఉపయోగించి క్రీమును తొలగించండి. మీరు మీ అవాంచిత రోమాలను కూడా దానితో తొలగించబడటం చూస్తారు.  

వాక్సింగ్

మీరు వాక్సింగ్ ప్రక్రియ విధానాన్ని సలూన్ కి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం చేతులు, కాళ్ళు, చంకలలో కూడా అవాంచిత రోమాలను తొలగించడానికి  ఉపయోగించబడుతుంది. మీరు ఈ విధానాన్ని మీ చనుమొనల మీద కూడా ఉపయోగించవచ్చు. మీరు పార్లర్ లో ఈ వాక్సింగ్ కొరకు సిగ్గు పడుతున్నట్లయితే ఇంట్లో కూడా ఈ విధానాన్ని చేసుకోవచ్చు. దీనికి మీకు కావలిసిందల్లా వాక్స్ మరియు ఒక కాటన్ వస్త్రం మాత్రమే. వాక్సును సరిపడా కరిగించి అవాంఛిత వెంట్రుకలు కలిగిన చోట్ల పూయండి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో చర్మానికి వస్త్రానికి మధ్య గాలి ఖాళీ లేనట్లుగా నొక్కి కప్పి ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా వస్త్రాన్ని లాగండి. దానితో పాటుగా తొలగించబడిన వెంట్రుకలు మీరు చూడ గలుగుతారు.

లేజర్ చికిత్స

అవాంఛిత రోమాల తొలగింపునకు మీరు లేజర్ చికిత్స గురించి వినే ఉంటారు. క్రీమ్ హెయిర్ రిమూవర్ అలాగే వాక్స్ వంటి వాటి వలె కాకుండా ఈ విధానం రొమ్ముల చుట్టూ ఉండే అవాంఛిత రోమాల తొలగింపునకు మరింత మెరుగు కలిగిన శాశ్వత పరిష్కార చికిత్సా విధానంగా పేర్కొనవచ్చు. ఇక్కడ నిపుణులు మీ శరీర భాగం నుండి అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించేందుకు ఒక కిరణమును ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా 2-3 పర్యాయాలు చికిత్సకు కూర్చోవాల్సి ఉంటుంది. అయితే ఫలితంగా ఇది మీకు పరిపూర్ణమైన రుజువుతో ఎన్నటికీ సమస్య పునరావృతం కాని విధంగా మీరు హామీ పొందగలుగుతారు.   

చక్కెర చికిత్స

ఎటువంటి కృత్రిమ రసాయనాలను ఉపయోగించకుండా సహజమైన పద్ధతిలో కూడా మీరు ఈ చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. దీని కొరకు మీరు ఒక చెంచా పంచదార తీసుకుని ఒక సన్నని మంట మీద కరిగించండి. అది కరిగిన తర్వాత మీరు అవాంఛిత రోమాలను తొలగించాలనుకునే ప్రదేశంలో అప్లై చేయండి. దీని మీదగా ఒక కాటన్ వస్త్రాన్ని నొక్కుతూ కవర్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా వస్త్రాన్ని వొలిచే క్రమంలో తొలగిస్తూ మార్పుని చూడండి.    

ఎలక్ట్రోలైసిస్ (విద్యుద్విశ్లేషణ)

ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియతో కూడా మీ చనుమొనల చుట్టూ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. స్త్రీలు చంకలు, యోని, చేతులు మరియు కాళ్ళను క్షౌరము చేసేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మీరు చికిత్స గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎలక్ట్రోలైసిస్ నిపుణున్ని సంప్రదించగలరు. ఇది మీ చనుమొనల చుట్టూ ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి ఒక సురక్షితమైన మార్గం. నేడు   ఎలక్ట్రోలైసిస్ అనేది అన్ని రకాల చర్మ రకాలకు మరియు రోమాలకు సంబంధించి ప్రభావ వంతంగా పని చేసే ఒక సమర్ధవంతమైన విధానం. కానీ మీరు మీ సంరక్షణ కొరకు ఒక లైసెన్సు కలిగిన అనుభవజ్ఞులైన ఎలక్ట్రోలైసిస్ నిపుణులని సంప్రదించాలి. అలాగే ఎలక్ట్రోలైసిస్ వంటి వివిధ చికిత్సలను నిర్వహిస్తున్న పేరొందిన సంస్థలను కూడా మీరు సంప్రదించవచ్చు.  

దీనికోసం మీరు ఆన్లైన్ లో వివిధ రకాల వెబ్ సైట్లు మరియు వాటి సంస్థాగత నిర్మాణం, ప్రారంభించిన సంవత్సరం వంటి సామర్ధ్యపు పరిమితులను గురించి ఒక లుక్కేయొచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రోలైసిస్ ఏజెంట్ ను సంప్రదించి ఇందులోని లాభ నష్టాలను గురించి పూర్తి వివరాలను పొందగలరు. మీరు దానికి సంభంధించిన ప్రతీ అంశాన్ని క్షున్నంగా తెలుసుకోవడం వలన తర్వాత పశ్చాత్తాపం ఉండదు. నిర్ణయాన్ని తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులని కూడా  ఒకసారి సంప్రదించండి.

Posted on

Weight loss tips in Telugu – బరువు తగ్గడానికి చిట్కాలు

ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడంతో శరీరం చేత గోధుమ కొవ్వులను నియంత్రించడం సాధ్యపడుతుంది. మీరు బరువుని కోల్పోతున్నామని చెప్తున్నట్లయితే మీరు కేలరీలను కోల్పోతున్నారని దాని అర్ధం. అధిక బరువు అనేది వ్యక్తిలో ఊబకాయంకు దారితీస్తుంది. ప్రజలు ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన ఆకృతి గల శరీరాన్ని కోరుకుంటారు. ఇదంతా మీరు నిర్ధిష్టమైన ఆహార నియమాలు మరియు క్రమం తప్పని వ్యాయామాలతో పొందవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం మీ బరువుని నిర్ణయించడంలో రసాయనాల వినియోగం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

వివిధ పరిశోధనల్లో కనుగొన్నది ఏమిటంటే గోధుమ కొవ్వులు లేదా గోధుమ కొవ్వు కణజాలం అనే ఒకదానిని కొన్ని సంవత్సరాల ముందు కనుగొన్నారు. అంతేకాకుండా అది శిశువు శరీరంలో ఉండి వాళ్ళు ఎదిగే కొద్దీ కోల్పోతుందని ఒక నమ్మకం కూడా ఉండేది. శాస్త్రవేత్తల ప్రకారం గోధుమ కొవ్వులు జీవక్రియాపరంగా మేల్కొని ఉండి కొవ్వులను కరిగించడంలో సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది మంచి కొవ్వు వర్గంలో పరిగణించబడుతుంది కాబట్టి పరిపూర్ణ శరీర ఉష్ణోగ్రతని నిర్వహించడంలో ఇది నిజంగా సామర్ధ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది స్థూలకాయం, షుగరు వ్యాధి వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహకరిస్తుంది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి ఇటీవల నివేదిక ప్రకారం గోధుమ కొవ్వు ఉత్పత్తిని కలిగి ఉన్న నిర్ధిష్ట జన్యువుతో ఉన్న ఎలుకలు తక్కువ రక్తపోటు స్థాయితో పాటుగా చాలా స్లిమ్ గా ఉండటం గమనించారు. అంతేకాకుండా అవి తక్కువ ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. జన్యుపరంగా మార్పు చెందిన ఎలుకలతో పోలిస్తే ఈ ఎలుకలు కాలేయంలో తక్కువ కొవ్వు కలిగి ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యంగా మరియు సరియైన శరీర ఆకృతిని కలిగియున్నాయి. అందువల్ల స్థూలకాయులను చికిత్స చేయడంలో గోధుమ కొవ్వు నిజంగా ప్రభావవంతమైనది అని అనేక వాస్తవాలను ఆధారంగా పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు.

పరిశోధకులు ప్రతీ వయోజన వ్యక్తి ఎక్కువ లేదా తక్కువ నిష్పత్తిలో గోధుమ కొవ్వులను కలిగి ఉన్నట్లు కూడా తెలుసుకున్నారు. కానీ దానిని సక్రమంగా వినియోగించలేకపోతే అది అంతగా చర్యలలో ఉండదు. వయసు మళ్ళిన కొద్దీ గోధుమ కొవ్వులను ఆయా వ్యక్తులు కోల్పోవచ్చు కూడా. మధ్యస్థ వయష్కులు మరియు వృద్ధులు అధికంగా బరువు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కానీ నేడు ప్రజలు శరీరంలో గోధుమ కొవ్వులు తగ్గడం వలన యవ్వన వయష్కులు కూడా స్థూలకాయం మరియు అధిక బరువు వంటి సమస్యలకు గురవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం అధిక బరువు లేని వారికి ఒక శుభవార్త. గోధుమ కొవ్వులను యాక్టివేట్ చేయడం ద్వారా భవిష్యత్తులో స్థూలకాయం రాకుండా సులభంగా రక్షణ కల్పించవచ్చు.

ఉత్సాహంగా కొవ్వులను కరిగించే మార్గాలు

థర్మోస్టాట్ డౌన్ క్రాంక్

మీరు ఎప్పుడయినా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనపు కిటికీలను తెర్చినపుడు వాహనంలోని వాతావరణం చల్లబడటాన్ని గమనిస్తారు. అలాగే మీరు నివసిస్తున్న స్థలం కొన్ని డిగ్రీలకు చల్లగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనది. చాలా ఎక్కువ అధ్యయనాలు చల్లని వాతావరణం గోధుమ కొవ్వు పనితీరుని ఉత్తేజపరచడంలో ఎంతో ప్రభావవంతం అని చూపిస్తున్నాయి. అటువంటి వాతావరణం కేలరీలను కరిగించడంలో కూడా సహాయం చేస్తున్నట్టు వెల్లడిస్తున్నాయి. కానీ ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మనం సహజ వాతావరణం నుండి చల్లదనాన్ని పొందడం కష్టతరంగా మారింది. వేడిగా ఉన్న నివాస వాతావరణం కేలరీలను కరిగించే శక్తిని కోల్పోతూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఆపిల్ వైపుకు దృష్టి సారించండి

ఆపిల్ యొక్క చర్మం ఉర్సోలిక్ అనే ఆమ్లం ని కలిగి ఉంటుంది. ఇది ఎలుకలలో అలాగే అస్థిపంజర నిర్మాణం రెండింటిలోనూ గోధుమ కొవ్వులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు రుజువయింది. ఆ ఎలుకలు చాలా ఎక్కువ కొవ్వులను కలిగిన ఆహారం తీసుకుంటున్నప్పటికీ కేలరీలను కరిగించే సామర్ధ్యం పెరుగుతున్నట్లు గుర్తించారు. అవి తక్కువ బరువుతో పాటుగా స్థిరమైన రక్తపోటుని కలిగి ఉన్నాయి. కొవ్వు కాలేయ వ్యాధులు కూడా వాటిలో అభివృద్ధి చెందడం చాలా అరుదుగా ఉన్నట్లు గమనించారు.

మీరు రోజుకి ఒకటి లేదా రెండు ఆపిళ్లను తీసుకున్నట్లయితే శరీరాన్ని స్లిమ్ గా ఉంచడానికి కావాల్సిన ఉర్సోలిక్ ఆమ్లము సరిపడే మొత్తంలో లభిస్తుంది. మీరు రోజ్మేరీ, థైమ్, లావెండర్, తులసి మరియు క్రాన్బెర్రీస్ తినవచ్చు.

మరిన్ని మిరియాలు తినండి

ఘాటైన మిరియాలు తినడం ద్వారా శరీర జీవక్రియ పెరగడానికి మరియు కొవ్వులు సులభంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు చిలీ మిరియాలు తీసుకున్నట్లయితే అవి కలిగిన కేప్సినాయిడ్లు గోధుమ కొవ్వులను అభివృద్ధి చేయడానికి అనుసంధానించబడి ఉంటాయి. కేప్సినాయిడ్లను కలిగిన ఘాటైన మిరియాలు మీ నాడీ వ్యవస్థకు సంకేతాలు అందించి గోధుమ కొవ్వుల ఉత్పత్తిని ఉత్తేజపరిచే గ్రాహకలుగా పనిచేస్తాయి.

ఒక వైద్య పరమైన పరిశోధనలో 10 మంది పురుషులకు 9 మిల్లీ గ్రాముల కేప్సినాయిడ్లను మరియు మరికొందరికి ప్రభావం లేని ఇతర ఔషదాన్ని ఇచ్చారు. ఫలితంగా చిలీ మిరియాల గుళికలను తీసుకున్న వ్యక్తులు చల్లదనానికి మరింత స్పందించారు. ప్రభావం లేని ఇతర ఔషదాన్ని తీసుకున్న వారికంటే కూడా వారు రోజుకు 150 కేలరీలను కరిగించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారు.

Posted on

Telugu tips to remove facial hair – ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించే చిట్కాలు

ముఖం మీద అవాంచిత రోమాలను ఎవరూ ఇష్టపడరు. మహిళలు తమ ఇతర శరీర భాగాలలో అవాంచిత రోమాలకు  వాక్సింగ్ మరియు హెయిర్ రిమూవర్ లను ఉపయోగిస్తుంటారు. మహిళలు ముఖ సంబందిత హెయిర్ రిమూవర్ లను ఒక్కసారి ఉపయోగించినట్లయితే అది జీవితకాలం పాటు కొనసాగించాల్సి వస్తుంది.అవాంచిత రోమాలు ఎంతో చిరాకు కలిగిస్తాయి. దీనినుండి ఉపశమనం పొందాలని ప్రజలు నిరంతరం కోరుకుంటూ ఉంటారు.

అవాంచిత రోమాల నివారణకు కొంతమంది వాక్సింగ్ ను మరికొందరు హెయిర్ రిమూవర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించడానికి సులభమైన మరియు త్వరితమైన మార్గాలను గురించి తెలుసుకుందాం.

అవాంచిత ముఖ రోమాలు మహిళలకు సంభందించిన ఒక సమస్య. ఇది మహిళలు వారి యొక్క రూపానికి గానూ సిగ్గు పడుతూ ఉండేలా చేస్తుంది. కొంతమంది నల్లని గజిబిజి రోమాలు ముఖం మీద పెరగడం జరుగుతూ ఉండగా మరికొందరికి స్వల్పంగా గుర్తించగలిగే రోమాలు పెరుగుతూ ఉంటాయి. ఈ ముఖభాగ రోమాలు వంశపారంపర్యంగా గానీ, ఒత్తిడి వలన గానీ, హార్మోనుల మార్పులు వలన గానీ కలగవచ్చు.  మొటిమలు లేదా అధిక బరువు వంటి హార్మోనుల లోపాలు కూడా ముఖభాగ అవాంచిత రోమాలు పెరుగుదలకు కారణం కావచ్చు.

మీరు ముందుగా వాక్సింగ్, షేవింగ్, మరియు ఇతత చికిత్సలు తీసుకోవడం వలన క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉండే  అవాంచిత రోమాల సమస్య ఒక దీర్ఘ కాలిక సమస్యగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనలేనప్పటికీ  మీకు చాలా రకాలుగా సహాయం చేసే కొన్ని సులభమైన గృహ చిట్కాలను ఇక్కడ మీకు అందించడం జరిగింది.

ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించడానికి గృహ చిట్కాలు

ముఖ రోమాలు తొలగించడానికి పసుపు

భారతీయ కుటుంబములలో పసుపు ఎన్నో అందమైన వాస్తవాలతో మీ ముందుకు వస్తుంది. పసుపు తరుచుగా మీ ముఖానికి రాసుకోవడం వలన మీ ముఖ కాంతి పెరుగుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మానికి మంచి కాంతిని అందించి ఇబ్బందికరంగా ఉన్న రోమాలను తొలగిస్తాయి. పసుపు వెంట్రుకల పెరుగుదలను నివారించే లక్షణాలను కలిగి ఉన్నట్లు పేరుగాంచింది.

అవాంచిత రోమాలకు శనగ పిండి

ఇది గొప్ప ఫేస్ మాస్కుగా భారతీయ కుటుంబాలలో సంప్రదాయకంగా ఉపయోగించబడుతోంది. దీనిలోని ధర్మాలు చర్మం యొక్క కాంతి హీనతని తొలగించడంలో అత్యధిక లాభాలను కలిగి ఉన్నాయి.  శనగ పిండి, పసుపు మరియు పెరుగుల మిశ్రమము ఇతర ముఖ సౌందర్య చికిత్సల అన్నింటికంటే ప్రభావవంతంగా ఉంటుంది.  సహజ నివారణలు దుష్ప్రభాలను కలిగి ఉండవు అని మనకి తెలిసినట్లుగా ఈ మిశ్రమం చిన్నగా పెరుగుతున్న అవాంచిత రోమలను తొలగించే చికిత్సకారిణిగా నిలిచిపోయింది.

ముఖ రోమాల నివారణకు పంచదార మిశ్రమం

మీరు ఇంటిలో తయారు చేసుకునే ఈ  వాక్స్ వంటి పదార్ధము, వాక్స్ క్వాలిటీలను కలిగి స్వల్ప  నొప్పి లేదా ఎటువంటి నొప్పి లేకుండా  మంచి ఫలితాలను అందించగలదు. అయితే ఈ పద్దతి అధికంగా ప్రభావవంతమైనది అయినప్పటికీ స్వల్ప పరిమాణంలో నొప్పిని కలిగించ వచ్చు.  ప్రతిక్షేపము అయిన తేనె  మరియు నిమ్మల మిశ్రమము ముఖం మీద చిన్న పాటి చికాకుతో ఒక బ్లీచ్ లాగా పని చేస్తుంది. నిమ్మరసం, తేనె, పంచదార లను తీసుకుని మధ్యస్థ వేడి వద్ద వాటిని వేడి చేయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని అవాంఛిత ముఖ రోమాల వద్ద అప్లై చేయండి. ఆ మిశ్రమాన్ని తొలగించేటప్పుడు అక్కడ కనిపించే రోమాలను అది తొలగిస్తుంది.   వాక్సింగ్ ఇక్కడ అమలు చేయబడుతున్నందువలన ఇది   ఒక వొలిచిన క్రమంలో తొలగించబడుతుంది.

ముఖం పై అవాంఛిత రోమాల తొలగింపునకు కోడి గుడ్డుతో మాస్కు

గుడ్డులోని తెల్ల సొనని తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు ఒక అర టేబుల్ స్పూన్ జొన్న పిండిని కలపండి. పేస్టు ఏర్పడే వరకు బాగా కలపండి. తర్వాత ముఖ రోమాలు కలిగిన చోట దానిని అప్లై చేయండి. దానిని మాస్క్ వలె  ఏర్పడే వరకు ఆరనివ్వండి. అప్పుడు అది ముఖంపై అవాంఛిత రోమాలను సులభంగా తెంచి తొలగించగలుగుతుంది. ఈ గుడ్డు మాస్కు యొక్క  నివారణ సాధారణంగా గృహంలో అధికంగా ఉపయోగించే పధార్ధాలతో మంచి ఫలితాలను అందిస్తుంది.

మీ ఆహారంలో ఫైటోఈస్ట్రోజెన్స్  ఉండేలా చూసుకోండి

ఒక సంపూర్ణమైన ఆహారం  ముఖముపై అవాంచిత రోమాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖరోమాల సమస్య సాధారణంగా హార్మోనుల అసమతుల్యం వలన మరియు ఆహారపు అలవాట్లు పరిగణలోకి తీసుకోకపోవడం వలన తీవ్రతరం అవుతుంది.  పరిశోధకులు పేషేంట్లలో హార్మోనుల అసమతుల్యతలతో  ఫైటోఈస్ట్రోజెన్స్ యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధిక ఫైటోఈస్ట్రోజెన్స్ కలిగిన ఆహారం తీసుకుంటున్న వారిలో అవాంఛిత రోమాలు తక్కువగా పెరగడం గమనించారు.     అవిసె గింజలు, సోంపు, అల్ఫాల్ఫా (రాజిక) మరియు గొంటు కల (ఉత్తర భారత దేశంలో  బ్రహ్మి) మొదలైనవి ఫైటోఈస్ట్రోజెన్స్ అధికంగా కలిగి ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఆశించదగ్గ మార్పులను పొందవచ్చు.

వాక్సింగ్ లేదా థ్రెడింగ్ లేకుండా ముఖంపై అవాంచిత రోమాలను తొలగించుటకు గృహ చిట్కాలు

ముఖముపై  రోమాలు తొలగించడం ఒక నొప్పికరమైన ప్రక్రియ. ఎందుకంటే శరీరంలో ఇతర భాగాల చర్మం కంటే ముఖ భాగ  చర్మం మరింత సున్నితమైనది.  వాక్సింగ్, థ్రెడింగ్, ట్వీ-జింగ్, ఎలెక్ట్రోలైసిస్, లేజర్, ఎపిలేటర్స్ మరియు హెయిర్ రిమూవల్ క్రీమ్లు అవాంఛిత రోమాలు తొలగించే కొన్ని పద్ధతులు. అయితే ఇటీవలి సంవత్సరాలలో అనేక గృహ నివారణలు ఈ సమస్య చికిత్స విషయంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొనబడ్డాయి.

ఓట్స్ పిండితో ముఖ రోమాలు తొలగించడం

ఓట్స్ పిండి దాని నిర్మాణ రీత్యా గట్టి దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది అవాంఛిత రోమాలను తొలగించి చర్మాన్ని మృదువుగా హైడ్రేట్ గా  ఉంచడానికి సహకరిస్తుంది.ఓట్స్ పిండి, తేనె మరియు నిమ్మరసంల కలియికల మిశ్రమాన్ని పేస్టు లాగా చేసుకుని ముఖానికి అప్లై చేయండి. 15 నిముషాలపాటు వదిలేసి వెంట్రుకలను తొలగించే దిశలో మృదువుగా రుద్దండి. తర్వాత వేడి నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోండి.

ముఖం మీద రోమాలకు మంచి ఉపాయం మెంతులు

అవాంచిత రోమాలు వంటి మహిళా సమస్యలకు చక్కనైన పరిష్కారం అందించే సహజ వైద్య మూలిక మెంతులు. మునుపటి రోజు రాత్రి నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతీ రోజు తీసుకోవాలి. దీనిని ముఖానికి వేసుకునే మాస్కు లాగా కూడా ఉపయోగించవచ్చు.  సమాన భాగాలుగా మెంతుల పొడి మరియు  పెసర పొడి తీసుకుని నీళ్ళతో కలిపి పేస్టు లాగా తాయారు చేసుకోండి. దీనిని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. ఆరిపోయాక మెత్తని పొడి గుడ్డతో మృదువుగా రుద్ది పేస్టుని తీసివేయండి.

బార్లీ స్క్రబ్

బార్లీ స్క్రబ్  అనేది ముఖం మీద అవాంఛిత రోమాలను తొలగించడంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది.ఇది ముఖముపై రోమాలను తొలగించడంతో  పాటుగా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది.   బార్లీ గుండ, పాలు మరియు నిమ్మరసం కలిపి పేస్టు లాగా తయారు చేసుకుని ముఖానికి పట్టించండి. 30 నిముషాల పాటు వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.

ముఖం మీద రోమాలను  తొలగించడానికి గోధుమ ఊక స్క్రబ్

గోధుమ ఊక అనేది గోధుమల శుద్ధి ప్రక్రియ తరువాత మిగిలు పదార్ధము. ఇది సాధారణంగా జంతువుల మేతకు ఉపయోగించే గోధుమల బాహ్యపు పొర. దీనిని వివిధ మాస్కులకు మరియు స్క్రబ్ లకు కూడా ఉపయోగపడుతుంది. పేస్టు తయారు చేయడానికి గోధుమ ఊకని పాలు మరియు రోజ్ వాటర్ లతో కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఎండిపోయేవరకు వృత్తాకారంలో స్క్రబ్ చేయండి. చల్లని నీళ్లతో కడిగేసుకోండి.

ముఖంపై అవాంఛిత రోమాల తొలగింపుకు నేరేడు మరియు తేనెల స్క్రబ్

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రధానంగా నేరేడు మరియు ద్వితీయంగా తేనెలను ఉపయోగించి స్క్రబ్ తయారు చేసుకోండి. దీనిని ముఖానికి రాసుకుని వృత్తాకారంలో 20 నిముషాలపాటు మృదువుగా రుద్దండి. అప్పుడు నీళ్లతో కడిగేసుకోండి.

నారింజ-నిమ్మ తొక్కల మాస్కు

శుభ్రపరచడం, బ్లీచింగ్ మరియు చర్మాన్ని పొరలుగా వలచడానికి కొన్ని సహజ పదార్ధాల కలయిక అవాంఛిత రోమాలను తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మాస్కును తయారు చేయడానికి కొన్ని ఎండిన నారింజ తొక్కలు, నిమ్మ తొక్కలు, ఓట్స్ పిండి,బాదం, ఆలివ్ నూనె మరియు రోజ్ వాటర్ లను తీసుకుని పేస్టులాగా కలుపుకోండి. దీనిని ముఖానికి పట్టించి 5 నిముషాలపాటు వదిలేయండి.అప్పుడు మృదువుగా వృత్తాకారంలో 10 నిముషాలపాటు రుద్దండి. నీళ్లతో కడిగేసుకోండి.

Posted on

Telugu tips for black spots on face – ముఖంపై నల్లని మచ్చలు పోవాలంటే?

మీరు సహజ మార్గంలో నల్లని మచ్చలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? తెల్లని ఛాయ కలిగిన స్త్రీల అందమైన మొహంలో నల్ల మచ్చలు చాలా స్పష్టంగా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే ముఖం మీద కనిపించే ఈ నల్లని మచ్చలు మీద ప్రభావంతంగా పనిచేసే ఎన్నో రకాల కాస్మొటిక్ ఉత్పత్తులు సులభంగా నేడు లభిస్తున్నాయి. కానీ చాలామంది మార్కెట్ లో లభించే ఈ క్రీములని అధిక మొత్తంలో ఉపయోంచడం వలన చర్మ సమస్యలు ఏర్పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు కొన్ని గృహ నివారణలు పాటించడం వలన ఎంతో సులభంగా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చికిత్స చేయవచ్చు. చర్మపు పొరల మీదగా నల్ల మచ్చల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది చర్మములో అదనపు మెలానిన్ స్రావాలను కలిగి ఉండటం వలన, మరి కొందరు సూర్య రశ్మిలో ఎక్కువసేపు గడపడం వలన చర్మం ప్రభావితం కాబడినప్పుడు ఇదే సమస్యని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి గొప్ప సహజమైన చిట్కాలను అందిస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలు అలాగే కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్న ప్రజలు కూడా చర్మం మీదగా నల్లని మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు.

ముఖం మీద నల్లని మచ్చల చికిత్సకు అద్భుతమైన గృహ చిట్కాలు

నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.

వేప ఫేస్ ప్యాక్

పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

కలబంద మరియు మజ్జిగ ఫేస్ ప్యాక్

కలబంద అద్భుతమైన శోథ నిరోధక మరియు క్రిమినాశక మూలికగా పేరుగాంచింది. మజ్జిక చర్మానికి సంభందించిన ఎన్నో లాభాలను తీసుకువస్తుంది. దీనికి మీకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ , కొన్ని చుక్కల రోజ్ వాటర్, మరియు కలబంద గుజ్జులను కలిపి ఒక చూర్ణంగా తయారు చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని దానిని పూర్తిగా రానివ్వండి. తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోండి.

వేప మరియు పసుపుల ఫేస్ ప్యాక్

పసుపు పొడి మరియు వేప ల మిశ్రమంతో ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటి సమస్యలకు మరొక అందమైన నివారిణి అని చెప్పవచ్చు. చేతి నిండా సరిపడే వేప ఆకులను గ్రైండ్ చేసిన తర్వాత దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ లేదా బదులుగా కలబంద గుజ్జుని మరియు ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలిపి ఆ ప్యాక్ ని మీ ముఖానికి రాసుకోండి.పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోండి. ఈ చిట్కాని వారంలో 2/3 సార్లు అప్లై చేయండి.

కీర దోసకాయ మరియు రోజ్ వాటర్ ప్యాక్

కొన్ని దోస ముక్కలని గ్రైండ్ చేయండి మరియు చూర్ణం కోసం దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని కలపండి. ఆ చూర్ణాన్ని ముఖమంతా రాసుకోండి. దానిని బాగా ఆరనివ్వండి. బాగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి. మీరు ప్రతీ రోజు ఈ చిట్కాని అనుసరించినట్లయితే మీ ముఖంలో కనిపించే చూడముచ్చట మార్పులకు ఎంతగానో సంతోషపడతారు.

మొటిమల మచ్చలకు బొప్పాయి చికిత్స

తొక్క తీసిన బొప్పాయిని తీసుకోండి. దానిని ముక్కలుగా కోయండి. అప్పుడు బొప్పాయిని ఒక చూర్ణం లాగ చేయండి. ఆ చూర్ణాన్ని మీ ముఖానికి రాసుకుని 10-15 నిముషాలపాటు ఆరనివ్వండి. తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. బొప్పాయి పాపెయిన్ అనే ఎంజైమ్ ను కలిగి ఉంటుంది. ఇది ముఖం మీద నల్లని మచ్చలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ రసం

నిమ్మరసం తీసుకుని నల్లని మచ్చల మీద అప్లై చేయండి. నిమ్మరసం లో ఉండే విటమిన్ సి నల్లని మచ్చలను రంగు మార్చి చర్మం మీద మలినాలను తొలగిస్తుంది. ఒక కాటన్ బంతిని నిమ్మరసంలో ముంచి దానిని నల్ల మచ్చలు కలిగిన ప్రదేశంలో మృదువుగా రుద్దండి. ఒకవేళ మీరు సున్నితమైన చర్మ స్వభావులు అయితే నిమ్మరసానికి కొన్ని నీళ్లు జోడించి ఫలితాలను పొందేవరకు ఉపయోగించండి.

నల్లని మచ్చల నుండి ఉపశమనానికి గంధపు ఫేస్ ప్యాక్

ఒక గంధపు చెక్కను తీసుకుని దాన్ని చూర్ణంగాచేసి మీ ముఖానికి రాయండి. గంధం కూడా ముఖం మీద నల్లని మచ్చలను మరియు మొటిమలను నివారించే లక్షణాలను కలిగి ఉంది.

మొటిమలు మరియు మచ్చలకు కలబంద

కలబంద గుజ్జు నల్లని మచ్చలను తగ్గించే అతి ముఖ్యమైన వాటిలో కలబంద గుజ్జు ప్రధానమైనది. కలబంద గుజ్జుని తీసుకుని నల్ల మచ్చల మీద పూయండి. 20 నిముషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోండి.

విటమిన్ ఇ

నల్లని మచ్చలు మరియు మొటిమల మచ్చలు విటమిన్ల లోపం వలన ఏర్పడతాయి. ప్రధాన ప్రత్యక్ష నివారణగా విటమిన్ ఇ మాత్రలను తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ వంటి విటమిన్ ఇ ఆయిల్స్ మొదలైన వాటిని అప్లై చేయండి. అలాగే మీ ఆహారంలో విటమిన్ ఇ ఉండేలా చూసుకోండి.

నల్లని మచ్చల చికిత్సకు పాలు

ఒక కప్పులో పాలను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుంది అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ప్రతీ రోజు ప్రతీ రోజు 5 నిముషాలపాటు అనుకున్న ఫలితాన్ని పొందేవరకు ఇలా చేయండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖ భాగంలో చర్మ పొరల్ని శుభ్రం చేసి నల్లని మచ్చలేని మీరు చర్మపు రంగులోకి మారుస్తుంది.

ముఖంపై నల్ల మచ్చలు కొరకు బంగాళాదుంపలు

మీరు సహజ మార్గంలో నల్ల మచ్చలు తొలగించుకోవాలని ఆశిస్తున్నట్లయితే అప్పుడు ఒక బంగాళా దుంపని తీసుకుని చక్రాల వలె కోయండి. ఆ చక్రాలను రిఫ్రిజిరేటర్ లో 2-3 గంటల పాటు ఉంచండి. తర్వాత ఈ చక్రాలను తీసుకుని నల్ల మచ్చలమీద రుద్దండి. 5 నిముషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. మరొక మార్గంలో బంగాళా దుంపని చూర్ణం లా చేసి దానికి తేనె కలిపి ఈ చూర్ణాన్ని ఫేస్ మాస్కులాగా అప్లై చేసుకోండి.

ముఖం మీద నల్ల మచ్చల చికిత్సకు ఆముదం

ఒక కప్పులో తాజా ఆముదం నూనెను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ఆముదంలో ఉండే ఆమ్లజనక, శోథ నిరోధక లక్షణాలు ముఖ భాగంలో నల్ల మచ్చల్ని తొలగిస్తాయి.

ముఖంలో నల్లని చర్మ భాగాల కొరకు ఉల్లి రసం

మీరు నల్లని మచ్చల నుండి ఉపశమనం పొందాలని చూస్తున్నారా? అయితే ఉల్లిపాయల్ని తీసుకుని బాగా గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక కాటన్ గుడ్డలో వేసి ఒక కప్పులోకి దాని రసాన్ని పిండండి. ఇప్పుడు ఒక కాటన్ బాల్ ను ఆ రసంలో ముంచి నేరుగా నల్లని మచ్చల మీద రాయండి. 5 నిముషాలపాటు వదిలేసి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

పైన పేర్కొన్న నివారణోపాయాలు మీరు సహజ పద్దతిలో గృహ చిట్కాలుగా మీ ముఖం మీద నల్లని మచ్చల నివారణకు సహాయపడతాయి. ఒకవేళ మీరు 100% సంపూర్ణ ఫలితాలు పొందలేనట్లయితే 100% ఫలితాలను పొందేందుకు దగ్గరలోని డెర్మటాలజిస్ట్ ను సంప్రదించగలరు.

Posted on

Breast enhancement tips in Telugu – వక్షోజాల పరిమాణం పెరగాలంటే..

మీ స్నేహితుల నడుమ మీ రొమ్ముల పరిమాణం చిన్నదిగా ఉన్నందుకు దిగులు పడుతున్నారా? మీరు మీ శరీర ఆకృతిలో స్త్రీత్వం లోపంచినట్లుగా భావించి కాస్మోటిక్ రొమ్ము విస్తరణ ప్రక్రియలను ఎంచుకోవలసి వస్తుందని భయపడుతూ ఉన్నారా? పైన పేర్కొన్న ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే ఆహారం మరియు వ్యాయామాలతో సులభంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మార్గాలకోసం మీరు ఈ శీర్షికని చదవండి.

సంపూర్ణమైన రొమ్ములు మీ పూర్తి రూపానికి నిండుతనంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి. చిన్న రొమ్ములు కలిగిన స్త్రీలు తమ మీద తమకి విశ్వాస లోపంతో వారి వారి నైపుణ్య రంగాలలో వెనుకబడుతూ ఉంటారు.

మీరు ధృడంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవాలని కాంక్షిస్తున్నవారు అయితే రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మాత్రలు వంటివి ఖచ్చితంగా మీకు దుష్పభావాలని కలిగించే అవకాశం ఉంది. అంతే కాకుండా నేడు ఎన్నో రకాల రొమ్ము విస్తరణ క్రీములు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటితో రొమ్ములను మసాజ్ చేయడం వలన రొమ్ములు సంపూర్ణంగా విస్తరించి బిగుతుగా ఉండవచ్చు. కానీ అటువంటి ఉత్పత్తులలో వాస్తవంగా మీకు పని చేసేది ఎదో చెప్పడం కష్టం. సహజ పద్దతిలో రొమ్ముల పరిమాణం పెంచుకునే మార్గం ఉత్తమమైనదని చెప్పవచ్చు. సరైన వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వలన మరింత పుష్కలమైన రూపాన్ని పొందవచ్చు. అయితే దీని ప్రభావం వ్యక్తికీ వ్యక్తికీ మద్య వేరుగా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజ పద్దతిలో ఎటువంటి దుష్పభావాలు లేకుండా మీ జీవన విధానాలలో చిన్న చిన్న ఆరోగ్య కరమైన మార్పులతో సులభంగా మీరు కోరుకున్న ఫలితాలను పొందగలగ వచ్చు. కాబట్టి అమ్మాయిలూ, పూర్తిగా చదివి మీరు కోరుకున్న ఫలితాలని త్వరలోనే పొందుతారని ఆశిస్తున్నాం.

సహజమైన రొమ్ము విస్తరణ కోసం ఆహారాలు

సంపూర్ణ వక్షోజాల కోసం ఆహారం

ప్రధాన కారణంగా స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను లోపించడం వలన తరుచుగా రొమ్ములలో పెరుగుదల లోపిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ హార్మోను, అది స్త్రీలలో ఋతు క్రమాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు చిన్న రొమ్ములను కలిగి ఉన్నట్లయితే మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు. దీనికోసం మీరు ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపించే కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా అవి సహజంగా మీ శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా మీ రొమ్ములు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఇక్కడ సంపూర్ణ రొమ్ములను ప్రోత్సహించే కొన్ని ఆహార పదార్ధాల జాబితా ఇవ్వబడింది.

పాల ఉత్పత్తులు

మీరు మీ రొమ్ముల పరిమాణం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీ రోజూ వారి ఆహారంలో మరిన్ని పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవడం వలన ఎంతో మెరుగైన ఫలితాలని పొందుతారు.

సోయా ఉత్పత్తులు

అమ్మాయిలు తమ రొమ్ములను పెంచుకోవడానికి మంచి ఆహార పదార్ధాల కోసం చూస్తున్నట్లయితే సోయా ఉత్పత్తుల మీద సులభంగా ఆధారపడవచ్చు. సోయా ఉత్పత్తులు అధిక మొత్తంలో ప్రోటీన్లను కలిగి ఉండటమే కాకుండా అందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని సాధారణ హార్మోనుల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి.

పెద్ద రొమ్ముల కోసం సముద్రపు ఆహారాలు

సముద్రపు ఆహారాలలో ఉండే అధికమైన పోషకాలు మీ స్తనాల పరిమాణం మరింత పెంచడంలో సహాయపడతాయి. రొయ్యలు, సముద్రపు చేపలు, సముద్ర కలుపు మొక్కలు, ఆలుచిప్పలు మొదలైనవన్నీ అధిక కేలరీల ప్రోటీన్లను సమృద్దిగా కలిగి ఉండి సహజమైన గొప్ప మాంగనీసు వనురులగా ఉంటున్నాయి. మాంగనీసు శరీరంలో హార్మోనులను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించే ఒక ముఖ్య ఖనిజము. మీ ఆహారంలో మరిన్ని సముద్రపు ఆహారపదార్ధాలు జతచేస్తే అది స్త్రీ లలో రొమ్ముల పెరుగుదలకు కీలకమైన మరింత ఈస్ట్రోజెన్ హార్మోను ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది.

ఆకు కూరలు

ఆకుకూరలు మీ శరీరానికి ఎంతో ఆరోగ్య వంతమైనవి. పాలకూర, ఆల్ఫల్పా వంటివి అనామ్లజనకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు శరీరంలో సాధారణ హార్మోన్ల సంతులనాన్ని ప్రోత్సహిస్తాయి. అందువలన మరిన్ని ఆకు కూరలను మీ ఆహారంలో భాగం చేయడం వలన క్రమంగా మీ పూర్తి ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. తద్వారా మీ రొమ్ములు కూడా పుష్టిగా ఉంటాయి.

భారీ వక్షోజాల కోసం విత్తనాలు

అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోంపు గింజలు మరియు గుమ్మడికాయ విత్తనాలు మొదలైన అన్నిరకాల విత్తనాలు రొమ్ము కణాల పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. గింజలు శరీరంలోని ఈస్ట్రోజెన్ యొక్క సహజమైన ఉత్పత్తిని పెంచే ఫైటోఈస్ట్రోజెన్ ను కలిగి ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో వివిధ రకాలైన విత్తనాలను చేర్చడం వలన మీరు భారీ స్తనాలను పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందుతారు.

పెద్ద స్తన పరిమాణం కొరకు మెంతులు

మెంతులులలో ఉన్న అధిక ఫైటోఈస్ట్రోజెన్ మూలకాలు శరీరంలో లోపించిన ఈస్ట్రోజెన్ హార్మోనును నింపడానికి సహాయం చేస్తాయి. మెంతులు రొమ్ములలోని క్షీర గ్రంధులను అభివృద్ధి చేయడంలో అత్యధికంగా సహాయపడతాయి.

సహజమైన రొమ్ము విస్తరణ కొరకు గింజలు

బాదం, జీడి పప్పు, పిస్తా మరియు అక్రోటులు మీ రొమ్ము కణాలను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు ప్రోటీన్లను అందించడంలో గొప్ప వనరులుగా చెప్పవచ్చు. అవి మీ రొమ్ము పరిమాణాన్ని సహజంగా పెంచడంలో సహకరిస్తాయి.

పెద్ద రొమ్ములు పొందడానికి పండ్లు

స్ట్రా బెర్రీ, పుచ్చకాయ, మేడి పండ్లు మొదలైన పండ్లు ఫైటోఈస్ట్రోజెన్ లతో పూరించబడి ఉంటాయి. అవి రొమ్ము కణాల అభివృద్దికి మీకు సహకరిస్తాయి. ఆపిళ్ళు, చెర్రీ పండ్లు మరియు రేగి పండ్లలో ఉండే ఈస్ట్రోజెన్ సహజంగా మీ రొమ్ము పరిమాణాన్ని విస్తరింపజేయడానికి ప్రోత్సహిస్తాయి. అందువల్ల మరిన్ని ఎక్కువ పండ్లను తీసుకోవడం ద్వార క్రమంగా మీరు కోరుకున్న లక్ష్యానికి చేరగలుగుతారు.

వక్షోజాల సహజ పెరుగుదలకు వ్యాయామాలు

పైన పేర్కొన్న ఆహారాలతో పాటుగా కొన్ని నిర్దిష్ట వ్యాయామాలను మిళితం చేసినపుడు ఫలితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి. అటువంటి కొన్ని అద్భుతమైన వ్యాయామాలను సులభంగా మీ స్తన సంపదను అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఇక్కడ అందించడం జరిగింది. ఈ వ్యాయామాలు మీ ఛాతి కండరాలతో పాటు ప్రస్తుతం మీ రొమ్ములలో ఉన్న కొవ్వు కణజాలాలను దృడంగా నిర్మించి రొమ్ములను పుష్టిగా మరియు నిండుగా కనిపించేలా చేస్తాయి.

పుష్ అప్స్

Push ups

ఏ ఉపకరణాల సహాయం లేకుండా మీరు మీ ఇంటిలోనే చేయగల సాధారణ, సాంప్రదాయ పుష్ అప్లు మీ వక్షోజాల యొక్క పరిమాణం మరియు ఆకారానికి అద్భుతాలు జోడించగలవని మీకు తెలియకపోవచ్చు. మీ అర చేతులను భుజములకు సమంగా నేలకు ఆన్చండి. మీ బరువుని మీ చేతులు మరియు కాలి వేళ్ళ మీదగా కింది చిత్రంలో వలె ఉంచండి. ఇప్పుడు మీ మోచేతులని వంచుతూ మీ శరీరాన్ని నేల వైపుకు వంచండి. నేలను తాకకుండా వీలైనంత దగ్గరకు వెళ్ళండి. తర్వాత మళ్ళీ చేతులను నిటారుగా వచ్చేలాగ పైకి లేవండి. మీరు 3 సెట్ లతో ప్రారంభించి తర్వాత మీరు వెళ్ళగలిగే వరకు పెంచండి.

పైకెత్తబడిన పుష్ అప్స్

Elevated push ups

ఛాతి కండరాలకు ఒత్తిడి కలిగించడం ద్వార త్వరితంగా పెద్ద స్తనాలను మీరు పొందగలుగుతారు. ఈ వ్యాయామానికి మీరు తక్కువ ఎత్తుగల టేబుల్ లేదా ఒక కుర్చీ సహాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీ అర చేతులని మీ భుజాలకు సమానంగా నేలకు ఆన్చండి. తరువాత మీ పాదాలను ఎత్తుకొరకు అమర్చిన కుర్చీ లేదా టేబుల్ మీదకు సమతలంగా ఉంచండి. ఇప్పుడు మీ ఎగువ శరీరాన్ని మీ మోచేతులని వంచడం ద్వార నేల వైపుకు వాలండి. కొన్ని నిముషాలపాటు ఆ సస్థితిలో నిలిచి ఉండి మరల ప్రారంభ స్థితికి రండి. ఇలా 3 సెట్స్ తో వ్యాయామాన్ని ప్రారంబించండి.

గోడకు పుష్ అప్స్

Wall push ups

గోడకు పుష్ అప్స్ చేయడం ప్రారంభీకులకి చాల సులభమైన వ్యాయామం. ఇది మీరు శారీరకంగా ధృడంగా లేకపోయినప్పటికీ సులభంగా చేయగలిగే వ్యాయామం. దీనికోసం గోడకు ఎదురుగా అర చేతుల దూరంలో నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ అర చేతులను భుజాలకి సమానంగా గోడపై ఆన్చండి. తర్వాత మీ మోచేతులను వంచుతూ మీ పాదాలు స్థిరంగా ఉంచి మీ శరీర బరువు మీ చేతుల మీద ఉండేలా గోడవైపుకి వాలండి.కొన్ని నిముషాలపాటు ఆ స్థితిలో నిలిచి ఉండి ప్రారంభ స్థితికి వచ్చేయండి. ఇలా 5 సెట్స్ తో ప్రారంభించండి

Posted on

Pregnancy symptoms in telugu – గర్భధారణ ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు

మీరు మీ పీరియడ్ ను మిస్ అయ్యారా? మీకు అలసట వంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? దీని అర్థం మీరు గర్భవతి కావచ్చనా? పీరియడ్ తప్పినప్పుడు గర్భ పరీక్షలు మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా మీరు గర్భవతి అవునో, కాదో నిర్ధారిస్తారు. ఏదేమైనప్పటికీ, సంకేతములు మరియు లక్షణాలు ఒక వారములోనే గుర్తించబడతాయి. మీరు నిజంగా గర్భవతి కావచ్చు అనే జీవనసంబంధమైన సూచన వస్తుంది. ఒక స్త్రీ తాను గర్భం దాల్చినప్పుడు కలిగే 10 ప్రధాన లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి మీకు ప్రాధమికంగా సహాయపడతాయి మరియు మార్గదర్శకంగా పనిచేస్తాయి.

పీరియడ్ మిస్ అవ్వడం

గర్భం గుర్తించడానికి ఇది అత్యంత స్పష్టమైన మరియు అనుభవమైన మార్గం. మీరు ఇదివరకు క్రమం తప్పని రుతుక్రమాలను కలిగి ఉన్నవాళ్లు అయితే ఎప్పుడూ సంభవించని జాప్యం మీ ఋతు క్రమంలో ఏర్పడిందా? అయితే అది మీరు గర్భ పరీక్ష చేయడానికి ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా మీకు వేరొక రకంగా వికారం, అలసట మరియు తరచూ బాత్ రూమ్ కి వెళ్ళడం వంటి సూచనలు కనిపిస్తూ కూడా ఉండవచ్చు.

అలసట

ఇది గర్భం యొక్క సాధారణ లక్షణం. దీనికి కారణం ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క స్థాయి పెరిగడం. ఈ హార్మోన్ మంచి మోతాదులో ఉండటం వలన మిమ్మల్ని నిద్రలో ఉంచుతుంది.

ముందు జాగ్రత్త – మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి కొన్ని వారాలు మీరు మంచి నిద్ర మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు అనుగుణంగా బెడ్ రూమ్ ను చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు అండోత్సర్గము తరువాత నుండి రెండు వారాల పాటు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.

రొమ్ములు మృదువుగా మారి ఉబ్బటం

హార్మోన్ల మార్పులు కారణంగా మీరు కొన్ని వారాల లోపల రొమ్ములు మృదువుగా మరియు ఉబికినట్లు ఉండటం గమనించవచ్చు. ఈ హార్మోన్లు మీ రొమ్ములు పెరగడానికి కారణమవుతాయి మరియు స్తనములు తిమ్మిరిగా ఉండి భారీగా అనిపిస్తాయి. చనుమొనలో మార్పులు సంభవించి స్తన పరివేషంలో రంగు మరియు పరిమాణంలో మార్పులు గమనించవచ్చు.

ముందు జాగ్రత్త – ఉబికిన మృదు రొమ్ముల కోసం ప్రసూతి బ్రా లను ధరించడం ఎల్లప్పుడూ సూచించదగినది. ఇవి లోపలి నిరోధక తీగలు లేకుండా సౌకర్యవంతంగా ఉంది విస్తరించేందుకు వీలుగా ఉంటుంది.

బ్లీడింగ్ లేదా స్పాటింగ్

గర్భాధారణ జరిగిన 10-14 రోజుల్లో కొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ ఉండవచ్చు. ఇది సాధారణమైనది అని అనుకోవద్దు. ఇది ఎండోమెట్రియం (గర్భాశయ అంతర్గత లైనింగ్) లోకి ఫలదీకరణం చేసిన గుడ్డు యొక్క అమరిక వలన సంభవిస్తుంది. ఇది సుమారు మూడు రోజుల పాటు కొనసాగుతుంది మరియు దీనికి చికిత్స అవసరం లేదు.

మూర్ఛ మరియు మైకం

మీరు గర్భం దాల్చినట్లయితే మీ రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది మరియు విస్తరించిన రక్త నాళాల ఫలితంగా మీరు మైకమును పొందవచ్చు. కళ్ళు తిరగడం, నీరసం కమ్మడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీ వైద్యుడిని సంప్రదించండి మరియు మీ రక్తపోటు స్థాయిని క్రమంగా ట్రాక్ చేయండి. ఆహార ప్రణాళికను అనుసరించండి మరియు నీరు పుష్కలంగా త్రాగడానికి ప్రయత్నించండి. గర్భానికి అనుకూలంగా స్వల్ప వ్యాయామం లేదా యోగ చేయడం మంచిది.

వికారం

వాంతులు, వికారం లేదా ఉదయం లేవగానే నలతగా ఉండటం ఇలాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలకు మొదటి రెండు వారాలు లేదా నెల రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. దీనిని మార్నింగ్ సిక్నెస్ అని పిలుస్తారు. ఇది రోజులో ఏ సమయంలో అయినా సంభవించవచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయిలు కడుపులో వేగంగా పెరగడం వలన సాధారణంగా వాంతులు వంటి భావన ఏర్పడుతుంది. సుగంధ పరిమళాల వాసన, సువాసనలు, ఆహార వాసన మరియు సిగరెట్ల యొక్క వాసన ఎక్కువగా పొందడం వలన వికారం మరియు వాంతుల భావనను మీరు కలిగి ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీరు వికారం కారణంగా తినలేకపోతే, బలవంతంగా తినకండి. నీటిని పుష్కలంగా త్రాగి మరియు హైడ్రేటెడ్ గా ఉండండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే డాక్టర్ ను సంప్రదించండి.

మలబద్ధకం

కడుపులో ప్రొజెస్టెరాన్ పెరుగుదల వలన ఆలస్యంగా ఆహరం అరుగుదల జరుగుతుంది. కారణంగా జీర్ణ వ్యవస్థ ప్రక్రియలు ఆలస్యంగా జరగడం వలన ఈ పరిస్థితి మలబద్ధకంకు కారణమవుతుంది.

మానసిక కల్లోలాలు

శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ యొక్క ప్రవాహ స్థాయి పెరిగిన కారణంగా, మీరు మానసిక కల్లోలంను అనుభవిస్తారు మరియు ఇది గర్భవతి మహిళల్లో చాలా సాధారణ సంఘటన. వేర్వేరు మహిళలు ఈ మార్పులకు భిన్నంగా స్పందిస్తారు. మానసిక భావోద్వేగాల భ్రమణంలో కొన్ని భావోద్వేగాలు మంచివి కావచ్చు లేదా చెడు కావచ్చు, మరికొందరు వీటికి పూర్తి భిన్నమయిన భావోద్వేగాలను కలిగి ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీరు దుఃఖం, ఆత్రుత, కుమిలిపోవడం లేదా రోజువారీ చర్యలను ఎదుర్కోలేకపోవడం మరియు ఏకాగ్రత సాధ్యం కాకపోతే, వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఇది దీర్ఘకాలంలో మీకు మరియు శిశువుకు కూడా సహాయపడవచ్చు.

తరచుగా మూత్ర విసర్జన

హార్మోన్ల మార్పు ఫలితంగా గర్భధారణ సమయంలో మీ మూత్రపిండాలు ద్వారా రక్తం ప్రవహిస్తుంది. అందువల్ల, మూత్రపిండము సాధారణమైన దాని కన్నా ఎక్కువ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల పిత్తాశయంలో ఎక్కువ ద్రవాలను ప్రేరేపిస్తుంది. అందువల్ల, బాత్‌రూమ్ కు మీరు తరచూ వెళ్ళాలని కోరుకుంటారు.

పెరిగిన హృదయ స్పందన రేటు

గర్భధారణ జరిగి సుమారు రెండు నెలల తరువాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. గుండె వేగంగా మరియు క్లిష్టంగా రక్తంను పంపు చేస్తుంది.

ముందు జాగ్రత్త – మీకు ఏవైనా గుండె జబ్బులు లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించండి.

ఇవన్నీ మీరు గర్భవతా లేదా అని నిర్ధారించడానికి సహాయపడే కొన్ని సంకేతాలు. హార్మోన్ల మార్పుల వలన తరచుగా వచ్చే తేలికపాటి తలనొప్పులు కూడా ఇతర సంకేతాలుగా ఉంటాయి. మీరు మీ చర్మం తేమగా లేదా జిడ్డుగా ఉండటం గమనించవచ్చు. ఇది హార్మోన్ల మార్పుల ఫలితం మరియు దీని వలన మోటిమలు విచ్ఛిన్నం కావచ్చు. మొదటి మూడు నెలల తర్వాత ఈ లక్షణాలు చాలా వరకూ తగ్గుతాయని గుర్తుంచుకోండి. ఈ క్రమంలో తగిన అవగాహనా కలిగి పైన పేర్కొన్న సూచనలన్నింటినీ మీరు అనుభవించినట్లయితే, గర్భ పరీక్ష చేయించుకోండి మరియు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Posted on

ప్రొలాక్టిన్ హార్మోన్ డిజార్డర్ కు చిట్కాలు

ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారంను తగిన స్థాయిలో తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అది ఆరోగ్యకరమైన జీవానికి దారితీస్తుంది. మంచి ఆలోచనల ద్వారా ఎటువంటి పరిస్థితినైనా అరికట్టగలం. కాబట్టి చెడు ఆలోచనలను వదిలివేయాలి. ఒక సామెత చెప్పినట్టు “చికిత్స కంటే నివారణ మంచిది”. జాగ్రత్తగా ఉండటం వలన మరియు కొన్ని నియమాలను పాటించడం వలన అనారోగ్యం కలుగకుండా చేయవచ్చు. అనారోగ్యం అనేది, అడ్డంకుగా ఉంటుంది, ఇది దినచర్యను అనుసరించదు. అనారోగ్యం ఏ రూపంలోనైనా రావచ్చు మరియు ఈ వ్యాధుల వలన సాధారణ దినచర్యకు ఆటంకం ఏర్పడుతుంది.

మానవ ఆరోగ్యానికి  ప్రత్యేక శ్రద్ధ అవసరం. అవసరమైన మొత్తంలో ఆహారాన్ని, పోషకాలను తీసుకోవడం ద్వారా మానవ శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీలు బలంగా ఉండాలి. దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితుల కారణంగా అనేక సందర్భాల్లో సాధారణ పనితీరుకు భంగం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు వ్యాధులు మరియు సమస్యలను నివారించడానికి మరింత రక్షణ తీసుకోవాలి. శరీరం సాధారణ పనితీరును కొనసాగించడానికి ప్రతీ నిమిషం కూడా శ్రద్ధ చాలా అవసరం. మహిళల శరీర రకాలను బట్టి ముందుగానే జాగ్రత్తలు  మరియు చికిత్సలను అనుసరించాలి. ఒక ఆరోగ్యకరమైన జీవితం సరైన ఉపశమనంతో పాటుగా మంచి  విశ్రాంతికి దారి చూపిస్తుంది.

ప్రతీ తల్లి ఆరోగ్యకరమైన బిడ్డను పునరుత్పత్తి చేయటానికి ప్రయత్నిస్తుంది మరియు ఈ ప్రక్రియలో ఏ సమస్య లేకుండా ఉండాలని కోరుకుంటుంది. తల్లి మరియు బిడ్డల మధ్య ఉన్న సంబంధంలో మరొక అర్ధం కూడా ఉంది. ప్రతీ తల్లికి తన బిడ్డ పుట్టుకతో ఒక ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో చాలా దశలు ఉంటాయి, ప్రోలాక్టిన్ అనే హార్మోన్ అసాధారణంగా ఉండటం వలన ఫలితంగా తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. ఇది పిట్యూటరీ గ్రంథిచే నియంత్రించబడుతుంది. ఇది కొన్ని స్థాయిలలో దీనిని పరీక్షిస్తారు. ఈ హార్మోన్ చాలా ముఖ్యం ఎందుకంటే ఇది పాలు ఏర్పడటాన్ని నియంత్రిస్తుంది. పెళ్లి కాని లేదా గర్భిణీ కాని స్త్రీలలో ఈ హార్మోన్ రొమ్ము రుగ్మతకు దారి తీయవచ్చు. ఇది తలనొప్పి మరియు ఇతర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

ప్రోలాక్టిన్ హార్మోన్ సమస్యకి గల కారణాలు

ప్రొలాక్టిన్ హార్మోన్ను మాస్టర్ గ్లాండ్- మెదడులో ఉండే పిట్యూటరీ గ్లాండ్ వలన ఉత్పత్తి అవుతుంది మరియు ఎక్కువ ప్రొలాక్టిన్ అధికంగా ఉత్పత్తి చేయడం వలన సమస్య వస్తుంది. దీని ఫలితంగా, ఇది స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మరియు పురుషులలో టెస్టోటెస్టోర్న్ హార్మోన్ వంటి లైంగిక హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. మెదడు యొక్క ప్రధాన స్థావరం వద్ద ఉన్న పిట్యూటరీ గ్రంథి చిన్నదిగా ఉంటుంది మరియు శరీరం యొక్క ప్రతీ భాగంపై దీని ప్రభావం చాలా ఉంటుంది. తగినంత మొత్తంలో ఈ హార్మోన్ ఉత్పత్తి అయితే ఒక ఆరోగ్యకరమైన జీవనంకు దారితీస్తుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ స్థాయిని పరిశీలించాల్సిన అవసరం ఉంది, అందువలన శరీరంలో ఒత్తిడి ఉండదు. ప్రోలాక్టిన్ హార్మోన్ కారణంగా సమస్యలు వస్తాయని గమనించాలి. దీనికి గల కారణాలు అధిక మొత్తంలో ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం, మందులను వాడటం, థైరాయిడ్ గ్రంధి ఆధీనంలో ఉండకపోవడం, ఛాతీ సమస్యలు, గర్భంలో సమస్యలు మరియు తల్లిపాల సమస్య. వ్యతిరేక వికారం మందులు, గర్భానిరోదక సమస్య, యాంటిడిప్రెసెంట్స్ వంటి సమస్యలు వస్తాయి. వీలయినంత త్వరగా వ్యాధి లక్షణాలను గుర్తించి డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది.  తద్వారా అనారోగ్య చింతన వీడి ప్రశాంత జీవితం వైపుకు అడుగులు వేయవచ్చు.

ప్రోలాక్టిన్ హార్మోన్ సమస్యకు గల లక్షణాలు

ప్రోలాక్టిన్ హార్మోన్ల సమస్య నుండి గమనించదగ్గ లక్షణాలను గుర్తించాలి. ఇది ప్రోటీన్ పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రోలాక్టిన్ డిజార్డర్ యొక్క కొన్ని లక్షణాలు స్త్రీలు మరియు పురుషులలో ప్రత్యేకమైనవి.

  • స్త్రీలలో, ప్రొలాక్టిన్ లోపం యొక్క లక్షణాలలో కొన్ని గుర్తించదగినవి మరియు కొన్ని లక్షణాలను గుర్తించలేము. స్త్రీలు క్రమరహిత ఋతు కాలంకు (ఒలిగో మేనోర్హియా) గురవుతారు. ప్రొలాక్టిన్ హార్మోన్ లోపం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం రొమ్ముల నుండి పాలు  వృధా అవుతుంది మరియు ఇది తల్లి పాలు ఇచ్చే ప్రతీసారీ జరుగుతుంది.
  • అధిక శరీరం మరియు ముఖంపై అవాంచిత రోమాల పెరుగుదల ద్వారా అందమైన రూపానికి  భగ్నం కలగవచ్చు.
  • ప్రోలాక్టిన్ లోపం యొక్క లక్షణాలు మగవాళ్ళలోనూ ఉంటాయి. అలాంటి ఒక సమస్య అంగస్తంభన. శరీరము మరియు ముఖంలో అవాంచిత రోమాల పెరుగుదల తగ్గుదల సమస్యను పురుషులు ఎదుర్కోవచ్చు. ఇది పురుషులకు ఏ హార్మోను వలన వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన జీవానికి దారితీయదు.
  • దీని లోపంతో పరిశీలిస్తే పురుషులలో రొమ్ములు పెద్దదిగా విస్తరిస్తాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది తీవ్రంగా పురుషుడి యొక్క వ్యక్తిత్వం మరియు శరీర ఆకృతిని నాశనం చేస్తుంది. స్త్రీ పురుషులలో పరిశీలిస్తే ఎముక సాంద్రత తగ్గడం, తలనొప్పి, వంధ్యత్వం, ఇతర హార్మోన్ ఉత్పత్తి తగ్గుదల వంటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శారీరక అసౌకర్యాలను సృష్టిస్తుంది. లైంగిక కార్యకలాపాలు కొనసాగించడంలో ఆసక్తి ఉండదు.
  • లైంగిక కార్యకలాపాల్లో ఆసక్తి కోల్పోవడం ప్రేమ జీవితంలో ఆనందాన్ని నిరుత్సాహపరుస్తుంది. వంధ్యత్వం రెండు లింగాలలో ప్రోలక్టిన్ రుగ్మతకు మరొక కారణం మరియు దీని వల్ల జీవితం నెమ్మదిగా ఉంటుంది. ఇది పిల్లల యొక్క పుట్టుకను దెబ్బతీస్తుంది. తలనొప్పి రెండు లింగాలలో కూడా కనిపిస్తుంది. ఇదేకాక, ప్రొలాక్టిన్ డిజార్డర్ సంతోషకరమైన జీవితంకు విఘాతం కలిగించగలదు మరియు ఇంకా మరికొన్ని ప్రధాన విషయాలు గమనించవచ్చు.

ప్రోలాక్టిన్ డిజార్డర్ కు చికిత్స

ప్రోలాక్టిన్ హార్మోన్ రుగ్మతకు సరైన చికిత్స అవసరం. సరైన చికిత్స కొన్ని నివారణలు ఇవ్వగలదు. చికిత్స అనేది ప్రోలాక్టిన్ సమస్యపై ఆధారపడి ఉంటుంది. దీనిని జాగ్రత్తగా నిర్ధారణ చేసుకోవడం అవసరం.

  • ఒక ఉపశమనం పొందేవరకు డాక్టర్ దగ్గరకు వెళ్లి సరైన చికిత్స తీసుకోవాలి. ఇది ఎక్కువగా కణితి యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ చికిత్సతో సిటి స్కాన్ చేయడం ద్వారా సమస్య త్వరగా పరిష్కారింపబడుతుంది మరియు చింతలను తొలగిస్తుంది.
  • ప్రోలాక్టిన్ సమస్య నుండి ఒత్తిడి మరియు ఉపశమనం పొందుటకు సరైన చికిత్స చాలా అవసరం. ప్రొలాక్టిన్ డిజార్డర్స్ లక్షణాలు మరియు కణితి యొక్క పరిమాణం స్కాన్ చేయవలసిన అవసరంపై చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది.
  • అత్యంత బాధాకరమైన ప్రక్రియ కణితి తొలగింపు ప్రక్రియ. అవసరమైతే శస్త్రచికిత్స ఒక శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. వేరే విధంగా కూడా నోటి నుండి ఔషధాలను పంపి చికిత్స చేయవచ్చు. ఆ విధంగా కూడాను  శస్త్రచికిత్సను తప్పకుండా నివారించవచ్చు. నోటి ద్వారా ఔషధాలను పంపడం చాలా సమర్థవంతంగా ఉంటుంది.
  • గర్భిణీ స్త్రీలకు సూచించే వరకు నోటి మందులతో చికిత్స చేయరాదు అని గుర్తుంచుకోండి. మహిళలకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అవసరం మరియు మందులు డాక్టర్ సూచిస్తేనే తీసుకోవాలి.
Posted on

Telugu tips for dark circles – కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించే చిట్కాలు

మన కళ్ళకింద ఏర్పడే నల్లటి వలయాలను సహజ పద్దతిలో వదిలించుకోవడానికి కొన్ని సమర్ధవంతమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ చిట్కాల ద్వారా క్రమంగా చక్కటి ఫలితాలను పొందుతారు. కళ్ళకింద ఉండే చర్మం నల్లగా ఉండటాన్ని నల్లటి వలయాలు అని పిలుస్తారు. ఇది అన్ని వయసుల పురుషులను మరియు స్త్రీ లను ప్రభావితం చేస్తుంది. మొదటిగా నల్లటి వలయాలు రావడానికి గల సాధారణ కారణాలు తెలుసుకుందాం.

ఏ కారణం వల్ల కళ్ళకింద నల్లటి వలయాలు వస్తాయి?

సాధారణంగా కళ్ళ చుట్టూ ఉండే ఈ నల్లటి వలయాలు ఉదయం లేవగానే మరింత ఎక్కువ నీలం రంగులో కనిపిస్తాయి మరియు దీని వల్ల కళ్ళకింద చర్మం పలుచగా ఉండటంతో పాటు రక్త వాహక నాళాలు శరీరంలో మిగతా చోటుకంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ, చర్మం దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుంది మరియు చర్మం మరింత పలుచగా అవుతుంది. ఫలితంగా నల్లటి వలయాలు మరింత నీలంగా మారుతాయి.

అయితే, ఆసియా ప్రజల చర్మ వర్ణం లో సాధారణంగా నీలం వలయాలు చాలా అరుదు. ఇది గోధుమ రంగులో ఉన్నట్లయితే జీవితం చాల దుర్భలంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితినే హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు, దీనికి కారణం కళ్ళ క్రింద ఎక్కువ మెలానిన్ ఉత్పత్తి అవ్వడం. ఒక్కోసారి ఈ నల్లటి వలయాలు వంశపారంపర్యంగా వస్తాయి మరియు ఈ సందర్భంలో చర్మం రంగు మార్చడానికి సరైన చికిత్స తప్ప వేరే మార్గం లేదు.

శరీరం యొక్క ఇతర భాగాలలో చర్మం 2 మిల్లీ మీటర్ల మందంతో ఉంటే కళ్ళు చుట్టూ ఉండే చర్మం 0.5 మిల్లీ మీటర్ల మందంగా మాత్రమే ఉంటుంది, అందుకే మీరు సుదీర్ఘ కాలం పనిచేసినా, మీరు సన్ గ్లాస్ లేకుండా సూర్యుడు కింద కొన్ని గంటలు గడిపినా, ఒక నిద్రలేని రాత్రి గడిపినా, ఈ ప్రాంతం యొక్క చర్మం చాలా ప్రభావితం అవుతుంది.

ఈ వ్యాసం యొక్క తరువాతి భాగంలో మీ అలవాట్లు మరియు జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం వలన అవి ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి ఎలా సహాయపడతాయో వివరించడం జరిగింది. చదవండి.

సరిగా నిద్ర పోండి

సరైన నిద్ర లేకపోవడం వలన ఈ కంటి క్రింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉంది. అలసటతో కూడిన జీవనశైలితో పాటు సరిగా విశ్రాంతి తీసుకోకపోవడం మరియు ఒత్తిడి వంటివి అన్ని వయస్సుల వారికి ఈ నల్లటి వలయాలు రావడానికి గల ప్రధాన కారణాలు. మానసికంగా మరియు శారీరకంగా అధిక పని ఒత్తిడి కూడా దీనికి కారణమవుతుంది.

సూర్యరశ్మి నుండి మీ చర్మంను రక్షించుకోండి

ముందు చెప్పినట్లుగా, మీరు సన్ స్కిన్ లోషన్ రాసుకోకుండా బయటికి వెళ్లినప్పుడు హానికరమైన అల్ట్రా వైలెట్ కిరణాలు మీ చర్మంపై ప్రభావం చూపుతాయి, కళ్ళు చుట్టూ ఉండే చర్మం చాలా పలుచగా మరియు సున్నితమైనదిగా ఉంటుంది, దీని వలన మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా నల్లటి వలయాలు ఏర్పడుతాయి.

మంచి నాణ్యమైన మేక్-అప్ ఉత్పత్తులను సరైన పద్ధతిలో వాడండి
మీది సున్నితమైన చర్మం అయితే, మేకప్ ఉత్పత్తులను సరైన పద్ధతిలో ఉపయోగించక పోవడం వలన నల్లటి వలయాలు పొందే అవకాశం అధికంగా ఉంటుంది. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించే ముందు మీరు వాటిని పరీక్షించి మీ చర్మం సున్నితమైనది కానటువంటి నాణ్యమైన సౌందర్యాలను మాత్రమే ఎంచుకోండి. అలాగే నిద్రించడానికి ముందు పూర్తిగా మేక్-అప్ ను తొలగించండి.

వ్యాధికి సరైన చికిత్స తీసుకోండి

రక్తహీనత మరియు మూత్రపిండాల సమస్యలు వంటి కొన్ని వ్యాధులు మీ కళ్ళు కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు. మీరు అలాంటి సమస్యలతో బాధపడుతుంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అనారోగ్యానికి గురైన తర్వాత నల్లటి వలయాలు రావడం చాలా సాధారణం కానీ సరైన జాగ్రత్త తీసుకుంటే సాధారణంగా సమయంతో పాటు అవి తొలగిపోతాయి.

ద్రుష్టి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోండి

మీకు దృష్టి సమస్యలు ఉన్నా, కానీ మీరు కళ్ళజోళ్ళు లేదా లెన్సులు ధరించకపోతే, అది కూడా నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు. దృష్టి సమస్యలున్నప్పుడు కళ్ళజోళ్ళు లేదా లెన్సులు ఉపయోగించని వ్యక్తులు స్పష్టంగా చూడటం కోసం వారి కళ్ళను నొక్కిచూస్తారు, ఇలా చేయడం వలన నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాబట్టి మీకు దృష్టి లోపం ఉందో లేదో ఈ రోజే తెలుసుకోండి.

మీ జీవన శైలిని మార్చుకోండి

ఉత్తమమైన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అధిక ధూమపానం మరియు మద్యం వినియోగం చేయడం ద్వారా కూడా కళ్ళు చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ అలవాట్లనుండి దూరంగా ఉండండి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ మరియు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

డీ హైడ్రేషన్ ను నివారించండి

డీ హైడ్రేషన్, శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు. డీ హైడ్రేషన్ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది, దీని వల్ల చర్మం పొడిగా ఉంటుంది, ఇది కంటి ప్రాంతం యొక్క సున్నితమైన చర్మాన్ని మరింత ప్రభావితం చేస్తుంది, ఇది నల్లటి వలయాలను పెంచుతుంది. కాబట్టి, మీ శరీరం మరియు చర్మం హై డ్రేట్ అవ్వకుండా క్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.

ఏ కారణం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయో మరియు వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన గృహ చిట్కాలను మీరు ఇక్కడ తెలుసుకుంటారు. క్రింద చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తూ ఆహారపు అలవాట్లను మరియు పైన చెప్పిన జీవనశైలిలో మార్పులు అనుసరిస్తే నల్లటి వలయాలు తగ్గడం మీరు గమనిస్తారు.

కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని గృహ చిట్కాలు

పసుపు మరియు పైనాపిల్ జ్యూస్

పసుపు చర్మం ఉపశమనానికి మరియు కాంతిని పొందటం వంటి సహజ లక్షణాలను కలిగి ఉంది. పైనాపిల్ జ్యూస్ చర్మానికి పోషణను అందించగలదు, కళ్ళు చుట్టూ ఉండే నల్లటి వలయాలను వదిలించి కాంతివంతం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్ 1 చెంచా తో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు పేస్ట్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ళ చుట్టూ ఉండే చర్మంపై ఒక ప్యాక్ లా వేసుకోండి. 5 నిముషాల పాటు అలానే వదిలివేసి తరువాత నీటితో కడగండి.

కీర దోసకాయ

దోసకాయతో కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించే ఒక ప్రసిద్ధి చెందిన గృహ చికిత్స. దోసకాయలో నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడే కాణ జాలాలకు సహజ చర్మపు సౌమ్యత లక్షణాలను కలిగి ఉంటుంది. రిఫ్రిజిరేటెడ్ దోసకాయలను ముక్కలుగా చేసి, నేరుగా మీ కళ్ళ కింద నల్లటి వలయాలను కప్పే విధంగా 10 నిమిషాల పాటు ఉంచాలి. త్వరిత ప్రభావం కోసం దోసకాయ రసంలో దూదిని నానబెట్టి 20 నిమిషాలు మీ కళ్ళ కింద నల్లటి వలయాలపై పెట్టండి. ఆ తరువాత, మామూలు నీటితో కడగండి. ఈ చిట్కా వలన చర్మపు సౌమ్యత మరియు రిఫ్రెష్ ప్రభావాన్ని పొందుతారు.

కీర దోస మరియు నిమ్మ రసం

మీరు శీఘ్ర ఫలితాలను పొందడం కోసం నిమ్మరసంతో పాటు దోసకాయ రసంని కూడా ఉపయోగించవచ్చు . 2 స్పూన్లు దోసకాయ రసం తో పాటు కొన్ని చుక్కల నిమ్మ రసంను కలపండి ఈ మిశ్రమాన్ని కన్ను కింద నల్లటి వలయాలపై రాయండి. 10 నుంచి 15 నిముషాల వరకు అలానే వదిలేసి తరువాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగుదలను చూడడానికి ఒక వారం లేదా పది రోజులు ఈ పరిష్కరణా విధానాన్ని ప్రయత్నించండి.

కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి బంగాళదుంప జ్యూస్

తొక్క తీసి చిన్నగా ముక్కలు చేసిన బంగాళ దుంపలను మెత్తగా గ్రైండ్ చేసి వచ్చిన గుజ్జు నుండి రసం సేకరించాలి. తర్వాత కాటన్ బాల్ లను తీసుకుని వాటిని ఆ రసంలో ముంచి నల్లని వలయాలను కప్పి ఉంచేలా కళ్ళ మీదగా పెట్టుకోవాలి . అలా ఒక 20 నిముషాలు ఉంచి కడిగేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా ప్రతీ రోజు బంగాళా దుంపలను చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకుని 15-20 నిముషాలు పాటు ఉంచగలిగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

రోజ్ వాటర్

మొండి నల్లటి వలయాలను వదిలించుకోవడానికి రోజ్ వాటర్ మీకు సహాయం చేస్తుంది. రెండు దూది ముక్కలను తీసుకుని రోజ్ వాటర్లో నానబెట్టి, వాటిని మీ మూసి ఉన్న కళ్ళపై ఉంచి, 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. తడిగా ఉండేలా చూసుకోండి. ఈ చిట్కా వలన చర్మపు సౌమ్యత మరియు రిఫ్రెష్ ప్రభావాన్ని పొందుతారు. ఈ పరిహారంను కొన్ని వారాలపాటు రోజుకి రెండు సార్లు చెయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

ఆల్మాండ్ మరియు మిల్క్

బాదం మరియు పాలు కంటి కింద నల్లటి వలయాల కోసం చాలా సమర్థవంతమైన పరిష్కారం. రాత్రిపూట 4-5 బాదం గింజలను పాలతో పాటు నానబెట్టి, ఉదయం ఈ మిశ్రమాన్ని పేస్టు లా చేసుకోవాలి. ఇప్పుడు స్వచ్ఛమైన గిన్నెలో 1 స్పూన్ తాజా పాలు మరియు 1 స్పూన్ బాదం పేస్ట్ తీసుకుని, రెండు పదార్ధాలను కలపాలి మరియు నేరుగా కళ్ళ కింద నల్లటి వలయాలపై ఈ పేస్ట్ ను రాయాలి. 15 నిముషాల పాటు అలానే వదిలివేసి మామూలు నీటితో కడగాలి. మరిన్నివివరాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి.

రోజ్ వాటర్ మరియు నిమ్మ రసం

ఒక శుభ్రమైన గిన్నెలో 2 స్పూన్లు రోజ్ వాటర్ తో పాటు 2 స్పూన్లు నిమ్మ రసంను కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమంలో దూదిని నానబెట్టి, కళ్ళ కింద మొండి నల్లటి వలయాలపై నేరుగా ఈ రసంని రాయండి. 10 నిముషాల పాటు అలానే వదిలివేసి మామూలు నీటితో కడగాలి. ఈ గృహ చిట్కాల కోసం మరిన్నివివరాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి.

ఆల్మాండ్ ఆయిల్

కళ్ళు చుట్టూ ఉండే సున్నితమైన చర్మంకు చికిత్స కోసం, బాదం నూనె ఉత్తమంగా పనిచేస్తుంది. నల్లటి వలయాలపై కొద్దిగా బాదం నూనెను రాయండి మరియు పడుకునేముందు వేళ్లతో వృత్తాకార దిశలో నెమ్మదిగా రుద్దండి. మరుసటి రోజు ఉదయం మంచి నీటితో శుభ్రం చేసుకోండి.

పుదీనా ఆకులు మరియు నిమ్మ రసం

నిమ్మరసంతో పాటు మింట్ ఆకులు నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. కొన్ని తాజా పుదీనా ఆకులను క్రష్ చేసి పేస్టు లా చేయండి. 1 స్పూన్ పుదీనా పేస్ట్ కు 1 స్పూన్ నిమ్మకాయ రసంను కలపండి మరియు ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాయండి. మరిన్ని వివరాలకోసం ఈ వీడియో చూడండి.

నిమ్మ రసం మరియు పెరుగు

నిమ్మకాయలో సహజ రక్తస్రావ లక్షణములు మరియు పెరుగు లో తేమ వంటి లక్షణాలు కలిగి ఉండటం వలన మీ కళ్ళకి ఉపశమనంతో పాటు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగుతో పాటు ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసంను తీసుకుని రెండింటినీ కలపండి. బాగా కలపాలి మరియు ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాయండి. ప్యాక్ ఆరిపోయిన తర్వాత, రెండో కోటింగ్ వేసుకుని మరొక కొద్ది నిమిషాలు ఉండాలి. చివరిగా మామూలు నీటితో కడగండి.

కార్న్ ఫ్లోర్ మరియు పెరుగు

మొక్కజొన్న పిండి మరియు పెరుగుతో తయారుచేసిన పేస్ట్ మొండి నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కు 1 టేబుల్ స్పూన్ పెరుగుని కలపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. కళ్ళు చుట్టూ ఈ పేస్ట్ ను రాయండి మరియు 10-15 నిమిషాలు అలానే వదిలేయండి. సాధారణ నీటితో కడగండి.

చల్లటి టీ సంచులు

చల్లని టీ సంచులను ఉపయోగించడం ద్వారా కళ్ళకి ఉపశమనంతో పాటు నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 నిమిషాలు గోరు వెచ్చని నీటిలో రెండు టీ సంచులు వేసి, వాటిని చల్లబరచడానికి ఫ్రిజ్లో ఉంచండి. కళ్ళపై ఈ చల్లని టీ సంచులను 10 నిముషాలు లేదా ఎక్కువసేపు ఉంచండి. సాధారణ తేయాకుకు బదులుగా గ్రీన్ టీ సంచులను ఉపయోగించడం వలన ప్రభావం ఎక్కువ ఉంటుంది.

ఆల్మాండ్ ఆయిల్ మరియు హనీ

ఆల్మాండ్ ఆయిల్ మరియు తేనె నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక చెంచా తేనెతో బాదం నూనెను 1 స్పూన్ కలపండి మరియు కళ్ళు కింద నల్లటి వలయాలపై ఈ మిశ్రమాన్ని రాయండి. తేనె మరియు బాదం రెండూ పోషక లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అవి సహజంగా చర్మంపై ఉన్న నల్లటి వలయాలను సహజంగా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ 10 నిముషాలు ఉంచి ఆపై నీటితో కడగాలి.

పసుపు మరియు పైనాపిల్

పసుపులో యాంటి-ఆక్షిడెంట్ మరియు సహజ చర్మ సౌందర్య లక్షణాలతో నిండి ఉంటుంది. మరోవైపు పైనాపిల్ లో అధిక విటమిన్ సి మరియు E కంటెంట్ ఉంటాయి, ఇది సున్నితమైన చర్మంను పోషించడంలో సహాయపడుతుంది. తాజాగా తయారు చేసిన పైనాపిల్ జ్యూస్తో 1 చెంచా పసుపు ను కలిపి పేస్ట్ లా కలపాలి. కళ్ళు చుట్టూ ఈ మిశ్రమాన్ని రాయాలి. 10 నిముషాల పాటు అలానే వదిలి, తరువాత నీటితో కడగాలి.

టమాటో మరియు నిమ్మ రసం

టమోటో మరియు నిమ్మరసంలో సహజ చర్మపు కాంతిని ఇచ్చే లక్షణాలు ఉంటాయి మరియు అవి చర్మంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ను ఎక్కువగా పెంచుతాయి. తాజాగా తయారు చేసిన 2 స్పూన్ల టమాటో రసంకు 1/2 స్పూన్ నిమ్మ రసంను కలపండి మరియు కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై ఈ మిశ్రమాన్ని రాయండి. ఇది 10 నిముషాల ఉంచి, ఎక్కువ నీటితో కడగాలి.

కాస్టర్ ఆయిల్ మరియు మిల్క్

కాస్టర్ ఆయిల్ మరియు మిల్క్ నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తాజా పాలతో కలిపినప్పుడు, ప్రభావం మరింత బాగుంటుంది. 1 చెంచా ఆముదం నూనె 1 స్పూన్ పాలతో కలపండి మరియు కళ్ళు చుట్టూ ఈ మిశ్రమాన్ని రాయండి. 10 నిముషాల పాటు అలానే వదిలి, తరువాత నీటితో కడగాలి.

గులాబీ రేకులు మరియు మిల్క్

గులాబీ రేకులు మరియు పాలు కళ్ళు చుట్టూ ఉండే చర్మం రంగు పాలిపోకుండా ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని తాజా గులాబీ రేకులను మృదువైన పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ లో 1 చెంచా పాలు కలపండి మరియు కళ్ళు చుట్టూ నల్లటి వలయాలపై రాయండి. 10-15 నిమిషాల పాటు అలానే వదిలివేసి తరువాత నీటితో కడగాలి.

అలో వెరా మరియు ఆల్మాండ్ ఆయిల్

అలో వెరాలో చర్మం పోషణ మరియు ఉపశమనం వంటి లక్షణాలు ఉంటాయి. బాదం నూనె లో విటమిన్ ‘ఇ’ సమృద్ధిగా ఉంటుంది, ఇది కంటి ప్రాంతం యొక్క చర్మంను కాంతివంతం చేయుటకు సహాయపడుతుంది. అలో వెరా చర్మంను గట్టితరం చేస్తుంది. ఇది కళ్ళు కింద చారలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తాజా అలో వెరా పల్ప్ ను 1 అలో వెరా ఆకు నుండి సేకరించండి మరియు ఒక క్లీన్ మందపాటి జెల్ను కంటైనర్లోకి తీసుకుని 1 చెంచా బాదం నూనెను వేసి బాగా కలపాలి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన చర్మంపై నేరుగా రాయండి. రాసిన తరువాత, మీ కళ్ళను 20 నిమిషాలు మూసివేయండి, తడిగా ఉన్న మరియు మృదువైన దూదితో ప్యాక్ని తీసివేయండి. నీటితో చేయవద్దు.

పసుపు మరియు క్యారెట్ సీడ్ ఆయిల్

పసుపు సహజమైన చర్మ సౌందర్య లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే క్యారట్ విత్తనాల నూనెలో విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ-ఆక్షిడెంట్ లు అధిక మోతాదులో ఉండటం వలన మృదువైన మరియు ప్రకాశవంతమైన చర్మంను పొందవచ్చు. దీన్ని తయారు చేయడం కోసం, వంటగదిలో ఉపయోగించే పసుపు పొడికి బదులు, పచ్చి తాజా పసుపు కొమ్ములను ఉపయోగించండి.

కొన్ని పసుపు కొమ్ములను మెత్తగా రుబ్బి రసంను తీయండి. ఒక స్వచ్ఛమైన గిన్నెలో ఈ పసుపు రసంను 2 స్పూన్లు మరియు ఈ మిశ్రమంలో 2-3 చుక్కల క్యారట్ సీడ్ ఆయిల్ ను కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కొత్త దూది సహాయంతో మీ చర్మంకు రాయండి. ఏమైనప్పటికీ, ఈ మిశ్రమం మీ కళ్ళల్లోకి వెళ్ళకుండా చూసుకోండి. 10 నిముషాల పాటు ఉండనివ్వండి, ఆపై మామూలు నీటిని చల్లుతూ తొలగించండి. మీరు ఈ చికిత్సను తీసుకునే ముందు మీరు క్యారట్ సీడ్ ఆయిల్ నుండి ఏ అలెర్జీలు పొందరని నిర్ధారించడానికి ప్యాచ్ పరీక్షకు వెళ్ళడం చాలా ముఖ్యం.

Posted on

Telugu eye care tips – కళ్లు దురద పెడుతున్నాయా?

మీ కళ్ళకు ఏదైనా చికాకు లేదా హాని కలిగినప్పుడు అది మీ దైనందిన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అదీకాక మీ అందమైన జీవితాన్ని దుర్భలంగా చేస్తుంది. అలెర్జీలు, కండ్ల కలక,  చర్మ అలెర్జీలు, కంటి పొర అలెర్జీలు, పొడిబారిన కంటి లక్షణాలు, మెయోబొమియన్ గ్రంధి యొక్క వైఫల్యం, బీఫారైటిస్, నేత్ర స్పర్శ కటకము వ్యాధి బారిన పడటం, జీవన శైలి విధానాలు లేదా ఇదివరకే ఉన్న కంటి ఆరోగ్య సమస్యలు వంటివి ప్రధానంగా కంటి దురదకు కారణమవుతాయి. దురదలు మాత్రమే కాకుండా దురద, ఎరుపు, వాపు, కాంతిని చూడలేకపోవడం మరియు మంట స్వభావాలని కలిగి ఉంటుంది. మీ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించక ముందే  సాధ్యమైనంత త్వరలో ఈ పరిస్థితికి చికిత్స అందించడం ఎంతో ముఖ్యం.

కంటి దురద చికత్స కొరకు ప్రధాన గృహ నివారణలు

మీ కళ్ళకి చల్లదనాన్ని అందించి కంటి దురదను ప్రాలద్రోలే కొన్ని ముఖ్యమైన నివారణ మార్గాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

టీ బ్యాగులు

బ్లాక్ టీ అనామ్లజనకాలకు చాలా అద్భుతమైన మూలము. ఇందులో ఉండే లెక్కలేనన్ని తాప వ్యతిరేఖ లక్షణాలు మీ కళ్ళు మండటం నుండి చల్లబరచి, దురద యొక్క సమస్యలు నుండి వెంటనే ఉపశమనం అందించడానికి సహాయపడుతుంది. మీ కళ్ళకు చికాకు కలిగి దురద పెట్టడం ప్రారంభమయినప్పుడు మీరు ఈ సులభ గృహ నివారణ చికిత్సను ఉపయోగించవచ్చు. మీకు ఈ నివారణ కోసం కావలిసిందల్లా రెండు వాడేసిన టీ బ్యాగులు మాత్రమే. మీరు టీ తయారు చేసినప్పుడు మిగిలిపోయిన టీ సంచులను పారవేయకుండా వాటిని రిఫ్రిజిరేటర్ లో 30 నిముషాలపాటు ఉంచండి. తదుపరి మూసి ఉంచిన కనురెప్పల మీద ఈ టీ సంచులను 10-15 నిమిషాలు పాటు ఉంచండి.

విచ్ హాజెల్

కంటి దురద నివారణకు ఇప్పుడు పెర్కొనబోయే ఒకానొక ఆశ్చర్యకరమైన ఔషదం విచ్ హాజెల్. ఇది రక్తస్రావ నివారణ మరియు తాపజనక వ్యతిరేక లక్షణాలను ఎన్నింటినో కలిగి ఉంది. అవి మీకు దురద మరియు మంట నుండి ఉపశమనం పొందేందుకు సహాయం చేస్తాయి.  దీనికోసం మీకు కొంత విచ్ హాజెల్ రసం  మరియు కొన్ని కాటన్ ప్యాడ్ లు అవసరమవుతాయి. కాటన్ ప్యాడ్  లు తీసుకుని వాటిని విచ్ హాజెల్ ద్రావణంలో నాన్చి తడిగా ఉన్న ప్యాడ్ లను మూసి ఉంచిన మీ కంటి రెప్పల మీదగా పెట్టుకుని దాదాపు 10-15 నిముషాలు ఉంచుకోవాలి. మీరు ఈ ఉపాయాన్ని రోజుకు రెండు సార్లు ప్రయత్నించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

ఆముదం

ఆముదం అనేక లక్షణాలను కలిగి ఉంది. అవి అనేక శోథ నిరోధక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇది కంటి దురద చికిత్సకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది కూడా కళ్ళు పొడిబారకుండా ఉంచే ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్ మరియు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిలుపుదల చేస్తుంది. దీనికోసం మీరు కొన్ని కాటన్ బంతులు మరియు మంచి నాణ్యత గల ఆముదం అవసరమువుతుంది. కొన్ని కాటన్ బంతులని ఆముదంలో ముంచి అదనపు ఆముదాన్ని కిందకి జారవిడిచి ఈ బంతిని మూసిన కనురెప్పల మీద 15 నిమిషాలు పాటూ ఉంచాలి. తరువాత బంతులను తీసి మీ కళ్ళను కొంత మంచి నీటితో శుభ్రం చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి రోజూ 1-2 సార్లు చేయాలి.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ యొక్క శోధ నిరోధక మరియు బాధ నివారణ లక్షణాలు మీ కళ్ళ మంట మరియు దురదలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నివారణ ఉపయోగించడానికి నాలుగు చుక్కల పరిశుద్ధమైన లావెండర్ ఆయిల్ ను ఒక టీ స్పూన్ కొబ్బరి నునేకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ ప్యాడ్ తో కనురెప్పల చుట్టూ మృదువుగా పూయాలి. తరువాత దానిని 10-15 నిముషాల పాటు అలానే వదిలేసి అప్పుడు నీళ్ళతో సాధారణంగా దానిని కడిగేసుకోవాలి. మీరు ఈ చిట్కాను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది.    

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ ను మీ అలంకరణ పెట్టెలో ఎల్లప్పుడూ ఉంచుకోవాల్సిన ఒక అద్భుతమైన పదార్ధము. టీ ట్రీ ఆయిల్ సూక్ష్మ జీవుల సంబంధిత ఇన్ఫెక్షన్ల నుండి మీ కళ్ళకు రక్షణ కలిపించడం మాత్రమే కాకుండా ఎన్నో వ్యతిరేక శోధ నిరోధక లక్షణాలను నిర్మూలిస్తుంది.   దీనికోసం మీరు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను తీసుకుని ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా మరో రకం క్యారియర్ ఆయిల్ కు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీ కంటి పై భాగాల మీదగా మృదువుగా రాయాలి. తదుపరి ఒక 20 నిముషాల పాటూ దానిని అలాగే ఉండనిచ్చి అప్పుడు మంచి నీటితో మొత్తం శుభ్రపరుచుకోవాలి. ఈ చిట్కాను ప్రతి రోజూ రెండు సార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితాలను చూడవచ్చు.

విటమిన్లు

కంటి దురదకు కారణమయ్యే దోహదకాలలో అతి పెద్దది శరీరంలో కొన్ని నిర్ధిష్ట పోషకాలు లోపించడం. మీ కళ్ళ పూర్తి పనితీరును ప్రభావితం చేయడంలో కొన్ని సామాన్య కారణాలు విటమిన్  C, E మరియు A లతో పాటుగా సాధారణంగా అది కంటి దురదకు సంబంధం కలిగి ఉంటుంది. సిట్రిక్ ఫలాలను ఎక్కువగా తీసుకోవడం మీ కళ్ళకు ఎంతో మంచిది. ముదురు ఆకుపచ్చ కూరగాయలు, ఆకు కూరలు, క్యారెట్లు, మామిడి పండ్లు మరియు జున్ను వంటి పదార్ధాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరు ఎన్నో రకాల కంటి సమస్యల నుండి సహజ మార్గంలో దూరంగా ఉండగలుగుతారు.

Posted on

Benefits of glucose in Telugu – గ్లూకోజ్ ప్రయోజనాలు

గ్లూకోజ్ అనేది పిండి పదార్ధాల నుండి మార్పిడి చేయబడిన ఒక రకమైన చక్కెర పదార్ధము.  ఈ మార్పిడి ప్రక్రియ కాలేయము చేత జరుగుతుంది. గ్లూకోజ్ మెదడుకు మరియు కండరాల పనితీరుకు శక్తిని పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు మొత్తంలో గ్లూకోజ్ ఉన్నట్లయితే అది గ్లైకోజేన్ గా నిల్వ చేయబడుతుంది. అది తరువాత శరీర శ్రమ మరియు వ్యాయమ సమయంలో ఖర్చు అవుతుంది.

వ్యాయామ సమయంలో సరిపడా గ్లూకోజ్ నిల్వలను మీరు కలిగి ఉండకపోతే అది హైపో గ్లైసీమియా అనే సమస్యకు దారితీస్తుంది. అది శారీరక మరియు మానిసిక ఆరోగ్యాలకు అలసట కలగజేస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది నీరసాన్ని మరియు మైకాన్ని కూడా కలిగిస్తుంది. పని చేస్తున్న కండరాలకు గ్లూకోజ్ నుండి సరిపడా శక్తి అవసరం, లేదంటే అవి ప్రోటీన్లను శక్తి కోసం వాడుకోవడం జరుగుతుంది. ఇలా జరిగితే  మూత్రపిండాలు అలసటకు గురవుతాయి. ఈ ప్రోటీన్లు అసలైన ప్రక్రియ కండరాల నిర్మాణానికి బదులుగా శక్తిగా మార్చబడటానికి కొనసాగుతాయి.

గ్లైకోజెన్

గ్లైకోజెన్ క్రీడాకారుల కండరాలకు బలాన్ని సమకూర్చే వనరులు. ఇవి కాలేయం మరియు అస్థిపంజర కండరాలలో నిల్వచేయబడతాయి. ఇవి సరిపడా కార్బోహైడ్రేట్ల నిల్వలు లేకుండా దీర్ఘ వ్యాయామము లేదా పని చేస్తున్నప్పుడు రక్తంలో పంపిణీ చేయబడిన గ్లూకోజ్ కంటే అదనంగా శరీరం శక్తిని కోరినప్పుడు ఈ గ్లైకోజెన్ మెదడుకు మరియు కండరాలకు శక్తిని సరఫరా చేస్తుంది.  

స్వల్ప వ్యాయామాల సమయంలో నిల్వచేయబడిన గ్లైకోజెన్ 90 నిముషాలకు సరిపడా గ్లూకోజ్ స్థాయిని పెంచబడుతుంది. అయితే అధిక తీవ్రతగల వ్యాయామాల సమయంలో నిల్వ చేయబడిన గ్లైకోజేన్ కేవలం 20 నిముషాల వరకు మాత్రమే శక్తిని అందిస్తుంది. అందువలన మరింత మొత్తంలో పిండి పదార్ధాలను ఖర్చు చేయడం ద్వారా గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. ఎవరైతే గ్లైకోజెన్ సహాయముతో వారి అదనపు శరీర శ్రమను నిర్వహించుకోగలుగుతారో వాళ్ళు గ్లూకోజ్ ను చాలా తక్కువ కొవ్వు నిల్వలుగా కలిగి ఉంటారు.

వ్యాయామ సమయంలో మంచి గ్లూకోజ్ స్థాయిలను పొందడానికి  సాధారణ కార్బోహైడ్రేట్లు కంటే క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు మరింత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. పిండి, రొట్టె, పాస్తా, పీచు పదార్ధాలు  మరియు తృణధాన్యాలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల క్రిందకి వస్తాయి. అలాగే సాధారణ కార్బోహైడ్రేట్లు రసాలు మరియు పంచదారతో చేసిన తీపి పదార్ధాలలో ఉంటాయి. వ్యాయామ సమయంలో సాధారణ కార్బోహైడ్రేట్లు వినియోగం వలన చాలా త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. కానీ క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు సాధారణ కార్బోహైడ్రేట్లకు పూర్తిగా వ్యతిరేకం. అవి క్రమంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి కొన్ని గంటల వరకు నిలిచి ఉంటాయి.

వ్యాయామ సమయంలో సరిపడా గ్లూకోజ్ స్థాయిని పొందడానికి వ్యాయామానికి రెండు గంటల ముందు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఒక మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామంలో 90 నిముషాల తర్వాత గ్లూకోజ్ ను పునరుద్ధరించడానికి స్పోర్ట్స్ డ్రింక్ ను సేవించండి. షుగరు వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో సరిపడా గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించాల్సిన అవసరం ఉంది లేదంటే వ్యాయామ సమయంలో రక్తం యొక్క హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని డయాబెటిస్ కలిగి వైద్య పరిధిలో ఉన్నవారు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వ్యాయామానికి ముందు మరియు తరువాత చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా డెసీ లీటరుకు 100 నుండి 250 మి.గ్రా, లేదా మి.గ్రా/డె.లీ అనేది వ్యాయామానికి ముందు ఉండాల్సిన రక్తంలో చక్కెర స్థాయికి ప్రామాణికం. మీరు ఈ పరిధి నుండి ఏదైనా తగ్గుదలను గమనించినట్లయితే కార్బోహైడ్రేట్ల స్నాక్స్ తో దానిని పైకి లేపండి. మీరు 250 మి.గ్రా/డె.లీ పరిధి కంటే ఎక్కువ చక్కర స్థాయిలను కలిగి ఉన్నట్లయితే మీరు కెటోయాసిడోసిస్ అని పిలవబడే ప్రమాదానికి దగ్గరవుతున్నట్లు చెప్పవచ్చు. అందువలన సురక్షిత స్థాయిలకు వచ్చేవరకు మీ వ్యాయామాన్ని వాయిదా వేయడం మంచిది.   

శరీర ఇంధనంగా గ్లూకోజ్

గ్లూకోజ్ అనేది మీరు తీసుకునే ఆహార పదార్ధాలు మరియు ద్రవపదార్దాల నుండి సేకరించబడుతుంది.  శరీర శ్రమ లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలు చక్కగా పని చేయడానికి మరియు వ్యాయామం చేసిన తర్వాత కూడా  తగిన మొత్తంలో మీ కండరాలకు ప్రోటీన్లను అందించడం అవసరం. గ్లూకోజ్ కు కొవ్వులకంటే తక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి అది అధిక శరీర శ్రమ వద్ద ఒక ఇంధనంగా ఉపయోగించబడుతుంది. శ్రమ తీవ్రత తరువాత స్థాయికి పెంచబడినప్పుడు మరింత ఎక్కువ గ్లూకోజ్ మీ శరీరానికి ఇంధనంగా అవసరం కావచ్చు. మీ శరీరం తక్కువ స్థాయిలో ఆక్సిజన్ పొందినప్పుడు మీరు గ్లూకోజ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.  మీరు తీవ్రమైన సుదీర్ఘ వ్యాయామానికి ప్రణాళిక చేస్తున్నప్పుడు మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పునరుద్ధరణ చేయాల్సి ఉంటుంది.

కండరాల పునరుద్ధరణలో గ్లూకోజ్ పాత్ర

2012 లో ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్’ వారిచే ప్రచురించబడిన ఒక పత్రికలో పేర్కొనబడినట్లుగా తీవ్ర వ్యాయామం తరువాత కండరాల పునఃనిర్మాణానికి ప్రోటీన్లు మరియు గ్లూకోజ్ రెండూ అవసరమవుతాయి. ప్రోటీన్ల సహాయంతో కండరాల నిర్మాణాన్ని పునఃనిర్మించడానికి గ్లూకోజ్ శక్తిని అందిస్తుంది.  అందువలన రోజూవారి వ్యాయామంలో కార్బోహైడ్రేట్లు అలాగే ప్రోటీన్లు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఆ పత్రికను అనుసరించి తీవ్ర వ్యాయామం తరువాత ఎంత త్వరగా మీరు గ్లూకోజ్ ను తీసుకున్నట్లయితే, అంత త్వరగా బలిష్టమైన కండరాల రూపకల్పనకు మీ కండరాల నిర్మాణం రిపేర్ ప్రక్రియకు లేదా పునఃనిర్మాణానికి ప్రారంభమవుతుందని కూడా కనుగొనబడింది.

ఏమి తినాలి?

ప్రజలు సాధారనంగా గ్లూకోజ్ ను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది మన శరీరానికి అవసరమయిన  గరిష్ట గ్లూకోజ్ ని అందించగలదో తెలియక చాలా తికమక పడుతూ ఉంటారు. గ్లూకోజ్ ను ఒక సహజ మూల పదార్ధముగా కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు వంటి  కొన్ని నిర్ధిష్ట ఆహార పదార్ధాలలో కనుగొనవచ్చు. ఈ ఆహార మూలాలలో పీచు పదార్ధాలు వాటిని నింపడానికి దోహదం చేస్తాయి. మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో లేదా చేసిన తరువాత అరటి పండుని లేదా ఇతర ఫలాలను కూడా తీసుకోవచ్చు.  వ్యాయామ సమయంలో వేగవంతమైన చర్య కోసం గ్లూకోజ్ పానీయాలను కూడా తీసుకోవచ్చు. స్పోర్ట్స్ జెల్ అనేది మరొక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఇవి గ్లూకోజ్ ను అందించడమే కాకుండా ఎన్నో క్యాలరీలను కూడా అందిస్తాయి.

మీకు ఎంత గ్లూకోజ్ అవసరం?

మీ శరీరాన్ని, కండరాలను సమర్ధవంతమైన స్థితిలో ఉంచాలంటే వ్యాయామానికి ముందు కనీసం రెండు భోజనాలు చేసి ఉండాలి. స్త్రీలు  ప్రతీ భోజనంలో 25 నుండి 35 గ్రాముల కర్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. అదే పురుషులు అయితే 35 నుండి 50 గ్రాములు ఉండేలా చూసుకోవాలి.  ఉదయకాలంలో తీసుకునే ఆహారం ఎక్కువ సమయం నిలిచి ఉండి నెమ్మదిగా శక్తిని విడుదల చేయడానికి తప్పనిసరిగా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది.  గ్లూకోజ్ మరియు తక్కువ మొత్తంలో కేలరీలను కలిగిన సాధారణ కార్బోహైడ్రేట్లను వ్యాయామానికి ఒక గంట ముందు తీసుకోవాలి. మీరు ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే శక్తిని కోల్పోతున్నప్పుడు తీసుకునే కేలరీలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.  సరైన కేలరీలను తీసుకోవడం వలన మీ బరువుని ప్రతీ రోజు కోరుకున్నట్లు తగ్గగలుగుతారు. మరో వైపు మీరు బరువు పెరగాలనుకున్నప్పుడు మీరు కరిగించిన కేలరీలను కంటే 30% నుండి 40% ఎక్కువ తీసుకోవాలి.