Posted on

Telugu tips for vaginal yeast infection – యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు గృహ నివారణలు

అనేక రకాలైన సంక్రమణ వ్యాధులు ఎవరికైనా రావచ్చు. అటువంటి సంక్రమణంను నివారించడానికి ఉత్తమమైన మార్గం పరిశుభ్రంగా ఉండటం. ఈస్ట్ అనేది ఒక రకమైన ఫంగస్. ఈ ఫంగస్ మాములుగా యోనిలో చాలా తక్కువ మొత్తాలో ఉంటుంది. ఇది ఎక్కువ అయినప్పుడు ఈస్ట్ సంక్రమణ వ్యాధి స్త్రీలలో చాలా సాధారణంగా వస్తుంది. ఈ సంక్రమణం తీవ్రమైన వ్యాధి కాదు, అయినప్పటికీ చాలా చిరాకు కలిగిస్తుంది. యోనిలో ఈ ఇన్ఫెక్షన్ను కలిగించే ఫంగస్ పేరు కాండిడాఅల్బికాన్స్‘.

ప్రతి స్త్రీలోని పునరుత్పత్తి అవయవం చాలా సున్నితమైనది. ఎలాంటి సంక్రమణం అయినా ఈ అవయవానికి హాని కలిగించవచ్చు. యోని సంక్రమణం వలన దురద, వాపు మరియు చిరాకు లాంటి వివిధ రకాలైన సమస్యలు ఎదురవుతాయి.

ఎక్కువగా యోనిలో ఏర్పడే ఈ ఈస్ట్ సంక్రమణం, దంతాలు, గోరుల చుట్టూ, చర్మం మడతలలో, ఉదరం మరియు రొమ్ము కింద బాగాలలో కూడా రావచ్చు. ఇటువంటి పరిస్థితి ప్రధానంగా ఒత్తిడి, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి, గర్భధారణ, డయాబెటిస్ వలన ఏర్పడవచ్చు. లేదా యాంటీ-బయోటిక్స్, స్టెరాయిడ్స్ మరియు గర్భనిరోధక మాత్రలు వాడటం వలన కూడా సంభవిస్తుంది.

యోని ఈస్ట్ సంక్రమణానికి కారణాలు

ఒక ఆరోగ్యకరమైన యోనిలో ఎక్కువ బాక్టీరియా కణాలు మరియు తక్కువ ఈస్ట్ కణాలు ఉంటాయి.లాక్టోబాసిల్లస్అసిడోఫైలస్ అనే బాక్టీరియా ఈస్ట్ సంఖ్యను తగ్గించటానికి సహాయపడుతుంది. కొన్ని సార్లు యాంటీ-బయోటిక్స్ తీసుకోవటం వలన వీటి సంఖ్యలు మారవచ్చు. తద్వారా ఈస్ట్ కణాల సంఖ్య పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయుల వలన కూడా ఈస్ట్ కణాలు అధికం కావచ్చు. మరి కొన్ని కారణాలు: హార్మోన్ పునఃస్థాపన చికిత్స లేదా HIV.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థప్రతి వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఒకేలా ఉండదు. కొందరిలో బలహీనంగా మరి కొందరిలో బలంగా ఉంటుంది. బలహీనమైన నిరోధక శక్తిని కలిగిన వ్యక్తులు సంక్రమణంను ఎదుర్కోలేరు. ఫలితంగా వారు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు.

హార్మోన్ల అసమతుల్యతమీ శరీరంలో హార్మోన్ స్రావం సరిగ్గా లేకపోతే, మీకు యోని ఈస్ట్ సంక్రమణ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిద్ర లేకపోవడంఈ ఇన్ఫెక్షన్ కు మరొక కారణం నిద్ర లేకపోవడం. 8 గంటల సరైన నిద్ర ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. దాని యొక్క అంతరాయం మీ శరీరంలో అసమతుల్యతకు దారి తీస్తుంది. కాబట్టి నిద్ర లేకపోవడం కూడా యోని ఈస్ట్ సంక్రమణంకు ఒక కారణం అవుతుంది.

మీకు ఈ సంక్రమణం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఒక వైద్యుడిని సంప్రదించండి.

ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ యొక్క లక్షణాలు

 • యోనిలో దురద లేదా నొప్పిగా ఉండటం.
 • మూత్ర విసర్జన లేదా లైంగిక సంభోగం సమయంలో నొప్పి లేదా మంటగా ఉండటం.
 • మీ ఋతుచక్రంకు ఒక వారం ముందు మందమైన మరియు వాసన లేని తెలుపు ఉత్సర్గం అవ్వటం.
 • యోని పై భాగం ఎర్రగా ఉండటం.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలు

ఈ ఇన్ఫెక్షన్ తగ్గటానికి యాంటీఫంగల్ క్రీమ్స్ లేదా యాంటీఫంగల్ మాత్రలను వాడవచ్చు. సంక్రమణం చాలా తక్కువగా ఉన్నట్లయితే అది స్వయంచాలకంగా తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో ఒక వైద్యుడిని సంప్రదించి సూచించిన మందులను వాడండి. మీరు యాంటీఫంగల్ క్రీమ్‌ను వాడుతున్నట్లయితే

గర్భ నియంత్రణ కోసం కండెమ్ లేదా డయాఫ్రేం మీద ఆధార పడవద్దు. ఎందుకంటే మీరు ఉపయోగించే క్రీమ్ లో వీటిని బలహీనపరచగల కొన్ని మందులు ఉండవచ్చు. కొంత మంది స్త్రీలకు ఈ సంక్రమణం మల్లీ మల్లీ వస్తూనే ఉంటుంది, అలాంటప్పుడు వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ముందు జాగ్రత్తలు

 • యోనిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
 • తేలిక పాటు సువాసన రహిత సబ్బులను మరియు నీటిని వాడండి.
 • మరుగు దొడ్డిని ఉపయోగించిన తరువాత పాయువు నుండి యోనికి బాక్టీరియా లేదా ఈస్ట్ వ్యాపించకుండా ఉండటానికి ముందునుండి వెనక్కు తుడవండి.
 • పత్తితో తయారు చేసిన లో దుస్తులను వాడండి.
 • బిగువైన జీన్స్ ను వేసుకోవద్దు. వీటిని తరచుగా వేసుకోవటం వలన జననేంద్రియ ప్రాంతంలో తేమ మరియు వేడిని పెంచుతుంది.
 • మీ సానిటరీ నాప్‌కిన్‌లను తరచుగా మార్చండి.
 • మీ యోని పై స్ప్రేలు, పౌడర్లు లేదా పెర్ఫ్యూమ్లను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి బాక్టీరియా మరియు ఫంగస్ యొక్క సంతులనంలో మార్పులు కలిగించవచ్చు.
 • మీరు చాలా సేపు తడి దుస్తులను ధరించినట్లయితే, మీ జననేంద్రియాలు తేమగా ఉంటాయి, ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్లను పెంచుతుంది, కాబట్టి వీలైనంత త్వరగా మీ తడి గుడ్డలను మార్చుకోండి.

యోని సంక్రమణంను తొలగించేందుకు గృహ నివారణలు

క్రాన్బెర్రీస్

ఇందులో యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ బెర్రీలు మూత్ర నాళం మరియు మూత్రాశయం ద్వారా వచ్చే అంటురోగాలను కూడా నివారిస్తాయి. రోజూ తాజా క్రాన్బెర్రీ ఫల రసాన్ని త్రాగండి. లేదా 2-3 క్రాన్బెర్రీ మాత్రలు తీసుకోండి. ఇవి చాలా త్వరగా ఇన్ఫెక్షన్లను తొలగించగలదు.

పెరుగు

ఇది సులభంగా లభించే ఒక ఇంటి నివారణి. ఇందులోని లాక్టోబాసిల్లస్ ఆసిడోఫిలస్అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. పెరుగును ఇన్ఫెక్షన్ ఉన్న చోటుపై రాసి గంట సేపు తరువాత కడగండి. లేదా వట్టి పెరుగును తినటం వలన కూడా సంక్రమణం తగ్గుతుంది.

టీ ట్రీ నూనె

ఇందులోని యాంటీ-ఫంగల్ లక్షణాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వలన కలిగే సమస్యలను తొలగిస్తుంది. కొద్దిగా టీ ట్రీ నూనెని నీటిలో లేదా బాదాం నూనెలో లేదా ఆలివ్ నూనెలో కలుపుకొని ఇన్ఫెక్షన్ ఉన్న చోటులలో రాయండి. రోజుకు అనేక సార్లు రాయాలి. మీ యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఒక టాంపూన్ పై టీ ట్రీ నూనెని రాసి దీనిని మీ యోని లోపల 2-3 గంటలు ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.

గమనిక: టీ ట్రీ నూనెని గర్భిణీ స్త్రీలు వాడకూడదు. ఎందుకంటే ఇది శిశువును బాధించగలదు.

వినిగర్/ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్‌లోని విలక్షణమైన లక్షణాలు ఇన్ఫెక్షన్లకు కారణం అయిన ఫంగస్ ఎక్కువ కాకుండా ఆపుతుంది. మీరు స్నానం చేసే వేడి నీటి తొట్టిలో కొన్ని చుక్కల వినిగర్‌ని బాగా కలిపి అందులో అరగంట సేపు మీ శరీరాన్ని నానపెట్టండి. లేదా వినిగర్‌ని నీటిలో కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న చోటులపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి. ఇది ఇన్ఫెక్షన్ వలన కలిగే దురద మరియు మంటల్ని తొలగిస్తుంది.

బోరిక్ యాసిడ్

బోరిక్ యాసిడ్‌ను గుళికలుగా తీసుకోవటం లేదా డైల్యూట్ చేసిన (నీటితో కలిపి పలుచగా చేసిన) బోరిక్ యాసిడ్‌ను ఇన్ఫెక్షన్లపై రాయటం వలన ఈస్ట్ సంక్రమణ తగ్గుతుంది. ఇందులో క్రిమినాశక, యాంటీ-వైరల్ మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నందున వేగంగా ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది.

గమనిక: బోరిక్ యాసిడ్ విషపూరితమైన స్వభావం కలిగినది. దీనిని దీర్ఘకాలం ఉపయోగించకూడదు. మరియు గర్భిణి స్త్రీలు ఉపయోగించకూడదు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో సంక్రమణంను తొలగించే లక్షణాలు ఉన్నాయి, ఇందువలన కడుపులో ఎలాంటి సంక్రమణాన్నైనా తొలగించేందుకు ఉపయోగిస్తారు. రెండు వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా చేసుకొని ఒక శుభ్రమైన చిన్న వస్త్రంలో ఉంచి మీ యోనిపై రాత్రంతా ఉంచండి.

తాజా ఫల రసం

ఎలాంటి సంక్రమణాన్నైనా తొలగించేందుకు మనం తినే ఆహారాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. యోని సంక్రమణంతో భాధ పడుతున్న స్త్రీలు తాజా ఫల రసాన్ని త్రాగటం మంచిదని వైద్యులు కూడా సూచిస్తారు. నిమ్మపండు, నారింజపండు, ఆపిల్ లాంటి ఫలాలలో విటమిన్లు మరియు యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నందున ఇవి శరీరం లోని ఈస్ట్‌ను తొలగిస్తుంది. మాములుగా ఇలాంటి సంక్రమణ వ్యాధులకు వైద్యులు మల్టీ విటమిన్ గుళికలను సూచిస్తారు, కానీ వాటికన్నా తాజా ఫల రసాలు ప్రాకృతికమైన నివారిణి.

ఉప్పు

యోని సంక్రమణాన్ని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పుని కలుపుకొని ఈ నీటితో యోనిని కడగండి. ఇది సంక్రమణం వలన కలిగే చిరాకు మరియు దురదను వెంటనే తొలగిస్తుంది.

ఆలివ్ ఆకులు

ఆలివ్ ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి. తరువాత కొద్దిగా ఉప్పుని కలిపి ఈ నీటితో మీ యోనిని బాగా కడగండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనాన్ని పొందుతారు.

ద్రాక్ష పండు

ద్రాక్ష పండు ఫల రసాన్ని తరచుగా త్రాగటం వలన, ఇది సంక్రమణం వల్ల కలిగే నొప్పిని మరియు దురదను తొలగిస్తుంది. ఈస్ట్ సంక్రమణం నుండి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

తేనె

తేనె అనేక చర్మ వ్యాధులను గుణ పరుస్తుందని అందరికీ తేలిసిన విషయమే. ఇది యోని సంక్రమణాన్ని కూడా తొలగించగలదు. తేనెని మీ యోని పై చర్మపు భాగాలలో రాయండి. 15 నిమిషాలు ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి.

మజ్జిగ

మజ్జిగను ఉపయోగించి కూడా సంక్రమణంను తొలగించవచ్చు. మజ్జిగను మీ రోజూ ఆహారాలతో పాటు త్రాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ యోనిని ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మజ్జిగను ఏ వయసు వారైనా త్రాగవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మరియు చర్మానికి చాలా మంచిది.

మౌత్ వాష్

మీరు మీ నోటి నుండి ఇన్ఫెక్షన్లను మరియు ఫలకములను తొలగించడానికి మౌత్ వాష్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు, ఇది మీ యోని ఈస్ట్ సంక్రమణమును తొలగించేందుకు కూడా ఉపయోగ పడుతుంది. మౌత్ వాష్‌ని ఒక కప్పు నీటిలో కరిగించి యోనిని ఈ నీటితో శుభ్రం చేయండి.

వేపాకు నీరు

కొద్దిగా వేపాకులను నీటిలో వేసి 10 నిముషాల పాటు ఉడికించండి. నీళ్లు పచ్చని రంగుకి మారేంతవరకు ఉడికించండి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత, యోనిని ఈ నీటితో బాగా శుభ్రం చేయండి.

Posted on

Pregnancy stretch marks removal tips in Telugu – ఇంటి నివారణ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించటం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రసవం తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సమస్య. గర్భంగా ఉన్నప్పుడు, మీ బరువు పెరగి చర్మం సాగడం వలన ఈ చారలు ఏర్పడతాయి. పొట్ట భాగంలో, తొడల మీద ఇలా చాలా సున్నితమైన ప్రదేశాలలో సాగిన చర్మపు గుర్తులు ఏర్పడతాయి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించడం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు కొన్ని సర్జరీల గురించి మీరు వినే ఉంటారు. వాస్కులర్ లేజర్, టంమ్నీ టక్స్ మరియు ఫ్రాక్షనల్ లేజర్ చికిత్స లాంటివి. వీటి వలన అనేక ప్రమాదాలు కలగవచ్చు, కనుక గృహ నివారణలు వాడటమే మంచిది. ఈ మార్క్స్‌ను నిర్మూలించడానికి క్రింద చెప్పిన కొన్ని నివారణ పద్దతులను పాటించండి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు ప్రాకృతిక గృహ నివారణలు

కలబంద

కలబంద గుజ్జును చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజూ చేయడంవలన కొద్ది రోజుల్లోనే చారలు తొలగిపోయి అందమైన మరియు మృదువైన చర్మం పొందుతారు.

తేనె

ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు తోడ్పడతాయి. ఒక వస్త్రంపై తేనె రాసి, ఈ వస్త్రంను చారలపై ఉంచండి. తేనె ఆరిన తరువాత, వెచ్చని నీటితో కడగండి. దీనిని స్క్రబ్ లా కూడా ఉపయోగించవచ్చు. తేనె, ఉప్పు మరియు గ్లిసెరిన్ ను కలిపి చారలపై మృదువుగా మర్దన చేయండి. 5 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

షియా వెన్న (షీ బట్టర్)

మీరు షియా వెన్న కలిగి ఉన్న లోషన్‌లను చూసే ఉంటారు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. ఈ వెన్న నేచురల్ షెల్ నుండి తయారు చేయబడినందున అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లోషన్‌ను క్రమం తప్పకుండా వాడటం వలన చర్మంపై ఉన్న చారలను తొలగించి స్థితిస్థాపకతను పెంచుతుంది.

చక్కెర

చర్మపు చారలను తొలగించేందుకు చక్కెర ఒక ఉత్తమ సహజ నివారిణి. స్నానం చేసే ముందు ఒక చెంచా చక్కెరను కొద్దిగా బాదాం నూనె మరియు నిమ్మరసంలో కలుపుకొని, చారలపై రాసి కొన్ని నిమిషాలపాటు మర్దన చేయండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన మీ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడాన్ని గమనించవచ్చు.

నూనెలు

స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించేందుకు మీరు ఈ పద్దతిని అనుసరించండి. మీరు గర్భిణీ అయ్యే మూడు నెలల ముందు నుంచే నూనెలను మీ కడుపుపై, తొడలపై మరియు రొమ్ములపై రాసి కొద్ది సేపు మృదువుగా మర్దన చేయండి. ఇది మీ చర్మంపై చారలు రాకుండా ఆపుతుంది. మీరు అనేక రకమైన నూనెలను వాడవచ్చు. ఉదాహరణకు ఆముదము, బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, విటమిన్ ఇ నూనె మరియు సుగంధ నూనెలు.

నిమ్మరసం

నిమ్మరసం సహజమైన అసిడిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మీ చర్మ మొటిమలను, నల్లని మచ్చలను మరియు చారలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక నిమ్మపండును తీసుకొని సగంగా కోసి, చారలపై మృదువుగా వృత్తాకార కదలికలో రాయండి.10 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి. లేదా దోసకాయ రసం మరియు నిమ్మరసాన్ని సమాన మోతాదులలో కలిపి చారలపై పూయవచ్చు.

సుగంధపు నూనెలు

ఒక స్పూన్ జెర్మేనియం, లావెండర్, రోజ్, మైర్ లేదా హెలిచ్రిసం లాంటి ఏదైనా ఒక సుగంధ నూనెని బాదం లేదా కొబ్బరి నూనెలో కలుపుకొని సాగిన చర్మపు గుర్తులపై రాయండి. 30 నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన ఇది మీ చర్మ లోతుల్లోకి ప్రవేశించి చారలను పూర్తిగా తొలగిస్తాయి.

నీళ్లు

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు మరియు ఇతర చర్మపు సమస్యలను తొలగించేందుకు మనం చర్మాన్ని ఉత్తమ హైడ్రేషన్ స్థాయిలలో ఉంచుకోవాలి. రోజూ కొన్ని లీటర్ల నీటిని త్రాగటం వలన చర్మం నిర్జలీకరణ లేదా నిర్విషీకరణ కాకుండా ఉంటుంది. ఇది మీ చర్మంలోని స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీటిని త్రాగటం చాలా మంచిది. అంతే కాదు నీళ్లు మీ చర్మం మృదువుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాఫీ, టీ లేదా సోడా లాంటి పానీయాలను నివారించేందుకు ప్రయత్నించండి.

మాయిశ్చరైజర్

చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచేందుకు మాయిశ్చరైజర్ను వాడండి. మీ చర్మం యొక్క నిర్మాణాన్ని బట్టి మాయిశ్చరైజర్ను ఎంపిక చేసుకోండి. పొడి బారిన చర్మం అయితే కోకో గింజలతో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. జిడ్డు చర్మం అయితే కలబంద లేదా బంక మట్టితో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. మీరు సహజమైన మాయిశ్చరైజర్ను తయారు చేయాలనుకుంటే క్రింద చెప్పిన విధంగా చేయండి.

గోధుమ బీజ చమురు, కలబంద గుజ్జు మరియు ఆలివ్ నూనెలను సమాన మోతాదులలో కలుపుకోండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే ఇందులో బంక మట్టిని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఎలాంటి రసాయనాలు లేనందున భవిష్యతులో ఎలాంటి సమస్యలు రావు.

గ్లైకోలిక్ యాసిడ్

గ్లైకోలిక్ యాసిడ్ ఒక ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లా, ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి సాగిన చర్మపు గుర్తులను తొలగిస్తుంది. ఔషధ దుకాణంలో గ్లైకోలిక్ యాసిడ్ గుళికలు లభిస్తాయి. వీటిని వాడే ముందు ఒక వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విటమిన్ ఇ నూనె

చర్మపు చారలను తొలగించేందుకు ఒక అద్భుతమైన విటమిన్, విటమిన్ . విటమిన్ ఇ నూనెని ఏదైనా ఒక మాయిశ్చరైజర్ లో కలుపుకొని స్ట్రెచ్ మార్క్స్ పై రాయండి. దీనిని క్రమంగా వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

అప్రికోట్ (నేరేడు పండు)

మీరు నేరేడు పండు స్క్రబ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేరేడు పండు నుండి విత్తనాలను తీసివేసి, దీనిని బాగా చూర్ణం చేసి ఒక ముద్దలా చేసుకోవాలి. తరువాత చారలపై రాసి 15-20 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

కోడి గుడ్డు యొక్క తెల్లసొన

తెల్లసొనలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చారలను తొలగించి మీ చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. రోజుకు 1-3సార్లు మీ చర్యలపై తెల్లసొనను రాయండి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేసి చైతన్యం నింపుతుంది. క్రమంగా సాగిన చర్మపు గుర్తులను కూడా తొలగిస్తుంది.

బంగాళదుంప

మీ చర్మం యొక్క స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు బంగాళదుంప సమర్ధవంతంగా పని చేస్తుంది. దీనిపై ఉన్న చర్మాన్ని తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, చూర్ణం చేయండి. దీనిని ఒక గుజ్జులా చేసి మీ చర్మంపై పూయండి, లేదా దీని రసాన్ని పిండి చర్మంపై రాయండి. 5-10 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇందులో పాలీఫెనోల్స్, ఫైటోకెమికల్స్ మరియు కెరోటినాయిడ్లు ఉన్నందున దీనిని కొన్ని నెలలు వాడటం వలన చారలు తొలగిపోతాయి.

డైట్ పరిశీలన

గర్భిణిగా ఉండే సమయంలో సరైన పోషక ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన శిశువు యొక్క ఆరోగ్యం మెరుగు పరచటమే కాదు మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఆపవచ్చు. జింక్, ఐరన్, విటమిన్ కె మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి మీ చర్మాన్ని మృదువుగా ఉంచటం వలన చారలు రాకుండా నివారిస్తాయి. గింజలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను కూడా తినండి.

వ్యాయామాలు

మీరు గర్భిణిగా ఉండే సమయంలో అధిక వ్యాయామాలను చేయలేక పోవచ్చు, కానీ డెలివరీ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామాలను అనుసరించడం మంచిది. ఇది సాగిపోయిన మీ చర్మాన్ని ధృఢంగా చేసి, స్థితిస్థాపకతను పెంచేందుకు సహాయ పడుతుంది, ముందుగా మీ కడుపుపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించి తరువాత వీటిని వేర్ల నుండి పూర్తిగా తొలగిస్తుంది.

పసుపు మరియు గంధం

పసుపు మరియు గంధంను మన దేశంలో కొన్ని శతాబ్దాలుగా చర్మ సంరక్షణంకు వాడుతున్నాము. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని కొంత కాలం పాటు ఉపయోగించటం వలన చర్మపు చారలు కూడా తొలగిపోతాయి. ముందుగా గంధపు చెక్కను ఇసుక రాయిపై రుద్ది ఒక స్పూన్ పేస్ట్‌ను తయారు చేయండి. రెండు అంగుళాల పసుపు వేరును చూర్ణం చేసి,గంధపు ముద్దలో కలపండి. ఈ మిశ్రమాన్ని చర్యలపై రాసి, 60 శాతం ఎండిన తరువాత మర్దన చేయండి. ఇలా రోజుకు ఒక సారి 6 నెలల పాటు చేయటం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.

పాలు, చక్కెర మరియు పచ్చ కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లను క్రమంగా వాడితే చర్మంపై ఏ రకమైన మచ్చలైనా తొలగిపోతాయి. రెండు స్పూన్ల పచ్చి పాలలో కొన్ని చుక్కల దోసకాయ రసం, కొన్ని చుక్కల నిమ్మరసం మరియు 1/2 స్పూన్ చక్కెరను కలుపుకొని ఒక స్క్రబ్ ను తయారు చేసుకోండి. దీనిని చారలపై రాసి నెమ్మదిగా వృత్తాకారంలో కొద్ది సేపు మర్దన చేసి నీటితో కడగండి. ఈ స్క్రబ్ వారానికి 3 సార్లకన్నా ఎక్కువగా వాడకూడదు.

నీటితో కడిగిన తర్వాత, చర్మాన్ని ఆరపెట్టి తాజా పచ్చ కొబ్బరి నీళ్లను మీ చారలపై పూయండి. ఇది ఎండిన తరువాత కలబంద జెల్ లేదా షీ వెన్నను రాయండి. కొబ్బరి నీళ్లతో మీ చర్మ చారలను రోజుకు 2-3 సార్లు కడగవచ్చు. ఇది ఎలాంటి హాని కలిగించదు.

Posted on

Telugu tips for PCOD – పాలిసిస్టిక్ ఓవరీయన్ డిసీస్ (PCOD) కు గృహ నివారణలు

పాలిసిస్టిక్ ఓవరీయన్ సిండ్రోమ్ (PCOS)/ పాలిసిస్టిక్ ఓవరీయన్ డిసీస్ (PCOD) అనే వ్యాధి స్త్రీలలో సంతానోత్పత్తి వయసులో కనిపించే ఒక హార్మోన్ సంబంధిత వ్యవస్థ రుగ్మత. PCOSతో బాధపడుతున్న మహిళలు ఫాలికల్‌లు (ద్రవ సంగ్రహములు) కలిగిన పెద్ద అండాశయాలను కలిగి ఉంటారు. ఈ పరిస్థితి హార్మోన్ల వలన మరియు జీవనశైలి వలన ఏర్పడుతుంది. అధిక బరువు ఉండటం దీనికి ముఖ్యకారణం. జెనెటిక్స్ వలన కూడా రావచ్చు. PCOD వలన చాలా సమస్యలు రావచ్చు. ఉదాహరణకు అరుదైన రుతుస్రావం, జుట్టు పలుచగా కావటం, జిడ్డు చర్మం, ఆకలి లేకపోవడం, గర్భం ధరించడంలో సమస్యలు ఇంకా ఎన్నో.

సరైన చికిత్స ద్వారా ఈ సమస్యను తొలగించవచ్చు. మీరు ఇంటి చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన వ్యాయామాలను మరియు సరైన జీవన శైలిని పాటిస్తే PCOSను సమర్థవంతంగా నయం చేయవచ్చు. ఒకవేళ ఈ సమస్య ఆధునిక దశలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా హార్మోన్ల మందులను వాడాలి.

పాలిసిస్టిక్ అండాశయ వ్యాధికి సమర్థవంతమైన గృహ నివారణలు

ఆముదము

హార్మోన్ల లోపాలను చికిత్స చేయడంలో ఆముదం ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీనిని పూయటం వలన కడుపు క్రింద ప్రాంతంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఎక్కువ ఫలితాన్ని పొందేందుకు సేంద్రీయ ఆముదమును వాడండి. హాట్ బాగ్ పై కొన్ని చుక్కల ఆముదమును వేసి ఇది చల్లబడే వరకు మీ ఉదరంపై రాయండి.

పామ్ బెల్లం

PCOD సమస్య ఉండే వారికి ఇన్సులిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందువలన వీరు తెల్లని చక్కెరను వాడకూడదు దానికి బదులుగా పామ్ బెల్లంను వాడాలి. ఇది ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.

సా పాల్మెట్టో

పచ్చి ‘సా పాల్మెట్టో’ సారంను తీసుకోవాలి. ఇవి PCOD రోగులలో సాధారణంగా ఎక్కువగా కనిపించే టెస్టోస్టెరాన్ను నియంత్రిస్తుంది.

గమనిక: శిశువుకు తల్లి పాలు ఇస్తున్న స్త్రీలు దీనిని ఉపయోగించకూడదు.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్ స్థాయిని మరియు హార్మోన్ల పెరుగుదలను చాలా ప్రభావితంగా నిర్వహిస్తుంది. కొన్ని గుమ్మడికాయ గింజలను ఒక బౌల్ నీళ్లలో నానపెట్టి త్రాగండి. లేదా ఒక పేస్ట్‌లా చేసి నీటిలో కలుపుకొని త్రాగండి.

జీలకర్ర

జీలకర్రలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను కూడా నియంత్రిస్తుంది. కొన్ని పచ్చి జీలకర్రను పొడి చేసుకొని నీలల్లో కలిపి త్రాగండి.

కొబ్బరి నూనె

PCOS సమస్యతో పోరాడటానికి కొబ్బరి నూనె ఒక అద్భుతమైన నివారిణి. ఒక టేబుల్ స్పూన్ నాణ్యమైన పచ్చి కొబ్బరి నూనెని రోజూ తీసుకోండి. దీనిని నేరుగా లేదా మీరు తినే సలాడ్స్, స్మూతీస్ లో కలుపుకొని తినండి. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయులను మరియు ఇన్సులిన్ స్రావంను నియంత్రిస్తుంది.

దాల్చిన చెక్క

ఇది PCOS సమస్యకు ఒక అద్భుతమైన నివారిణి. రోజూ ఒక టేబుల్ స్పూన్ చెక్క పొడిని వెచ్చని నీటిలో కలుపుకొని తెల్లవారు జామున ఖాళీ కడుపుతో త్రాగండి. లేదా ఒక దాల్చిన చెక్క ముక్కని మొత్తం తినవచ్చు. మీరు రోజూ తినే ఆహారాలు ఉదాహరణకు స్మూతీస్, ఫల రసం, డెస్సర్ట్స్ లేదా టీలో చేర్చుకొని త్రాగవచ్చు. ఇది ఎక్కువ కేలరీలను దహించి రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరీకరించి జీవక్రియను అధికరిస్తుంది.

గమనిక: దాల్చిన చెక్కను దీర్ఘకాలం వ్యవధిలో ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీ కాలేయంపై దుష్ప్రభావం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

గ్రీన్ టీ

ఇది PCOS సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ-ఇంప్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ‘పాలీఫెనోల్స్’ స్థాయి ఎక్కువగా ఉన్నందున ఇది రక్త కణాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది.

గ్రీన్ టీ ఆకులను వేడి నీటిలో 3-4 నిమిషాల పాటు ఉంచి, వడగట్టి కొద్దిగా తేనెని కలుపుకొని త్రాగండి. దీనిని రోజుకు 3-4 సార్లు తీసుకోవడం వలన మీ బరువు తగ్గటానికి కూడా సహాయ పడుతుంది.

మెంతులు

మెంతులు మీ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నిర్వహించడం ద్వారా PCODని గుణ పరిచేందుకు ప్రభావితంగా పని చేస్తుంది. మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి పొద్దున వడగట్టి ఖాళీ కడుపుతో త్రాగండి. రోజుకు 3 సార్లు ఈ నీటిని త్రాగండి; తెల్లవారు జామున ఖాళీ కడుపుతో ఒక సారి, మధ్యాహ్నం భోజనం చేసే 5 నిమిషాల ముందు ఒక సారి అలాగే రాత్రి డిన్నర్ తినే 5 నిమిషాల ముందు ఒక సారి. వండిన మెంతాకులను కూడా తినవచ్చు.

అవిసెగింజలు

అవిసెగింజలలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ మరియు లిగ్నన్స్ కూడా ఎక్కువగా ఉన్నందున శరీరంలోని ‘టెస్టోస్టెరాన్’(వృషణముల స్రావము) ని సమర్థవంతంగా తొలగిస్తుంది, దీని ద్వారా PCOD నియంత్రించబడుతుంది.

అవిసెగింజల పొడిని నీలల్లో కలుపుకొని ఖాళీ కడుపుతో తెల్లవారు జామున త్రాగాలి లేదా గింజలను నమిలి తినవచ్చు.

తులసి ఆకులు

‘ఆండ్రోజెన్’ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన కూడా PCOS సమస్య వస్తుంది. ఈ ఆండ్రోజెన్ స్థాయులను నియంత్రించేందుకు తులసి ఆకులు తోడ్పడతాయి. తెల్లవారు జామున ఖాళీ కడుపుతో 10-12 తులసి ఆకులను నమిలి తినండి. అలాగే వీలైన వరకు తులసి ఆకులు నానపెట్టిన నీళ్లను కూడా త్రాగండి.

తేనె మరియు నిమ్మపండు

PCODకు ముఖ్య కారణం స్థూలకాయం. తేనె మరియు నిమ్మరసాన్ని తీసుకోవటం వలన మీ బరువు తగ్గుతుంది. రెండు స్పూన్ల తేనె మరియు ఒక నిమ్మపండు రసాన్ని ఒక గ్లాస్ వెచ్చని నీటిలో కలుపుకొని తెల్లవారు జామున ఖాళీ కడుపుతో తాగాలి. ఇది మీ బరువు తగ్గించి PCODని నియంత్రించేందుకు తోడ్పడుతుంది.

ఆమ్లా

ఆమ్లాలో విటమిన్ సి మరియు యాంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గించేందుకు మరియు మహిళల్లో సంతానోత్పత్తి పెంచటానికి సహాయపడుతుంది. ఇందులోని డీటాక్సిఫయింగ్ లక్షణాలు బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

ఆమ్లాలలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తినండి. లేదా ఒక గ్లాస్ నీటిలో తురిమిన ఆమ్లాలను వేసుకొని రాత్రి పడుకునే ముందు త్రాగండి. ఇది మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కాకరకాయ

కాకరకాయ రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా ఇది PCOD యొక్క లక్షణాలను కూడా తొలగించగలదు. వీటిని మీ రోజూ ఆహారంలో చేర్చుకోండి. లేదా కాకరకాయ ఫల రసాన్ని త్రాగండి.

ఆపిల్ సీడర్ వినిగర్

ఇది మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాలను చూపుతుంది. PCOD సమస్య తొలగించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల వినిగర్‌ను ఒక గ్లాస్ వెచ్చని నీళ్లలో కలుపుకొని రోజూ 3 సార్లు; తెల్లవారు జామున ఖాళీ కడుపుతో, మధ్యాహ్నం భోజనం ముందు ,మరియు రాత్రి డిన్నర్ తినే ముందు త్రాగండి.

చేస్ట్ బెర్రీ

చేస్ట్ బెర్రీ శరీరంలోని హార్మోన్ స్థాయులను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడటం ద్వారా PCODకు సంబంధించిన సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

చేస్ట్ బెర్రీ టీని క్రమం తప్పకుండా త్రాగండి. ఈ టీని తయారు చేసేందుకు ఒక స్పూన్ ఎండిన చేస్ట్ బెర్రీలను ఒక కప్పు నీటిలో 8-10 నిమిషాల పాటు ఉడికించండి. తరువాత వడగట్టి వెచ్చగా ఉన్నప్పుడే త్రాగండి.

లికోరైస్

లికోరైస్ వేర్లు ‘ టెస్టోస్టెరాన్‌’ల స్థాయిని తగ్గించగలదని నమ్మకం. టెస్టోస్టెరాన్లను తొలగించటం ద్వారా PCODను నయం చేయడానికి చాలా ప్రభావితమైనది. ఇది అండోత్సర్గమును కూడా పెంచుతుంది. ఎండిన లికోరైస్ వేర్లను నీలల్లో వేసి 10-15 నిమిషాల పాటు ఉడికించి, వడగట్టి త్రాగండి.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉన్నాయి. ఇది శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిని తగ్గించి ఇన్సులిన్ ని పెంచుతుంది. ఫిష్ ఆయిల్ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన PCOD వ్యాధిని తగ్గించేందుకు సమర్థవంతంగా పని చేస్తుంది.

జీవనశైలి మరియు ఆహార మార్పులు

PCOD చికిత్సలో మీ జీవనశైలి మరియు ఆహార మార్పులు చాలా ముఖ్యమైనవి. ఉత్తమ ఫలితాలను పొందేందుకు గృహ నివారణ పద్దతులతో పాటు ఈ చిట్కాలను కూడా అనుసరించండి.

 • మీ రోజువారీ క్రమంలో వ్యాయామాలను చేయండి. ఇది మీ బరువు తగ్గించేందుకు మరియు PCOS చికిత్సకు తోడ్పడుతుంది.
 • ఆహార నియమం కూడా చాలా అవసరం. మీ బరువు తగ్గటానికి తోడ్పడే ఆహారాలను తినండి. ఉదాహరణకు ఆకుకూరలు, పళ్ళు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలు.
 • ధూమపానం వలన ఆండ్రోజెన్ స్థాయులు అధికరిస్తుంది. మీకు ధూమపానం అలవాటు ఉంటే వెంటనే ఆపడం మంచిది.
 • PCOD ఉన్నప్పుడు మద్యం సేవించడం మంచిది కాదు. ఇది మీ బరువు పెంచగలదు.
 • యోగాసనాలు PCOD సమస్యను తొలగించేందుకు తోడ్పడుతుంది. కానీ వీటిని సరియైన గురువుల దగ్గర నేర్చుకోవాలి.
Posted on

Telugu tips to treat skin hives – చర్మం పై దద్దుర్లు (హైవ్స్) దురద తగ్గటానికి ఇంటి చిట్కాలు

ఏదైనా అలర్జీ వలన చర్మం పై ఏర్పడే ఎరుపు గడ్డలను దద్దుర్లు అని అంటారు. అవి కొందరిలో చిన్నగా మరి కొందరిలో పెద్దగా వ్యాపిస్తాయి. అవి దురదగా ఉంటాయి.

చర్మ దద్దుర్లకు కారణాలు ఏమిటి?

ఇవి హిస్టామిన్ రసాయనం వలన కలుగుతాయి. రక్త కణాల ద్వారా హిస్టామిన్ అనే రసాయనం డిశ్చార్జ్ అవుతుంది. ఈ రసాయనం రక్త నాళాల నుండి చర్మం లోతుల్లోకి లీక్ అవుతుంది. వీటి వలన దద్దుర్లు ఏర్పడతాయి. మందులు వాడటం, ఒత్తిడి, వైరల్ ఇన్‌ఫెక్షన్, జలుబు, సూర్య కాంతులు మరియు వేడి వలన ఈ దద్దుర్లు రావచ్చు. దుమ్ము, దుమ్ము పురుగులు, పుప్పొడి, డాండ్రఫ్, షెల్ఫిష్ మరియు ఇతర ఆహారాల వలన కూడా రావచ్చు.

దద్దుర్లకు ఉత్తమ చికిత్స ఏమిటి?

ఈ అలర్జీ నుండి ఉపశమనం పొందేందుకు యాంటీ-హిస్టామిన్ మందులను వాడండి. మీకు మత్తును కలిగించని మందులను ఎంపిక చేసుకోండి. మందులు వాటి పనిని అవి చేస్తాయి, వాటితో పాటు కొన్ని గృహ నివారణలు కూడా పాటించడం వలన ఎక్కువ ఉపశమనాన్ని పొందుతారు.

దద్దుర్లను తొలగించేందుకు గృహ నివారణ పద్ధతులు

చల్లని నీటితో స్నానం

చాలా అరుదుగా జలుబు వలన దద్దుర్లు వస్తాయి. అలాంటప్పుడు చల్లని నీటితో స్నానం చేయండి. దీని వలన రక్త నాళాలు కృశించిపోయి చర్మం లోనికి హిస్టామిన్ రసాయనం డిశ్చార్జ్ కాకుండా ఆగిపోతుంది. లేదా ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్ క్యూబ్స్ ని నింపి దురద చర్మంపై ఉంచండి. బాధించే దద్దుర్ల నుండి ఉపశమనం పొందటానికి ఈ పద్ధతిని రోజుకు అనేక సార్లు ప్రయత్నించండి.

ఆస్ట్రిజెంట్స్

రక్త నాళాల నుండి హిస్టామిన్ ఉత్పత్తిని ఆపడానికి కాలమైన్ లోషన్లేదా విచ్ హాజెల్లాంటివి వాడండి. పెప్టో-బిస్మోల్లేదా మిల్క్ అఫ్ మెగ్నీషియలాంటి లోషన్‌లను కూడా వాడవచ్చు.

బేకింగ్ సోడా

రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఒక ముద్దలా చేసుకోండి. దీనిని దద్దుర్లపై రాయటం వలన దురద తగ్గుతుంది.

వినిగర్

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ లో ఒక టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లను కలుపుకొని దద్దుర్లపై రాయండి. ఇది మీ దురదను తగ్గిస్తుంది.

బ్రౌన్ షుగర్ మరియు అల్లం

1/4 కప్పు బ్రౌన్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం మరియు 3/4 కప్పు వినిగర్‌ను బాగా కలిపి కొన్ని నిమిషాలపాటు బాగా ఉడికించాలి. ఈ నీటిని వడగట్టి వెచ్చగా అయిన తరువాత దద్దుర్లపై అద్దాలి. ఇలా రోజుకు అనేక సార్లు చేయండి.

ఫిష్ ఆయిల్

1000 మిల్లీగ్రాముల ఫిష్ ఆయిల్‌ క్యాప్సూల్స్ ను రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు. ఇందులోని ఫాటీఆసిడ్స్ కు యాంటీ-ఇన్ఫమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంటను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది. చల్లని నీటిలో ఉండే చేపలు, ఉదాహరణకు బ్లూ ఫిష్,సాల్మన్ మరియు అల్బ కోర్ ట్యూనా లాంటి చేపలను తినండి.

ఒత్తిడిని తగ్గించుట

కొన్ని సార్లు ఒత్తిడి వలన కూడా దద్దుర్లు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం మరియు వ్యాయామాలను ఆచరించండి.

తులసి

తులసి ఒక ప్రాకృతిక యాంటీ-హిస్టామిన్’. దద్దుర్లను తొలగించేందుకు ఇది ఒక ప్రముఖమైన నివారిణి. ఇది దురద మరియు మంటల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. కొన్ని తులసి ఆకులను ఒక జార్ వేడి నీళ్లలో వేసి మూసి పెట్టాలి. ఈ నీళ్లు చల్లబడిన తరువాత దద్దుర్లపై రాయండి. లేదా కొన్ని తులసి ఆకులను బాగా దంచి వాటిని దద్దుర్లపై రాయండి. కొద్ది సేపు తరువాత వెచ్చని నీటితో కడగండి.

పుదీనా

పుదీనా చల్లని ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది దద్దుర్ల వలన కలిగే దురదను తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇది దురద మరియు అసౌకర్యమైన మంటను నివారించడానికి చాలా ప్రభావితమైన పదార్థము. ఇందులో యాంటీ-ఇన్ఫమేటరీ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

ఒక కప్పు నీటిలో పుదీనా ఆకులను వేసి బాగా ఉడికించండి. ఈ నీటిని వడగట్టి, చల్లబడిన తరువాత ఫ్రిజ్లో కొన్ని గంటలు ఉంచండి. ఈ చల్లని నీటిని మీ చర్మం పై రాయండి. ఇలా రోజుకు అనేక సార్లు రాయటం వలన ఉపసమనం పొందుతారు.

దీనిని చర్మం పై రాయటమే కాకుండా త్రాగడం వలన కూడా దురద మరియు మంట తగ్గుతుంది. ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా పుదీనా ఆకులను, ఒక చెంచా చెక్కరని వేసి బాగా ఉడికించండి. ఈ నీటిని వడగట్టి చల్లబడిన తరువాత త్రాగండి. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి.

పసుపు

వండటానికే కాదు చర్మం మెరుగు పరచటానికి మరియు దద్దుర్ల చికిత్సకు కూడా పసుపు ఉపయోగ పడుతుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫమేటరీ గుణాలు శరీరం లోని కార్టికోస్టెరాయిడ్స్ని ఉత్తేజ పరుస్తుంది. ఇందులో యాంటీ-హిస్టామిన్ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. రోజుకు రెండు సార్లు వెచ్చని పాలు లేదా నీళ్లలో ఒక చెంచా పసుపును కలుపుకొని తాగండి. వంట వండేటప్పుడు మామూలు కన్నా కొద్దిగా ఎక్కువ పసుపును వాడండి.

దురదగొండి(నెట్టల్)

ఇది వంకరటింకర ఆకులు కలిగిన ఒక మూలిక చెట్టు. మూలికా శాస్త్రజ్ఞులు దద్దుర్లను తొలగించటానికి దీనిని సిఫార్సు చేస్తారు. ఇందులో యాంటీ-హిస్టామిన్, యాంటీ-ఇన్ఫమేటరీ మరియు రక్తస్రావ నివారిణి లక్షణాలు ఉన్నాయి. ఇది వాపు, మంట మరియు దురదను తొలగించటానికి వాడుతారు.

ఒక టేబుల్ స్పూన్ ఎండిన దురదగొండి ఆకులను ఒక కప్పు వెచ్చని నీళ్లలో కలిపి 10-15 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టి కొద్దిగా తేనెని కలుపుకొని త్రాగండి. రోజుకు 2-3 సార్లు త్రాగటం వలన ఉపయోగకరంగా ఉంటుంది.

లేకపోతే 300-మిల్లీగ్రాముల నెట్టల్ క్యాప్సూల్స్ ను రోజూ తీసుకోవచ్చు. ఈ క్యాప్సూల్స్ ను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించుట మంచిది.

వోట్మీల్

ఇందులో యాంటీ-ఇర్రిటేటింగ్, యాంటీ-ఇన్ఫమేటరీ మరియు సూతింగ్ లక్షణాలు ఉన్నందున ఇది దురదను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒక కప్పు బేకింగ్ సోడాని రెండు కప్పుల పొడిచేసి ఓట్‌మీల్ తో కలుపుకోవాలి. స్నానం చేసే వెచ్చని నీటిలో దీనిని బాగా కలపి 15 నిమిషాల పాటు ఈ నీటిలో ఉండండి. ఇలా రోజుకు రెండు సార్లు మీ దద్దుర్లు తగ్గేంత వరకు చేయండి.

లేదా 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని 2 కప్పుల ఓట్ మీల్ పొడితో కలిపి ఒక ముద్దలా చేసి చర్మం పై రాయండి. 15-20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజూ చేయాలి.

కలబంద(అలో వెరా)

ఇది కూడా పుదీనా లాగే చర్మాన్ని చల్లబరచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫమేటరీ  మరియు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు చర్మంపై ఎరుపుని, మంటని మరియు దురదని తగ్గిస్తుంది. వీటిని తినటం వలన రోగనిరోధక శక్తిని పెంచి, తాప జనక(ఇన్ఫమేటరీ) టాక్సిన్లను తొలగించేందుకు సహాయ పడుతుంది.

అలో వెరా జెల్‌ను చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు అనేక సార్లు రెండు వారాల పాటు రాయండి. లేదా, కలబంద రసాన్ని రోజూ తాగండి.

గమనిక: ఈ చిట్కాని చిన్న పిల్లలు మరియు పాలు ఇచ్చే ఆడవాళ్ళు అనుసరించకూడదు.

గులాబీ నీరు

రోజ్ వాటర్ తరచుగా చర్మ దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించబడే ఉత్తమ ఔషధం. దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్‌ని చర్మంపై రాసి, 15-20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెలో ఉండే పోషక పదార్థాలు చర్మ సమస్యలని పోగొట్టడంలో ప్రభావితమైనది. కొంచం ఆలివ్ ఆయిల్‌ని పత్తితో దద్దుర్లపై రాయండి. 20 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

మజ్జిగ

అలర్జీల వలన ఏర్పడే చర్మ సమస్యలకు మజ్జిగ ఒక చక్కటి పరిష్కారం. మజ్జిగను దద్దుర్లపై రాసి 10-15 నిముషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడగండి.

Posted on

Telugu tips for skin open pores – చర్మం యొక్క రంధ్రాలను(ఓపెన్ పోర్స్) తొలగించటం ఎలా?

చర్మ రంధ్రాలు మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి, వీటిని సూక్ష్మంగా తనిఖీ చేస్తే గమనించవచ్చు. కొద్దిమందిలో అవి పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం(ఆయిలీ స్కిన్) ఉండే వాళ్లకు ఈ రంధ్రాలు పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువ, వాటివలన మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలు రావచ్చు.

ముఖ్య గమనిక, ఈ రంధ్రాలను తొలగించటానికి శాశ్వత చికిత్సలు లేవు. కానీ కొన్ని ఇంటి నివారణ పద్ధతుల ద్వారా వాటియొక్క పరిమాణంను తగ్గించవచ్చు.

చర్మ రంధ్రాల చికిత్సకు కొన్ని సహజమైన నివారణలు

గుడ్లు

ఒక కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని, కొద్ది సేపు బాగా చిలికి ఫ్రిజ్లో 5 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖంపై రాయండి. కొన్ని నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ముఖంపై ఉంచి కడగండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన రంధ్రాల యొక్క పరిమాణంలో మార్పులను చూడవచ్చు. జిడ్డు చర్మం ఉండే వారు ఈ మిశ్రమం వాడటం వలన రంధ్రాలు చిన్నగా అవ్వటం మాత్రమే కాదు చర్మం కూడా ధృఢంగా మరియు బిగువుగా అవుతుంది.

ముల్లంగి

ఒక టేబుల్ స్పూన్ వినిగర్, నిమ్మరసం, తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ల తాజా ముల్లంగి రసాన్ని ఒక గిన్నెలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక జార్లో స్టోర్ చేయండి. పత్తిని ఉపయోగించి ఈ నీటిని రోజూ చర్మంపై రాయండి. ఎలాంటి రకమైన చర్మం ఉన్న వారైనా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు.

దోసకాయ

రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ గులాబీ నీలల్లో కలిపి ఒక పత్తితో ముఖంపై రాయండి.

శనగ పిండి

ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలిపి ఒక నున్నటి పిండి ముద్దలా తయారు చేసుకోండి. దీనిని ముఖంపై రాసి 15-20 నిముషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన చర్మ రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. ఇది పొడి బారిన చర్మంపై ప్రభావితంగా పని చేస్తుంది.

ముల్తాని మట్టి

రెండు టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టిని రెండు టేబుల్ స్పూన్ల గులాబి నీటిలో(రోజ్ వాటర్) కలిపి చర్మంపై రాయండి. జిడ్డు చర్మం ఉండే వారికి ఇది మంచి పరిష్కారం. ఈ మిశ్రమాన్ని తరచూ వాడవద్దు, ఎందుకంటే చర్మం పొడిగా అవుతుంది.

బొప్పాయి పండు

పండిన బొప్పాయి పండును బాగా మెత్తగా చేసి ముఖంపై సమానంగా రాయండి. రంధ్రాలు ఎక్కువగా ఉన్న చోట్లలో రాసి 30 నిమిషాల తరువాత వెచ్చని నీళ్లతో కడగండి. ఇది రంధ్రాలను తొలగించటమే కాకుండా ముఖంలోని నరాలలో స్థితిస్థాపకతని(ఎలాస్టిసిటీ) పెంచుతుంది. బొప్పాయి పండులోని యాంటీ-యాక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని బాగు చేసి మెరుగుపరుస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

ఇది ఒక ప్రాకృతిక రక్తస్రావ నివారిణి మరియు చర్మం యొక్క రంగును పెంచుతుంది. వినిగర్‌ను నీళ్లలో కలిపి ఒక పత్తితో ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత కడగండి. ఇందులోని యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు మీ మొటిమలను మరియు బాక్టీరియా దాడులను కూడా తగ్గిస్తుంది. ఇది మీ చర్మ రంధ్రాలను తగ్గించి చర్మం యొక్క PH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మీ చర్మానికి చాలా మంచిది. ఇది వాడటం వలన మీ చర్మంలోని జిడ్డు మరియు దుమ్మును తొలగించి, రంధ్రాలను తగ్గిస్తుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి ఒక ముద్దలా చేయండి. దీన్ని మీ ముఖంపై మసాజ్ చేసి నీళ్లతో కడగండి. ఇలా ఒక వారం పాటు రోజూ వాడి తేడాను చూడండి.

తేనె

తేనె కూడా మీ చర్మానికి చాలా మంచిది. ఇది ఒక మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఇందులో చాలా వైద్య లక్షణాలు ఉన్నందున చర్మాన్ని శుభ్రం చేస్తుంది. తేనెని మీ ముఖంపై రాసి చూడండి, మీ చర్మ రంధ్రాలు చిన్నగా మరియు చర్మం మెరుస్తూ అందంగా అవుతుంది.

పెరుగు

ఇందులో లాక్టిక్ ఆమ్లాలు(ఆసిడ్స్) ఉంటాయి, ఇవి మీ చర్మంలోని జిడ్డును మరియు సన్నటి గీతలను(ఫైన్ లైన్స్) తొలగించి రంధ్రాలను తగ్గిస్తుంది. పెరుగును ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీళ్లతో కడగండి. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్లయితే పెరుగులో కోడిగుడ్డు యొక్క తెల్లసొనను కలుపుకొని ముఖంపై రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

చక్కెర

చక్కెరతో మీ ముఖాన్ని క్రమం తప్పకుండా రుద్దండి (స్క్రబ్ చేయండి). ఇది చర్మం యొక్క పోర్స్ ను సహజంగా శుభ్ర పరుస్తుంది.

కలబంద గుజ్జు

ఇది చర్మానికి తేమను అందించి, శుభ్రపరచడమే కాకుండా, పోషకాలను కూడా అందిస్తుంది. దీనిని పూయటం వలన చర్మంపై పేరుకున్న మురికి మరియు జిడ్డును తొలగించి, రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ నూనె

ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం యొక్క పొడి దనాన్ని, నిస్తేజాన్ని మరియు పెద్దగా ఉండే చర్మం యొక్క పోర్స్ ను సరి చేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నూనెతో మీ చర్మంపై 3-4 నిమిషాల పాటు మర్దన చేసి, నీటితో శుభ్రం చేసుకోండి.

చర్మంపై పెద్ద రంధ్రాల చికిత్సకు చిట్కాలు

 • యాంటీ-యేజింగ్ లేదా పోర్-మినిమైజింగ్ క్రీములను కొని క్రమం తప్పకుండా వాడండి. ట్రెటినోయిన్ లేదా రెటినోనిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎ పదార్థాలు ఉండే క్రీములను ఎంపిక చేసుకోండి.
 • జిడ్డు గల చర్మంకోసం ఉద్దేశించబడిన ఒక మెడికల్ కోర్సును అనుసరించండి. ఇది మీ చర్మాన్ని తక్కువ నూనెని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది మరియు పోర్స్ ను తొలగిస్తుంది.
 • మీ దగ్గర ఎప్పుడూ బ్లాట్టింగ్ పేపర్స్ ను ఉంచుకోండి. ఇవి చర్మంలోని జిడ్డును తొలగిస్తుంది. మీ చర్మం ఎక్కువ జిడ్డుగా అనిపించినప్పుడు వీటిని వాడండి.
 • మీరు మీ ముఖం మీద పిండిని(పౌడరు) రాసేటప్పుడు, T- జోన్ల పై (నెత్తి, ముక్కు మరియు గడ్డం) దృష్టి పెట్టండి. పౌడర్ నూనెని గ్రహిస్తుంది, అందువలన చర్మం తక్కువ మెరుస్తూ మరియు జిడ్డుగా కనిపిస్తుంది.
 • ఆయిలీ పదార్ధాలతో తయారు చేసిన అలంకరణ వస్తువులను వాడవద్దు. వాటిని వాడటం వలన చర్మం పై పోర్స్ మూసుకుపోతాయి మరియు వాటి పరిమాణం పెరుగుతుంది. అలంకరణకు ఆయిల్ తక్కువగా ఉండే ఉత్పత్తులనే వాడండి. వీలయినంత వరకు తక్కువ మేకప్ చేసుకోండి.
 • ముఖంపై పెద్ద రంధ్రాలు మరియు ముడతలు రాకుండా ఉండేందుకు సన్ స్క్రీన్‌ను ఉపయోగించండి. ఇందులోని SPF వీటిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది.
 • ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న ప్రాడక్ట్స్ ను చర్మంపై వాడవద్దు. అవి మీ చర్మాన్ని పొడిగా చేస్తాయి.
Posted on

Telugu tips to reduce breast size – స్త్రీల స్తనాలను శస్త్రచికిత్స(సర్జరీ) చేయకుండా తగ్గించడం ఎలా?

స్త్రీలలో వక్షోజాలు ఒక ముఖ్యమైన అవయవము. ఇవి చాలా పెద్దగా ఉంటే వికారంగా ఉంటుంది. అంతే కాదు వెన్నునొప్పి లాంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులకు కూడా దారితీస్తాయి. వక్షోజాలలో ఎక్కువ కొవ్వు ఉండటం వలన కుంగిపోతాయి.

స్తనాల కొవ్వు అంటే ఏంటి?

ఇది చర్మం క్రింద ఒక పొరలా ఏర్పడే ప్రత్యేక రకం చర్మాంతర్గత కొవ్వు. వీటిని తగ్గించేందుకు సరైన ఆహార పోషణతో పాటు కఠినమైన వ్యాయామం కూడా అవసరం. కొన్ని సార్లు శరీరంలోని హార్మోన్ల మార్పుల వలన కూడా కుచాలు పెద్దగా కావచ్చు. ఉదాహరణకు గర్భిణీ కావటం, పాలు ఇవ్వటం లేదా మందులు వాడటం లాంటివి. జీన్స్ మరియు స్థూలకాయం వీటికి ప్రధాన కారణాలు.

వీటిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేసినట్లయితే అనేక దుష్ప్రభావాలు పెరుగుతాయి.

సర్జరీ(శస్త్రచికిత్స) ద్వారా రొమ్ములను తగ్గించే విధానాన్ని చూదాం.

సర్జరీని చేసేటప్పుడు చర్మాన్ని తీసివేస్తారు. శరీరం పై రెండు మూడు చోట్లలో చర్మాన్ని కోసి చర్మం లోని కొవ్వును తొలగించి కుట్లు వేస్తారు. కొంత మందికి చర్మంలోనే కాకుండా వక్షాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు లిపోసక్షన్ని కూడా చేస్తారు.

ఫలితం

చాలా మందికి ఈ చికిత్స యొక్క ఫలితం అనుకూలంగా ఉండదు. 10 మందిలో 8 మంది స్త్రీలు చాలా నొప్పికి గురి అవుతారు. మిగిలిన వాళ్ళు 2-3 నెలల వరకు కొద్దిగా అసౌకర్యాన్ని ఎదుర్కుంటారు. కొంత మందికి చాలా వారాల వరకు గాయాలు అలాగే వాపు కూడా వస్తుంది. ఇవన్నీ గుణం అయ్యే వరకు శస్త్రచికిత్స బ్రాలనే వాడవలసి ఉంటుంది. ఇందువలన ప్రాకృతిక విధానాలను అనుసరించడం మంచిది.

రొమ్ము పరిమాణం తగ్గించడానికి సహజ మార్గాలు

BMI

మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే వెంటనే బరువు తగ్గే క్రమాన్ని అనుసరించండి. అనారోగ్యకరమైన ఆహారాలను తిన వద్దు, ఉదాహరణకు ప్రాసెస్ చేసిన పదార్థాలు, నూనెలో వేంచిన ఆహారాలు మరియు తీపి పదార్థాలు. వీటికి బదులుగా పళ్ళు, కూరగాయలు , తృణధాన్యాలు, పింటో బీన్స్, తక్కువ కొవ్వు వున్న పాలు, లీన్ గొడ్డు మాంసం మరియు గింజలను మీ రోజు ఆహారాలలో చేర్చుకోండి.

కుచాల కొవ్వులను తగ్గించే మాత్రలు

కొవ్వును తగ్గించే మూలిక మాత్రలు ఒక సురక్షితమైన ఎంపిక. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా రొమ్ములను తగ్గిస్తుంది.

బ్రెస్ట్ ప్రొడక్ట్స్ మరియు లోషన్స్

ఇది మరో ప్రసిద్ధ పద్ధతి. ఈ లోషన్స్ మరియు క్రీమ్స్ ని మీ వక్షోజాలపై రాసినట్లయితే మీరు అందమైన, పరిపూర్ణ పరిమాణం మరియు ఆకారం కలిగిన వృక్షోజాలను పొందవచ్చు.

బాగా కచ్చితమైన బ్రాలు

పెద్ద స్తనాలతో ఉన్న స్త్రీలు ప్రత్యేకమైన కనిష్టీకరణ బ్రాలు ధరించండి. ఇది రొమ్ములను రూపు మారకుండా ఉంచి చిన్నగా కనిపించేలా చేస్తుంది.

గృహ నివారణలు

చాలా సురక్షితమైన కొన్ని ఇంటి నివారణ పద్దతులు ఉన్నాయి. వీటిని పాటించటం వలన మీ కుచాలలోని కొవ్వును తగ్గించి చిన్నగా మరియు అందంగా చేయవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మాములుగా మన బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే ఇది రొమ్ములలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇందులోని కాటెచిన్ శరీరంలోని కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది. అంతే కాదు గ్రీన్ టీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ ఆకులను వేడి నెలల్లో వేసి 4-5 నిమిషాలు నానపెట్టి ఆ నీటిని త్రాగండి. ఇలా రోజుకు 4-5 సార్లు త్రాగటం వలన మంచి ప్రభావం ఉంటుంది.

నిమ్మపండు, తేనె

ఇది బరువు తగ్గించేందుకు వాడే ప్రాచీన పద్దతి. బరువు మాత్రమే కాదు ఇది త్రాగటం వలన వక్షోజాల కొవ్వుకూడా తగ్గుతుంది. ఒక గ్లాసు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి. ఇది రోజూ నిద్రలేచిన వెంటనే వట్టి కడుపుతో తాగాలి. ఇది శరీరం లోని చెడు పదార్థాలను(టాక్సిన్స్) తొలగించి జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తుంది.

కాఫీ స్క్రైబ్

కాఫీ లోని కెఫిన్ జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది.2 స్పూన్ల కాఫీ పొడిలో కొద్దిగా తేనెని కలుపుకొని మీ రొమ్ములపై రుద్దండి. ఇలా 10-15 నిమిషాలు రుద్ది కడగండి. ఇలా తరచూ చేయటంవలన కొవ్వు తగ్గుతుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్ లో ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది మరియు ఈస్ట్రోజెన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతే కాదు ఇది జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఫిష్ ఆయిల్, సాల్మన్ మరియు ట్యూనా లాంటి చేపలను మీ ఆహారంలో చేర్చుకోండి.

జితచెట్టు (ఆలివ్) నూనె

వృక్షోజాలు పెద్దగా కావటం వలన అవి కుంగిపోతాయి. మసాజ్ చేయటం వలన వీటిని సరైన రూపంలో ఉంచవచ్చు. మసాజ్ నూనెలు బజారులో లభిస్తాయి. వీటిని రాయటం వలన రక్త ప్రసరణను అధికరించి వీటి పరిమాణాలను తగ్గిస్తాయి. వెచ్చని జితచెట్టు నూనెతో రోజుకు రెండుసార్లు మసాజ్ చేయండి. రొమ్ములను తగ్గించే క్రీములను కూడా వాడవచ్చు కానీ ఈ క్రీములను వాడే ముందు వైద్యుడిని సంప్రదించటం మంచిది.

అల్లం

అల్లం మీ రొమ్ముల పరిమాణాన్ని తగ్గిస్తుందంటే నమ్మగలుగుతారు? అవును, ఇవి మీ రొమ్ములను తగ్గించటానికి ఉపయోగపడతాయి. అల్లం శరీరంలో జీవక్రియను పెంచడంవలన కొవ్వును తగ్గిస్తుంది. ఒక చెంచా తురిమిన అల్లంను నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ నీటిని వడకట్టి తేనెని కలుపుకొని త్రాగండి.

అవిసె గింజలు

అవిసె గింజలలో కూడా ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను తగ్గించి జీవక్రియను పెంచడం ద్వారా శరీరం మరియు రొమ్ములలోని కొవ్వును తగ్గిస్తుంది. రోజూ ఒక చెంచా అవిసె గింజలను తినండి లేదా ఆహారంలో చేర్చుకోండి.

మంజిస్తా వేర్లు

ఇది మన దేశంలో చాలా సులభంగా లభిస్తుంది. ఇది రొమ్ములలో కొవ్వు పెరగటానికి కారణమయిన ఈస్ట్రోజెన్ ని తగ్గించటం వలన స్తనాలు చిన్నగా అవుతాయి. కొన్ని మంజిస్తా వేర్లను నీలల్లో నానపెట్టి తరువాత బాగా ఉడికించండి. ఈ నీటిలో తేనెని లేదా ఈ నీటిని టీ లో కలుపుకొని త్రాగండి.

వక్షోజాలను తగ్గించటానికి మంచి ఆహార పద్ధతులతో పాటు సరైన వ్యాయామం కూడా అవసరం. వక్షోజాలను తగ్గించే వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి. ఈ నిత్యకృత్యాలను పాటిస్తే శారీరం యొక్క ఆకారాన్ని మారుస్తుంది. బోటింగ్, జాగింగ్, చురుకైన వాకింగ్ మరియు సైక్లింగ్ లాంటి కార్డియోవాస్క్యూలర్ నిత్యకృత్యాలను కూడా అనుసరించండి. స్తనాలను తగ్గించటానికి కొన్ని వ్యాయామాలను చూద్దాం.

ఏరోబిక్స్

పాటలు వింటూ చాలా ఉత్సాహంగా చేసే వ్యాయామాలను ఏరోబిక్స్ అని అంటారు. ఇది మీ హృదయానికి చాలా మంచిది. రోజుకు 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయటంవలన సులభంగా మీ వక్షోజాలలోని కొవ్వును తగ్గించి వాటిని చిన్నగా చేయవచ్చు.

పుష్ అప్స్

పుష్ అప్స్ శరీర పైభాగంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇది రొమ్ముల కొవ్వును కూడా తగ్గిస్తుంది. నేలపై బోర్ల పడుకొని మీ అర చేతులు భుజాలకు నేరుగా నెలపై ఉంచి మీ కాళ్లను విస్తరించండి. మొత్తం బరువు మీ చేతుల మీద పట్టి శరీరం యొక్క పై భాగాన్ని పైకి లేపండి. వీలైనంత పైకి లేపిన తరువాత మల్లి క్రిందకు దింపండి, ఇలా చేసేటప్పుడు మీ శరీరం నెలకు తగలకూడదు. మీ వెన్నెముకను వంచకుండా చేయండి. ఇలా ఆపకుండా 3 సార్లు చేయండి, క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

డంబెల్స్

డంబెల్స్ ను ఉపయోగించి రొమ్ములపై ఒత్తిడిని పెంచటం కూడా ఒక ఉపయోగకరమైన వ్యాయామం. ఇది మీ శరీర పైభాగంలోని కొవ్వును తగ్గించేందుకు మరియు రొమ్ములను బిగువుగా చేసేందుకు తోడ్పడుతుంది. మీ భుజాలను నేలపై ఉంచి, శరీరం యొక్క క్రిందిభాగాన్ని మోకాళ్లను వంచి పైకి లేపండి. రెండు చేతులతో డంబెల్స్ ను పట్టుకొని చేతులను స్ట్రెచ్ చేయండి. ఇలా ప్రారంభంలో 5 సార్లు చేసి క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

రెసిస్టన్స్ బ్యాండ్

ఈ బ్యాండ్‌ని ఉపయోగించి వ్యాయామం చేయటం వలన కూడా మీ రొమ్ముల కొవ్వును తగ్గించవచ్చు. ఈ బ్యాండ్ని ముందుకు లాగేటప్పుడు మీ చేతులు మాత్రమే ముందుకు వెళ్ళాలి, మీ శరీరం స్థిరంగా ఒక చోటులోనే ఉండాలి. క్రమంగా మీ బ్యాండ్ యొక్క రెసిస్టన్స్ ను పెంచండి. మీరు వివిధ రకాలుగా చేయాలనుకుంటే, ఒక చేతితో బ్యాండ్ ని లాగి రొమ్ము పై ఒత్తిడిని పెంచి ప్రయత్నించవచ్చు.

డిప్స్

స్థానాలలోని కొవ్వును తగ్గించటానికి ఇది ఒక సమర్థవంతమైన వ్యాయామం. డిప్ హాండెల్స్ ను పట్టుకొని మీ నడుం వరకు శరీరాన్ని పైకి ఎత్తండి. ఆ తరువాత మోకాళ్లను వంచి మీ శరీరాన్ని పైకి క్రిందకు పుష్ చేయండి. ఇలా ఆపకుండా 3 సార్లు చేయటం మొదలు పెట్టి క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

తక్కువ ప్రభావాలు ఉండే హృదయ( కార్డియోవాస్క్యూలర్) వ్యాయామాలు

చాలా పెద్ద స్తనాలు ఉండే ఆడ వాళ్లకు జాగిం, పరిగెత్తడం లాంటి వ్యాయామాలను చేయటం కష్టంగా ఉంటుంది. వీరు సులభమైన వ్యాయామాలను అనుసరించటం ఉచితం. థ్రెడ్ మిల్స్, స్థిర బైకులు(స్టేషనరీ బైక్స్) లాంటి వాటితో వ్యాయామాలు చేయండి. ఇలాంటి వ్యాయామాలద్వారా మీరు ఫలితాన్ని పొందాలంటే ఎక్కువ సేపు మరియు తరచుగా మీరు శ్రమించాలి. క్రమంగా ఈ వ్యాయామాలను కొనసాగిస్తే శరీరంలోని కొవ్వును తగ్గించటం చాలా సులభం.

ఈత(స్విమ్మింగ్)

శరీరంలోని అన్ని నరాలనూ రూపొందించేందుకు స్విమ్మింగ్ ఒక సమర్థవంతమైన వ్యాయామం. రోజుకు ఒక గంటసేపు స్విమ్మింగ్ చేయటం రొమ్ము నరాలను తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది.

మీ వ్యాయామాలను ఇంకా ప్రభావితం చేయటానికి వివిధ రకాలను ప్రయత్నించండి. ఒకే రకమైన వ్యాయామం కాకుండా, వారంలో 3 రోజులు స్విమ్మింగ్, మిగిలిన 4 రోజులు బరువు తగ్గించే వ్యాయామాలు మరియు ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలను చేయండి.

గమనిక: వ్యాయామం చేసేటప్పుడు మీకు సరిగ్గా సరిపడేటటువంటి బ్రాలను ధరించండి, లేకపోతే వెన్నెముక నొప్పి రావచ్చు లేదా రొమ్ములు కుంగిపోవచ్చు.

Posted on

Telugu tips to get rid of lizards – బల్లులను వదిలించుకోవటం ఎలా?

ఇంట్లో బల్లులు ఉండటం చాలామందికి ఆటంకంగానూ ఇబ్బంది గానూ ఉంటుంది. ఇవి మీ గోడలపై ఉండటం మీకు నచ్చక పోవచ్చు. వీటిని ఇంటి నుంచి దూరంగా ఉంచేందుకు ఉత్తమ గృహ నివారణలు కొన్ని చూద్దాం.

బల్లులను వదిలించుకోవటం ఎలా?

గుడ్డు చిప్ప(ఎగ్ షెల్స్)

బల్లులను దూరంగా ఉంచటానికి గుడ్డు యొక్క చిప్పను ఉపయోగించవచ్చు. ఇది ఒక నమ్మదగిన పరిష్కారం. బల్లులకు గుడ్ల వాసన నచ్చదు. మీరు గుడ్లను తిన్న తరువాత వాటి చిప్పను బల్లులు ఉండే చోట్లలో పెట్టండి. క్రమంగా అవి ఆ చోటు నుంచి తొలగిపోతాయి.

వెల్లుల్లి

బల్లులు రాకుండా ఉండేందుకు వెల్లుల్లిని కూడా వాడవచ్చు. వీటిని ఇంట్లో కొన్ని చోట్లలో వేలాడదీయండి. వీటి వాసన వలన బల్లులు ఆ దరిదాపులకు రావు. లేదా వెల్లుల్లి రసాన్ని తయారు చేసి, నీళ్లలో కలిపి ఇంట్లో కొన్ని చోట్లలో స్ప్రే చేయండి. కొన్ని వెల్లుల్లిని మీ ఇంటి తలుపులు మరియు కిటికీల వద్ద ఉంచవచ్చు. ఇవి తప్పకుండా బల్లులను రాకుండా ఆపుతాయి.

కాఫీ పొడి

కాఫీ పొడి బల్లులను చంపగలదు. కాఫీ పొడిని, పొగాకు పొడిని కలిపి చిన్న బంతులలా చేసి ఇంట్లో అన్ని మాలల్లో వాటిని విస్తరించండి. బల్లులు మాములుగా ఉండే అల్మారుల వెనుక ఈ బంతులను ఉంచండి. అవి వీటిని తిన్న వెంటనే చనిపోతాయి. మీరు వీటి శరీరాన్ని తీసివేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి అత్యంత విషపూరితమైనది.

ఉల్లిపాయలు

వీటి గాఢమైన వాసన బల్లులను దూరంగా ఉంచుతుంది. వీటిని తలుపుల పక్కన లేదా బల్లులు ఎక్కువ ఉండే చోట్లలో ఉంచండి. ఉల్లిపాయ రసాన్ని నీటిలో కలిపి స్ప్రే చేయండి. ఇది తప్పకుండా బల్లులను ఇంటి నుంచి వెళ్లగొడతాయి.

మిరియాలు

మిరియాల స్ప్రే ఉపయోగించి కూడా మీరు బల్లులను వెళ్లగొట్టవచ్చు. మిరియాల పొడిని మరియు మిరప పొడిని నీటిలో కలిపి ఒక స్ప్రే లాగ తయారు చేసుకోవాలి. దీనిని వాడే ముందు బాగా కలపి చాలా చోటులలో స్ప్రే చేయండి. దీని యొక్క వాసన బల్లులను దూరంగా ఉంచుతుంది.

ప్లై పేపర్

ప్లై పేపర్స్ జంతువులను పట్టే బోను వలే పని చేస్తుంది. ఈ పేపర్లను గోడలపై అతికించండి. ముఖ్యంగా బల్లులు ఎక్కువగా ఉండే మూలలు, ట్యూబ్ లైట్ల పై, అల్మారుల వెనుక. ఇందులో బల్లులు తప్పించుకోవడానికి వీలు లేనంతగా చిక్కుకుంటాయి. మీరు చాలా సులభంగా వీటిని ఇంటి బయటకి తీసి వేయవచ్చు.

నాఫ్తలీన్ బంతులు

వీటిని మాములుగా ఇంట్లో నల్లులను తొలగించటానికి వాడుతాము. ఇవి బల్లులను కూడా తొలగించగలదు. వీటి యొక్క ఘాటైన వాసన బల్లులకు చాలా చిరాకు పుట్టిస్తుంది. దీని వలన అవి ఆ చోటు నుంచి వెంటనే వెళ్లిపోతాయి. ఈ బంతులను బల్లులు ఎక్కువగా తిరిగే చోట్లలో ఉంచండి.

టబాస్కో సాస్

ఇది ఒక కారమైన సాస్. దీనిని నీటిలో కలుపుకొని ఒక స్ప్రేలా తయారు చేసుకోండి. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఈ స్ప్రేని చల్లండి. దీని యొక్క వాసన ఇంటిలోని బల్లులను పారిపోయేలా చేస్తుంది.

చల్లని నీళ్లు

బల్లులు ఉష్ణోగ్రత యొక్క అగస్మాతు మార్పులను తట్టుకోలేదు. మీరు బల్లిని చూచినప్పుడు చల్లని నీళ్లను వాటిపై పోయండి. అది ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా ఉండిపోతుంది, ఆ సమయంలో దీనిని తీసి బయట పారవేయవచ్చు.

నెమలి ఈకలు

బల్లులు నెమలి ఈకలను చూసి భయపడతాయి. బల్లులు నివసించే గోడపై నెమలి ఈకలను అంటించవచ్చు. అలాగే ఫ్లవర్ వాజ్లో కూడా పెట్టవచ్చు. వీటి వలన బల్లులు మీ ఇంటి నుండి పారిపోతాయి.

తలుపులు మరియు కిటికీలను మూసిపెట్టుట

చివరిగా మీరు చేయగలిగే మరో విషయం మీ ఇంటి తలుపులను కిటికీలను మూసి పెట్టుట. లోపలికి రావటానికి వీలులేనందున అవి రావు. ఇది అన్నింటికన్నా సులువైన పద్దతి. ఎందుకంటే ఒక సరి ఇంటిలోకి వచ్చిన తరువాత దానిని వెళ్లగొట్టడం చాలా కష్టం, అవి మీకు దొరకకుండా దాక్కుంటాయి.

బల్లులను దూరంగా ఉంచటానికి మరికొన్ని విధానాలు మీరు ప్రయత్నించవచ్చు. బల్లి బలమైన వాసనలకు స్పందిస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. బలమైన వాసనలను ఉపయోగించి వీటిని ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చు.

Posted on

Telugu remedies for blisters- నాలుకపై బొబ్బలను(బ్లిస్టర్స్) తొలగించేందుకు ప్రాకృతిక నివారణలు

బొబ్బలు విటమిన్ల లోపం వళ్ళ ఏర్పడే ఒక ఆరోగ్య పరిస్థితి. కొన్నిసార్లు అనుకోకుండా మనం నాలుకను కొరికినప్పుడు కూడా రావచ్చు. నాలుక మంట వలన, ఆహార అలర్జీలు, నోటి పుండు మరియు వైరల్ సంక్రమణ వలన కూడా బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ సి లోపం వలన కూడా కావచ్చు. కొంత మందికి ప్రస్తుతం వేరే ఆరోగ్య సమస్యల కోసం తీసుకుంటున్న మందుల వలన కూడా రావచ్చు.

బొబ్బలు చాలా రకాలు, కొన్ని చర్మం రంగులలో, కొన్ని పసుపు మరియు ఎరుపు రంగులలో ఉంటాయి. ఇది ఆహారాలను భుజించేటప్పుడు చాలా చిరాకును పుట్టిస్తుంది. వీటిని గుణపరిచేటందుకు కొన్ని సహజ విధానాలను చూద్దాం.

నాలుక మీద బొబ్బలు నయం చేయటం ఎలా?

ఇది చాలా నొప్పిని కలిగించే ఒక సంక్రమణ. మీ నోటిలో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలు కాదు. ఇది పిల్లలకు లేదా పెద్దలకు పెదాలపై, నోటి లోపల భాగాలలో లేదా నాలుక పైన రావచ్చు. ఇవి బాగా నొప్పిగా ఉండేందువలన సరిగ్గా తినడానికి కూడా వీలు కాదు. వీటిని నివారించేందుకు కొన్ని గృహ నివారణ పద్ధతులను చూద్దాం. ఇవి తప్పకుండా మీ నొప్పిని మరియు బ్లిస్టర్స్ ను తొలగిస్తుంది.

గృహ నివారణలు

బేకింగ్ సోడా

ఇది చాలా సాధారణమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా బేకింగ్ సోడాను కలుపుకొని నోట్లో 3 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేసినట్లయితే బొబ్బలు తగ్గిపోతాయి.

కలబంద

కలబంద గురించి మీరు వినే ఉంటారు, ఇది చాలా ఉపయోగకరమైన చెట్టు. దీనిని బ్లిస్టర్స్ ను తొలగించేందుకు కూడా వాడవచ్చు. ఇందులోని జెల్‌ను నోటి బొబ్బలపై రాసి 5 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

మంచు గెడ్డ (ఐస్)

ఇది చర్మాన్ని మొద్దుబారేలా చేయటంవలన నొప్పిని తగ్గిస్తుంది. మంచు గెడల్ని మీ నోటి బొబ్బల పై మెల్లగా రుద్దండి . ఇది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

పసుపు

ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు నోట్లో లేదా పెదాలపై ఉన్న కురుపులను తగ్గించేందుకు తోడ్పడుతుంది. వెంటనే ఉపశమనాన్ని పొందేందుకు ఒక టీస్పూన్ తేనెలో పసుపును కలిపి కురుపులపై రాసి 3 నిమిషాల తరువాత కడగండి. ఇలా రోజుకు మూడు సార్లు చేయటంవలన తొందరగా ప్రభావం చూపిస్తుంది.

ఉప్పు

ఉప్పుని ఉపయోగించటం వలన బొబ్బలవల్ల కలిగే మంటను మరియు నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా ఉప్పుని కలిపి కనీసం 30 సెకండ్లు పుక్కిలించాలి. ఆ తరువాత ఉప్పుని బొబ్బలపై రాసి ఒక నిమిషం ఉంచి వెచ్చని నీటితో కడగండి. బొబ్బలు తగ్గేవరకూ ఇలా రోజుకు 45 సార్లు చేయండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులో యాంటీ-బాక్టీరియల్  మరియు క్రిమిసంహారక లక్షణాలు ఉన్నందున ఇది సంక్రమణాలను తగ్గిస్తుంది.3% హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను మాత్రమే వాడాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నీటిని సమంగా కలిపి ఒక పత్తిని ఈ ద్రవంలో తడిపి బ్లిస్టర్స్ పై రాయాలి. రెండు నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు కొన్ని సార్లు చేయండి.

గమనిక : హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని తక్కువ మోతాదులలో వాడాలి. ఎక్కువ వాడకూడదు.

తులసి

తులసిలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది మంటను మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి ఆకులను బాగా కడిగి, కొన్నింటిని బాగా నమిలి తినాలి. ఇలా 3 లేదా 4 రోజులు తినటం వలన బొబ్బలు తగ్గిపోతాయి.

తేయాకు చెట్టు నూనె

ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు బ్లిస్టర్స్ ను తొలగిస్తాయి. ఒక కప్ నీళ్లలో కొన్ని చుక్కల తేయాకు చెట్టు నూనెని వేసుకొని రోజుకు రెండు సార్లు మౌత్ వాష్ లాగా వాడండి.

కొత్తిమీర/ధనియాలు

ఇందులోని యాంటీ-ఇంఫ్లమేషన్ మరియు యాంటీ సెప్టిక్ గుణాల వలన మంటను మరియు నొప్పిని తగ్గించి బ్లిస్టర్స్ ను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది.

ఒక కప్పు నీటిలో ధనియాలు లేదా కొత్తిమీరను వేసి బాగా ఉడకబెట్టండి. ఈ నీటితో నోటిని బాగా కడగండి. ఇలా రోజుకు 3-4 సార్లు చేయటం వలన బొబ్బలు తొలగిపోతాయి.

విటమిన్ బి

విటమిన్ బి లోపం వలన కూడా ఈ బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఇవి తొలగిపోతాయి.

పాలు, పెరుగు, చీస్ మరియు తృణధాన్యాలు, గుడ్లు, సాల్మన్ చేప, ఓట్స్, ఊక, అవకాడొలు, అరటి పండ్లు, టర్కీ( సీమ కోడి) మరియు కాలేయం, వీటన్నిటి లో విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు విటమిన్ బి మందులను కూడా తీసుకోవచ్చు.

బొబ్బలు ఉన్నప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

 • మీ పళ్ళతో బ్లిస్టర్స్ ను గోక వద్దు. ఇది మంటను పెంచుతుంది. ఇందువలన వీటిని నివారించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
 • ఎక్కువ నీరు త్రాగటం చాలా అవసరం. నీరు త్రాగటం వలన బొబ్బలు ఎక్కువ కాకుండా ఉంటుంది. నాలుక తడిగా ఉండటం వలన నొప్పి తగ్గుతుంది.
 • చల్లని నీళ్లలో ఉప్పుని కలుపి నోరును పుక్కిలించండి. ఇది నోటిని శుభ్రం చేసి బాక్టీరియాలను తొలగిస్తుంది. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయటం వలన గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.  అంతే కాదు ఇది మీ నోటిని తాజాగా ఉంచుతుంది.
 • తరచూ పళ్ళను తోమి బాక్టీరియాలను తొలగించండి.
 • మీ నోట్లో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు చల్లని పదార్థాలను తినండి. ఉదాహరణకు చల్లని నీళ్ళు, చల్లని పాలు, ఐస్ క్రీమ్స్, ఫల రసాలు లాంటివి. ఇది మీ నాలుకను తడిగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
 • కాఫీ, టీ లాంటి వేడి మరియు కార మైన పదార్థాలను తినకండి. ఇవి నొప్పిని పెంచుతుంది.
 • మీరు ఏదైనా మౌత్ వాష్లను వాడుతునట్లయితే, సంక్రమణం వ్యాపించకుండా ఉండేందుకు కొద్ది రోజులు వాడడం మానండి. వీటికి బదులుగా తేయాకు నూనెని వాడండి.
 • మీరు రోజు తినే ఆహారంలో అల్లం మరియు వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోండి. రోజూ తినడం వలన ఇది బ్లిస్టర్స్ ఎక్కువ కాకుండా ఆపుతుంది.
 • ఎక్కువ కారం ఉండే పదార్థాలను మరియు ఎక్కువ ఆసిడ్స్ ఉండే పదార్థాలను తీసుకోవద్దు. ఎక్కువ తీపును కూడా తినవద్దు.
 • మెత్తగా ఉండే ఆహార పదార్థాలను తినండి. ఎందుకంటే ఇవి నమలటానికి సులువుగా ఉంటాయి.
 • మీకు తరచూ ఈ బ్లిస్టర్స్ వస్తున్నట్లయితే, సోడియం లరిల్ సల్ఫేట్(SLS ) ఉండే పేస్టులను వాడవద్దు.

బ్లిస్టర్స్ తగ్గటానికి మరియు రాకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు

 • రోజుకు రెండు సార్లు పళ్ళు తోమండి.
 • విటమిన్స్ మరియు పోషక ఆహారాలను తినండి.
 • పెప్సీ, కోక్ లాంటి అసిడిటీ కలిగించే పానీయాలు త్రాగకుండా నివారించండి.

మీ బ్లిస్టర్స్ రెండు వారాలకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించి కారణాలను తెలుసుకొని తగిన మందులను వాడండి.

Posted on

Best dark circle removal creams in Telugu – కంటి చుట్టూ నల్లని వలయాలను(డార్క్ సర్కిల్స్) తొలగించేందుకు ఉత్తమ క్రీమ్స్

శరీరంలో అతి పెద్ద అవయవంగా పిలవబడేది చర్మం. మన శరీరం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం కావాలని కోరుకునే వాళ్లకు కంటి చుట్టూ ఉన్న నలుపు చాలా ఇబ్బంది పెడుతుంది. అలంకరణ సామగ్రుల ద్వారా ఈ నలుపును తెలియకుండా కప్పి వేయవచ్చు, కానీ ఇది పరిష్కారం కాదు. ఎక్కువ కెమికల్స్ ఉన్న అలంకరణ సామగ్రులను వాడటం కూడా అంత మంచిది కాదు.

ఆరోగ్యమైన పద్దతిలో వీటిని తొలగించేందుకు వివిధ రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ చర్మానికి సరిపడే క్రీమ్‌ను మీరు ఎంపిక చేసుకోవచ్చు.

దాదాపు 70 శాతం ప్రజలకు కంటి చుట్టూ నలుపు మరియు ముడతలు(వ్రిన్కుల్స్) ఉన్నందున ఈ క్రీమ్స్ ప్రధానంగా మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని ఉత్తమ క్రీమ్స్ ను చూద్దాం.

మమ ఎర్త్ అండర్-ఐ క్రీమ్

Mama Earth Under-Eye Cram[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఆధునిక పద్దతిలో తయారు చేయబడిన ఈ అద్వితీయ మైన క్రీమ్ మీ చర్మం లోని సహజ అందాన్ని పునరుజ్జీవింప చేస్తుంది. ఇందులో కెఫీన్,తెల్లని లిల్లీ మరియు దోసకాయలలోని సారం ఉన్నందున ఇది ఒక అద్భుతమైన సుగంధ మిశ్రమం. కంటి చుట్టూ ఉన్న చర్మంలో చమురును ఉత్పత్తి చేసే గ్రంథులు లేనందున ఈ క్రీమ్‌ను రాయటంతో చర్మాన్ని చల్లబరచి, చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇందులోని విటమిన్ సి వాపు మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావాన్ని మరియు చర్మంపై తేడాను మొదటి సారి రాసినప్పటినుంచే మీరు చూడవచ్చు.

అరోమా ట్రెజర్స్ అలీవెరా క్రీమ్ జెల్

Aroma Treasures Aloe Vera Cream Gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీ కంటి క్రింద ఉన్న ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని తొలగించటానికి అరోమా ట్రెజర్స్ యాంటీ ఏజింగ్ క్రీమ్ చాలా సమర్ధవంతమైనది. ఇందులోని కలబంద సారం మీ చర్మం లోని కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనే ప్రోటీన్‌లను ఉత్తేజ పరుస్తుంది. ఇది మీ కంటి క్రింద ఉన్న చర్మంలో తేమను(మాయిశ్చర్) పునరుద్ధరింపచేసి సున్నితమైన పొరను రక్షించడం ద్వారా మృదువుగా చేస్తుంది. ఇందులో యాంటీ-బాక్టీరియల్ మరియు యాంటీ-సెప్టిక్ గుణాలు ఉన్నందున అన్ని వయసుల వాళ్లూ దీనిని వాడవచ్చు.

హెర్బలిన్ అండర్ క్రీమ్

Herbline Under Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, తేనె మరియు ఈతచెట్టు మైనం(పామ్ వాక్స్) ల అరుదైన కలయికలతో చేయబడిన ఒక అద్భుతమైన క్రీమ్. ఇందులోని కలబంద చర్మంలో మంటను తగ్గించి ఆరోగ్యంగానూ, యవ్వనంగానూ ఉండేలా చేస్తుంది. ఇది మీ చర్మాన్ని చల్లబరచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ క్రీమ్ లోని పామ్ వాక్స్ మీ చర్మం లోతుల దాకా వెళ్లి పుండులను నివారించి చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేయటం వలన మీ చర్మం సహజంగా ప్రకాశిస్తుంది. ఇందులోని తేనె మీ చర్మం యొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

బ్లిస్స్ ట్రీ అండర్ ఐ క్రీమ్

Bliss Tree Under-Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక నునుపైన మరియు విలాసవంతమైన సుగంధ మిశ్రమం. ఇది 100 శాతం ప్రాకృతికమైనది, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ పరాబెన్లు కానీ లేవు. ఇందులో విటమిన్ ఎ, కలబంద, విటమిన్ ఇ, విటమిన్ డి, చేమంతుల సారం, నారింజ నూనె, గ్లిసరిన్ మరియు ప్రోఆంథోసైటిన్ లు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని పునరుజ్జీవింప చేసి తేమను పునరుద్ధరిస్తుంది. అంతేకాదు ఈ క్రీమ్ మీ చర్మాన్ని నిరంతరం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఆర్గానిక్ తెరపి అండర్ ఐ కామింగ్ క్రీమ్

Organic Therapie Under Eye Calming Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్ సువాసన కలిగిన నూనెల (అరోమా ఆయిల్స్) మిశ్రమంతో తయారు చేయబడినది. ఇది మీ కంటి క్రింద ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని గుణ పరుస్తుంది. ఇందులోని విటమిన్ కె మరియు ప్రో-రెటినోల్ (విటమిన్ ఏ) కంటి చుట్టూ ఉన్న ముడతల్ని తొలగించి సున్నితమైన చర్మాన్ని హైడ్రేట్ చేసి ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇందులో బంగాళదుంప సారం ఉన్నందున డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను వేగంగా తొలగిస్తుంది.

కాసా అండర్ ఐ క్రీమ్ ఫర్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్

Kasa Under Eye Cream for Dark Circles and Puffiness[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, చామంతి సారం, బాదాం మరియు ములెతీల యొక్క అరుదైన మిశ్రమాలతో తయారు చేయబడినది. డిహైడ్రేషన్ వలన వచ్చిన కంటి నలుపును మరియు వాపును తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ ఉన్న చర్మానికి కావలసిన మినరల్స్ మరియు విటమిన్లను అందజేసి పోషణ ఇస్తుంది.

VLCC ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

VLCC almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నల్లని వలయాలను తగ్గించేందుకు వాడే ఈ క్రీమ్ 15ml జార్లో కూడా లభిస్తుంది. ఇందులోని ముఖ్య ప్రాకృతిక పదార్థాలు: చామంతి – ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి రాడికల్స్ ను తొలగిస్తుంది. బాదాం – మీ చర్మం యొక్క నాణ్యతను పెంచేందుకు మరియు యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. విటమిన్ ఇ మరియు ఆలివ్ నూనె – ఇది మీ చర్మంపై మాయిశ్చరైజర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తుంది.

అరోమా మేజిక్ అండర్ ఐ జెల్

Aroma magic under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

అరోమా మేజిక్ జెల్ కూడా మీ డార్క్ సర్కిల్స్ కు ఒక పరిష్కారం. ఇందులో యాంటీ- వ్రిన్కుల్ (ముడతలను తగ్గించే) లక్షణాలు ఉన్నాయి. మాములుగా వృద్ధాప్య ప్రక్రియలో ఎక్కువ ఒత్తిడి వలన మరియు సరైన నిద్ర లేకపోవడం వలన మీ కళ్ళు చాలా అలసిపోతాయి. ఇలాంటి సమస్యను తొలగించేందుకు మీరు ఈ అరోమా మేజిక్ జెల్‌ను వాడవచ్చు. ఇది మీ కళ్లలో చైతన్యం నింపుతుంది. అంతేకాదు ఇందులోని ఎస్సెన్షియల్ ఆయిల్స్ మీ కంటి అలసటను, డార్క్ సర్కిల్స్ ను మరియు వాపును తొలగించేందుకు కూడా ఉపయోగ పడుతుంది.

హిమాలయ హేర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Himalaya herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

వివిధ రకాలైన మూలికల ఉత్పత్తులను తయారు చేయడంలో హిమాలయ ఒక విష్వశీయమైన బ్రాండ్. వీటిలో అండర్ ఐ క్రీమ్ అన్నింటికంటే ఉత్తమమైన మరియు అద్భుతమైన ప్రభావం కలిగినది. మీ కంటి చుట్టూ విభిన్నమైన నలుపు ఉన్నట్లయితే హిమాలయ అండర్ ఐ క్రీమ్ సమర్ధవంతమైన పరిష్కారం. ఇది మీ నల్లని వలయాలను తొలగించటమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైస్ చేసి ముడతలను కూడా తొలగిస్తుంది. ఈ క్రీమ్‌ను వాడండి కొద్దీ రోజుల్లోనే తేడాను చూడండి.

ఎలైట్ అడ్వాన్స్డ్ డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ ఐ క్రీమ్

Elite advanced dark circles correcting eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఇతర క్రీమ్స్ తో పోల్చుకుంటే ఖరీదైనది కావచ్చు, కానీ ఇది వాడడం వలన డార్క్ సర్కిల్స్ ను అతి వేగంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు, మిగిలిన క్రీమ్స్ ఒక నెల రోజులలో తగ్గించే నలుపును ఈ ఎలైట్ క్రీమ్ ఒకే వారంలో తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ నలుపుకు కారణం అయిన వర్ణ ద్రవ్యాలను నిర్మూలిస్తుంది, మీరు మీ చర్మం యొక్క అసలైన రంగును నిశ్చయముగా తిరిగి పొందుతారు. ఇది చర్మం లోని మంటను కూడా తగ్గించి అందంగా చేస్తుంది. ఈ క్రీమ్ అన్ని ఆన్‌లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

షనాస్ హుసైన్ షాస్మూత్ ప్లస్ ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

Shahnaz Husain Shasmooth plus almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీరు నిజంగా మీ కంటి చుట్టూ ఉన్న నలుపును తొలగించాలని అనుకొంటున్నట్లయితే షనాస్ హుసేన్ యొక్క ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్ ను ఉపయోగించండి. ఇందులో బాదాం యొక్క గుణాలు ఉన్నందున ఇది డార్క్ సర్కిల్స్ మరియు వాపును తగ్గించి మీ చర్మాన్ని పోషిస్తుంది. ఇది మీ కంటి చుట్టూ ఉన్న ముడతలను కూడా తొలగిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ మరియు అత్యంత అధికంగా వాదే క్రీమ్.

బయోటిక్ బయో ఆల్మండ్ సూతింగ్ అండ్ నరిషింగ్ ఐ క్రీమ్

Biotique Bio Almond Soothing and Nourishing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

బయో ఆల్మండ్ క్రీమ్ ఉపయోగించటం వలన మీ కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలకు ప్రాకృతిక పోషణ ఇవ్వబడుతుంది. ఇందులోని బాదాం లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నందున ఇది మీ చర్మం లోతుల దాకా వెళ్లి మాయిశ్చరైస్ చేస్తుంది. మీ కంటి పఫీనెస్ ను మరియు ముడతలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

ఆప్టిమల్స్ వైట్ సీఇంగ్ ఐ క్రీమ్

Oriflame Optimals White Seeing Is Believing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఓరీఫ్లేమ్ యొక్క ఈ క్రీమ్‌ను స్కిన్ లైటెనింగ్ కాంప్లెక్స్ తో రూపొందించారు. ఇది డార్క్ సర్కిల్స్ ను కొద్ది సమయం లోనే సమర్ధవంతంగా తొలగిస్తుంది. ప్రాకృతిక ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ క్రీమ్‌ను ఎంపిక చేసుకోండి. ఈ క్రీమ్ లో హైడ్రేటింగ్ సమ్మేళనాలు మరియు కెఫీన్లు ఉండటం వలన కంటి చుట్టూ వున్న చర్మంలో సూక్ష్మ ప్రసరణను పెంచి డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ మరియు SPF లు చర్మాన్ని సంరక్షిస్తాయి.

లోరియాల్ పారిస్ డెర్మో ఎక్స్పెర్టైస్ యూత్ కోడ్ ఐ క్రీమ్

L’Oreal Paris dermo expertise youth code eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ యూత్ కోడ్ క్రీమ్ విస్తృతమైన పరిశోధన యొక్క ఉత్పత్తి. ఇందులోని సమృద్ధమైన ప్రో-జెన్ TM టెక్నాలజీ మీ కంటి క్రింద ఉన్న చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని మాయిశ్చరైసింగ్ సూత్రం చర్మాన్ని సున్నితంగా చేసి ప్రాకృతిక ప్రకాశాన్ని ఇస్తుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ క్రీమ్ ను మీరు రాసుకున్న 10 నిమిషాల్లోనే తేడాను చూడవచ్చు.

ఖాదీ ప్రీమియం హెర్బల్ అండర్ ఐ క్రీమ్

Khadi Premimum herbal under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ మూలికల మిశ్రమం మీ కంటి క్రింద ఉన్న చర్మాన్నీ మృదువుగా చేసి నల్లని వలయాలను తొలగించటంలో తోడ్పడుతుంది. ఇందులో బేర్ బెర్రీ, బొప్పాయి, బాదాం మరియు దోసకాయల యొక్క సారం ఉన్నందున చర్మంలోని పిగ్మెంటేషన్ మరియు పఫీనెస్ తగ్గించి ప్రకాశింపచేస్తుంది. దీనిని క్రమంగా వాడటం వలన చర్మంపై ఉన్న ముడతలు, గీతాలు తొలగిపోతాయి.

లోటస్ హెర్బల్స్ నూట్రాఐ రీజువనేటింగ్ అండ్ కరెక్టింగ్ ఐ జెల్

Lotus herbals nutraeye rejuvenating and correcting eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక ప్రముఖమైన మూలికల ఉత్పత్తి. ఇందులో జల విశ్లేషణ, గోధుమ ( హైడ్రోలైజ్డ్ వీట్ ) ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవి కంటి క్రింద ముడతలను తొలగిస్తుంది. ఇందులోని ‘సొయా బయో పెప్టైడ్స్’ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. ఇందులోని బియ్యం తవుడు, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ లు చర్మాన్ని హైడ్రేట్ చేసి చైతన్యం నింపడంవలన చర్మం యవ్వనంగా ఉంటుంది.

DCR డార్క్ సర్కిల్ రిమూవర్ లోషన్

DCR dark circle remover lotion[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమమైన క్రీమ్. ఈ క్రీమ్ వాడటం వలన మీ డార్క్ సర్కిల్స్ ను త్వరగా తొలగించవచ్చు.

వావ్ అల్టిమేట్ అండర్ ఐ అండ్ ఫేషియల్ జెల్

Wow ultimate under eye and facial gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇతర క్రీమ్లతో పోల్చుకుంటే ఇది కొంచం ఖరీదైనదిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అండర్ ఐ క్రీమ్ మాత్రమే కాదు ఫేషియల్ జెల్ కూడా. ఇది మీ చర్మానికి ఎలాంటి హానీ కలిగించని సురక్షితమైన జెల్. సహజమైన అందమైన ముఖం కోసం ఈ జెల్‌ని వాడండి. ఇది ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లలో లభిస్తుంది.

డార్క్ అవే డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ క్రీమ్

Dark away dark circles correcting cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

 

ఇది దిగుమతి చేయబడిన క్రీమ్. ఇది రక్తంలో పిగ్మెంటేషన్ వలన వచ్చే డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. మీ కంటి క్రింద కలిగే మంటను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వాడటం వలన మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ క్రీమ్‌ను వాడి చూడండి. ఇది మీ డార్క్ సర్కిల్స్ ను తొలగించి సంతృప్తిని కలిగిస్తుంది.

St.బొటానికా అండర్ ఐ క్రీమ్

St.Botanica under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది యాంటీ ఏజింగ్, యాంటీ వ్రిన్కుల్స్ (ముడతలు) మరియు డార్క్ సర్కిల్స్ కు సమర్థవంతమైన క్రీమ్. హైలోరోనిక్ ఆసిడ్, మొరాకన్ అర్గన్ ఆయిల్, విటమిన్ ఇ, విటమిన్ బి3, కలబంద సారం ,అతి మధురపు వేర్ల సారం(లిక్విఓరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్), దోసకాయ సారం, కెఫీన్ లాంటి సమర్ధవంతమైన పదార్థాలతో చేయబడినది. కంటి చుట్టూ ఉన్న చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకూ ఇది పరిష్కారం. ఇందులోని దోసకాయ సారం చర్మాన్ని మృదువుగా చేసి వాపును తగ్గిస్తుంది. ఇందులోని ‘ప్లాంట్ స్టెమ్ కణాలు’ మరియు ‘పెప్టైడ్స్’ చర్మాన్ని చైతన్యం చేస్తుంది. హైలోరోనిక్ ఆసిడ్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ క్రీమ్‌ను కల్లకే కాదు, బుగ్గలపై మరియు నుతుడిపై కూడా రాయవచ్చు.

గార్నియర్ స్కిన్ నాచురల్స్ వైట్ కంప్లీట్ ఐ రోల్-ఆన్

Garnier skin naturals white complete eye roll-on[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

గార్నియర్ లో చాలా రకాల చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ మరియు అలంకరణ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఐ రోల్-ఆన్ డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తాయని చర్మ శాస్త్రం ప్రకారం నిరూపించబడినది. ఇందులో కెఫీన్ మరియు ప్రో విటమిన్ బి15 లాంటి పదార్థాలు ఉన్నాయి. కెఫీన్ చర్మాన్ని ఉత్తేజ పరిచి అందంగా చేస్తుంది.

వాడి హెర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Vaadi herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ ఉన్న చర్మంలో నూనె గ్రంథులు లేనందున ఎక్కువ పోషణ అవసరం. ఎక్కువ సేపు పనిచేయటం వలన, నిద్ర లేక పోవటం వలన సరైన పౌష్టిక ఆహారాలు తీసుకోనందున లేదా ఎక్కువగా ఎండలో తిరగటం వలన కూడా డార్క్ సర్కిల్స్, పఫీనెస్ మరియు ముడతలు వస్తాయి. ఈ హెర్బల్ క్రీమ్ తొలగిస్తుంది. ఇందులో దోసకాయ, రోజా మరియు బాదాంల యొక్క సారం ఉన్నందున ఇది చర్మాన్ని తెల్లగాను ప్రకాశవంతంగాను చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా మరియు యవ్వనంగా చేస్తుంది.

నేచర్స్ ఎసెన్స్ డార్క్ సర్కిల్ అండ్ పఫీనెస్ రెడ్యూస్డ్ ఐ క్రీమ్

Nature’s essence dark circle and puffiness reduced eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గించే ఈ క్రీమ్లో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు, బాదాం నూనె మరియు ఇతర అంశాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మృధువుగా చేసి హైడ్రేట్ చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. దీనిని ప్రతి రోజూ పడుకునే ముందు మీ కంటి చుట్టూ పూయండి.

సాత్త్విక్ ఆర్గానిక్స్ ఐ కేర్

Sattvik organics eye care[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక కంటి సంరక్షణ క్రీమ్. ఇందులోని అరోమా నూనెలు చర్మాన్ని చైతన్యవంతంగా మరియు హైడ్రేట్ చేసి డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగిస్తుంది. ఈ క్రీమ్ మీ వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి యవ్వనంగా వుంచుతుంది. ఇది రక్త ప్రసరణను ఉత్తేజ పరుస్తుంది. ఈ క్రీమ్‌ని రోజూ రాత్రి కంటి చుట్టూ రాయండి.

ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్

Organic harvest under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నిస్తేజ చర్మం, పఫీనెస్ మరియు డార్క్ సర్కిల్స్ లాంటి అనేక సమస్యలు సరైన రక్త ప్రసరణ లేనందున వస్తుంది. ఈ దట్టమైన జెల్ మీ కంటి చుట్టూ రక్త ప్రసరణను మెరుగు చేసి స్కిన్‌ టోన్ మరియు రంగును పెంచుతుంది, ముడతలతో మరియు వృద్ధాప్య లక్షణాలతో పోరాడుతుంది, డార్క్ సర్కిల్‌ను తగ్గిస్తుంది. అనేక చర్మ సమస్యలను వదిలించుకోవడానికి ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్ ఉపయోగించవచ్చు.

2N ఐమెడ్ ఆస్ట్రేలియా 15 డేస్ డార్క్ సర్కిల్ రిమూవర్ క్రీమ్

2N EyeMed Australia 15 Days Dark Circle Remover Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్‌లోని హాలోక్సయిల్రక్త ప్రసరణను మెరుగు చేసి డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఐశేరాయిల్ చర్మంయొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి పఫీనెస్ని తొలగిస్తుంది. రేనోవాజ్ లోని యాంటీ-యేజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

Posted on

Protein rich foods in Telugu – ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు

మన శరీరంయొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ స్థూల పోషక పదార్థం. ఎక్కువ ప్రోటీన్స్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రోటీన్ లోపిస్తే కండరాలు క్షీణిస్తాయి. ప్రోటీన్స్ మొత్తం 20 అమైనో ఆమ్లాల(అమైనో ఆసిడ్స్) సేకరణను కలిగి ఉంటుంది. ఇందులోని 8 ముఖ్యమైన (ఎస్సెంషియల్) అమైనో ఆసిడ్స్ ను మనం రోజూ తినే ఆహారం ద్వారా శరీరానికి లభిస్తుంది. మిగిలిన 12 నాన్- ఎస్సెంషియల్ ఆసిడ్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. గుడ్లు మరియు మాంసాహారం లాంటి ఆహారాలలో కండరాల నిర్మాణంకు కావలసిన అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

కొన్ని ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ తొందరగా జీర్ణం అవుతాయి మరికొన్ని నిదానంగా జీర్ణించుకొని శరీరంలో శోషించబడతాయి. ఉదాహరణకు గుడ్లు, ఇది ప్రోటీన్ ఆహారాలలో రాజువంటిది. ఇందులో అన్ని (20) అమైనో ఆసిడ్స్ లు ఉన్నాయి, ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. మరోపక్క పాలు, ఇందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులోని ప్రోటీన్స్ కొన్ని వేగంగా మరి కొన్ని నిదానంగా అమైనో ఆసిడ్స్ ను విడుదల చేస్తాయి. పాల్లలో ప్రోటీన్స్ మాత్రమే కాదు ఎముకలకు బలాన్ని పెంచే కాల్షియము కూడా ఉంటుంది.

శరీరంయొక్క ప్రతి పనికి ప్రోటీన్స్ చాలా అవసరం. పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రోటీన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండలేరు. ఎన్నో రకాల ఆహారాలలో ప్రోటీన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినవి ఎంపిక చేసుకొని రోజూ తీసుకోండి.

శాకాహారులకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలలో కొన్ని పాల్లు, పెరుగు, జున్ను(చీస్), గింజలు (బీన్స్) , కాయధాన్యాలు (లెంటిల్స్) మరియు విత్తనాలు. మరికొన్ని తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు కాటేజ్ చీజ్, గ్రీక్ చీజ్, తెల్లటి పుట్టగొడుగులు, వెన్నతీసిన పాలు ( స్కిమ్డ్ మిల్క్) మరియు నాటో (పులియబెట్టిన సోయాబీన్స్). పాల్ల ఉత్పత్తులే కాకుండా పళ్ళలో మరియు గింజలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ధాన్యాలు

ధాన్యాలు ప్రధానమైన పోషక ఆహార పదార్థం. ఇది శరీరానికి కావలసిన కేలరీలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ప్రొటీన్లను అందిస్తుంది. ఇతర ధాన్యాలకన్నా బఠానీలు, రాజ్మా మరియు పెసర పప్పులు లాంటి తృణధాన్యాలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫైన్డ్ (సుద్దిచేసిన గింజలు) గింజలను పాస్తాలు, పాన్ కేక్లు, స్మూతీస్ మరియు బ్రెడ్లు చేసేటప్పుడు వాడవచ్చు. గోధుమ బీజ, వండిన ఓట్స్ తవుడు, బియ్యం తవుడు మరియు ఓట్స్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువుగా ఉంటుంది.

కూరగాయలు

కూరగాయలు ఉత్తమ ప్రోటీన్ ఆహారాలు. మొలకెత్తిన బీన్స్, బటానీలు మరియు కాయధాన్యాలు (లెంటిల్స్) ప్రోటీన్లకు మూల పదార్థాలు. మరికొన్ని-వండిన లిమా బీన్స్, ఆకుపచ్చ బటానీలు, మొక్కజొన్న, బ్రొక్కొలి మరియు పుట్టగొడుగులు.

పండ్లు

ప్రోటీన్ పదార్థాలలో మరో ముఖ్యమైన ఆహారం తాజా పండ్లు. కూరగాయలతో పోల్చుకుంటే పండ్లలో తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. రైసిన్లు, అక్రోట్లు, జీడిపప్పులు లాంటి ఎండిన పండ్లలో(డ్రై ఫ్రూట్‌స్) ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జల్దారు, జామ పండ్లు, బొంత పళ్ళు(మల్బెర్రీస్) , బ్లాక్బెర్రీస్, స్టార్ ఫ్రూట్‌, కుంక్వాట్స్, పీచ్ పండు, దానిమ్మ పండ్లు మరియు ద్రాక్ష పండ్లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

గింజలు

బాదాం, పిస్తా పప్పులు, అక్రోట్, జీడిపప్పులు మరియు బఠానీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఇందులో సోడియం మరియు పొటాషియం కూడా ఉన్నందున వీటిని తిన్న వెంటనే మనకు కావలసిన బలాన్ని తక్షణమే ఇస్తుంది మరియు చెమట వలన శరీరం నుండి తొలగిపోయిన ఎలెక్ట్రోలైట్స్ ను సరఫరా చేస్తుంది. చాలా గింజలలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన పోషక పదార్థాలు ఉన్నాయి.

ఓట్స్

ఓట్స్ అన్నింటికంటే ఆరోగ్యవంతమైన ధాన్యాలు. ఇందులో అనేక పౌష్టిక పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం మరియు విటమిన్ B1 ఎక్కువగా ఉంటాయి. వీటిని తెల్లవారు జామున అల్పాహారంగా భుజించడం మంచిది.

కాటేజ్ చీజ్

ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కొవ్వు మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. కాల్షియం, ఫాస్ఫరస్(భాస్వరం), సెలీనియం మరియు విటమిన్ బి12 ఇందులోని ఇతర పోషక పదార్థాలు.

బ్రొక్కొలి

ఇతర కూరగాయలకన్నా ఇందులో ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కేలరీలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ మరియు పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నాయి.

క్వినోవ

సమీప కాలంలో చాలా ప్రముఖమైన ఒక ఆహార పదార్థం క్వినోవ విత్తనాలు. వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటి-ఆక్సిడెంట్ ఉన్నందున ఆరోగ్యానికి చాల మంచిది.

గ్రీక్ పెరుగు

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది మిఠాయి దుకాణాలలో కూడా దొరుకుతుంది. దీనిని విడిగానే తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది.

యెహెజ్కేల్ బ్రెడ్

ఇది మొలకెత్తిన తృణధాన్యాలతో తయారు చేయబడినది. వీటిని సోయాబీన్స్, బార్లీ, చిరు ధాన్యాలు మరియు గోధుమతో కూడా తయారు చేస్తారు. ఈ బ్రెడ్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు

మనం రోజూ వంటలో గుమ్మడికాయను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వీటి గింజలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలియదు. ఇందులో ప్రోటీన్స్ మాత్రమే కాదు, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలు కూడా ఉన్నాయి.

మాంసాహారుల కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

మాంసం మరియు చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. తూర చేప(ట్యూనా), సాల్మోనాండ్ హాలిబుట్ చేప, స్నాపర్, పెర్చ్ లాంటి చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. మాంసంలో కోడిమాంసం, ఆవు మాంసం మరియు పంది మాంసాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది.

కోడిమాంసం లోని రొమ్ములు

ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రుచికరమైన ఆహారంగా వండుట చాలా సులభం.

చిన్నరొయ్యలు

ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహారం.