Posted on

Easy egg roll recipe in Telugu – ఎగ్ రోల్ రెసిపీ

ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన డిన్నర్ కొరకు ఎగ్ రోల్ ని ట్రై చేయండి. గోధుమ పిండి మరియు గుడ్లను ఉపయోగించి తయారు చేసే ఈ వంటకం కలకత్తా లో ఎంతో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్. మధ్యలో ఉంచే స్టఫ్ ని సమానంగా స్ప్రెడ్ చేయడం ద్వారా ప్రతి బైట్ లో అద్భుతమైన రుచిని పొందగలరు. మరి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఎగ్ రోల్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి – 1 కప్పు
  • ఉప్పు – 2 టీ స్పూన్లు
  • నూనె
  • గుడ్డు –  1
  • బట్టర్ (optional)
  • దోసకాయ ముక్కలు
  • తరిగిన ఉల్లిపాయలు
  • చిన్నగా తరిగిన పచ్చి మిర్చీ
  • మిరియాల పొడి
  • నిమ్మరసం
  • టమాటో కెచప్
  • గ్రీన్ చిల్లీ సాస్

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నూనె వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బౌల్ లో 1 గుడ్డును కొట్టుకొని, 1 చిటిక ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని చపాతీలా తిక్కుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి నూనె లేదా బట్టర్ ని రాసి చపాతీ ని రెండు వైపులా వేడి చేసుకోవాలి.
  • ఆ తరువాత చపాతీని పక్కకుతీసి అదే పెనము పై కలిపి ఉంచుకున్న గుడ్డును వేసి ప్యాన్ పై బాగా స్ప్రెడ్ చేయాలి.
  • ఆ తరువాత దాని పై చపాతీని ఉంచి, గుడ్డు బాగా కుక్ అయిన తరువాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  • మధ్యలో కొన్ని దోసకాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చులు, మిరియాల పొడి, నిమ్మరసం, కొద్దిగా టమాటో కెచప్ మరియు గ్రీన్ చిల్లీ సాస్ ని వేసుకొని రోల్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ ఎగ్ రోల్ రెడీ!