Posted on

Best dark circle removal creams in Telugu – కంటి చుట్టూ నల్లని వలయాలను(డార్క్ సర్కిల్స్) తొలగించేందుకు ఉత్తమ క్రీమ్స్

శరీరంలో అతి పెద్ద అవయవంగా పిలవబడేది చర్మం. మన శరీరం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం కావాలని కోరుకునే వాళ్లకు కంటి చుట్టూ ఉన్న నలుపు చాలా ఇబ్బంది పెడుతుంది. అలంకరణ సామగ్రుల ద్వారా ఈ నలుపును తెలియకుండా కప్పి వేయవచ్చు, కానీ ఇది పరిష్కారం కాదు. ఎక్కువ కెమికల్స్ ఉన్న అలంకరణ సామగ్రులను వాడటం కూడా అంత మంచిది కాదు.

ఆరోగ్యమైన పద్దతిలో వీటిని తొలగించేందుకు వివిధ రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ చర్మానికి సరిపడే క్రీమ్‌ను మీరు ఎంపిక చేసుకోవచ్చు.

దాదాపు 70 శాతం ప్రజలకు కంటి చుట్టూ నలుపు మరియు ముడతలు(వ్రిన్కుల్స్) ఉన్నందున ఈ క్రీమ్స్ ప్రధానంగా మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని ఉత్తమ క్రీమ్స్ ను చూద్దాం.

మమ ఎర్త్ అండర్-ఐ క్రీమ్

Mama Earth Under-Eye Cram[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఆధునిక పద్దతిలో తయారు చేయబడిన ఈ అద్వితీయ మైన క్రీమ్ మీ చర్మం లోని సహజ అందాన్ని పునరుజ్జీవింప చేస్తుంది. ఇందులో కెఫీన్,తెల్లని లిల్లీ మరియు దోసకాయలలోని సారం ఉన్నందున ఇది ఒక అద్భుతమైన సుగంధ మిశ్రమం. కంటి చుట్టూ ఉన్న చర్మంలో చమురును ఉత్పత్తి చేసే గ్రంథులు లేనందున ఈ క్రీమ్‌ను రాయటంతో చర్మాన్ని చల్లబరచి, చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇందులోని విటమిన్ సి వాపు మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావాన్ని మరియు చర్మంపై తేడాను మొదటి సారి రాసినప్పటినుంచే మీరు చూడవచ్చు.

అరోమా ట్రెజర్స్ అలీవెరా క్రీమ్ జెల్

Aroma Treasures Aloe Vera Cream Gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీ కంటి క్రింద ఉన్న ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని తొలగించటానికి అరోమా ట్రెజర్స్ యాంటీ ఏజింగ్ క్రీమ్ చాలా సమర్ధవంతమైనది. ఇందులోని కలబంద సారం మీ చర్మం లోని కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనే ప్రోటీన్‌లను ఉత్తేజ పరుస్తుంది. ఇది మీ కంటి క్రింద ఉన్న చర్మంలో తేమను(మాయిశ్చర్) పునరుద్ధరింపచేసి సున్నితమైన పొరను రక్షించడం ద్వారా మృదువుగా చేస్తుంది. ఇందులో యాంటీ-బాక్టీరియల్ మరియు యాంటీ-సెప్టిక్ గుణాలు ఉన్నందున అన్ని వయసుల వాళ్లూ దీనిని వాడవచ్చు.

హెర్బలిన్ అండర్ క్రీమ్

Herbline Under Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, తేనె మరియు ఈతచెట్టు మైనం(పామ్ వాక్స్) ల అరుదైన కలయికలతో చేయబడిన ఒక అద్భుతమైన క్రీమ్. ఇందులోని కలబంద చర్మంలో మంటను తగ్గించి ఆరోగ్యంగానూ, యవ్వనంగానూ ఉండేలా చేస్తుంది. ఇది మీ చర్మాన్ని చల్లబరచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ క్రీమ్ లోని పామ్ వాక్స్ మీ చర్మం లోతుల దాకా వెళ్లి పుండులను నివారించి చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేయటం వలన మీ చర్మం సహజంగా ప్రకాశిస్తుంది. ఇందులోని తేనె మీ చర్మం యొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

బ్లిస్స్ ట్రీ అండర్ ఐ క్రీమ్

Bliss Tree Under-Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక నునుపైన మరియు విలాసవంతమైన సుగంధ మిశ్రమం. ఇది 100 శాతం ప్రాకృతికమైనది, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ పరాబెన్లు కానీ లేవు. ఇందులో విటమిన్ ఎ, కలబంద, విటమిన్ ఇ, విటమిన్ డి, చేమంతుల సారం, నారింజ నూనె, గ్లిసరిన్ మరియు ప్రోఆంథోసైటిన్ లు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని పునరుజ్జీవింప చేసి తేమను పునరుద్ధరిస్తుంది. అంతేకాదు ఈ క్రీమ్ మీ చర్మాన్ని నిరంతరం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఆర్గానిక్ తెరపి అండర్ ఐ కామింగ్ క్రీమ్

Organic Therapie Under Eye Calming Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్ సువాసన కలిగిన నూనెల (అరోమా ఆయిల్స్) మిశ్రమంతో తయారు చేయబడినది. ఇది మీ కంటి క్రింద ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని గుణ పరుస్తుంది. ఇందులోని విటమిన్ కె మరియు ప్రో-రెటినోల్ (విటమిన్ ఏ) కంటి చుట్టూ ఉన్న ముడతల్ని తొలగించి సున్నితమైన చర్మాన్ని హైడ్రేట్ చేసి ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇందులో బంగాళదుంప సారం ఉన్నందున డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను వేగంగా తొలగిస్తుంది.

కాసా అండర్ ఐ క్రీమ్ ఫర్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్

Kasa Under Eye Cream for Dark Circles and Puffiness[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, చామంతి సారం, బాదాం మరియు ములెతీల యొక్క అరుదైన మిశ్రమాలతో తయారు చేయబడినది. డిహైడ్రేషన్ వలన వచ్చిన కంటి నలుపును మరియు వాపును తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ ఉన్న చర్మానికి కావలసిన మినరల్స్ మరియు విటమిన్లను అందజేసి పోషణ ఇస్తుంది.

VLCC ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

VLCC almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నల్లని వలయాలను తగ్గించేందుకు వాడే ఈ క్రీమ్ 15ml జార్లో కూడా లభిస్తుంది. ఇందులోని ముఖ్య ప్రాకృతిక పదార్థాలు: చామంతి – ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి రాడికల్స్ ను తొలగిస్తుంది. బాదాం – మీ చర్మం యొక్క నాణ్యతను పెంచేందుకు మరియు యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. విటమిన్ ఇ మరియు ఆలివ్ నూనె – ఇది మీ చర్మంపై మాయిశ్చరైజర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తుంది.

అరోమా మేజిక్ అండర్ ఐ జెల్

Aroma magic under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

అరోమా మేజిక్ జెల్ కూడా మీ డార్క్ సర్కిల్స్ కు ఒక పరిష్కారం. ఇందులో యాంటీ- వ్రిన్కుల్ (ముడతలను తగ్గించే) లక్షణాలు ఉన్నాయి. మాములుగా వృద్ధాప్య ప్రక్రియలో ఎక్కువ ఒత్తిడి వలన మరియు సరైన నిద్ర లేకపోవడం వలన మీ కళ్ళు చాలా అలసిపోతాయి. ఇలాంటి సమస్యను తొలగించేందుకు మీరు ఈ అరోమా మేజిక్ జెల్‌ను వాడవచ్చు. ఇది మీ కళ్లలో చైతన్యం నింపుతుంది. అంతేకాదు ఇందులోని ఎస్సెన్షియల్ ఆయిల్స్ మీ కంటి అలసటను, డార్క్ సర్కిల్స్ ను మరియు వాపును తొలగించేందుకు కూడా ఉపయోగ పడుతుంది.

హిమాలయ హేర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Himalaya herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

వివిధ రకాలైన మూలికల ఉత్పత్తులను తయారు చేయడంలో హిమాలయ ఒక విష్వశీయమైన బ్రాండ్. వీటిలో అండర్ ఐ క్రీమ్ అన్నింటికంటే ఉత్తమమైన మరియు అద్భుతమైన ప్రభావం కలిగినది. మీ కంటి చుట్టూ విభిన్నమైన నలుపు ఉన్నట్లయితే హిమాలయ అండర్ ఐ క్రీమ్ సమర్ధవంతమైన పరిష్కారం. ఇది మీ నల్లని వలయాలను తొలగించటమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైస్ చేసి ముడతలను కూడా తొలగిస్తుంది. ఈ క్రీమ్‌ను వాడండి కొద్దీ రోజుల్లోనే తేడాను చూడండి.

ఎలైట్ అడ్వాన్స్డ్ డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ ఐ క్రీమ్

Elite advanced dark circles correcting eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఇతర క్రీమ్స్ తో పోల్చుకుంటే ఖరీదైనది కావచ్చు, కానీ ఇది వాడడం వలన డార్క్ సర్కిల్స్ ను అతి వేగంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు, మిగిలిన క్రీమ్స్ ఒక నెల రోజులలో తగ్గించే నలుపును ఈ ఎలైట్ క్రీమ్ ఒకే వారంలో తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ నలుపుకు కారణం అయిన వర్ణ ద్రవ్యాలను నిర్మూలిస్తుంది, మీరు మీ చర్మం యొక్క అసలైన రంగును నిశ్చయముగా తిరిగి పొందుతారు. ఇది చర్మం లోని మంటను కూడా తగ్గించి అందంగా చేస్తుంది. ఈ క్రీమ్ అన్ని ఆన్‌లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

షనాస్ హుసైన్ షాస్మూత్ ప్లస్ ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

Shahnaz Husain Shasmooth plus almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీరు నిజంగా మీ కంటి చుట్టూ ఉన్న నలుపును తొలగించాలని అనుకొంటున్నట్లయితే షనాస్ హుసేన్ యొక్క ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్ ను ఉపయోగించండి. ఇందులో బాదాం యొక్క గుణాలు ఉన్నందున ఇది డార్క్ సర్కిల్స్ మరియు వాపును తగ్గించి మీ చర్మాన్ని పోషిస్తుంది. ఇది మీ కంటి చుట్టూ ఉన్న ముడతలను కూడా తొలగిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ మరియు అత్యంత అధికంగా వాదే క్రీమ్.

బయోటిక్ బయో ఆల్మండ్ సూతింగ్ అండ్ నరిషింగ్ ఐ క్రీమ్

Biotique Bio Almond Soothing and Nourishing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

బయో ఆల్మండ్ క్రీమ్ ఉపయోగించటం వలన మీ కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలకు ప్రాకృతిక పోషణ ఇవ్వబడుతుంది. ఇందులోని బాదాం లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నందున ఇది మీ చర్మం లోతుల దాకా వెళ్లి మాయిశ్చరైస్ చేస్తుంది. మీ కంటి పఫీనెస్ ను మరియు ముడతలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

ఆప్టిమల్స్ వైట్ సీఇంగ్ ఐ క్రీమ్

Oriflame Optimals White Seeing Is Believing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఓరీఫ్లేమ్ యొక్క ఈ క్రీమ్‌ను స్కిన్ లైటెనింగ్ కాంప్లెక్స్ తో రూపొందించారు. ఇది డార్క్ సర్కిల్స్ ను కొద్ది సమయం లోనే సమర్ధవంతంగా తొలగిస్తుంది. ప్రాకృతిక ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ క్రీమ్‌ను ఎంపిక చేసుకోండి. ఈ క్రీమ్ లో హైడ్రేటింగ్ సమ్మేళనాలు మరియు కెఫీన్లు ఉండటం వలన కంటి చుట్టూ వున్న చర్మంలో సూక్ష్మ ప్రసరణను పెంచి డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ మరియు SPF లు చర్మాన్ని సంరక్షిస్తాయి.

లోరియాల్ పారిస్ డెర్మో ఎక్స్పెర్టైస్ యూత్ కోడ్ ఐ క్రీమ్

L’Oreal Paris dermo expertise youth code eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ యూత్ కోడ్ క్రీమ్ విస్తృతమైన పరిశోధన యొక్క ఉత్పత్తి. ఇందులోని సమృద్ధమైన ప్రో-జెన్ TM టెక్నాలజీ మీ కంటి క్రింద ఉన్న చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని మాయిశ్చరైసింగ్ సూత్రం చర్మాన్ని సున్నితంగా చేసి ప్రాకృతిక ప్రకాశాన్ని ఇస్తుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ క్రీమ్ ను మీరు రాసుకున్న 10 నిమిషాల్లోనే తేడాను చూడవచ్చు.

ఖాదీ ప్రీమియం హెర్బల్ అండర్ ఐ క్రీమ్

Khadi Premimum herbal under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ మూలికల మిశ్రమం మీ కంటి క్రింద ఉన్న చర్మాన్నీ మృదువుగా చేసి నల్లని వలయాలను తొలగించటంలో తోడ్పడుతుంది. ఇందులో బేర్ బెర్రీ, బొప్పాయి, బాదాం మరియు దోసకాయల యొక్క సారం ఉన్నందున చర్మంలోని పిగ్మెంటేషన్ మరియు పఫీనెస్ తగ్గించి ప్రకాశింపచేస్తుంది. దీనిని క్రమంగా వాడటం వలన చర్మంపై ఉన్న ముడతలు, గీతాలు తొలగిపోతాయి.

లోటస్ హెర్బల్స్ నూట్రాఐ రీజువనేటింగ్ అండ్ కరెక్టింగ్ ఐ జెల్

Lotus herbals nutraeye rejuvenating and correcting eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక ప్రముఖమైన మూలికల ఉత్పత్తి. ఇందులో జల విశ్లేషణ, గోధుమ ( హైడ్రోలైజ్డ్ వీట్ ) ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవి కంటి క్రింద ముడతలను తొలగిస్తుంది. ఇందులోని ‘సొయా బయో పెప్టైడ్స్’ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. ఇందులోని బియ్యం తవుడు, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ లు చర్మాన్ని హైడ్రేట్ చేసి చైతన్యం నింపడంవలన చర్మం యవ్వనంగా ఉంటుంది.

DCR డార్క్ సర్కిల్ రిమూవర్ లోషన్

DCR dark circle remover lotion[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమమైన క్రీమ్. ఈ క్రీమ్ వాడటం వలన మీ డార్క్ సర్కిల్స్ ను త్వరగా తొలగించవచ్చు.

వావ్ అల్టిమేట్ అండర్ ఐ అండ్ ఫేషియల్ జెల్

Wow ultimate under eye and facial gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇతర క్రీమ్లతో పోల్చుకుంటే ఇది కొంచం ఖరీదైనదిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అండర్ ఐ క్రీమ్ మాత్రమే కాదు ఫేషియల్ జెల్ కూడా. ఇది మీ చర్మానికి ఎలాంటి హానీ కలిగించని సురక్షితమైన జెల్. సహజమైన అందమైన ముఖం కోసం ఈ జెల్‌ని వాడండి. ఇది ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లలో లభిస్తుంది.

డార్క్ అవే డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ క్రీమ్

Dark away dark circles correcting cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

 

ఇది దిగుమతి చేయబడిన క్రీమ్. ఇది రక్తంలో పిగ్మెంటేషన్ వలన వచ్చే డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. మీ కంటి క్రింద కలిగే మంటను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వాడటం వలన మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ క్రీమ్‌ను వాడి చూడండి. ఇది మీ డార్క్ సర్కిల్స్ ను తొలగించి సంతృప్తిని కలిగిస్తుంది.

St.బొటానికా అండర్ ఐ క్రీమ్

St.Botanica under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది యాంటీ ఏజింగ్, యాంటీ వ్రిన్కుల్స్ (ముడతలు) మరియు డార్క్ సర్కిల్స్ కు సమర్థవంతమైన క్రీమ్. హైలోరోనిక్ ఆసిడ్, మొరాకన్ అర్గన్ ఆయిల్, విటమిన్ ఇ, విటమిన్ బి3, కలబంద సారం ,అతి మధురపు వేర్ల సారం(లిక్విఓరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్), దోసకాయ సారం, కెఫీన్ లాంటి సమర్ధవంతమైన పదార్థాలతో చేయబడినది. కంటి చుట్టూ ఉన్న చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకూ ఇది పరిష్కారం. ఇందులోని దోసకాయ సారం చర్మాన్ని మృదువుగా చేసి వాపును తగ్గిస్తుంది. ఇందులోని ‘ప్లాంట్ స్టెమ్ కణాలు’ మరియు ‘పెప్టైడ్స్’ చర్మాన్ని చైతన్యం చేస్తుంది. హైలోరోనిక్ ఆసిడ్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ క్రీమ్‌ను కల్లకే కాదు, బుగ్గలపై మరియు నుతుడిపై కూడా రాయవచ్చు.

గార్నియర్ స్కిన్ నాచురల్స్ వైట్ కంప్లీట్ ఐ రోల్-ఆన్

Garnier skin naturals white complete eye roll-on[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

గార్నియర్ లో చాలా రకాల చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ మరియు అలంకరణ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఐ రోల్-ఆన్ డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తాయని చర్మ శాస్త్రం ప్రకారం నిరూపించబడినది. ఇందులో కెఫీన్ మరియు ప్రో విటమిన్ బి15 లాంటి పదార్థాలు ఉన్నాయి. కెఫీన్ చర్మాన్ని ఉత్తేజ పరిచి అందంగా చేస్తుంది.

వాడి హెర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Vaadi herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ ఉన్న చర్మంలో నూనె గ్రంథులు లేనందున ఎక్కువ పోషణ అవసరం. ఎక్కువ సేపు పనిచేయటం వలన, నిద్ర లేక పోవటం వలన సరైన పౌష్టిక ఆహారాలు తీసుకోనందున లేదా ఎక్కువగా ఎండలో తిరగటం వలన కూడా డార్క్ సర్కిల్స్, పఫీనెస్ మరియు ముడతలు వస్తాయి. ఈ హెర్బల్ క్రీమ్ తొలగిస్తుంది. ఇందులో దోసకాయ, రోజా మరియు బాదాంల యొక్క సారం ఉన్నందున ఇది చర్మాన్ని తెల్లగాను ప్రకాశవంతంగాను చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా మరియు యవ్వనంగా చేస్తుంది.

నేచర్స్ ఎసెన్స్ డార్క్ సర్కిల్ అండ్ పఫీనెస్ రెడ్యూస్డ్ ఐ క్రీమ్

Nature’s essence dark circle and puffiness reduced eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గించే ఈ క్రీమ్లో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు, బాదాం నూనె మరియు ఇతర అంశాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మృధువుగా చేసి హైడ్రేట్ చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. దీనిని ప్రతి రోజూ పడుకునే ముందు మీ కంటి చుట్టూ పూయండి.

సాత్త్విక్ ఆర్గానిక్స్ ఐ కేర్

Sattvik organics eye care[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక కంటి సంరక్షణ క్రీమ్. ఇందులోని అరోమా నూనెలు చర్మాన్ని చైతన్యవంతంగా మరియు హైడ్రేట్ చేసి డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగిస్తుంది. ఈ క్రీమ్ మీ వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి యవ్వనంగా వుంచుతుంది. ఇది రక్త ప్రసరణను ఉత్తేజ పరుస్తుంది. ఈ క్రీమ్‌ని రోజూ రాత్రి కంటి చుట్టూ రాయండి.

ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్

Organic harvest under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నిస్తేజ చర్మం, పఫీనెస్ మరియు డార్క్ సర్కిల్స్ లాంటి అనేక సమస్యలు సరైన రక్త ప్రసరణ లేనందున వస్తుంది. ఈ దట్టమైన జెల్ మీ కంటి చుట్టూ రక్త ప్రసరణను మెరుగు చేసి స్కిన్‌ టోన్ మరియు రంగును పెంచుతుంది, ముడతలతో మరియు వృద్ధాప్య లక్షణాలతో పోరాడుతుంది, డార్క్ సర్కిల్‌ను తగ్గిస్తుంది. అనేక చర్మ సమస్యలను వదిలించుకోవడానికి ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్ ఉపయోగించవచ్చు.

2N ఐమెడ్ ఆస్ట్రేలియా 15 డేస్ డార్క్ సర్కిల్ రిమూవర్ క్రీమ్

2N EyeMed Australia 15 Days Dark Circle Remover Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్‌లోని హాలోక్సయిల్రక్త ప్రసరణను మెరుగు చేసి డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఐశేరాయిల్ చర్మంయొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి పఫీనెస్ని తొలగిస్తుంది. రేనోవాజ్ లోని యాంటీ-యేజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

Posted on

Protein rich foods in Telugu – ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు

మన శరీరంయొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ స్థూల పోషక పదార్థం. ఎక్కువ ప్రోటీన్స్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రోటీన్ లోపిస్తే కండరాలు క్షీణిస్తాయి. ప్రోటీన్స్ మొత్తం 20 అమైనో ఆమ్లాల(అమైనో ఆసిడ్స్) సేకరణను కలిగి ఉంటుంది. ఇందులోని 8 ముఖ్యమైన (ఎస్సెంషియల్) అమైనో ఆసిడ్స్ ను మనం రోజూ తినే ఆహారం ద్వారా శరీరానికి లభిస్తుంది. మిగిలిన 12 నాన్- ఎస్సెంషియల్ ఆసిడ్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. గుడ్లు మరియు మాంసాహారం లాంటి ఆహారాలలో కండరాల నిర్మాణంకు కావలసిన అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

కొన్ని ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ తొందరగా జీర్ణం అవుతాయి మరికొన్ని నిదానంగా జీర్ణించుకొని శరీరంలో శోషించబడతాయి. ఉదాహరణకు గుడ్లు, ఇది ప్రోటీన్ ఆహారాలలో రాజువంటిది. ఇందులో అన్ని (20) అమైనో ఆసిడ్స్ లు ఉన్నాయి, ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. మరోపక్క పాలు, ఇందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులోని ప్రోటీన్స్ కొన్ని వేగంగా మరి కొన్ని నిదానంగా అమైనో ఆసిడ్స్ ను విడుదల చేస్తాయి. పాల్లలో ప్రోటీన్స్ మాత్రమే కాదు ఎముకలకు బలాన్ని పెంచే కాల్షియము కూడా ఉంటుంది.

శరీరంయొక్క ప్రతి పనికి ప్రోటీన్స్ చాలా అవసరం. పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రోటీన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండలేరు. ఎన్నో రకాల ఆహారాలలో ప్రోటీన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినవి ఎంపిక చేసుకొని రోజూ తీసుకోండి.

శాకాహారులకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలలో కొన్ని పాల్లు, పెరుగు, జున్ను(చీస్), గింజలు (బీన్స్) , కాయధాన్యాలు (లెంటిల్స్) మరియు విత్తనాలు. మరికొన్ని తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు కాటేజ్ చీజ్, గ్రీక్ చీజ్, తెల్లటి పుట్టగొడుగులు, వెన్నతీసిన పాలు ( స్కిమ్డ్ మిల్క్) మరియు నాటో (పులియబెట్టిన సోయాబీన్స్). పాల్ల ఉత్పత్తులే కాకుండా పళ్ళలో మరియు గింజలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ధాన్యాలు

ధాన్యాలు ప్రధానమైన పోషక ఆహార పదార్థం. ఇది శరీరానికి కావలసిన కేలరీలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ప్రొటీన్లను అందిస్తుంది. ఇతర ధాన్యాలకన్నా బఠానీలు, రాజ్మా మరియు పెసర పప్పులు లాంటి తృణధాన్యాలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫైన్డ్ (సుద్దిచేసిన గింజలు) గింజలను పాస్తాలు, పాన్ కేక్లు, స్మూతీస్ మరియు బ్రెడ్లు చేసేటప్పుడు వాడవచ్చు. గోధుమ బీజ, వండిన ఓట్స్ తవుడు, బియ్యం తవుడు మరియు ఓట్స్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువుగా ఉంటుంది.

కూరగాయలు

కూరగాయలు ఉత్తమ ప్రోటీన్ ఆహారాలు. మొలకెత్తిన బీన్స్, బటానీలు మరియు కాయధాన్యాలు (లెంటిల్స్) ప్రోటీన్లకు మూల పదార్థాలు. మరికొన్ని-వండిన లిమా బీన్స్, ఆకుపచ్చ బటానీలు, మొక్కజొన్న, బ్రొక్కొలి మరియు పుట్టగొడుగులు.

పండ్లు

ప్రోటీన్ పదార్థాలలో మరో ముఖ్యమైన ఆహారం తాజా పండ్లు. కూరగాయలతో పోల్చుకుంటే పండ్లలో తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. రైసిన్లు, అక్రోట్లు, జీడిపప్పులు లాంటి ఎండిన పండ్లలో(డ్రై ఫ్రూట్‌స్) ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జల్దారు, జామ పండ్లు, బొంత పళ్ళు(మల్బెర్రీస్) , బ్లాక్బెర్రీస్, స్టార్ ఫ్రూట్‌, కుంక్వాట్స్, పీచ్ పండు, దానిమ్మ పండ్లు మరియు ద్రాక్ష పండ్లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

గింజలు

బాదాం, పిస్తా పప్పులు, అక్రోట్, జీడిపప్పులు మరియు బఠానీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఇందులో సోడియం మరియు పొటాషియం కూడా ఉన్నందున వీటిని తిన్న వెంటనే మనకు కావలసిన బలాన్ని తక్షణమే ఇస్తుంది మరియు చెమట వలన శరీరం నుండి తొలగిపోయిన ఎలెక్ట్రోలైట్స్ ను సరఫరా చేస్తుంది. చాలా గింజలలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన పోషక పదార్థాలు ఉన్నాయి.

ఓట్స్

ఓట్స్ అన్నింటికంటే ఆరోగ్యవంతమైన ధాన్యాలు. ఇందులో అనేక పౌష్టిక పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం మరియు విటమిన్ B1 ఎక్కువగా ఉంటాయి. వీటిని తెల్లవారు జామున అల్పాహారంగా భుజించడం మంచిది.

కాటేజ్ చీజ్

ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కొవ్వు మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. కాల్షియం, ఫాస్ఫరస్(భాస్వరం), సెలీనియం మరియు విటమిన్ బి12 ఇందులోని ఇతర పోషక పదార్థాలు.

బ్రొక్కొలి

ఇతర కూరగాయలకన్నా ఇందులో ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కేలరీలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ మరియు పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నాయి.

క్వినోవ

సమీప కాలంలో చాలా ప్రముఖమైన ఒక ఆహార పదార్థం క్వినోవ విత్తనాలు. వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటి-ఆక్సిడెంట్ ఉన్నందున ఆరోగ్యానికి చాల మంచిది.

గ్రీక్ పెరుగు

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది మిఠాయి దుకాణాలలో కూడా దొరుకుతుంది. దీనిని విడిగానే తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది.

యెహెజ్కేల్ బ్రెడ్

ఇది మొలకెత్తిన తృణధాన్యాలతో తయారు చేయబడినది. వీటిని సోయాబీన్స్, బార్లీ, చిరు ధాన్యాలు మరియు గోధుమతో కూడా తయారు చేస్తారు. ఈ బ్రెడ్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు

మనం రోజూ వంటలో గుమ్మడికాయను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వీటి గింజలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలియదు. ఇందులో ప్రోటీన్స్ మాత్రమే కాదు, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలు కూడా ఉన్నాయి.

మాంసాహారుల కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

మాంసం మరియు చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. తూర చేప(ట్యూనా), సాల్మోనాండ్ హాలిబుట్ చేప, స్నాపర్, పెర్చ్ లాంటి చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. మాంసంలో కోడిమాంసం, ఆవు మాంసం మరియు పంది మాంసాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది.

కోడిమాంసం లోని రొమ్ములు

ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రుచికరమైన ఆహారంగా వండుట చాలా సులభం.

చిన్నరొయ్యలు

ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహారం.

Posted on

Telugu tips for throat pain/throat infection – గొంతు మంట మరియు గొంతు నొప్పికి సహజ గృహ నివారణలు

గొంతు మంట ఈ రోజుల్లో చాలా సాధారణంగా వస్తుంది. గొంతులోని నరాలపై ఒత్తిడి కలిగినప్పుడు గొంతు నొప్పి కలుగుతుంది. ఇది ఎక్కువగా అరవటం, వైరస్ సంక్రమణ, బాక్టీరియాల సంక్రమణ మరియు ఇతర కారణాల వాళ్ళ రావచ్చు. ఇది తల నొప్పి, ఒంటి నొప్పి, జలుబు, దగ్గు లాంటివి రావటానికి కారణం అవుతుంది. ఇది ప్రమాదకరమైనది కాదు, అయినప్పటికీ ఎంత తొందరగా చికిత్స చేస్తే అంత మంచిది.

గొంతు మంటను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు కొన్ని

తేనె, అల్లం మరియు నిమ్మపండు

ఇది ఒక బ్రహ్మాండమైన నివారణ పద్దతి. వేడి నీటిలో తేనె మరియు అల్లంను కలిపి కొంచం నిమ్మరసాన్ని పిండి ఈ నీటితో 5-10 నిమిషాల వరకూ పుక్కిలించండి. లేదా 1 చెంచా తేనెని మాత్రం వెచ్చని నీటిలో కలుపుకొని పుక్కిలించవచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్నాయి, గొంతు లోపల ఒక పూతలా ఏర్పడుతుంది. దీని వలన మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

మిరియాలు

మంటను తగ్గించేందుకు మిరియాలు చాలా ఉపయోగ పడతాయి. వేడి నీటిలో కొంచం ఘాటైన మిరియాల పొడిని కలిపి ఈ నీటితో 2 నిముషాలు నోరు పుక్కిలించండి.5 నిమిషాలకు ఒకసారి ఇలా చేయటం వలన మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

సేజ్

గొంతు మంట ఉన్నప్పుడు ముక్కులోని నాసల్ ఉబ్బుతుంది, దీని వలన ఎక్కువ నొప్పిగా ఉంటుంది. ఇటువంటప్పుడు ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా సేజ్, అర చెంచా పటిక,1/4 కప్పు గోధుమ చక్కెర, కొద్దిగా వినిగర్‌ను కలిపి నోరు పుక్కిలించాలి.

పసుపు

పసుపులో యాంటీ-ఆక్సిడెంట్ మరియు అనేక వ్యాధులను నివారించే ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. వేడి నీళ్లలో అర చెంచా పసుపు పొడి మరియు అర చెంచా ఉప్పుని కలిపి ఈ నీటితో నోరు పుక్కిలించండి. ఇది మీ గొంతు మంట నుండి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

గోధుమ గడ్డి

గొంతు మంట నుంచి ఉపశమనం పొందటానికి గోధుమ గడ్డి సారం చాలా ఉపయోగకరమైనది. ఈ సారంను నోటిలో 5 నిమిషాలపాటు ఉంచండి. ఇది గొంతు మంటను తగ్గించడమే కాదు నోటిలోని బాక్టీరియాలను చంపి పళ్ళ చిగురులను ధృఢంగా చేస్తుంది.

లవంగాలు

నీళ్లలో లవంగ పొడిని కలిపి నోటిని పుక్కిలించండి. లవంగం లో యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ-బాక్టీరియాల లక్షణాలు ఉన్నాయి. అందువలన ఇది గొంతు మంట నుంచి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

ఆపిల్  సీడర్ వినిగర్

అర చెంచా ఉప్పు మరియు అర చెంచా ఆపిల్ సీడర్ వినిగర్‌ను ఒక కప్పు వేడి నీటిలో కలుపుకొని నోటిని 5 నిమిషాల పాటు పుక్కిలించండి. మాములుగా త్రాగే నీటికి బదులుగా వేడి నీటిలో 4 టేబుల్ స్పూన్ల వినిగర్‌ని కలుపుకొని త్రాగండి.

ఉప్పు

ఉప్పులోని సోడియం మంటకు కారణమైన క్రిములను చంపుతుంది (యాంటీ సెప్టిక్). ఇందువలన ఇది మంటను తగ్గించటానికి తోడ్పడుతుంది. ఒక గ్లాస్ నీళ్లలో ఉప్పుని కలిపి రోజుకి 3 సార్లు 5 నిముషాల పాటు
నోటిని పుక్కిలించండి.

నిమ్మపండు

నీళ్లలో నిమ్మరసాన్ని పిండి ఈ నీటితో నోరు పుక్కిలించండి. లేదా నిమ్మరసం, ఒక చిటిక ఉప్పు, 4-5 చిటికెల నల్ల మిరియాల పొడిని నీళ్లలో కలిపి రోజుకు నాలుగు సార్లు త్రాగండి.

దాల్చిన చెక్క

రెండు కప్పుల నీటిలో ఒక ముక్క దాల్చిన చెక్క, ఒక చిటిక నల్ల మిరియాల పొడిని వేసి 5 నుండి 10 నిమిషాల దాకా ఉడికించాలి. ఆ తరువాత ఈ నీటిని వడగట్టి కొంచం తేనెని కలుపుకొని త్రాగితే మీకు గొంతు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి నూనె

వెచ్చని నీటిలో 4-5 డ్రాప్ల వెల్లుల్లి నూనెని కలుపుకొని పుక్కిలించండి. వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నందున ఇది గొంతు మంట నుంచి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

మెంతులు

8 కప్పుల నీటిలో 3 స్పూన్ల మెంతులు వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి. ఆరిన తరువాత నీటిని వడగట్టి త్రాగండి.

పెప్పర్మిట్ (పుదీనా) ఆయిల్

పెప్పర్మిట్ ఆయిల్ మీ గొంతు నొప్పిని త్వరగా తగ్గించడంలో సహజసిద్ధమైనది మరియు చాలా ప్రభావవంతమైనది. ఒక కప్పు వేడి నీటిలో 4-5 చుక్కల పెప్పర్మిట్ ఆయిల్ వేసి,5 నిమిషాల పాటు పుక్కిలించండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడంవలన మీ గొంతు నొప్పి తగ్గుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో ఉన్న సమ్మేళనాలు ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.¼ టీ స్పూన్ ఉప్పు మరియు ¼ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడి నీటిలో వేసి కలపండి. గొంతు నొప్పి పూర్తిగా తగ్గే వరకూ ఈ మిశ్రమంతో ప్రతిరోజు 5 నిమిషాల పాటు పుక్కిలించండి.

టమాట జ్యూస్

టమాటలో పుష్కలంగా దొరికే విటమిన్-సి మరియు లైకోపీన్ మీ గొంతులోని బాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది.½ కప్పు నీటిలో ½ కప్పు టమాట రసం కలిపి బాగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలపాటు మీ గొంతులో ఉంచి బాగా పుక్కిలించండి.

Posted on

Skin warts tips in Telugu – ఇంట్లో నివారణ పద్ధతుల ద్వారా పులిపిర్లను (వార్ట్స్) తొలగించడం ఎలా?

వివిధ రకాలైన పులిపిర్లను చాలామందిలో చూడవచ్చు. వీటిలో కొన్ని నొప్పిని కలిగిస్తాయి. మరి కొన్ని కొద్ది సమయంలోనే చాలా పెద్దగా పెరుగుతాయి. ఇలాంటి పులిపిర్లకు వెంటనే చికిత్స అవసరం, లేదా ఇది మరింత కీడును కలిగిస్తుంది. నొప్పిని కలిగించే పులిపిర్లు కొన్ని సార్లు కాన్సర్గా కూడా మారవచ్చు. వీటిని మీ వైద్యులు చెప్పిన పద్దతి ప్రకారం గుణ పరచటం మంచిది.

పై చెప్పినటువంటి పులిపిర్లు కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అవి సాధారణంగా చేతులు, ముఖం లేదా కాళ్లపై రావచ్చు. వీటివల్ల నొప్పి కానీ హాని గాని ఉండదు, ఇవి కొన్ని సంవత్సరాల తరువాత తొలగిపోతాయి. కానీ కొందరు స్త్రీలు వీటిని తమ అందానికి ఆటంకంగా భావిస్తారు. వీటిని ప్రాకృతిక విధాలద్వారా తొలగించటానికి గృహ నివారణలు ప్రయోగించండి.

పులిపిర్లు అనేక రకాలు, వీటిలో కొన్ని ఎలాంటి హానిచేయవు, కొన్ని హానికరమైనవి ఉంటాయి. కావున మీకు వచ్చిన పులిపిర్లు ఎలాంటిదో ఒక వైద్యుడిని సంప్రదించి పరిశీలించుట మంచిది.

హానికరమైనది కాదని మీ వైద్యుడు చెప్పినట్లయితే మీరు గృహ నివారణ పద్దతులను ఉపయోగించవచ్చు. చాలా వరకు చర్మ పులిపిర్లు చిన్న గడ్డలు లేదా ఎక్కువ చర్మం పెరగటం వలన వస్తుంది. ఇది ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్స్ – HPV’ అనే వైరస్ వలన శరీరంలోని చాలా భాగాలలో వస్తుంది. పులిపిర్లు ఉన్న వాళ్లను మనం తాకడం వలన ఈ వైరస్ సోకుతుంది.

వీటిని ‘వెర్రుకా వల్గారిస్ అని అంటారు. ఇవి హానికరం కానప్పటికీ వీటిని తొలగించటం సులువు కాదు.

వైద్య పరంగా 6 రకాల పులిపిర్లు ఉన్నాయి.

 • కామన్ వార్ట్స్, సాధారణ పులిపిర్లు ఉబ్బుగా, గరుకుగా ఉంటాయి. ఇవి చేతుల పై మరియు వేళ్ళ పై వస్తాయి. వీటిని చిన్న పిల్లలలో ఎక్కువగా చూడవచ్చు.
 • ఫ్లాట్ వార్ట్స్, ఇవి చాలా చిన్నగా ఉంటాయి, సాధారణంగా ముఖ వెనుక భాగాలలో, చేతులపై మరియు కాళ్ల పై వస్తుంది.
 • ఫిలిఫార్మ్ వార్ట్స్, ఇవి కంటి చుట్టూ, గొంతు మరియు ముఖం పై రావచ్చు. ఇవి చాలా పొడవుగా మరియు మందంగా ఉంటాయి.
 • పెరియాంగువల్ వార్ట్స్ , గోరులను తరచూ కొరికే అలవాటు ఉన్న వారికి ఇది గోరుచుట్టూ వస్తుంది.
 • ప్లాంర్ (అరికాలి) వార్ట్స్, ఇది అరికాళ్లలో వస్తుంది.
 • జెనిటిల్ (జననేంద్రియాల) వార్ట్స్, ఇవి జననేంద్రియాలపై వస్తుంది.

చాలా రకాల పులిపిర్లు ఎలాంటి చికిత్సా చేయకుండానే తొలగిపోతాయి. కొన్నింటికి చికిత్స చేయవలసి ఉంటుంది. ఎక్కువ మంది అనుసరించి మంచి ఫలితాలు ఇచ్చిన కొన్ని చికిత్సలను చూద్దాం.

 • లిక్విడ్ నైట్రోజన్ – దీనిని ఉపయోగించి పులిపిర్లను గడ్డ కట్టేలా(ఫ్రీజ్) చేయొచ్చు. ఫ్రీజ్ చేయటం వలన ఫ్రోబ్సైట్ ఏర్పడుతుంది. ఇది మెల్లగా వార్ట్స్ ను తొలగించి HPV వైరస్‌ను ధ్వంసం చేస్తుంది. ఇది ఒక రోజులో జరగదు. చాలా సార్లు ఈ లిక్విడ్‌ను రాయాలి.
 • సాలిసైలిక్ ఆసిడ్ – ఇది కూడా పైచెప్పిన లిక్విడ్ నైట్రోజన్ లాగానే పని చేస్తుంది. ఇది పులిపిర్లను పూర్తిగా తొలగిస్తుంది.
 • రోగ నిరోధక చికిత్సను ప్రయత్నించి చూడండి. ఇది ఇంటిలో చేయడం వీలుకాదు. ఏదైనా కేంద్రాలలో చేసుకోవచ్చు. ఈ చికిత్సలో ‘కాండిడా’ అనే పదార్ధంను వాడుతారు. ఇది HPV వైరస్ యొక్క పెరుగుదలను ఆపి, పులిపిర్లను తొలగిస్తుంది.
 • మీకు చాలా పెద్దగా మరియు చిరాకు పుట్టించేలా పులిపిర్లు ఉన్నట్లయితే మీరు ఒక వైద్యుడిని సంప్రదించండి. లేజర్ చికిత్సద్వారా నివారించవచ్చు. కానీ ఈ చికిత్స చాలా నొప్పిగా మరియు బాధాకరంగా ఉంటుంది. కనుక మీకు చాలా ఎక్కువగా వార్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ చికిత్స తీసుకోండి.
 • డక్ట్ టేప్, ఈ టేప్‌ను మీ పులిపిర్లపై మూయండి. 6 రోజులపాటు అలాగే ఉంచి, 7అవ రోజు తీసి అగ్నిశిల రాయిని (పమిస్ స్టోన్) వాడి పులిపిర్లను తొలగించండి. ఈ పద్దతిని పదేపదే అనుసరించడం వలన వార్ట్సను పూర్తిగా తొలగించవచ్చు.

పులిపిర్లను సాధారణం అనుకొని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే కొన్ని కాన్సర్గా కూడా మారవచ్చు. మీ పులిపిరి మొండిగానో వింతగానో అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

చర్మం లోని పులిపిర్లను తొలగించటానికి ఉత్తమ గృహ నివారణలు

వినిగర్

ఒక పత్తిని(కాటన్) రెండు చెంచా తెల్ల వినిగర్లో ముంచి, పులిపిరిపై పెట్టి కట్టుకట్టి రెండు గంటల సేపు ఉంచండి. ఇలా రోజూ చేయటం వలన ఇవి తగ్గుతాయి.

అరటి తొక్క

అరటి తొక్కలోని రసాయనం మన చర్మంలోని పులిపిర్లను తొలగించగలదు. ఇది చాలా ప్రాకృతికమైన పద్దతి. మీరు రోజూ అరటి తొక్కలోని లోపలి భాగంతో పులిపిరిపై రుద్దండి. ఇలా చేస్తే పులిపిరి కరిగిపోతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిని బాగా దంచి, దానిని పులిపిరిపై రోజూ రాయండి. దీని వలన పులిపిరి ఒక బొబ్బలా అవుతుంది. ఆ తరువాత కొన్ని నెలల్లో రాలిపోతుంది.

బొప్పాయి పండు

పచ్చని బొప్పాయి పండులోని ఎంజైములు వార్ట్స్ ను తొలగించటానికి ఉపయోగపడతాయి. కొన్ని ముక్కల బొప్పాయి పండును పిండి పులిపిరిపై రాయండి. ఆరిన తరువాత నీటితో కడగండి.

ఆముదం నూనె

పడుకునే ముందు ఆముదం నూనెని పులిపిర్లపై రాసి కట్టు కట్టండి. దీనిని పూసినప్పుడు చిరాకుగా ఉండొచ్చు కానీ ఇలా క్రమంగా పూయటం వలన పులిపిర్లు తొలగిపోతాయి.

పచ్చి బంగాళదుంప

కొద్దిగా పచ్చి బంగాళదుంపను రుబ్బి గుజ్జులా చేసి పులిపిర్లపై రాయండి. ఆరిన తర్వాత నీటితో బాగా కడగండి. కడిగిన వెంటనే టవల్ తో బాగా తుడవండి లేదా మీ చర్మంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

డాండెలైన్ (సింహదంష్ట్రిక)

మీ ఇంటి పెరటిలో ఈ చెట్టు ఉన్నట్లయితే వీటి కాడ యొక్క రసాన్ని పిండి, ఒక పత్తిని ముంచి పులిపిర్లపై పూయండి. దీనిని పూసినప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వలన కొద్దిగా చిరాకు పుట్టవచ్చు.

తులసి ఆకులు

కొన్ని తాజా ఆకులను నలిపి మీ పులిపిరి పై ఉంచి, వాటర్ ప్రూఫ్ టేపును వేసి రోజంతా ఉంచండి. రోజూ ఈ ఆకులను మార్చండి. ఇందులో వైరస్‌ను తొలగించే గుణాలు ఉన్నందున మీ చర్మంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

విటమిన్ సి మాత్రలు

మందుల అంగడిలో ఈ మాత్రలు దొరుకుతాయి. రోజూ ఒక మాత్రను నలిపి నీటిలో కలిపి పులిపిరిపై రాయండి. ఇందులోని ఆమ్ల (అసిడిక్) లక్షణాలు వార్ట్స్ ను తొలగిస్తాయి.

బిర్చ్ బెరడు

బిర్చ్ చెట్టుయొక్క బెరడులో సాలిసిలిక్ ఆమ్లంఉంటుంది. ఇది మీ చర్మంలోని పులిపిర్లను తొలగిస్తుంది. ముందుగా బెరడును నీటిలో నానపెట్టాలి. తేలికగా మరియు మృదువుగా అయిన తరువాత బెరడు యొక్క లోపలి పక్కను వార్ట్స్ పై రుద్దండి.

నల్ల గింజలు

పులిపిర్ల నివారణకు ఇవి బాగా సహాయపడతాయి. నల్ల గింజల నూనెతో తేనె కలిపి ఒక పేస్ట్ చేయాలి. దీన్ని పులిపిర్ల మీద రాయాలి, తర్వాత కట్టు కట్టి కొద్ది సేపు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అనాస పండు

తాజాగా ఉండే అనాస పండు ముక్కలను పులిపిరిపై రాయండి. రోజుకు రెండు మూడు సార్లు రాయటం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ

వెనిగర్లో ఉల్లిపాయ ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టాలి. రోజూ ఉదయం ఈ ఉల్లిపాయ ముక్కలు పులిపిరిపై కొద్దిసేపు ఉంచండి.

కర్పూరం నూనె

కర్పూరం నూనె చాలా ప్రభావితమైనది. పులిపిర్లు ఉన్న ప్రదేశంలో కర్పూరం నూనెని రోజూ రాయండి.

Posted on

Telugu tips for leg pains & cramps – కాళ్లు, కీళ్ల నొప్పులు మరియు కాళ్ల తిమ్మిరిని వదిలించుకోవటం ఎలా?

వివిధ కారణాల వలన చాలా బాధాకరమైన కాళ్ల నొప్పి మరియు తిమ్మిరి వస్తుంది. ఇటువంటి ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స అవసరం. కొందరు ఔషధాల ద్వారా చికిత్స చేయాలని అనుకుంటారు కానీ రోజూ మందులను వేసుకోవటం మంచిది కాదు. దుష్ప్రభావాలను ఇచ్చే మందులకన్నా ప్రాకృతిక నివారణ చాలా మంచిది.

వివిధ రకాల కాళ్ల నొప్పులను చాలా మందిలో చూడవచ్చు. నొప్పియొక్క కారణాలు మరియు లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి తేడాగా ఉంటుంది. చిన్న నొప్పులకు చికిత్స అవసరం ఉండదు. అన్ని రకాల కాళ్ల నొప్పులను పరిష్కరించడానికి ఇంటి నివారణ పద్దతులను పాటించటమే ఉత్తమం.

కాళ్ల నొప్పికి సహజ నివారణలు

 • మంచు గడ్డలను నొప్పిగా ఉన్న చోటుపై కొద్ది సేపు ఉంచండి. ఇది చర్మం యొక్క స్పర్శ గుణాన్ని తగ్గించడం వలన నొప్పి తగ్గుతుంది.
 • ఎక్కువగా నీళ్లు త్రాగండి , పోషక ఆహారాలు, కాల్షియం మరియు పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తినండి.
 • కాళ్లను విస్తరించే వ్యాయామాలను చేయండి, ఇది మీ రక్త ప్రసరణను మెరుగు చేసి కాళ్ల నొప్పి నుండి ఉపశమనాన్నీ ఇస్తుంది.
 • పసుపు పొడి, నిమ్మరసం మరియు ఉప్పుని కలిపి ఒక ముద్దలా చేసుకొని నొప్పిగా ఉన్న కాళ్ల భాగాలపై రాయండి.
 • ఎక్కువగా హీల్స్ ఉండే చెప్పులను వేయకూడదు, వాటివలన నొప్పి ఎక్కువ అవుతుంది.
 • పచ్చ కాయకూరలు, క్యారెట్, చెరుకు, అరటి పండు లాంటి సమతుల్యమైన ఆహారాలని భుజించండి.

కాళ్లలో తిమ్మిరి మరియు నొప్పులు తగ్గించటానికి గృహ నివారణలు

సరైన బూట్లు వేసుకోవటం

నిరంతరం కాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? అయితే మీరు మీ బూట్లను ఒకసారి పరీక్ష చేయండి. మీ కాళ్లకు సరిపడని బూట్లు లేదా హీనమైన గుడ్డలతో చేసిన బూట్లు మీ కాళ్లకు నొప్పిని పెంచుతాయి. అందువలన మీ బూట్లను మార్చి సరైనవి వాడండి.

ఈత (స్విమ్మింగ్)

సాధారణంగా నీళ్లలో ఈతకొట్టేటప్పుడు మన శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. కనుక ఇది మీ కాళ్లకు మరియు కీళ్లకు నొప్పి లేకుండా ప్రభావితమైన వ్యాయామంగా ఉంటుంది. ఈతలో మీ జాయింట్లకు ప్రయోజనకరమైన వివిధ భంగిమలను ప్రయత్నించండి.

యోగ

వ్యాయామ శాలకు (జిం)  వెళ్లి వ్యాయామాలను చేయటమే కాకుండా యోగాలను కూడా చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ కాళ్లు మరియు జాయింట్ల (కీళ్లు) నొప్పిని తగ్గించడమే కాకుండా మీలోని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. వ్యాయామాలు చేసేటప్పుడు మీ కాళ్ల పై తక్కువ ప్రభావం ఉండేలా చేయండి.

నడవడం

కాళ్లు నొప్పిగా ఉన్నాయని నడవడం మానకూడదు. ఎక్కువ దూరం నడవ లేక పోయినా వీలైనంతవరకు నడవాలి. దీని వలన కాళ్లలోని కండరాలకు విశ్రాంతిగా ఉంటుంది. నడిచిన తరువాత కొద్దిగా మర్దన (మసాజ్) చేయండి.

మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి

గర్భిణి స్త్రీలకు, మరి కొందరికి నిద్రలో కాళ్ల నరాలు లాగటం వలన క్రామ్ప్స్( తిమ్మిరి) వస్తుంది. అలాంటి వాళ్ళు మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మంచిది. ఉదాహరణకు గింజలు మరియు విత్తనాలు.

పసుపు

పసుపులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. ఇది కాళ్ల నొప్పి మరియు క్రామ్ప్స్ ను కూడా తగ్గించగలదు. పసుపులో యాంటీ -ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించుతుంది. వెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి కాళ్లపై రాసి అరగంట మర్దన చేయండి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సోమ్ ఉప్పు

ఇది చాలా సులభమైన నివారణ పద్దతి. ఒక బౌల్ వెచ్చని నీటిలో ఒక చెంచా ఎప్సోమ్ ఉప్పుని వేసుకొని మీ కాళ్లను అందులో 10 నిమిషాలపాటు నానపెట్టండి.

పుల్లని చెర్రీ ఫలరసం

కొంతమంది రోజంతా శారీరక పనులు చేయవలసి ఉంటుంది. దీని వలన మీ కాళ్లు బాగా నొప్పిగా ఉంటాయి. అలాంటప్పుడు రోజూ ½ కప్పు పుల్లని చెర్రీ పండ్లను తినాలి లేదా 1 కప్పు ఫల రసంను రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ మరియు మంటని తగ్గించే (యాంటీ- ఇంఫ్లమేటరీ) లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రామ్ప్స్ మరియు నొప్పిని తగ్గిస్తుంది.

నిమ్మరసం

ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ మరియు మంటని తగ్గించే గుణాలు (యాంటీ ఇంఫ్లమేటరీ) ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవటం వలన ఒంటిలోని PH స్థాయి సమతుల్యత పొందుతుంది. ఒక గ్లాస్ వెచ్చని నీటిలో అర నిమ్మపండు రసాన్ని కలిపి రోజూ త్రాగండి. లేదా ఆముదం మరియు నిమ్మరసం సమంగా కలిపి నొప్పిగా వున్న చోటులపై పూసి మర్దన చేయండి.

వేడి నీళ్లు మరియు చల్లని నీళ్లు

ఒక టవల్‌ను వేడి నీటిలో తడిపి నొప్పిగా ఉన్న కాళ్లపై రాయండి, తరువాత అదే టవల్‌ని వెంటనే చల్లని నీటిలో తడిపి రాయండి, మళ్ళీ వేడి నీటిలో ముంచి, నొప్పిగా ఉన్న చోటుపై రాయండి. ఇలా వేడి నీళ్లను చల్ల నీళ్లను ఒక దాని తరువాత ఒకదాని రాయటం వలన మీ కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. వేడి నీళ్లకి బదులుగా ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్‌ని వాడవచ్చు. దీనికి బదులుగా మీరు వేడి నీటితో స్నానం చేసి తరువాత మంచు ముక్కలను కాళ్లపై తడవడం వలన కూడా నివారణ పొందుతారు.

కండరాలను స్ట్రెచ్ చేయడం (సాగదీయడం)

మీరు దినసరి పనులను ప్రారంభించే ముందు మీ శరీరంలోని కండరాలను స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వలన క్రామ్ప్స్(తిమ్మిరి) రాకుండా ఉంటుంది.

పొటాషియం

శరీరంలో పొటాషియం లోపించడం వలన కూడా కాళ్ల నొప్పి రావచ్చు. పొటాషియం నాడి వ్యవస్థ మరియు కండరాల బలానికి అత్యంత అవసరమయిన పౌష్టిక ఆహారం. అలాగే డీహైడ్రేషన్ను(శరీరంలో నీరు తక్కువగా ఉండటం) తగ్గిస్తుంది.  పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు, ఉదాహరణకు బంగాళదుంప, అరటి పండ్లు, రేగు పండ్లు మరియు టమోటా జ్యూస్ వంటివి రోజూ తీసుకోవాలి.

సోడియం

మీరు ఇంట్లోనే సోడియం ఎక్కువగా ఉండేల ఒక టానిక్ ని తయారు చేసుకోవచ్చు. రెండు చెంచా తేనె మరియు ఒక చెంచా పసుపు ఆవాలను పొడి చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి త్రాగండి.  ఇది మీ కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

వింటర్గ్రీన్ నూనె

మీ కాళ్ల నొప్పి తగ్గటానికి ఒక అద్భుతమైన నూనెని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక చెంచా వింటర్గ్రీన్ నూనె మరియు 4 స్పూన్లు వెజిటేబుల్ నూనెని కలిపి నొప్పిగా ఉన్న కాళ్లపై మర్దన చేయండి. వింటర్గ్రీన్ నూనెలో ‘మిథైల్ సాల్సిలేట్ ’ ఉన్నందున మరియు రక్త ప్రసరణను మెరుగు చేయటం వలన ఇది నొప్పినుంచి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మీరు రోజుకు ఎన్ని సారులైనా వాడవచ్చు. దీనిని వాడటం వలన మీకు దీర్ఘకాల ఉపశమనం కలుగుతుంది.

Posted on

Telugu tips for toothache relief – పంటినొప్పి నుండి ఉపశమనం పొందటానికి గృహ చిట్కాలు

మనం మాములుగా తినే చెక్కర లేదా పిండి పదార్థాలు పళ్ళపై ఉండిపోయినప్పుడు ఇవి బాక్టీరియా రావటానికి కారణం అవుతాయి, దీని వలన కావిటీస్ ఏర్పడతాయి. ఈ కావిటీస్ వలనే పంటి నొప్పి వస్తుంది. ఈ బాక్టీరియాలు ఆమ్లాలను(ఆసిడ్స్) ఉత్పత్తి చేస్తాయి, ఇది పంటికి చాలా హానికరం. ఈ ఆసిడ్స్ నరాలను చేరుకున్నప్పుడు నొప్పి ప్రారంభమవుతుంది.

నోటిలోని చిగుళ్లు ముడుచుకుపోయినప్పుడు పంటి దంతి క్రింద ఉన్న ధాతువు బయటకి రావటం వలన పళ్ళు చాలా సున్నితం అవుతాయి. వేడీ లేదా చల్లని పదార్థాలను తినేటప్పుడు సున్నితమైన పళ్ళలో నొప్పి పుడుతుంది.

పంటి చిగురు గట్టిగా లేనప్పుడు లేదా పంటిపై చీలికలు ఏర్పడినప్పుడు కూడా పంటి నొప్పి రావచ్చు. ఏ ఒక్క సంక్రమణమైన పంటి చిగురు వరకూ వెళ్లినప్పుడు నొప్పి ఏర్పడుతుంది. ఒక దంత వైద్యుడు మాత్రమే నొప్పి యొక్క అసలైన కారణం కనిపెట్టగలరు. అయినప్పటికీ, కొన్ని గృహ నివారణ పద్ధతుల ద్వారా నొప్పిని తగ్గించడం ఎలా గని తెలుసుకుందాం.

నిద్రలేచిన వెంటనే పంటి నొప్పి రావటం చాలా చిరాకు పుట్టిస్తుంది. కొంత మందికి తక్కువ నొప్పి ఉండొచ్చు మరి కొంత మందికి తీవ్రమైన నొప్పి కలగొచ్చు. ఎటువంటి నొప్పి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టండి.

పంటి నరాలు నుదుటి నరాలకు జత పడి ఉన్నందున కొన్ని సార్లు పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు మీ నుదురు కూడా నొప్పిగా ఉంటుంది. ఒక నియమం ప్రకారం పంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది.

పంటినొప్పిని తగ్గించటానికి గృహ చిట్కాలు

 • అన్నం తిన్న తరువాత లేదా పొద్దున, రాత్రి పళ్ళు తోమిన తరువాత వెచ్చని నీళ్లతో లేదా ఉప్పుని కలిపిన వెచ్చని నీళ్లతో పుక్కిలించండి.
 • మద్యం లేదా లవంగం నూనె లేదా జాజికాయ నూనెని గాయపడిన పంటిపై రాయండి.
 • మీకు అపారమైన నొప్పి ఏర్పడినప్పుడు మంచు గడ్డలను దంతాలు మరియు బుగ్గలు మధ్య 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేయండి.
 • పాలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినండి, వీటిలో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. చెక్కర మరియు చల్లని ఆహార పదార్థాలను తినడం మానుకోండి, వాటివలన పళ్ళు కుళ్లిపోతాయి.
 • నొప్పిగా ఉన్నప్పుడు వేడిని తగలనివ్వద్దు , ఇది నొప్పిని ఇంకా పెంచుతుంది.

సాధారణంగా పంటి నొప్పి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది, ఆస్పిరిన్ లాంటి మందులు లేదా నొప్పిని తగ్గించే జెల్‌ని పూయటం వలన మరియు క్రింద చెప్పిన ప్రాకృతిక నివారణలను అనుసరించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.

ప్రాకృతిక నివారణలు

 • లవంగ నూనె – లవంగ నూనెలో బాక్టీరియాను చంపే లక్షణాలు ఉన్నాయి. ఇది పళ్లకు మత్తు కలిగించుతుంది. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి. ఈ నూనెని నొప్పిగా ఉన్న పంటిపై పూసుకోవడంవలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 • లవంగం – కొన్ని లవంగాలను నోటిలో వేసుకొని మెత్తగా అయిన తరువాత నమలండి. నొప్పిగా ఉన్న పళ్ళపై పెట్టి నొక్కండి. ఇలా ఒక అరగంట చేయటం వలన నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి, పళ్ళ సంక్రమణం లేదా పంటి గడ్డలను నివారించటానికి  లవంగం ఉపయోగపడుతుంది.
 • అల్లం మరియు ఎరుపు మిరియాలు – అల్లం పొడి మరియు మిరియాల పొడిని నీటిలో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
 • సాంబ్రాణి – సాంబ్రాణి మంటని తగ్గించి బాక్టీరియాలను చంపుతుంది. ఒక చెంచా సాంబ్రాణి పొడిని రెండు కప్పుల నీటిలో వేసి 30 నిమిషాల పాటు తక్కువ మంటపై పెట్టి వేడి చేయాలి. ఆరిన తరువాత వడగట్టి రోజుకు 4 లేదా 6 సార్లు ఈ నీటితో నోటిని పుక్కిలించండి.
 • మిరియాలు – ఇందులో మంచి సువాసన మరియు మత్తు కలిగించే గుణాలు ఉన్నాయి. మిరియాల ఆకులను వేడి నీటిలో వేసి 20 నిమిషాల పాటు నానపెట్టండి. ఆ తరువాత ఆ నీటితో నోటిని పుక్కిలించండి.
 • ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి, 30 సెకండ్ల పాటు పుక్కిలించండి.
 • వెల్లుల్లి – చూర్ణం చేసిన వెల్లుల్లి లేదా వెల్లుల్లి పొడిని నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి.
 • మంచు గడ్డలు – మంచు గడ్డలు నరాలకు మత్తు కలిగిస్తుంది. నొప్పిగా ఉన్న నరాల పై 15 నిమిషాల పాటు ఉంచండి. వీటికి బదులుగా మంచు పాక్లను బుగ్గలపై ఉంచవచ్చు.
 • బ్లాక్ టీ – ఇందులో రక్తస్రావాన్ని నివారించే గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించి తాత్కాలిక నివారణని ఇస్తుంది.
 • జిగురు కణజాలంను సంరక్షించడానికి, మరింత ముడుచుకొని పోకుండా ఉండటానికి మృదువైన బ్రష్లు ఉపయోగించాలి.
 • పంటి నొప్పిని తగ్గించటానికి పసుపును వాడవచ్చు. దీనికి నొప్పిని తగ్గించే సామర్థ్యం కలదు. బాక్టీరియా మరియు క్రిమి నాసిక లక్షణాలు ఉన్నాయి. పసుపును నీటిలో కలిపి ముద్దగా చేసి దూదితో నొప్పిగా ఉన్న చోటులో రాయండి.
 • హైడ్రోజన్ పెరాక్సైడ్ – పంటి నొప్పిని తగ్గించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా మందికి ఉపయోగ పడింది. అర చెంచా 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నోటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి లేదా ఒక దూదిని ఈ ద్రవంలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచండి.
 • జాజికాయ నూనె – ఒక దూదిని ఈ నూనెలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
 • అరటి ఆకులు, జామ ఆకులు మరియు తోటకూర ఆకులు – ఇవన్నీ పంటినొప్పిని తగ్గించే ప్రాకృతిక పదార్థాలు. ఈ ఆకులను నోటిలో వేసుకొని నమలచ్చు, లేదా వీటిని నలిపి నొప్పిగా ఉన్న చోట్లో పూయండి. జామ ఆకులను నీళ్లలో ఉడకబెట్టి ఉప్పుని కలిపి ఈ నీటితో పుక్కిలించవచ్చు.
 • దోసకాయ – తాజా దోసకాయ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై కొంచం సేపు ఉంచండి. చల్లని దోసకాయ ముక్క భరించలేని నొప్పినుంచి కూడా వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఇది సున్నితమైన పళ్ళపై వాడకూడదు, దానికి బదులుగా దోసకాయను బాగా దంచి అందులో ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయవచ్చు.
 • బేకింగ్ సోడా – బేకింగ్ సోడా ను నీటిలో కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. లేదా వెచ్చని నీటిలో బేకింగ్ సోడాని కలిపి పుక్కిలించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.

పంటినొప్పి ఉపశమనం కోసం ప్రాకృతిక గృహ చిట్కాలు

ఉప్పు మరియు మిరియాలు

ఉప్పు మరియు మిరియాలు మీ వంటింట్లో చాల కావలసిన పదార్థాలు. ఈ పదార్థాలను వాడి మీ పంటినొప్పిని కూడా తగ్గించవచ్చు. వీటి రెండింటి లోను బాక్టీరియా మరియు వేడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. నీటిలో అర చెంచా ఉప్పు మరియు అర చెంచా మిరియాల పొడిని కలిపి ముద్దలా చేసుకొని నొప్పిగా ఉన్న పళ్ళపై రాయండి.

ఉల్లిపాయ

మీరు రోజు తినే ఆహారాలలో ఉల్లిపాయలను వాడుతారు . కానీ ఇది పల్ల సమస్యలను తొలగిస్తుందని కొంత మందికి తెలియక పోవచ్చు. ఇందులో మైక్రోబియల్ ( బాక్టీరియా)ని తొలగించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలతో మీ పంటిలోని క్రిములను నిర్మూలించవచ్చు. పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు పచ్చ ఉల్లిపాయలను నమలండి.

గోధుమ గడ్డి సారం

మీరు తరచూ గోధుమ గడ్డి యొక్క సారంతో నోటిని కడిగితే పంటి నొప్పి నుంచి గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. ఈ సారాన్ని మీరు క్రమం తప్పకుండా వాడాలి. ఇది మీ పళ్ళు మరియు దంతాలపై విష పదార్థాలను తొలగిస్తుంది. బాక్టీరియా మరియు ఎలాంటి సంక్రమణము జరగకుండా కాపాడుతుంది.

Posted on

Telugu tips for cold & cough – జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందటం ఎలా?

జలుబు మరియు దగ్గు సాధారణంగా అందరికీ వస్తుంది. ఇది చాలా అనారోగ్యకరమైన అనుభూతిని ఇస్తుంది. మామూలుగా దీనికి కావలసిన మందులు మనం ఇంటిలో ఉంచుకుంటాం. కానీ తరచుగా ఆ మందులు వేసుకోవటంకన్నా కొన్ని గృహ నివారణలు అనుసరించడం వలన చాలా సులభంగా వీటిని నివారించవచ్చు.

గృహ నివారణలు సురక్షితమైనది మరియు ప్రాకృతికం, అందువలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పద్ధతులు శ్లేష్మంను(చీమిడి) ఉత్పత్తి చేసి శరీర వ్యవస్థను శుభ్రం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పాలు మరియు పసుపు యొక్క సమర్థవంతమైన మిశ్రమం

దగ్గు మరియు జలుబు తగ్గడంకోసం ఉత్తమ గృహ నివారణ వస్తువులు పాలు మరియు పసుపు. వెచ్చని పాలలో పసుపును కలుపుకొని త్రాగితే జలుబు తగ్గిపోతుంది. పెద్దలు మరియు పిల్లలు కూడా దీనిని త్రాగవచ్చు. ఇది సాధారణ జలుబుకు మాత్రమే కాదు, మీకు ఎప్పుడు అనారోగ్యంగా వున్నట్లు అనిపించినా త్రాగవచ్చు.

తేనె, దాల్చిన చెక్క మరియు నిమ్మకాయ

ఈ రెండో నివారణ పద్దతిలో మీరు తేనె, దాల్చిన చెక్క మరియు నిమ్మకాయను ఉపయోగించి ఒక సిరప్‌ను తయారు చేయాలి. ఈ సిరప్‌ను చేయటానికి ఒక చట్టిలో కొంచం తేనె వేసుకొని వేడి చేసి అందులో నిమ్మరసం మరియు ఒక చిటిక దాల్చిన చెక్కను వేసి కలపాలి. ఈ సిరప్‌ని జలుబు నుండి నివారణ పొందటానికి చిన్న పిల్లలు కూడా త్రాగవచ్చు.

బ్రాందీ మరియు తేనె

సాధారణ దగ్గు మరియు జలుబుని నివారించటానికి బ్రాందీ మరియు తేనెలు వాడవచ్చు. ఛాతీని వెచ్చగా ఉంచటానికి మరియు ఒంట్లో వేడిని పెంచటానికి బ్రాందీ ఉపయోగపడుతుంది. తేనెలో దగ్గును తగ్గించే సహజ సామర్థ్యం ఉంది. ఈ రెండూ కలిపి త్రాగటంవలన దగ్గు మరియు జలుబుపై కచ్చితంగా గొప్ప ప్రభావం చూపిస్తుంది.

ఆమ్లా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ఆమ్లాన్ని రోగ నిరోధక ఔషధం అనికూడా చెప్పవచ్చు. ఇది మిమ్మల్ని చాల రోగాలనుంచి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా వుండటంవలన ఇది ఆరోగ్యానికి చాల మంచిది. దీనిని తరచూ తినడం వలన కాలేయము(లివర్) సరిగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మీ రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తులను పెంచుతుంది అందువలన రోజూ ఆమ్లాలని తినండి. సాధారణ దగ్గు మరియు జలుబును తగ్గించటానికి ఇది ఉత్తమ మార్గం.

తులసి, అల్లం మరియు నల్ల మిరియాల టీ

జలుబు వలన బాధపడుతున్నప్పుడు ఈ మసాలా టీ చేసుకోండి. రుచికరమైన మరియు ఘాటైన టీ కోసం మీరు అల్లం, తులసి మరియు నల్ల మిరియాలను వేసుకోవాలి. ఈ టీని త్రాగితే కొద్ది సమయంలోనే మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు.

తేనె, వెచ్చని నీరు మరియు నిమ్మరసం

వెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మరసం కలుపుకొని త్రాగటం వలన సాధారణ దగ్గు మరియు జలుబు నయమవుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని త్రాగటం వలన మీ జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మీ ప్రసరణ వ్యవస్థకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అసౌకర్యానికి గురయినప్పుడు మేజిక్‌లా పనిచేసే పదార్థాలు ఇవి.

అవిసె గింజలు

అవిసె గింజలను నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. నీరు చిక్కగా అయిన తరువాత, వడగట్టి ఆ నీటిలో తేనె మరియు నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగండి. ఇది దగ్గు మరియు జలుబు వలన కలిగిన అసౌకర్యాన్ని తొలగిస్తుంది.

ఆరోగ్యంను కాపాడుటలో అల్లం ఉత్తమమైన పదార్థం

అల్లంను ఇతర పదార్ధాలతో కలిపి తీసుకోవడమే కాకుండా మీ గొంతులో అసౌకర్యం కలిగినప్పుడు అల్లంను పొడి పొడిగా కోసుకొని ఉప్పుని కలిపి నోటితో నమలచ్చు. అల్లం జలుబుకు మాత్రమే కాదు, దగ్గు మరియు గొంతు నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరు దీన్ని నమలడం వలన దీనియొక్క సారం మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

అల్లం, తులసి మరియు తేనె

అల్లం మరియు తులసి మిశ్రమం సాధారణ జలుబు మరియు దగ్గును తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ముందుగా తులసి ఆకులను దంచి అందులో అల్లం సారాన్ని కలపాలి. దీనిని ఇంకా మెరుగు చేయటానికి ఇందులో తేనెని కలపవచ్చు. అల్లం మరియు తులసిల యొక్క సారం మన ఆరోగ్యానికి చాలా మంచిది, వీటిని రోజూ తీసుకోవచ్చు.

దోరగా వేయించిన వెల్లుల్లి

వెల్లుల్లి కూడా మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఆహార పదార్థం. జలుబు మరియు దగ్గును తగ్గించటానికి ముందుగా కొన్ని వెలుల్లిని దోరగా వేయించి ఆ తరువాత కొంచం నెయ్యిని కలిపి వేయించాలి. వీటిని వెచ్చగా ఉన్నప్పుడే తినటం వలన ఆరోగ్యానికి చాల మంచిది.

బెల్లం

బెల్లం దగ్గు మరియు జలుబును నివారిస్తుందని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండొచ్చు. వుడుకు నీటిలో నల్ల మిరియాలు, జీలకర్ర మరియు బెల్లంను వేసి త్రాగండి. ఇది ఛాతిరద్ది నుంచి, జలుబు మరియు దగ్గు నుంచి నివారణ ఇస్తుంది.

క్యారట్

చాలా మందికి తెలియక పోయినప్పటికీ క్యారట్ జలుబు మరియు దగ్గు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. క్యారట్ రసం చాలా ఆరోగ్యకరమైనది మరియు ప్రయోజనకరమైనది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి అదే సమయంలో మీ రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది.

మూలిక టీ

దగ్గు మరియు జలుబు రాకుండా ఉండటానికి మీరు మూలిక టీ ను త్రాగవచ్చు. ప్రత్యేకమైన మూలిక చెట్లలోని ఆకులతో చేయబడిన టీ లో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి. మీకు దీర్ఘకాలిక దగ్గు లేదా జలుబు ఉన్నట్లయితే మీరు మూలిగ టీ ను ఎంపిక చేసుకోవాలి.

ఎన్నో విధాలుగా ఈ టీ ను తయారు చేయవచ్చు. మొదట తులసి ఆకులు వేసి చేయవచ్చు, తులసిని బాగా ఉడికించిన తరువాత కొంచం నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగటం వలన ఆరోగ్యం సంరక్షించబడుతుంది. ఏలకులు, లవంగాలు, వెల్లుల్లి, నల్ల మిరియాలు మరియు అల్లం ముక్కలు కూడా వేసి టీ తయారు చేయొచ్చు. ఇది చేసేటప్పుడు తక్కువ మంటలో వీటన్నిటినీ నీళ్లలో బాగా ఉడికించాలి, ముఖ్యంగా మూత వేసి ఉడికించాలి. ఈ టీ ను త్రాగే ముందు తేనె మరియు పాలను కలుపుకోవచ్చు.

లాసేంగెస్ (గొంతు నొప్పిగా వున్నప్పుడు వాడే మాత్రలు)

ఈ మాత్రలను ఇంటిలోనే తయారు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చిరాకును తగ్గించి గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మాత్రలను తయారు చేయటానికి కావలసిన పదార్థాలు, మిరియాలు, అల్లం, ఏలకులు మరియు తేనె. వీటన్నిటినీ బాగా కలిపి చిక్కని ముద్ద చేసుకోవాలి. చల్లబడిన తరువాత, చిన్న మాత్రల ఆకారంలో తయారు చేసుకొని, అవసరం ఉన్నప్పుడు వాడవచ్చు. వీటిని నోటిలో వేసుకొని చప్పరించాలి, దీని రసాయనం మీ గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది.

తడి సాక్స్ (కాల్ తిత్తి)

పడుకునేముందు వేడి నీటిలో సాక్స్ ను తడిపి వేసుకోండి. ఇది మీ శరీరంలోని రక్తాన్ని కాళ్లలోకి ఈడ్చి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇది రక్తప్రసరణ ప్రక్రియను మెరుగుపరుచుతుంది.

ఆవాలు

ఒక లీటరు వెచ్చని నీటిలో ఒక చెంచా ఆవాల పొడిని కలుపుకొని మీ పాదాలను అందులో నానపెట్టండి. ఇది మీ శరీరంలోని రక్తాన్ని పాదాలకు లాగుతుంది. దీనివల్ల శరీరం వెచ్చదనాన్ని పొంది జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఆవిరిని శ్వాసించండి

జలుబు మరియు దగ్గు వలన ముక్కు మూసుకుపోయినప్పుడు, ఆవిరిని శ్వాసించడం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్లను తీసుకొని మీ తలపై నుండి ఒక పెద్ద టవల్‌ని కప్పుకొని ఆవిరిని శ్వాసించండి.

Posted on

Telugu tips to treat inner thigh skin rashes – తొడల మధ్య దురద చర్మంలోని దద్దుర్లను గుణపరచటం ఎలా?

తొడల మధ్య దద్దుర్లను సాధారణంగా జోక్ దురదమరియు శాస్త్రీయంగా తామర వ్యాధి” (టినియా క్రురిస్) అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఫంగస్ సంక్రమణ వ్యాధి.

ఇది చాలా చిరాకు పుట్టించే సంక్రమణం, సాధారణంగా పురుషులు మరియు స్త్రీలలో కూడా కనబడుతుంది, రోజంతా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

తొడల మధ్య దద్దుర్లు ఎందుకు? ఎలా వస్తాయి ?

మాములుగా తొడల మధ్య తేమ ఉండిపోవటం వలన ఈ దద్దుర్లు రావచ్చు. తేమకు కారణం బిగువుగా ఉన్న దుస్తులు వేసుకోవడం. ఇది ఫంగస్ని ఎక్కువ చేస్తుంది. నడిచేటప్పుడు తొడలు రుద్దుకోవటం వలన దురదగానూ, ఎర్రగా మరియు అరిగేలా చేస్తుంది.

స్నానం చేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్నానం తరువాత శరీరంలోని ప్రతి అంగాన్ని శుభ్రమైన టవల్ తో తుడవండి. ఘర్షణ ఎక్కువగా ఉండే చోట్లను తేమ లేకుండా బాగా తుడవాలి ముఖ్యంగా చర్మంలో మడత భాగాలు, తొడలు, జఘనం మరియు జననేంద్రియ భాగాలు, చంకలలో, పిరుదులలో, బికినీలో. ఈ చోట్లలో గాలిని బాగా ప్రవేసింపచేసి తేమ లేకుండా చేయడం వలన ఈ సమస్య రాకుండా ఉంటుంది.

స్థూలకాయం

చక్కర వ్యాధి (డయాబెటిస్స్) మరియు బరువు ఎక్కువగా ఉండటంవలన వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నప్పటికీ చర్మాన్ని పొడిగా ఉంచినప్పటికీ దదుర్లు రావచ్చు. వీరికి ఎక్కువగా చెమట రావటం వలన చర్మంలోని PH స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది.

PH సమతుల్యత

ఈ సమస్యను తగ్గించడానికి పొడులు లేదా నూనెలను ఉపయోగించవద్దు, ఇవి సమస్యను ఎక్కువ చేయొచ్చు. వాటికి బదులు ఎక్కువసేపు స్నానం చేయండి మరియు ముఖ్యమైన చర్మ భాగాలను బాగా తుడవండి. మీ అంతర్గత దుస్తులు సౌకర్యముగా ఉండేట్లు వేసుకోండి, బిగువుగా ఉన్నవి వాడవద్దు. మీ అంతర్గత దుస్తులుకాని టవల్నికాని ఇతరులతో పంచుకోవద్దు.

తొడల మధ్య దద్దుర్లు తగ్గడానికి గృహ నివారణలు

 • బేకింగ్ సోడాని నీటిలో కలిపి తడిగా ఉన్న చర్మాన్ని కడగటం వలన PH స్థాయిని సమతుల్యం చేస్తుంది.
 • ఒక శుభ్రమైన గుడ్డలో మంచు గడ్డలను మూటగట్టి తొడల మధ్యభాగంలో కొంత సేపు రుద్దటం వలన ఉపశమనం పొందుతారు.
 • కలబందలో(ఆలి వేరా) శీతలీకరణ గుణం ఉన్నందున దాని గుజ్జును చర్మంపై 15 నిమిషాల పాటు మర్దన చేస్తే మీ అసౌకర్యాన్ని తగ్గించుతుంది.
 • వోట్మీల్ని నీటిలో కలిపి కొంచం సేపు ఊరబెట్టిన తరువాత చర్మంపై రాయండి.
 • వెంటనే ఉపశమనం పొందటానికి వేపాకులను వేడి నీటిలో కలిపి స్నానం చేయండి.
 • పసుపును పూయటం వలన లేదా బకెట్ నీలలో కలిపి స్నానం చేయటం వలన ఈ సమస్య తగ్గుతుంది.
 • వీటన్నింటి కన్నా ఉత్తమమైన పద్దతి ఏమిటంటే, కొబ్బరి నూనె, జిత చెట్టు (ఆలివ్) నూనె లేదా నువ్వుల నూనెని తొడల మధ్య రాసి ఒక రాత్రి అలాగే ఉంచండి. ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

ఈ వ్యాసంలోని విషయాలు మీకు అసౌకర్యమైన దద్దుర్ల నుంచి ఉపశమనం కలిగించిందని ఆశిస్తున్నాము.

Posted on

Reasons for irregular periods in Telugu – ఋతుస్రావం క్రమం తప్పడానికి కారణాలు – పీరియ‌డ్స్ స‌రిగ్గా రాక‌పోవ‌డానికి లేదా మిస్ అవ్వటానికి కారణాలు

ఋతుస్రావం ఒక క్రమం ప్రకారం వస్తుంది. సాధారణంగా 28 రోజులకు ఒక సరి వస్తుంది, 2 లేదా 3 రోజులు ముందు వెనుక కావచ్చు. అంతకంటే ఆలస్యంగా లేదా త్వరగా వచ్చినట్లయితే మీకు ఋతుస్రావం సక్రమంగా లేనట్టు. 30 శాతం స్త్రీలకు గర్భవతులుగా ఉన్న సంవత్సరాలలో ఋతుచక్రము సక్రమంగా ఉండకపోవచ్చు, ఇది సాధారణంగా సమస్య కాదు, కానీ ఇది మీకు ఆరోగ్య సమస్యలని సూచిస్తుంది.

మీ ఋతుచక్రం ఎంతవరకు క్రమంగా ఉందో తెలుసా?

 • 21 రోజుల విరామము ముందు ఋతుస్రావం వచ్చినట్లయితే మీకు ఋతుచక్రం సక్రమంగా లేనట్టు.
 • 8 రోజులకంటే ఎక్కువ రోజులు ఉంటే క్రమంగా లేనట్టు.
 • ఒక నెల పీరియ‌డ్స్ రాకపోవడం, ముందుగా రావడం లేదా చాల రోజులు ఆలస్యంగా వచ్చినట్లయితే ఋతుచక్రం సక్రమంగా లేనట్టు.

మీ ఋతుచక్రం లెక్కించడానికి, మీరు మీ ముందు నెల ఋతుస్రావము కాలం యొక్క చివరి రోజు నుండి ఈ నెల ప్రారంభించిన మొదటి రోజు వరకు లెక్కపెట్టాలి. మీ క్రమాన్ని తెలుసుకునేందుకు కనీసం మూడు నెలలు లెక్కించాలి.

పీరియ‌డ్స్ తప్పడానికి మరియు క్రమరహితం కావడానికి కారణాలు

అండోత్సర్గం జరగక పోవడం (ఆన్- ఆవులేషన్) వలన ఋతుస్రావం రాక పోవచ్చు. ఇందుకు ముఖ్యకారణం తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత. కొన్నిసార్లు సూక్ష్మ అసమానతలవల్ల కూడా కావచ్చు. ఇలా జరగటానికి ఆరోగ్య పరిస్థితులు మరియు జీవన విధానం రెండూ కారణాలు. పీరియ‌డ్స్ క్రమంగా రానివ్వకుండా ప్రేరేపించే ప్రధాన కారణాలు కొన్ని:

అధిక వ్యాయామం / ఆహార నియంత్రణ

సాధారణంగా వ్యాయామం అలవాటు లేనివాళ్లు హఠాత్తుగా తీవ్రంగా ప్రారంభించినప్పుడు మీ ఋతుచక్రంపై ప్రభావం చూపిస్తుంది. అలవాట్లను కొనసాగించటం వలన క్రీడాకారులు తరచూ వారి ఋతుస్రావాన్ని కోల్పోతారు. తక్కువ బరువు ఉండటం వలన కానీ అదనపు ఆహార నియంత్రణ పాటించడం వలన కానీ ఆహారపు లోపాలు ఉండటం వలన కానీ ఈ పరిస్థితి రావచ్చు. ఇది మీ శరీర బలహీనతకు మరియు అనారోగ్యానికి దారితీస్తుంది.

ఒత్తిడి

మీ ఋతుచక్రాన్ని ప్రభావితం చేసే ఒక విషయం ఒత్తిడి కావచ్చు. మీకు దీర్ఘకాలిక ఒత్తిడి వున్నట్టయితే మీరు చాలా త్వరగా ఆత్రుత పొందుతారు దీని వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఋతుస్రావం క్రమాన్ని బాధిస్తుంది.

గర్భ నియంత్రణ మాత్రలు

గర్భ నియంత్రణ మాత్రలు తీసుకోవడం వలన ఋతుస్రావం క్రమం తప్పుతుంది. ఈ పరిస్థితి రెండు నెలలకన్నా ఎక్కువ కాలంపాటు సాగవచ్చు. సాధారణంగా వచ్చే పీరియ‌డ్స్ కాకుండా మీకు కొంతకాలం రక్తస్రావం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఋతుస్రావం తప్పిపోవచ్చు, అయినప్పటికీ క్రమంగా సమతుల్యత పొందుతుంది.

పోలీసైస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)

ఈ ఆరోగ్య పరిస్థితి ఎవరికైనా రావచ్చు. సక్రమంగా జీవనశైలి లేని వారికీ మరియు లావుగా ఉన్న స్త్రీలకు ఈ పరిస్థితి సాధారణంగా ఏర్పడుతుంది. అండాశయాలపై చిన్న తిత్తులు ఏర్పడతాయి అవి సాధారణ అండోత్సర్గమునకు అంతరాయం కలిగించుతుంది. పూర్వం ఎప్పుడైనా ఋతుస్రావం క్రమంగా లేని వారికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సంతాన లేమికి కూడా దారి తీస్తుంది. గుండె మరియు మధుమేహం(చక్కెర వ్యాధి) వ్యాధులను పెంచుతుంది.

వయసు

ఋతుస్రావం యొక్క ప్రారంభ సమయంలో సక్రమంగా లేకపోవచ్చు. శరీరం సమతుల్యత పొందటానికి మరియు నూతన మార్పులకు అలవాటుపడటానికి సమయం పడుతుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. మెనోపాజ్ సమయంలో కూడా ఋతుస్రావం క్రమం తప్పవచ్చు.

ఇతర అనారోగ్యాలు

 • థైరాయిడ్ హార్మోన్ల యొక్క రక్త స్థాయిలు చాలా ఎక్కువ లేదా తక్కువగా పోవడం వలన కూడా పీరియ‌డ్స్ క్రమరాహిత్యం కావచ్చు.
 • లైంగిక సంక్రమణ వ్యాధులవలన కూడా మీకు ఋతుస్రావం క్రమరాహిత్యం కావచ్చు.
 • సరైన ఆహార పద్ధతులు లేకపోవడం
 • డయాబెటిస్(చక్కెర వ్యాధి)
 • ఫైబ్రాయిడ్లు
 • ఎండోమెట్రీయాసిస్

మీకు పోలీసైస్టిక్ అండాశయం ఉన్నట్టు భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య ప్రక్రియల ద్వారా గుణపరచవచ్చు. ఒత్తిడి తగ్గించి ఒక పరిమితిలో వ్యాయామాలు అనుసరించటానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీకు ఒక ఆరోగ్యకరమైన ఋతుచక్రం కలగడానికి సహాయం చేస్తుంది.

పీరియ‌డ్స్ తొందరగా రావాలంటే ఏమి చేయాలి?

గర్భనిరోధక మాత్రలు

ఈ మాత్రలు మీ ప్రస్తుత హార్మోన్లను సర్దుబాటు చేయడంవలన మీ గర్భాన్ని ఆపడమే కాకుండా ఋతుస్రావాన్ని త్వరగా వచ్చేలా చేస్తుంది.35 వయస్సు దాటిన ఆడవాళ్ళు ఈ మాత్రలు వాడే ముందు వైద్యులను సంప్రదించడం వలన మరిన్ని సమస్యలను నివారించవచ్చు.

విటమిన్ సి

ఇది శరీరంలోని ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గించడం వలన ఋతుస్రావాన్ని వేగవంతం చేస్తుంది. లేదా ప్రత్యామ్నాయంగా ప్రొజెస్టెరాన్ యొక్క ప్రవేశాన్ని రద్దుచేసి తీవ్రమైన ఆరోగ్య స్థితికి దారితీస్తుంది.

మూలికలు

అల్లం మరియు కొత్తిమీర మీ ఋతుస్రావాన్ని వేగవంతం చేయడానికి సహాయ పడుతుంది. ఇవి గర్భాశయాన్ని విస్తరింపచేసి ప్రవాహానికి దారితీస్తుంది. ఇది ఆలస్యంగా ఋతుశ్రావణం రావడానికి కారణం అయిన మీ హార్మోన్ల లోపాలను కూడా సమతుల్యం చేస్తుంది. టీ లో అల్లం లేదా కొత్తిమీరను కలుపుకొని ఉదయం మరియు రాత్రి త్రాగండి.

వ్యాయామం

మీరు క్రమమైన వ్యాయామం చేయకపోతే బరువు పెరగడం లేదా ఋతుస్రావం ఆలస్యంగా రావడం లాంటి శారీరక సమస్యలను ఎదుర్కుంటారు. మన శరీరాన్ని ధృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వ్యాయామాలు ప్రత్యేకంగా అనుసరించడం వలన ఋతుస్రావాన్ని ముందుగా వచ్చేలా చేస్తుంది. అలాంటి వ్యాయామాలను తెలుసుకొని అనుసరించండి.

ఒత్తిడిని తగ్గించండి

ఒత్తిడిని కలిగించే ఆందోళనలను తగ్గించుకోవాలి, లేకపోతే దీని వలన మీ శరీరంలో మార్పులు రావచ్చు. వీటిని పూర్తిగా నివారించలేక పోయినప్పటికీ కొన్ని పద్ధతులు పాటించడం వలన వీటికి దూరంగా ఉండొచ్చు. యోగా మరియు ధ్యానం సాధన చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

బరువు తగ్గడం

తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగటం వలన మీ ఋతుస్రావం ఆలస్యం కావచ్చు. ప్రస్తుత శరీర ఆకృతిని సంరక్షించుట చాలా అవసరం.

Posted on

Itching skin remedies in Telugu – దురద చర్మాన్ని చికిత్స చేయడానికి గృహ నివారణలు

మీరు దురద సమస్యను ఎదుర్కుంటున్నారా? ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సాధారణం అయిపోయింది. అనేకమంది దురద బాధితులు ఉన్నారు. పురుగులు కుట్టడం వలన, చర్మ సంక్రమణ వలన, సబ్బులు మరియు డిటర్జెంట్ వలన, పొడి వాతావరణం వంటి కారణాల వలన దురద రావచ్చు.

దురద అంటువ్యాధులు మరియు గాయాలకు దారితీస్తుంది మరియు మీ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించగలవు. దురద నుండి ఉపశమనం కలిగించేందుకు అనేక గృహ నివారణలు ఉన్నాయి.

గృహ నివారణలు

చల్లని నీరు

చల్లని నీటితో స్నానం చేయడం వలన దురద తగ్గుతుంది. లేదా మీరు వెంటనే ఉపశమనం పొందడానికి మంచు ప్యాక్‌లను(ఐస్ ప్యాక్) ఉపయోగించవచ్చు.

బేకింగ్ సోడా

ఒక కప్పు బేకింగ్ సోడాను ఒక బకెట్ వెచ్చని నీటిలో కలిపి 30 నుండి 60 నిముషాలు  ఉంచండి. ఆ తరువాత ఈ నీటితో స్నానం చేయండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

మూడు కప్పుల వెనిగర్‌ని బకెట్ నీళ్లలో కలిపి 20  నుండి ౩౦ నిమిషాల తరువాత ఈ నీటితో స్నానం చేయండి.

నిమ్మకాయ

ఉపశమనానికి మీరు దురదగా వున్న చోట్లలో నిమ్మరసాన్ని పూయండి.

విటమిన్స్

విటమిన్ ఏ,బి మరియు ఇ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పొడి పళ్ళు( డ్రై ఫ్రూట్స్)  రోజు తినడం వలన చర్మంలోని తేమ తగ్గకుండా ఉంటుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నూనెలు

వేడిని తగ్గించే (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణాలు ఉన్న నూనెలను వాడాలి. వాటిని దురద ఉన్న ప్రాంతాలపై పూయవచ్చు, లేదా స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు. క్రింద చెప్పిన నూనెలలో వేడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

తులసి నూనె, బకరాకు నూనె (బే లీఫ్ ఆయిల్), బంతి పూల నూనె (కలేన్ద్యులా ఆయిల్), దొగ్గలికూర నూనె (చిక్వీడ్ ఆయిల్), చామంతి నూనె (చమోమిలే ఆయిల్), గెరనియం ఆయిల్, లవంగ నూనె, ఆగ్రిమొనీ ఆయిల్, వేప నూనె, జ్యువెల్వీడ్ ఆయిల్, దురదగొండి నూనె, రోజ్మేరీ ఆయిల్, థైమ్ ఆయిల్, మిరియాల నూనె (పెప్పర్మిట్ ఆయిల్) మరియు లావెండర్ ఆయిల్.

వోట్మీల్

వెచ్చని నీటిలో రెండు కప్పుల పొడిచేసి వోట్మీల్ని కలుపుకొని స్నానం చేయడం వలన మీ దురద చర్మానికి  చల్లదనాన్ని మరియు ఉపశమనాన్ని ఇస్తుంది.

కొబ్బరి నీళ్లు మరియు కొబ్బరి పాలు

కొబ్బరి పాలు నల్లని మచ్చలను మరియు చర్మంలోని పొడితనాన్ని తగ్గిస్తుంది. ముఖానికి లేదా దురద ఉన్న చోటులో కొబ్బరి పాలను పూసి ఒక రాత్రి దాన్ని అలాగే ఉంచాలి.

కొబ్బరి నూనె దురదని తగ్గించేందుకు  తోడ్పడుతుంది. మోచేతులకు, కాలి వెనుక భాగాలకు, చేతులకు లేదా దురదగా ఉన్న చోట్లలో పూసి ఒక రాత్రి అలాగే ఉంచాలి.

బేసిల్

బేసిల్లో యుజెనాల్ ఎక్కువగా ఉంటుంది. ఐదు గ్రాముల ఎండు బేసిల్ ఆకులను వేడి నీళ్లలో వేసి మూసిపెట్టాలి. ఆ నీళ్లు చల్లబడిన తరువాత ఒక గుడ్డని ఆ నీటిలో తడిపి దురదగా ఉన్న చోటులలో రాయాలి. ఇలా చేయడం వలన దురద తగ్గుతుంది.

ఆలీవెరా

ఒక ముక్క ఆలీవెరా తీసుకొని అందులోని జెల్‌ని దురదగా ఉన్న చోటులో రాయండి. ఆలీవెరాలో వేడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటుంది. ఇది వాడటం  వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆలీవెరా మీ చర్మాన్ని మలినాలనుంచి కాపాడుతుంది.

తేనె

తేనెలో యాంటీమైక్రోబియల్ మరియు యాంటిఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి తోడ్పడుతుంది. వెచ్చని తేనెని దురదగా ఉన్న చోటులో రాసి 15 నుండి 20 నిముషాలు ఉంచండి.

గ్లిసరిన్

గ్లిసరిన్ చర్మానికి నీటి పదార్థాలను చేర్చుతుంది. దీనిని పన్నీరులో కలిపి దురదగా ఉన్న చర్మం పై రాయండి.

పుదీనా

పుదీనాలో కావల్సినంత మెంథాల్ ఉంటుంది. ఇది మంటని తగ్గించి మత్తును పెంచడంవలన దురద తగ్గుతుంది.

ఐదు గ్రాముల పుదీనాని వేడి నీటిలో వేసి మూసిపెట్టాలి. అది ఆరిన తరువాత ఒక శుభ్రమైన గుడ్డని ఈ నీటిలో తడిపి దురదగా ఉన్న చర్మంపై రాయాలి.

థైమ్

థైమ్ లో కావల్సినంత థైమోల్ ఉంటుంది. ఇది మంటని తగ్గించి మత్తును పెంచడంవలన దురద తగ్గుతుంది.

ఐదు గ్రాముల థైమ్ ఎండు ఆకులను వేడి నీటిలో వేసి మూసిపెట్టాలి. అది ఆరిన తరువాత ఒక శుభ్రమైన గుడ్డను ఈ నీటిలో తడిపి దురదగా ఉన్న చర్మంపై రాయాలి.

జీవన విధానం

మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమళంతో కూడిన సబ్బులను వాడకూడదు, ఎందుకంటే అందులో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి అందువలన దురద రావచ్చు. ఎక్కువగా నీరు త్రాగటంవలన శరీరానికి కావల్సినంత తేమ పదార్థం లభిస్తుంది మరియు శరీరంలోని విషపదార్థాలను మూత్రం ద్వారా తొలగిస్తుంది. పాలిస్టర్ మరియు సింథటిక్ వస్త్రాలను ధరించకూడదు, ఇవి దురదను ఎక్కువ చేస్తుంది. కాఫీ మరియు మద్యం సేవించకూడదు, ఇందులోని కెఫిన్ చర్మంలో పొడితనాని పెంచుతుంది.