Posted on

Pulihora / puliyogare recipe in Telugu – పులిహోర / లెమన్ రైస్ రెసిపీ

మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ కొరకైనా లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత టైర్డ్ గా ఉంటే డిన్నర్ కైనా ఎంతో తొందరగా, తక్కువ పదార్థాలను ఉపయోగించి రుచికరమైన వంటను చేయాలనుకుంటున్నారా? అయితే ఈ లెమన్ రైస్ / పులిహోర రెసిపీని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు

  • అన్నం – ఉడికించిన బియ్యం
  • నూనె – 1/2 కప్పు
  • వేరు శనగలు – 1 కప్పు
  • తరిగిన అల్లం
  • తడ్కా – 2 టేబుల్ స్పూన్
  • నిమ్మ కాయలు – 2
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • కాజు
  • తరిగిన పచ్చి మిర్చులు – 3
  • రెడ్ చిల్లీలు
  • కరివేపాకులు
  • తురిమిన క్యారట్
  • కొత్తిమీర – 1/2 కప్పు

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ లో 1/2 కప్పు నూనె పోసి, అందులో 1 కప్పు వేరు శనగలను వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో తరిగిన అల్లం, కొన్ని కాజులూ, 2 టీ స్పూన్ తడ్కా వేసి బాగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత తరిగిన పచ్చి మిర్చులు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • తరువాత రెడ్ చిల్లీలు, 1 టీ స్పూన్ పసుపు పొడి, కొన్ని కరివేపాకులు వేసి దోరగా వేయించాలి.
  • ఇప్పుడు ఒక కప్పు అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  • నిమ్మరసంలో ఉప్పుని వేసి బాగా కలిపి ఆ నిమ్మరసాన్ని సిద్ధంగా ఉన్న అన్నంలో కలుపుకోవాలి.
  • ఆ తరువాత పొడిగా తరిగిన క్యారట్ మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ రైస్ / పులిహోర రెడీ!
Posted on

Amla murabba recipe in Telugu – ఆమ్లా మురబ్బా / ఉసిరి మురబ్బా రెసిపీ

ఉసిరికాయలు ఎంతో ఆరోగ్యకరమైన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాదు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.  దీనిని రాజస్థాన్ లో సాధారణంగా ‘మురబ్బాస్’ రూపంలో తింటారు. ఎంతో తియ్యగా మరియు పుల్లని రుచిగల ఉసిరి మురబ్బాలను సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • ఉసిరికాయలు
  • చక్కెర
  • ఏలకుల పొడి

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ప్యాన్ ని ఉంచి అందులో కొద్దిగా నీళ్లు పోసి, ఉసిరికాయలను నీటిలో వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
  • ఆ తరువాత నీటిని వడగట్టాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ ని ఉంచి అందులో ఈ ఉడికించిన ఉసిరికాయలు, ఒక కప్పు చక్కెర మరియు కొద్దిగా నీళ్లు పోసి చక్కెర బాగా కరిగే వరకు ఉడికించాలి.
  • ఆ తరువాత ఒక బౌల్ లోకి తీసుకొని ఏలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 లేదా 3 రోజులు ఫ్రీజర్ లో ఉంచి ఫ్రీజ్ చేస్తే ఎంతో రుచికరమైన తియ్యని ఉసిరి మురబ్బా తయారు!
Posted on

Dry arbi sabji recipe in Telugu – డ్రై ఆర్బీ సబ్జి / డ్రై చేమగడ్డ సబ్జి రెసిపీ

నోరూరించే వంటలలో చేమగడ్డ సబ్జి కూడా ఒకటి. దూర ప్రయాణాలప్పుడు కూడా దీనిని తయారు చేసి ప్యాక్ చేసి తీసుకెళ్లవచ్చు, ఎందుకంటే అంత తేలికగా పాచిపోవు, చాలా సమయం వరకు తాజాగా ఉంటుంది. మీరు దీనిని భోజనంలో గాని లేదా అల్పాహారంగా గాని చేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 2 టీ స్పూన్
  • ఇంగువ – 1/4 టీ స్పూన్
  • ఆవాలు – 1 టీ స్పూన్
  • తురిమిన అల్లం – 2 టీ స్పూన్
  • వినిగర్ – 1 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • మాంగో పౌడర్ – 2 టీ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా చేమగడ్డలను బాగా ఉడికించి తోలు తీయాలి.
  • లాంగ్ స్లైసెస్ గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె, 1/4 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ తురిమిన అల్లం వేసి 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఇపుడు అందులో 1 టీ స్పూన్ వినిగర్ వేసి కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి 2 నిమిషాల పాటు సన్నని మంటలో ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ మాంగో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇంకొన్ని నీళ్లు పోసి 3 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత కత్తిరించిన కొన్ని కొత్తిమీరను వేసి బాగా కలపాలి.
  • ముందుగా ఉడికించి ఉంచుకున్న చేమగడ్డలను కూడా అందులో వేసి బాగా కలుపుకుంటే వేడి వేడి రుచికరమైన ‘డ్రై చేమగడ్డ సబ్జి’ రెడీ!
Posted on

Non veg country chicken curry recipe in Telugu – కంట్రీ చికెన్ / నాటు కోడి కూర రెసిపీ

నాటు కోడి కూర ఎంతో రుచికరమైన కారమైన తెలుగువారి వంట. వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు. భోజనానికి మాత్రమే కాదు, దీనిని దోస, చపాతీ వంటి టిఫిన్ కి కూడా సైడ్ డిష్ గా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి ఘాటైన నాటు కోడి కూరను ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నాటు కోడి – 1/2 కిలో
  • గరం మసాలా – 3 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 6 టేబుల్ స్పూన్
  • పచ్చి మిర్చులు
  • ఉల్లిపాయలు – 5
  • లవంగాలు – 3
  • చింతపండు నీళ్లు
  • కొత్తిమీర
  • చికెన్ మసాలా – 2 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి – 3 టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లులి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 6 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 3 టేబుల్ స్పూన్
  • గసగసాలు – 1 టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క- 1/2 ముక్క

తయారీ విధానం

  • ముందుగా ఒక కుక్కర్లో 500 మిల్లీ లీటర్ల (1 కప్పు) నీళ్లు పోసుకొని, అందులో రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, 2 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని ఆ నీళ్లలో వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు అనగా 4 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి చికెన్ ని ఒక బోల్ లో, వడగట్టిన నీటిని వేరే బౌల్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలను మరియు గసగసాలను వేసి సన్నటి మంటలో దోరగా వేయించుకోవాలి.
  • ఈ స్పైసెస్ ని మిక్సీ లో వేసి పౌడర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత తరిగిన పచ్చి మిర్చులు, 5 లేదా 6 తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్‌ బ్రౌన్ రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత అందులో 3 టీ స్పూన్ ధనియాల పొడి, పొడి చేసి ఉంచుకున్న స్పైసెస్, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
  • 2 టీ స్పూన్ల గరం మాసాలా పొడి కూడా చేర్చి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత చింతపండు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ ని వేసి 2 నిమిషాలు వేయించి ఉడకబెట్టినప్పుడు ఉపయోగించిన నీటిని కూడా ఇందులో చేర్చుకోవాలి.
  • చివరిగా 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా మరియు కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికిస్తే వేడి వేడి నాటు కోడి కూర తయారు!
Posted on

Raw banana chips in Telugu – బనానా చిప్స్ రెసిపీ

బనానా చిప్స్ కేరళలో ఎంతో ఫేమస్. దీనిని నేంత్ర-కాయ ఓపెరి లేదా ఉప్పరీ అని పిలుస్తారు. కేరళలో వీటిని కొబ్బరి నూనెలో వేయించి తయారు చేస్తారు. అరటి పండు మరియు అరటి కాయ రెండింటినీ ఈ రకమైన చిప్స్ తయారీకి ఉపయోగిస్తారు. వీటితో సాల్ట్, మసాలా చిప్స్ లేదా బెల్లం చిప్స్ అని అనేక రకాలుగా చేస్తారు. మరి ఇప్పుడు సాల్ట్ బనానా చిప్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పసుపు పొడి – 1/2 టేబుల్ స్పూన్
  • అరటి కాయలు
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారీ విధానం

  • ముందుగా అరటి కాయలను మరియు ఒక బౌల్ లో 1 కప్పు నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఆ నీటిలో 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత అరటి కాయల తోలును తీసి, చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి ఆ నీటిలో వేసుకోవాలి.
  • అరటి కాయ స్లైసెస్ నీటిలో 10 నిమిషాలు నానిన తరువాత నీటిని వడగట్టి, ఒక క్లాత్ పై వేసి ఆరనివ్వాలి.
  • బాగా ఆరిన తరువాత స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి, డీప్ ఫ్రై కి కావల్సినంత నూనెని పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత అరటి కాయ స్లైసెస్ ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • గోల్డెన్‌ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫేవరెట్ బనానా చిప్స్ రెడీ!
Posted on

Chicken kabab recipe in Telugu – చికెన్ కబాబ్ రెసిపీ

రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ కొరకు చికెన్ కబాబ్ ని ట్రై చేయండి. ముఖ్యంగా చలికాలంలో నోరూరించే చికెన్ కబాబ్ ఎంతో తక్కువ ఇంగ్రిడియెంట్స్ తో తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • బోన్ లెస్ చికెన్ – 500 గ్రాములు లేదా 1 కప్పు
  • ధనియాల పొడి – 2 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 2 టీ స్పూన్
  • అల్లం వెలుల్లి పేస్ట్
  • నిమ్మరసం – 2 టీ స్పూన్
  • కార్న్ ఫ్లార్ – 1 కప్పు
  • మైదా – 1 కప్పు
  • పెరుగు – 1 కప్పు
  • గుడ్డు – 1

తయారీ విధానం

  • ముందుగా ఒక బౌల్ లో 1 కప్పు బోన్ లెస్ చికెన్ వేసుకొని అందులో 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్,  2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు కార్న్ ఫ్లార్, 1 కప్పు మైదా, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు ఊరనివ్వాలి.
  • గంట సేపు ఊరిన తరువాత అందులో 1 గుడ్డుని వేసుకొని బాగా కలుపుకొని మరో గంట సేపు ఊరనివ్వాలి.
  • ఇప్పుడు ప్యాన్ లో డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తరువాత ఊరబెట్టిన బోన్ లెస్ చికెన్ ని 20 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేస్తే వేడి వేడి చికెన్ కబాబ్ రెడీ!
Posted on

How to make Suji ka halwa in Telugu – సుజి కా హల్వా రెసిపీ

భారత దేశంలో ముఖ్యంగా పండుగ సమయాలలో సాంప్రదాయకంగా దేవునికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసుకునే తీపి పదార్థం ‘సుజి కా హల్వా’. దీనిని గోధుమ రవ (సెమోలినా) తో చేస్తారు కనుక ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. మరి ఎంతో సులువైన ఆరోగ్యకరమైన సుజి హల్వా ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నీళ్లు – 500 మిల్లీ లీటర్లు
  • పంచదార – 1 కప్పు
  • నెయ్యి – 1 కప్పు
  • సుజి/సెమోలినా – 2 కప్పులు
  • తరిగిన బాదాం
  • ఎండు ద్రాక్షలు/ కిస్‌మిస్
  • తరిగిన జీడిపప్పులు

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 500 మిల్లీ లీటర్ల నీళ్లు, 250 గ్రాములు లేదా 1 కప్పు పంచదార వేసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • ఈ చక్కెర పాగు చల్లారిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ లో 1 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తరువాత అందులో 2 కప్పుల సుజి ని వేసి దోరగా వేయించుకోవాలి.
  • సుజి గోల్డెన్‌ బ్రౌన్ రంగుకు వచ్చిన తరువాత అందులో తరిగిన బాదాం, కొన్ని కిస్‌మిస్, కొన్ని జీడిపప్పులు వేసి కలుపుతూ 2 నిమిషాలు దోరగా వేయించాలి.
  • ఇప్పుడు అందులో సిద్ధం చేసి ఉంచుకున్న చక్కెర పాగుని చేర్చుకొని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
  • దీన్ని బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్‌స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన ‘సుజి కా హల్వా’ రెడీ!
Posted on

Bengali sweet sandesh recipe in Telugu – సందేష్ బెంగాలీ స్వీట్ రెసిపీ

ఎంతో ప్రసిద్ధమైన సులభమైన బెంగాలీ స్వీట్స్ లో ‘సందేష్ బెంగాలీ స్వీట్’ కూడా ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైన తీపి పదార్థం. మధ్యయుగ బెంగాలీ సాహిత్యాలలో ముఖ్యంగా ‘క్రితిబాస్ రామాయణం’లో సందేష్ అనే తీపి వంటకం ప్రస్తావించబడిందని చెప్తున్నారు. మరి ఎంతో ప్రాచీనమైన రుచికరమైన ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు

  • పాలు – 1 లీటర్
  • నిమ్మరసం
  • కుంకుమ పువ్వు
  • షుగర్ పౌడర్ – 1 కప్పు
  • ఇలాచీ పౌడర్
  • పిస్తా

తయారీ విధానం

  • ఒక ప్యాన్ లో 1 లీటర్ పాలను పోసి మరిగించాలి.
  • పాలను గెట్టిగా చేసేందుకు నిమ్మకాయని పిండి కొంత నిమ్మరసాన్ని పాలలో చేర్చండి.
  • పాలు విరిగిన తరువాత ఒక శుభ్రమైన క్లాత్ తో నీటిని వడగట్టండి.
  • పాలలోని నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలిపి కుంకుమ పువ్వు, 1 కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో వేసుకొని 5 నిమిషాల పాటు దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి చిన్న చిన్న రౌండ్స్ చేసి వాటిపై పిస్తా తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తియ్యని సందేష్ బెంగాలీ స్వీట్ రెడీ!
Posted on

Watermelon milkshake recipe in Telugu – వాటర్ మెలాన్ మిల్క్ షేక్ రెసిపీ

ఎండా కాలం వేడిని తట్టుకొనే ఒక ఉత్తమ మార్గం ఫ్రూట్‌ జ్యూస్ మరియు చల్లని మిల్క్ షేక్స్ ని తాగటం. అందులోనూ వాటర్ మెలాన్ మనల్ని ఎంతో హైడ్రేటడ్ గా ఉంచుతుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఎంతో సులభమైన రుచికరమైన వాటర్ మెలాన్ మిల్క్ షేక్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • వెన్నిలా ఐస్ క్రీం -100 గ్రాములు
  • వాటర్ మెలాన్ – 1 కప్పు
  • పాలు – 1/4 కప్పు
  • ఐస్ క్యూబ్స్ – 2
  • పంచదార – 4 టీ స్పూన్
  • చక్కెర సాన్ఫ్

తయారీ విధానం

  • మిక్సీ జార్ లో 100 గ్రాముల వెన్నిలా ఐస్ క్రీం, 1 కప్పు చిన్నగా తరిగిన వాటర్ మిలాన్ ముక్కలు, 1/4 కప్పు పాలు, 2 ఐస్ క్యూబ్స్, ఆ తరువాత 4 టీ స్పూన్ పంచదార వేసి మిక్సీ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ ని ఒక గ్లాస్ లో పోసుకొని కొద్దిగా వెన్నిలా ఐస్ క్రీం ని చేర్చి, చక్కెర సాన్ఫ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో చల్లని, తియ్యని వాటర్ మెలోన్ మిల్క్ షేక్ తయారు!
Posted on

Rasmalai sweet recipe in Telugu – రసమలై రెసిపీ

ఏ పండుగ సమయంలోనైనా ఏ ప్రత్యేక సందర్బాలలోనైనా ప్రతి ఒక్కరూ ఇష్ట పడేది తీపి పదార్థాలనే. అందులోనూ పాలతో తయారు చేసే స్వీట్స్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధి చెంది ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో కూడా ప్రతి చోటా అందుబాటులో ఉండే స్వీట్ రసమలై. మరి ఈ స్వీట్ ని ఎంతో సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పాలు – 2 లీటర్లు
  • పంచదారా – 1 బౌల్
  • నిమ్మరసం
  • బాదాం
  • పిస్తా
  • ఏలక్కల పొడి – 1 టేబుల్ స్పూన్
  • జీడీ పప్పులు/ కాజు
  • నీళ్లు

తయారీ విధానం

  • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 లీటర్ పాలను పోసి, అందులో 1/2 కప్పు నిమ్మరసం వేసి బాగా వేడి చేస్తే పాలు విరిగిపోతుంది.
  • పాలు పూర్తిగా విగిరిన తరువాత నీటిని ఫిల్టర్ చేసేందుకు ఒక శుభ్రమైన క్లాత్ తో వడగట్టాలి.
  • విరిగిన పాలలో నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • చక్కెర కరిగిన తరువాత సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ రౌండ్స్ ని వేసి 5 నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి.
  • మరో ప్యాన్ లో 1 లీటర్ పాలు పోసుకొని సన్నటి మంటలో పాలను 30 నిమిషాల పాటు మరిగించాలి.
  • ఆ తరువాత పాలలో 1/2 కప్పు పంచదార, తరిగిన బాదాం, తరిగిన పిస్తా, తరిగిన కాజులు, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందే ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ ముక్కలను పాలలో వేసుకుంటే ఎంతో తియ్యని రుచికరమైన రసమలై రెడీ!