Posted on

Flax seeds in telugu – Health Benefits of flax seeds in telugu

Flaxseeds in Telugu

అవిసె గింజ‌ల‌తో ఎన్నో రకాల వంటకాలను మనం ప్రతి రోజు తయారు చేస్తూనే ఉంటాము. అవిసె గింజ‌ల‌ లడ్డు, అవిసె గింజ‌ల‌ పొడి, అవిసె గింజ‌ల‌ బర్ఫీ ఇంకా మరెన్నో… ఈ పదార్థాలు ఎంత రుచికరమో అంత ఆరోగ్యకరమైనవి కూడా.

ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం అవిసె గింజెలు. ఈ గింజలలో ప్రోటీన్, లిగ్నన్ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఆల్ఫా-లినోలెనిక్ ఉన్నాయి, దీనిని ALA లేదా ఒమేగా -3 అని కూడా పిలుస్తారు. ఈ గింజ‌లు జీర్ణ వ్యవస్థ మెరుగుదల, బ్లడ్ ప్రెషర్ తగ్గింపు, గుండె జబ్బులను నివారించడం వంటి ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది. 

అవిసె గింజ‌ల‌లోని న్యూట్రిషన్ మరియు వాటి యొక్క ఆరోగ్య  ప్రయోజనాల గురించి మరింత వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 

అవిసె గింజలలోని పోషకాలు:

ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలలో ఈ క్రింది పోషకాలు ఉంటాయి: 

 • కేలరీలు: 37
 • ప్రోటీన్: 1.3 గ్రాములు
 • కార్బ్స్ : 2 గ్రాములు
 • ఫైబర్: 1.9 గ్రాములు
 • మొత్తం కొవ్వు: 3 గ్రాములు
 • శాచురేటేడ్ కొవ్వు: 0.3 గ్రాములు
 • మోనోశాచురేటెడ్ కొవ్వు: 0.5 గ్రాములు
 • పాలీ-అన్‌-శాచురేటెడ్ కొవ్వు: 2.0 గ్రాములు
 • ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్: 1,597 మి.గ్రా
 • విటమిన్ బి 1: ఆర్డీఐలో 8%
 • విటమిన్ బి 6: ఆర్డీఐలో 2%
 • ఫోలేట్: ఆర్డీఐలో 2%
 • కాల్షియం: ఆర్డీఐలో 2%
 • ఐరన్ : ఆర్డీఐలో 2%
 • మెగ్నీషియం: ఆర్డీఐలో 7%
 • ఫాస్ఫరస్ : ఆర్డీఐలో 4%
 • పొటాషియం: ఆర్డీఐలో 2%

పై తెలిపిన విధంగా ఇందులోని ప్రధాన పోషకాలు “ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్”, “లిగ్నాన్ మరియు “ఫైబర్”.

ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్: మన శరీరంలో ఉత్పత్తి కాని అనగా మన శరీరం అదంతట అదే ఉత్పత్తి చేయలేని పోషకాలలో ఒకటి ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్. కనుక వీటి మోతాదు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన మోదాదులలో వీటిని పొందగలము.

అవిసె గింజలలోని ALAలు గుండె రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు డిపాజిట్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ధమనులలో మంటను తగ్గిస్తుంది మరియు కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది.

ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 

లిగ్నాన్ : లిగ్నాన్స్ లో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

ఫైబర్ : తగిన మోతాదులో ఫైబర్ ని తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ మృదువుగా మరియు నెమ్మదిగా జరుగుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రించబడతాయి.

అవిసె గింజలలోని ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of Flax seeds in Telugu)

గుండె జబ్బులు: ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో చనిపోతున్న వారి సంఖ్యలో ఎక్కువ శాతం గుండె జబ్బులే ప్రధాన కారణం. ఇందుకు మూల కారణం శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు.

అధిక మోతాదులలో కొలెస్ట్రాల్ హృదయ నరాలలో పేరుకుపోవడం వలన ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారంగా అవిసె గింజలను (ఫ్లాక్స్ సీడ్స్) తినమని నిపుణుల సలహా.

అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు గుండె నరాలలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది మరియు శోథ నిరోధక చర్య మరియు హృదయ స్పందనను సాధారణీకరించడం ద్వారా గుండె పోటు వంటి సమస్యలను నివారిస్తుంది.

అలసట :  అవిసె గింజలను ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవడం వలన అలసటనుంచి ఉపశమనం పొందవచ్చు. రోజంతా చేయు పనులకు కావల్సినంత శక్తి శరీరానికి అందుతుంది.

ప్రతిరోజు రాత్రి పూట ఒక చెంచా అవిసె గింజలను ఒక గ్లాసులో నానబెట్టి ఉదయం నీళ్లను వడగట్టి గింజలను తినడం వల్ల అలసట మాత్రమే కాదు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

 

క్యాన్సర్: అవిసె గింజలను క్రమంగా తినడం వలన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ (ముఖ్యంగా ఋతు క్రమం ఆగిపోయిన మహిళలలో) వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశీలనా అధ్యయనాలు చెబుతున్నాయి.

పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ముందే తెలిపినట్టు అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమ్యసలు ఉండవు.  

 

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

 • ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
 • రోగ నిరోధక శక్తిని పెంచడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
 • అవిసె గింజల్లో పలురకాల క్యాన్సర్‌లను తగ్గించే గుణాలున్నాయి. వెంట్రుకలు, చర్మ సమస్యలు కూడ దూరమవుతాయి.
 • అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు అవిసె గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
 • చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లుఅవిసె గింజలలో అత్యధికంగా ఉన్నందున, శాకాహారులు చేపలకు బదులుగా అవిసె గింజలను వారి ఆహారంలో చేర్చుకోవచ్చు.
 • అవిసె నూనె వాడితే ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
 • మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మోనోపాజ్ దశలోని మహిళల సమస్యలకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు.
 • ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
Posted on

Sabja Seeds in Telugu – Health Benefits of Basil seeds in telugu

sabja seeds in Telugu

సబ్జా గింజలు – శరీరానికి చలవే కాదు ఎంతో ఆరోగ్యం కూడా

వేసవి కాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రత గల వాతావరణంలో ప్రతి ఒక్కరి శరీరం కూడా వేడెక్కి ఎన్నో అసౌకర్యాలను ఎదుర్కుంటాము. ఎండలో బయటికి వెళ్లి వచ్చామంటే చాలు మాడు మాడిపోతుంది.

వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం అనేక రకాల పానీయాలు త్రాగుతూ ఉంటాము. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలని అనిపిస్తుంది.

అవి వేడినుండి తక్షణం ఉపశమనాన్ని అందించినా ఎంత వరకు ఆరోగ్యోకరమైనవి? అన్న ప్రశ్న మన మనసులో ఉంటూనే ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించకుండా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించ గల పానీయం ఏదైనా ఉందా అని అడిగితే అందుకు ఒక గొప్ప సమాధానం సబ్జా గింజల పానీయం.  

సబ్జా గింజలు అంటే మరేంటో కాదండి “తులసి విత్తనాలు”. ఇటీవల కాలంలో వీటి ప్రాముఖ్యత తెలియకుండా పోయిందే కానీ ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానపెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. మరి ఈ సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం.

పానీయం తయారీ విధానం: 

గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్లు, బెడ్లు ఉంటే ఏరేయాలి. మంచి నీళ్లతో వాటిని చాలా సార్లు శుభ్రం చేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి.

నీటిలో నానిన నల్లని గింజలు కొంత జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని కొంత పంచదార వేసుకొని త్రాగండి. ఈ నీళ్లు ఎంతో రుచికరంగా ఉంటుంది.

సబ్జా గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వంటి వ్యాధులకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

మలబద్ధకం మరియు ఉబ్బరం నుండి ఉపశమనం : సబ్జా గింజల్లో పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య తొలగిపితుంది మరియు మృదువైన ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

జీర్ణ వ్యవస్థలోని ప్రేగులలోని వాయువు నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడే వోలటైల్ నూనెలు ఈ గింజలో ఉంటాయి. అంతే కాదు, శరీరంలోని వ్యర్థాలు (టాక్సిన్స్) కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

బరువు తగ్గడానికి మంచి ఔషధం : ఊబకాయంతో బాధపడే ఎంతో మందికి సబ్జా గింజల పానీయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.

మధుమేహం నుంచి ఉపశమనం : చక్కెర వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చి పాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రించబడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టు కోసం : సబ్జా విత్తనాలను కొబ్బరి నూనెలో చూర్ణం చేసి ప్రభావిత ప్రాంతాలపై పూయడం ద్వారా తామర మరియు సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. విత్తనాలను నానబెట్టకుండా, చూర్ణం చేసి ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి కొన్ని క్షణాలు వేడి చేసి ఉపయోగించాలి.

తులసి విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం కొల్లాజెన్‌ను స్రవిస్తుంది. ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో ఐరన్, విటమిన్ కె మరియు ప్రోటీన్ ఉన్నాయి.

పొడవాటి మరియు బలమైన జుట్టుకు ఈ ఖనిజాలు ఎంతో అవసరం. ప్రోటీన్ మరియు ఐరన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు వాల్యూమ్‌ను పెంచుతుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

 • తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే ఎంతో మంచిది. రెగ్యులర్ గా త్రాగడం వలన శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
 • వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
 • గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
 • గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే ఎంతో మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు.
 • సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి కనుక ఈ పానీయం తాగితే మహిళలకు ఎంతగానో అవసరమైన ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి.
 • సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.
 • ఈ గింజలు దగ్గును నియంత్రించడంలో సహాయపడతుంది. ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులోని వైసెనిన్, ఓరింటిన్ మరియు బీటా కెరోటిన్ వంటి ఫ్లవనాయిడ్లు శరీరం యొక్క రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి.

గమనిక : పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు సబ్జా విత్తనాలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ విత్తనాలను నీటితో బాగా కలపకపోతే చిన్నపిల్లలు వాటిని త్రాగే సమయంలో గొంతులో అడ్డుపడి వారిని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.

గర్భిణీ స్త్రీల విషయంలో, ఈ విత్తనాలు శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయులను తగ్గిస్తాయి. కనుక గర్భిణీ స్త్రీలు లేదా ఇతర రోగాలతో బాధపడే వారు మీ ఆహారంలో సబ్జా విత్తనాలను చేర్చుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Posted on

Spirulina in Telugu – Spirulina Benefits – స్పిరులినా

స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క. దీనిని భూమిపై మొక్కల ఆవిర్భావానికి తొలి రూపంగా భావిస్తారు. ఆది మానవుల యొక్క ఆహారంలో ఇది ఒక భాగంగా ఉండేది. చారిత్రకంగా వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ఈ నాచు మొక్క ఇప్పటికీ ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది.

ఇప్పటికీ అనేక దేశాల ప్రజలు వారి ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకుంటున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు వారికి అవసరమయ్యే పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డాలు.

స్పిరులినా అనేక రకాల ప్రజలకు ఎంటువంటి దుష్ప్రభావాలనూ చూపకుండా మంచి ఫలితాలను అందించే నీటి మొక్క. ఈ మొక్క యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి, నిత్యం కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇతర ఏ పోషకాహారం తీసుకోవాల్సిన పనిలేదు. తల్లి పాలలో ఉన్న పోషకాలు కూడా ఈ మొక్కలో ఉంటాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని తల్లి పాల తర్వాత అత్యంత పోషకాలు కలిగిన ఆహారంగా 1975లోనే తేల్చి చెప్పింది.

ఈ మొక్క యొక్క ఉత్పత్తి మన దేశంలోనే చాలా ఎక్కువ. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దీని గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ నీటి ముక్క గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం

స్పిరులినా పోషకాల వివరాలు:

ఒకే టేబుల్ స్పూన్ (7 గ్రాములు) ఎండిన స్పిరులినా పొడిలో గల పోషకాల వివరాలు:

 • ప్రోటీన్: 4 గ్రాములు
 • విటమిన్ బి 1 (థియామిన్): ఆర్‌డిఎలో 11%
 • విటమిన్ బి 2 (రిబోఫ్లేవిన్): ఆర్‌డిఎలో 15%
 • విటమిన్ బి 3 (నియాసిన్): ఆర్‌డిఎలో 4%
 • రాగి : RDA లో 21%
 • ఐరన్ : RDA లో 11%
 • కార్బోహైడ్రేట్ : 1.67 గ్రాములు
 • అదనంగా కేలరీలు: 20 మరియు డైజెస్టిబుల్ కార్బ్స్ : 1.7 గ్రాములు

ఇది మంచి మొత్తంలో మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ మరియు మీకు అవసరమైన ప్రతి ఇతర పోషకాల యొక్క చిన్న మొత్తాలను కలిగి ఉంటుంది.

 • కొవ్వు : 0.54 గ్రాముల
 • కాల్షియం : 8 మిల్లీ గ్రాములు (స్పిరులినా పొడిలో కాల్షియం సాధారణ పాలలో కన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి.)
 • మెగ్నీషియం : 14 మిల్లీ గ్రాములు
 • ఫాస్పరస్ : 8 మిల్లీ గ్రాములు
 • పొటాషియం : 95 మిల్లీ గ్రాములు
 • సోడియం : 73 మిల్లీ గ్రాములు
 • విటమిన్ సి  : 0.7 మిల్లీ గ్రాములు

స్పిరులినాలోని ప్రోటీన్ యొక్క నాణ్యత అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని గుడ్లతో పోల్చవచ్చు. ఇది మీకు అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది.

ఇందులో ఫోలేట్ కూడా ఉంటుంది.

కనుకఈ భూ గ్రహంలో అత్యంత పోషకాలతో కూడిన ఆహారం స్పిరులినా అని చెప్పవచ్చు.  

స్పిరులినా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of  Spirulina in Telugu):

 • దేహ నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు, కొత్త కణాల ఉత్పత్తికి ప్రోటీన్లు ఎంతో అవసరం. స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల్లోకెల్లా అధికంగా ప్రోటీన్లు కలిగి ఉన్నది ఇదే. శాకాహారులు ఈ పొడిని తీసుకుంటే వారికి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
 • పిల్లల పెరుగుదలకు అవసరమయ్యే అమైనో ఆమ్లాలు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉన్నందున రక్తాన్ని శుభ్రపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది.
 • పలు రకాల క్యాన్సర్లు దూరం చేసి, నరాల బలహీనతను పోగొడుతుంది. 
 • కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. మధుమేహులకు మేలు చేస్తుంది. 
 • రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
 • రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
 • రక్తపోటును తగ్గిస్తుంది.
 • గుండె సంబంధ వ్యాధులను, వాపులు, నొప్పులను నివారిస్తుంది. అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయుల వల్ల కలుగు గుండె జబ్బులను నివారిస్తుంది.
 • జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. 
 • శరీరంలోని హార్మోన్ల పనితీరును సక్రమంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 • అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి ఔషధంగా పనిచేస్తుంది. 
 • శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపుతుంది.
 • స్పిరులినా తీసుకోవడం వలన జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 • క్యారెట్ కన్నా 2800 శాతం ఎక్కువ బీటా కెరోటీన్, పాలకూరలో కన్నా 3900 శాతం ఎక్కువ ఐరన్, బ్లూబెర్రీలలో కన్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి. కనుక మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన ఆహారం ఇది
 • కలుషితమైన నీరు త్రాగడం లేదా ఇతర కాలుష్యాల వలన శరీరంలో ఏర్పడు టాక్సిన్స్ ని నిరోధించగల లక్షణాలు స్పిరులినాలో ఉన్నాయి.
 • నిరాశ మరియు ఆందోళన వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులలో సెరోటోనిన్ స్థాయి తక్కువగా ఉండవచ్చు. స్పిరులినా ట్రిప్టోఫాన్ యొక్క మూలం. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 • అలెర్జీ లక్షణాలను తగ్గించడం : ఒక వ్యక్తికి పుప్పొడి, దుమ్ము లేదా పెంపుడు జంతువులు అంటే అలెర్జీ ఉన్నప్పుడు, వారి ముక్కు లోపలి భాగం ఉబ్బుతుంది. ఈ ప్రతిచర్యను అలెర్జీ రినిటిస్ అని అంటారు. ఈ పరిస్థితి యొక్క లక్షణాలను మెరుగుపరచడానికి స్పిరులినా సహాయపడుతుందని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ఇది క్రింద తెలిపిన అలెర్జీ రినిటిస్ లక్షణాలను తగ్గిస్తుంది:

 • చలితో చీము కారుతున్న ముక్కు
 • తుమ్ము
 • ముక్కు దిబ్బడ మరియు
 • దురద
Posted on

Best Smartphones / Mobiles in Rs.10000/- in Telugu

Mobiles Below 10000 in Telugu

ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు.

అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాల మందిలో ఉంటుంది.. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్ అయినా అయ్యో అనాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో మార్కెట్లో మంచి ఫీచర్లతో ఈ మధ్య విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 10,000లోపు ధ‌ర‌లో ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవి … త‌క్కువ బ‌డ్జెట్.. ఇదీ మొబైల్ కొనాల‌నుకునే వారికి ముఖ్యమయిన ప్రాధాన్యం. అందుకు త‌గ్గ‌ట్టుగానే బ‌డ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ల‌పై అనేక ఆఫర్లు మరియు ప్రచారాలు జోరుగా సాగుతూనే ఉంటాయి….

అయితే తక్కువ ధర ఇంకా మంచి ఫీచర్స్ తో  లభించే స్మార్ట్ ఫోన్ లు కొనాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఒక్కసారి చూసి తీరాల్సిందే అంటున్నారు స్మార్ట్ ఫోన్ లవర్స్.రూ.10,000లోపు టాప్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు …మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు  ఎప్పటికప్పుడు పోటీపడుతూ మరీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.

వీటిల్లో ఎక్కువ బడ్జెట్ కేటగిరికి సంబంధించినవి. వాటిలో రూ.10,000 విభాగం చాలా కీలకమైనది. ఎందుకంటే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా కేవలం ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారు కూడా ఈ విభాగంలో ఫోన్ల వైపే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఏ ఫోన్ ఎంచుకోవాలి అనే గందరగోళం కూడా ఉంటుంది.

స్మార్ట్ ఫోన్.. ఇది లేకుండా  ప్రస్తుతం మనుషులు లేరిప్పుడు.. ప్రతి అవసరానికి సెల్ ఫోన్ ముడిపడి ఉంది. ప్రస్తుత తరుణంలో.. అందుకే వీలైనంత స్మార్ట్ గా ఉండే ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా  చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.

కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగానే మంచి ఫీచర్లతో సెల్ ఫోన్ కంపెనీలు ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో ఎక్కువ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. బిగ్ బిలియన్ డేస్, అమేజాన్ ఇండియన్ సేల్స్ లాంటి సేల్స్ ద్వారా ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.

ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువమంది రూ.10,000 లోపు కొన్న ఫోన్ ఏమిటో తెలుసుకుందామా..ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేలలోపు  ఫోన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

అందుకే రూ.10 వేల లోపు అదిరిపోయే ఫీచర్లున్న ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం..శాంసంగ్, షావోమి, రియల్‌మి కంపెనీలు ఇటీవల కాలంలో అందరికి అందుబాటు ధరలో చాలా  స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

కానీ మంచి ఫీచర్స్ మరియు 10,000లోపు బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్లు బెటరో  ఇప్పుడు చూద్దాం..

షియోమీ రెడ్ మీ 7

దీని ధర రూ. 7,499గా ఉంది. షియోమీ రెడ్ మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5
మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్ బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్ మీ నోట్ 8

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి తాజాగా లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొబైళ్లలో ధరకు తగిన విలువను అందించే మొబైల్స్ లో ఈ ఫోన్ కూడా కచ్చితంగా ఉంటుంది. ఇందులో 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను ఇందులో అందించారు.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు నాలుగు కెమెరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది 28W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ 5

ఈ స్మార్ట్ ఫోన్  ప్రారంభ ధర రూ.9,990గా ఉంది. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

వివో యూ10

ఈ ఫోన్ ధర రూ.8,990 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.35 అంగుళాల హాలో ఫుల్ వ్యూ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు.

వెనకవైపు కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ 3 ప్రో

ఈ ఫోన్ ధర ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 AIE ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,045 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 20W VOOC 3.0 ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

మోటోరోలా వన్ మాక్రో

ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.2 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. హీలియో పీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

రెడ్ మీ 8

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. రెడ్ మీ 8లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆరా మిర్రర్ డిజైన్ ను ఇందులో అందించారు. 6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇందులో డ్యూయల్ కెమెరా ఫీచర్ ఉంది. 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ రెడ్ మీ 8లో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం30

ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. ఎక్సోనిస్ 7904 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది.

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది.

ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.మన అవసరానికి మరియు మన ఇష్టానికి తగట్టు ఎంచు కొనేందుకు ప్రస్తుతం పలు ఫోన్లు మరియు వాటి ఫీచర్స్ అన్ని తెలిపారు ఆయా సంస్థ వారు.కాబ్బటి ఎవరికీ ఇటువంటివి నచ్చుతాయో చూసుకొని,ఎంచుకునేందుకు మరింత సులభంగా వివరణ ఇచ్చారు.కేవలం పదివేలు పెడితే చాలు, బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్  ఫోన్స్ మీ సొంతం.

Posted on

Samsung Galaxy a70 review in Telugu

Samsung Galaxy A70 in Telugu

శుక్రవారం నాడు మార్కెట్లోకి  కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ అమ్మకాలు సెప్టెంబర్28  నుండి  ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సైట్లు మరియు  ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్  అందరికి అందుబాటులోకి రానుంది. మరి దీని ధర ఎంత.. దీనిపై ఉన్న ఆఫర్లేంటి?  ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ..చాలానే ఉన్నాయని చెప్పచు.

ప్రముఖ ఫోన్ దిగజాలలో ఒక్కటయిన శాంసంగ్ నుంచి  మరో కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ ఇప్పుడు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు శనివారం నుంచి మొదలు కానున్నాయి.

ఈ ఫోన్ శుక్రవారం నాడు లాంచ్ అయింది. ఈ సంవత్సరమే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ70కి తర్వాత అడ్వాన్స్డ్  వెర్షన్ గా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకువచ్చింది.ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ధరను రూ.28,999గా నిర్ణయించారు.

ఇందులోనే మరో వేరియంట్  8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.30,999గా ఉంది. ఈ రెండు వేరియంట్లూ అన్ని ప్రముఖ వెబ్ సైట్లు, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్, శాంసంగ్ ఒపేరా హౌస్ ల్లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్స్ ప్రిసమ్ క్రష్ రెడ్, ప్రిసమ్ క్రష్ బ్లాక్,మరియు  ప్రిసమ్ క్రష్ వైట్ రంగుల్లో  లభించనుంది అని తెలిపారు శాంసంగ్ సంస్థ వారు.

వీటితో పటు పలు ఆఫర్లు కూడా వారు ప్రకటించారు.శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ మొబైల్ ను కొన్న జియో సబ్ స్క్రైబర్లు రూ.198, రూ.299 రీచార్జ్ లపై రెట్టింపు డేటాను పొందుతారు. అత్యధికంగా 12 రీచార్జిల వరకు ఈ  రెట్టింపు డేటా వస్తుంది. అలాగే ఎయిర్ టెల్ సబ్ స్క్రైబర్లు  అయితే రూ.249, రూ.349 రీచార్జ్ లపై రెట్టింపు డేటా పొందుతారు.

వీరికి కూడా 12 రీచార్జిల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వొడాఫోన్, ఐడియా సబ్ స్క్రైబర్లకు రెట్టింపు డేటా లభించదు,కానీ మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ల ద్వారా రూ.255 రీచార్జ్ చేస్తే రూ.75 క్యాష్ బ్యాక్ వస్తుంది. అత్యధికంగా 50 రీచార్జ్ ల వరకు ఈ ఆఫర్ లభించనుంది.

ఈ ఫోన్  అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా తయారు చేసారు  శాంసంగ్ సంస్థ వారు.6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అంటే 1080×2400 పిక్సెల్స్ కలిగి ఉంటుంది. సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ ను వీటికి అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దాని అపెర్చర్ f/1.8గా ఉంది. 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా 32 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరా ఇచ్చారు. దీని అపెర్చర్ f/2.0గా ఉంది.మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉన్న ఈ వేరియంట్ ఫోన్స్ ముఖ్యంగా కెమెరా ప్రియులుని ఆకట్టుకొనున్నాయి.

ఇక అతి ముఖ్యమయిన బ్యాటరీ విషయం లోకి వస్తే,ఇందులో 4,500 mAh సామర్థ్యమున్న బ్యాటరీని అమర్చారు.ఇది 25W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో అందించిన ఇంటర్నల్ స్టోరేజే కాకుండా మైక్రో ఎస్ డీ కార్డు స్లట్ ద్వారా అదనంగా 512 జీబీ వరకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు.

అంతేకాకుండా ఈ ఫోన్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారిత వన్ యూజర్ ఇంటర్ ఫేస్ పై పనిచేయనుంది. తాజా లాంచ్ కాబట్టి త్వరలో దీనికి కూడా ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ లభించే అవకాశాలున్నాయి.

ఈ ఫోన్ లో 1.8 గిగాహెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ ను అందించారు. 12 జీబీ ర్యామ్ కాగా, 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ప్రత్యేకంగా మెమొరీ కార్డు వేసుకోవడానికి మైక్రో ఎస్ డీ స్లాట్ ను అందించలేదు. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కార్డు సౌకర్యం కూడా ఇందులో ఉంది.

ఇంకా ఈ ఫోన్లో  మరిన్ని ఫీచర్స్ కలిగి ఉన్నాయి.యాక్సెలరో మీటర్,యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, కంపాస్ మీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.

ఈ ఫోన్ 15.44 సెంటీమీటర్ల పొడవు, 7.23 సెంటీమీటర్ల వెడల్పు,ఇంకా 1.04 సెంటీమీటర్ల మందం ఉండనుంది. బరువు 241 గ్రాములుగా ఉండి చాలా స్టైలిష్ గా కనువిందు చేయనుంది

Posted on

Telugu tips for Sugar / Diabetes

Diabetes in Telugu

షుగర్ వస్తే పోదు. మనం ఆహారంలో మార్పులు – చేర్పులూ చేయడం ద్వారా షుగర్‌ను కంట్రోల్ చెయ్యగలం. మరింత ఎక్కువ అవ్వకుండా చెయ్యగలం. అదెలాగో తెలుసుకుందాం.

ప్రపంచ దేశాలన్నీ… షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నాయి. మనం ఏం తిన్నా… దాని లోని షుగర్ (గ్లూకోజ్ లేదా పిండిపదార్థం)… బ్లడ్ లో కలుస్తుంది. ఐతే… బ్లడ్ లో షుగర్ ఎక్కువ అయితే … ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ అనేది మన బాడీని, బ్లడ్‌నీ కంట్రోల్ చేస్తుంది.

సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే… బీపీ వచ్చి… హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓవరాల్‌గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేసుకోవడం, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వకుండా చూసుకోవడం… షుగర్ ఉన్నవారి టార్గెట్ అనుకోవచ్చు.

కొన్ని రకాల ఆహారాలు… బ్లడ్ లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలు కూడా షుగర్‌ను అదుపులో ఉంచుతాయి. దానివల్ల అవేంటో తెలుసుకుందాం.

పసుపు, కాకరకాయ, ఉసిరి : ఇవి మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. బర్ బెర్రీస్, పసుపు బాగా పనిచేస్తాయి. పసుపు, ఉసిరి, కాకర కాయ… వీటిని వేటితో కలిపి తీసుకున్నా… షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. సింపుల్‌గా ఇలా చెయ్యండి.

ఓ ఉసిరికాయ గుజ్జు, చిటికెడు పసుపును ముద్దగా చేసి మింగేయండి. ఇది చక్కగా పనిచేస్తుందని డాక్టర్ నిషా మణికాంతన్ తెలిపారు.

మామిడి ఆకులు (Mango Leaves) : ఇవి కూడా బాగా పనిచేస్తాయి. మామిడి ఆకుల రసానికి… ఆల్ఫా గ్లోకోసిడేస్ అనే ఎంజైమ్‌ని నిరోధించే శక్తి ఉంది. దానివల్ల మామిడి ఆకుల రసం తాగితే… బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇందుకు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

దాల్చిన చెక్క (Cinnamon) : పసుపు తర్వాత దాదాపు అదే స్థాయిలో పనిచేసే సుగంధ ద్రవ్యం దాల్చిన చెక్క. షుగర్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాల్చిన చెక్కకు ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసే శక్తి ఉంది. అంటే తక్కువ ఇన్సులిన్ ఉంటే… దాన్ని పెరిగేలా చెయ్యగలదు.

ఎక్కువ ఉంటే తగ్గించగలదు. దాల్చిన చెక్కను ఏ మోతాదులో తీసుకోవాలో నిర్ణయించుకునేందుకు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిదే.

అవిసె గింజలు (Flaxseeds) : ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైన అవిసె గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దానివల్ల ఇవి షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

మెంతులు (Fenugreek) : మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయ పడతాయి. దీని మీద జరిగిన పరిశోధనల్లో ఈ సంగతి తెలిసింది .

షుగర్ ఉన్నవారు… పంచదారతో చేసిన తీపి జోలికి వెళ్లకపోవడం మేలు. ఒకవేళ తీపి పదార్థ్దాలు తినాలని ఉంటే … పండ్లతో చేసినవే తినడం మంచిది. అది కూడా కొద్దికొద్దిగానే. కాఫీ, టీ పంచదార బదులు హనీ వేసుకోవచ్చు. హనీ షుగర్ ఉన్నవారికి హాని చెయ్యదు.

పండ్లు తినవచ్చా : షుగర్ ఉన్నవారికి కొన్ని రకాల పళ్ళు మంచి చేస్తాయి. బెర్రీస్, దానిమ్మలు, ఉసిరి వంటివి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తాయి. రోజుకో యాపిల్ పండు తినవచ్చు.

ఫ్రూట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జి . ఐ) తక్కువగా ఉండేవి షుగర్ పేషెంట్లకు హాని చెయ్యవు. ఏం తినాలి, ఏం తినకూడదు… అని పదే పదే ఆలోచించుకుంటూ ఉంటే… అదో రకమైన ఒత్తిడిగా మారుతుంది. దానివల్ల షుగర్ పేషెంట్లు తీపిగా ఉండేవి ఏవి తిన్నా… చిన్న మొత్తంలో తింటే పర్వాలేదంటున్నారు వైద్యులు.

కాకరకాయ రసం, నేరేడు పండు రసం కలిపి తాగొచ్చు. ఇలాంటి ప్రయోగాల వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండటమే కాకుండా… ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు వీలవుతుందంటున్నారు డాక్టర్లు.

Posted on

ఇలా చేస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం – Telugu tips for Teeth Pain

పళ్ళు మరియు దవడల చుట్టూ ఉన్న నొప్పిని పంటి నొప్పి అంటారు. దంతక్షయం, ఇన్ఫెక్షన్, దంతాలు వదులుగా మారడం, విరగడం లేదా చిగుళ్ళవాపు పంటినొప్పికి గల ప్రధాన కారణాలు. 2 రోజులకు మించి పంటినొప్పితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టర్ ని కలవాల్సిందే ..

మన ఇంట్లో ఉన్న వస్తువులతో సహజంగానే ఈ పంటినొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ :

కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ దంత నొప్పిని తగ్గిస్తుందని చెప్తారు . ముఖ్యంగా పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుర్ల వాపు ఉన్నపుడు ఈ టిప్ బాగా పనిచేస్తుంది.

ఐస్ ప్యాక్ లేదా ఫ్రిజ్‌లో చల్లబరిచిన బఠానీల ప్యాక్ ని వాడి కోల్డ్ కంప్రెస్ ట్రై చెయ్యొచ్చు . చెక్కిళ్ళకు బయట భాగాన పన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో కొంత సమయం అలా అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఈ చికిత్సను ప్రయత్నించటం ద్వారా, ఇది రక్త నాళాలను నిర్బంధిస్తుంది, నెమ్మదిగా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా నొప్పిని , వాపుని మరియు మంటని తగ్గించడానికి సహాయం చేస్తుంది .

2. సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం (మౌత్ వాష్) :

వేడి సాల్ట్ వాటర్ తో నోరు శుభ్రం చేసుకోవటం ద్వారా, దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది . సాల్ట్ వాటర్ వాపును తగ్గించడమే కాక, వైద్యాన్ని సులభతరం చేస్తుంది. సాల్ట్ వాటర్ టిప్ గొంతు నొప్పి నుండి కూడా రిలీఫ్ కలిగిస్తుందని మనకు తెలుసు.

1 టీస్పూన్ సాల్ట్ ని 1 గ్లాసు వెచ్చని నీటిలో కరిగించి , ఉమ్మటానికి ముందు 1 నిమిషం పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి. ఈ ప్రక్రియను అవసరమైనంతమేర పునరావృతం చేయండి.

3. నొప్పి నివారణ మందులు :

ఎసిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి. అయితే, 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. అదేవిధంగా వైద్యుని సూచనల మేరకే అనుసరించడం ఉత్తమం.

4. గార్లిక్ / వెల్లుల్లి / చిన్నుల్లి :

వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్ధం. వెల్లుల్లి, అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.

మొదటగా, తాజా గార్లిక్ రెబ్బలను చూర్ణం చేసి, ఆపై కొద్దిగా సాల్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. కాసేపటికే మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు .

5. పుదీనా Tea :

లవంగాల లాగానే, పుదీనాకు కూడా పంటి బాధ నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్, ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ఒక టీస్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, కాస్త చల్లబడిన తరువాత, వాటితో పుక్కిలించొచ్చు. లేదా టీ లా తాగేసేయొచ్చు. తడి టీ-బ్యాగ్ ను కూడా నొప్పి తగ్గే వరకూ నొప్పి ఉన్న భాగంలో అదిమిపెట్టుకోవచ్చు..

ఒక కాటన్-బాల్ మీద కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె వేసి, తాత్కాలిక నివారణిగా ప్రభావిత పంటిమీద ఉంచాలి. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.

6. థైమ్ :

థైమ్ దాని ఔషధ ప్రయోజనాల పరంగా ప్రసిద్ది చెందిన మొక్కగా అందరికీ సుపరిచితం. అంతేకాకుండా కోరింతదగ్గు, ధనుర్వాతం వంటి ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన నివారణగా చెప్పబడుతుంది కూడా. ఈ థైమ్ ఎసెన్షియల్ నూనెలో ప్రధానంగా ఉండే థైమోల్, క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఒక చుక్క థైమ్ ఎసెన్షియల్ నూనెను ఒక గ్లాసు నీటిలో కలిపి మౌత్ వాష్ చేయడానికి వినియోగించవచ్చు.

మరో పద్ధతి ఏమిటంటే, కొన్ని చుక్కల థైమ్ ఎసెన్షియల్ నూనె, మరియు నీళ్ళను ఒక కాటన్-బాల్ పై చల్లుకుని, నొప్పిగా ఉన్న పంటి అపసవ్య దిశలో అదిమినట్లుగా ఉంచండి. తక్కువ సమయంలోనే మంచి ఉపశమనం ఉంటుంది.

7. అలోవెరా :

అలోవెరా గుజ్జు(జెల్ వంటి పదార్ధం), కాలిన గాయాలు మరియు చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది. కొంతమంది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా అలోవెరా జెల్‌ని వాడతారు.

అలోవెరాలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, దంత క్షయం కలిగించే బాక్టీరియాను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అలోవెరా జెల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి.

8. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రం చేయడం :

సమర్థవంతమైన యాంటీ బాక్టీరియల్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో పుక్కిలించడం (మౌత్ వాష్) ఎంతో ఉత్తమం. ముఖ్యంగా పంటి నొప్పి ఇన్ఫెక్షన్ కారణంగా వస్తే ఆ సమస్య మొత్తం తీరిపోతుంది. అయితే, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని మింగకూడదు. దీని వల్ల నష్టాలుంటాయి. కాబట్టి, పుక్కిలించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్  తీసుకుని, దీనికి సమానంగా నీటిని కలిపి 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి పుక్కిలించాలి. దాన్ని ఉమ్మిన తరువాత, నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.  చిన్నపిల్లలకు మాత్రం ముఖ్యంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిట్కా వాడొద్దు.

9. లవంగాలు :

లవంగాలు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందిన మసాలా దినుసులు. వాటిలో సహజసిద్దమైన మత్తు మందుగా పనిచేసే యూజీనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.

లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలు మరియు చిగుళ్ళ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి.

లవంగాల నూనెలో ఒక చిన్న కాటన్- బాల్ ని నానబెట్టి, ప్రభావితమైన దంతాల భాగంలో ఉంచడం ద్వారా ఉపశమనం పొందొచ్చు.

లవంగాలను నొప్పి ఉన్న భాగంలో పెట్టి.. ఆ రసాన్ని మింగుతూ ఉండండి.. ఇలా రోజూ 30 నిమిషాలు చేయండి..

దంతవైద్యుడిని ఎప్పుడు సంప్రదించవలసి ఉంటుంది :

ఈ గృహ చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమేనని గుర్తుంచుకోండి. పంటి నొప్పి ఒకటి లేదా రెండు రోజులకు మించి ఉంటే డెంటల్ డాక్టర్‌ని కవలవడం తప్పనిసరి.

పంటి నొప్పికి త్వరితగతిన చికిత్స చేయని ఎడల, ఇది చిగుళ్ళ వ్యాధి, కణితి లేదా వాపు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. దంతాల దగ్గర కణితిగా ఏర్పడితే, అది బాక్టీరియాతో కూడిన చీమును కలిగి ఉంటుంది.

జాగ్రత్తలు :

పంటి నొప్పి మరియు దంతాల వద్ద కణుతులు లేదా గడ్డలను నివారించడానికి ఉత్తమ మార్గం, పళ్ళు మరియు చిగుళ్ళను వీలైనంత ఆరోగ్యంగా ఉంచడం. క్రమంగా కింది దశలను అనుసరించడం ద్వారా, అది సాధ్యపడుతుంది :

• ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు, కనీసం 2 నిమిషాలపాటు పళ్ళు తోముకోవడం
• చక్కెర ఆహారాలు, పానీయాలను తగ్గించడం
• దంతాల మధ్య మరియు “గమ్ లైన్” కింద శుభ్రం చేయడానికి క్రమం తప్పకుండా “ఇంటర్‌డెంటల్” బ్రష్‌ను ఉపయోగించడం
• ధూమపానం ఆరోగ్యానికే కాదు దంతాలకు కూడా హానికరం, ఎందుకంటే ఇది దంత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది
• క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం.

ముందుగా చెప్పినట్లుగా, రెండు రోజుల కన్నా ఎక్కువ కాలం పంటి నొప్పి ఉంటే, వారు ఖచ్చితంగా సలహా, చికిత్స కోసం వారి డెంటల్ డాక్టర్‌ని సంప్రదించాలి.

Posted on

Fairness tips for men in Telugu – పురుషుల కోసం ఫెయిర్నెస్ టిప్స్ – ఫెయిర్ స్కిన్ పొందటం ఎలా?

ఈ రోజుల్లో మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా వారి లుక్స్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొసైటీలో వారు అన్ని విధాలుగా మర్యాదస్తులుగా కనిపించాలని అనుకుంటారు.  ఖచ్చితమైన లుక్స్ ని పొందటానికి చర్మం యొక్క రంగు కూడా ఒక ముఖ్యమైన అంశం. మార్కెట్లో అనేక ఫెయిర్నెస్ క్రీములు మరియు లోషన్లు అందుబాటులో ఉన్నాయి కానీ అవి మీ చర్మానికి మంచిది కాదు.

మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించటం ఆపాలి మరియు ఇంటి నివారణ పద్దతులను అనుసరించాలి. ఈ పద్ధతుల వలన మీరు పొందే రంగు ప్రభావితంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎటువంటి కాస్మెటిక్స్ ఉండవు. పురుషుల కొరకు కొన్ని సమర్థవంతమైన చిట్కాలను చూద్దాం.

పురుషుల కొరకు ఇంటి చిట్కాలు

మగవాళ్లు అందరూ అలంకరణ చేసుకోక పోయినప్పటికీ దుమ్ము, ధూళి మరియు అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు వంటి ఇతర కారకాల వలన చర్మవ్యాధి మరియు ముదురు చర్మం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలను సహజంగా తొలగించేందుకు కొన్ని హోం రెమెడీస్ గురించి చూద్దాం.

కలబంద జ్యూస్ మరియు నారింజ జ్యూస్

ఎన్నో ఉత్పత్తుల్లో కలబంద చాలా ముఖ్యమైన అంశంగా ఉండటానికి కారణం ఇందులో ఎన్నో చర్మ సంరక్షణ లక్షణాలను ఉన్నాయి. ఇది మొటిమలను, హైపర్ పిగ్మెంటేషన్ని కూడా తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేసి ఈవెన్ స్కిన్ టోన్‌ని ఇస్తుంది. దీని యొక్క కూలింగ్ ఎఫెక్ట్ వలన డామేజ్ అయిన కణజాలంను రిపేర్ చేస్తుంది.

కలబంద జెల్‌ని డైరెక్ట్ గా మీ ముఖం మీద రాయవచ్చు. దీనిని రెగ్యులర్గా ఉపయోగించటం వలన మీ చర్మాన్ని మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా చేస్తుంది. ఇందులో కొద్దిగా నారింజ జ్యూస్ని కూడా చేర్చుకోవచ్చు ఎందుకంటే నారింజలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. సమాన మొత్తాల్లో అనగా 1: 1 రేషియోలో కలబంద జెల్ మరియు నారింజ రసం కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. మీ ముఖం మీద దీనిని రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

పాలు మరియు నిమ్మరసం

పాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మ రంగు మరియు టోన్‌ని పెంచుతుంది. నిమ్మరసం శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది మరియు ఇందులో విటమిన్ సి ఉన్నందున మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుతారు.

ఒక స్పూన్ పాలు మరియు ఒక స్పూన్ నిమ్మరసంను కలుపుకోండి. ఇందులో కొద్దిగా బియ్యం పిండిని కూడా జోడించవచ్చు. దీనిని ముఖంపై రాసి కొద్ది సేపు తరువాత నీటితో కడగండి.

పెరుగు మరియు అరటిపండు ప్యాక్

ఎల్లప్పుడూ ముఖంపై ఫేషియల్ చేసేటప్పుడు పెరుగును ఉపయోగిస్తారు. మరోవైపు, మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు తాజాగా ఉంచుకోవడానికి అవసరమైన విటమిన్లు అరటి పండులో పుష్కలంగా ఉంటాయి.

ఒక కప్పు పెరుగులో ఒక అరటి పండుని చూర్ణం చేసి బాగా కలపండి. దీనిని మీ చర్మంపై రాసి 20 నిముషాలు ఉంచి, నీటితో కడగండి. ఇలా ఒక వారం చేసిన తరువాత, మీ చర్మం తెల్లబడటం చూస్తారు.

చక్కెర మరియు తేనె ప్యాక్

హనీ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. దీనిని చక్కెరతో కలిపి పురుషుల ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. స్త్రీలతో పోల్చుకుంటే పురుషులకు గరుకైన చర్మం ఉంటుంది. కనుక చక్కెర చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని శుభ్రపరచేందుకు సహాయపడుతుంది.

రెండు టీ స్పూన్ల తేనె మరియు ఒక టీ స్పూన్ చక్కెరను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీనిని ముఖంపై రాసిన 10 నిమిషాల తరువాత, నీటితో కడగండి. ఈ పదార్ధాలు బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో కూడా ప్రభావితంగా పనిచేస్తుంది.

ఉసిరి మరియు తేనె ప్యాక్

ఆమ్లా మీ చర్మంలో చైతన్యం నింపుతుంది. వీటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది మొటిమలు మరియు మచ్చలను కూడా తొలగిస్తుంది. తేనె మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

ఉసిరి రసం మరియు తేనెని బాగా కలిపి మీ ముఖంపై రాయండి. ఆరిన తరువాత నీటితో కడగండి. మీరు ఆమ్లా జ్యూస్ని త్రాగవచ్చు. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరుగు పరుస్తుంది.

పసుపు మరియు టొమాటో పేస్ ప్యాక్

పసుపులో హెర్బల్ మరియు యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. టమోటా చర్మంపై ఏర్పడిన టాన్ ని తొలగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం మరియు కొద్దిగా పసుపును బాగా కలుపుకొని మీ ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని రెగ్యులర్గా వాడటం వలన అందమైన మచ్చలు లేని చర్మాన్ని పొందుతారు.

ఆరంజ్, నిమ్మకాయి మరియు పెరుగు ప్యాక్

ఆరంజ్ మరియు నిమ్మరసం మీ చర్మంలో యాంటీ ఆక్సిడెంట్స్ ని నింపుతుంది. పెరుగు మీ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ జ్యూస్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను ఒక కప్ పెరుగులో కలపండి. బాగా కలిపి ఒక పేస్ట్‌లా చేసి మీ ముఖంపై రాయండి. ఆరిన తరువాత కడగండి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ఆముదము

అందరికీ సాధారణంగా వచ్చే సమస్య వయసు వలన చర్మంపై ఏర్పడే ముడతలు. కాస్టర్ ఆయిల్ ఈ సమస్యను తొలగిస్తుంది.

కొన్ని చుక్కల ఆముదములో కొద్దిగా పసుపును కలిపి మీ కంటి చుట్టూ రాసి మసాజ్ చేయండి. ఇది మీ చర్మాన్ని టైటనింగ్ చేస్తుంది మరియు మృదువుగా చేస్తుంది. మీకు చాలా సున్నితమైన చర్మం ఉన్నట్లయితే పసుపును కలపకుండా ఆముదం నూనెని మాత్రమే రాయండి.

గ్రీన్ టీ వాటర్ మరియు తేనె

గ్రీన్ టీ బాగ్స్ ని మీ కళ్లపై వాడటం వలన డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది. రెగ్యులర్గా గ్రీన్ టీని త్రాగటం వలన మీ చర్మం మృదువుగా మరియు క్లియర్ గా అవుతుంది.

ఒక కప్పు గ్రీన్ టీ నీటిలో రెండు స్పూన్ బియ్యం పిండి మరియు అర స్పూన్ తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచండి. కడిగే ముందు వలయ ఆకారంలో మసాజ్ చేస్తూ కడగండి. ఇలా చేయటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగిపోతాయి.

పెరుగు మరియు పసుపు

పెరుగు మీ చర్మాన్ని హైడ్రేటెడ్గా మరియు క్లియర్‌గా చేస్తుంది. పసుపు మొటిమలను నల్లని మచ్చలను తొలగిస్తుంది.

ఒక స్పూన్ పెరుగులో కొద్దిగా పసుపుని కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచండి. తరువాత నీటితో కడగండి.

పసుపు మరియు నిమ్మరసం

లెమన్ ఒక యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది మీ చర్మంపై టాన్ ని తొలగిస్తుంది. పసుపు క్రిములను మరియు ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.

కొద్దిగా శనగ పిండి, పసుపు, నిమ్మరసం మరియు పాలను కలుపుకొని ఒక పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై మసాజ్ చేసి 20 నిమిషాల తరువాత కడగండి. ఈ ప్యాక్ ని రెగ్యులర్గా వాడటం వలన మీరు శుభ్రమైన మరియు క్లియర్ స్కిన్‌ ని పొందుతారు.

పెరుగు మరియు నిమ్మరసం

పెరుగు మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. నిమ్మరసం డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును బాగా కలిపి మీ ముఖంపై రాసి ఎండిన తరువాత కడగండి. మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే వట్టి పెరుగును కూడా మీ చర్మంపై రాసుకోవచ్చు.

పాలు, నిమ్మరసం మరియు తేనె

ఈ మిశ్రమం ఒక మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని బాగా కలిపి ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత కడగండి.

పాలు మరియు కుంకుమ పువ్వు

సాఫ్రాన్ మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని పాలతో కలిపి ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది. రెండు లేదా 3 టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి 3 నుండి 4 గంటల వరకు నానపెట్టండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచి కడగండి. లేదా వట్టి పాలను ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఆలివ్ నూనె మరియు సి సాల్ట్ స్క్రబ్

ఈ స్క్రబ్ని వాడటం వలన మీ చర్మంపై ఉండే మురికి పదార్థాలను తొలగిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ సి సాల్ట్ ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. దీనితో మీ ముఖాన్ని కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేసి కడగండి.

కొబ్బరి పాలు

కొబ్బరి పాలు చర్మాన్ని వైటెన్ చేస్తుంది. రెగ్యులర్గా వాడటం వలన చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు హైడ్రేట్ చేస్తుంది. కొబ్బరి నుండి కొబ్బరి పాలను పిండి ముఖంపై రాయండి. ఆరిన తరువాత కడగండి. ఇది మీ పెదాలకు కూడా చాలా మంచిది.

ఆల్మండ్ పేస్ట్

బాదాం చర్మంలో విటమిన్ కంటెంట్ ని అధికరిస్తుంది. 5 లేదా 6 బాదాం ను రాత్రంతా పాలలో నానబెట్టి ఒక స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

నిమ్మరసం మరియు పుదీనా రసం

నిమ్మరసం నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. పుదీనా చర్మంపై ఇర్రిటేషన్ను తగ్గిస్తుంది.1/2 స్పూన్ నిమ్మరసం మరియు 2 స్పూన్ పుదీనా రసాన్ని కలిపి ముఖంపై రాయండి. ఆరిన తరువాత నీటితో కడగండి.

శనగ పిండి, బొప్పాయి మరియు పసుపు పేస్ ప్యాక్

ఈ రెమెడీని ఎన్నో ఏళ్లుగా తెల్లని చర్మాన్ని పొందేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని శనగలు మరియు ఎరుపు కాయ ధాన్యాలను పొడిచేయండి. లేదా నీళ్లను కలుపుకొని బాగా రుబ్బండి. ఇందులో కొద్దిగా పసుపు మరియు అర స్పూన్ బొప్పాయి గుజ్జును కలపండి. ఈ పేస్ట్‌ని మీ ముఖంపై మాస్క్ లాగా రాసి 15 నుండి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి.

ఓట్స్ మరియు పసుపు పేస్ ప్యాక్

ఇది ఇన్స్టంట్ ఫెయిర్నెస్ ని ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక చిటిక పసుపుని కలుపుకొని ఒక మృదువైన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

నారింజ రసం మరియు పసుపు

నారింజ రసం చనిపోయిన చర్మ కణాలను మరియు టాన్ ని తొలగిస్తుంది. రెండు  టేబుల్ స్పూన్ నారింజ రసం మరియు ఒక చిటిక పసుపును కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని రోజూ వేసుకోవటం వలన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను పొందుతారు.

నారింజ తొక్క మరియు పెరుగు

నారింజ జ్యూస్ లానే నారింజ తొక్క కూడా చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

రెండు టేబుల్ స్పూన్  నారింజ తొక్క యొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ పెరుగుతో కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని వారానికి 2 సార్లు ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.

ఫుల్లెర్స్ ఎర్త్ (ముల్తాని మిట్టి)

చర్మాన్ని లైటెన్ చేసేందుకు మరియు మెరిసే చర్మం కొరకు ఎర్త్ ఫుల్లెర్స్ ని ఉపయోగించటం చాలా పాత పద్దతి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మంలో చైతన్యం నింపుతుంది.

దీనిని ముల్తాని మిట్టి అని కూడా అంటారు. రెండు స్పూన్ల ముల్తాని మిట్టిని రోజ్ వాటర్ లో కలుపుకొని ముఖంపై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి.

శనగ పిండి, పసుపు మరియు పాలు

ఈ రెమెడీ డార్క్ స్పాట్స్, మొటిమలు, పిగ్మెంటేషన్ మరియు ఇతర చర్మ సమస్యలను తొలగిస్తుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని క్రిములనుండి కాపాడుతుంది మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

రెండు స్పూన్ శనగ పిండి, చిటిక పసుపు మరియు కొద్దిగా పాలను కలుపుకొని ఒక పేస్ట్‌ను తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై మరియు మెడపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. మీరు పసుపు మరియు పచ్చి పాలను మాత్రమే ఉపయోగించి కూడా ముఖంపై రాయవచ్చు. కొద్దిగా పచ్చి పాలలో చిటిక పసుపును వేసుకొని ముఖమై రాసి 10 నుండి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

తేనె మరియు దాల్చిన చెక్క

తేనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృధువుగా చేస్తుంది. తేనె మరియు దాల్చిన చెక్క పొడిని కలుపుకొని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

నిమ్మరసం మరియు టమాటో పేస్ట్

ఈ మిశ్రమం టాన్ ని తొలగిస్తుంది. బాగా పండిన టొమాటోని చూర్ణం చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఆరిన తరువాత నీటితో కడగండి. పురుషుల చర్మం చాలా గరుకుగా ఉండటం వలన వారానికి 2 లేదా 3 సార్లు ఈ పేస్ట్‌ని రాయండి.

దోసకాయ

దోసకాయ కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ని తొలగించి మీ చర్మాన్ని అందంగా చేస్తుంది. ఒక దోసకాయ తోలును తీసి చిన్న ముక్కలుగా కోసి గ్రైండర్లో వేసుకొని జ్యుసీ పల్ప్ చేయండి. దీనిని మీ ముఖంపై రాయండి.15 నిముషాల పాటు వదిలి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు దోసకాయను తినటం వలన కూడా మీ చర్మం తాజాగా ఉంటుంది.

శనగ పిండి, పసుపు మరియు ముల్తాని మిట్టి

పసుపు, శనగ పిండి మరియు ముల్తాని మిట్టి యొక్క కలయిక మీ ముఖం మీద తెలుపురంగుని తిరిగి తెచ్చేందుకు బాగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో శనగ పిండి మరియు ముల్తాని మిట్టిని సమాన మోతాదులలో వేసుకొని ఒక చిటిక పసుపుని జోడించి రోజ్ వాటర్‌తో పేస్ట్‌లా కలుపుకోండి. ఈ ప్యాక్‌ని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

బంగాళదుంప

ఈ ప్రత్యేకమైన కూరగాయ ఫెయిర్ స్కిన్ టోన్ని పొందడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంపలో విటమిన్ సి ఉన్నందున, ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ కన్నా ప్రభావితంగా పనిచేస్తుంది. కనుక, పురుషులు ఫెయిర్ స్కిన్ టోన్ కొరకు బంగాళదుంపను ఉపయోగించవచ్చు.

బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి వాటితో చర్మంపై మసాజ్ చేయండి.  లేదా బంగాళదుంపల నుండి పల్ప్ తయారు చేసుకొని చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

పండిన బొప్పాయి మరియు చక్కెర

బొప్పాయి పండుని బాగా చూర్ణం చేసుకోవాలి. ఈ గుజ్జులో ఒక స్పూన్ చక్కెర కలుపుకొని చర్మంపై రాయండి. నెమ్మదిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

ఐస్ మసాజ్

పురుషుల చర్మంపై గ్లో పెంపొందించే మార్గాలలో ఒకటి, ఐస్ క్యూబ్తో చర్మాన్ని మసాజ్ చేయటం. ఒక ఐస్ క్యూబ్‌ని 20 నుండి 30 సార్లు ముఖంపై రాయండి.  దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. ఇది చాలా సులభమయిన పద్దతి.

పైనాపిల్, స్ట్రాబెర్రీ మరియు బొప్పాయి

ఈ మూడు పండ్లను కలిపి గుజ్జులా చూసుకొని ముఖంపై రాసి కొద్ది సేపు మసాజ్ చేయండి. వీటి రసం చర్మంలోనికి బాగా చొచ్చుకుపోయి మరియు శోషించబడిన తరువాత నీటితో కడగండి.

చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి

పై చెప్పిన ప్యాక్‌లను ఉపయోగించటమే కాకుండా రోజువారీ జాగ్రత్తలను తీసుకోవటం కూడా చాలా ముఖ్యం.

క్లెన్సింగ్

మీరు మీ చర్మాన్ని క్రమంగా శుభ్రపరచాలి. ఒక మంచి క్లెన్సెర్ని ఉపయోగించి  రోజుకు రెండుసార్లు ఉదయం మరియు సాయంత్రం మీ ముఖాన్ని శుభ్రం చేయండి. కలబంద కలిగి ఉన్న క్లెన్సెర్ను ఉపయోగించటం ఉత్తమం.

చర్మ రక్షణ

మీ చర్మం యొక్క సహజ మాయిశ్చర్‌ని కోల్పోకుండా ఉండేందుకు రెగ్యులర్గా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. ఫెయిర్నెస్ క్రీములను కూడా ఉపయోగించవచ్చు. మీరు ఎండలో వెళ్ళేముందు SPF లోషన్‌లను రాసుకోండి. కఠినమైన సూర్య కిరణాల నుండి మరింత రక్షణ కోసం పూర్తి స్లీవ్స్ ఉన్న చొక్కాలను, టోపీ మరియు సన్ గ్లాస్‌ను ధరించండి.

మలినాలను తొలగించడం

మీ శరీరం మరియు ముఖం నుండి చనిపోయిన చర్మ కణాలను శుభ్రపరచడం వలన చర్మం యవ్వనంగా మరియు మృదువుగా కనిపిస్తుంది. ఎన్నో రకాల ఫేస్ స్క్రబ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి, వాటి నుంచి మీ చర్మానికి తగిన వాటిని ఎంచుకోండి. మీరు స్క్రబ్ చేయడానికి ముందు మీ ముఖానికి ఆవిరి పట్టండి. ఇది చర్మం యొక్క లోతైన రంధ్రాల నుండి మురికి మరియు జిడ్డును తొలగించేందుకు తోడ్పడుతుంది.

ఆహారం, వ్యాయామం మరియు నీరు

ధ్యానం మరియు సరైన వ్యాయామాలు మీ చర్మం నుండి అదనపు జిడ్డుని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు సరైన ఆహారం తీసుకొని, మీ శరీరం నుండి టాక్సిన్ ను విడుదల చేయడానికి తగిన నీరు త్రాగాలి. జ్యూసీగా మరియు తాజాగా ఉండే పండ్లు మీ శరీరం లోని తేమను నిలబెట్టుకోవటానికి మరియు పోషించుటకు సహాయం చేస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నూనె పదార్థాలను తక్కువగా తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సిఇ  మీ చర్మానికి మంచిది.

పురుషులు మృదువైన మరియు క్లియర్ చర్మం పొందడానికి ఇతర మార్గాలు

మీ చెడ్డ అలవాట్లను వదులుకోండి

ధూమపానం మరియు ఆల్కహాల్ మీ వయస్సును అధికంగా కనిపించేలా చేస్తుంది. మీరు మంచి చర్మం కావాలనుకుంటే మీ వ్యసనాలను తగ్గించడానికి మరియు నిష్క్రమించడానికి ప్రయత్నించండి.

మీ నిద్ర సమయాన్ని అధికరించండి

తగిన నిద్ర లేకపోవడం వలన మీ చర్మం నిస్తేజంగా మరియు పొడిగా అవుతుంది. చనిపోయిన చర్మ కణాలు మరియు డార్క్ సర్కిల్స్ అధికరిస్తాయి. సరైన సమయంలో తగినంత నిద్రను పొందటం వలన మీ స్కిన్ టోన్ మెరుగు పొందుతుంది.

ఎక్కువ నీళ్లు త్రాగండి

నీరు మీ చర్మాన్నీ హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. దీని ఫలితంగా  ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన చర్మం లభిస్తుంది.

పై చెప్పిన చిట్కాలను ఉపయోగించండి, ఫెయిర్ అండ్ హ్యాండ్సం చర్మాన్ని పొందండి.

Posted on

Best baby massage oils in Telugu – ఉత్తమ బేబీ మసాజ్ ఆయిల్స్

పసి పిల్లలకు తగిన చమురును ఎంచుకోవటం అంత సులువు కాదు. మసాజ్ నూనెలు మీ శిశువు యొక్క ఎముకలు మరియు కండరాలను బలంగా చేస్తాయి, కనుక ఇది చాలా ముఖ్యమైనది. వీటిలో విటమిన్ ఇ ఉండటం వలన చర్మానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో ఎన్నో రకాల మసాజ్ ఆయిల్స్ బ్రాండ్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలను చూద్దాం. వీటి నుండి మీ శిశువుకి సరిపోయే ప్రోడక్ట్‌ని ఎంచుకోండి.

భారతదేశంలో ఉత్తమ బేబీ మసాజ్ ఆయిల్స్

సెబామెడ్ బేబీ మసాజ్ ఆయిల్

Sebamed Baby Massage Oil[Buy it online]

సెబామెడ్ బేబీ మసాజ్ ఆయిల్‌ని రాయటం వలన మీ శిశువు యొక్క చర్మం రిలాక్స్డ్ గా మరియు మృదువుగా అనిపిస్తుంది. ఈ ఆయిల్లో సోయా మరియు విటమిన్ ఎఫ్ కూడా ఉంటుంది, ఇవి సహజ చర్మ గుణాలను నిలుపుతుంది. ఈ ఆయిల్‌ని క్రమంగా ఉపయోగించినట్లయితే, మీ శిశువు యొక్క చర్మ సహ్యత అభివృద్ధి చెందుతుంది. మీ శిశువు యొక్క నరాలు మరియు జీర్ణాశయ అభివృద్ధితో పాటు చర్మంలో సంపూర్ణ ఉత్తేజాన్ని నింపుతుంది. మీ శిశువుకు పొడి చర్మం మరియు దద్దుర్ల సమస్య ఉన్నట్లయితే, ఈ ప్రత్యేక మసాజ్ ఆయిల్ ఆదర్శంగా ఉంటుంది.

హిమాలయ హెర్బల్స్ బేబీ మసాజ్ ఆయిల్

Himalaya Baby Massage Oil[Buy it online]

నేటికీ, శిశువులకు కూడా, హిమాలయ అనే పేరు గల ఉత్పాదక కంపెనీ యొక్క ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి. ఇవి మూలికల ఫార్ములా ఆధారిత ఉత్పత్తులు కనుక, మీ శిశువు సులభంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. మీరు రెగ్యులర్గా మీ శిశువు చర్మంపై ఈ ఆయిల్‌ని రాసినట్లయితే సరైన పోషణ సాధ్యం అవుతుంది. ఈ ప్రత్యేక హెర్బల్ మసాజ్ ఆయిల్ మీ శిశువు చర్మానికి శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంచిది. ఇది చాలా తేలికపాటి నూనె కనుక, మీ శిశువు స్నానం తర్వాత కూడా తేమ యొక్క ప్రభావం ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీనిని ప్రయోగించటం వలన మీ శిశువు యొక్క చర్మం అభివృద్ధి చెందుతుంది.

డాబర్ లాల్ టైల్

Dabur Lal Tail[Buy it online]

బిడ్డల యొక్క కండరాలు మరియు ఎముకలను బలంగా ఉంచడానికి తల్లులు ఈ బేబీ ఆయిల్‌ని మొదటి నుండి ఉపయోగిస్తున్నారు. ఈనాటికి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఆధునిక మరియు ఖరీదైన నూనెలు ఉన్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ తమ శిశువులకు ఈ చమురునే ఉపయోగిస్తున్నారు. ఇది కూడా అన్ని రకాల మూలికలు మరియు ప్రాకృతిక పదార్ధాలతో తయారు చేయబడిన ఒక ఆయుర్వేద నూనె. ఈ నూనెని వాడటం వలన సహజంగా మీ శిశువు చాలా సురక్షితంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది మీ శిశువు యొక్క కండరాలకు మరియు ఎముకలకు సరైన బలాన్ని అందించడంతో పాటు, మొత్తం శారీరక పెరుగుదలకు సహాయపడుతుంది.

చికో మసాజ్ ఆయిల్

Chicco Massage Oil[Buy it online]

ఇది మార్కెట్లో అన్ని రకాల బేబీ ప్రొడక్ట్స్ నూ తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన మంచి బ్రాండ్. ఇది మీ చర్మాన్ని మృదువుగా మరియు వెల్వెటీగా చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది రైస్ బ్రాన్ అనే ప్రత్యేక ఫార్ములా ద్వారా తయారు చేయబడింది. ఈ నూనెలో ఎటువంటి ఆల్కహాల్, డైస్ మరియు పారాబెన్స్ ఉండదు కాబట్టి, సున్నితమైన చర్మం కలవారికి ఇది చాలా మంచిది. ఇందులో ఆయిల్ అబ్సార్బింగ్ లక్షణాలు ఉన్నందున మీ చర్మంపై జిడ్డు సమస్యను తొలగిస్తుంది. ఈ అద్భుతమైన మసాజ్ ఆయిల్‌ని ఉపయోగించిన తర్వాత మీ శిశువు యొక్క చర్మం చాలా మృదువుగా మరియు సప్ప్లెర్ గా అవుతుంది.

సీగిలిస్ ఓవిలియన్

Seagulls Olivon[Buy it online]

ఈ రోజుల్లో, ఆలివ్ నూనెలోని గుడ్నెస్ వలన ఈ నూనె యొక్క డిమాండ్ పెరుగుతోంది. బేబీ మసాజ్ నూనెలు తయారు చేయడానికి కూడా ఆలివ్ నూనెని వాడుతున్నారు. బేబీ మసాజ్ ఉత్పత్తులలో కూడా, మీరు ఆలివ్ ఆయిల్ యొక్క చురుకైన పాత్రను చూడగలుగుతారు. మీ శిశువు యొక్క చర్మం మృదువుగా మరియు సున్నితంగా ఉండటానికే కాదు, మీరు వయోజన ఉపయోగాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. శిశువు యొక్క చర్మం అందంగా మరియు ప్రకాశించేలా చేయాలనుకునే తల్లిదండ్రులందరూ ఈ నూనెని సూచిస్తారు. స్నానం చేసే 30 నిమిషాల ముందు మీ శిశువు యొక్క శరీరంపై మసాజ్ చేయటానికి ఇది ఉత్తమమైన ఆయిల్. ఈ ఆయిల్‌ని రాసిన తరువాత మీ శిశువును సూర్యకాంతిలో కొద్ది సేపు ఉంచాలి, తద్వారా విటమిన్ డి చర్మం ద్వారా శోషించబడుతుంది మరియు మీ శిశువు యొక్క ఎముకలు మరియు కండరాలను బలంగా చేస్తుంది.

డాబర్ బేబీ మసాజ్ ఆయిల్ విత్ ఆలివ్ అండ్ ఆల్మాండ్

Dabur Badam Tail[Buy it online]

మీ చర్మానికి పారఫిన్ లేని మసాజ్ ఆయిల్ చాలా మంచిది. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ రంగులూ లేవు కనుక మీ శిశువుకు నిజంగా ఆరోగ్యకరమైనది. ఈ ఆయిల్తో మీ శిశువు యొక్క శరీరంపై రెగ్యులర్గా మసాజ్ చేసినట్లయితే, ఎముకలు మరియు కండరాలను నిజంగా బలపరుస్తుంది. ఇందులో ఎటువంటి రసాయనాలూ లేనందున మీ శిశువుకు ఎంతో మంచిది.

జాన్సన్ బేబీ ఆయిల్ విత్ విటమిన్ ఇ

Johnson's Baby Oil with Vitamin E[Buy it online]

శిశువు యొక్క చర్మాన్ని సురక్షితంగా ఉంచడంలో బాగా పనిచేయటం వలన చాలామంది తల్లిదండ్రులు జాన్సన్ బ్రాండ్ ను ఎంచుకుంటారు. తల్లులు అందరికీ శుభవార్త ఏమిటంటే ఇప్పుడు విటమిన్ ఇ యొక్క చికిత్స తో జాన్సన్ యొక్క బేబీ మసాజ్ ఆయిల్ లభిస్తోంది. ఇది మీ పిల్లల చర్మాన్ని మృదువుగా మరియు అందంగా చేస్తుంది. ఆన్‌లైన్ కొనుగోలు ద్వారా ఈ రోజే దీనిని ప్రయత్నించి చూడండి.

బయోటిక్ హెర్బల్ బయో వీట్ బేబీ సాఫ్ట్ మసాజ్ ఆయిల్

Biotique Herbals Bio Wheat Baby Soft Massage Oil[Buy it online]

ఇది పూర్తిగా మూలికలతో చేసిన శిశువు సంరక్షణ ఉత్పత్తులలో ఒకటి. మీ శిశువు కొరకు వచ్చే ఉత్తమ నాణ్యత కిట్లలో ఇది ఒకటి. ఈ నూనెని రాయటం వలన మీ చర్మాన్ని మృదువుగా మరియు అందంగా చేస్తుంది. ఇది మీ శిశువు యొక్క చర్మంకు సున్నితమైన సంరక్షణను అందిస్తుంది, ఇది చర్మం పొర నుండి పొడితనాన్ని దూరంగా ఉంచుతుంది.

పీజియన్ 200మిలి బేబీ ఆయిల్

Pigeon baby oil[Buy it online]

ఈ బేబీ కేర్ ఆయిల్ పరిపూర్ణ మాయిశ్చరైజింగ్ మూలకాన్ని కలిగి ఉంది, ఇది మీ శిశువు యొక్క చర్మాన్ని చాలా మృదువుగా మరియు అందంగా చేస్తుంది. మీరు దీనిని రాసి మసాజ్ చేస్తే, ఇది మీ శిశువు యొక్క చర్మంలోకి చొచ్చుకుపోయి, మృదువుగా మరియు అందంగా కనిపించేలా చేస్తుంది.

Posted on

Telugu tips to remove blackheads – తొందరగా బ్లాక్ హెడ్స్ తొలగించటం ఎలా?

మీ ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ మీ ముఖ అందాన్ని పాడుచేస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా ఎదురయ్యే సమస్య. సాధారణంగా పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతుంటారు. క్లెన్సెర్, టోనర్ మరియు మాయిశ్చరైజర్ లను వాడుతూ చర్మంపై  మంచి జాగ్రత్తలను తీసుకునే వ్యక్తులకు బ్లాక్ హెడ్స్ తక్కువగా ఉంటుంది. కానీ, ప్రస్తుత రోజులలో రెగ్యులర్గా చర్మంపై జాగ్రత్తలు తీసుకునేందుకు చాలా మందికి తగిన సమయం ఉండదు. కనుక, మేము బ్లాక్ హెడ్స్ ను తొందరగా తొలగించటం కోసం కొన్ని సమర్థవంతమైన హోం రెమెడీస్ ను ఈ ఆర్టికల్ లో వివరించాము.

బ్లాక్ హెడ్స్ యొక్క కారణాలు

 • హార్మోన్ల మార్పుల వలన లేదా అధిక సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వలన బ్లాక్ హెడ్స్ రావచ్చు.
 • జిడ్డు చర్మం ఉన్న స్త్రీలకు చర్మం మీద బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ముక్కు యొక్క మూలలు మరియు గడ్డం వంటి చోటులపై బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. వీటి వలన మీరు అలంకరణ చేసుకున్నప్పటికీ నల్లని మచ్చలతో మీ అలంకరణ అసంపూర్తిగా కనపడుతుంది.
 • కాలుష్యం వలన మన చర్మంపై అంటుకున్న మురికి మరియు కార్బన్ పదార్థాలు బ్లాక్ హెడ్స్ గా మారుతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగించేందుకు ఇంటి నివారణలు

చర్మం నుండి బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా ఉపయోగకరమైన మందులు మార్కెట్ లో లభిస్తాయి. అయినప్పటికీ, సైడ్ ఎఫెక్ట్స్ నుండి దూరంగా ఉండటానికి, సహజ నివారణ పద్దతులను అనుసరించండి.

టూత్ పేస్ట్

బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు ఇది ఒక సమర్థవంతమైన పరిష్కారం. టూత్ పేస్టుని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంపై రాసి సుమారు 25 నిమిషాలు ఉంచండి. మొదట్లో ఇది మంటను పుట్టించవచ్చు కానీ తర్వాత మంట తగ్గిపోతుంది. ఇలా రెండు వారాల పాటు చేసినట్లయితే, బ్లాక్ హెడ్స్ ఖచ్చితంగా తొలగిపోతుంది.

టొమాటో

టమాటోలోని యొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరచి, హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. ఇది బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను కూడా తొలగించటానికి సహాయపడుతుంది. తోలు ఒలిచిన టొమాటోను గుజ్జు చేసి బ్లాక్ హెడ్స్ పై రాయండి. మంచి ఫలితాల కోసం, రాసిన తరువాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగండి.

ఇంకో విధానం ఒక టొమాటో తీసుకొని బ్లెండ్ చేసి ఈ ప్యూరీలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలపండి. బాగా కలిపాక, మీ ముక్కు మీద ఈ మిశ్రమాన్ని మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకుంటూ రాయండి. ఐదు నుండి పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

నిమ్మకాయ

బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై ఉప్పు కలిపిన నిమ్మరసంను రాయండి. కానీ రాసే ముందు మీ ముఖాన్ని వెచ్చని నీటితో కడగాలి. ఉప్పు మరియు నిమ్మరసం యొక్క మిశ్రమం ముఖం మీద 20 నిమిషాలు ఉంచాలి, తరువాత వెచ్చని నీటితో మృదువుగా కడగండి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగును కూడా కలుపుకోవచ్చు.

పెరుగు, ఆలివ్ నూనె మరియు ఓట్ మీల్

రెండు టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను ఒక బౌల్లో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాయండి మరియు మంచి ఫలితాలను పొందడానికి సుమారు ఐదు నుండి ఏడు నిముషాల పాటు ఉంచండి. తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

తేనె

ఇది మన ఇంటిలో తక్షణమే అందుబాటులో ఉండే పదార్థం. దీనిని చర్మంపై రాయటం వలన బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగిస్తుంది. వట్టి తేనెని బ్లాక్ హెడ్స్ పై రాసి ఆరే వరకు ఉంచండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మరియు నీటిని సమాన భాగాలలో కలపండి. ఈ పేస్ట్‌ని బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై రాసి, మృదువుగా మసాజ్ చేయండి మరియు సుమారు 15 నిముషాల పాటు ఉంచండి. ఆ తరువాత వెచ్చని నీటితో కడగండి.

బంగాళదుంపలు

బంగాళదుంపలను తురిమి చర్మంపై రుద్దినప్పుడు బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అంతే కాదు స్కిన్‌ లైటనింగ్ కొరకు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను పొడి చేసి, ఒక టీ స్పూన్ పొడి, ఒక చిటికె పసుపు మరియు నిమ్మరసాన్ని బాగా కలుపుకోండి. దీనిని ముఖంపై రాసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. కడిగే ముందు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంపై మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన బ్లాక్ హెడ్స్ వేర్ల నుండి తొలగిపోతాయి.

గ్రీన్ టీ

ఒక టీ స్పూన్ ఎండిన గ్రీన్ టీ ఆకులను తీసుకొని కొద్దిగా నీటిని కలిపి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్ ని బ్లాక్ హెడ్స్ పై రాసి మృదువుగా మసాజ్ చేయండి. రెండు లేదా మూడు నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా చేయటం వలన మీ బ్లాక్ హెడ్స్ మరియు చర్మ రంధ్రంలో ఉండే జిడ్డుని కూడా తొలగిస్తుంది.  

ఓట్ మీల్

ఓట్ మీల్ తీసుకోవటం వలన మీరు ఫిట్ గా ఉండొచ్చు మరియు మీ బరువును నియంత్రించవచ్చ అని మీకు తెలుసు. కానీ, ఇది బ్లాక్ హెడ్స్ ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఒక చెంచా వోట్ మీల్, రెండు చెంచా టమోటా రసం మరియు ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని ఒక స్క్రబ్ను తయారు చేసుకోండి. దీనితో మీ బ్లాక్ హెడ్స్ పై కొద్ది సేపు స్క్రబ్ చేసి 10 నిమిషాల తరువాత కడగండి. క్లియర్ స్కిన్‌ కోసం ఈ ప్రక్రియను 2 లేదా 3 నెలలు చేయండి.

పచ్చి గుడ్డు

గుడ్డు యొక్క తెల్లసొనలో ఉన్న పోషకాలు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తాయి. పచ్చి గుడ్డు నుండి తెల్లసొనను తీసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

పాలు

బ్లాక్ హెడ్స్ మురికి వలన ఏర్పడుతుంది. కనుక నేచురల్ క్లెన్సెర్లను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయటం వలన బ్లాక్ హెడ్స్ ని నిరోధించవచ్చు. ఐదు లేదా ఆరు స్పూన్ల పచ్చి పాలలో ఒక పత్తిని ముంచి ముఖం పై రాయండి. కొద్ది సేపు మృదువుగా మసాజ్ చేసి వెచ్చని నీటితో కడగండి.

క్లే ప్యాక్

మీ ముఖం నుండి అధిక కార్బన్లు మరియు ధూళిని తీసివేయడానికి క్లే ప్యాక్ ఒక అద్భుతమైన పరిహారం. మీరు ముల్తానీ మిట్టి వంటి సహజ మట్టిని పొందగలిగితే, వీటిని ఉపయోగించి మీ ముఖం నుండి బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించవచ్చు. ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ క్లే పౌడర్ మరియు కొన్ని చుక్కల ఆపిల్ సీడ్ వినిగర్‌ని కలుపుకొని ఒక పేస్ట్ లా చేసుకోండి. దీనిని మీ బ్లాక్ హెడ్స్ పై రాసి 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

పుదీనా రసం మరియు పసుపు

కొన్ని పుదీనా ఆకులను రుబ్బి రసాన్ని పిండి ఒక బౌల్ లో తీసుకోండి. అందులో కొద్దిగా పసుపుని కలుపుకొని బ్లాక్ హెడ్స్ పై రాయండి. ఈ మిశ్రమం ఆరే వరకు వెయిట్ చేసి వెచ్చని నీటితో కడగండి.

మొక్కజొన్న స్క్రబ్

మీ వద్ద ఉండే పేస్ వాష్ లో అర స్పూన్ మొక్కజొన్న పొడిని కలుపుకొని బ్లాక్ హెడ్స్ పై రాసి స్క్రబ్ చేయండి. పది నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

తేనె మరియు చక్కెర

ఇంట్లో బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి ఇది అత్యంత సులభమయిన మరియు సమర్థవంతమైన మార్గం. సగం టీస్పూన్ చక్కెర మరియు ఒక టీస్పూన్ తేనెని కలుపుకోండి. దీనిని బ్లాక్ హెడ్స్ పై రాసి మసాజ్ చేసి కొద్ది సేపు తరువాత కడగండి.

మెంతాకులు

కొన్ని మెంతాకులను రుబ్బి ఒక పేస్ట్ లా చేసుకోండి. దీనిని బ్లాక్ హెడ్స్ పై రాసి 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

చక్కెర మరియు నిమ్మకాయ

ఈ మిశ్రమం చర్మం మీది మృతకణాలను తొలగించడానికి ఉత్తమమైనది. ఇది చర్మం నుండి విషతుల్య పదార్థాలను తొలగిస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. దీనితో మీ ముక్కు మీద మృదువుగా కొన్ని నిమిషాల పాటు వలయాకార కదలికలలో మసాజ్ చేయండి. పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఉత్తమమైన మరియు వేగవంతమైన ఫలితాల కొరకు ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయండి.

పాలు మరియు జిలాటిన్

ఈ మిశ్రమం చర్మ సంరక్షణకు బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వాసన లేని జిలాటిన్ పొడి 1 టేబుల్ స్పూన్ పాలు వేసి, నెమ్మదిగా రెండు పదార్థాలను కలపాలి. ఇప్పుడు, కొన్ని సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయండి. మిశ్రమం కొద్దిగా చల్లారాక, మీ ముక్కు మీద ఒక పొరలా పూసుకోండి. సుమారు 15 నిముషాలు ఆరనివ్వండి. తరువాత ఆ పొరను తీసివేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

తేనె మరియు పైనాపిల్

పైనాపిల్ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది మరియు తేనె చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఒక పైనాపిల్ ను చిన్న ముక్కలుగా కోసి, బ్లెండ్ చేయండి. దాని రసాన్ని వడగట్టి ఒక గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల తేనెని ఈ రసంలో కలపండి. మీ ముఖానికి ఈ మాస్కును రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత, గోరు వెచ్చని నీటిలో ముంచిన బట్టతో తుడిచేయండి.

నారింజ తొక్క

ఆరెంజి తొక్క లో విటమిన్ సి ఉంటుంది. ఇది మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి వివిధ చర్మ సమస్యలతో పోరాడుతుంది. నారింజ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తని పొడిలా చేసి జాడీలో స్టోర్ చేసుకోండి. ఒక చెంచా ఆరెంజి పొడిని 2 చెంచాల రోజ్ వాటర్లో కలిపి మెత్తని పేస్టులా చేయండి. దీన్ని మీ బ్లాక్ హెడ్స్ పై రాసి ఎండనివ్వండి. తరువాత తడి చేతులతో మెల్లగా తొలగించి చల్లని నీటితో కడగండి.

ఆలోవెరా

కలబంద లోని యాంటీ బయాటిక్ లక్షణాలు చర్మం లోపాలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఇది చర్మానికి ఉపశమనాన్ని ఇస్తుంది, ఎక్కువ జిడ్డు ఉత్పత్తి కాకుండా చూస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది, మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా నివారిస్తుంది. మీరు ఆలోవెరా జెల్ ను నేరుగా బ్లాక్ హెడ్స్ పై లేదా పూర్తీ ముఖంపై రాసుకుని 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు ఆహారాలు

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి స్ట్రిప్స్ మరియు ఎన్నో రకాల క్రీమ్స్ లభిస్తున్నాయి. కానీ, వీటిని వేర్ల నుండి తొలగించటం చాలా ముఖ్యం. బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఆహారాల గురించి కూడా చూద్దాం.

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న తృణధాన్యాలు సులభంగా లభిస్తాయి. మీరు మీ ముఖం నుండి బ్లాక్ హెడ్స్ ను తొలగించాలని అనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. వివిధ రకాలైన స్ప్లిట్‌ బఠానీలు, కిడ్నీ బీన్స్, కాయ ధాన్యాలు మొదలైనవి తీసుకోండి. మీరు నాన్ వెజ్ ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలనుకుంటే అధిక ప్రోటీన్ ఉన్న వాటిని కాకుండా తాజా నీటి చేపలు మరియు స్కిన్‌ లెస్ పౌల్ట్రీ మాంసం లాంటి లీన్ ప్రోటీన్‌ను తీసుకోండి.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం

విటమిన్ సి ఉన్న పండ్లు మీ చర్మంపై బ్లాక్ హెడ్స్ చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, నారింజ, నిమ్మకాయ, బొప్పాయి, పైనాపిల్ మొదలైనవి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు. ఇవి సహజంగా లభించే ఆహారాలు మరియు చర్మానికి తగినంత పోషకాలను అందిస్తుంది. మీరు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా తీసుకోవచ్చు.

సెలీనియం అధికంగా ఉండే ఆహారం

విటమిన్లు మరియు ప్రొటీన్లతో పాటు, మీ శరీరానికి ఇతర ఖనిజాలను అందించటం కూడా చాలా ముఖ్యం. సెలీనియం లాంటి ఖనిజాలు తక్కువగా ఉండటం వలన కూడా బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. బార్లీ, తృణధాన్యాలు, గోధుమ బియ్యం, వోట్స్ వంటి సెలీనియం రిచ్ ఫుడ్ ను రెగ్యులర్గా తీసుకోవటం వలన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

గ్రీన్ టీ

మీ శరీరంలో అధికంగా టాక్సిన్స్ ఉత్పత్తి అవటం వలన కూడా బ్లాక్ హెడ్స్ రావచ్చు. గ్రీన్ టీ ఒక డీటాక్స్ హెర్బ్. ఇది మీ శరీరంలోని అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ ముఖం నుండి నెమ్మదిగా బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ త్రాగాలి. అంతే కాదు ఇది మీ చర్మాన్ని సున్నితంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది.