Posted on

Best baby massage oils in Telugu – ఉత్తమ బేబీ మసాజ్ ఆయిల్స్

పసి పిల్లలకు తగిన చమురును ఎంచుకోవటం అంత సులువు కాదు. మసాజ్ నూనెలు మీ శిశువు యొక్క ఎముకలు మరియు కండరాలను బలంగా చేస్తాయి, కనుక ఇది చాలా ముఖ్యమైనది. వీటిలో విటమిన్ ఇ ఉండటం వలన చర్మానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో ఎన్నో రకాల మసాజ్ ఆయిల్స్ బ్రాండ్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలను చూద్దాం. వీటి నుండి మీ శిశువుకి సరిపోయే ప్రోడక్ట్‌ని ఎంచుకోండి.

భారతదేశంలో ఉత్తమ బేబీ మసాజ్ ఆయిల్స్

సెబామెడ్ బేబీ మసాజ్ ఆయిల్

Sebamed Baby Massage Oil[Buy it online]

సెబామెడ్ బేబీ మసాజ్ ఆయిల్‌ని రాయటం వలన మీ శిశువు యొక్క చర్మం రిలాక్స్డ్ గా మరియు మృదువుగా అనిపిస్తుంది. ఈ ఆయిల్లో సోయా మరియు విటమిన్ ఎఫ్ కూడా ఉంటుంది, ఇవి సహజ చర్మ గుణాలను నిలుపుతుంది. ఈ ఆయిల్‌ని క్రమంగా ఉపయోగించినట్లయితే, మీ శిశువు యొక్క చర్మ సహ్యత అభివృద్ధి చెందుతుంది. మీ శిశువు యొక్క నరాలు మరియు జీర్ణాశయ అభివృద్ధితో పాటు చర్మంలో సంపూర్ణ ఉత్తేజాన్ని నింపుతుంది. మీ శిశువుకు పొడి చర్మం మరియు దద్దుర్ల సమస్య ఉన్నట్లయితే, ఈ ప్రత్యేక మసాజ్ ఆయిల్ ఆదర్శంగా ఉంటుంది.

హిమాలయ హెర్బల్స్ బేబీ మసాజ్ ఆయిల్

Himalaya Baby Massage Oil[Buy it online]

నేటికీ, శిశువులకు కూడా, హిమాలయ అనే పేరు గల ఉత్పాదక కంపెనీ యొక్క ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి. ఇవి మూలికల ఫార్ములా ఆధారిత ఉత్పత్తులు కనుక, మీ శిశువు సులభంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. మీరు రెగ్యులర్గా మీ శిశువు చర్మంపై ఈ ఆయిల్‌ని రాసినట్లయితే సరైన పోషణ సాధ్యం అవుతుంది. ఈ ప్రత్యేక హెర్బల్ మసాజ్ ఆయిల్ మీ శిశువు చర్మానికి శీతాకాలం వచ్చినప్పుడు చాలా మంచిది. ఇది చాలా తేలికపాటి నూనె కనుక, మీ శిశువు స్నానం తర్వాత కూడా తేమ యొక్క ప్రభావం ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీనిని ప్రయోగించటం వలన మీ శిశువు యొక్క చర్మం అభివృద్ధి చెందుతుంది.

డాబర్ లాల్ టైల్

Dabur Lal Tail[Buy it online]

బిడ్డల యొక్క కండరాలు మరియు ఎముకలను బలంగా ఉంచడానికి తల్లులు ఈ బేబీ ఆయిల్‌ని మొదటి నుండి ఉపయోగిస్తున్నారు. ఈనాటికి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఆధునిక మరియు ఖరీదైన నూనెలు ఉన్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ తమ శిశువులకు ఈ చమురునే ఉపయోగిస్తున్నారు. ఇది కూడా అన్ని రకాల మూలికలు మరియు ప్రాకృతిక పదార్ధాలతో తయారు చేయబడిన ఒక ఆయుర్వేద నూనె. ఈ నూనెని వాడటం వలన సహజంగా మీ శిశువు చాలా సురక్షితంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది మీ శిశువు యొక్క కండరాలకు మరియు ఎముకలకు సరైన బలాన్ని అందించడంతో పాటు, మొత్తం శారీరక పెరుగుదలకు సహాయపడుతుంది.

చికో మసాజ్ ఆయిల్

Chicco Massage Oil[Buy it online]

ఇది మార్కెట్లో అన్ని రకాల బేబీ ప్రొడక్ట్స్ నూ తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన మంచి బ్రాండ్. ఇది మీ చర్మాన్ని మృదువుగా మరియు వెల్వెటీగా చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది రైస్ బ్రాన్ అనే ప్రత్యేక ఫార్ములా ద్వారా తయారు చేయబడింది. ఈ నూనెలో ఎటువంటి ఆల్కహాల్, డైస్ మరియు పారాబెన్స్ ఉండదు కాబట్టి, సున్నితమైన చర్మం కలవారికి ఇది చాలా మంచిది. ఇందులో ఆయిల్ అబ్సార్బింగ్ లక్షణాలు ఉన్నందున మీ చర్మంపై జిడ్డు సమస్యను తొలగిస్తుంది. ఈ అద్భుతమైన మసాజ్ ఆయిల్‌ని ఉపయోగించిన తర్వాత మీ శిశువు యొక్క చర్మం చాలా మృదువుగా మరియు సప్ప్లెర్ గా అవుతుంది.

సీగిలిస్ ఓవిలియన్

Seagulls Olivon[Buy it online]

ఈ రోజుల్లో, ఆలివ్ నూనెలోని గుడ్నెస్ వలన ఈ నూనె యొక్క డిమాండ్ పెరుగుతోంది. బేబీ మసాజ్ నూనెలు తయారు చేయడానికి కూడా ఆలివ్ నూనెని వాడుతున్నారు. బేబీ మసాజ్ ఉత్పత్తులలో కూడా, మీరు ఆలివ్ ఆయిల్ యొక్క చురుకైన పాత్రను చూడగలుగుతారు. మీ శిశువు యొక్క చర్మం మృదువుగా మరియు సున్నితంగా ఉండటానికే కాదు, మీరు వయోజన ఉపయోగాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. శిశువు యొక్క చర్మం అందంగా మరియు ప్రకాశించేలా చేయాలనుకునే తల్లిదండ్రులందరూ ఈ నూనెని సూచిస్తారు. స్నానం చేసే 30 నిమిషాల ముందు మీ శిశువు యొక్క శరీరంపై మసాజ్ చేయటానికి ఇది ఉత్తమమైన ఆయిల్. ఈ ఆయిల్‌ని రాసిన తరువాత మీ శిశువును సూర్యకాంతిలో కొద్ది సేపు ఉంచాలి, తద్వారా విటమిన్ డి చర్మం ద్వారా శోషించబడుతుంది మరియు మీ శిశువు యొక్క ఎముకలు మరియు కండరాలను బలంగా చేస్తుంది.

డాబర్ బేబీ మసాజ్ ఆయిల్ విత్ ఆలివ్ అండ్ ఆల్మాండ్

Dabur Badam Tail[Buy it online]

మీ చర్మానికి పారఫిన్ లేని మసాజ్ ఆయిల్ చాలా మంచిది. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ రంగులూ లేవు కనుక మీ శిశువుకు నిజంగా ఆరోగ్యకరమైనది. ఈ ఆయిల్తో మీ శిశువు యొక్క శరీరంపై రెగ్యులర్గా మసాజ్ చేసినట్లయితే, ఎముకలు మరియు కండరాలను నిజంగా బలపరుస్తుంది. ఇందులో ఎటువంటి రసాయనాలూ లేనందున మీ శిశువుకు ఎంతో మంచిది.

జాన్సన్ బేబీ ఆయిల్ విత్ విటమిన్ ఇ

Johnson's Baby Oil with Vitamin E[Buy it online]

శిశువు యొక్క చర్మాన్ని సురక్షితంగా ఉంచడంలో బాగా పనిచేయటం వలన చాలామంది తల్లిదండ్రులు జాన్సన్ బ్రాండ్ ను ఎంచుకుంటారు. తల్లులు అందరికీ శుభవార్త ఏమిటంటే ఇప్పుడు విటమిన్ ఇ యొక్క చికిత్స తో జాన్సన్ యొక్క బేబీ మసాజ్ ఆయిల్ లభిస్తోంది. ఇది మీ పిల్లల చర్మాన్ని మృదువుగా మరియు అందంగా చేస్తుంది. ఆన్‌లైన్ కొనుగోలు ద్వారా ఈ రోజే దీనిని ప్రయత్నించి చూడండి.

బయోటిక్ హెర్బల్ బయో వీట్ బేబీ సాఫ్ట్ మసాజ్ ఆయిల్

Biotique Herbals Bio Wheat Baby Soft Massage Oil[Buy it online]

ఇది పూర్తిగా మూలికలతో చేసిన శిశువు సంరక్షణ ఉత్పత్తులలో ఒకటి. మీ శిశువు కొరకు వచ్చే ఉత్తమ నాణ్యత కిట్లలో ఇది ఒకటి. ఈ నూనెని రాయటం వలన మీ చర్మాన్ని మృదువుగా మరియు అందంగా చేస్తుంది. ఇది మీ శిశువు యొక్క చర్మంకు సున్నితమైన సంరక్షణను అందిస్తుంది, ఇది చర్మం పొర నుండి పొడితనాన్ని దూరంగా ఉంచుతుంది.

పీజియన్ 200మిలి బేబీ ఆయిల్

Pigeon baby oil[Buy it online]

ఈ బేబీ కేర్ ఆయిల్ పరిపూర్ణ మాయిశ్చరైజింగ్ మూలకాన్ని కలిగి ఉంది, ఇది మీ శిశువు యొక్క చర్మాన్ని చాలా మృదువుగా మరియు అందంగా చేస్తుంది. మీరు దీనిని రాసి మసాజ్ చేస్తే, ఇది మీ శిశువు యొక్క చర్మంలోకి చొచ్చుకుపోయి, మృదువుగా మరియు అందంగా కనిపించేలా చేస్తుంది.

Posted on

Telugu tips to remove blackheads – తొందరగా బ్లాక్ హెడ్స్ తొలగించటం ఎలా?

మీ ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ మీ ముఖ అందాన్ని పాడుచేస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా ఎదురయ్యే సమస్య. సాధారణంగా పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతుంటారు. క్లెన్సెర్, టోనర్ మరియు మాయిశ్చరైజర్ లను వాడుతూ చర్మంపై  మంచి జాగ్రత్తలను తీసుకునే వ్యక్తులకు బ్లాక్ హెడ్స్ తక్కువగా ఉంటుంది. కానీ, ప్రస్తుత రోజులలో రెగ్యులర్గా చర్మంపై జాగ్రత్తలు తీసుకునేందుకు చాలా మందికి తగిన సమయం ఉండదు. కనుక, మేము బ్లాక్ హెడ్స్ ను తొందరగా తొలగించటం కోసం కొన్ని సమర్థవంతమైన హోం రెమెడీస్ ను ఈ ఆర్టికల్ లో వివరించాము.

బ్లాక్ హెడ్స్ యొక్క కారణాలు

 • హార్మోన్ల మార్పుల వలన లేదా అధిక సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వలన బ్లాక్ హెడ్స్ రావచ్చు.
 • జిడ్డు చర్మం ఉన్న స్త్రీలకు చర్మం మీద బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ముక్కు యొక్క మూలలు మరియు గడ్డం వంటి చోటులపై బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. వీటి వలన మీరు అలంకరణ చేసుకున్నప్పటికీ నల్లని మచ్చలతో మీ అలంకరణ అసంపూర్తిగా కనపడుతుంది.
 • కాలుష్యం వలన మన చర్మంపై అంటుకున్న మురికి మరియు కార్బన్ పదార్థాలు బ్లాక్ హెడ్స్ గా మారుతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగించేందుకు ఇంటి నివారణలు

చర్మం నుండి బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా ఉపయోగకరమైన మందులు మార్కెట్ లో లభిస్తాయి. అయినప్పటికీ, సైడ్ ఎఫెక్ట్స్ నుండి దూరంగా ఉండటానికి, సహజ నివారణ పద్దతులను అనుసరించండి.

టూత్ పేస్ట్

బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు ఇది ఒక సమర్థవంతమైన పరిష్కారం. టూత్ పేస్టుని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంపై రాసి సుమారు 25 నిమిషాలు ఉంచండి. మొదట్లో ఇది మంటను పుట్టించవచ్చు కానీ తర్వాత మంట తగ్గిపోతుంది. ఇలా రెండు వారాల పాటు చేసినట్లయితే, బ్లాక్ హెడ్స్ ఖచ్చితంగా తొలగిపోతుంది.

టొమాటో

టమాటోలోని యొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరచి, హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. ఇది బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను కూడా తొలగించటానికి సహాయపడుతుంది. తోలు ఒలిచిన టొమాటోను గుజ్జు చేసి బ్లాక్ హెడ్స్ పై రాయండి. మంచి ఫలితాల కోసం, రాసిన తరువాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగండి.

ఇంకో విధానం ఒక టొమాటో తీసుకొని బ్లెండ్ చేసి ఈ ప్యూరీలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలపండి. బాగా కలిపాక, మీ ముక్కు మీద ఈ మిశ్రమాన్ని మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకుంటూ రాయండి. ఐదు నుండి పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

నిమ్మకాయ

బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై ఉప్పు కలిపిన నిమ్మరసంను రాయండి. కానీ రాసే ముందు మీ ముఖాన్ని వెచ్చని నీటితో కడగాలి. ఉప్పు మరియు నిమ్మరసం యొక్క మిశ్రమం ముఖం మీద 20 నిమిషాలు ఉంచాలి, తరువాత వెచ్చని నీటితో మృదువుగా కడగండి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగును కూడా కలుపుకోవచ్చు.

పెరుగు, ఆలివ్ నూనె మరియు ఓట్ మీల్

రెండు టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను ఒక బౌల్లో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాయండి మరియు మంచి ఫలితాలను పొందడానికి సుమారు ఐదు నుండి ఏడు నిముషాల పాటు ఉంచండి. తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

తేనె

ఇది మన ఇంటిలో తక్షణమే అందుబాటులో ఉండే పదార్థం. దీనిని చర్మంపై రాయటం వలన బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగిస్తుంది. వట్టి తేనెని బ్లాక్ హెడ్స్ పై రాసి ఆరే వరకు ఉంచండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మరియు నీటిని సమాన భాగాలలో కలపండి. ఈ పేస్ట్‌ని బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై రాసి, మృదువుగా మసాజ్ చేయండి మరియు సుమారు 15 నిముషాల పాటు ఉంచండి. ఆ తరువాత వెచ్చని నీటితో కడగండి.

బంగాళదుంపలు

బంగాళదుంపలను తురిమి చర్మంపై రుద్దినప్పుడు బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అంతే కాదు స్కిన్‌ లైటనింగ్ కొరకు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను పొడి చేసి, ఒక టీ స్పూన్ పొడి, ఒక చిటికె పసుపు మరియు నిమ్మరసాన్ని బాగా కలుపుకోండి. దీనిని ముఖంపై రాసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. కడిగే ముందు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంపై మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన బ్లాక్ హెడ్స్ వేర్ల నుండి తొలగిపోతాయి.

గ్రీన్ టీ

ఒక టీ స్పూన్ ఎండిన గ్రీన్ టీ ఆకులను తీసుకొని కొద్దిగా నీటిని కలిపి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్ ని బ్లాక్ హెడ్స్ పై రాసి మృదువుగా మసాజ్ చేయండి. రెండు లేదా మూడు నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా చేయటం వలన మీ బ్లాక్ హెడ్స్ మరియు చర్మ రంధ్రంలో ఉండే జిడ్డుని కూడా తొలగిస్తుంది.  

ఓట్ మీల్

ఓట్ మీల్ తీసుకోవటం వలన మీరు ఫిట్ గా ఉండొచ్చు మరియు మీ బరువును నియంత్రించవచ్చ అని మీకు తెలుసు. కానీ, ఇది బ్లాక్ హెడ్స్ ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఒక చెంచా వోట్ మీల్, రెండు చెంచా టమోటా రసం మరియు ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని ఒక స్క్రబ్ను తయారు చేసుకోండి. దీనితో మీ బ్లాక్ హెడ్స్ పై కొద్ది సేపు స్క్రబ్ చేసి 10 నిమిషాల తరువాత కడగండి. క్లియర్ స్కిన్‌ కోసం ఈ ప్రక్రియను 2 లేదా 3 నెలలు చేయండి.

పచ్చి గుడ్డు

గుడ్డు యొక్క తెల్లసొనలో ఉన్న పోషకాలు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తాయి. పచ్చి గుడ్డు నుండి తెల్లసొనను తీసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

పాలు

బ్లాక్ హెడ్స్ మురికి వలన ఏర్పడుతుంది. కనుక నేచురల్ క్లెన్సెర్లను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయటం వలన బ్లాక్ హెడ్స్ ని నిరోధించవచ్చు. ఐదు లేదా ఆరు స్పూన్ల పచ్చి పాలలో ఒక పత్తిని ముంచి ముఖం పై రాయండి. కొద్ది సేపు మృదువుగా మసాజ్ చేసి వెచ్చని నీటితో కడగండి.

క్లే ప్యాక్

మీ ముఖం నుండి అధిక కార్బన్లు మరియు ధూళిని తీసివేయడానికి క్లే ప్యాక్ ఒక అద్భుతమైన పరిహారం. మీరు ముల్తానీ మిట్టి వంటి సహజ మట్టిని పొందగలిగితే, వీటిని ఉపయోగించి మీ ముఖం నుండి బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించవచ్చు. ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ క్లే పౌడర్ మరియు కొన్ని చుక్కల ఆపిల్ సీడ్ వినిగర్‌ని కలుపుకొని ఒక పేస్ట్ లా చేసుకోండి. దీనిని మీ బ్లాక్ హెడ్స్ పై రాసి 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోండి.

పుదీనా రసం మరియు పసుపు

కొన్ని పుదీనా ఆకులను రుబ్బి రసాన్ని పిండి ఒక బౌల్ లో తీసుకోండి. అందులో కొద్దిగా పసుపుని కలుపుకొని బ్లాక్ హెడ్స్ పై రాయండి. ఈ మిశ్రమం ఆరే వరకు వెయిట్ చేసి వెచ్చని నీటితో కడగండి.

మొక్కజొన్న స్క్రబ్

మీ వద్ద ఉండే పేస్ వాష్ లో అర స్పూన్ మొక్కజొన్న పొడిని కలుపుకొని బ్లాక్ హెడ్స్ పై రాసి స్క్రబ్ చేయండి. పది నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

తేనె మరియు చక్కెర

ఇంట్లో బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి ఇది అత్యంత సులభమయిన మరియు సమర్థవంతమైన మార్గం. సగం టీస్పూన్ చక్కెర మరియు ఒక టీస్పూన్ తేనెని కలుపుకోండి. దీనిని బ్లాక్ హెడ్స్ పై రాసి మసాజ్ చేసి కొద్ది సేపు తరువాత కడగండి.

మెంతాకులు

కొన్ని మెంతాకులను రుబ్బి ఒక పేస్ట్ లా చేసుకోండి. దీనిని బ్లాక్ హెడ్స్ పై రాసి 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

చక్కెర మరియు నిమ్మకాయ

ఈ మిశ్రమం చర్మం మీది మృతకణాలను తొలగించడానికి ఉత్తమమైనది. ఇది చర్మం నుండి విషతుల్య పదార్థాలను తొలగిస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. దీనితో మీ ముక్కు మీద మృదువుగా కొన్ని నిమిషాల పాటు వలయాకార కదలికలలో మసాజ్ చేయండి. పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఉత్తమమైన మరియు వేగవంతమైన ఫలితాల కొరకు ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయండి.

పాలు మరియు జిలాటిన్

ఈ మిశ్రమం చర్మ సంరక్షణకు బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వాసన లేని జిలాటిన్ పొడి 1 టేబుల్ స్పూన్ పాలు వేసి, నెమ్మదిగా రెండు పదార్థాలను కలపాలి. ఇప్పుడు, కొన్ని సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయండి. మిశ్రమం కొద్దిగా చల్లారాక, మీ ముక్కు మీద ఒక పొరలా పూసుకోండి. సుమారు 15 నిముషాలు ఆరనివ్వండి. తరువాత ఆ పొరను తీసివేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

తేనె మరియు పైనాపిల్

పైనాపిల్ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది మరియు తేనె చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఒక పైనాపిల్ ను చిన్న ముక్కలుగా కోసి, బ్లెండ్ చేయండి. దాని రసాన్ని వడగట్టి ఒక గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల తేనెని ఈ రసంలో కలపండి. మీ ముఖానికి ఈ మాస్కును రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత, గోరు వెచ్చని నీటిలో ముంచిన బట్టతో తుడిచేయండి.

నారింజ తొక్క

ఆరెంజి తొక్క లో విటమిన్ సి ఉంటుంది. ఇది మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి వివిధ చర్మ సమస్యలతో పోరాడుతుంది. నారింజ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తని పొడిలా చేసి జాడీలో స్టోర్ చేసుకోండి. ఒక చెంచా ఆరెంజి పొడిని 2 చెంచాల రోజ్ వాటర్లో కలిపి మెత్తని పేస్టులా చేయండి. దీన్ని మీ బ్లాక్ హెడ్స్ పై రాసి ఎండనివ్వండి. తరువాత తడి చేతులతో మెల్లగా తొలగించి చల్లని నీటితో కడగండి.

ఆలోవెరా

కలబంద లోని యాంటీ బయాటిక్ లక్షణాలు చర్మం లోపాలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఇది చర్మానికి ఉపశమనాన్ని ఇస్తుంది, ఎక్కువ జిడ్డు ఉత్పత్తి కాకుండా చూస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది, మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా నివారిస్తుంది. మీరు ఆలోవెరా జెల్ ను నేరుగా బ్లాక్ హెడ్స్ పై లేదా పూర్తీ ముఖంపై రాసుకుని 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు ఆహారాలు

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి స్ట్రిప్స్ మరియు ఎన్నో రకాల క్రీమ్స్ లభిస్తున్నాయి. కానీ, వీటిని వేర్ల నుండి తొలగించటం చాలా ముఖ్యం. బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఆహారాల గురించి కూడా చూద్దాం.

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న తృణధాన్యాలు సులభంగా లభిస్తాయి. మీరు మీ ముఖం నుండి బ్లాక్ హెడ్స్ ను తొలగించాలని అనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. వివిధ రకాలైన స్ప్లిట్‌ బఠానీలు, కిడ్నీ బీన్స్, కాయ ధాన్యాలు మొదలైనవి తీసుకోండి. మీరు నాన్ వెజ్ ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలనుకుంటే అధిక ప్రోటీన్ ఉన్న వాటిని కాకుండా తాజా నీటి చేపలు మరియు స్కిన్‌ లెస్ పౌల్ట్రీ మాంసం లాంటి లీన్ ప్రోటీన్‌ను తీసుకోండి.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం

విటమిన్ సి ఉన్న పండ్లు మీ చర్మంపై బ్లాక్ హెడ్స్ చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, నారింజ, నిమ్మకాయ, బొప్పాయి, పైనాపిల్ మొదలైనవి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు. ఇవి సహజంగా లభించే ఆహారాలు మరియు చర్మానికి తగినంత పోషకాలను అందిస్తుంది. మీరు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా తీసుకోవచ్చు.

సెలీనియం అధికంగా ఉండే ఆహారం

విటమిన్లు మరియు ప్రొటీన్లతో పాటు, మీ శరీరానికి ఇతర ఖనిజాలను అందించటం కూడా చాలా ముఖ్యం. సెలీనియం లాంటి ఖనిజాలు తక్కువగా ఉండటం వలన కూడా బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. బార్లీ, తృణధాన్యాలు, గోధుమ బియ్యం, వోట్స్ వంటి సెలీనియం రిచ్ ఫుడ్ ను రెగ్యులర్గా తీసుకోవటం వలన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

గ్రీన్ టీ

మీ శరీరంలో అధికంగా టాక్సిన్స్ ఉత్పత్తి అవటం వలన కూడా బ్లాక్ హెడ్స్ రావచ్చు. గ్రీన్ టీ ఒక డీటాక్స్ హెర్బ్. ఇది మీ శరీరంలోని అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ ముఖం నుండి నెమ్మదిగా బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ త్రాగాలి. అంతే కాదు ఇది మీ చర్మాన్ని సున్నితంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది.

Posted on

Benefits of castor oil in Telugu – స్కిన్‌ మరియు హెయిర్ సంరక్షణ కోసం కాస్టర్ ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలి

కాస్టర్ ఆయిల్ అనేది స్టికీగా ఉండే ఒక చమురు, ఇది ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి సంబంధించిన అనేక చికిత్సలకు ఉపయోగిస్తారు. కాస్టర్ ఆయిల్ స్టికీగా ఉన్నపటికీ అది మీ చర్మం మరియు జుట్టుకు అనేక రకాలుగా పరిహారాలను అందిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల, బట్ట తల మరియు చుండ్రు వంటి సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. చర్మం పొడిబారడం, పింపుల్స్ లాంటి అనేక చర్మ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.

కాస్టర్ యొక్క స్కిన్ బెనిఫిట్స్

క్లియర్ స్కిన్‌

ఇది స్కిన్‌ క్లెన్సెర్ గా పనిచేస్తుంది. స్నానానికి 15 నిమిషాల ముందు మీ శరీరంపై కాస్టర్ ఆయిల్ ను రాయండి. తరువాత వేడి నీటితో స్నానం చేయండి. ఇది శరీరంలోని చనిపోయిన కణాలను శుభ్రపరచి చర్మాన్ని స్పష్టంగా మరియు తాజాగా చేస్తుంది.

ఏజ్ స్పాట్స్

వయస్సు వలన కలిగే మచ్చలకు ఉత్తమమైన పరిహారం కాస్టర్ ఆయిల్. మీ మచ్చల మీద ఆముదాన్ని రాసి సున్నితంగా మసాజ్ చేయండి.

పాదాల పగుళ్లు

రాత్రి పడుకునే ముందు పాదాల పగుళ్లపై వేడి చేసిన కాస్టర్ నూనెని రాసి ఉదయాన్నే వేడి నీటితో కడగండి. ఇది పగుళ్ల వలన కలిగే నొప్పిని తొలగిస్తుంది మరియు క్రమంగా వాడటం వలన పగుళ్లను కూడా తొలగిస్తుంది.

ముడతలను తొలగిస్తుంది

ముడతలు ఉన్న చోట్ల పై కాస్టర్ నూనెని రాయండి. చర్మం నూనెని పూర్తిగా పీల్చుకున్న తరువాత వేడి నీటితో కడగండి. ఇలా క్రమంగా చేయటం వలన ముడతలు తొలగిపోతాయి.

మచ్చలను తొలగిస్తుంది

కాస్టర్ నూనెతో బేకింగ్ సోడాని కలుపుకొని చర్మ మచ్చలపై రాయండి. ఇలా క్రమంగా చేయటం వలన మచ్చలు తొలగిపోతాయి.

స్ట్రెచ్ మార్క్స్ చికిత్స

కాస్టర్ ఆయిల్ చర్మపు సాగిన గుర్తులను తొలగిస్తుంది. మీ స్ట్రెచ్ మార్క్స్‌పై ఆముదం నూనెని ఒక నెల పాటు వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

పగుళ్లు ఉన్న గోరులకు మంచిది

ఒక వారం పాటు రోజూ రాత్రి గోరులు మరియు వేళ్ల చివర కాస్టర్ ఆయిల్ రాయటం వలన గోరుపై పగుళ్లని నిరోధిస్తుంది.

మాయిశ్చరైజర్‌

కాస్టర్ ఆయిల్ చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో లభ్యమయ్యే విటమిన్ ఇ చర్మం యొక్క ఎలాస్టిసిటీని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ముడతలు అలాగే ఫైన్ లైన్స్ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

సన్ బర్న్

వేసవి కాలంలో, సన్ బర్న్స్ అనేక మంది ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యల్లో ఒకటి. కాస్టర్ ఆయిల్ సన్ బర్న్ కొరకు ఒక అద్భుతమైన పరిష్కారం అందిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె తీసుకోండి. దీనిని మీ చర్మంపై ఒక వారం పాటు రాయండి.

మొటిమలు

జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్యలు ఎక్కువగా ఉంటుంది. కాస్టర్ ఆయిల్ లో రిసినోలిక్ ఆమ్లం ఉన్నందున ఇది మొటిమల చికిత్సకు సహాయపడుతుంది. దీనిని మీ ముఖం మీద రాయటానికి ఒక విధానం ఉంది. ఈ ప్రక్రియను రాత్రి పడుకునే ముందు చేయాలి. ముందుగా వెచ్చని నీటితో ముఖాన్ని కడగండి, మీ చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు కొద్దిగా కాస్టర్ ఆయిల్ తీసుకొని మీ ముఖం మీద రాసి ఉదయం కడగండి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన మొటిమలు తొలగిపోతాయి.

పులిపిర్లు

ఐ లిడ్స్, మెడ, మణికట్టు మరియు అంకల్ లాంటి చోట్లలో పులిపిర్లు సాధారణంగా వస్తుంది. ఇవి హానికరం కానప్పటికీ మన చర్మంపై అసహ్యంగా ఉంటుంది. మీరు ఒక సహజ పద్ధతిలో వీటిని వదిలించుకోవాలనుకుంటే రోజూ దానిపై కాస్టర్ నూనెని రాయండి.

స్కార్స్ ని లైటెన్ చేస్తుంది

కాస్టర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మం యొక్క కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ముఖంపై కట్స్ వలన అలాగే దెబ్బల వలన ఏర్పడిన మచ్చలను తొలగేందుకు క్యాస్టర్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక పాత్రలో తీసుకుని బాగా కలపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని ప్రతి రోజు పాటిస్తే మెరుగైన ఫలితాన్ని పొందుతారు.

డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్లలో అసమతుల్యం వంటివి డార్క్ సర్కిల్స్ సమస్యకు దారితీస్తుంది. కాస్టర్ ఆయిల్ ఈ సమస్యను నివారించేందుకు తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ కాస్టర్ ఆయిల్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక బౌల్ లో తీసుకోండి. ఈ మిశ్రమం గడ్డకట్టే వరకు ఫ్రీజ్ చేయండి. తరువాత ఒక క్యూబ్‌ను తీసుకుని కంటి కింద సున్నితంగా మసాజ్ చేయండి. ప్రతి రోజూ ఇలా చేయటం వలన  వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాలను పొందుతారు. కలబంద జెల్ చర్మాన్ని సూత్ చేస్తుంది మరియు చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది.

కాస్టర్ యొక్క హెయిర్ బెనిఫిట్స్

జుట్టు మల్లీ పెరిగేందుకు

పాత రోజులలో ఆముదము హెయిర్ ఆయిల్గా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఆ స్థానాన్ని తీసుకుంది ఎందుకంటే కాస్టర్ ఆయిల్ ప్రకృతికంగా మందంగా ఉంటుంది మరియు సుగంధంగా ఉండదు. కానీ ఆముదము జుట్టు పెరుగుదలలో చాలా సహాయపడుతుంది. స్కాల్ప్ పై ఆముదాన్ని రాయండి. వేడి చేసిన కాస్టర్ నూనెని ఉపయోగించడం ఉత్తమం. ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి.

హెయిర్ కండిషనింగ్

ఇది హెయిర్ కండిషనింగ్గా పనిచేస్తుంది. కాస్టర్ నూనెలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

స్ప్లిట్‌ ఎండ్స్ ను తొలగిస్తుంది

కురులకు సరైన పోషణ ఇవ్వకపోవటం వలన స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఎదురవుతుంది. ఎన్నో జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు వివిధ రకాల షాంపులను ఉపయోగించినప్పటికీ ఈ సమస్య తొలగిపోకుండా ఉండొచ్చు. కాస్టర్ ఆయిల్ ఉపయోగించి చూడండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు.

చుండ్రు

మీ జుట్టు చాలా పొడిగా ఉన్నప్పుడు చుండ్రు సమస్య ఏర్పడవచ్చు. దీని వలన మీ స్కాల్ప్ చాలా దురదగా ఉండొచ్చు మరియు చర్మపు రేకులు రాలవచ్చు. కొన్ని చుక్కల కాస్టర్ ఆయిల్‌ని మీ తలపై రాయండి. కాస్టర్ ఆయిల్ మీ చర్మం యొక్క పొడితనాన్ని తొలగిస్తుంది మరియు చర్మాన్ని మాయిశ్చరైస్ చేస్తుంది. మీరు ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని కలుపుకొని మీ జుట్టు మీద రాయటం వలన కూడా చుండ్రుని వదిలించుకోవచ్చు.

ప్రకాశవంతమైన జుట్టు

కాలుష్యం, ఆహారంలో కలుషితం మరియు రసాయనం ఎక్కువగా ఉండే షాంపులను ఉపయోగించడం వలన జుట్టు సహజ ప్రకాశాన్ని కోల్పోతుంది. మీరు మీ జుట్టు యొక్క సహజమైన ప్రకాశాన్ని తిరిగి పొందాలనుకుంటే, కాస్టర్ ఆయిల్ ఒక అద్భుతమైన పరిహారం. దీని కోసం కాస్టర్ ఆయిల్ ని ప్రత్యేకమైన మార్గంలో ఉపయోగించాలి. ఒక గిన్నెలో తగినంత ఆయిల్ ను తీసుకొని దానిని వేడి చేయండి. ఇప్పుడు మీ జుట్టు మరియు జుట్టు మూలాల మీద రాసుకోండి మరియు మీ జుట్టును ఒక టవెల్ తో చుట్టి రాత్రంతా అలాగే ఉంచండి. నిద్ర లేచిన తర్వాత, మీ జుట్టును ఒక మైల్డ్ షాంపుతో కడగండి. ఇది సులభంగా మీ జుట్టు లోపల తేమను లాక్ చేస్తుంది మరియు జుట్టు నిగనిగలాడేలా మరియు అందంగా చేస్తుంది.

హెయిర్ కలర్

మీరు జుట్టు రంగును ఉపయోగిస్తున్నట్లయితే, దానిని సరైన విధంగా నిర్వహించడం చాలా అవసరం. జుట్టుకు రంగును వేసిన తరువాత రెగ్యులర్ గా కాస్టర్ ఆయిల్‌ని రాయండి. ఇది మీ హెయిర్ కలర్ ని టోన్ చేస్తుంది మరియు జుట్టుని సురక్షితంగా ఉంచుతుంది.

కాస్టర్ యొక్క స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది

చాలా మందికి చర్మం మరియు జుట్టు మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చుండ్రు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క ఒక రూపం. మీ జుట్టు మూలాలు మరియు చర్మం మీద ఆముదాన్ని రాయటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది.

Posted on

Telugu tips to know about vomiting in babies – మీరు పసి పిల్లలలో వాంతులు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

శిశువు యొక్క వాంతులకు చాలా కారణాలు ఉండవచ్చు. చాలా సందర్భాలలో పిల్లలలో వాంతులు ప్రమాదకరం కావు మరియు ఏ మందులనూ ఉపయోగించకుండా గుణపరచవచ్చు. కొన్ని సార్లు వాంతులు ఇతర అనారోగ్యం వలన కావచ్చు, అటువంటప్పుడు ప్రత్యేకమైన చికిత్స చేయవలసి ఉంటుంది. పిల్లలలో వాంతుల గురించి మరియు వాటిని ఎలా వ్యవహరించాలన్న ముఖ్యమైన సమాచారాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ని చదవండి.

పసి పిల్లల వాంతులకు కారణాలు

ఆహారం వలన సమస్యలు

పిల్లల్లో వాంతుల యొక్క అతి సాధారణ కారణం ఆహార సమస్యలు. ఫార్ములా పాలు లేదా రొమ్ము పాలను ఎక్కువగా ఇవ్వటం వలన లేదా వాటి అలర్జీ వలన వాంతులు అవుతాయి. శిశువుకు సరైన మార్గంలో పాలు ఇవ్వక పోవడం కూడా వాంతులు రావడానికి కారణమవుతుంది. మీ శిశువు ఆహారాన్ని తీసుకున్న వెంటనే కక్కినట్లయితే, అది సరైన రీతిలో పాలు ఇవ్వక పోవటం వలనే అవుతుంది.

కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పుడుతున్నప్పుడు: పసి పిల్లల శరీరం కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పడటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అటువంటి దశలలో, మీ శిశువు ఆహారానికి ఇమడ్చుకోలేక వాంతులు చేసుకోవచ్చు. ఈ రకమైన వాంతి గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇన్ఫెక్షన్

పిల్లలు తరచుగా వాంతులు చేసుకోటానికి శరీరంలోని వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక మూల కారణం. శ్వాస మార్గంలో ఇన్ఫెక్షన్, గొంతులో రద్దీ లాంటి ఏదైనా కారణాలు పిల్లలలో వాంతిని ప్రేరేపించగలవు. మీ శిశువుకు జలుబు లేదా ఇటీవల ఫ్లూ నుండి కోలుకొని ఉంటే, వాంతులు చాలా సాధారణంగా అవుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్ వలన కూడా కావచ్చు. మీ శిశువుకు తరచుగా వాంతులతో పాటు డయేరియా, ఉదరంలో నొప్పి లేదా ఆకలి లేకపోవటం లాంటివి ఉన్నట్లయితే, దీనికి ప్రధాన కారణం కడుపులో ఇన్ఫెక్షన్. చెవి ఇన్ఫెక్షన్, మూత్ర నాళాల సంక్రమణం లేదా గొంతు నొప్పి కూడా పిల్లలలో తరచూ వాంతులకు కారణం అవుతుంది.

మోషన్ అనారోగ్యం

మీ పిల్లలు కారులో లేదా బస్సులో ప్రయాణించేటప్పుడు లేదా ప్రయాణం ముగిసిన వెంటనే వాంతులు చేసుకుంటే అది కేవలం మోషన్ అనారోగ్యం వలనే. మీ ప్రయాణం ముగిసిన తరువాత మంచి విశ్రాంతి పొందితే స్వయంచాలకంగా ఈ సమస్య నుండి బయటికి వస్తారు. వయస్సు పెరిగే కొద్ది, ఈ పరిస్థితి తొలగిపోతుంది.

ఏడవటం

చాలా సేపు ఏడ్చే పిల్లలలో గాగ్ రిఫ్లెక్స్ ప్రేరేపించటం ద్వారా వాంతులు చేసుకుంటారు. ఏమైనప్పటికీ, ఈ కారణం వలన వంతుల గురించి చింతించవలసిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, వారు ఆరు గంటల లోపలే ఉపశమనం పొంది ఏడుపును ఆపేస్తారు . అందువలన, ఇది మీ చిన్నారికి ఏ విధంగా కూడా దీర్ఘకాలిక ఆరోగ్య నష్టం కలిగించదు.

పాయిజనస్ పదార్థాలను తీసుకోవటం వలన కూడా తరచూ వాంతులు అవుతాయి. ఈ పరిస్థితిని పిలోరిక్ స్టెనోసిస్ అని అంటారు. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

వాంతులు మరియు ఉమ్మి వేయడం మధ్య వ్యత్యాసం తెలుసుకోండి

కొత్త తల్లులకు వాంతులు మరియు ఉమ్మి వేయడం మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే రెండూ ఒకేలా కనిపిస్తాయి. ఉమ్మి వేయడం పిల్లలలో చాలా సాధారణమైనది మరియు మీరు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

ఉమ్మినప్పుడు, బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాలు బయటికి వస్తాయి మరియు మీరు దానిని గమనించక పోవచ్చు. కడుపులోని ఆహారాన్ని గొంతులో గాగుల్ చేయటం కూడా ఉమ్మడానికి ఒక సాధారణ కారణం. తినేటప్పుడు శిశువు గాలిని మింగడం మరియు గాలి తేపు వలె బయటికి వస్తున్నప్పుడు, కొంత ద్రవం దానితో పాటు బయటకు వస్తుంది. భోజనమైన వెంటనే ఉమ్మి వేయడం మరింత సాధారణమైనది.

మరోవైపు, వాంతుల సమయంలో, ఆహారాన్ని కడుపు కండరాలు బలవంతంగా బయటకు తోస్తాయి. దీని వలన మీ శిశువు ఏడవడం మొదలుపెడతారు లేదా అలసిపోతారు. వాంతి మొత్తాలు కూడా ఎక్కువగా ఉంటుంది.

మీ శిశువు వాంతులు చేసుకుంటే ఏమి చేయాలి?

మీ శిశువు వాంతులు చేసుకుంటే, చాలా సందర్భాలలో మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అదంతట అదే ఆగి పోతుంది మరియు పిల్లలు వాటికి చాలా అలవాటు పడి ఉంటారు. అయితే, మీ శిశువు సౌకర్యంగా ఉందని నిర్ధారించుకోడానికి మీరు ఈ క్రింద విషయాలను గుర్తుంచుకోవాలి. పిల్లలు వాంతి చేస్తున్నప్పుడు, వారిని నిటారుగా నిల్చోబెట్టడం ఉత్తమమైనది. ఎందుకంటే, బయటికి వచ్చే ఆహారం మరింత సులభంగా వస్తుంది మరియు వాంతి చేసుకొనేటప్పుడు ఆహారం ఇరుక్కునే అవకాశం కూడా తగ్గుతుంది.

తరువాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ పై పడుకోబెట్టండి, తలపై మరియు మెత్తలో ఏ ఎత్తులూ లేకుండా, ఒక ఫ్లాట్ సర్ఫేన్ పై శిశువుని నిద్రపుచ్చండి. మీ శిశువు సాలిడ్ ఆహారాలను తీసుకోవడం ప్రారంభించినట్లయితే, తదుపరి 24 గంటలు పాపకు సాలిడ్ ఆహారం ఇవ్వకండి. వాంతుల సమయంలో ద్రవాలు మాత్రమే ఇవ్వాలని నిర్ధారించుకోండి.

వాంతుల తరువాత పిల్లలలో డీహైడ్రేషన్ ను నిరోధించడం ఎలా?

మీ పిల్లలకు తరచుగా వాంతులు అవుతున్నప్పటికీ నిర్జలీకరణ లక్షణాలను చూపక పోవచ్చు. కనుక, మీ శిశువు తరచుగా వాంతులు చేస్తే, తగినంత ద్రవాలను ఇవ్వాలని గుర్తుంచుకోండి. సాదా నీటిని ఇవ్వడానికి బదులుగా, డీహైడ్రేషన్ చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉండే ఎలక్ట్రోలైట్ లాంటి ద్రవాన్ని ఇవ్వండి. ఎలక్ట్రోలైట్ ఎలా ఇవ్వాలని మరియు ఎంత ఇవ్వాలని వైద్యుడిని సంప్రదించి తెలుసుకోవటం మంచిది. వాంతి చేసుకున్న వెంటనే బిడ్డకు ఎలక్ట్రోలైట్ ద్రవాన్ని ఇవ్వకూడదు. 10 నుండి 15 నిమిషాల విశ్రాంతి తరువాత ఇవ్వండి. అలాగే, మొత్తం ఎలక్ట్రోలిట్ సొల్యూషన్ ని ఒకే సారి ఇవ్వకూడదు, ఒక స్పూన్ తో చిన్న మొత్తాలలో తరచూ ఇవ్వండి.

ఒక వేళ మీ శిశువుకు తీవ్రమైన నిర్జలీకరణ సమస్య ఉన్నట్లయితే ఇనాక్టివ్ గా ఉంటారు, నోరు ఎండిపోతుంది, కన్నీళ్లు లేకుండా ఏడుస్తారు, మూత్రవిసర్జన తగ్గిపోతుంది, పెదవులు పొడిగా ఉంటాయి. అటువంటప్పుడు వెంటనే అత్యవసర చికిత్స చేయాలి.

వాంతి నుండి మరియు డీహైడ్రేషన్ ను నివారించడానికి పండ్ల రసాలను ఇవ్వడం మంచిది కాదు, ఇది కడుపును అప్‌సెట్ చేసి తరచూ వాంతులు రావటానికి కారణమవుతుంది.

పిల్లలను వాంతులు లేదా ఉమ్మడం నుండి నిరోధించడం ఎలా

మనం పిల్లలలో వాంతికి కారణాలను ఎల్లప్పుడూ నిరోధించలేనప్పటికీ, ఉమ్మివేయడాన్ని నివారించవచ్చు. మీ శిశువుకు నెమ్మదిగా మరియు చిన్న మొత్తాలలో ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పిల్లలు ఉమ్మడాన్ని ప్రివెంటి చేయవచ్చు. తిన్న తరువాత తేపు వచ్చేలా చేయటం వలన కూడా ఉమ్మటాన్ని వాంత్ చేయవచ్చు. తిన్న వెంటనే శిశువును నిద్రపుచ్చకూడదు.

మీ శిశువుకు మోషన్ అనారోగ్యం కారణంగా వాంతులు అవుతున్నట్లయితే, మీ ప్రయాణంలో కొన్ని విరామాలను తీసుకోండి. ఇది వాంతులను తగ్గిస్తుంది.

నా శిశువు వాంతిలో రక్తం ఉంది, ఇది తీవ్రమైన సమస్యనా?

మీ శిశువు యొక్క వాంతిలో ఒక రక్తపు బొట్టు లేదా పైత్య రసం ఉన్నప్పటికీ మీరు దిగులు చెందనక్కర్లేదు. వాంతి చేసుకొనే సమయంలో అన్నవాహిక లైనింగ్ యొక్క కొన్ని చిన్న రక్త నాళాలు సులభంగా చినిగి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది. గత ఆరు గంటల్లో నోటిలో ఏదైనా కట్స్ వలన లేదా ముక్కు రక్తస్రావం నుండి వచ్చిన రక్తాన్ని మింగినట్లయితే మీ శిశువు యొక్క వాంతిలో కొంత రక్తం ఉండొచ్చు. అయినప్పటికీ, రక్తపోటు పదేపదే లేదా రక్తం యొక్క మొత్తాన్ని వాంతితో అధికరించటం లాంటి సూచనలు ఉన్నట్లయితే, వెంటనే అత్యవసర చికిత్స చేయండి.

డాక్టర్ ని ఎప్పుడు పిలవాలి?

పిల్లలలో వాంతులు సాధారణంగా హాని కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో తక్షణ వైద్య సహాయం పొందాలి.

 • మీ బిడ్డ 24 గంటల కన్నా ఎక్కువ తరచుగా వాంతులు చేస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను పిలవండి.
 • మీ శిశువుకు 3 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, జ్వరం (100.4 డిగ్రీల ఫేరన్‌హీట్ యొక్క మల ఉష్ణోగ్రత) మరియు పదేపదే వాంతులు అవుతుంటే, వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందండి.
 • డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు కనిపించినప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే వైద్య సహాయం పొందడం ముఖ్యం.
Posted on

Calcium rich foods in Telugu – కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు – కాల్షియం రిచ్ ఫుడ్స్

మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజాలలో కాల్షియం చాలా ముఖ్యమైనది. కాల్షియం ఒక అద్భుతమైన పదార్ధం, దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కాల్షియం యొక్క ప్రయోజనాలను చూద్దాం

 • బలమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజము.
 • నెర్వస్ సిస్టమ్ యొక్క పనితీరుకు సహాయపడుతుంది.
 • మెదడు నుండి ఇతర శరీర భాగాలకు మెసేజ్‌ని తీసుకువెళ్లే నరాలకు సహాయపడుతుంది.
 • ఎక్కువ ఫాట్ బర్నింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.
 • ప్రీమెన్స్ట్రుల్ సిండ్రోమ్ సమయంలో కలిగే అసౌకర్యాన్ని తొలగిస్తుంది.
 • కొలరెక్టల్, ఒవేరియన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్‌లను నివారించటానికి శరీరంలో సరైన కాల్షియం స్థాయిలు సహాయపడుతాయి.
 • శరీరం మొత్తం రక్త ప్రసరణకు సహాయం చేయడంలో కాల్షియం కీలక పాత్ర వహిస్తుంది.

కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు

పాలు, జున్ను మరియు పాల ఉత్పత్తులు ప్రధాన కాల్షియం ప్రొవైడర్స్. పాల ఉత్పత్తులలో మాత్రమే కాదు ఆకుకూరలు, సీ ఫుడ్స్, లెగ్యూమ్ మరియు పండ్లలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్రింద చెప్పిన కాల్షియం రిచ్ ఆహారాలతో పాటు అన్ని రకాల పోషకాలనూ తీసుకోవడం చాలా ముఖ్యం.

పాలు

పాలలో అత్యధికంగా కాల్షియం ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు. కనుక ప్రతి రోజూ కనీసం ఒక గ్లాసు పాలలో ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకుంటే చాలా మంచిది.

వైట్ బీన్స్

వైట్ బీన్స్ లో కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వివిధ వంటకాల్లో జోడించుకోవచ్చు. ఒక కప్పు వైట్ బీన్స్ తినడం వల్ల 100 మీ గ్రా కాల్షియం శరీరానికి అందుతుంది.

క్యాన్డ్ సాల్మన్

క్యాన్డ్ సాల్మన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఎముకలు క్యానింగ్ ప్రక్రియ ద్వారా మృదువుగా చేయబడతాయి. కనుక మాంసంతో సహా ఎముకలను కూడా సులభంగా చూర్ణం చేయవచ్చు. కాల్షియం మరియు ఒమేగా 3 ఫాటీ యాసిడ్‌ను అధికంగా అందించే సాల్మన్ కేకులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

సార్డినెస్

సార్డినెస్ వంటి ఆరోగ్యవంతమైన చేపల్లో కాల్షియం, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ డి ఉంటుంది. మార్కెట్లో సులభంగా లభించే ఈ సముద్రపు చేపలో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ చేపల ద్వారా మీకు రోజుకు కావాల్సిన 33% యూనిట్ల కాల్షియం లభిస్తుంది.

ఎండిన అత్తి పండ్లు

ఎండిన అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని రెగ్యులర్గా తినండి.

బోక్ చోయ్

బోక్ చోయ్ అనేది ఒక చైనీస్ క్యాబేజీ. ఇందులో విటమిన్ ఏ మరియు సి, కాల్షియం మరియు ఫైబర్లు అధికంగా ఉంటాయి. దీనిని వెల్లుల్లి మరియు ఆలివ్ నూనె తో వేయించి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటను తయారు చేయవచ్చు.

మొలాసిస్

నల్లని మొలాసిస్ లో కాల్షియం, ఐరన్ మరియు ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది తియ్యగా ఉంటుంది, కనుక అనేక డెసెర్ట్స్ లో మరియు పాన్ కేక్స్ పై చేర్చుకోవచ్చు. మొలాసిస్ ని ఉపయోగించి బ్రౌన్ షుగర్ ను కూడా తయారు చేయవచ్చు.

కేల్

కేల్ లో కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని అన్ని రకాల సలాడ్స్ లో ఉపయోగించవచ్చు.

బాదాం

కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలలో బాదాం ఒకటి. ఇందులో ఫాట్స్, విటమిన్ ఇ మరియు ప్రోటీన్లు కూడా ఉంటాయి. అంతేకాదు ఇది ఒక సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది మరియు హార్ట్ అట్టాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పచ్చని ఆకుకూరలు

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. బచ్చలికూర, మెంతాకులు, లెటుస్, తోటకూర, పాలకూర మొదలైన ఆకుకూరలను మీ డైట్లో చేర్చుకోండి. వీటిని సూప్ లేదా జ్యూస్ మరియు స్మూతీస్ లలో కూడా చేర్చుకోవచ్చు.

క్యాబేజీ, బ్రోకలీ

100 గ్రాముల బ్రోకలీలో 47 మి గ్రా కాల్షియం ఉంటుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవటం వలన శరీరానికి అధిక మోతాదులలో కాల్షియంను అందిస్తాయి. ఈ కూరగాయలు నాడీ వ్యవస్థకు మంచిది. రక్తపోటు స్థాయిని నిర్వహించడం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఓక్రా (బెండకాయ)

దీనిలో కాల్షియం మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నె బెండకాయలో 175 మి గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వంద గ్రాముల బెండకాయలో కాల్షియం 82 మి గ్రా కాల్షియం ఉంటుంది.

నువ్వుల గింజలు

నువ్వుల గింజలు చాలా ఆరోగ్యకరమైనది. వీటిలో ఫోలిక్ ఆసిడ్స్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. వీటిని అనేక వంటలలో మరియు రొట్టెలలో చేర్చుకొని తినండి.

అరటి పండు

అరటి పండ్లలో కాల్షియంతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే లేదా వ్యాయామాలను చేసే ముందు తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

నారింజ పండు

ఆరెంజ్ లో కాల్షియం మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ని ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవచ్చు.

కాల్షియంతో బలపరచిన ఆహారాలు

ఇటీవల కాలంలో కాల్షియంతో కూడిన ఆహారాలు (ఫోర్టిఫైడ్ ఫుడ్స్) మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ రకమైన ఆహారాలను మరియు ఫల రసాలను మీ డైట్ లో చేర్చుకోండి.

ఇన్స్టెంట్ వోట్మీల్

ఈ రోజుల్లో కాల్షియంతో కూడిన అనేక ధాన్యాలు మరియు గింజలు లభిస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ సిరీల్స్ లాంటి తృణధాన్యాలలో ఫైబర్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక మీ రోజూ డైట్ లో వోట్మీల్ ను చేర్చుకోండి.

సోయా పాలు

లాక్టోస్ ఇన్టాలరెన్స్ ఉన్న వారు ఆవు పాలకు బదులుగా సోయా పాలను తీసుకోండి. సాధారణ పాలతో పోల్చితే ఇందులో ఎక్కువ ప్రోటీన్ మరియు కాల్షియం ఉంటుంది. ఒక ఔన్స్ సోయా పాలలో 300 మి గ్రా కాల్షియం ఉంటుంది. దీనిని తృణధాన్యాలు, టీ మరియు కాఫీ తయారీలో ఉపయోగించవచ్చు.

క్యాబేజి ఆకుకూరలు

చాలా ఆరోగ్యకరమైన ఆకుపచ్చ కూరగాయలలో ఇది కూడా ఒకటి. వండిన ప్రతి 1 కప్పు క్యాబేజి ఆకులలో 268 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్ ఏ ఉండటం వలన మీ కంటి చూపుకు కూడా చాలా మంచిది. సగం ఉడికించిన ఆకులను సలాడ్లలో కలుపుకొని కూడా తినవచ్చు.

ఎడామామె

ఈ కూరగాయలు భారతదేశంలో సులభంగా అందుబాటులో లేకపోవచ్చు, ఇవి ఎక్కువగా చైనాలో పెరుగుతుంది. ఒక కప్ ఉడికించిన ఎడామామెలో 98 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

టోఫు

సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్నే టోఫు అని అంటారు. ఇందులో సమృద్ధిగా ఉన్న కాల్షియం అన్ని వయసుల వారికీ ముఖ్యంగా పెరిగే పిల్లకు చాలా అవసరం. అర కప్పు టోఫు లో 434 mg కాల్షియం ఉంటుంది.

అలసందలు

అధిక కాల్షియం తో కూడిన ఈ బటానీలను సులభంగా మార్కెట్లో పొందవచ్చు. వీటిని విడిగా లేదా ఇతర కూరగాయలతో చేర్చుకొని ఉడికించి తినండి.

పెరుగు

మనం ఇళ్లలో పాల ద్వారా తయారు చేసుకునే పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో లభించే యోగార్ట్ అంత మంచిది కాదు. అందువలన రోజూ ఇంట్లో పెరుగు తయారు చేసుకొని తినండి. పాలలో లాగే పెరుగులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్టోజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

చీజ్

చీజ్ కూడా మనకు సులభంగా మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా పాల ఉత్పత్తికి సంబంధించిందే. ఇందులోనూ కాల్షియం నిండుగా ఉంటుంది. పర్మెసాన్ చీజ్ లో అత్యధిక శాతం కాల్షియం ఉంటుంది.

ప్రాన్స్

రొయ్యలలో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న కాల్షియం మోతాదు తగ్గిపోతుంది. అందువలన వీటిని ఎక్కువగా వేయించకుండా తింటే మంచిది.

క్రాబ్స్

పీత మాంసంలో అనేక పోషకాలు మరియు మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఒక కప్పు పీత మాసంలో 123 మి గ్రా కాల్షియం ఉంటుంది. కనుక క్రాబ్స్ ను కూడా మీ డైట్ లో చేర్చుకోండి.

ఉడికించిన గుడ్లు

ఒక ఉడికించిన గుడ్డులో 50 మి గ్రా కాల్షియం ఉంటుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్లు మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. కనుక రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినండి.

చింతపండు

పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పోల్చుకుంటే చింతపండులో అంతగా కాల్షియం ఉండదు. కానీ ఇందులో పొటాషియం, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి.

డేట్స్

ఖర్జూరంలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

సీతాఫలం

కస్టర్డ్ ఆపిల్ లేదా సీతాఫలం తినడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఇందులో కూడా కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

సోయాబీన్స్

పైన ఇచ్చిన వాటిలో సోయాబీన్ ఉత్పత్తులయిన సోయా పాలు, టోఫు గురించి మనం తెలుసుకున్నాం. అయితే వీటికన్నా సోయాబీన్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

బ్రాజిల్ నట్స్

6 బ్రాజిల్ నట్స్ తింటే చాలు, అది మీకు 45 మీ గ్రా కాల్షియంను అందిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన నట్స్ లో ప్రోటీనులు కూడా అధికంగా ఉంటాయి.

డ్రైడ్ హెర్బ్స్

వివిధ రకాల మూలికలు, థైమ్ మరియు రోస్ మెర్రీ వంటి వాటిలో అధికంగా కాల్షియం ఉంటుంది. వీటిని సూపులు లేదా కర్రీస్ లో వాడుకోవచ్చు.

అరుగుల

ఇది గ్రీన్ వెజిటేబుల్స్ కు సంబంధించిన ఒక స్పెషల్ ఆకుకూర. దీన్ని సాధారణంగా సలాడ్స్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది మీకు కావల్సిన కాల్షియం అందిస్తుంది. కాబట్టి దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

Posted on

Overnight solution for scars in Telugu – ఒకే రాత్రిలో పింపుల్స్ స్కార్స్ ను తొలగించటం ఎలా? – ఒకే రాత్రిలో మొటిమల మచ్చలకు పరిష్కారం

మీకు మొటిమలను ఎలా నయం చేయాలో తెలిసి ఉండవచ్చు, కానీ వాటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోలేరు. మన చర్మం మీద చెమట, సీబం (శ్లేష పటలము, క్షయము కలిసిన మిశ్రమము) మరియు దుమ్ము పదార్థాల వలన ఇది సంభవించవచ్చు. మొటిమలను వదిలించుకోవటం చాలా సులభం, కానీ వాటివలన చర్మంపై కలిగిన నల్ల మచ్చలను తొలగించటం చాలా కష్టం మరియు చాలా సమయం పడుతుంది. కొన్ని సాధారణ పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ సమస్య సులభంగా పరిష్కరించవచ్చు. కొన్ని చికిత్సలు మరియు విధానాలు క్రింద వివరించబడ్డాయి.

మొటిమల మచ్చలను తొలగించటానికి హోమ్ రెమెడీలు

దోసకాయ

దోసకాయలలో మన చర్మానికి చాలా ఉపయోగకరమైన అనేక విటమిన్లు మరియు మెగ్నీషియాలు ఉంటాయి. ఇది మొటిమల మచ్చలను తొలగించడానికి ఒక అద్భుతమైన సహజ పదార్థం. మచ్చల్నే కాదు వాపు మరియు హీల్స్ ని కూడా తొలగిస్తుంది మరియు చర్మాన్ని ఊరట పరుస్తుంది.

 • దోసకాయ ముక్కలను మీ చర్మం యొక్క ప్రభావిత ప్రాంతాలపై 30 నిమిషాలు ఉంచండి.
 • తరువాత చల్లని నీటితో కడగండి.
 • మీ మచ్చలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ రెమెడీని రోజూ రిపీట్ చేయండి.
 • ముక్కలకు బదులుగా దోసకాయను బాగా రుబ్బి మీ చర్మంపై పూయవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. కనుక ఇది ఒకే రాత్రిలో మొటిమలను తొలగిస్తుంది. దీనిని మొటిమల వలన కలిగే మచ్చలను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.

 • వెల్లుల్లిపై ఉన్న చర్మాన్ని తొలగించాలి.
 • వాటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
 • కొద్ది సేపు మచ్చలపై వీటిని రుద్దండి.
 • 15 నిమిషాల తరువాత కడగండి.

టమోటాలు

టమోటాలో విటమిన్ ఎ కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చనిపోయిన చర్మ కణాలను సరి చేసి, ఆరోగ్యవంతమైన పెరుగుదలను ప్రోత్సహించగలదు.

 • పూర్తిగా పండిన, ఎరుపు రంగులో ఉండే టమోటాను తీసుకోండి.
 • చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు లేదా బాగా రుబ్బి పేస్ట్ చేసుకోవచ్చు.
 • దీనిని మీ చర్మపు మచ్చలపై రుద్ది 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచిన తరువాత నీటితో కడగండి.
 • ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

టీ ట్రీ నూనె

టీ ట్రీ ఆయిల్లో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమలు, ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమల యొక్క మచ్చలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మొటిమల కారణంగా చర్మంపై ఏర్పడే రెడ్నెస్ ని కూడా తగ్గిస్తుంది.

 • అరచేతిలో మీ రెగ్యులర్ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తీసుకోండి.
 • అందులో కొన్ని చుక్కల టీ ట్రీ నూనెని చేర్చుకోండి.
 • దీనిని మీ చర్మంపై పూర్తిగా రాసి మసాజ్ చేయండి.
 • 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

ఆపిల్ సీడర్ వినిగర్

మొటిమలు మరియు మచ్చలతో సహా పలు ఇతర చర్మ సమస్యలను తొలగించేందుకు వినిగర్ ఒక ప్రముఖ నివారిణి. మొటిమలకు ప్రధాన కారణం అయిన రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

 • కొద్దిగా నీటిని తీసుకొని కొన్ని చుక్కల ఆపిల్ సీడర్ వినిగర్‌ని కలుపుకోండి.
 • ఈ మిశ్రమంలో శుభ్రమైన పత్తిని ఉపయోగించి మీ చర్మంపై మొటిమలు అలాగే మచ్చలు ఉన్న ప్రాంతాలపై రాయండి.
 • కొన్ని గంటల తర్వాత కడగండి లేదా అలాగే వదిలేయవచ్చు.

పసుపు

మొటిమల యొక్క నల్లని మచ్చలను తొలగించటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది. కలబంద మరియు పసుపు మిశ్రమాన్ని ఉపయోగించి మొటిమలను తొలగించవచ్చు.

 • పాలు, పసుపు పొడి మరియు నిమ్మరసంను కలుపుకొని మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి.
 • మొటిమల వలన ఏర్పడిన నల్లని మచ్చలపై దీనిని రాయండి.
 • పూర్తిగా ఆరే వరకు ఉంచండి.
 • తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
 • అవసరమైతే ఈ చికిత్సను రిపీట్ చేయండి.

పై చెప్పిన మిశ్రమంకు బదులుగా ఆలివ్ నూనె మరియు పసుపు పొడిని కలుపుకుని ఉపయోగించవచ్చు. ఇది కూడా మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో ఎక్సఫోలియేషణ్ లక్షణాలు ఉన్నాయి. దీనిని రెగ్యులర్గా ఉపయోగించటం వలన నల్లని మచ్చలను తొలగించవచ్చు.

 • బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలుపుకోండి. నీటికి బదులుగా రోజ్ వాటర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
 • ఈ పేస్ట్‌ని మచ్చల మీద రాసి రాత్రంతా అలాగే వదిలేయండి.
 • ఉదయం శుభ్రంగా కడగండి.
 • ఇది మచ్చలను తొలగించటం మాత్రమే కాదు, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆసిడ్ (AHA) ఉండటం వలన న్యాచురల్ బ్లీచింగా పనిచేస్తుంది. ఇది చర్మంపై మచ్చలను మరియు పాచెస్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని స్వచ్ఛంగా మరియు శుభ్రంగా చేస్తుంది.

 • ఒక గిన్నెలో తాజా నిమ్మరసంను తీసుకోండి.
 • మీ చర్మం చాలా సున్నితంగా ఉన్నట్లయితే కొద్దిగా నీటిని కలుపుకోండి.
 • ఒక పత్తితో ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాయండి.
 • ఆరే వరకు అలాగే ఉంచండి.
 • ఆ తరువాత చల్లని నీటితో కడగండి.
 • తరువాత సున్నితమైన మాయిశ్చరైజర్‌ని రాయండి.
 • స్వచ్చమైన చర్మం పొందడానికి వారానికి రెండు సార్లు ఈ ప్రక్రియను చేయండి.

నిమ్మరసం మచ్చలను తొలగించటమే కాదు, చర్మాన్ని పొడిగా చేస్తుంది. కనుక మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం మర్చిపోకండి.

నీరు

మీ చర్మానికి ఒక క్లెన్సింగ్ ఏజెంట్. ఇది అన్ని రకాల అంటువ్యాధుల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది మరియు చర్మపు మలినాలను తొలగిస్తుంది. దీర్ఘకాలం మీ చర్మాన్ని క్లియర్‌గా ఉంచడానికి ప్రతి రోజు కనీసం 3 లేదా 4 లీటర్ల నీరు త్రాగటం ప్రారంభించండి.

గంధం

ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు మచ్చలను సహజంగా తొలగించటానికి సహాయపడుతుంది.

 • గంధం మరియు గులాబీ నీటితో ఒక కూర్పుని తయారు చేసుకోండి.
 • మొటిమ మచ్చలపై ఈ కూర్పుని రాయండి.
 • 1 గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

బంగాళదుంప

ముదురు మచ్చలు మరియు పాచెస్ తొలగించటానికి బంగాళదుంప ఒక ఉత్తమ పరిష్కారం. ఒకే రాత్రిలో మచ్చలను వదిలించుకోవడానికి క్రింద చెప్పిన విధంగా చేయండి.

 • తాజా బంగాళదుంపను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి.
 • మీ ముఖం యొక్క ప్రభావిత చర్మంపై వాటిని ఉంచండి.
 • కొన్ని నిమిషాలు అలాగే ఉంచి వెచ్చని నీటితో కడగండి.
 • బంగాళదుంప రసాన్ని తేనెలో కలుపుకొని కూడా ఉపయోగించవచ్చు.

ఇది మొటిమ మరియు డార్క్ సర్కిల్స్ ను (కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను) కూడా తొలగిస్తుంది.

కలబంద

ఆలీ వెరాలో పాలిసాకరైడ్లు, ఎంజైములు మరియు పోషకాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నల్లని మొటిమల మచ్చలను సహజంగా మరియు సులభంగా వదిలించుకోవటానికి సహాయపడుతుంది.

 • తాజా కలబంద ఆకును ఎంచుకోండి.
 • ఆకు నుండి కలబంద జెల్‌ను తీయండి.
 • మీ చేతితో మొటిమ గుర్తులు లేదా మొటిమల ప్రదేశంలో జెల్‌ను మసాజ్ చేయండి.
 • సహజంగా మొటిమ మచ్చలను తొలగించటానికి రోజుకు రెండుసార్లు రాయండి.

తేనె

మొటిమలు, మొటిమల వలన కలిగే రెడ్ నెస్ మరియు ముదురు మచ్చలను నయం చేయడానికి ఇది అధిక నాణ్యమైన గృహ చికిత్స. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక చర్మ సమస్యలకు ఒక సహజ హీలర్గా పనిచేస్తుంది.

 • నిద్ర పోయే ముందు మచ్చల మీద తేనెని రాయండి.
 • రాత్రంతా చర్మంపై వదిలేయండి.
 • ఉదయం శుభ్రమైన నీటితో కడగండి.
 • అవసరమైతే ఈ ప్రక్రియను రిపీట్ చేయండి.

తులసి మరియు వేప ఫేస్ ప్యాక్

 • 3 తులసి ఆకులు, 2 పుదీనా ఆకులు, 2 వేప ఆకులు, 1 నిమ్మకాయ మరియు 1 టీ స్పూన్ పసుపును తీసుకోండి.
 • ముందుగా నిమ్మకాయ నుంచి రసాన్ని తీయండి.
 • అన్ని ఆకులనూ కలిపి బాగా రుబ్బుకోవాలి.
 • తరువాత పసుపు, నిమ్మరసం మరియు ఆకుల పేస్ట్ ను బాగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
 • ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తులసి, వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన డార్క్ స్పాట్స్ మరియు స్కిన్‌ డ్యామేజ్ ని తొలగిస్తుంది. పుదీనా ఆకులు చల్లని అనుభూతిని ఇస్తాయి మరియు రెడ్ నెస్ ని తొలగిస్తాయి. నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది మరియు మచ్చలను నివారిస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది.

బాదాం

బాదాంను నీరు లేదా పాలలో 12 గంటలు నానబెట్టాలి. నానిన బాదాం తోలును తీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయండి.

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలను పేస్ట్ చేసి క్రమం తప్పకుండా ముఖానికి రాస్తే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతాకులు

మెంతి ఆకులను రుబ్బి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి. బాగా ఆరిన తరువాత ముఖాన్ని కడగండి. మొటిమలని తొలగించడానికి ఇదే పద్దతిని కొన్ని రోజులపాటు పాటించాలి. ఇది మీ చర్మాన్ని మృదువు గా చేస్తుంది.

Posted on

Telugu tips to calculate the most fertile days in women – మహిళల్లో అత్యంత ఫర్టిలిటీ రోజులను లెక్కించే విధానాలు

మీరు గర్భవతి అవ్వటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు ఉత్తమ సంతానోత్పత్తి సమయం ఎప్పుడని తెలుసుకోవడం చాలా అవసరం. మీరు అండోత్సర్గం క్యాలెండర్‌ను మరియు గర్భధారణ అవకాశాలు పెంచడానికి లైంగిక సంబంధాలకు మంచి సమయాలను లెక్కించాలి. మీరు చేయవలసిందల్లా మీ ఋతు చక్రంను సరిగ్గా ట్రాక్ చేయాలి.

మీ పీరియడ్స్ యొక్క అత్యంత ఫర్టిలిటీ రోజులను తెలుసుకోండి

మీకు మీ ఋతు చక్రం సరిగ్గా ఉన్నప్పటికీ గర్భవతి కాలేకపోతున్నారా! సరైన సమయంలో నెలసరులు వస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొనుట సహజమయిన విషయమే. ఋతు స్రావం సమయంలో మహిళలు గర్భవతి అవుతారని ప్రజలు నమ్ముతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఋతు చక్రాల రోజులలో సంతానోత్పత్తి ప్రక్రియ జరగదు. అండోత్సర్గం సంభవిస్తేనే మీరు గర్భవతి కాగలుగుతారు. అండోత్సర్గము జరిగే ముందు కూడా గర్భం ధరించవచ్చు. అండోత్సర్గము అంటే ఒక పరిపక్వ గుడ్డు మీ అండాశయం లోనికి ప్రవేశిస్తుంది మరియు ఆ గుడ్డు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయబడుతుంది. ఇప్పుడు, మీ ఫర్టిలిటీ రోజులు ఏమిటో అది మీరు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

మందమైన లైనింగ్ యొక్క తొలగింపు

మీ గర్భాశయం నుండి మీ యోని ద్వారా బయటకి వచ్చిన మందమైన లైనింగ్‌ని మీరు గమనిస్తునట్లయితే అది మీ ఫర్టిలిటీకి ఉత్తమ సమయం అని తెలుసుకోవచ్చు. మరియు ఇది మీ ఋతు స్రావ సమయంలో 3 నుండి7 రోజులు రక్తస్రావానికి కారణమవుతుంది. ఫొలికల్స్ లో గుడ్డు ఉంటుంది మరియు దాని పెరుగుదల 13 నుండి 14 రోజుల ఫోలిక్యులర్ ఫేస్లో జరుగుతుంది.

లూటినీజింగ్ హార్మోన్

లూటినీజింగ్ హార్మోన్ స్థాయి పెరుగినప్పుడు అండోత్సర్గము ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న దశ, కేవలం 16 నుండి 32 గంటలు మాత్రమే కొనసాగుతుంది. శరీరం నుండి ఒక గుడ్డును విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

మితవాద (లుటీల్) పరిస్థితి

ఇది అండోత్సర్గము తర్వాత ప్రారంభమవుతుంది మరియు మీ తరువాతి పీరియడ్స్ వరకు కొనసాగుతుంది. ఇది గుడ్డు ఫలదీకరణం చేయబడినప్పుడు మరియు గర్భాశయ గోడలో అమర్చబడే సమయంలో గర్భాశయంను సిద్ధం చేయడానికి బాగా సహాయపడుతుంది.

గర్భం ధరించడానికి ఉత్తమ సమయం తెలుసుకోండి

మీరు ప్రెగ్నెన్ట్ కావడానికి మీ భాగస్వామితో సంపర్కం కలిగి ఉండేందుకు ఉత్తమ సమయం తెలుసుకోవాలి. మీ భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా గర్భవతి అవ్వడానికి ఋతు చక్రం సమయంలో చాలా అవకాశాలు ఉంటాయి. చాలామంది మహిళలకు ఆరు రోజులు చాలా సాధారణ సంతానోత్పత్తి రోజులు.

ఆ రోజులలో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన గర్భవతి అవుతారని భరోసా ఉండదు, కానీ గర్భవతి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఏమిటంటే అండోత్సర్గము ముందు లేదా అండోత్సర్గము జరిగిన 24 గంటల తరువాత గర్భవతి అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.

మీ పీరియడ్స్ యొక్క క్రమబద్ధతను తెలుసుకోండి

ప్రతి మహిళకు ఋతు చక్రం వేరుగా ఉంటుంది, అది ఒత్తిడి వంటి కొన్ని కారణాల వలన కూడా మార్పు చెందుతుంది. మీరు మూడు నుండి నాలుగు నెలల పాటు మీ ఋతు స్రావం ఎంతకాలం కొనసాగుతోంది మరియు ప్రతి నెలా అదే సమయంలో సంభవిస్తోందా అని గమనించాలి.

మీ నెలసరులు సంభవించినప్పుడు తేదీని ప్రారంభించి మీ తదుపరి నెలసరి సంభవించే వరకు రోజులను లెక్కించండి. ఋతు చక్రం యొక్క సాధారణ వ్యవధి 28 రోజులు లేదా 21 నుండి 35 రోజుల వరకు ఉంటుంది.

ఇర్రెగులర్ పీరియడ్స్ సమస్య ఉందా?

మీరు మీ నెలసరులను మూడు నుండి నాలుగు నెలలు ట్రాక్ చేయాలి. ఒకవేళ క్రమంగా లేనట్టు కనుగొంటే, మీకు ఇర్రేగులర్ పీరియడ్స్ ఉన్నట్టు. ఎక్కువ శారీరక కార్యకలాపాలు, వైద్య సమస్యలు, ఒత్తిడి మరియు బరువు తగ్గటం వంటి కారణాల వలన ఇర్రెగులర్ పీరియడ్స్ కలుగుతాయి. ఇటువంటప్పుడు తీవ్రమైన వైద్య సమస్యలను నివారించడానికి మీ డాక్టర్ను సంప్రదించండి. క్రమరహిత నెలసరులలో గర్భధారణ కలగవచ్చు, అయితే దీనికి కొద్దిగా సమయం పడుతుంది మరియు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

మీకు మూడు నెలల వరకు పీరియడ్స్ రాకపోయినా మరియు మీరు కన్సీవ్ కాకపోయినా మీకు వైద్య సహాయం అవసరం. హార్మోన్ల రుగ్మత క్రమరాహిత్యమైన ఋతు స్రావానికి కారణమవుతుంది. మీ పునరుత్పత్తి అవయవాలలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా ఇర్రేగులర్ పీరియడ్స్ కలగవచ్చు.

మీ ఫర్టిలిటీ కాలాన్ని తెలుసుకోండి

మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నట్లయితే గర్భవతి కావటం చాలా సులభం. మీరు మీ నెలసరుల ఆధారంగా మీ సంతానోత్పత్తికి తగిన కాలాన్ని తెలుసుకోవచ్చు. మీ అండోత్సర్గము ప్రారంభం అయినప్పటి నుండి మీ సంతానోత్పత్తి విండో ప్రారంభమవుతుందిఅండోత్సర్గము జరిగిన రోజుతో సహా మొత్తం ఆరు రోజులు. మీ ఋతు చక్రం కాలాన్ని ఉపయోగించి మీ ఫర్టిలిటీ రోజులను తెలుసుకోవచ్చు. ఋతు చక్రం యొక్క సమయం నుండి 14 రోజులు తీసివేయాలి.

 • మీ ఋతు చక్రం 28 రోజుల పాటు కొనసాగినట్లయితే ఋతు చక్రం యొక్క 14వ రోజు అండోత్సర్గము జరుగుతుంది. 14వ రోజు మీకు అత్యంత సారవంతమైనది మరియు 12, 13 రోజులు కూడా సారవంతమైనవి.
 • మీ ఋతు చక్రం 21 రోజుల పాటు ఉన్నట్లయితే అండోత్సర్గము 7వ రోజు జరుగుతుంది. 7వ రోజుతో పాటు, 5 మరియు 6 వ రోజులు కూడా మరింత సారవంతమైనవి.
 • మీ ఋతుచక్రం 35 రోజుల పాటు కొనసాగినట్లయితే, మీ ఋతు చక్రం యొక్క 21 వ రోజున అండోత్సర్గము జరుగుతుంది. 21 అలాగే 19 మరియు 20వ రోజు కూడా సారవంతమైన రోజులు.
Posted on

Telugu tips to improve eyesight – సహజంగా కంటి చూపును మెరుగుపరచటం ఎలా?

మీ శరీరం యొక్క అత్యంత అందమైన భాగాలలో మీ కళ్ళు కూడా ఒకటి కావచ్చు. ఇవి ఆరోగ్యంగా మరియు ఎల్లప్పుడూ తాజాగా ఉండాలి. మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా – మీ కంటి కండరాలు మీ శరీరంలో అత్యంత చురుకైనవి.

మీ కంటి కండరాలు రోజుకు సుమారు 100,000 సార్లు లేదా అంతకంటే ఎక్కువ కదలికలు కలిగి ఉంటాయి. ఎక్కువ ఆక్టివిటీస్ చేయటం వలన మీ కంటి నరాలు మరింత అలసట చెందుతాయి, కనుక ఎక్కువ రక్షణ తీసుకోవాలి. ప్రతి మనిషికీ మంచి కంటి చూపు ఉండాలి. అయినప్పటికి, వంశపారంపర్యం, తక్కువ పోషకాహారం మరియు ఒత్తిడి వంటి కారణాల వలన కంటి చూపు సమస్య ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది.

అంటువ్యాధులు మరియు ఇతర కంటి అనారోగ్యాలను నివారించడానికి ధూళి మరియు దుమ్ము నుండి మీ కళ్లను రక్షించుకోవటంతో పాటు, కంటిచూపును మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇంట్లో సహజంగా మీ కంటి చూపును అభివృద్ధి చేయటానికి కొన్ని చర్యలను చూద్దాం.

సహజంగా కంటి చూపును మెరుగు పరిచే విధానాలు

రోజూ మీ కళ్లను కడగండి

కళ్లను మెరుగుపర్చడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు నీటితో మీ కళ్లను కడగండి.

బాదాం

బాదాంలోని ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇందులో మంచి కొలెస్ట్రాల్, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది. నీటిలో రాత్రంతా నానబెట్టిన 4 లేదా 5 బాదాంలను రోజూ తినటం వలన మీ కళ్లకు మరియు మెదడులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంట్లో తయారు చేసిన కాటుక

మీ కళ్లను అందంగా ఉంచుకోవడానికి చమురు మరియు అగ్నితో చేయబడిన సాంప్రదాయక కాటుకను వాడండి. ఎస్సెంటిల్ నూనె, బొగ్గు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న కాటుకను ఉపయోగించండి. ఆవాల నూనెలో ముంచిన పత్తిని వెలిగించి వాటి నుంచి వచ్చే నలుపు ఆవిరిని ఒక ఇనుప స్పూన్ తో సేకరించండి. ఈ అవశేషాన్ని కాజల్ అని అంటారు. బాదాంను నిప్పులో కాల్చి కూడా ఈ కాటుకను తయారు చేయవచ్చు. ఇలా సేకరించిన కాటుకను అలాగే లేదా కొద్దిగా ఎస్సెంటిల్ ఆయిల్‌ను కలిపి రోజూ వాడవచ్చు. ఇది మెరుగైన కంటి చూపు, పెద్ద కళ్ళు మరియు అందమైన కనురెప్పలను అందిస్తుంది!

పాలలో వండిన క్యారట్లను తినండి

కంటిచూపును మెరుగుపరిచేందుకు పాలలో వండిన క్యారట్లను తినండి. పాలలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా, క్యారట్లో విటమిన్ ఎ మరియు సి ఉంటుంది. కంటి చూపు సమస్యలకు ప్రధాన కారణాలు పోషకాహార మరియు విటమిన్ ఎ యొక్క లోపం. వీటిని మీ రోజూ డైట్లో చేర్చుకోవటం వలన మీకు అవసరమైన పోషకాలను మరియు విటమిన్లను పొందుతారు. మీకు కంటిచూపు సమస్య లేనప్పటికీ, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవటం వలన కంటి సమస్యలను నివారించవచ్చు.

బ్లాక్ మైరోబాలన్ మరియు ఉసిరికాయ

ఈ పండ్లు బలహీనమైన కంటిచూపు చికిత్సకు మంచి ఫలితాలను అందించగలవు. మీరు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళలో ఈ పండ్లను నానబెట్టి, ఉదయం ఈ నీటిని ఖాళీ కడుపుతో త్రాగాలి. లేదా, పొడిచేసిన బ్లాక్ మైరోబాలన్ ను ఒక గ్లాసు పాలలో కలుపుకొని అల్పాహారం తీసుకునే ముందు త్రాగాలి.

అవొకాడో

దీనిలో ఉన్న బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పోషక పదార్ధాలు కంటి చూపుకు చాలా మంచిది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ లో కోకో అధికంగా ఉండటం వలన కంటి చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్‌ను రెగ్యులర్గా తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. డార్క్ చాక్లెట్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కార్నియాను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

బీట్ దుంపలు

బీట్ రూట్, క్యారట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వలన కాటరాక్ట్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు ఇందులో ఉన్న ఐరన్ కంటెంట్ సాధారణ కంటి చూపును మెరుగుపరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెల్ పెప్పర్

పసుపు మరియు ఆరెంజ్ బెల్ పెప్పర్స్ లో విటమిన్ ఏ, సి లో లూటిన్ ఉండటం మూలంగా కాటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ లో అధిక శాతంలో జింక్ మరియు ఎసెన్షియల్ కాంపోనెట్స్ ఉండటం వలన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ మినరల్స్ ఎంజైమ్లను అధికంగా ఉత్పత్తి చేయడానికి సహాయపడి, రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సోయా

సోయా మిల్క్ మరియు సోయా సాస్ లో అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిండెంట్స్ కళ్ళు పొడిబారకుండా మరియు కాటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి.

ద్రాక్ష

ద్రాక్షలు రాత్రి పూట మీ కంటి చూపును స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. కనుక మీకు వీలు దొరికినప్పుడుల్లా ద్రాక్ష పండ్లను తినండి.

గుమ్మడికాయ

గుమ్మడికాయలో ఉండే పోషకాలు మీ ఆప్టికల్ ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించండి

అధిక రక్తపోటు, కంటి కణజాలాలకు (టిష్యూస్) మరియు నరాలకు హాని కలిగిస్తుంది. కనుక బిపి సమస్యను నియంత్రించడానికి ప్రతి చర్యా తీసుకోవాలి.

ఆరోగ్యకరమయిన ఆహారం

రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం వలన కంటి చూపును దెబ్బతీసే ప్రమాదాలు ఉన్నాయి. కనుక, సరైన ఆహార పద్దతులను అనుసరించి చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా కంటి చుపును మెరుగుపరుచవచ్చు.

కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వండి

ఇతర శరీర భాగాల్లానే మీ కళ్లు కూడా నిరంతరంగా పని చేస్తాయి, అందువలన, పనుల కళ్లకు కూడా తగిన విశ్రాంతిని ఇవ్వాలి.

కొన్ని కంటి వ్యాయామాలు

పెన్సిల్ పుష్-అప్స్: మీరు మంచి ఆరోగ్యం కొరకు “పుష్-అప్స్” వ్యాయామం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కంటి చూపు కొరకు పెన్సిల్ పుష్అప్‌లను చూద్దాం. క్రింద చెప్పిన విధానాన్ని పాటించండి.

 • ఒక పెన్సిల్ తీసుకొని దాని మధ్య భాగంలో ఒక మార్క్ చేసుకోండి.
 • పెన్సిల్‌ని ముందుకు తరువాత వెనక్కు కదిలించటం ద్వారా పెన్సిల్ పుష్అప్‌ని చేయాలి.
 • చేతి యొక్క తరువాత దూరం వద్ద పెన్సిల్‌ను నిలువుగా పట్టుకొని మీరు చేసిన మార్క్ మీద దృష్టి పెట్టండి. మీరు చేసిన మార్కుపై సరిగ్గా దృష్టి పెట్టే వరకు క్రింద స్టెప్‌కు వెళ్ళకూడదు.
 • అదే మార్క్ మీద దృష్టి పెట్టి, ఇప్పుడు మీ ముక్కుకు నేరుగా పెన్సిల్‌ను దగ్గరగా తేవాలి.
 • పెన్సిల్‌ని దగ్గరకు తీసుకొని వచ్చేటప్పుడు మార్క్ పై దృష్టి పెట్టేందుకు కంటి చూపును అడ్జెస్ట్ చేసుకోవాలి.
 • మీకు పెన్సిల్ రెండుగా కనిపించినప్పుడు దగ్గరికి తేవటం ఆపండి. ఇప్పుడు కొన్ని సెకండ్లు మీ కళ్లను మూసుకొని కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలి.
 • ఇప్పుడు అదే మార్క్‌పై దృష్టి పెట్టి పెన్సిల్‌ను ముక్కు నుండి దూరంగా మీ చేతి యొక్క పొడవు దూరానికి తీసుకు వెళ్ళండి. తరువాత కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలి.
 • మీ కళ్ళు రిఫ్రెష్ అయిన తరువాత పై చెప్పిన ప్రక్రియను తిరిగి చేయండి.
 • ప్రతి రోజూ ఈ వ్యాయామాన్ని 5 నుండి 10 నిమిషాలు చేయండి.
 • ఈ వ్యాయామం, క్రమంగా చేసినట్లయితే మీ కంటిచూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది క్రాస్డ్ అయిస్ మరియు డబుల్ విషన్ సమస్యను తొలగించేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తమ విషయం ఏమిటంటే, ఇది నొప్పి లేనిది మరియు సులభమైన వ్యాయామం.

ఐ రోలింగ్

మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ వ్యాయామం చేయటానికి ప్రయత్నించండి. 10 సార్లు క్లాక్ వైస్ దిశలో మీ కళ్లను రోల్ చేయండి. తరువాత కళ్లను మూసుకొని 2 నిమిషాలు విరామం తీసుకోండి. కళ్లు తెరిచిన తరువాత 10 సార్లు ఆంటీ క్లాక్ దిశలో రోల్ చేయండి. ఈ వ్యాయామం మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

టెంపుల్ మసాజ్

మీ బొటనవేలుతో కంటి చుట్టూ క్లాక్ వైస్ మరియు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో 20 సార్లు మసాజ్ చేయండి. ఆ తరువాత ఉత్తమ ఫలితాల కోసం మీ నుదిటి మధ్య లేదా మీ కనుబొమ్మల మధ్యభాగంలో మసాజ్ చేయాలి.

కనురెప్పలను వెచ్చగా చేయటం

ఒక చేతితో మరొక చేతిని రుద్దడం ద్వారా చేతులను వెచ్చగా చేసి మీ కనురెప్పల మీద 5 సెకన్లు ఉంచండి. ఇలా 3 సార్లు చేయండి.

అల్ప నిద్ర

మీకు విలైనప్పుడల్లా మీ కళ్లను మూసుకొని 3 నిమిషాలు కండరాలను రిలాక్స్ చేయండి. ఇలా చేయటం వలన మీ కళ్లలో చైతన్యం తిరిగి నింపబడుతుంది.

రోజూ ఆహార డైట్ మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • మీ జీవనశైలి మరియు మీరు తినే ఆహారం మీ కంటిచూపుపై గొప్ప ప్రభావం చూపుతుంది. మీ కళ్లకు తగినంత పోషకాలు మరియు విటమిన్లను అందించే ఆహారాన్ని తీసుకోండి.
 • ఆకుపచ్చ ఆకు కూరలు, సాల్మన్ మరియు ట్యూనా వంటి చేపలు, నారింజ మరియు నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్ల రసాలు, అరటి మరియు నట్స్ వంటి పండ్లు మీ కళ్లకు తగిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
 • విటమిన్ ఇ, సి మరియు ఎ పుష్కలంగా ఉన్న క్యారట్లు, కివీ, స్క్వాష్, చీజ్, పాలు, కాంటాలోప్, స్పినాచ్, క్రాన్బెర్రీస్, బొప్పాయి, ఆలివ్, గోధుమ బీజ, కూరగాయల నూనెలు వంటి ఆహారాలను తినండి.
 • ఆంటీ ఆక్సిడెంట్స్ మీ కళ్లకు చాలా మంచిది. బీటా కెరోటిన్, లూటీన్ లేదా జియాక్సంతిన్ లాంటి ఆంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి సూర్య కాంతి వలన కలిగే డిహైడ్రేషన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఆకు కూరలు, మిరియాలు, గుడ్డు, తియ్యటి బంగాళాదుంప మరియు గుమ్మడికాయలలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటుంది.
 • ద్రాక్ష, బ్లూబెర్రీలు మరియు గోజీ బెర్రీలలో కూడా కంటి చూపును మెరుగుపరిచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి.
 • లెసిథిన్, సిస్టీన్ మరియు సల్ఫర్ కలిగి ఉన్న ఆహారాలు క్యాటరాక్ట్ ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనాల కోసం వెల్లుల్లి, కేపెర్స్, ఉల్లిపాయలు మరియు షల్లాట్స్ ను తినండి.
 • నీటిని ఎక్కువగా తాగడం వలన మీ శరీరం హైడ్రేటడ్గా ఉంటుంది మరియు కళ్ళు పొడిబారకుండా నిరోధిస్తుంది.
 • ధూమపానం మీ కంటి చూపును ప్రభావితం చేస్తుంది మరియు క్యాటరాక్టులను కలిగించవచ్చు, కాబట్టి ధూమపానం నివారించండి. మీ కళ్లను, దాని పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
 • మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు లేదా దుమ్ము మరియు ధూళి నుండి మీ కళ్లను దూరంగా ఉంచడానికి ఎల్లప్పుడూ సన్ గ్లాసెస్ను ఉపయోగించండి. మీ సన్ గ్లాసెస్ UV- సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
 • ల్యాప్ టాప్ల మరియు మొబైల్ల నిరంతర వినియోగం, టీవీ చూడటం కూడా మీ కంటి చూపు స్థాయిని తగ్గిస్తుంది, కాబట్టి ల్యాప్ టాప్లు లేదా టీవీని ఉపయోగించినప్పుడు మీ కళ్లను కొన్ని నిమిషాలు మూసుకొని విరామం ఇవ్వండి. మీ కళ్లపై కొన్ని దోసకాయలు లేదా ఐస్ క్యూబ్స్ ఉంచండి.
 • మీరు ప్రమాదకర వాతావరణంలో పని చేస్తున్నట్లయితే భద్రతా దుస్తులు తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే పని చేస్తున్నప్పుడు భద్రతా గ్లాసెస్ లేదా గాగుల్స్ ధరించండి. రాకెట్ బాల్, ఐస్ హాకీ మరియు లక్రోస్ వంటి ఆటలు క్రీడాకారుల దృష్టిని గాయ పరిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ క్రీడలలో పాల్గొనటానికి తప్పకుండా హెల్మెట్‌ను ఉపయోగించాలి.
 • తగినంత నిద్ర మీ కళ్లకు మరియు మీ శరీరానికి చాలా విశ్రాంతిని ఇస్తుంది.

ఈ చిట్కాలను అనుసరించి మీరు మీ కంటిచూపును మెరుగుపరుచవచ్చు. ఏమైనప్పటికీ, ఒక వైద్యుడిని కనీసం 3 నెలలకు ఒకసారి సంప్రదించటం చాలా మంచిది.

Posted on

Telugu tips to make hips grow bigger – బటక్స్ ను పెద్దగా పెంచటం ఎలా? – వ్యాయామాలు మరియు ఇంటి నివారణలు

పెద్ద నడుము తరచూ స్త్రీల అందం యొక్క చిహ్నంగా భావించబడతాయి మరియు మన అభిమాన నటీనటులలో కొందరు నిజానికి వారి స్థూలమైన బటక్స్ వలనే ప్రసిద్ధి చెందారు. మీరు పెద్ద నడుమును పొందాలనుకుంటే సరైన వ్యాయామాలు మరియు తగిన పోషక ఆహారాలను తీసుకోవాలి. వీటి వివరాలను ఈ ఆర్టికల్లో చూద్దాం.

మీ బటక్స్ (పిరుదులు)ను పెంచేందుకు తగిన డైట్

ప్రోటీన్లు

కండరాలను పెంచేందుకు ప్రోటీన్లు ప్రాథమిక పోషక ఆహారం. పిరుదులను పెద్దగా పెంచాలంటే తప్పనిసరిగా తగిన స్థాయిలో ప్రోటీన్‌లను తీసుకోవాలి. మీరు తినడానికి ఎంచుకున్న ప్రోటీన్ ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ యొక్క కాన్ఫిగరేషన్ శరీరానికి సరిపడేట్టు ఉన్నట్లయితే ఇది ప్రోటీన్ల యొక్క త్వరిత శోషణ మరియు కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అటువంటి ప్రోటీన్ ఆహారాలు చేప, పౌల్ట్రీ పక్షులు, బీన్స్ మరియు గుడ్లు. సరైన వ్యాయామంతో పాటు ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్లో తగిన పరిమాణంలో చేర్చుకోండి.

గింజలు

గింజలు ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్స్ యొక్క ధనిక మూలాలలో ఒకటి. ఇవి కండరాలను నిర్మించేందుకు యాంటీ ఆక్సిడెంట్స్ తో కూడిన వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. తద్వారా నడుము యొక్క కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలు

ఆకుపచ్చ కూరగాయలు శరీరానికి విటమిన్లు మరియు ఖనిజాలను అందించే ప్రాథమిక వనరులు. ఇవి జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించేందుకు ఫైబర్లను అధిక మోతాదులలో అందిస్తుంది మరియు పోషకాల శోషణమును ప్రోత్సహిస్తుంది. అందువలన మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు సరైన మొత్తాల్లో చేర్చుకోండి.

మీ పిరుదులను పెంచేందుకు వ్యాయామాలు

మీ బటక్స్ పెద్దగా కావాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే సరైన ఆహారంతో పాటు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో చేయాలి. రోజూ జిమ్‌కు వెళ్లే అవసరం లేకుండా మీరు ఈ వ్యాయామాలను ఇంటిలోనే చేయగలరు.

స్టాండింగ్ ఓబ్లిక్ ఫ్లెక్షన్

Standing oblique flexion

ఈ వ్యాయామం నడుము మరియు ఉదరంపై పనిచేస్తుంది. ఇది జీవక్రియను నియంత్రించడంలో మరియు శరీర ఆకృతిని మెరుగు పరుచుకోవడంలో సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేసే ముందు నేరుగా నిలుచుకొని కుడి చేతిలో డంబెల్స్ పట్టుకోండి. డంబెల్ ఉన్న కుడి వైపుకు వీలైనంత వరకు నడుముపై ఒత్తిడిని పెట్టి వంగండి. ఇలాగే ఎడమ వైపు కూడా చేయాలి. రోజుకు 30 నిమిషాలు ఒక రోజు విడిచి రోజు చేయటం వలన ఇది మీ హిప్ కండరాలను టోన్ చేసి మీకు కావలసిన ఆకారంను ఇస్తుంది.

కార్డియో వర్క్అవుట్

Cardio workout

మీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు మెటబాలిజంను అధికరించేందుకు కార్డియోవాస్క్యూలార్ వ్యాయామాలను కూడా చేయాలి. ఇది హిప్ వ్యాయామాలను చేసే ముందు వార్మ్ అప్ అవ్వడానికి సహాయపడుతుంది. జుమ్బా లేదా ఏరోబిక్స్, బర్ఫీస్, స్క్వాట్స్ మరియు స్కిప్పింగ్ వంటివి అధిక శక్తికరమైన కార్డియో వ్యాయామాలు, ఇవి మీ రక్త ప్రవాహాన్ని పెంచి మిమ్మల్ని శక్తివంతంగా మరియు చురుకుగా చేస్తుంది.

రషియన్ ట్విస్ట్

Russian twist

మీ నడుము యొక్క కొవ్వును పూర్తిగా తొలగించి మీకు కావలసిన ఆకారంలో ఉంచేందుకు కొన్ని ట్విస్ట్ వ్యాయామాలను కూడా చేయాలి. ఈ వ్యాయామం నడుము మరియు సైడ్ లింబ్స్ పై ప్రభావాన్ని చూపుతుంది. మీరు మ్యూజిక్‌ని ఆన్ చేసుకొని మీ స్నేహితులతో చేరి నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తూ ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. ఇది మీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది.

స్టెప్ అప్

Step up

మీరు నిలుచుకున్న సర్ఫేస్ కన్నా కొద్దిగా ఎతైన ధృఢనిర్మాణంగల సర్ఫేస్ని మీ ముందు ఉంచుకోండి. ఒక కాలు తరువాత మరొక కాలుని ఆ సర్ఫేస్ పై పెట్టి జాగింగ్ ప్రాకారంలో వ్యాయామం చేయండి. ఇది మీ నడుము కండరాలను దృఢంగా నిర్మించడానికి సహాయపడుతుంది.

డాంకీ కిక్

Basic donkey kick

మీ మోకాళ్లు మరియు చేతులను నేలపై ఉంచండి. కళ్లను వంచినట్టే పైకి లేపండి, ఒక కాలుతో 15 సెకండ్లు చేసిన తరువాత రెండవ కాలుతో కూడా చేయండి. ఈ విధంగా చేయటంవలన మీ కాళ్లు మరియు నడుము యొక్క కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామం కనీసం వారానికి 3 సార్లు చేయాలి.

యోగా

Yoga

ప్రశాంతమైన మనసు మరియు శరీరం కొరకు యోగాలను ప్రాక్టీస్ చేయండి. యోగా మిమల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచటమే కాకుండా మీ బటక్స్ యొక్క సైజును పెంచటానికి కూడా సహాయపడుతుంది. ఒక కాలుపై నిలబడి మరో కాలుని మరియు ఒక చేతిని నేలకు పార్లల్ గా చాపాలి. ఇలా చేస్తే మీ మొత్తం శరీరం యొక్క బరువు ఒక కాలుపై మరియు నడుముపై ఉండటం వలన కండరాలు ధృఢంగా అవుతాయి.

స్క్వాట్స్

Squats

మీ నడుము కండరాలను పెంచేందుకు స్క్వాట్స్  ఒక మంచి వ్యాయామం. మీ కాళ్లను వెడల్పుగా ఉంచి చేతులను నేరుగా విస్తరించండి. ఇప్పుడు మీ మోకాళ్లను 90 డిగ్రీలు వంచి అలాగే 5 సెకండ్లు ఉండండి. మొదట్లో 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

ఫ్రంట్ లుంగ్స్

Front lunges

మీ రెండు చేతులలో ఒక కిలో బరువు ఉన్న డంబెల్స్ ని తీసుకొని నేరుగా నిలుచుకోండి. ఎడమ కాలిని కదిలించకుండా కుడి కాలుని వీలైనంత వెడల్పు ముందుకు చాపి రెండు కాళ్లనూ 90 డిగ్రీలు వంచాలి. 5 సెకండ్ల తరువాత ఇదే ప్రక్రియను ఎడమ కాలుతో చేయాలి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

సైడ్ లుంగ్స్

Side Lunges

సైడ్ లుంగ్స్ లో కాళ్లను ముందుకు చాపకుండా పక్కకు స్ట్రెచ్ చేయాలి. ఇది మీ నడుము కండరాలను పెంచేందుకు అత్యంత ప్రభావితంగా పని చేస్తుంది.

సైడ్ లెగ్ లిఫ్ట్స్

Side leg lifts

ఇది చాలా సులభమైన వ్యాయామం మరియు మీ నడుము యొక్క కండరాలపై ప్రభావితంగా పని చేస్తుంది. కుడి వైపుకు తిరిగి మీ చేతిపై పడుకొని ఎడమ కాలిని పైకి లేపాలి. మీ నడుము కండరాలపై ఒత్తిడి పెరిగినట్టు మీకు అనిపించే వరకు కాలుని లేపి అలా 5 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఇదే పద్దతిని ఎడమ వైపు తిరిగి చేయండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

ఫ్రాగ్ జంప్స్

Frog Jumps

ఈ వ్యాయామంలో కప్పలాగా ఎగరాలి. మీ మొత్తం బరువుని నేలపై మోపి పైకి ఎగిరి తిరిగి నేలపై మోపాలి. మీ రెండు చేతులతో మీ బరువుని బాలన్స్ చేయండి. ఇలా 4 సెట్లుగా 4 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

లెగ్ రైజ్ అండ్ స్ట్రెచ్

Leg raise and stretch

నేలపై నేరుగా పడుకొని మీ రెండు కాళ్లను జోడించి 45 డిగ్రీ పైకి లేపాలి. ఆ తరువాత రెండు కాళ్లనూ విరిచి మీ నడుము యొక్క కండరాలపై ఒత్తిడి పెంచే వరకు స్ట్రెచ్ చేయండి. ఆ తరువాత మల్లి రెండు కాళ్లనూ జోడించి మొదలు పెట్టిన పొజిషన్‌కు తీసుకురండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

సైడ్ లెగ్ బ్రిడ్జెస్

Single leg bridges

మీ చేతులను నేలపై చాపి పడుకోండి. మీ పాదాలను నేలపై మోపి మోకాళ్లను 90 డిగ్రీలు వంచి మీ శరీరం యొక్క క్రింద భాగాన్ని పైకి లేపండి. ఇప్పుడు మీ శరీరానికి సమానంగా ఒక కాలుని పైకి లేపండి. ఈ పొసిషన్ లో 5 సెకండ్లు ఉండాలి. ఇదే పద్దతిని రెండో కాలుకి కూడా పాటించండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయండి.

మీ పిరుదులను పెంచేందుకు హోం రెమిడీలు

క్రింద చెప్పిన ఇంటి నివారణలు మీ బటక్స్ యొక్క కండరాలను టోన్ చేయడం ద్వారా వాటిని పెంచడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. అయినప్పటికీ, వాటి ప్రభావం మీ శరీరంలోని జీవక్రియ మరియు కండరాల నిర్మాణం లాంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది. కనుక, ఇవి మీ శరీరంపై పని చేస్తాయో లేదో తెలుసుకోవడానికి వాటిని ప్రయత్నించి చూడండి.

వేడి ఆయిల్ మసాజ్

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మరియు ఆవాల నూనె కండరాలను నిర్మించేందుకు మరియు టోన్ చేసేందుకు ఉత్తమంగా పనిచేస్తాయి. ఈ మూడు నూనెలను తగినంత మరియు సమాన పరిమాణంలో తీసుకొని కొద్దిగా వేడి చేయండి. వేడి నూనె మరింత సులభంగా చర్మంలో చొచ్చుకుపోతుంది మరియు మంచి ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు కనీసం 20 నుండి 30 నిమిషాలు మీ పిరుదులపై ఈ నూనెతో మసాజ్ చేసుకోవాలి, తరువాత కడిగే ముందు 20 నిమిషాలు హాట్ ప్యాక్ ని ఉంచండి. రోజుకు కనీసం రెండుసార్లు ఈ చికిత్సను చేయండి. మీరు పెద్ద పిరుదులను పొందేందుకు ఇది సమర్థవంతమైన గృహ చికిత్స.

సి ఉప్పు మరియు హాట్ బాత్

సముద్రపు ఉప్పులో అధిక పరిమాణంలో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు కొవ్వును తగ్గించడంలో మరియు కండరాలను నిర్మించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. ఒక కప్పు సి ఉప్పుని సగం బకెట్ వేడి నీటిలో కలపండి. ఇప్పుడు ఈ నీటిలో మందపాటి కాటన్ టవల్‌ను ముంచి మీరు పెంచాలని అనుకుంటున్న కండరాలపై ఉంచండి. టవల్ వేడిగా ఉండే వరకు ఉంచి మల్లి ఈ ప్రక్రియను రిపీట్ చేయండి, ఇలా 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆహారంలో వాడుతున్న సాధారణ ఉప్పుకు బదులుగా సి ఉప్పుని వాడటం వలన మీ శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.

తేనె మరియు వెచ్చని నీటితో నిమ్మరసం

కొద్దిగా వెచ్చని నీటిలో ఒక నిమ్మపండు రసాన్ని, ఒక స్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి. ఉదయం లేచిన వెంటనే ఈ మిశ్రమాన్ని త్రాగాలి. ఇది కొవ్వుని కరిగించి కండరాలను సమర్థవంతంగా టోన్ చేస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

1/2 కప్పు వినిగర్ మరియు 1/4 కప్పు ఆలివ్ నూనెని కలుపుకొని మీ బటక్స్ పై 15 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత 30 నిమిషాలు హాట్ ప్యాక్ ని ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. ఆపిల్ సీడర్ వినిగర్‌ని మీ ఆహారంలో చేర్చుకోవటం వలన కూడా కొవ్వుని కరిగించి మీ కండరాలను టోన్ చేస్తుంది.

కాఫీ మరియు వాల్నట్ స్క్రబ్

సరైన రీతిలో చర్మంపై స్క్రబ్ చేయటం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ నడుము ప్రాంతంలో రక్త ప్రసరణ పెంచడానికి మరియు కండరాలను టోన్ చేసి వాటిని పెద్దవిగా పెంచడానికి స్క్రబ్ సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి మరియు 2 వాల్నట్ యొక్క షెల్స్ ను పొడిచేసి కలుపుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెని కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ని చర్మంపై రాసి ఆరిపోయే వరకు 5 నిమిషాలకు ఒకసారి స్క్రబ్ చేసి వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు 2 సార్లు 2 నెలలు చేసి మంచి ఫలితాలను పొందండి.

Posted on

Telugu remedies for mouth ulcers – నోటి అల్సర్ కు బెస్ట్ నేచురల్ హోమ్ రెమెడీస్

నోటి పుండ్లు తెల్ల రంగులో ఉంటాయి, చాలా నొప్పిని కలిగిస్తాయి. ఈ పుండు యొక్క అంచులు ఎర్రగా ఉంటాయి. ఇది నోటిలోపల చెంప భాగంలో, నాలుక క్రింద లేదా పెదాలపై ఏర్పడుతుంది. నోటి అల్సర్ తీవ్రమైనది కాదు, కానీ గుణం అయ్యేందుకు 7 నుండి 10 రోజులు పడుతుంది. మలబద్ధకం, హార్మోన్ల మార్పులు లాంటి అనేక కారణాల వలన ఇది ఏర్పడవచ్చు. మరి కొన్ని కారణాలు:

 • అనుకోకుండా చెంప లోపలి భాగంలో కొరికినప్పుడు
 • విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క లోపాలు
 • ఐరన్ లోపాలు
 • ఆహార ప్రభావం
 • వారసత్వ కారకాలు
 • అధిక అసిడిటీ
 • ఒత్తిడి
 • విటమిన్ సి లోపం
 • పోషకాల లోపాలు

మౌత్ అల్సర్ ఒక సాధారణ సమస్య. ఆహారాన్ని తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు స్వల్ప మంటను మరియు నొప్పిని కలిగిస్తుంది. కొన్ని సులభమైన ఇంటి నివారణ పద్ధతుల ద్వారా వీటిని గుణపరచొచ్చు.

నోటి పుండు కోసం ఉత్తమ సహజ నివారణలు మరియు వాటిని నిరోధించే పద్ధతులు

తేనె

తేనె ఒక ఉత్తమమైన యాంటీ సెప్టిక్ నివారిణి. ఇది నిర్జలీకరణము నుండి రక్షిస్తుంది, మచ్చలను తొలగిస్తుంది మరియు మాయిశ్చర్‌ను నిల్వ చేస్తుంది. ఇది కొత్త కణజాల పెరుగుదలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటుంది మరియు ఇది నోటి పుండు వేగంగా నయం అవ్వటానికి సహాయపడుతుంది. కొద్దిగా తాజా తేనె తీసుకొని నెమ్మదిగా నోటి పుండు మీద రాయండి. లేదా తేనెలో కొద్దిగా పసుపును కలుపుకొని ఒక మందపాటి పేస్ట్‌లా తయారు చేసుకొని పుండుపై వాడండి.

ఐస్

నోటి అల్సర్‌ను నయం చేయటానికి ఐస్ ఉత్తమమైన మరియు అత్యంత ప్రభావితమైన గృహ చికిత్స. ఇది జలదరింపు మరియు దహన సంచలనాన్ని తొలగిస్తుంది. ఇది ఇంట్లో సులభంగా లభిస్తుంది మరియు తరచూ వాడటం వలన తొందరగా ఫలితాలను అందిస్తుంది.

పెరుగు

బ్యాక్టీరియా ఫెర్మెన్టేషన్ ప్రక్రియ ద్వారా పెరుగు తయారు అవుతుంది. ఈ బాక్టీరియా లేదా ఈస్ట్ ఆర్గానిక్ ఆసిడ్స్ వంటి కార్బోహైడ్రేట్లుగా మార్చబడుతుంది. మంచి ఆరోగ్యం కొరకు రోజూ పెరుగు తినండి. ఇది మీ నోటిలో బ్యాక్టీరియాను సమతుల్యం చేసేందుకు సహాయపడే ఒక ఆహార పదార్థం. నోటి అల్సర్‌ పుండులను తొలగించేందుకు రోజుకు 3 సార్లు 1 టేబుల్ స్పూన్ పెరుగును తినండి. వేగంగా గుణం అయ్యేందుకు పెరుగులో కొద్దిగా తేనెని జోడించవచ్చు.

వెచ్చని ఉప్పు నీరు

ఉప్పు నీరు నోటి పుండులోని అధిక ద్రవాన్ని తొలగిస్తుంది. గొంతు లోపల భాగంలో శ్లేష్మ పొరలోని కణాల వాపును తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. వెచ్చని నీరు ఉపశమనాన్ని కలిగించి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది. 1/4 కప్పు వెచ్చని ఉప్పు నీటితో రోజుకు మూడు సార్లు మీ నోటిని పుక్కిలించండి.

గసగసాలు

శరీరంలోని వేడి తగ్గించడంలో గసగసాలు ప్రభావితంగా పనిచేస్తాయి. నోట్లో అల్సర్లు ఇబ్బంది పెట్టడానికి కారణం అధిక వేడే. కనుక ఒక టేబుల్ స్పూన్ పొడిచేసిన గసగసాలకు అంతే పరిమాణంలో పంచదారను జతచేసి, సమస్య తగ్గే వరకూ రోజకు 2 లేదా 3 సార్లు తినండి.

లవంగాలు

అల్సర్ బాధిస్తున్నప్పుడు తరచూ లవంగాలు నమిలితే, ఆ ఘాటుకు సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కాస్త మంటను భరించాల్సి ఉంటుంది.

నెయ్యి

నోటి అల్సర్‌ను నివారించే మరో నేచురల్ రెమెడీ నెయ్యి. అల్సర్ ఉన్న చోట నెయ్యిని రాయండి.

విటమిన్ బి12

సాధారణంగా శరీరంలో విటమిన్ బి12 శాతం తగ్గిపోతే నోటి అల్సర్లు వంటి సమస్య ఎక్కువగా ఎదురవుతాయి. వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12 మందులు వాడితే అల్సర్ తగ్గిపోతుంది.

విటమిన్ సి

విటమిన్ సి అధికంగా ఉండే కమలా పండ్లను తీసుకోవటం వలన కూడా నోటి అల్సర్లను తొలగించవచ్చు.

పచ్చి ఉల్లిపాయలు

ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోండి. వీలైతే వీటిని సలాడ్లలో కూడా చేర్చుకొని తినడం వలన నోటి అల్సర్ల సమస్య త్వరగా తొలగిపోతుంది.

కొబ్బరి నూనె

ఎండు కొబ్బరిని నమిలి కొద్ది సేపు అలాగే నోట్లో పెట్టుకోవాలి. లేదా కొబ్బరి నూనెని 5 నుండి 10 నిమిషాలపాటు పుక్కిలించాలి.

నోటి అల్సర్ వదిలించుకోవటానికి సహజమైన గృహ నివారణ చిట్కాలు

 • కొబ్బరి పాలు మౌత్ అల్సర్ చికిత్సకు బాగా పనిచేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం రోజుకు 3 లేదా 4 సార్లు కొబ్బరి పాలతో నోటిని పుక్కిలించండి.
 • ఉదయం లేచిన వెంటనే కొన్ని తులసి ఆకులను నీటితో పాటు నమలండి. ఇందులో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను ఉన్నందున ఇది అంటువ్యాధులు రాకుండా కాపాడటం ద్వారా మీ నోరు ఆరోగ్యంగా ఉంటుంది.
 • ఒక టేబుల్ స్పూన్ గ్లిసరిన్ మరియు ఒక చిటికె పసుపును కలిపి నోటి పుండుపై రాయండి. ఇది మంట నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
 • చల్లని నీటితో మీ నోరును పుక్కిలించిన తక్షణమే వేడి నీటితో పుక్కిలించండి. ఇది అల్సర్‌ను గుణపరిచేందుకు ఒక సమర్థవంతమైన పద్ధతి.
 • నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఉడికించండి. చల్లబడిన తరువాత ఈ నీటితో నోరు పుక్కిలించండి.
 • రోజుకు రెండు సార్లు టమోటా జ్యూస్ ని త్రాగండి లేదా జ్యూస్ తో నోటిని పుక్కిలించండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కాన్సర్ లక్షణాలు ఉంటాయి.
 • కొత్తిమీర ఆకులను బాగా నలిపి నీటిలో వేసి ఉడికించండి. చల్లబడిన తరువాత ఈ నీటితో నోరును పుక్కిలించండి, ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చేయండి.
 • మెంతాకులు కూడా నోటి అల్సర్‌ను తొలగించేందుకు బాగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో ఒక కప్పు మెంతాకులను వేసి బాగా ఉడికించండి. చల్లారిన తరువాత వడగట్టి ఈ నీటితో నోరును పుక్కిలించండి.
 • కలబంద యొక్క జెల్‌ని రోజుకు 3 సార్లు తినండి. ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరి, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు నోటి పుండులను మరియు ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
 • కర్పూరం మరియు చెక్కరని బాగా కలుపుకొని ఒక మందపాటి పేస్ట్‌లా చేసుకోండి. దీనిని నోటి పుండుపై కొన్ని నిమిషాల పాటు ఉంచి తరువాత తొలగించండి.
 • ఉసిరి కాయల పేస్ట్‌ను తయారు చేసి పుండుపై రాయండి. రోజుకు రెండు సార్లు రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 • నోటి అల్సర్ చుట్టూ ఉన్న ఎరుపు రంగును మరియు మంటను తొలగించేందుకు టీ ట్రీ ఆయిల్‌ని రాయండి.
 • ప్లైన్ సోడా బైకార్బొనేట్కని రాయటం వలన నొప్పినుండి వెంటనే ఉపశమనాన్ని పొందుతారు.
 • గోరు వెచ్చని నీటితో నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే అల్సర్లు కారణంగా ఎదురయ్యే మంట మరియు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
 • చల్లని మజ్జిగను ఎక్కువగా త్రాగటం వలన అల్సర్ సులభంగా తగ్గిపోతుంది.
 • ప్రతి రోజూ 3 లేదా 4 సార్లు కొబ్బరి నీళ్ళతో నోటిని పుక్కిలించండి.