Posted on

Telugu tips to reduce stomach bloating – ఉబ్బిన పొట్టను తగ్గించడం ఎలా? – కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

కాలేయం లేదా గుండె జబ్బులు వలనే కడుపు ఉబ్బుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రేగులోని వాయువు లేదా కణజాలంలో అదనపు ద్రవాలు చేరడం. దీని వలన మీ కడుపు యొక్క పరిమాణం పెరిగి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిని కడుపు వాపు అని కూడా అంటారు. ఇది ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి మొదలైన కారణాల వలన కలిగే సమస్య. క్రింద చెప్పిన కొన్ని విధానాలను అనుసరించి ఈ సమస్యను సులభంగా తొలగించండి.

ఉబ్బిన కడుపు తగ్గించే ఇంటి చిట్కాలు

పొటాషియం

పొటాషియం శరీరంలోని ద్రవాలను సంతులనంగా ఉంచుతుంది. అరటి పండు, టమోటాలు, బచ్చలి కూర, మామిడి పండు మరియు గింజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన శరీరంలోని అదనపు నీటిని తొలగించి ఉబ్బిన కడుపు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

అరటి పండ్లు

అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున మలబద్ధకం రావటానికి కారణం అయిన వాయువు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మీ శరీరంలోని ద్రవాల స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండ్లను తినడం ద్వారా పొట్ట ఉబ్బరం తొలగిపోతుంది.

గాలిని మింగకూడదు

మనం తెలిసో తెలియకనో గాలిని ఎక్కువగా మింగుతాము, దీని మూలంగా కడుపు ఉబ్బుతుంది. ధూమపానం, పళ్ళ రసాలను త్రాగటం, బబుల్ గమ్ నమలడం లాంటి కొన్ని అలవాట్లపై దృష్టి పెట్టండి. తినేటప్పుడు తక్కువ మాట్లాడండి.

సోపు గింజలు

ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపు ఉబ్బటం వలన కలిగే మూత్ర విసర్జన నొప్పిని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో కండరాలను సడలిస్తుంది. భోజనం చేసిన తరువాత కొన్ని సోపు గింజలను నమలండి లేదా, ఒక స్పూన్ సోపు గింజలను ఒక కప్పు వేడి నీటిలో వేసి 5-10 నిమిషాల పాటు ఉంచండి. ఈ నీటిని వడి గట్టి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

స్టార్చ్ ఆహారాలను నివారించండి

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం స్టార్చ్ ఆహార పదార్థాలు. కావున వీటిని నివారించండి లేదా తక్కువగా తినండి. నూడుల్స్, వైట్ బ్రెడ్, పాస్టరీస్, కేకులు, పాస్తాలు మొదలైన వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.

శారీరక పనులను అనుసరించండి

రోజువారీ శారీరక పనులను చేయడం వలన మీ జీర్ణ శక్తి మెరుగు పొందుతుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎనిమిది గంటలు నిద్ర కూడా అవసరం.

అల్లం

అల్లం శరీరంలోని వాయువును తొలగించి ఉబ్బిన పొట్టను తొలగిస్తుంది. ఇది ప్రేగులలో వాపును మరియు మంటను తగ్గించి ప్రేగు కండరాలను సడలిస్తుంది.5 లేదా 6 ముక్కల అల్లంను ఒక కప్పు ఉడుకు నీటిలో వేసి 10 నిమిషాల పాటు మూసి పెట్టండి. ఆ తరువాత వడి గట్టి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి రోజుకు 3 సార్లు త్రాగండి.

నివారించవలసిన ఆహార పదార్థాలు

నల్ల మిరియాలు, వెనిగర్, మిరపకాయ, ఆవాలు, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి కరమైన ఆహార పదార్థాలను నివారించండి. ఎందుకంటే ఇవి కడుపులో మంటను పుట్టించవచ్చు.

మసాజ్ చేయటం

మీ ఉబ్బిన కడుపులోనీ వాయువును తొలగించేందుకు జీర్ణ వాహిక దిశలో మసాజ్ చేయండి. మీ వేళ్లను నడుము నుండి మొదలు పెట్టి పెద్ద ప్రేగు వరకు నొక్కండి.

కారవే విత్తనాలు

ఇందులో యాంటీ మోక్రోబియాల్, యాంటీ స్పస్మోడిక్ మరియు కర్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులోని కార్వోల్ మరియు కార్వెనే అనే రెండు రసాయనాలు జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల కణజాలను సున్నితంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ విత్తనాలు మీ శరీరంలోని వాయువును బహిష్కరించి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. మీకు తరచూ పొట్ట ఉబ్బే సమస్య ఉన్నట్లయితే ఒక చిటిక కారవే విత్తనాలను రోజంతా నమలండి. లేదా ఈ విత్తనాలను బాగా దంచి నీటిలో వేసి ఉడకబెట్టి టీ లా త్రాగండి.

ఆహారాన్ని నమిలేటప్పుడు జాగ్రత్త వహించండి

సరైన ఆహారాన్ని తీసుకోవటమే కాదు వాటిని తినేటప్పుడు ఎక్కువ సార్లు నమిలి తినాలి. ఆహారాన్ని వేగంగా మరియు సరిగ్గా నమలకుండా తినటం వలన పొట్ట ఉబ్బుతుంది. జీర్ణం కానీ ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తున్నప్పుడు బాక్టీరియాలు వీటి ద్వారా వాయువును విడుదల చేస్తాయి, ఇది ఉబ్బిన కడుపుకు దారితీస్తుంది.

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం లేదా తక్కువగా తీసుకోవటం వలన కూడా కడుపు ఉబ్బుతుంది. కావున ఫైబర్ ఉన్న ఆహారాలను సరైన మోతాదులలో తీసుకోవాలి.

మలబద్ధకం

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం మలబద్దకం. సరైన ఫైబర్ ఆహారాలను తీసుకోవటం వలన మీ జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. దీని వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్స్, మొక్కజొన్న, గోధుమ బియ్యం, అవోకాడో, గోధుమ పాస్తా, బటానీలు, ఆర్టిచోకెస్, గోధుమ బ్రెడ్, బ్రోకలీ, ఆపిల్ పండు, బఠానీలు, కోరిందకాయలు మరియు బాదాంలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఒక వేళా మీకు మలబద్ధకం సమస్య లేనట్లయితే ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తినకూడదు, ఎందుకంటే మీ సమస్య మరింత అధికం కావచ్చు. మీకు వాయువు సమస్య ఉన్నట్లయితే ఫైబర్ ఆహారాలను తగ్గించండి.

ఉడికించిన కాయకూరలు

కాయకూరలను ఉడికించేటప్పుడు కడుపు ఉబ్బరం సమస్య కలిగించే కొన్ని ఫైబర్లు మరియు ఎంజైములు తొలగిపోతాయి. అంతే కాదు ఉడికించిన కాయకూరలు సులభంగా జీర్ణం అవుతాయి.

Posted on

Telugu tips for pregnant women with thyroid problems – థైరాయిడ్ సమస్యలు ఉన్న గర్భిణీ స్త్రీలు – కారణాలు మరియు చికిత్సలు

స్త్రీలకు గర్భం ధరించడం ఒక వరం. ప్రతి గర్భిణీ ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కలగచ్చు, థైరాయిడ్ సమస్య అందులో ఒకటి. థైరాయిడ్ ని అవటుగ్రంథిమరియు కాకళగ్రంథి అని అంటారు.

థైరాయిడ్ గ్రంథులు జీవక్రియను సమతుల్యంగా ఉంచేందుకు కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఈ గ్రంథులు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? మీ మెడలో ఆడమ్స్ ఆపిల్ క్రింద ఒక సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు ఎక్కువగా పనిచేయటం లేదా సరిగ్గా పనిచేయక పోవటం వలన సమస్యలు కలగవచ్చు.

థైరాయిడ్ గురించి కొన్ని వివరాలను చూద్దాం

థైరాయిడ్ గ్రంథులు కొన్ని సార్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరి కొన్ని సార్లు చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు.

గర్భిణి స్త్రీలు తెలుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మీకు ప్రసవించే శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యా కలగకుండా చూసుకోవచ్చు. ఇందుకు మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి. మీ వైద్యుడు సూచించిన మందులను సరైన సమయాలకు వేసుకోవటం మర్చిపోకూడదు.

గర్భిణి స్త్రీలలో థైరాయిడ్ యొక్క ముఖ్యత్వం

శిశువు యొక్క మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ యొక్క పెరుగుదల మీ థైరాయిడ్ హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ప్లాసెంటా మూలంగా శిశువుకు కావలసిన హార్మోన్లు మీ నుండి సరఫరా అవుతుంది.18-20 వారాల తరువాత మీ శిశువు యొక్క థైరాయిడ్ పని చేయటం మొదలుపెడుతుంది.

థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ కావటానికి లేదా తక్కువ కావటానికి కారణం ఈస్ట్రోజెన్మరియు హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్‘ (HCG) అనే రెండు హార్మోన్లు. మీరు కొద్దిగా అధిక బరువు ఉన్నట్లయితే మీ గర్భధారణ సమయంలో థైరాయిడ్ పెరుగుతుంది. కానీ ఈ మార్పులను కనుక్కోవటం మీ వైద్యులకు అంత సులువు కాదు. ఎందుకంటే, థైరాయిడ్ రుగ్మత వలన మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ వలన కూడా థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు కలుగుతుంది. కావున కొన్ని లక్షణాలను బట్టే ఈ సమస్యను కనుక్కోగలుగుతారు.

థైరాయిడ్ యొక్క లక్షణాలను చూద్దాం

హైపర్ థైరాయిడిజం

నీరసంగా ఉండటం, హృదయ స్పందన వేగంగా ఉండటం మరియు క్రమంగా లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టక పోవటం, ఎక్కువ దిగులుగా ఉండటం, బరువు తగ్గటం లేదా ఎక్కటం, వాంతులు లేదా తీవ్రమైన వికారం కలగటం, వణుకు పుట్టడం వంటి లక్షణాలను చూపుతుంది.

హైపో థైరాయిడిజం

బరువు పెరగటం, తీవ్రమైన అలసట కలగటం, ఏకాగ్రత లేక పోవటం లేదా విషయాలను తొందరగా మరిచిపోవటం, మలబద్ధకం, చలిని తట్టుకోలేక పోవటం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను చూపుతుంది.

గర్భధారణ సమయంలో థైరాయిడ్ వ్యాధికి కారణాలు ఏమిటి?

హైపర్ థైరాయిడిజం కలగటానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్. శరీరంలో గ్రేవ్స్ వ్యాధిఅనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కలిగినప్పుడు థైరాయిడ్ – స్టిములేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI)’ అనే యాంటీ బాడీఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

హైపో థైరాయిడిజం కలగటానికి కారణం హషిమోటోస్ థైరాయిడిటిస్అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీని వలన మీ థైరాయిడ్కు కావలసిన కణాలు అందకుండా పోతుంది. కావున తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధికి ఎలా చికిత్స చేయాలి?

ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించ వచ్చు.

మీకు హైపర్ థైరాయిడిజం ఉందని గుర్తించబడితే, సమస్యను పరిష్కరించడానికి యాంటీ థైరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి. హైపో థైరాయిడిజం ను T4 హార్మోన్‌లకు సమానమైన లెవోథైరోక్సిన్ తో చికిత్స చేయవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి మరియు పై చెప్పబడిన ఏదైనా లక్షణాలు మీలో కనపడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండండి.

Posted on

Telugu skin care tips for men – పురుషుల చర్మ సంరక్షణ చిట్కాలు

సాధారణంగా మహిళలు వారి అందాన్ని సంరక్షించుకోడానికి ఎన్నో ప్రయత్నాలను చేయటం చూసి ఉంటాము, అనేక పద్దతులను ప్రయత్నిస్తారు. కానీ, మహిళలే కాదు కొందరు పురుషులు కూడా వారి అందం పట్ల జాగ్రత్తలు మరియు మెరుగు పరిచే పద్దతులను అనుసరిస్తారు. పురుషుల యొక్క చర్మం వారి టెస్టోస్టిరాన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. వీరి చర్మం చాలా మందంగా, ఎక్కువ రంధ్రాలతో మరియు ఎక్కువ కొల్లాజెన్ ఫైబర్స్ కలిగి ఉంటుంది. పురుషుల చర్మంలోని సెబాషియస్ గ్లాండ్స్ మరింత చురుకుగా పనిచేయటం వలన వీరి చర్మం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది.

పురుషులు వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన చర్మ సంరక్షణ ఉత్పత్తులనే ఉపయోగించాలి. షేవింగ్ తరువాత తేలికపాటి మరియు సున్నితమైన క్లెన్సర్లనే వాడాలి. న్యూట్రల్గా మరియు కెమికల్స్ తక్కువగా ఉండే జెల్స్, ఫోమ్స్ ను ఉపయోగించే షేవింగ్ చెయ్యాలి. షేవింగ్ తర్వాత ఉపయోగించే లోషన్లు జిడ్డు లేకుండా, ఎటువంటి ఆల్కహాల్ లేకుండా మంటను తగ్గించే విధంగా ఉండాలి.

పురుషుల చర్మ సంరక్షణం కొరకు కొన్ని సూచనలు

సాధ్యమైనంత వరకూ సూర్య కిరణాలనుండి చర్మాన్ని రక్షించుకోండి

సూర్యుని కిరణాలనుండి రక్షణాత్మక చర్యలు తీసుకోండి. సన్ గ్లాసెస్ ఉపయోగించటం మరియు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా అవసరం.

సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించండి

ఇది చాలా సాధారణ విషయం, కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు.SPF కలిగి ఉన్న సన్‌స్క్రీన్లను ప్రతిరోజూ ఉపయోగించండి. దీని వలన సూర్య కాంతుల్లోని అనవసరమైన రేడియేషన్స్ నుండి మీ చర్మం సంరక్షింపబడుతుంది.

టోనర్ ఉపయోగించండి

టోనర్ కేవలం మహిళలకు మాత్రమే కాదు; పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయబడుతోంది. మీ ముఖంపై టోనర్ ఉపయోగించటం వలన మీ చర్మం యొక్క రంగు మెరుగు పొందుతుంది. అంతే కాదు ఇది మీ చర్మపు రంధ్రాలను కూడా తొలగిస్తుంది. రోజూ వీటిని ఉపయోగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచుకోండి.

మంచి క్వాలిటీ గల పేస్ వాష్‌ని ఉపయోగించండి

ఒక వేళా మీ చర్మం నల్లబడి ఉన్నట్లయితే సాధారణ సబ్బులను ఉపయోగించటం వలన మీ చర్మం యొక్క రంగును తిరిగి పొందలేరు. ఎందుకంటే పురుషుల చర్మంలో ఎక్కువ ఆమ్లాలు ఉంటుంది. కావున చర్మానికి తగిన పేస్ వాష్‌ని ఉపయోగించటం చాలా అవసరం.

విటమిన్ సి ఉత్పత్తులను ఉపయోగించండి

విటమిన్ సి లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మన చర్మాన్ని సూర్య కిరణాల లోని రాడికల్స్ వలన కలిగే హాని నుండి కాపాడుతుంది. విటమిన్ సి కలిగిన ఉత్పత్తులను వినియోగించండి.

ఎక్సఫాలియేట్

వేసవి కాలం వచ్చే సరికి చర్మం పొడిబారిపోతుంది. కావున ఎక్కువ నీటిని త్రాగి చర్మంలోని తేమను కాపాడుకోవాలి. హైడ్రేటింగ్ ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు.

చర్మం యొక్క పోషణ

చర్మానికి తగిన పోషకాలను అందించండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉత్పత్తులను ఉపయోగించండి. ఎండాకాలంలో చర్మం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది, కావున హైడ్రేటింగ్ మరియు మాయిశ్చరైజింగ్ క్రీములను ఉపయోగించండి. వేసవి కాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు తేనె మరియు నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని రోజూ త్రాగండి.

ఏక్కువ నీటిని త్రాగండి

రోజుకు 8 గ్లాసుల నీటిని త్రాగటం వలన మీ చర్మం ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంటుంది.

సమతుల్య మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

మీ చర్మం యొక్క ఆరోగ్యం మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. చక్కెర, ఆల్కహాల్ మరియు ఫాటీ ఫుడ్స్ ను నివారించాలి.

చర్మం పై రోజూ శ్రద్ధ తీసుకోవాలి

క్రమ బద్దకంగా చర్మంపై శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. మీ చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే మీరు రోజూ చర్మ సంరక్షణ నియమాలను, సూచనలను పాటించాలి. ఆడవాళ్ళు మాత్రమే కాదు పురుషులు కూడా ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. కేవలం కాస్మెటిక్స్ ఉపయోగించటం వలన చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచలేము.

పురుషులకు చర్మ సంరక్షణ చిట్కాలు

 • ఎప్పుడూ వెచ్చని నీటితోనే స్నానం చేయండి ఎందుకంటే వేడి నీటి స్నానం లేదా ఎక్కువ సేపు స్నానం చేయటం వలన చర్మంలోని నూనె గ్రంధాలు పూర్తిగా తొలగిపోయి, చర్మం పొడిబారిపోతుంది.
 • కెమికల్స్ తక్కువగా ఉండే సోపులను మరియు క్లీన్సర్లను వాడండి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కలిగిన సోపులు చర్మంలోని తేమను పూర్తిగా తొలగించి గరుకగా చేస్తుంది. మీ చర్మాన్ని బట్టి మీకు తగిన సబ్బులు, జెల్స్ మరియు షాంపులను ఉపయోగించండి.
 • రోజూ షేవింగ్ చేయటం మీ చర్మానికి మంచిది కాదు. షేవింగ్ చేయటానికి ముందు క్రీం, లోషన్ లేదా జెల్‌ను రాయాలి. శుభ్రమైన రేజర్ వాడాలి. షేవింగ్ తరువాత మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
 • మీరు వాడే మాయిశ్చరైజర్ మీ చర్మానికి తగినదై ఉండాలి. మీకు డ్రై చర్మం ఉన్నట్లయితే క్రీమీ లోషన్‌లను వాడండి, జిడ్డు చర్మం అయితే ఆయిల్ లేని మాయిశ్చరైజర్ ను వాడండి.
 • రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభంగా కడగాలి. ఇది మీ చర్మం లోతు వరకు శుభ్రం అవటానికి మరియు కొత్త కణాలు ఉత్పత్తి అవటానికి తోడ్పడుతుంది.
 • చర్మంలోని తేమ పదార్థాలను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఇందుకొరకు క్రీమీ లోషన్‌లను వాడండి మరియు ఎక్కువ నీటిని త్రాగండి.
 • కెఫీన్ మరియు మద్యం సేవించటాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇవి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. 20 ఏళ్ళ వయసునుండే రెటినోల్ క్రీములను రోజూ వాడటం వలన చర్మంపై ముడతలు మరియు చిన్నటి గీతలు రాకుండా ఉంటాయి.
 • ఎక్కువ చక్కెర పదార్థాలను తినకూడదు, ఎందుకంటే ఇవి చర్మానికి ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమల లాంటి సమస్యలను కలిగిస్తాయి.
 • చర్మం యొక్క శత్రువు సూర్య కిరణాలు. ఈ కిరణాల వలన చర్మంలో కొల్లాజెన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోయి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాదు స్థితిస్థాపకతను కూడా తగ్గిస్తుంది.
 • ఎక్కువ ఒత్తిడి వలన మీ చర్మానికి చాలా హాని కలుగుతుంది. కావును యోగా, ధ్యానం మరియు వ్యాయామాలను క్రమంగా చేసి మీ ఒత్తిడిని తొలగించండి.
 • సరైన నిద్ర అవసరం. సరైన నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది, దీని వలన చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.

కొన్ని ఇంటి చిట్కాలు

 • పచ్చి పాలను ముఖం, చేతులు మరియు కాళ్లపై రాసి 10 నిమిషాల తరువాత కడగవచ్చు.
 • షేవింగ్ చేసే 5 నిమిషాల ముందు ఆలివ్ లేదా బాదాం నూనెని రాసుకోవటం వలన చర్మం యొక్క తడితనం తగ్గకుండా ఉంటుంది.
 • 30ml కలబంద జెల్, 2 చుక్కల ద్రాక్ష పండు విత్తనాల రసం, 30ml గులాబీ నీళ్లు, 50ml ఆలివ్ నూనె మరియు 4 చుక్కల ఎస్సెంటిల్ ఆయిల్‌ను కలుపుకొని రోజూ మీ చర్మంపై రాసి కొద్దీ సేపు తరువాత కడగండి.
 • చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి వోట్మీల్ చాలా ప్రభావితంగా పని చేస్తుంది. కొద్దిగా చల్లని చమోమిలే టీ, వోట్మీల్, ఒక స్పూన్ తేనె మరియు 2 చుక్కల బాదాం నూనెని కలిపి ఒక స్క్రబ్ ను తయారు చేయండి. ఈ స్క్రబ్ ని ముఖం మరియు మెడపై రాసి కొద్ది సేపు మర్దన చేయండి.
 • అవోకాడో, తేనె మరియు వినిగర్‌ని కలిపి ఒక పేస్ట్‌లా చేసుకొని షేవింగ్ చేసిన తరువాత దీనిని రాయటం వలన మంట నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

తీర్మానం: పై చెప్పిన గృహ చర్మ సంరక్షణ చిట్కాలు పురుషుల కొరకు. ఎందుకంటే వారి చర్మ రంధ్రాలు పెద్దగా ఉంటాయి మరియు రోజూ లోతైన శుద్ది అవసరం. ఈ సహజ పదార్థాలను ఉపయోగించటం వలన ఎటువంటి హానీ కలగదు.

Posted on

Postpartum weight loss tips in Telugu – ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గటం ఎలా?

ప్రసవానంతరం బరువు తగ్గటం కష్టమైన విషయమే కానీ అసాధ్యం కాదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క ఆకారాన్ని మల్లీ పొందేందుకు కొన్ని నెలలు పడుతుంది, ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఒకే నెలలో బరువు తగ్గాలని ఎక్కువ ఒత్తిడిని కలిగించే పనులను, వ్యాయామాలను చేయకూడదు. శరీరానికి ఎక్కువ ఒత్తిడిని కలిగించటం వలన మీకే కాదు మీ శిశువు యొక్క ఆరోగ్యానికి కూడా హాని కలగచ్చు.

ప్రసవానంతరం బరువు తగ్గటం అనేది ఒక క్లిష్టమైన విషయం. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ శరీరానికి కావలసిన పోషక ఆహారాలను అందిస్తూ బరువు తగ్గించాలి. సాధారణంగా బరువు తగ్గడానికి పాటించే డైట్లను లేదా భారీ వ్యాయామాలను మీరు చేయకూడదు. సరైన పోషక ఆహారాలను తీసుకుంటూ సరైన వ్యాయామాలను చేస్తూ మీ ఆరోగ్యాన్ని మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

మీరు మీ ఇంట్లోనే కొన్ని ఆహార పద్ధతులు మరియు కొన్ని సులువైన వ్యాయామాలను చేస్తూ బరువును తగ్గించవచ్చు. వీటి గురించి వివరంగా ఈ వ్యాసం లో చూద్దాం.

ప్రసవానంతరం బరువు తగ్గటానికి సరైన ఆహారం తీసుకోండి

ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, బాలింతలకు సరైన పోషక ఆహారం అవసరం. కావున, అన్ని పోషకాలనూ సమతుల్య మోతాదులలో తీసుకోవాలి. మీ వైద్యులు మిమ్మల్ని కొన్ని విటమిన్ మరియు మినరల్స్ మందులను కూడా వాడమని సూచించవచ్చు. దీని వలన మీ శరీరానికి ఎటువంటి పోషణ లోపాలు కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాలు ఇచ్చే బాలింతలు రోజుకు కనీసం 2,200 కేలరీల ఆహారం తీసుకోవాలి. తల్లి పాలను ఇవ్వని బాలింతలు 1,800 కేలరీల ఆహారంకన్నా ఎక్కువ తీసుకోకూడదు.

ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

మీరు రోజూ తినే ఆహారంలో కావల్సినంత ప్రోటీన్స్ ఉండటం చాలా అవసరం. చేపలు, గుడ్లు, పప్పులు మరియు బీన్స్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. చల్ల నీటిలో ఉండే చేపలు టునా, సాల్మన్ మరియు సార్డినల్ లో DHA మరియు ఒమేగా 3 ఫాటీ యాసిడ్ ఉంటాయి. ఇవి శిశువు యొక్క మెదడు కణాలను మరియు నాడి వ్యవస్థను పోషిస్తుంది. గుడ్లు, బీన్స్ మరియు పప్పులలో కావల్సినంత ప్రోటీన్స్ ఉంటాయి మరియు ఇది మీ ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియమును అందిస్తుంది.

విటమిన్లు మరియు ఖనిజాలపై దృష్టి పెట్టండి

మీకు ఇంతవరకూ ఇష్టం లేకపోయినా కాయకూరలను మరియు పళ్ళను తినాలి. మీరు తల్లి పాలు ఇవ్వటం వలన మీ శరీరంలోని అన్ని విటమిన్లను మరియు మినరల్స్ ను కోల్పోతారు. కావున వీటిని తిరిగి పొందేందుకు ఆకుకూరలు, క్యారట్లు, బ్రొకళ్లి, బీన్స్, స్క్వాష్ వంటి కాయకూరలు మరియు బాదాం, వాల్నట్ మరియు ఎండు ద్రాక్షలను రోజూ తినండి. స్ట్రాబెర్రీస్, నారింజ, ఆపిల్, జామ, దోసకాయ మరియు ద్రాక్ష వంటి పండ్లను కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి.

ఆహారాన్ని చిన్న మోతాదులలో తినండి

బరువు తగ్గటానికి ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాలి. ప్రసవానంతరం బాలింతలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఒకే సారి మొత్తం ఆహారాన్ని తినడంకన్నా,రోజుకు 5 లేదా 6 సార్లు తక్కువ మోతాదులలో తినండి. మీరు ఎప్పటికీ ఆకలితో లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ భోజనాలకు మధ్యలో ఆకలిగా అనిపిస్తే తాజా పళ్ళను లేదా బాదాం లాంటి డ్రై ఫ్రూప్ట్స్ తినండి.

ఎక్కువ నీటిని త్రాగండి

చాలా మంది బాలింతలు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడతారు. శరీరంలో ద్రవం సంతులనంగా లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. కావున ఎక్కువ నీటిని త్రాగాలి, ఇది మీ శరీరం యొక్క జీవక్రియను అధికరిస్తుంది. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు త్రాగ కూడదు, భోజనానికి కొన్ని నిమిషాల ముందు లేదా తరువాత త్రాగాలి.

శిశువుకు తల్లి పాలు ఇవ్వండి

మీరు తల్లి పాలు ఇవ్వటం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే పాలు ఇవ్వటం వలన మీ శరీరంలోని అదనపు కేలరీలు కరుగుతాయి. పాల యొక్క ఉత్పత్తిని బట్టి, రోజుకు 500 కేలరీల వరకు కరుగుతుంది. చమోమిలే, మెంతులు మరియు సోంపు వంటి ఆహార పదార్థాలు ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడతాయి. వీటిని మీ రోజూ ఆహారాలలో చేర్చుకోవటం వలన ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా ఎక్కువ కేలరీలను కరిగించవచ్చు.

వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయండి

పాలు ఇవ్వటం, సరైన ఆహారాలను తీసుకోవటం వలన కొవ్వు తగ్గుతుంది. కానీ ఇది ఒక భాగం మాత్రమే. వీటితో పాటు మీరు సరైన వ్యాయామాలను కూడా చేయాలి. ఇది మీ అదనపు కేలరీలను కరిగిస్తుంది. అంతే కాదు ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్నీ ఇస్తుంది. నిపుణులు చెప్పినదాని బట్టి వారానికి 150 నిమిషాలైనా వ్యాయామాలను చేయాలి. తక్కువ బరువులను ఉపయోగించి లేదా వట్టి చేతులతో వ్యాయామాలు చేయండి. ఏరోబిక్స్ లాంటివి కూడా చేయవచ్చు. కానీ ఇవి చేసేటప్పుడు మీ శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా చూసుకోండి.

వ్యాయామాలను చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఎందుకంటే ఒకవేళ మీకు సిజేరియన్ ఆపరేషన్ చేసి ఉంటే, మీరు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది మరియు కొన్ని వ్యాయామాలను మీరు నివారించవలసి ఉంటుంది.

యోగా

బాలింతలు తమ బరువును తగ్గించేందుకు ఇది అత్యంత ప్రభావితమైన ఒక మార్గం. యోగా చేయటం వలన మీ శరీరంపై ఒత్తిడి పెరగకుండానే కేలరీలు కరుగుతాయి. అయినప్పటికీ యోగాలో ఏ ఆసనాలను మీరు చేయాలో ఏవి చేయకూడదో మీ వైద్యుడిని సంప్రదించి కనుక్కోవాలి.

మంచి నిద్ర అవసరం

పై చెప్పిన విషయాలన్నిటినీ పాటించినప్పటికీ సరైన నిద్ర లేకపోతే మీ బరువు తగ్గడం చాలా కష్టం. అప్పుడే పుట్టిన శిశువును చూసుకుంటూ సరైన నిద్రను పొందటం బాలింతలకు కష్టమైనా విషయమే. కాని నిద్ర లేక పోతే శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, దీని వలన బరువు పెరుగుతుంది.

పడుకునే 3 గంటల ముందే మీరు భోజనం చేయాలి, పాలు లేదా ఏదైనా పానీయాలను త్రాగాలనుకుంటే వాటిని 1.5 గంటల ముందే త్రాగాలి. తిన్న వెంటనే పడుకోవటం మంచిది కాదు.

కొవ్వును కరిగించే పానీయాలను మీ రోజూ డైట్లో చేర్చుకోండి

కొవ్వును తగ్గించే పానీయాలను రోజూ త్రాగటం వలన బాలింతల బరువు తొందరగా తగ్గుతుంది. ఈ పానీయాలను ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇవి శరీరంలో జీవక్రియను అధికరించి అదనపు బరువును తొలగించేందుకు తోడ్పడుతుంది.

1/2 స్పూన్ అల్లం యొక్క రసం, 1/2 స్పూన్ పైపర్ డస్ట్ మరియు ఒక స్పూన్ తేనెని ఒక గ్లాస్ వెచ్చని నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు త్రాగండి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు. ఈ పానీయం మీ బరువును తగ్గించటమే కాదు మీకు ఎక్కువ బలాన్ని కూడా ఇస్తుంది.

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ మరియు అవిసె గింజలు

ప్రసవానంతరం బరువు తగ్గేందుకు మీరు కొన్ని సులభమైన పద్ధతులకోసం చూసి ఉంటారు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడటం మరియు మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవటం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఫిష్ ఆయిల్ లోని ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు మీరు వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ కేలరీలను కరిగించేందుకు తోడ్పడుతుంది.

Posted on

Telugu remedies for Ringworm – రింగ్వార్మ్(తామర) యొక్క లక్షణాలు మరియు నివారణలు

ప్రతి ఒక్కరికి తమ శరీరం శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ మనం ప్రయాణం చేసేటప్పుడు లేదా పని చేసే చోట్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు కలగచ్చు. వీటి నుండి దూరంగా ఉండేందుకు కొన్ని సాధారణ ముందు జాగ్రత్తలను తీసుకోవాలి, ఉదాహరణకు బయట పనినుండి రాగానే స్నానం చేయటం, మనం స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల డెట్టాల్ కలుపు కోవటం లాంటివి.

రింగ్వార్మ్(తామర) ఒక చర్మ వ్యాధి, ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, సాధారణంగా తలపై, గడ్డం లాంటి చోట్లలో వస్తుంది. చూసేందుకు ఇది ఎరుపు లేదా గోధుమ రంగులో ఒక వలయం ఆకారపు దద్దురులా కనపడుతుంది. ఇది ఒక అంటు వ్యాధి, పురుగుల వలన కలిగే వ్యాధి కాదు. ఇది మన చర్మంలో ఒక భాగం నుండి ఇంకొక భాగానికి తొందరగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రారంభంలో ఒక వలయంలా ఎరువు రంగులో ఉంటుంది, కానీ ఈ పరిస్థితి మరింత తీవ్రమయినప్పుడు చర్మం ఉబ్బి, బొబ్బలు ఏర్పడతాయి.

రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు

ఇవి ఎరుపు లేదా గోధుమ రంగులో ఒక వలయంలా మరియు పొక్కులా ఉంటుంది. వీటి యొక్క అంచులు చాలా స్పష్టంగా కనపడతాయి. ఇవి మీ గోర్ల చుట్టూ వచ్చినట్లయితే మీ గోరు యొక్క రంగు మారుతుంది, కొన్ని సార్లు మీరు మీ గోర్లను కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇది మీ తలపై వచ్చినట్లయితే ఆ చోట్లో మీ వెంట్రుకలు రాలిపోవచ్చు. ఇది ఏర్పడే ప్రతి భాగం యొక్క లక్షణాలు క్రింద చెప్పిన విధంగా భిన్నంగా ఉంటాయి.

తలపై

 • దురదగా ఉండటం.
 • చర్మంపై నొప్పి మరియు చిన్న పాచెస్ రావటం.
 • ఆ పాచెస్ లోని జుట్టు రాలడం.
 • తలపై చర్మ పొరలో మార్పులు.
 • చర్మం మీద చీము నిండిన పుళ్ళు ఏర్పడటం.

శరీరం

 • చూసేందుకు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ వలయం యొక్క అంచుల్లో చాలా దురదగా ఉండటం.
 • చీము నిండిన పుళ్ళు మరియు పొక్కు ఏర్పడటం.
 • దురదగా మరియు ఉబ్బిన బొబ్బలా ఉండటం.

మొల భాగములో రింగ్వార్మ్ లక్షణాలు

 • అంతర్గత తొడల చర్మం పొరలుగా ఉండటం.
 • గోధుమ మరియు ఎరుపు రంగు పుళ్ళు ఏర్పడటం.
 • మీ గజ్జ ప్రాంతంపై దురదగా ఉండటం.

రింగ్వార్మ్ సంక్రమణ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు

 • మీ శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోండి.
 • దుస్తులను ధరించే ముందు మీ శరీరంలోని తేమను పూర్తిగా తుడుచుకోవాలి.
 • క్రమం తప్పకుండా తల స్నానం చేయండి, వెంట్రుకలను కత్తిరించిన వెంటనే తల స్నానం చేయండి.
 • బిగువైన దుస్తులను నివారించండి, వీలైనంతవరకు కాటన్ దుస్తులను ధరించండి, ఎందుకంటే ఇది మీ చర్మాన్ని పొడిగా ఉంచుతుంది.
 • మీరు రోజూ బూట్లను వాడుతున్నట్లయితే సాక్స్ ను రోజూ శుభ్రం చేసి వేసుకోండి.
 • మీ టవల్, దుస్తులు, పడుకునే చాపలు, దువ్వెన లాంటి వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.
 • ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారి వస్తువులను పొరపాటుగా వాడినట్లయితే వెంటనే యాంటీ ఫంగల్ సబ్బుతో స్నానం చేయండి.
 • ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారి దువ్వెన వాడినట్లయితే వెంటనే యాంటీ ఫంగల్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి.
 • మీరు పెంచుకొనే పెంపుడు జంతువులకు ఈ ఇన్ఫెక్షన్ కలిగినట్లయితే వెంటనే పశువుల వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళండి.
 • ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన చోటుపై బ్యాండేజ్ వాడకూడదు.

రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ తొలగించేందుకు హోమ్ రెమెడీస్

సబ్బు నీళ్లు

ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన చోటును ఎప్పుడూ వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. వెచ్చని నీటిలో సబ్బును కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలను బాగా కడగాలి. ఆ తరువాత ఆ చోటుని తుడిచి తడి లేకుండా చూసుకోవాలి.

పసుపు

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. పసుపులోని ముఖ్యమైన ఒక పదార్థం కుర్కుమిన్. దీనిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపుని టీ లో లేదా ఆహారాలలో చేర్చుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపుని కొబ్బరి నూనె లేదా నీటిలో కలిపి ఒక పేస్ట్ లా చేసుకొని ఈ ఇన్ఫెక్షన్ కలిగిన చోటుపై రాసి, ఆరిపోయిన తరువాత తుడవండి.

లికోరైస్

ఇందులో ఎన్నో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని సాంప్రదాయక చైనీస్ మందులలో వాడుతారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది రింగ్వార్మ్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు ఉపయోగించవచ్చు.3 టేబుల్ స్పూన్ల లికోరైస్ పొడిని ఒక కప్పు నీటిలో కలుపుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించి, చల్లారిన తరువాత ఒక పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని రింగ్వార్మ్ పై రోజుకు రెండు సార్లు పూసి, 10 నిమిషాల తరువాత తుడవండి లేదా నీటితో కడగండి.

అల్లం

అల్లం లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఒక ఇంచు అల్లంను చిన్న ముక్కలుగా కోసుకొని రింగ్వార్మ్ పై కొద్ది సేపు ఉంచండి.

కొబ్బరి నూనె

మనం ఎన్నో రకాల కొబ్బరి నూనెలను మార్కెట్ లో చూస్తూ ఉంటాము. కానీ చెట్ల నుండి తాజాగా తయారు చేసిన కొబ్బరి నేనే రింగ్వార్మ్ ను తొలగించేందుకు చాలా ప్రభావితంగా పని చేస్తుంది.

ఆవాలు

కొన్ని ఆవాలను నీటిలో వేసి 30 నిమిషాల పాటు నానపెట్టండి. తరువాత వీటిని బాగా రుబ్బి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ని ఇన్ఫెక్షన్ పై రాయటం వలన వెంటనే దురద నుండి ఉపశమనం పొందుతారు.

కలబంద

ఎలాంటి ఇన్ఫెక్షన్ నుండి అయినా అలో వేరా గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. వీటి యొక్క జెల్ ని రింగ్వార్మ్ పై రాసి రాత్రంతా ఉంచండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో వైద్య విలువలు ఉన్నాయి. ముఖ్యంగా రింగ్వార్మ్ నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

లెవెండర్ నూనె

ఇది రింగ్వార్మ్ ను తొలగించేందుకు మరియు ఇతర ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఈ నూనెని ఇన్ఫెక్షన్ పై రాయండి.

ఆపిల్ సీడర్ వెనిగర్

ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రింగ్వార్మ్ ను నివారించడంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకొని ఇన్ఫెక్షన్ ఉన్న చోట్ల పై రాయవచ్చు.

ఆలివ్ ఆకులు

ఆలివ్ ఆకుల యొక్క రసం రింగ్వార్మ్ ని నివారించేందుకు తోడ్పడుతుంది.

బొప్పాయి

బొప్పాయి పండు యొక్క తోలు ఎలాంటి ఇన్ఫెక్షన్నైనా తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ పండు యొక్క తోలును పేస్ట్ లా చేసుకొని ఇన్ఫెక్షన్ పై రాయండి.

ఈ నివారణలు ఉపయోగించిన తరువాత కూడా రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ తగ్గక పోతే, వైద్యుడిని సంప్రదించి వారి సూచనల ప్రకారం యాంటీ ఫంగల్ మందులను ఉపయోగించండి.

Posted on

Do’s and don’ts for diabetics in Telugu – డయాబెటిస్ ఉన్నవారు చేయవలసిన మరియు చేయకూడని పనులు

ఈ రోజుల్లో డయాబెటిస్ చాలా సాధారణమైన ఒక ఆరోగ్యసమస్య. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో కొంత మందికి డయాబెటిస్ ఉందన్న విషయం తెలియకుండానే ఉంటారు, ఏదైనా తీవ్రమైన లక్షణాలు కనపడినప్పుడు మాత్రమే అది తెలుసుకుంటారు. ఇది ఒక సాధారణ వ్యాధి, ప్రారంభ దశలోనే కనిపెడితే సులభంగా చికిత్స చేయవచ్చు.

డయాబెటిస్ రెండు రకాలు

టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 సాధారణంగా పిల్లల్లో మరియు యువతల్లో ఎక్కువగా కనపడుతుంది. దీనిని జువెనైల్ డయాబెటిస్ అని అంటారు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం లేదా తక్కువగా ఉత్పత్తి అవటం వలన ఈ రకం డయాబెటిస్ వస్తుంది. అయితే, ప్రపంచంలో ఈ రకం డయాబెటిస్ కేవలం 5 శాతమే నిర్ధారణ చేయబడింది.

టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ మందిలో కనపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ప్రతిఘటన వలన ఇది కలుగుతుంది. ఈ డయాబెటిస్ ని హైపర్గ్లైసీమియాఅని అంటారు. ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలోని గ్లూకోజ్ ను స్టార్చ్ గా మారుస్తుంది. శరీరంలోని రక్త కణాలు ఇన్సులిన్ని సరిగా ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని కోల్పోవటం వలన గ్లూకోజ్ స్థాయి అధికరించి ఈ రకం డయాబెటిస్ ఏర్పడుతుంది.

మధుమేహం ఉన్న వాళ్ళు మందులతో పాటు సరైన ఆహార అలవాట్లు మరియు జీవనశైలిని నిర్వహించాలి. క్రింద చెప్పిన విషయాలను మీరు పాటించడం వలన డయాబెటిస్ ఉన్నప్పటికీ మీరు సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు చేయవలసిన విషయాలు

హోమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్‌ ని ఉపయోగించండి

టైప్ 2 డయాబెటిస్ మనకు తెలియకుండానే అధికరిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికరించినప్పటికీ కొందరికి ఎలాంటి మార్పులూ తెలియక పోవచ్చు. దీని వలన శరీరానికి హాని కలగచ్చు. ఇందువలన, తరచుగా ఇంట్లోనే బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ కిట్ ని ఉపయోగించి గ్లూకోజ్ స్థాయులను తనిఖీ చేయటం మంచిది. ఈ కిట్ ని ఉపయోగించే ముందు ఎలా వాడాలో మరియు ఎన్ని రోజులకు ఒక సారి మీరు చెక్ చేయాలని మీ వైద్యుడిని సంప్రదించి తెలుసుకోవటం మంచిది.

సౌకర్యవంతమైన బూట్‌లను ధరించండి

డయాబెటిస్ ఉన్న వారికి తరచుగా కాళ్ల నొప్పి రావచ్చు ఎందుకంటే వారి పాదాలకు రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఇందువలన వీరి పాదాలలో ఏదైనా పొక్కు లేదా బొబ్బలు వచ్చినా స్పందించలేక పోతారు, అంతే కాదు ఇవి గుణ పరచటానికి కూడా చాలా సమయం పడుతుంది. కావున మీరు వాడే బూట్లు మీకు ఎలాంటి హానీ కలిగించకుండా, సౌకర్యంగా ఉండేట్లు వేసుకోండి. మీ పాదాలను ఎప్పుడూ శుభ్రంగా మరియు ఎలాంటి గాయాలు లేకుండా చూసుకోండి.

కొన్ని రకాల పండ్లను నివారించాలి

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొన్ని పండ్లు తక్కువ కార్బోహైడ్రేట్స్ మరి కొన్ని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ రక్తంలోని చక్కెర స్థాయిని అధికరిస్తుంది. కావున అన్ని రకాల పండ్లనూ తినడం డయాబెటిస్ ఉన్న వారికి మంచిది కాదు.

మీరు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది, అంతే కాదు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను కూడా నివారించండి.

సాధారణ అనారోగ్యాలనుండి సురక్షితంగా ఉండండి

డయాబెటిస్ ఉన్నవారికి చాలా సులభంగా చలి జ్వరం లేదా ఇతర అనారోగ్యాలు రావచ్చు. కానీ ఇవి గుణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కావున న్యుమోనియా మరియు ఇతర అనారోగ్యాల నుండి సురక్షితంగా ఉండండి.

HbA1c పరీక్ష తీసుకోండి

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయి తరచూ మారుతూ ఉంటుంది. మీరు గ్లూకోజ్ స్థాయిని పరీక్షించే సమయం బట్టి దీని యొక్క తీవ్రతను కనుక్కోవటం కుదరదు. కావున HbA1c అనే పరీక్ష చేయాలి. ఇందులో మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయి గత కొన్ని వారాలుగా ఎలా ఉందో తెలుస్తుంది. ఇది గ్లూకోజ్ స్థాయులను స్పష్టంగా తెలియజేయడంలో మరింత ప్రభావితమైన పరీక్ష.

డయాబెటిస్ ఉన్నవారు గ్లూకోజ్ స్థాయిని సరిగ్గా నియంత్రించకపోతే ఈ గ్లూకోజ్ హిమోగ్లోబిన్ లో కలిసిపోతుంది. హిమోగ్లోబిన్ మీ శరీరంలో ఆక్సిజన్ ని సరఫరా చేసే ఒక సమ్మేళనం. కావున హిమోగ్లోబిన్ లోని A1c స్థాయులను పరీక్షించడం వలన సుదీర్ఘ కాల వ్యవధిలో ఎంత చక్కెర ఉందో చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు.

డయాబెటిస్ తక్కువగా ఉన్నట్లయితే HbA1c పరీక్షలో 7% కన్నా తక్కువ ఉంటుంది. ఆలా ఉంటే 3 లేదా 6 నెలలకు ఒక సారి మీరు ఈ పరీక్షను చేసి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి మరియు 3 నెలలకు ఒక సారి ఈ పరీక్ష చేయాలి.

వ్యాయామాలను సక్రమంగా చేయండి

డయాబెటిస్‌ని తొలగించేందుకు వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను తగ్గించి ఇన్సులిన్ యొక్క వాడుకను పెంచుతుంది. అంతే కాదు ఇది బీపీ ని కూడా నియంత్రించి మంచి హృదయ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయటం వలన మనం వాడే మందులు కూడా తగ్గించవచ్చు. ఒక వారానికి 150 నిముషాల వ్యాయామం చాలా అవసరం. వారానికి 3-4 రోజులు కనీసం 30 లేదా 40 నిమిషాలపాటు నడవడం వలన కూడా చక్కెర స్థాయులను నియంత్రించవచ్చు.

మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలను కూడా చేయవచ్చు, కానీ వీటిని చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్‌ లాంటి వ్యాయామాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారానికి 2-3 సార్లు రెసిస్టన్స్ ట్రైనింగ్ తీసుకోవటం వలన మీ కండరాలు పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తిక అధికరిస్తుంది.

అదనపు బరువును తగ్గించండి

బరువు తగ్గటం వలన మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గి ఇన్సులిన్ యొక్క వాడుక అధికరిస్తుంది. దీని వలన మీ హృదయం ఆరోగ్యంగా ఉంటుంది మరియు ఇతర తీవ్రమైన అనారోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి పెరగటం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కూడా పెరుగుతుంది. కావున ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా అవసరం. ప్రస్తుత కాలంలో ఒత్తిడిని పూర్తిగా తొలగించటం అంత సులువు కాదు. కావున డీప్ బ్రీతింగ్, వ్యాయామాలు, యోగా, తగిన విశ్రాంతి లాంటి అలవాట్లను పెంచుకోండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించేందుకు మరియు డయాబెటిస్‌ని తొలగించేందుకు తోడ్పడుతుంది.

ఆహారంలో ఉప్పు తగ్గించండి

ఉప్పు ఎక్కువ తినటం వలన మీ రక్తంలోని చక్కెర స్థాయి అధికరించవు, కాని దీని వలన బీపీ అధికం అవటం లేదా మూత్రపిండాలలో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది. కావున, మీరు తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే ఈ సమస్యల నుండి రక్షింపబడతారు.

మీరు రోజూ తినే ఆహారంలో ఎంత ఉప్పు చేర్చుకోవాలని మీ వైద్యుడిని సంప్రదించి కనుక్కోవటం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తిన వద్దు, ఎందుకంటే వాటిలో ఎక్కువ ఉప్పు ఉపయోగిస్తారు.

నోటిని పరిశుభ్రంగా ఉంచుకోండి

సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి చిగురు లేదా నోటి సమస్యలు ఉంటాయి. కావిటీస్ మరియు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్ అధికరిస్తుంది. దీని వలన డయాబెటిస్ సమస్య ఇంకా అధికం అవుతుంది. కావున నోటిని పరిశుభ్రంగా ఉంచుకోండి మరియు మీ దంత వైద్యుడిని 6 నెలలకు ఒక సారి సంప్రదించండి.

తగినంత నిద్ర పొందండి

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి తగినంత నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే మీ శరీరంలోని చక్కెర స్థాయి అధికరిస్తుంది. మీకు ఎల్లప్పుడూ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తే మీ వైద్యుడిని సంప్రదించండి.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు చేయకూడని పనులు

రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోక పోవటం

డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయులను సరిగ్గా నియంత్రించకపోతే అత్యంత ప్రమాదకరం. దీని వలన అనేక సమస్యలను అత్యంత అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఎక్కువ పరిమాణంలో తినటం

డయాబెటిస్ ఉన్నవారు నచ్చిన ఆహారాలను తినవచ్చు, కానీ చిన్న మోతాదులలో తినాలి. సరైన ఆహార పరిమాణాన్ని అలవాటు చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఆహారం తిన్న వెంటనే శరీరంలో చక్కెర స్థాయి అధికరిస్తుంది. కావున ఒకే సారి ఎక్కువ ఆహారం తింటే డయాబెటిస్ తగ్గించటం అసాధ్యం. సరైన సమయంలో సరైన మోతాదులలో తినాలి.

నిశ్చలమైన జీవనశైలి

మన ప్రస్తుత జీవనశైలి ఎలాంటి శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించదు, కానీ మీకు డయాబెటిస్ ఉందని తెలిసిన తరువాత జీవనశైలిని తప్పకుండా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయాలి, కండరాలను బలపరచేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి చేయటం వలన ఇన్సులిన్ స్థాయి అధికరిస్తుంది. సోమరితనమైన జీవనశైలి వలన తప్పకుండా శరీరం యొక్క బరువు పెరుగుతుంది, దీని వలన అనేక సమస్యలు ఎదురవుతాయి.

అన్ని రకాల కొవ్వు పదార్థాలను తొలగించటం

మీరు వినే ఉంటారు, డయాబెటిస్ ఉన్న వారు కొవ్వు పదార్థాలను తినకూడదని, తినటం వలన అనేక కార్డియోవాస్క్యులార్ సమస్యలు ఎదురవుతాయని. కానీ, అన్ని కొవ్వు పదార్థాలను తొలగించటం అంత మంచిది కాదు. కొవ్వు పదార్థాలు రెండు రకాలు, సాచురేటెడ్ / ట్రాన్స్-ఫ్యాట్స్ మరియు మోనో-సాచురేటెడ్ / పాళీ-అన్సాచురేటెడ్ ఫ్యాట్స్.

సాచురేటెడ్ / ట్రాన్స్-ఫ్యాట్స్ వలన హృదయ ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. మోనో-సాచురేటెడ్ / పాళీ-అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ హృదయానికి మరియు శరీరం యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారంలో అన్ని రకాల కొవ్వులనూ తొలగించకుండా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారాలను చేర్చుకోండి.

గాయాలకు తక్షణ సంరక్షణ తీసుకోక పోవటం

డయాబెటిస్ ఉన్న వారికి గాయాలు తొందరగా మానవు, చాలా సమయం పడుతుంది. కనుక చిన్న గాయం అయినా వెంటనే చికిత్స చేయటం అవసరం. వాటిని పట్టించుకోక పోవటం వలన అవి పెద్ద సమస్యలను ఏర్పరుస్తాయి.

ఎక్కువగా మద్యం సేవించటం లేదా ధూమపానం అలవాటు ఉండటం

పరిశోధనల బట్టి, మద్యం సేవించటం లేదా ధూమపానం వలన మీ రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా ఎక్కువ లేదా తక్కువ కాగలదు. అంతే కాదు ఇది మీ బరువును కూడా పెంచుతుంది. దీని వలన కార్డియోవాస్క్యలార్ సమస్యలు ఎదురవుతాయి.

Posted on

Post pregnancy Diet in Telugu – డెలివరీ తర్వాత తినకూడని ఆహార పదార్థాలు

శిశువు పుట్టిన తరువాత చాలా మంది బాలింతలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం మానేస్తారు. సరైన పోషక ఆహారం తినకపోవడం వలన ఎక్కువ బీపీ మరియు డయాబెటిస్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు బాలింతలు తినకూడని కొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను చూద్దాం.

నివారించవలసిన ఆహారాలు

వేయించిన పదార్థాలు

నూనెలో బాగా వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి ఇవి కొవ్వును పెంచి శరీరం లావు అయ్యేందుకు కారణం అవుతాయి.

ప్రాసెస్స్ చేయబడిన ఆహార పదార్థాలు

మనం మార్కెట్లో ఎన్నో ఆహార పదార్థాలను ప్రాసెస్స్ చేసి ప్యాక్ చేసి అమ్మడం చూసే ఉంటాము, ముఖ్యంగా మాసం మరియు చేపలు. ఇవి తొందరగా చెడిపోకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ని మరియు సోడియంను ఎక్కువగా కలుపుతారు. ఇవి చాలా హానికరమైనవి, వీటిని తినడం వలన బీపీ అధికరిస్తుంది మరియు మీ శరీరం యొక్క హోమియోస్టాసిస్ పై ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్

బాలింతలు మద్యం సేవించకూడదు. ఇది మీ శరీరానికి హాని కలిగించటమే కాకుండా శిశువుకు మీరు ఇచ్చే పాలలో చేరి వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ బాలింతలు తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మీరు శిశువుకు ఇచ్చే పాలలో చేరి మీ శిశువు యొక్క శరీరంలో లాక్టోజ్ అసహనాన్ని పెంచగలదు. పాలకు బదులుగా తక్కువ కొవ్వు కలిగిన పెరుగును తీసుకోండి.

కెఫీన్

కెఫీన్ మీకే కాదు మీ శిశువు యొక్క నిద్రను కూడా భంగ పరుస్తుంది, అంతే కాదు శిశువుకు చిరాకు మరియు ఒత్తిడిని కలిగిస్తుంది.

కారమైన ఆహార పదార్థాలు

బాలింతల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కారమైన మరియు క్యాప్సైసిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం అవటం చాలా కష్టం. ఇది మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. అంతే కాదు మీరు ఇచ్చే పాల ద్వారా ఈ సమస్యలు శిశువుకు కూడా కలగచ్చు. వారికి అనేక కడుపు నొప్పి సమస్యలు కూడా రావచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

 • బాలింతలు రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు త్రాగాలి.
 • శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క బరువు మెల్లగా తగ్గుతుంది, కావున సహనంతో ఉండాలి. తొందరగా తగ్గాలని ఎక్కువ శ్రమకరమైన వ్యాయామాలను చేయకూడదు.
 • కొద్దిగా వ్యాయామాలతో పాటు సరైన డైట్ ని కూడా పాటించండి.
 • ఎక్కువగా పచ్చని కూరగాయలు మరియు ఆకు కూరలను తినండి. కానీ కాలీఫ్లవర్ లాంటి వాయువును పంచే ఆహారాలను నిరోధించండి.
Posted on

Potassium rich foods in Telugu – పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

శరీరం యొక్క పెరుగుదలకు మరియు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ చాలా అవసరం. మన శరీరంలో తగిన మోతాదులలో ఉండవలసిన మినరల్స్ లో పొటాషియం ముఖ్యమైనది. కొంత మంది పొటాషియం లాంటి అవసరమైన మినరల్స్ కన్నా సోడియం ఎక్కువగా తీసుకుంటారు. దాని వలన మీ బీపీ పెరుగుతుంది. సోడియంను తక్కువగా తీసుకుంటే గుండె ప్రమాదాలు రాకుండా ఉంటుంది. పొటాషియం ఒక అద్భుతమైన మినరల్. ఇది మీ శరీరంలోని రక్త కణాలను ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాలనుండి కాపాడుతుంది. ఏ ఒక్క మినరల్స్ ని అయినా కావల్సినంత మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవటం మంచిదికాదు.

పొటాషియం వలన లాభాలు, లోపం యొక్క లక్షణాలు మరియు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఈ వ్యాసంలో చూద్దాం.

మనకు పొటాషియం ఎందుకు అవసరం?

మన శరీరానికి ప్రతిరోజూ 2500 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. ఇది రక్తపోటు(బీపీ), ఎముకల బలం, గుండె కార్యాచరణ మరియు కండరాల యొక్క కార్యాచరణలలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. దీని లోపం వలన పై చెప్పిన విషయాలలో మీరు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు.

పొటాషియం లోపాల లక్షణాలు

 • నిర్జలీకరణముతో(డీహైడ్రేషన్) పాటు అధిక చెమట పుట్టడం.
 • చేతులు, కాళ్లు తిమ్మిరి ఎక్కడం మరియు దురదగా ఉండటం.
 • హృదయ స్పందన ఇర్రెగులర్ గా ఉండటం.
 • తరచుగా శరీరంలో అలసట మరియు బలహీనత కలగటం.
 • భ్రాంతి( హాలుసినేషన్) లేదా ఊహాత్మక సంకేతాలు.
 • వాంతులు లేదా వికారం కలగటం.
 • తరచూ దప్పికగా ఉండటం.
 • తరచుగా మూత్ర విసర్జన రావటం.
 • తక్కువ రక్తపోటు(లో బీపీ).
 • మూర్ఛపోవటం.
 • సుదీర్ఘ కాలపు డిప్రెషన్.
 • ఈటింగ్ డిసార్డర్, లిబిడో, డీహెడ్రల్, కండరాలలో సమస్యలు మరియు ఇతర ప్రమాదాలు కలగచ్చు.

పొటాషియం రిచ్ ఫుడ్స్

పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టమోటా, హనీడ్యూ పుచ్చకాయ, పాలు,  నారింజపండు, పాలకూర, బీన్స్, ఖర్జూరం, బంగాళదుంప, నేరేడుపండు మరియు కర్బూజాలలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

బీట్ రూట్ ఆకులు

మనం సాధారణంగా బీట్ రూట్ దుంపలను తిని వీటి ఆకులను విసిరేస్తారు. కానీ, ఈ బీట్ రూట్ ఆకులలో పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇవి కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.

పెరుగు

పెరుగును ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు లేదా దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు. దీనిని మీ రోజూ ఆహారాలలో చేర్చుకోవటం వలన కావల్సినంత పొటాషియం శరీరానికి లభిస్తుంది. పెరుగు రెండు రుచులలో ఉంటుంది, పుల్లని పెరుగు మరియు తీపి పెరుగు. తియ్యని పెరుగులో పొటాషియం తక్కువగా మరియు పుల్లని పెరుగులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

పండ్లు

ఈ పళ్ళను రోజూ తినడం వలన మీ ఎముకలు ధృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున ఇది మీ పళ్ళకు కూడా బలాన్ని ఇస్తుంది.

మొలాసిస్

మొలాసిస్ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఒక ఆహార పదార్థం. ఇది చూసేందుకు తేనెలా ఉంటుంది, దీనిని చక్కెరకు బదులుగా వాడుతారు. ఇది చక్కెరకంటే ఆరోగ్యకరమైనది మరియు ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాల్షియం మరియు ఐరన్ యొక్క లోపాలు ఉన్నవారు కూడా మొలాసిస్ తీసుకోవటం చాలా మంచిది.

సోయ్ బీన్స్

ఇవి రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి, ఒకటి ప్రాసెస్ చేయకుండా పచ్చి సోయ్ బీన్స్, ఇంకో రకం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన సోయ్ బీన్స్. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ప్రాసెస్ చేయని సోయ్ బీన్స్ మరింత ప్రయోజనకరమైనది. అర కప్పు ఉడకబెట్టిన సోయ్ బీన్స్లో 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

వైట్ బీన్స్

తెల్లని బీన్స్ అరుదైనవి అయినప్పటికీ, ప్రస్తుతం సూపర్ మాల్స్ మరియు పెద్ద కూరగాయల మార్కెట్లో లభిస్తాయి. వీటిని బాగా ఉడికించి ఉప్పు కలుపుకొని తినవచ్చు, లేదా మీరు తయారు చేసే కూరగాయల కూరల్లో వీటిని జోడించవచ్చు.

పొటాషియం యొక్క ప్రయోజనాలు

బ్రెయిన్ హెల్త్

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అన్ని వయస్సుల వారూ తినాలి. మీ మెదడుకు ఇది చాలా అవసరం. మెదడు చురుకుగా ఉండేందుకు మరియు దృష్టి దీర్ఘంగా మరియు స్థిరంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

శరీరంలో ద్రవం సంతులన

మన శరీరానికి కావలసిన ద్రవాలు లభించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పొటాషియం ఉన్న ఆహారాలను రోజూ తినడం వలన ఈ సమస్య రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి

ఈ కాలంలో ఎక్కువ పనుల వలన మరియు ఎక్కువ ఉద్రిక్తత వలన ఒత్తిడి పెరుగుతుంది. పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.

శరీర జీవక్రియ

మనం ఆరోగ్యంగా ఉండటానికి శరీరం యొక్క జీవక్రియను అధికరించటం చాలా అవసరం లేకపోతే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పొటాషియం జీవక్రియను అధికరించి శరీరం యొక్క శక్తిని అధికరిస్తుంది.

Posted on

Telugu tips for migraine – మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గించేందుకు గృహ చిట్కాలు

రక్తనాళాలు, నరాలు మరియు మెదడుకు చెందిన జీవరసాయన పదార్థాల్లో మార్పుల వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇది తల సగభాగంలో మాత్రమే వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. సాధారణంగా దీని వలన ప్రాణహానీ ఉండదు, అయినప్పటికీ ఇది రావటం వలన కాంతి మరియు శబ్ద సున్నితత్వం పెరుగటం, కడుపులో వికారంగా ఉండటం, వాంతులు అవటం మరియు ఆకలి లేక పోవటం లాంటి ఇబ్బందులు కలగచ్చు. ఈ నొప్పి నిరంతరం కాకుండా చూసుకోవటం మంచిది. క్రింద చెప్పిన నివారణ పద్దతులను ఉపయోగించి ఈ నొప్పిని తొలగించండి.

నివారణలు

లెవెండర్ నూనె

లెవెండర్ యొక్క వాసన చాలా బాగుంటుంది, అంతే కాదు ఇది మైగ్రేన్ తలనొప్పిని కూడా తొలగిస్తుంది. మీరు ఈ నూనెని తలపై రాయవచ్చు లేదా రెండు లేదా మూడు చుక్కల లెవెండర్ నూనెని ఒక బౌల్ వేడి నీటిలో వేసుకొని ఆవిరిని పీల్చండి.

ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్లో శరీరంలోని విషపదార్థాలను తొలగించటం, రక్తపోటును నియంత్రించటం, రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేయటం, బరువు తగ్గించటం, ఎముకల నొప్పిని తగ్గించటం మరియు మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగించటం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇది మైగ్రేన్ తల నొప్పిని కూడా తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ని మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజూ త్రాగండి.

కైయేన్ పెప్పర్

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది చాలా గొప్ప ఇంటి నివారిణి. ఇది మీ రక్త ప్రసరణను ప్రేరేపించి మెరుగుపరుస్తుంది. ఇందులోని క్యాప్సైసిన్సహజంగా నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ కైయేన్ పెప్పర్‌ని కలుపుకొని ఇందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసాన్ని చేర్చి త్రాగండి.

చమోమిలే టీ

చేమంతిలో యాంటీ-పాస్మోడిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు సూతింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తోడ్పడుతుంది. మీరు జర్మన్ చమోమిలే టీని ఉపయోగించినట్లైతే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. మీకు ఎప్పుడు తల నొప్పిగా అనిపించినా ఒక కప్పు చమోమిలే టీని త్రాగండి.

అల్లం

అల్లంలోని ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనం ఇన్ఫ్లమేషన్ను తగ్గించి హార్మోనులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది కండరాలను సంకోచ పరిచి మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. అనేక నాన్ స్టెరాయిడ్ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇలాగే పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పినుండి నివారణ పొందేందుకు పచ్చి అల్లం రసాన్ని లేదా అల్లం టీ త్రాగండి.

ఫివర్ ఫ్యూ

ఫివర్ ఫ్యూ అనే మొక్కలో పార్థేనాలిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తొలగించి, మంటను తొలగించటమే కాకుండా ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లను న్యూట్రలైజ్ చేసి నొప్పిని తొలగిస్తుంది. ఒక స్పూన్ ఫివర్ ఫ్యూ ఆకులను మరియు ఒక స్పూన్ పుదీనా ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అరగంట తరువాత వడగట్టి ఈ నీటిని రోజంతా త్రాగండి.

ఆపిల్

మీకు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఆపిల్ తినటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.  పచ్చ ఆపిల్ యొక్క వాసన పీల్చడం వలన కూడా నొప్పి యొక్క ప్రభావం తగ్గుతుంది.

కాఫీ

కాఫీ త్రాగటం వలన మీ మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఇందులోని కెఫిన్ నొప్పిని కలిగించే రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలను నియంత్రిస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోని త్రాగితే ఇంకా ప్రభావితంగా ఉంటుంది.

అవిసె గింజలు

మైగ్రేన్ తలనొప్పి ఇన్ఫ్లమేషన్ వలన కలుగుతుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వలన ఈ నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ చికిత్సకు అవిసె గింజలను తినవచ్చు లేదా వీటి నూనెని ఉపయోగించవచ్చు.

బక్వీట్

ఇందులోని ఫైటోకెమికల్స్ లో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ హెడ్ఏక్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది.

బాదాం

మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు మందులకు బదులుగా బాదాం తినండి. ఎందుకంటే తలనొప్పిని తగ్గించేందుకు మందులలో వాడే సాలిసిన్ అనే రసాయనం బాదాం లో ప్రాకృతికంగా లభిస్తుంది. ఇది నొప్పిని తగ్గించి మైగ్రేన్ రాకుండా నిరోధిస్తుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్‌ని తీసుకోవటం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గటమే కాదు, మీ రక్తపోటును తగ్గిస్తుంది, మీ హృదయం యొక్క లయలను స్థిర పరుస్తుంది. ఈ చర్యలు చివరికి మైగ్రేన్ తలనొప్పిని నిరోధించడానికి సహాయపడుతుంది.

బట్టర్ బర్

మాములు తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పులను తొలగించేందుకు అమెరికాలో బట్టర్ బర్ అనేది సాంప్రదాయంగా ఉపయోగించే ఒక ఔషధం. ఈ ఆధునిక కాలంలో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది నొప్పిని తగ్గించటమే కాదు, శరీరంలో ఈ నొప్పికి కారణం అయిన కొన్ని రసాయనాలను కూడా తగ్గిస్తుంది. దీనిని కేవలం సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇతర రూపంలో విషపూరితం.

మెగ్నీషియం

పరిశోధకులను బట్టి తరచుగా మైగ్రేన్ హెడ్ఏక్ తో బాధపడే వారు మెగ్నీషియం టాబ్లెట్స్ ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వారి మెదడులో తక్కువ స్థాయి మెగ్నీషియం ఉంటుంది. కొందరిలో మామూలుగానే తక్కువ స్థాయి మెగ్నీషియం ఉండే అవకాశం ఉంటాయి.

చల్లని లేదా వేడి ఒత్తిడి

చల్లని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి తలపై ఒత్తండి, లేదా హాట్ బాగ్ ఉపయోగించండి.  చాలా మందికి తెలియక పోయినప్పటికీ ఇది మైగ్రేన్ ని తొలగించేందుకు మంచి నివారణ పద్దతి.

5-HTP

శరీరం 5-HTPని ఉత్పత్తి చేయడానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి తరచూ రాకుండా మరియు దాని యొక్క తీవ్రతను తక్కువ చేస్తుంది.5-HTP ‘సెరోటోనిన్స్థాయులను సంతులనం చేయడం ద్వారా ఈ తలనొప్పిని తొలగిస్తుంది. అయినప్పటికీ, మీరు 5-HTP తీసుకోవడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

కోఎంజైమ్ Q10

ఇది ఒక యాంటీఆక్సిడెంట్. శరీరంలో దీని యొక్క స్థాయిని బట్టి రక్తనాళాల యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాల నుండి రక్త కణాలను కాపాడుతుంది, రక్తంలో చక్కెర స్థాయులను స్థిరీకరిస్తుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ చాలా ఆహార పదార్థాలలో లభిస్తుంది. మీరు మాత్రల రూపంలో తీసుకోవాలని అనుకుంటే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విల్లో బెరడు

ఇందులోని సాలిసిన్ఒక నొప్పి నివారణ సమ్మేళనం. మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ సహజ నివారిణి.

ద్రాక్ష

ద్రాక్ష ఫల రసం మైగ్రేన్ నొప్పి తొలగించేందుకు సమర్థవంతమైన నివారిణి. మీరు మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ప్రతి రోజూ కనీసం రెండు సార్లు ద్రాక్ష ఫల రసాన్ని త్రాగాలి. దీనిని రుచికరంగా  చేయాలనుకుంటే అందులో నీరు లేదా తేనె చేర్చవచ్చు.

క్యాబేజ్ ఆకులు

క్యాబేజీ ఆకులు మైగ్రేన్ తలనొప్పికి ఒక మంచి గృహ నివారిణి. మీరు కొన్ని క్యాబేజీ ఆకులను బాగా దంచి వాటిని ఒక వస్త్రంలో ఉంచాలి. పడుకునేముందు మీ తల చుట్టూ ఈ వస్త్రాన్ని కట్టుకోండి. తల నొప్పి నుండి పూర్తి ఉపశమనం పొందే వరకూ ఇలా చేయాలి.

ప్రింరోజ్ ఆయిల్

దీని యొక్క యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ప్రభావితమైన నివారిణి. ఇది మెదడులో బిగువుగా ఉండే కణాలనుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఈ నూనెని మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు లేదా దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నూనెని నుదిటిపై రాయవచ్చు లేదా నీళ్ళు మరియు తేనెతో కలిపి త్రాగవచ్చు.

గంధపు చెక్క పేస్ట్

మీరు రోజూ రాత్రి పడుకునే ముందు గంధపు చెక్క పేస్ట్‌ని తలపై రాయండి. మీ నొప్పి తగ్గిన తరువాతే దీనిని కడగవచ్చు.

గోరింటాకు పేస్ట్

మీకు ఎప్పుడు తలనొప్పిగా అనిపించినా గోరింటాకు చెట్టు పువ్వులను వినిగర్తో కలిపి ఒక పేస్ట్‌లా చేసుకొని రాత్రి పడుకునేముందు తలపై రాసుకోండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వలన, ఇది మైగ్రేన్ తలనొప్పికి మంచి నివారిణి. మీరు వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేసి తలపై రాయండి లేదా కొన్ని వెల్లుల్లిని నమలండి. నిరంతరం మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వలన మైగ్రేన్ తలనొప్పిని నివారించవచ్చు.

ఆవాల నూనె

తలలో నొప్పి ఉన్న వైపు ఈ నూనెని రాయండి. ఇది మీ మైగ్రేన్ తలనొప్పిని తక్షణమే తొలగిస్తుంది. ఒక వారం పాటు రెండు నుండి మూడు సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ తో స్నానం

కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేయండి లేదా స్పాంజుతో శరీరంపై రాయండి. ఇది తక్షణమే మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

రాస్ప్బెర్రీ లీఫ్ టీ

ఋతు స్రావం సమయంలో మహిళలకు ఇది ఒక ఉత్తమమైన మందు. ఎరుపు రాస్ప్బెర్రీ లీఫ్ టీ త్రాగితే మీ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటమే కాదు ఇతర రోగ లక్షణాలను కూడా తొలగిస్తుంది.

తులసి

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తులసి యొక్క వాసన లేదా తులసి నూనె యొక్క వాసన మాత్రమే చాలు. ఇది శరీరం యొక్క కండరాలను శాంతి పరచటమే కాదు ఒంటి నొప్పులను కూడా తొలగిస్తుంది. మీకు ఎప్పుడు తలనొప్పిగా ఉన్నా తులసి ఆకులను నమలండి లేదా తులసి నూనెని తలపై రాయండి.

వలేరియన్

ఇది మీ శరీరానికి ఉపశమనాన్ని అందించి, మైగ్రేన్ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

ధనియాలు

వేడి నీటిలో ధనియాలను వేసి బాగా ఉడికించి ఈ నీటి ఆవిరిని పీల్చండి. ఇది మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. లేదా వట్టి ధనియాలను నోటిలో వేసుకొని నమలండి లేదా వంటలో ఎక్కువగా వాడండి.

డోంగ్ క్వాయ్

వీటి యొక్క వేర్లు  మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. మీరు చేయవలసిందల్లా మీ నుదుటిపై డాంగ్ క్వాయ్ కలిగి ఉన్న క్రీమ్‌ను రాయండి. లేదా వేర్లను నీటిలో వేసి బాగా ఉడికించి ఈ నీటిని వడి గట్టి కొద్దిగా తేనెని కలిపి త్రాగండి.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్ కూడా మందుల్లానే పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి కోసం మీరు చేసుకునే ఆక్యుపంక్చర్ వలన దీర్ఘ కాలపు దుష్ప్రభావాలు ఉండవు.

ధ్యానం

ధ్యానం ఒత్తిడిని తగ్గించే ఒక మార్గం మాత్రమే కాక, తలనొప్పిని ఎదుర్కోవటానికి ఒక ఉత్తమమైన పద్దతి. రోజూ ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి.

లోతైన శ్వాస తీసుకోండి

ప్రతీ ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా లోతైన శ్వాసలను తీసుకోవాలి. మీకు మైగ్రేన్ హెడ్ఏక్ రాబోతుందని అనిపిస్తే మెల్లగా లోతైన శ్వాసలను తీసుకోండి, ఇది మీకు ఉపసమానాన్ని ఇస్తుంది. అంతే కాదు కొన్నిసార్లు నొప్పి రాకుండా నివారించగలదు.

పై చెప్పిన ఇంటి నివారణలు మీకు ఉపశమనాన్ని కలిగించకపోతే చిరోప్రాక్టర్ని సంప్రదించండి. వీరి సూచనలు మరియు వైద్యం ద్వారా నొప్పియొక్క ప్రభావాన్ని మరియు ఆవృతిని తగ్గించవచ్చు.

Posted on

Telugu tips to get rid of body heat – సహజంగా బాడీ హీట్ ను తగ్గించేందుకు గృహ నివారణలు

శరీరం వేడిగా ఉండటం వలన మీకు అసౌకర్యం కలగచ్చు. ఇది వ్యాధి కాదు, కానీ రాబోయే వ్యాధికి ఒక సూచన లాంటిది. మీరు చాలా శ్రమ కరమైన పనులు చేసినప్పుడు మీ శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావచ్చు. మీకు జ్వరం వచ్చినప్పుడు, లేదా ఏదైనా మాత్రలు వాడినప్పుడు ఈ అదనపు వేడి పుటొచ్చు. శరీరంలోని రసాయనాల అసమతుల్యత మరియు అసాధారణ జీవక్రియ వలన కూడా అకస్మాత్తుగా మరియు అవాంఛనీయ వేడి పుడుతుంది. కొన్ని సార్లు ఇది గుండె మంట, చర్మంపై దద్దుర్లు మరియు నల్లటి మచ్చలకు దారితీస్తాయి. వేడిని క్రింద చెప్పిన రెమెడీల ద్వారా తొలగించండి.

నివారణలు

పళ్ళు

ఎక్కువ పళ్ళను తినాలి. వీటిలో విటమిన్లు మరియు మినరల్లు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ లక్షణాల వలన ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ప్రతి రోజూ వట్టి కడుపుతో లేదా భోజనం చేసిన తరువాత పళ్ళను తినండి.

ఎండలో తిరగవద్దు

ఒక వేళ మీకు బయట పనులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు నీళ్లు ఎక్కువగా త్రాగాలి. సూర్య కాంతులు మీ శరీరంలో వేడిని అనవసరంగా పెంచి మీకు చిరాకు పుట్టించవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్‌ను వాడండి. ఇది మీ చర్మపు రంగును కూడా సంరక్షిస్తుంది.

చక్కెర మరియు ఉప్పు

ఒక స్పూన్ చక్కెర మరియు ఒక స్పూన్ ఉప్పుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని త్రాగండి. ఇది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

దానిమ్మ మరియు బాదాం ఫల రసం

మీరు బాదాం లేదా దానిమ్మ ఫల రసాన్ని త్రాగండి. రోజూ ఉదయం దీనిని త్రాగటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనవసరమైన వేడిని తొలగించి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

కొబ్బరి నీళ్లు మరియు పుచ్చకాయ

పుచ్చకాయలో శరీరం లోని వేడిని తగ్గించేందుకు కావలసిన విటమిన్లు ఉన్నాయి. కొబ్బరి నీల్లు కూడా శరీరంలోని వేడిని తగ్గించగలదు. వీటితో పాటు మీరు తరచుగా నీల్లను త్రాగటం చాలా మంచిది.

అత్తిపండు

అత్తిపండు మరియు పచ్చి అత్తిపండులో వేడిని తగ్గించే విటమిన్ బి2, పొటాషియం మరియు విటమిన్ ఏ ఉన్నాయి. రోజుకు కనీసం రెండు అత్తి పండ్లను తినడం వలన తప్పకుండా మీ శరీర వేడి క్రమంగా తగ్గి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది.

యాలకులు (కార్డమమ్)

మీ శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు యాలకులను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో చాలా వైద్య గుణాలు ఉన్నందున పురాతన కాలం నుండి శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు మరియు అనేక వ్యాధులను తొలగించేందుకు ఉపయోగిస్తారు.

ఆప్రికోట్(నేరేడు పండు)

మీకు దాహం వేసినప్పుడు నీటికి బదులుగా నేరేడు పండు రసాన్ని త్రాగండి. ఇది మీ శరీర వేడిని తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం దీనిని త్రాగటం అలవాటు చేసుకోండి.

కర్బూజ(మస్క్ మెలోన్)

బాడీ హీట్‌ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వేసవి కాలంలో మరియు ఎక్కువగా బయట పనులు ఉన్నవారు మీ రోజూ డైట్ లో ఈ కర్బూజను చేర్చుకోవడం ఉత్తమం.

రెడ్ రాడిష్(ఎర్ర ముల్లంగి)

ఎర్రముల్లంగిలో నీటి సారం ఎక్కువగా ఉండటంతో పాటు ఇందులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నందున ఇది మీ శరీరం యొక్క వేడిని సహజంగా తగ్గిస్తుంది. ఇందులో వ్యాధినిరోధ లక్షణాలు కూడా ఉన్నాయి . ఇది హీట్ స్ట్రెస్ తో పోరాడుతుంది.

మెంతులు

వేడిని తగ్గించడంలో అత్యంత ప్రాచుర్యం పొందినది మెంతులు. వీటిని వట్టిగా తినవచ్చు లేదు రోజూ ఆహారాలలో చేర్చుకోండి.

అరటి దూట

శరీరంలో వేడిని తగ్గించడానికి అరటి దూట బాగా ఉపయోగపడుతుంది. అరటి దూట కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి కూడా సహకరిస్తుంది.

రాగి గంజి

శరీరంలోని వేడిని హరించి, శరీరానికి పోషకాలను అందించేందుకు రాగి గంజిని తీసుకొండి. కొన్ని నీళ్ళు మరిగించి దాంట్లో చల్లని నీటిలో కలిపిన రాగుల పిండిని వేసి వుడికించి గంజి తయారు చేయండి. చల్లారిన తరువాత ఇందులో సరిపడ ఉప్పు, మజ్జిగ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

పెసర పప్పు

పెసరపప్పును రాత్రే గంజి చేసి ఉదయం నిద్రలేవగానే, వట్టి కడుపుతో త్రాగడం వలన శరీరంలోని వేడి ఇట్టే మాయం అవుతుంది. దీనిని మీ రోజూ ఆహారాలలో కూడా చేర్చుకోవచ్చు.

శరీరం యొక్క వేడిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు

 • శరీర వేడిని తగ్గించేందుకు ఒక ముఖ్యమైన చిట్కా నూనెలో వేపిన మరియు కారమైన ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి. వీటికి బదులుగా వేడిని తగ్గించే దోసకాయలు, ఆకు పచ్చని కూరగాయలను తీసుకోండి. పెరుగు మరియు పుచ్చకాయ రసాన్ని తరచుగా త్రాగండి.
 • తులసి విత్తనాలను కొన్ని నిమిషాలు నీటిలో నానపెట్టి పాలలో లేదా రోజ్ వాటర్ లో కలుపుకొని త్రాగండి.
 • జీవక్రియను పెంచేటువంటి ఆహారాలను తినండి, దీనివలన శరీరం యొక్క వేడి సంతులనం అవుతుంది. ఉదాహరణకు జీలకర్ర, కొత్తిమీర, సోంపు విత్తనాలు మరియు గులాబీ నీరు. మీ శరీరం యొక్క ఉపశమనానికి పెప్పర్మిట్(పుదీనా) మరియు చమోమిలే(చామంతి) టీ త్రాగండి.
 • మూలికల నూనె లేదా కొబ్బరి నూనెలను ఉపయోగించి శరీరాన్ని మసాజ్ చేయండి. ఇది మీ రక్త ప్రసరణను అధికరించి వేడిని తగ్గిస్తుంది.
 • మీరు రోజూ తినే ఆహారాలలో చక్కెరను ఉపయోగించటం తగ్గించి వాటికి బదులుగా తేనె మరియు మొలాసిస్లను ఉపయోగించండి.
 • పెరుగు ఒక సహజ శీతల కరణ ఏజెంట్, ప్రతి రోజూ భోజనం తరువాత కొద్దిగా పెరుగును నీటిలో కలుపుకొని త్రాగండి.
 • చల్లని వాతావరణంలో గార్డెనింగ్, స్విమ్మింగ్ లాంటి పనులు చేయటం వలన మీ శరీరం చల్లబడుతుంది.
 • కాటన్ మరియు లెనిన్ లాంటి దుస్తులను వేసుకోవటం వలన మీ చర్మానికి కావాల్సిన గాలి ప్రవాహాన్ని అందిస్తుంది.
 • ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను, ఎక్కువగా ఉప్పు మరియు నూనె ఉండే పదార్థాలను నివారించండి.
 • పాలు, పసుపు పొడి మరియు బాదాం పొడిని కలుపుకొని త్రాగటం వేడిని తగ్గించేందుకు ఒక ఆయుర్వేద వైద్య విధానం.
 • సూర్య నమస్కారం, ప్రాణాయామ మరియు త్రికోణాశనం లాంటి యోగాలను చేయటం వలన మీ శరీరం ప్రాకృతికంగా చల్లబడుతుంది. వీటితో పాటు ధ్యానం చేయటం వలన మీ మనసు కూడా శాంత పడుతుంది.
 • లేత కొబ్బరి నీళ్లు శరీర వేడిని తగ్గించేందుకు చాలా తోడ్పడుతుంది.
 • ఆముదం నూనెని తలపై రాసి స్నానం చేయండి. లేదా మీ పాదాలలో రాసుకోండి.
 • ఆముదం నూనెకు బదులుగా నువ్వుల నూనెని కూడా ఉపయోగించవచ్చు.
 • రోజూ రాత్రి పడుకునే ముందు అరటి పళ్ళను తినండి. ఇది శరీర వేడిని తగ్గించి మలబద్ధకం నుండి నివారణ ఇస్తుంది.