Posted on

Telugu tips to make your hair thicker – మీ జుట్టు ఒత్తుగా పెరగటానికి చిట్కాలు

వెంట్రుకలు రాలటానికి అనేక కారణాలు ఉన్నాయి, ఉదాహరణకు కాలుష్యం, హార్మోన్ల అసమతౌల్యం, పోషకాహార లోపాలు, వంశానుగత, అలర్జీలు మొదలైనవి. కానీ ఒతైన జుట్టు మీకు ఒక రోజులో లభించదు, అది రోజు మీరు తీసుకునే జాగ్రత్తలు మరియు మీరు ఉపయోగించే ప్రొడక్ట్స్ ను బట్టి పెరుగుతుంది. ఒతైన కురులను పొందేందుకు కొన్ని చిట్కాలను చూద్దాం.

హెయిర్ వాష్

మీకు రోజూ తల స్నానం చేయటం అంటే ఇష్టమా! కానీ అలా చేయటం అంత మంచిది కాదు. రోజు తల స్నానం చేయటం వలన మీ స్కాల్ప్ మరియు వెంట్రుకలను శుభ్రం చేయటం మాత్రమే కాదు మీ వెంట్రుకలను సంరక్షించేందుకు కావలసిన నేచురల్ ఆయిల్‌ని కూడా తొలగిస్తుంది. కనుక, వారానికి 3 లేదా 4 సార్లు మాత్రమే తల స్నానం చేయండి. వేడి నీటితో స్నానం చేయటం వలన మీ జుట్టు పొడిగ మరియు పెళుసుగా అవుతుంది. కనుక చల్ల నీటితో లేదా సాధారణ నీటితో తల స్నానం చేయండి. చల్లని నీళ్లు మీ కేశాలకు హాని కలగకుండా శుభ్రం చేస్తుంది.

జుట్టుని జాగ్రత్తగా ఆరపెట్టండి

తల స్నానం చేసిన వెంటనే మీ జుట్టుని బిగువుగా టవల్ తో కట్టకండి. అలా చేయటం వలన మీ జుట్టు డామేజ్ అవుతుంది. కురులలోని తడిని సున్నితంగా టవల్ తో తొలగించి గాలికి ఆరపెట్టండి. తడిగా ఉన్న జుట్టును ఎప్పుడు కూడా దువ్వకూడదు. మీ కురులు డామేజ్ అవ్వటానికి మరో కారణం మీరు వాడే దువ్వెన. జట్టులోని చిక్కును తొలగించేందుకు వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనలను వాడండి మరియు క్రింద నుండి పైకి దువ్వండి.

హీట్ స్టైలింగ్ టూల్స్ ని నివారించండి

మీరు తొందరగా సిద్దం అయ్యేందుకు హెయిర్ డ్రైయర్ లాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారా! వీటిని తరచుగా వాడటం వలన మీ కురులు మాత్రమే కాదు వాటి వేర్లు కూడా డామేజ్ అవుతాయి. మీ జుట్టు పలుచగా అవ్వటానికి ఇది ఒక ముఖ్య కారణం. కనుక, ఇటువంటి యంత్రాలను ఉపయోగించకుండా మీ జుట్టుని సహజంగా ఆరపెట్టండి.

కఠినమైన కెమికల్స్ ఉండే ఉత్పత్తులను వాడవద్దు

మీకు ఒతైన కురులు కావాలంటే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడకూడదు. ఇవి మీ జుట్టు మరియు స్కాల్ప్ ను డామేజ్ చేస్తాయి. ఉత్పత్తులలో సోడియం లారెల్ మరియు లారెత్ లాంటి కెమికల్స్ ఉన్నట్లయితే వాటిని వెంటనే పారవేయండి. ఎందుకంటే ఇవి కేశాలకు చాలా హాని కలిగిస్తుంది అంతేకాదు ఇటువంటి కెమికల్స్ డిష్ వాషింగ్ డిటర్జెంట్లలో వాడుతారు.

అలాగే మీరు వాడే కండీషనర్లో సిలికాన్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు మీ జుట్టుని చాలా సార్లు కడగాల్సి ఉంటుంది. ఇందు వలన మీ జుట్టు పలుచగా అవుతుంది.

మీ కేశములు పెరిగేందుకు సహాయపడే పదార్థాలను ఉపయోగించండి

కలబంద, కాస్టర్ ఆయిల్ మరియు అవోకాడో నూనె లాంటి పదార్థాలు ఉన్న షాంపూలను మరియు కండీషనర్లను వాడండి. కలబందతో కూడిన ఉత్పత్తులు వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాస్టర్ ఆయిల్ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అవోకాడో నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు మీ చర్మానికి విటమిన్లను అందిస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోవాలి

మీ జుట్టు మందంగా మరియు షైనీగా లేకపోవడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కురులు ఆరోగ్యాంగా మరియు ఒత్తుగా పెరుగుతాయి.

పౌష్టికాహారం

వేళకు భోజనం, పౌష్టికాహారం తీసుకోవడం, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల జుట్టు వేగంగా మరియు మందంగా పెరుగుతుంది.

తగిన నిద్ర

రోజుకు 7-8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. ప్రతి రోజూ సరైన నిద్రను పొందడం వలన జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

Posted on

Causes of menopause in Telugu – మెనోపాస్ అంటే ఏమిటి? మహిళల్లో మెనోపాస్ లక్షణాలు మరియు కారణాలు

వయస్సుతో పాటు మహిళలు తమ శరీరంలో కొన్ని మార్పులను పొందుతారు. 10-12 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకూ ప్రతి మహిళలో ఋతు చక్రం చాలా సాధారణం. 50 సంవత్సరాలు దాటిన తరువాత ఋతు చక్రం ఆగిపోతుంది. ఈ దశను మెనోపాస్ (ముట్లుడుగు కాలం) అని పిలుస్తారు. దీనిని ‘రజోనివృత్తి’ అని కూడా అంటారు. ఇది వ్యాధి కాదు. ఇది ఒక వయస్సు తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సహజ స్థితి. ఋతు చక్రం ఆగిన తరువాత గర్భవతి కావటం అసాధ్యం.

మహిళలలో మెనోపాస్ సమయంలో అనేక లక్షణాలు కనపడతాయి. క్రింద చెప్పిన వివిధ భౌతిక మరియు మానసిక మార్పులను ఎదుర్కుంటారు.

 • తలనొప్పి
 • నిద్రలేమి
 • అలసట
 • కీళ్లు మరియు కండరాల నొప్పి
 • మానసిక కల్లోలం
 • చిరాకు
 • మూత్రాశయ నియంత్రణలో సమస్యలు
 • డిప్రెషన్
 • గుండె వేగంగా కొట్టుకోవటం
 • యోని పొడిబారటం
 • సెక్స్ డ్రైవ్ తగ్గటం

మెనోపాస్ యొక్క కారణాలు

జీవశాస్త్ర ప్రకారం, ప్రతి మహిళ పుట్టేటప్పుడు పరిమిత సంఖ్యలో గుడ్లు కలిగి ఉంటారు. ఈ గుడ్లు అండాశయాలలో ఉంటాయి. ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ల తయారీలు అండాశయాలలోనే జరుగుతుంది. అండోత్సర్గము మరియు ఋతు స్రావం సరైన నియంత్రణలో ఉండేందుకు ఈ హార్మోన్లు సహాయపడతాయి. ఋతు చక్రం ఆగినప్పుడు స్త్రీ యొక్క అండాశయము గుడ్లను విడుదల చేయదు. దీనిని మెనోపాస్ అని అంటారు. మెనోపాస్ అందరికీ ఒకే వయస్సులో జరగదు. కొంతమంది మహిళలు 60 సంవత్సరాల వరకు ఋతు చక్రం కలిగి ఉంటారు. మరి కొందరికి చాలా చిన్న వయస్సులోనే మెనోపాస్ ఏర్పడుతుంది.

40 ఏళ్ళ తరువాత సహజంగా రుతు స్రావం ఆగిపోతే అది సాధారణ ప్రక్రియ. కానీ అండాశయంలో సమస్య ఏర్పడి సర్జరీ చేయటం లేదా కాన్సర్ వలన కీమోథెరపీ చికిత్స చేయటం లాంటి కారణాల వలన ఋతు చక్రం అసహజంగా అగిపోతుంది.

ఋతు చక్రం ఆగే దశలు

ప్రాకృతికంగా మెనోపాస్ మూడు దశలలో జరుగుతుంది.

మొదటి దశ: పెరి మెనోపాస్.

ఇది మెనోపాస్ కాలానికి కొద్ది సంవత్సరాల ముందు స్త్రీలు ఎదుర్కొను దశ. ఈ దశలో మీ అండాశయములో తక్కువ ఈస్ట్రోజెన్ ఉత్పత్తి అవుతాయి మరియు గుడ్లు అరుదుగా విడుదల అవుతాయి. అంతే కాదు గర్భం ధరించే అవకాశాలు కూడా తక్కువ. మెనోపాస్ కలిగే రెండు సంవత్సరాల ముందు నుండి ఈస్ట్రోజెన్ వేగంగా తగ్గడం మొదలవుతుంది.

రెండవ దశ: మెనోపాస్

ఈ దశలో ఋతు చక్రం పూర్తిగా ఆగిపోతుంది. ఒక సంవత్సరం వరకు ఋతు స్రావం జరగకపోతే మీరు మెనోపాస్ దశలో ఉన్నట్టు తెలుసుకోవచ్చు. ఈ దశలో అండాశయం నుండి గుడ్లు విడుదల పూర్తిగా ఆగిపోతుంది మరియు ఈస్ట్రోజన్ని పూర్తిగా కోల్పోతుంది. ఈ దశలో మహిళలు గర్భవతి అయ్యే అవకాశం లేదు.

మూడవ దశ: పోస్ట్ మెనోపాస్

మెనోపాస్ తరువాత కొన్ని సంవత్సరాలు ఈ దశలో మహిళలు మానసికంగా ప్రభావితులవుతారు.

అకాల మెనోపాస్

చాలా మంది మహిళలు అకాల మెనోపాస్ తో బాధపడుతుంటారు. ఇందుకు కారణాలు ప్రతిఒక్కరికి వేరుగా ఉంటుంది.

 • అండాశయములోనే ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లు తయారు అవుతాయి, కనుక అండాశయం నుండి గుడ్లు ఉత్పత్తి కాకపోతే ఈ పరిస్థితి ఏర్పడవచ్చు.
 • ఏదైనా ఆరోగ్యసమస్య వలన శరీరం నుండి అండాశయం తీసివేయటం వలన కూడా మెనోపాస్ ఏర్పడుతుంది.

గర్భాశయంలో కాన్సర్ మరియు కీమోథెరఫీ రేడియేషన్ వలన కూడా ప్రీమెచూర్ మెనోపాస్ కలగవచ్చు.

Posted on

Telugu tips to get slim waist – సన్నని నడుము పొందటం ఎలా?

ప్రతి ఒక్కరు వారి నడుము స్లిమ్ అండ్ ట్రింగా ఉండాలని ఆశిస్తారు. కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వారసత్వంగా సన్నటి నడుమును పొందుతారు. కొందరు ఎంతో కష్టపడి ఆకర్షణీయమైన నడుము పొందుతారు.

స్థూలకాయంతో బాధపడుతున్న వారి నడుము చుట్టు కొవ్వు ఎక్కువగా ఉండటం వలన సన్నబడటం చాలా కష్టం. ఎక్కువగా తినటం, వ్యాయామాలు మరియు భౌతిక పనులను చేయకపోవటం వంటి కారణాల వలన స్థూలకాయం ఏర్పడుతుంది.

కడుపులోని కొవ్వును తగ్గించేందుకు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఈ ఆర్టికల్ లో చెప్పబడి ఉన్నాయి. వాటిని పాటించి సన్నని అందమైన నడుముని పొందండి.

నడుములోని కొవ్వు తగ్గేందుకు కొన్ని చిట్కాలు

 • తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోండి.
 • ఎక్కువగా తినడం మానుకోండి. చిన్న మోతాదులలో భోజనం తీసుకునే ప్రయత్నం చేయాలి.
 • క్లోరిన్ ఉండే ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోండి.
 • మీ రోజువారీ కార్యకలాపాలలో వ్యాయామం మరియు ఉదయం నడవడం లాంటి అలవాట్లను చేర్చుకోండి.
 • మీకు నచ్చిన క్రీడలను ఎంచుకోని వాటిలో పాల్గొనండి.
 • చల్లటి నీళ్ళకు బదులుగా వెచ్చని నీళ్ళను త్రాగండి.
 • మీ శరీరాన్ని తాజాగా మరియు ఫిట్ గా కనపడేందుకు రోజుకు 10 లేదా 12 గ్లాసుల నీరు త్రాగండి.
 • జంక్ ఫుడ్స్ మీ పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం, కనుక వీటిని నివారించండి.
 • తగినంత సమయం విశ్రాంతి తీసుకోండి.
 • మనం చిన్న వయసులో ఆడుకునే స్కిప్పింగ్ ఒక వ్యాయామం లాంటిది, ఇది మన బరువు తగ్గటానికి మరియు పొట్టలోని కొవ్వు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది.
 • భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే నీటిని త్రాగకూడదు. అలా త్రాగటం వలన కడుపు ఉబ్బుతుంది. కనుక భోజనం చేసిన గంట తరువాత నీళ్లు త్రాగండి. తిన్న వెంటనే కొద్ది సేపు నడవడం చాలా మంచిది.

మీ డైట్ పై దృష్టి పెట్టండి

మీరు రోజువారీ డైట్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. తాజా కూరగాయలు మరియు పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆకు కూరలను తినండి. సిట్రస్ మరియు నీరు ఎక్కువగా ఉండే నారింజ లాంటి పండ్లను తినండి. మీ భోజనంలో మెరుగుపెట్టిన గింజలకన్నా తృణధాన్యాలను ఎక్కువగా చేర్చుకోండి. మెరుగుపెట్టిన(పాలిష్డ్ గ్రైన్స్) గింజలను పూర్తిగా నివారించడం మంచిది. ప్రోటీన్స్ మరియు మంచి ఫ్యాట్స్ కలిగిన పదార్థాలను తినడం కూడా చాలా అవసరం.

పానీయాలు

నీటిని ఎక్కువగా త్రాగండి. చక్కెర మరియు కెఫిన్ ను నివారించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

శరీరంలో మంచి ఆకారం పొందేందుకు వ్యాయామం చాలా అవసరం. ఒక రోజు వ్యాయామం చేసి వెంటనే మానేయటం మంచిది కాదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయటం వలన శరీరం ఆరోగ్యంగా మరియు సన్నగా అవుతుందని నిరూపించబడింది. పొట్టభుజం మరియు తొడ వ్యాయామాలు చేయటం వలన అందమైన శరీర నిర్మాణం పొందుతారు.

మూలాంశం పై దృష్టి పెట్టండి

మీ నడుముని బలపరిచే కార్డియో వ్యాయామాలను చేయటం చాలా ముఖ్యం. దీని వలన మీ వెన్ను నొప్పి కూడా తొలగిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్నటి అందమైన నడుమును పొందుతారు.

బాలన్స్ బాల్

బాలన్స్ బాల్ ని ఉపయోగించి వ్యాయామాలను చేయటం వలన సులభంగా సన్నటి నడుమును పొందవచ్చు.

ఆహారం లో మార్పు

ప్రస్తుతం మీరు పాటిస్తున్న డైట్ మీ బరువు తగ్గటానికి తోడ్పడకపోతే, మీ డైట్ ప్లాన్ ని మార్చండి. ఎందుకంటే చాలా మందిలో మార్పులు కలిగించే డైట్ ప్లాన్ కొందరిలో ఎటువంటి మార్పు చూపక పోవచ్చు. కనుక మీకు సరిపడే డైట్ షెడ్యూల్‌ని మీ ట్రైనర్ని సంప్రదించి మార్చుకోండి.

ఆరోగ్యకరమైన అల్పాహారం

మీరు మీ నడుముని తగ్గించాలని అనుకుంటే, మొత్తం శరీర నిర్మాణం తగ్గించటం కూడా చాలా ముఖ్యం. మీరు ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. రాత్రంతా ఏమీ తినకపోవడం వలన ఉదయం మంచి అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీ శరీర జీవక్రియను పెంచుతుంది అందువలన సహజంగా మీ నడుము సన్నబడుతుంది.

కేలరీలను తగ్గించుకోవాలి

ఒక కర్వ్ నడుము కోసం కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారం మీద దృష్టి పెట్టాలి. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలను తీసుకోండి.

Posted on

Telugu tips for 100 ways to gain weight in a month – మహిళలు ఒక నెలలో బరువు పెరగడానికి 100 విధానాలు

చాలా మంది స్త్రీలు బరువు తగ్గటానికి ప్రయత్నిస్తుస్తారు, కానీ మనలో కొందరు చాలా సన్నగా ఉండటం వలన బరువు పెరగాలని ప్రయత్నిస్తున్నారు. చాలా సన్నగా ఉండటం వలన మరియు పోషకాహార లోపం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఈ ఆర్టికల్ లో మీ బరువు పెరుగుటకు ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని అనుసరించి మీ బరువు మరియు ఆరోగ్యాన్ని పెంపొందించండి.

బరువు పెరిగే చిట్కాలు

 1. ఎక్కువ ఆహారం తీసుకోండి.
 2. మీ రోజువారీ డైట్ లో 500 కేలరీల ఆహారాన్ని ఎక్కువగా చేర్చుకోండి.
 3. స్నాక్స్ తినడం వలన మీ బరువు పెరగచ్చు కానీ ఇది ఆరోగ్యకరమైన పద్దతి కాదు.
 4. మీ డాక్టర్‌ని లేదా ఒక నిపుణుడిని సంప్రదించండి.
 5. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరిగేందుకు ప్రయత్నించండి.
 6. అందంగా కనపడేందుకు మాత్రమే బరువు పెరగటంకన్నా మీ శరీరం యొక్క ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి.
 7. ఆరోగ్యకరమైన కొవ్వు మరియు పోషకాలతో కూడిన ఆహారాన్ని తినండి.
 8. కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
 9. మొక్కలలోని కొవ్వు పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి. విత్తనాలు, గింజలు, అవకాడొలు, వేరుశెనగ వెన్న మరియు ఆలివ్ నూనెలను ఎక్కువ తీసుకోండి. బరువు పెరగడానికి ఇవి తోడ్పడతాయి.
 10. ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ మరియు కేలరీలు ఎక్కువగా ఉండే ఇతర నూనెలను సలాడ్ తినేటప్పుడు చేర్చుకోండి.
 11. మీకు తోచినప్పుడల్లా బాదాం, పిస్తా లాంటి గింజలను తినండి.
 12. మీరు మాంసాహారులు అయితే మీ ఆహారంలో జంతువుల కొవ్వుల్ని కూడా చేర్చుకోండి.
 13. సాచురేటెడ్ ఫ్యాట్స్ ని సరైన మోతాదులలో తినండి.
 14. పాల ఉత్పత్తులు మరియు లీన్ మాంసాలలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. మీ ఆహారంలో వాటిని చేర్చండి. ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే, తక్కువ కొవ్వు పదార్థాలను తినటం మంచిది.
 15. బరువు పెరిగేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవటం ఉత్తమ మార్గం. ఇది శరీరంలో కొవ్వును పెంచకుండా లీన్ కండరాలను నిర్మిస్తుంది.
 16. మీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు బరువు పెరుగుటకు శిక్షణ తీసుకోవాలి మరియు కండరాలను బలపరిచే వ్యాయామాలను చేయాలి.
 17. మీ రోజూ ఆహారంలో 5 ఔన్సుల ప్రోటీన్ ఉండాలి. పౌల్ట్రీ, చేప, లీన్ మాంసం, గుడ్లు, చిక్కుళ్ళు మరియు తృణధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
 18. మీరు ప్రోటీన్-రిచ్ పానీయాలు, స్మూతీస్ వంటివి కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
 19. కొందరు మహిళలకు ఎక్కువ తినడం సాధ్యం కాదు. అంటువంటి వాళ్ళు మీ ఆహారాన్ని వెన్న లేదా నూనెతో చేసుకొని తినండి. ఈ విధంగా మీరు ఎక్కువ తినకుండానే ఎక్కువ కేలరీలను తీసుకోవచ్చు. ఒక్క స్పూన్ నూనె కూడా ఎక్కువ కేలరీలను అందిస్తుంది.
 20. నూనె మరియు వెన్నను తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే, వీటిని ఎక్కువగా తినటం వలన ఆరోగ్యానికి కీడు కలుగుతుంది. కనుక సరైన మోతాదులలో తీసుకోవాలి.
 21. మీ అల్పాహారంతోపాటు ఫల రసాన్ని కూడా తీసుకోండి, ప్రాధాన్యంగా నారింజ ఫల రసాన్ని త్రాగాలి. ఇది రుచికరంగా మరియు ఎక్కువ కేలరీలను అందిస్తుంది.
 22. చాలా మంది మహిళలు తక్కువ బోన్ డెన్సిటీ సమస్యతో బాధపడుతుంటారు. కనుక, మీ రోజూ ఆహారంలో రెండు గ్లాసుల పాల్లను చేర్చుకోవాలి. ఇది కాల్షియం మరియు ప్రోటీన్లను మీకు అందిస్తుంది.
 23. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి.
 24. మీరు ప్రస్తుతం తింటున్న మోతాదులకన్నా ఎక్కువగా తినటానికి ప్రయత్నించండి.
 25. పెద్ద ప్లేట్లలో తినటం వలన మీకు తెలియకుండానే మీరు ఎక్కువ ఆహారాన్ని తింటారు. కనుక మీ ప్లేట్ ని మార్చండి.
 26. ఏ ఒక్క పూటా భోజనం దాటవేయకూడదు. ఇది మీ బరువు నిర్వహణ నియమాన్ని నాశనం చేస్తుంది.
 27. బరువు కచ్చితంగా పెరగాలని అనుకునే వారు రోజుకు ఎక్కువ సార్లు తినాలి. ఉదాహరణకు ప్రస్తుతం మీరు రోజుకు 3 సార్లు తింటున్నట్లయితే ఇకపై 6 సార్లు తినటానికి ప్రయత్నించండి.
 28. సమతుల్యమైన ఆహారం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, కొవ్వు, మరియు విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఉండాలి.
 29. బరువు పెరగటానికి సాల్మన్ మరియు టునా చేపలు చాలా సహాయపడుతుంది.
 30. పీనట్ బట్టర్ కూడా అద్భుతాలు చేస్తుంది.
 31. స్నాక్ టైం ని పెంచండి. మీరు తక్కువగా తిన్నా ఎక్కువ బరువు పెరగటానికి సహాయ పడుతుంది.
 32. మీ ఆహారాలను బాగా రుచికరంగా తయారు చేసుకోండి. ఆహారం రుచిగా మరియు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటే మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తింటాము.
 33. మీ ఆహార అలవాట్లను ప్రేరేపించేందుకు ప్రయత్నించండి.
 34. ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకపోవటమే మంచిది.
 35. ఆహారాల యొక్క న్యూట్రీషన్ విలువలను తెలుసుకునేందుకు ఒక డైటీషియన్ ని సంప్రదించండి.
 36. కొత్త రకాల వంటకాలను చేయటానికి ప్రయత్నించండి.
 37. బరువు పెంచే ఎన్నో రకాల వంటకాలు ఇంటర్నెట్ లో మీకు లభిస్తాయి.
 38. వేగంగా తినేందుకు ప్రయత్నించండి. వేగంగా తినటం వలన ఎక్కువగా తినగలుగుతారు.
 39. ప్రతి రెండు గంటలకు ఒక సారి తినటానికి ప్రయత్నించండి.
 40. బరువు పెరిగేందుకు మీ జీవనశైలి మరియు రోజువారీ అలవాట్లను మార్చుకోండి.
 41. జంక్ ఫుడ్ మరియు కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక మీరు బరువు పెరగటానికి వాటిపై ఆధార పడవద్దు.
 42. బరువు తగ్గటానికి రాత్రి 7 గంటల తరువాత ఏమీ తినకూడదని నిపుణులు అంటారు. మరి మనం బరువు పెరగటానికి దీనికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తామా? అవును, బరువు పెరగటానికి రాత్రి ఆలస్యమయినా పర్లేదు తినండి.
 43. తినటానికి స్పూన్లు ఉపయోగించవద్దు. చేతులతో తినండి. దీని వలన మీరు ఎక్కువగా తినగలుగుతారు.
 44. తినేటప్పుడు మీరు కూర్చొనే విధానం చాలా ముఖ్యం. సరిగ్గా కూర్చొని తినకపోతే ఎక్కువ ఆహారాన్ని తినలేరు.
 45. నీటిని ఎక్కువగా త్రాగండి.
 46. బంగాళదుంపను మీ ఆహారంలో రెగ్యులర్ గా చేర్చుకోండి. ఇది బరువు పెంచేందుకు తోడ్పడుతుంది.
 47. బరువు పెరగడానికి చీస్ తో కూడిన బంగాళదుంప చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.
 48. వారానికి రెండు సార్లు మీకు నచ్చిన ఐస్ క్రీములను తినండి.
 49. ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న పాలు త్రాగండి. వీటిని వీలైనంత ఎక్కువగా మీ టీ లేదా కాఫీలో చేర్చుకోండి.
 50. అరటి పండుని రోజూ తినండి.
 51. చికెన్ తినటం వలన మీ కండరాల మాస్ పెరుగుతుంది.
 52. ఎక్కువ ఫైబర్ ను తీసుకోండి. ఇది మీ ప్రేగుల యొక్క కార్యాచరణను మెరుగుపరుస్తుంది.
 53. భోజనం చేసే ముందు నీటిని త్రాగ కూడదు. అలా త్రాగటం వలన ఎక్కువ ఆహారాన్ని తినలేరు.
 54. మీరు భోజనానికి ముందు విరామంగా కొద్ది సేపు నడవండి. ఇది మీ ఆకలిని పెంచి ఎక్కువగా తినేందుకు తోడ్పడుతుంది.
 55. మీకు ఆకలి లేకపోయినా సమయానికి సరిగ్గా భోంచేయండి.
 56. తినేటప్పుడు టీవీ చూడటం లాంటి అలవాట్లను మానుకోండి. కేవలం ఆహారం మీద దృష్టి పెట్టి తినండి.
 57. బరువు పెరగటానికి ఆహారాలను ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం.
 58. చీస్ ఎక్కువగా ఉండే పిజ్జా, బర్గర్ మరియు డెజర్ట్స్, స్వీట్లను కొన్నిసార్లు తినటం వలన బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
 59. కార్బోహైడ్రేట్ ఆహారాలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి.
 60. నీరు ఎక్కువగా ఉండే దోసకాయ లాంటి కూరగాయలకన్నా క్యారట్లు, బంగాళదుంపలు లాంటి ఎక్కువ స్టార్చ్ ఉండే కూరగాయలను తీసుకోండి.
 61. పళ్ళలో కూడా పుచ్చకాయ లాంటి నీరు ఎక్కువగా ఉండే వాటికి బదులుగా స్టార్చ్ ఎక్కువగా ఉండే అరటి పండ్లను తీసుకోండి.
 62. డెసెర్ట్స్ ను తయారు చేసేటప్పుడు నీటికి బదులుగా పాలను ఉపయోగించండి. కొద్దిగా మిల్క్ క్రీం కూడా చేర్చుకోవచ్చు.
 63. మార్కెట్ లో లభించే నాణ్యమైన సప్లిమెంట్స్ మరియు మూలిక ఉత్పత్తులను వాడండి.
 64. ఎక్కువగా తినటం అంటే ఊపిరి తిరగకుండా చేసేలా తినమని అర్థం కాదు. మీరు ఎప్పుడూ తినేదానికంటే కొద్దిగా ఎక్కువ తినండి.
 65. మీకు ధూమపానం మరియు మద్యం సేవించే అలవాటు ఉంటే వెంటనే వాటిని మానండి. ఎందుకంటే వీటి వలన బరువు తగ్గటమే కాదు అనారోగ్యానికి కూడా హాని కలుగుతుంది.
 66. బరువు తగ్గటానికి మాత్రమే కాదు పెరగాలంటే కూడా వ్యాయామాలను చేయాలి.
 67. బైసెప్ కర్ల్స్, స్క్వాట్స్, చిన్ అప్, బెంచ్ ప్రెస్సెస్, లెగ్ కర్ల్స్ లాంటి వ్యాయామాలు కండరాలలో ద్రవ్యరాశిని పొందేందుకు మీకు సహాయపడుతుంది.
 68. ఏ వ్యాయామం నుండి మొదలు పెట్టాలో తెలియటం లేదా? ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ని సంప్రదించండి. వారు వ్యాయామాలను ఏలా చేయాలో పూర్తిగా వివరిస్తారు.
 69. ఎంత వ్యాయామం చేస్తే అన్ని కేలరీలను కోల్పోతారు. వీటిని తిరిగి పొందేందుకు ప్రోటీన్ షేక్స్ ను తీసుకోండి.
 70. హృదయ వ్యాయామాలను చేయకండి. ఈ వ్యాయామాలు మీ కేలరీలను ఎక్కువగా కరిగిస్తుంది. దీని వలన మీ బరువు తగ్గుతుంది.
 71. మీరు బరువు పెరిగేందుకు చేసే ఏ ప్రయత్నాలైనా స్థిరంగా చేయాలి. అప్పుడే తొందరగా ఫలితాన్ని పొందుతారు.
 72. బరువు పెరిగేందుకు కొద్దిగా సమయం పడుతుంది. రెండే రోజుల్లో బాడీ బిల్డర్ లా అవ్వటం కుదరదు. కనుక సహనంగా ఉండాలి.
 73. మీరు చేసే వ్యాయామాలను మారుస్తూనే ఉండండి. ఒకే రకమైన వ్యాయామం చేయటం చాలా విసుగు కలిగిస్తుంది.
 74. శరీరంలోని ఒక భాగంపై మాత్రమే ఒత్తిడిని పెంచే వ్యాయామాన్ని చేయకండి.
 75. స్ట్రెచింగ్ మరియు రెసిస్టన్స్ వ్యాయామాలు కూడా చాలా ముఖ్యం.
 76. వ్యాయామం చేసేటప్పుడు సెట్స్ మధ్యలో విశ్రాంతి తీసుకోండి.
 77. మీరు రిలాక్స్ అవ్వటానికి వ్యాయామం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేయండి.
 78. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి.
 79. మీ ఆహారం మరియు బరువు శిక్షణలో మార్పులు చేయడం మాత్రమే కాదు తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం.
 80. రోజుకు కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం.
 81. మీ శరీరానికి సరిపడే ఆహార పద్దతులను గ్రహించి వాటిని అనుసరించండి.
 82. మీరు బరువు పెరిగే ప్రయత్నాలను ప్రారంభించిన మొదటి రెండు రోజులలోనే మీ బరువును పోల్చవద్దు. ఎందుకంటే బరువు పెరిగేందుకు చాలా సమయం పడుతుంది.
 83. తక్షణ మార్పులను ఆశించకండి.
 84. మీ లక్ష్యం సాధించగలిగేలా మరియు నిర్వహించగలిగేలా ఉండాలి.
 85. మీ శరీరానికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడిని పెంచకూడదు.
 86. బరువు పెరిగే నియమావళిని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించటం చాలా సహాయపడుతుంది.
 87. వారానికి 3 రోజులు వ్యాయామం చేస్తే చాలు. ఎక్కువ సమయం అవసరం లేదు. చాలా మంది వ్యాయామం చేసేందుకు సమయం లేదని అంటారు. మీ కొరకు కొద్ది సమయాన్ని కేటాయించటం చాలా అవసరం.
 88. మీ బరువు యొక్క ట్రాక్ ని మెయింటైన్‌ చేయండి.
 89. ధ్యానం చేయటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది. మీరు రిలాక్స్ అవటం వలన మీ బరువు పెంచటంలో బాగా దృష్టి పెట్టవచ్చు.
 90. వెయిట్ మానెజ్మెంట్ సెమినార్లకు వెళ్ళండి. ఈ రోజుల్లో ఇలాంటి సెమినార్లు తరచుగా నిర్వహిస్తున్నారు.
 91. మీరు బరువు పెరిగేటప్పుడు మీ కండరాలతో పాటు మీ శరీరంలో కొవ్వు కూడా పెరుగుతుంది. దీని వలన మీరు నిరుత్సాహ పడకూడదు. మీకు కావలసిన బరువు పెరిగిన తరువాత అదనపు ఆహారాలను క్రమంగా తగ్గించాలి.
 92. రాబోయే వారాల్లో మీ శరీరానికి సంబంధించిన మార్పులను ముందుగానే తెలుసుకొని సానుకూల విధానంలో బరువు పెంచండి.
 93. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి.
 94. మీరు వ్యాయామాలను మొదలు పెట్టిన మొదటి రోజుకి మరియు 8 వ రోజుకి మీ బరువు లోని తేడాని చూడండి.
 95. ఒక వేళ మీరు బరువు పెరగాలని ప్రయత్నించి బరువు తగ్గి ఉంటే నిరాశ చెందవద్దు. సరైన గైడెన్స్ తో మళ్ళీ ప్రయత్నించండి.
 96. అవసరం అయినప్పుడు మీ ట్రైనర్ దగ్గర సలహాలు పొందండి.
 97. వేగంగా బరువు పెరగాలని ప్రయత్నించ కూడదు.
 98. కేలరీలను ఎక్కువ తీసుకోవటం మాత్రమే కాదు, సరైన పోషకాహారాలను కూడా తీసుకోవాలి.
 99. మీరు పాటిస్తున్న పద్ధతుల ద్వారా మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
 100. మీరు గర్భం ధరించటం వలన బరువు తగ్గి ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు మరియు మందులను తీసుకోండి.
Posted on

Fiber rich foods in Telugu – ఫైబర్ రిచ్ ఫుడ్స్ – మంచి ఆరోగ్యం కోసం ఫైబర్ రిచ్ ఆహారాలు

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కొందరు మంచి ఆరోగ్యం కోసం మరికొందరు బాడీ ఫిట్‌నెస్ కోసం ఈ ఆహారాలను తీసుకుంటారు. మంచి ఆరోగ్యం కొరకు వ్యాయామాలు, శారీరక పనులు మరియు క్రీడలలో పాల్గొంటూ ఫైబర్ ఆహారాలను కూడా మీ డైట్ లో చేర్చుకోవటం చాలా అవసరం. ఈ ఆహారాలు మీ పనులకు కావలసిన శక్తిని అందించి మీ శరీరం యొక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి తోడ్పడుతుంది.

ఫైబర్ యొక్క లోపం వలన మలబద్ధకం, మొలలు మరియు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఫైబర్ అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే అతిసారం, ప్రేగు అవరోధం లేదా నిర్జలీకరణం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక మన శరీరానికి కావల్సినంత ఫైబర్ పదార్థాలను మనం చేసే పనుల బట్టి తీసుకోవాలి.

ఫైబర్ ఎందుకు ముఖ్యమైనది?

ఫైబర్ ఆహారాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఇవి మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.

ఫైబర్ రెండు రకాలు

కరిగే ఫైబర్ (సాల్యుబుల్) మరియు కరగని ఫైబర్ (ఇన్ సాల్యుబుల్). సాల్యుబుల్ ఫైబర్ శరీరంలో ఒక జెల్ లా మారి మెల్లగా డైజెస్ట్ అవుతుంది. ఇన్ సాల్యుబుల్ ఫైబర్ డైజెస్ట్ అవ్వకుండానే శరీరం నుండి మలం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది.

ఫైబర్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు

ఊక (మొక్కజొన్న, గోధుమ, బియ్యం మరియు ఓట్స్)

బ్రాన్ సర్వసాధారణంగా ధాన్యపు రొట్టెలలో ఉపయోగిస్తాము. ఇందులో విటమిన్ బి6 మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మీ రోజూ అల్పాహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ మరియు గోధుమలను చేర్చుకోండి.

ఎండిన మూలికలు, మసాలా దినుసులు మరియు మిరియాలు

మీ వంటకాల్లో మిరపకాయాలు, పప్రికా వంటి మరింత ఎండిన స్పైసెస్ ని జోడించడం వలన ఇవి విటమిన్లు మరియు ఖనిజాలను ఎక్కువగా అందిస్తుంది. ఎండిన మూలికలు మరియు మసాలా దినుసులు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. పొడి చేసిన దాల్చిన చెక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

కోకో పౌడర్ మరియు డార్క్ చాక్లెట్

కోకో పౌడర్ లో ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కోకో పౌడర్ లో 32 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

అవిసె గింజలు, నువ్వులు గింజలు మరియు నువ్వులు వెన్న

అవిసె గింజలు మరియు నువ్వుల గింజలలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల అవిసె గింజలలో సుమారు 27.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. టోస్ట్ చేసిన 100 గ్రాముల నువ్వుల గింజలు 14 గ్రాముల ఫైబర్ అందిస్తుంది.

డ్రై రోస్టెడ్ సోయబీన్స్

కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సోయబీన్స్ సహాయపడుతుంది. ఇది ఎప్పుడైనా తినగలిగే ఒక ఆరోగ్యకరమైన స్నాక్స్.

ఎండబెట్టిన టమోటాలు

ఎండబెట్టిన టమోటాలలో ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి సాస్, పిజ్జా మరియు సలాడ్లలో గొప్ప రుచిని మరియు ఆకర్షణీయమైన ఎరుపు రంగుని పెంచుతుంది.

నట్స్ (బాదాం, పిస్తా పప్పులు, పెకాన్స్)

గింజల యొక్క ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. బాదాం గింజలలో రాజు ‍వంటిది మరియు గొప్ప ఆరోగ్య విలువ కలిగి ఉంటుంది. వీటిని సలాడ్లలో చేర్చవచ్చు లేదా స్నాక్స్ లా తినవచ్చు. ఒక 100 గ్రాముల బాదాం దాదాపు 12.2 గ్రాముల ఫైబర్ ని అందిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్

ఈ విత్తనాలను చిరుతిండిగా లేదా అనేక సలాడ్లలో ఒక మూల వస్తువుగా ఉపయోగించవచ్చు. సన్ ఫ్లవర్ విత్తనాలలో విటమిన్ ఇ, విటమిన్ బి1, బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం మరియు రాగి యొక్క గొప్ప లక్షణాలు ఉన్నాయి.

బీన్స్ (బేబీ, తెలుపు, ఫ్రెంచ్, కిడ్నీ)

బీన్స్ లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని ఉడికించి తినటం వలన ఎక్కువ ఫైబర్ ని అందిస్తుంది.100 గ్రాముల నేవీ బీన్స్ 10.5 గ్రాముల ఫైబర్ ని అందిస్తుంది.

పాషన్ పండు (గ్రానాడిల్లా)

ఇవి మరింత ప్రాచుర్యాన్ని పొందుతున్న ఉష్ణ మండల పండ్లు.100 గ్రాముల పండ్లలో 10.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

ఆర్టిచోకెస్

ఆర్టిచోక్ ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క మీడియం సైజు పండులో 10.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బ్రోకలీ

బ్రోకలీలో ప్రోటీన్ మరియు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన ఒక కప్పు బ్రోకలీలో 5.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రోకలీని ఉపయోగించి ఎన్నో రకాల వంటకాలను సులభంగా చేయవచ్చు.

బ్లాక్బెర్రీస్

బ్లాక్బెర్రీస్ ఒక కాలానుగుణ పండు, ఇందులో ఎక్కువ ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన పదార్ధాలు ఉన్నాయి. ఒక కప్పు బ్లాక్బెర్రీస్ లో 7.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మీరు ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఇతర పండ్లతో వీటిని కలుపుకొని తినవచ్చు.

బటానీలు

బటానీలు చాలా సులభంగా మార్కెట్ లో లభిస్తుంది మరియు ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఒక కప్పు ఉడికించిన బటానీలలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

లెంటిల్స్ (కాయధాన్యాలు)

వీటినే పప్పులు, త్రుణ ధాన్యాలు అనికూడా అంటారు. వీటిలో ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. వీటిని రోజూ ఆహారాలలో చేర్చుకోవడం వలన ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. వీటిని సలాడ్స్ లో కూడా చేర్చుకొని తినవచ్చు.

అవొకాడో

అవొకాడోని మీ డైట్ లో చేర్చుకోవటం వలన గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలా విటమిన్లను మరియు పోషకాలను అందించి మీ బరువు తగ్గటంలో సహాయపడుతుంది.

మష్రుమ్

మష్రుమ్ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కనుక వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

సెలరీ

సెలరీలో ఫైబర్ అధికంగా మరియు క్యాలరీలు తక్కువగా ఉంటుంది. కేవలం ఒక కప్పు సెలరీలో 6 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

జామకాయ

జామకాయను అధిక న్యూట్రీషియన్స్ ఉన్న ఫ్రూట్స్ అని అంటారు. ఒక్క జామ కాయలో 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ కె మరియు విటమిన్ సి కూడా ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన డయాబెటిస్ ను కూడా నివారిస్తుంది.

కివి ఫ్రూట్

కివి ఫ్రూట్ లో 1.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులోని సాల్యుబుల్ కంటెంట్ గుండె ప్రమాదాల్ని తగ్గిస్తుంది.

డేట్స్

ఖర్జూరంలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఒక్క ఖర్జూరంలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

ఆపిల్స్

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అనే విషయాన్ని వినే ఉంటారు. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాదు. నిజానికి దీనిలో ఫైబర్ మరియు ప్రయోజకరమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఒక సాధారణ పరిమాణం గల యాపిల్ లో 4.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

రాస్బెర్రీస్

రాస్బెర్రీస్ లో విటమిన్ సి, మ్యాంగనీస్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు రాస్బెర్రీస్ లో 8 గ్రాములు డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఒబేసిటీ మరియు గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది.

అరటి పండ్లు

అరటి పండ్లలో ఎక్కువ ఫైబర్ మరియు న్యూట్రిషన్స్ ఉంటాయి. అరటి పండ్లలోని ఫైబర్ క్రోనిక్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

Posted on

Telugu remedies for yellow teeth – పసుపు దంతాల చికిత్స కోసం ఇంటి చిట్కాలు

శరీరంలో దంతాలు ఒక ముఖ్యమైన భాగం. ఇవి తెల్లగా ఉంటే మనం మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు మన ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా కనపడుతుంది. పసుపు రంగు పళ్ళు చాలా వికారంగా ఉంటుంది మరియు తోటి వారికి మన పై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

పళ్ళను సరిగ్గా బ్రష్ చేయకపోవటం, వయసు అవటం, వంశానుగత కారణాలు, సరైన దంత పరిశుభ్రత లేఖ పోవటం, టీ మరియు కాఫీ ఎక్కువగా త్రాగటం, పొగాకు మరియు సిగరెట్ అధికంగా వినియోగించటం వలన మీ పళ్ళు పసుపు రంగు కావచ్చు. చాలా మంది దంతాల యొక్క తెలుపు రంగును తిరిగి పొందేందుకు ఎన్నో ఖరీదైన చికిత్సలను చేస్తారు. కానీ ఇంటిలోని పదార్థాలను ఉపయోగించి ఈ పసుపు రంగుని సులభంగా తొలగించవచ్చు.

పళ్ళపై పసుపు మరకలు తొలగించేందుకు ఇంటి నివారణలు

బేకింగ్ సోడా

బేకింగ్ పొడిని ఉపయోగించి పళ్ళ రంగును తెల్లగా మార్చే ఒక మౌత్ వాష్‌ని తయారు చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని 1/2 కప్పు చల్లని నీటిలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు మౌత్ వాష్‌లా ఉపయోగించండి.

స్ట్రాబెర్రీలు

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది.3 స్ట్రాబెర్రీలను బాగా రుబ్బి మీ పళ్ళపై ఒక నిమిషం పాటు రుద్దండి. ఇలా వారానికి 3 సార్లు ఉపయోగించండి.

నిమ్మరసం

కొన్ని చుక్కల నిమ్మరసంలో ఒక చిటికె ఉప్పుని కలుపుకొని మీ పళ్ళపై రుద్దండి. లేదా నిమ్మపండు యొక్క తొక్కని పళ్ళపై రుద్ది నీటితో నోరు పుక్కిలించండి. నిమ్మపండులో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నందున మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆపిల్ పండు

మీరు ఆపిల్ పండును తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఎందుకంటే ఇందులోని అసిడిక్ లక్షణాలు మరియు ఇందులోని ఫైబర్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది. మీ రోజూ డైట్లో ఆపిల్ పండును చేర్చుకొండి. ఇది మీ పళ్ళకు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉప్పు

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ నోటిలో ఉన్న బాక్టీరియాలను తొలగించి పళ్ళను తెల్లగా చేస్తుంది. అంతే కాదు మీ పళ్ళకు కావలసిన మినరల్స్ ని కూడా అందిస్తుంది. ఉప్పుని వాడేటప్పుడు జాగ్రత్తను వహించాలి, వీటిని ఎక్కువ కఠినంగా పళ్ళపై వాడటం వలన మీ చిగురు మరియు ఎనామెల్ని బాధించవచ్చు.

చార్కోల్

మీరు రోజూ ఉపయోగించే టూత్పేస్ట్ పై కొద్దిగా చార్కోల్ పౌడర్ చేర్చుకొని మృదువుగా బ్రష్ చేయండి. మీ పళ్ళు తెల్లగా అయ్యే వరకు రోజుకు రెండు సార్లు చార్కోల్ తో బ్రష్ చేయండి.

నారింజ తొక్క

రాత్రి పడుకునే ముందు నారింజ తొక్కతో మీ పళ్ళను బాగా రుద్దండి. దీనిని కడగకుండా రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో కడగండి. ఇది మీ పళ్ళకు తెలుపు రంగు ఇవ్వటమే కాదు క్రిములతో పోరాడి మీ దంతాలను ధృఢంగా చేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులోని బ్లీచింగ్ ఏజెంట్స్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగిస్తుంది. మీరు మౌత్ వాష్ కొనేటప్పుడు అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండేలా చూసి కొనండి.

తులసి

మన భారత దేశంలో ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టును పూజిస్తాము. ఇందులో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఇది మన పళ్ళ పసుపు రంగును మరియు అనేక నోటి సమస్యలను తొలగించేందుకు ఉపయోగ పడుతుంది. కొన్ని తులసి ఆకులను కొన్ని గంటలు ఎండలో ఉంచండి. ఆకులు బాగా ఎండిన తరువాత రుబ్బి పొడిలా చేసుకోండి. ఈ పొడిని మీ టూత్ పేస్ట్ తో పాటు పళ్ళను బ్రష్ చేసేటప్పుడు ఉపయోగించండి. లేదా, ఈ పొడిని ఆవాల నూనెలో కలుపుకొని పళ్ళపై మర్దన చేయండి.

వేపాకు

మన పురాతన రోజులలో పళ్ళను బ్రష్ చేసేందుకు వేపాకు చెట్టు యొక్క కొమ్మలను ఉపయోగించే వారు. ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు క్రిమినాశక లక్షణాలు పళ్ళను తెల్లగా చేస్తుంది. మరియు చెడు వాసనను తొలగిస్తుంది. మీ పెరటిలో ఈ చెట్టు ఉన్నట్లయితే వీటి యొక్క కొమ్మలను ఉపయోగించి మీ పళ్ళను రోజూ రుద్దండి. ఇది చేదుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తుంది.

అరటి పండు తోలు

అరటి పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. కానీ అరటి తొక్క వలన కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇది పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది. అరటి తోలును పళ్ళపై 2-3 నిమిషాలు రుద్ది 15 నిమిషాల తరువాత సాధారణ టూత్ పేస్ట్ తో బ్రష్ చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 రోజులు చేయండి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను ఎన్నో రకాల తీపి వంటకాలలో వాడుతాము. వీటిలో కొన్ని మీ దంతాలపై పసుపు మరకలను తొలగించేందుకు ఉపయోగించండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని ఎండుద్రాక్షలను నోటిలో వేసుకొని నమలండి. ఇది మీ నోటి లోపల లాలాజలమును అధికంగా ఉత్పత్తి చేసి పసుపు రంగును తొలగిస్తుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇది మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. నారింజ, నిమ్మ, పైనాపిల్  లాంటి పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక సిట్రస్ పండులోని చిన్న ముక్కను తీసుకొని మీ పళ్ళపై రుద్దండి.

ఆయిల్ పుల్లింగ్

ఈ పద్దతిని మన అమ్మమ్మ మరియు తాత చెప్పి ఉంటారు. కానీ మనలో కొందరు నిర్లక్ష్యం చేసి ఉంటాము. ఆయిల్ పుల్లింగ్ మీ పళ్ళను తెల్లగా చేయటం మాత్రమే కాదు మీ నోటిలోని బాక్టీరియాలను కూడా తొలగిస్తుంది.

పాలు మరియు పెరుగు

పళ్ళకు ముఖ్యమైన పోషకాలు కాల్షియం మరియు ఫాస్పరస్. పాలు మరియు పెరుగు మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి పంటి ఎనామెల్ యొక్క ఖనిజాలను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. కావిటీస్ ను కూడా తొలగిస్తుంది.

మర్రి చెట్టు మూలాలు

మీ పంటి సమస్యలను తొలగించేందుకు మర్రి చెట్టు యొక్క మూలాలను కూడా ఉపయోగించవచ్చు. మీరు టూత్ బ్రష్ లాగా వీటి వేర్లను ఉపయోగించవచ్చు. ఇది మీ పళ్ళపై పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది.

పచ్చికూరలు

కీరదోస వంటి పచ్చికూరగాలయను బాగా నమిలి తినడం వలన పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి .

ఆపిల్ సీడర్ వెనిగర్

ఆపిల్ సీడర్ వెనిగర్ తో మీ పసుపు రంగు పళ్ళను తెల్లగా మార్చుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు ఆపిల్ సీడర్ వెనిగర్ తో నోరు పుక్కిలించి కడగండి. ఇది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.

క్యారట్

పళ్ళపై పసుపు రంగును తొలగించేందుకు క్యారట్ లోని ఫైబర్ సహాయపడుతుంది. అంతే కాదు ఇది దంతాలను దృఢంగా చేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పు నమిలి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి. లేదా దాల్చిన చెక్క పొడితో బ్రష్ చేయండి.

Posted on

Telugu remedies for dry skin – పొడి చర్మం తొలగించడానికి గృహ నివారణలు

మీ చర్మం పొడిగా అయినప్పుడు లేదా మొదటి నుండి మీకు పొడి చర్మం ఉన్నట్లయితే దురద మరియు చర్మంపై పగుళ్లు లాంటి సమస్యలు ఎదుర్కుంటారు. సూర్య కిరణాలు లేదా మురికి కాలుష్యం వలన మీ పొడి చర్మం కఠినం కావచ్చు.

ఇది చాలా మందికి కలిగే ఒక సాధారణ సమస్య. చర్మం బాగా పొడిగా అయినప్పుడు గోరుతో చిన్నగా గోకినా తెల్లని గీత కనిపిస్తుంది. ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే చర్మంపై పగుళ్లు మరియు చర్మం నుండి రక్తం కారడం లాంటి విపరీత సమస్యలు ఎదురవుతాయి. కొన్ని పోషకాహార లోపం వలన కూడా చర్మం పొడి బారి పోతుంది. కొందరికి వయసు అవటం వలన కూడా ఈ సమస్య కలగచ్చు. ఈ సమస్యను మూలికలు, పండ్లు మరియు కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించి సులభంగా నిర్మూలించవచ్చు. మీకు జన్యు సిద్ధత వలన పొడి చర్మం ఉన్నట్లయితే ఇంటి నివారణలు ఉత్తమంగా పనిచేస్తాయి. కానీ ఈ నివారణ పద్దతులను అనుసరించేటప్పుడు కొద్దిగా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే ఈ పద్ధతులు మీ సమస్యను తొలగించేందుకు కొద్ది సమయం పడుతుంది.

దురద పుట్టించే పొడి చర్మంలో చైతన్యం నింపేందుకు గృహ నివారణ పద్దతులను చూద్దాం

నూనె

3 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ ఆముదము కలిపి ముఖంపై రాయండి. ఒక వస్త్రాన్ని వేడి నీటిలో తడిపి నూనె రాసిన ముఖంపై ఉంచండి. ఈ వస్త్రం చల్లగా అయ్యే వరకూ ఉంచి ముఖాన్ని కడగండి. చర్మం మృదువుగా అయ్యే వరకు ఈ పద్దతిని రిపీట్ చేయండి.

తేనె

కొద్దిగా తేనెని మీ ముఖంపై రాసి కొన్ని నిమిషాల తరువాత కడగండి.

మార్నింగ్ ప్యాక్

ఒక బౌల్లో ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నారింజ రసం, కొన్ని చుక్కల గులాబీ నీళ్లు మరియు నిమ్మరసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడపై రాసి 20 నిమిషాల తరువాత స్నానం చేయండి.

చాక్లెట్

డార్క్ చాక్లెట్లను ఉపయోగించి మీ చర్మాన్ని ప్రకాశంగా, యవ్వనంగా మరియు మచ్చలు లేకుండా చేయవచ్చు.3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ అవోకాడోను బాగా కలిపి పేస్ట్‌లా చేయండి. దీనిని ముఖం మరియు మెడపై రాసి మర్దన చేయండి.20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

ప్రాకృతిక పదార్థాలను వాడండి

మీరు ఉపయోగించే సబ్బులో కెమికల్స్ మరియు శుభ్రపరచే ఏజెంట్స్ ఉండటం వలన మీ చర్మానికి ఎక్కువ హాని కలుగుతుంది. కావున, శనగ పిండి లాంటి ప్రాకృతిక పదార్థాలను ఉపయోగించండి.

మామిడి పండు

మామిడి పండు కూడా మీ పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా మామిడి పండులో తగినంత చక్కెర కలుపుకొని ఒక పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత కడగండి.

ఉప్పు

స్నానం చేసిన వెంటనే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని మీ చర్మంపై రుద్దండి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

మొక్కజొన్న పిండి

మీరు స్నానం చేసే నీటిలో మూడు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని కలుపుకొని స్నానం చేయండి. ఇది పొడి మరియు దురద చర్మాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది.

అరటి పండు

ఒక అరటి పండును బాగా చూర్ణం చేసి ముఖంపై రాయండి.20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

మిల్క్ క్రీం

మిల్క్ క్రీంలోని లాక్టిక్ ఆసిడ్చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. కొన్ని చుక్కల నిమ్మరసం మరియు రెండు స్పూన్ల మిల్క్ క్రీమును కలుపుకొని ముఖం, చేతులు మరియు కాళ్లపై రాసి 15 నిమిషాల తరువాత స్నానం చేయండి. ఈ మిశ్రమాన్ని చర్మం నుండి తొలగించే ముందు 2 నిమిషాలు మర్దన చేయండి.

కొబ్బరి నూనె

తాజా కొబ్బరి నుండి తయారు చేసిన నూనెలో ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. స్నానం చేసిన తరువాత కొబ్బరి నూనెని శరీరంపై రాసుకోండి.

వోట్మీల్

చాలా మంది బరువు తగ్గేందుకు మరియు ఆరోగ్యంగా ఉండేందుకు వోట్మీల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఉపయోగకరమైన పదార్థం. మీరు స్నానం చేసే వెచ్చని నీటిలో ఒక కప్పు వోట్మీల్ని కలిపి ఆ నీటిలో మీ శరీరాన్ని నానపెట్టండి.15 నిమిషాల తరువాత స్నానం చేయండి. ఇది చనిపోయిన చర్మ పొరలను తొలగించి తాజా అనుభూతిని ఇస్తుంది.

బాదాం నూనె

పొడి చర్మానికి ముఖ్యంగా కావలసిన పోషక పదార్థం విటమిన్ ఇ. బాదాంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ పొడి చర్మానికి పోషణ ఇస్తుంది. కొద్దిగా బాదాం నూనెని వెచ్చగా అయ్యే వరకు వేడి చేసి, మీ ముఖం, చేతులు మరియు కాళ్లపై రాయండి. ఇలా రోజూ చేయటం వలన మీ చర్మం యొక్క తేమను తిరిగి పొందగలరు.

గుడ్డు పచ్చసొన

గుడ్డు యొక్క పచ్చసొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. మీ చర్మం మృదువుగా అయ్యేందుకు ప్రోటీన్స్ చాలా అవసరం. ఒక బౌల్లో గుడ్డు యొక్క పచ్చసొన, ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ మిల్క్ పౌడర్ కలుపుకొని మీ పొడి చర్మంపై రాయండి.20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

Posted on

Hyper-pigmentation removal face packs in Telugu – హైపర్ పిగ్మెంటేషన్ తొలగించటానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్

హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ప్యాచీ స్కిన్‌, అన్ ఈవెన్ స్కిన్‌ టోన్ లాంటివి బాలికలకు ఎదురయ్యే సాధారణ సమస్యలు. వీటిని తొలగించేందుకు ఎన్నో రకాల చిట్కాలను మరియు ఫేస్ ప్యాకులను చాలా వెబ్‌సైట్లలో చూసే ఉంటాము. కానీ ఇంకా కొన్ని కొత్త చిట్కాల కోసం మనం వెతుకుతూ ఉంటాము. ఈ ఆర్టికల్లో వంటగదిలో ఉండే పదార్థాలను ఉపయోగించి హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలను తొలగించే కొన్ని ఫేస్ ప్యాక్‌లను చూద్దాం.

హైపర్ పిగ్మెంటేషన్ తొలగించేందుకు ఫేస్ ప్యాకులు

క్రింద చెప్పిన ఫేస్ ప్యాకులలో మీ చర్మానికి ఏది సరిపోతుందో ఎంచుకొని కనీసం ఒక వారం ఆ ఫేస్ ప్యాకును వాడండి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.

పొటాటో ఫేస్ ప్యాక్

ఉర్లగడ్డలో విటమిన్లు, బి కాంప్లెక్స్ మరియు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మీ చర్మం లోతుల వరకూ వెళ్లి నల్లని మొటిమలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ను తొలగిస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ పై మైల్డ్ ఆసిడ్లా పనిచేస్తుంది.

 • ప్యాక్ 1: ఉర్లగడ్డ రసాన్ని ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత కడగండి.
 • ప్యాక్ 2: ఒక స్పూన్ ఉర్లగడ్డ రసాన్ని, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనెని కలుపుకొని ఒక పేస్ట్‌లా తయారు చేసుకోండి. దీనిని ముఖం మరియు మెడపై రాసి 15 నిమిషాల తరువాత కడగండి.

ఇందులోని ఉర్లగడ్డ రసం చర్మం యొక్క రంగును మెరుగు పరుస్తుంది, బియ్యం పిండి స్క్రబ్స్ లా పనిచేస్తుంది, నిమ్మరసం చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది మరియు తేనె మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

నిమ్మరసం ఫేస్ ప్యాక్

నిమ్మరసం చాలా ప్రభావితమైన పదార్థం. ఇది పొడి చర్మాన్ని, చనిపోయిన చర్మపు కణాలను మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ఒక స్పూన్ నిమ్మరసం, 5 స్పూన్ల తేనెని బాగా కలుపుకొని పిగ్మెంటేషన్ పై రాసి కొద్ది సేపు మర్దన చేయండి. 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

పాలు మరియు తేనె

నాలుగు స్పూన్ల పాలు ఒక స్పూన్ తేనెని బాగా కలిపి ముఖం మరియు పిగ్మెంటేషన్ పై రాసి మర్దన చేయండి.10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. పాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించగలదు.

పసుపు ఫేస్ ప్యాక్

ఎన్నో ఏళ్ళ నుండి చర్మం యొక్క సమస్యలను తొలగించేందుకు ఉపయోగించే ఒక మూలిక పసుపు. ఇది చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్, బ్యాక్టీరియా మరియు నల్లని మచ్చలను తొలగిస్తుంది.

 • ప్యాక్ 1: ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ పాలు మరియు ఒక స్పూన్ శనగ పిండిని కలుపుకొని పేస్ట్‌లా తయారు చేయండి. దీనిని ముఖం మరియు పిగ్మెంటేషన్ పై రాసి మర్దన చేయండి. బాగా ఆరిన తరువాత కడగండి.
 • ప్యాక్ 2: 2 స్పూన్ కొబ్బరి నూనె, 1/2 స్పూన్ పసుపు మరియు 1 స్పూన్ కలబంద జెల్ కలుపుకొని ఈ పేస్ట్‌ని పిగ్మెంటేషన్ పై రాసి 30 నిమిషాల తరువాత కడగండి. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. కలబంద చర్మంపై టాన్ మరియు నల్లని మచ్చలను తొలగిస్తుంది.
 • ప్యాక్ 3: 2 టేబుల్ స్పూన్ పెరుగు మరియు ఒక స్పూన్ పసుపును కలుపుకొని పిగ్మెంటేషన్ వున్న చర్మంపై మరియు ముఖం, మెడా, చేతులు, కాళ్లపై రాసి ఆరిపోయిన తరువాత కడగండి. పెరుగు చనిపోయిన చర్మపు కణాలను తొలగించి చర్మం యొక్క రంగును మెరుగు పరుస్తుంది.

బొప్పాయి పండు

బొప్పాయి పండులోని అనేక లక్షణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ కు కారణం అయిన మెలస్మాను తగ్గిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్ర పరుస్తుంది.

 • ఒక స్పూన్ పండిన బొప్పాయి పండు, ఒక స్పూన్ తేనెని పేస్ట్ లా కలుపుకొని ముఖంపై రాయండి. 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

బాదాం

చర్మం తెల్లబడేందుకు కావలసిన ప్రోటీన్లు మరియు విటమిన్ ఇ బాదాం లో ఎక్కువగా ఉన్నాయి.

 • ఐదు బాదాంలను రుబ్బి కొన్ని చుక్కల తేనెని అందులో కలుపుకొని గట్టి పేస్ట్‌లా చేసుకోండి. వీటిని ముఖంపై, పిగ్మెంటేషన్ పై రాసి 5 నిమిషాలు మర్దన చేసి 20 నిమిషాల తరువాత కడగండి.

కలబంద

కలబంద జెల్ లో హైడ్రాటింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మంటను మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. మీరు ఎన్నో క్రీములలో మరియు మాయిశ్చరైజర్ లో కలబంద ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగించటం చూసి ఉంటారు. దీనికి కారణం ఇందులోని వైద్య లక్షణాలు.

 • కలబంద జెల్‌ను ముఖంపై రాసి 5 నిమిషాలు మర్దన చేయండి. 15 నిమిషాల పాటు చర్మంపై ఉంచి కడగండి.

వోట్మీల్

వోట్మీల్ చర్మం యొక్క చనిపోయిన కణాలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగించడంలో సమర్ధవంతంగా పని చేస్తుంది.

 • ఒక టేబుల్ స్పూన్ వోట్మీల్ కొద్దిగా పాలు మరియు కొన్ని చుక్కల తేనెని కలుపుకొని చర్మంపై రాసి 2 నిమిషాలు మర్దన చేసి 20 నిమిషాల తరువాత కడగండి.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ హైపర్ పిగ్మెంటేషన్ తొలగించటమే కాదు నల్లని మచ్చలను కూడా తొలగించి చర్మానికి పోషణ కలిగిస్తుంది.

 • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని చర్మంపై రాసి 20 నిమిషాల తరువాత కడగండి.

దోసకాయ

ఇది అన్ని రకాల క్రీములు మరియు చర్మ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇందులో చర్మం యొక్క రంగును మెరుగు పరిచే మరియు హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి.

 • రెండు టేబుల్ స్పూన్ దోసకాయ పల్ప్, రెండు టేబుల్ స్పూన్ కలబంద జెల్ మరియు ఒక స్పూన్ గులాబీ నీళ్లను బాగా కలిపి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

కాయధాన్యాలు మరియు శనగ పిండి

ఇవి చర్మంపై చనిపోయిన కణాలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగ పిండి ఒక స్పూన్ ఉర్లగడ్డ రసం మరియు కొద్దిగ తేనెని కలుపుకొని పేస్ట్ లా తయారుచేయండి. దీనిని ముఖంపై రాసి ఆరిన తరువాత నీటితో మర్దన చేస్తూ తొలగించండి.

వేపాకు

ఇది ఒక శక్తివంతమైన స్కిన్ లైటనింగ్ ఏజెంట్. ఒక టేబుల్ స్పూన్ వేపాకు రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

టమోటా

ఇందులోని యాంటీ టాన్ అంశాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరచి పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ప్యాక్ 1: ఒక టమోటా రసం మరియు ఒక స్పూన్ చక్కెరను కలుపుకొని ముఖంపై రాసి 5 నిమిషాలు మర్దన చేసి కడగండి.
 • ప్యాక్ 2: 3 స్పూన్ల టమోటా రసం, 5 స్పూన్ల పాలు, ఒక స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు మరియు ఒక స్పూన్ కొత్తిమీర పేస్ట్ కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

సన్‌స్క్రీన్ లోషన్

సూర్య కిరణాల వలన పిగ్మెంటేషన్ అధికరిస్తుంది. కావున సూర్య కిరాణాల నుండి చర్మాన్ని కాపాడేందుకు ఇంట్లోనే సన్‌స్క్రీన్ లోషన్‌ను తయారు చేయవచ్చు.

 • ప్యాక్ 1: ఒక కప్పు దోసకాయ రసం, కొద్దిగా గ్లిసరిన్, గులాబీ నీళ్లను కలిపి ఫ్రిజ్లో ఉంచండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు దీనిని ముఖం మరియు చేతులపై రాసుకోండి.
 • ప్యాక్ 2: బయటికి వెళ్లే ముందు 2 లేదా 3 చుక్కల నెయ్యి లేదా కొబ్బరి నూనెని ముఖంపై, చేతులపై రాసుకోండి.

కొబ్బరి నూనె

రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెని ముఖంపై, కాళ్లపై రాసి 10 నిమిషాలు మర్దన చేయండి. ఈ నూనెని రాత్రంతా చర్మంపై ఉంచి ఉదయం శనగ పిండితో కడగండి. ఇది మీ చర్మంలోని జిడ్డును మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

Posted on

Telugu tips to reduce stomach bloating – ఉబ్బిన పొట్టను తగ్గించడం ఎలా? – కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

కాలేయం లేదా గుండె జబ్బులు వలనే కడుపు ఉబ్బుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రేగులోని వాయువు లేదా కణజాలంలో అదనపు ద్రవాలు చేరడం. దీని వలన మీ కడుపు యొక్క పరిమాణం పెరిగి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిని కడుపు వాపు అని కూడా అంటారు. ఇది ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి మొదలైన కారణాల వలన కలిగే సమస్య. క్రింద చెప్పిన కొన్ని విధానాలను అనుసరించి ఈ సమస్యను సులభంగా తొలగించండి.

ఉబ్బిన కడుపు తగ్గించే ఇంటి చిట్కాలు

పొటాషియం

పొటాషియం శరీరంలోని ద్రవాలను సంతులనంగా ఉంచుతుంది. అరటి పండు, టమోటాలు, బచ్చలి కూర, మామిడి పండు మరియు గింజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన శరీరంలోని అదనపు నీటిని తొలగించి ఉబ్బిన కడుపు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

అరటి పండ్లు

అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున మలబద్ధకం రావటానికి కారణం అయిన వాయువు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మీ శరీరంలోని ద్రవాల స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండ్లను తినడం ద్వారా పొట్ట ఉబ్బరం తొలగిపోతుంది.

గాలిని మింగకూడదు

మనం తెలిసో తెలియకనో గాలిని ఎక్కువగా మింగుతాము, దీని మూలంగా కడుపు ఉబ్బుతుంది. ధూమపానం, పళ్ళ రసాలను త్రాగటం, బబుల్ గమ్ నమలడం లాంటి కొన్ని అలవాట్లపై దృష్టి పెట్టండి. తినేటప్పుడు తక్కువ మాట్లాడండి.

సోపు గింజలు

ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపు ఉబ్బటం వలన కలిగే మూత్ర విసర్జన నొప్పిని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో కండరాలను సడలిస్తుంది. భోజనం చేసిన తరువాత కొన్ని సోపు గింజలను నమలండి లేదా, ఒక స్పూన్ సోపు గింజలను ఒక కప్పు వేడి నీటిలో వేసి 5-10 నిమిషాల పాటు ఉంచండి. ఈ నీటిని వడి గట్టి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

స్టార్చ్ ఆహారాలను నివారించండి

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం స్టార్చ్ ఆహార పదార్థాలు. కావున వీటిని నివారించండి లేదా తక్కువగా తినండి. నూడుల్స్, వైట్ బ్రెడ్, పాస్టరీస్, కేకులు, పాస్తాలు మొదలైన వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.

శారీరక పనులను అనుసరించండి

రోజువారీ శారీరక పనులను చేయడం వలన మీ జీర్ణ శక్తి మెరుగు పొందుతుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎనిమిది గంటలు నిద్ర కూడా అవసరం.

అల్లం

అల్లం శరీరంలోని వాయువును తొలగించి ఉబ్బిన పొట్టను తొలగిస్తుంది. ఇది ప్రేగులలో వాపును మరియు మంటను తగ్గించి ప్రేగు కండరాలను సడలిస్తుంది.5 లేదా 6 ముక్కల అల్లంను ఒక కప్పు ఉడుకు నీటిలో వేసి 10 నిమిషాల పాటు మూసి పెట్టండి. ఆ తరువాత వడి గట్టి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి రోజుకు 3 సార్లు త్రాగండి.

నివారించవలసిన ఆహార పదార్థాలు

నల్ల మిరియాలు, వెనిగర్, మిరపకాయ, ఆవాలు, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి కరమైన ఆహార పదార్థాలను నివారించండి. ఎందుకంటే ఇవి కడుపులో మంటను పుట్టించవచ్చు.

మసాజ్ చేయటం

మీ ఉబ్బిన కడుపులోనీ వాయువును తొలగించేందుకు జీర్ణ వాహిక దిశలో మసాజ్ చేయండి. మీ వేళ్లను నడుము నుండి మొదలు పెట్టి పెద్ద ప్రేగు వరకు నొక్కండి.

కారవే విత్తనాలు

ఇందులో యాంటీ మోక్రోబియాల్, యాంటీ స్పస్మోడిక్ మరియు కర్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులోని కార్వోల్ మరియు కార్వెనే అనే రెండు రసాయనాలు జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల కణజాలను సున్నితంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ విత్తనాలు మీ శరీరంలోని వాయువును బహిష్కరించి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. మీకు తరచూ పొట్ట ఉబ్బే సమస్య ఉన్నట్లయితే ఒక చిటిక కారవే విత్తనాలను రోజంతా నమలండి. లేదా ఈ విత్తనాలను బాగా దంచి నీటిలో వేసి ఉడకబెట్టి టీ లా త్రాగండి.

ఆహారాన్ని నమిలేటప్పుడు జాగ్రత్త వహించండి

సరైన ఆహారాన్ని తీసుకోవటమే కాదు వాటిని తినేటప్పుడు ఎక్కువ సార్లు నమిలి తినాలి. ఆహారాన్ని వేగంగా మరియు సరిగ్గా నమలకుండా తినటం వలన పొట్ట ఉబ్బుతుంది. జీర్ణం కానీ ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తున్నప్పుడు బాక్టీరియాలు వీటి ద్వారా వాయువును విడుదల చేస్తాయి, ఇది ఉబ్బిన కడుపుకు దారితీస్తుంది.

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం లేదా తక్కువగా తీసుకోవటం వలన కూడా కడుపు ఉబ్బుతుంది. కావున ఫైబర్ ఉన్న ఆహారాలను సరైన మోతాదులలో తీసుకోవాలి.

మలబద్ధకం

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం మలబద్దకం. సరైన ఫైబర్ ఆహారాలను తీసుకోవటం వలన మీ జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. దీని వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్స్, మొక్కజొన్న, గోధుమ బియ్యం, అవోకాడో, గోధుమ పాస్తా, బటానీలు, ఆర్టిచోకెస్, గోధుమ బ్రెడ్, బ్రోకలీ, ఆపిల్ పండు, బఠానీలు, కోరిందకాయలు మరియు బాదాంలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఒక వేళా మీకు మలబద్ధకం సమస్య లేనట్లయితే ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తినకూడదు, ఎందుకంటే మీ సమస్య మరింత అధికం కావచ్చు. మీకు వాయువు సమస్య ఉన్నట్లయితే ఫైబర్ ఆహారాలను తగ్గించండి.

ఉడికించిన కాయకూరలు

కాయకూరలను ఉడికించేటప్పుడు కడుపు ఉబ్బరం సమస్య కలిగించే కొన్ని ఫైబర్లు మరియు ఎంజైములు తొలగిపోతాయి. అంతే కాదు ఉడికించిన కాయకూరలు సులభంగా జీర్ణం అవుతాయి.

Posted on

Telugu tips for pregnant women with thyroid problems – థైరాయిడ్ సమస్యలు ఉన్న గర్భిణీ స్త్రీలు – కారణాలు మరియు చికిత్సలు

స్త్రీలకు గర్భం ధరించడం ఒక వరం. ప్రతి గర్భిణీ ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కలగచ్చు, థైరాయిడ్ సమస్య అందులో ఒకటి. థైరాయిడ్ ని అవటుగ్రంథిమరియు కాకళగ్రంథి అని అంటారు.

థైరాయిడ్ గ్రంథులు జీవక్రియను సమతుల్యంగా ఉంచేందుకు కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఈ గ్రంథులు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? మీ మెడలో ఆడమ్స్ ఆపిల్ క్రింద ఒక సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు ఎక్కువగా పనిచేయటం లేదా సరిగ్గా పనిచేయక పోవటం వలన సమస్యలు కలగవచ్చు.

థైరాయిడ్ గురించి కొన్ని వివరాలను చూద్దాం

థైరాయిడ్ గ్రంథులు కొన్ని సార్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరి కొన్ని సార్లు చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు.

గర్భిణి స్త్రీలు తెలుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మీకు ప్రసవించే శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యా కలగకుండా చూసుకోవచ్చు. ఇందుకు మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి. మీ వైద్యుడు సూచించిన మందులను సరైన సమయాలకు వేసుకోవటం మర్చిపోకూడదు.

గర్భిణి స్త్రీలలో థైరాయిడ్ యొక్క ముఖ్యత్వం

శిశువు యొక్క మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ యొక్క పెరుగుదల మీ థైరాయిడ్ హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ప్లాసెంటా మూలంగా శిశువుకు కావలసిన హార్మోన్లు మీ నుండి సరఫరా అవుతుంది.18-20 వారాల తరువాత మీ శిశువు యొక్క థైరాయిడ్ పని చేయటం మొదలుపెడుతుంది.

థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ కావటానికి లేదా తక్కువ కావటానికి కారణం ఈస్ట్రోజెన్మరియు హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్‘ (HCG) అనే రెండు హార్మోన్లు. మీరు కొద్దిగా అధిక బరువు ఉన్నట్లయితే మీ గర్భధారణ సమయంలో థైరాయిడ్ పెరుగుతుంది. కానీ ఈ మార్పులను కనుక్కోవటం మీ వైద్యులకు అంత సులువు కాదు. ఎందుకంటే, థైరాయిడ్ రుగ్మత వలన మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ వలన కూడా థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు కలుగుతుంది. కావున కొన్ని లక్షణాలను బట్టే ఈ సమస్యను కనుక్కోగలుగుతారు.

థైరాయిడ్ యొక్క లక్షణాలను చూద్దాం

హైపర్ థైరాయిడిజం

నీరసంగా ఉండటం, హృదయ స్పందన వేగంగా ఉండటం మరియు క్రమంగా లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టక పోవటం, ఎక్కువ దిగులుగా ఉండటం, బరువు తగ్గటం లేదా ఎక్కటం, వాంతులు లేదా తీవ్రమైన వికారం కలగటం, వణుకు పుట్టడం వంటి లక్షణాలను చూపుతుంది.

హైపో థైరాయిడిజం

బరువు పెరగటం, తీవ్రమైన అలసట కలగటం, ఏకాగ్రత లేక పోవటం లేదా విషయాలను తొందరగా మరిచిపోవటం, మలబద్ధకం, చలిని తట్టుకోలేక పోవటం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను చూపుతుంది.

గర్భధారణ సమయంలో థైరాయిడ్ వ్యాధికి కారణాలు ఏమిటి?

హైపర్ థైరాయిడిజం కలగటానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్. శరీరంలో గ్రేవ్స్ వ్యాధిఅనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కలిగినప్పుడు థైరాయిడ్ – స్టిములేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI)’ అనే యాంటీ బాడీఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

హైపో థైరాయిడిజం కలగటానికి కారణం హషిమోటోస్ థైరాయిడిటిస్అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీని వలన మీ థైరాయిడ్కు కావలసిన కణాలు అందకుండా పోతుంది. కావున తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధికి ఎలా చికిత్స చేయాలి?

ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించ వచ్చు.

మీకు హైపర్ థైరాయిడిజం ఉందని గుర్తించబడితే, సమస్యను పరిష్కరించడానికి యాంటీ థైరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి. హైపో థైరాయిడిజం ను T4 హార్మోన్‌లకు సమానమైన లెవోథైరోక్సిన్ తో చికిత్స చేయవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి మరియు పై చెప్పబడిన ఏదైనా లక్షణాలు మీలో కనపడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండండి.