Posted on

Benefits of sugarcane juice in Telugu – చెరుకు రసం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

భారతదేశంలో ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం ఒక ప్రముఖ పానీయం. ప్రపంచంలో ప్రముఖ చెరుకు ఉత్పత్తిదారులలో భారతదేశం కూడా ఒకటి.

చెరుకు, గ్రాస్ ఫామిలీకి చెందిన ముఖ్యమైన వాటిలో ఒకటి. దీనిని గన్న (Ganna) అని కూడా అంటారు. ఇందులో సుక్రోజ్ మరియు మన ఆరోగ్యానికి సహాయపడే జింక్, క్రోమియం, కోబాల్ట్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం మరియు కాపర్ లాంటి పోషకాలు ఉన్నాయి. ఇది శరీరానికి సహజమైన శక్తిని ఇస్తుంది. క్రింద చెప్పినవి చెరకు రసం యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు.

ఇందులో విటమిన్స్ ఎసిబి1 మరియు బి2, బి5 మరియు బి6 మరియు ఐరన్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు, సాల్యబుల్ ఫైబర్ మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి.

చెరుకు రసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

 • వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి విలువైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేందుకు అవసరమైన అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు చెరుకు రసంలో ఉంటాయి.
 • ఆర్టిఫీషియల్ మరియు ఎయిరేటేడ్ పానీయాలకు బదులుగా చెరుకు రసం త్రాగటం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
 • మూత్రం, ప్రొస్టాటిటిస్, మూత్రపిండాలలో రాళ్లు, STD (లైంగికంగా సంక్రమించిన వ్యాధి) మరియు మూత్ర నాళాల అంటువ్యాధులను గుణపరిచేందుకు చెరుకు రసం ఉపయోగపడుతుంది.
 • చెరకు రసం శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. క్లెన్సింగ్, జీవక్రియను మెరుగుపరుచడం మరియు డీటాక్సీఫయింగ్ ప్రక్రియల ద్వారా ఇది శరీరం నుండి టాక్సిన్స్ ని తొలగించేందుకు సహాయపడుతుంది. నిమ్మరసం లేదా కొబ్బరి నీటితో చెరకు రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే, క్రమంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
 • ఇందులో ఐరన్ మరియు ఫోలేట్స్ ఉండటం వలన ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇది పుట్టబోయే శిశువుని కూడా అనేక బర్త్ డిఫెక్ట్స్ నుండి కాపాడుతుంది.
 • చెరకు రసం యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది. ఇది చర్మంపై వృద్ధాప్య సంకేతాలు ఆలస్యంగా వచ్చేందుకు సహాయపడుతుంది. ఇది మోటిమలతో పోరాడటానికి, మచ్చలు తగ్గించడానికి మరియు చర్మాన్ని హైడ్రేట్ చేయటానికి సహాయపడుతుంది.
 • యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి.
 • చెరుకులో సహజమైన చక్కెర ఉంటుంది మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరగడాన్ని నిరోధిస్తుంది. డయాబెటిస్స్ ఉన్న వారు ఎయిరేటేడ్ పానీయాలకు బదులుగా చెరుకు రసాన్ని తీసుకోవచ్చు. కానీ, టైప్ 2 డయాబెటిస్స్ ఉన్నవారు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తరువాత మాట్లాడక తీసుకోవాలి.
 • రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడేందుకు చెరుకు రసం ప్రభావితంగా పనిచేస్తుంది.
 • చెరకు రసం శరీరంలోని ప్రోటీన్ స్థాయిని పెంచుతుంది తద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సహాయపడుతుంది.
 • చెరుకు రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ అంటువ్యాధులతో పోరాడేందుకు సహాయపడతాయి. ఇది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇది కాలేయాలను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది మరియు బిలిరుబిన్ స్థాయులను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.
 • ఇది కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఉండటం వలన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది.
 • చెరుకు రసంలో మినరల్స్ ఎక్కువ స్థాయిలో ఉన్నందున ఇది టూత్ డీకే మరియు బాడ్ బ్రీత్ లాంటి సమస్యలను తొలగించేందుకు సహాయపడుతుంది.
 • బలమైన మెరిసే గోర్లకు అవసరమయ్యే అన్ని పోషకాలూ చెరుకు రసంలో ఉంటుంది కనుక ఇది సహజంగా గోర్లను బలపరుస్తుంది.
 • ఫిబ్రైల్ డిజార్డర్లతో బాధపడుతున్న వారికి చెరుకు రసం చాలా మంచిది. శరీరం నుండి అధిక ప్రోటీన్ లాస్ అవ్వడానికి మరియు జ్వరం లాంటి అనారోగ్యాలు రావటానికి ఫిబ్రైల్ డిజార్డర్ ఒక కారణం. ఇది ముఖ్యంగా శిశువులు మరియు పిల్లలలో అనారోగ్యాలకు దారి తీస్తుంది. చెరకు రసం రెగ్యులర్గా త్రాగటం వలన శరీరానికి అవసరమైన ప్రోటీన్‌లను అందిస్తుంది. ఇది అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించి అవాంఛిత అనారోగ్యం నుండి రికవర్ అయ్యేందుకు సహాయపడుతుంది.
 • చెరుకు రసం మీ జుట్టుకు కూడా మంచిది. ఇది మీ జుట్టు యొక్క సరైన పెరుగుదలలో సహాయపడుతుంది మరియు హెయిర్ ఫాల్‌ని నిరోధిస్తుంది.
 • చెరుకు రసంలో కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల అభివృద్ధిలో సహాయపడుతుంది మరియు మీ ఎముకలను బలంగా చేస్తుంది. ఇవి డీహైడ్రేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది.
 • మూత్ర విసర్జన ప్రక్రియలో కలిగే గనోరియా మరియు మూత్రకోశము యొక్క శోధము లాంటి వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది.
 • చెరుకు రసంలో ఫ్లెవనాయిడ్స్ మరియు ఫెనోలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లెవనాయిడ్స్ శరీరంలో యాంటీ ఇంఫ్లమేటరి, యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటి వైరల్ మరియు యాంటీ అలర్జీ లాంటి లక్షణాలను అందించడానికి సహాయపడుతుంది.
 • గొంతు మంట, గొంతు గడ్డ కట్టడం, ఫ్లూ వంటి సమస్యలకు చెరుకు రసం ఉత్తమమైన రెమిడీ.
 • శరీరంలోని కండరాలలో శక్తిని నింపేందుకు అవసరమైన గ్లూకోజ్‌ను ఇది అందిస్తుంది.
 • పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. జాండీస్ సమయంలో శరీరంలో తగ్గిపోయిన గ్లూకోజ్ స్థాయులని తిరిగి పొందేందుకు రోజుకు 3 నుండి 4 గ్లాసుల చెరుకు రసాన్ని త్రాగండి.
 • ఇందులో సుక్రోజ్ వంటి అనేక రకాల కాంపౌండ్స్ ఉండటం వలన ఇది గాయాలు తొందరగా నయం అయ్యేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.
 • చెరుకు రసాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన కడుపు, మూత్రపిండాలు, గుండె, కళ్ళు, మరియు లైంగిక అవయవాలు బలపడతాయి.
 • చెరుకు రసం శరీరంలోని LDL మరియు ట్రైగ్లిజెరైడ్స్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
 • ఎండ‌లో ఎక్కువగా తిరిగే వారు చెరుకు రసం తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి. దీంతో ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది. ఇది లివర్‌ను పటిష్టం చేస్తుంది.

మంచి ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒక్క సారైనా చెరుకు రసాన్ని త్రాగాలి.