Posted on

Remedies to cure chickenpox in Telugu – చికెన్ పాక్స్ నివారణకు గృహ చిట్కాలు

చికెన్ పాక్స్ ని ఆటలమ్మ, అమ్మోరు లేదా తట్టు అని అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక భాగాలలో ఉన్న ప్రజల్లో ఏర్పడే ఒక సాధారణ వైరల్ వ్యాధి. ఇది ఒక అంటు వ్యాధి. ఈ సంక్రమణం ఒకసారి కంటే ఎక్కువగా రావటం చాలా అరుదు. ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం చర్మంపై దురద బొబ్బలు ఏర్పడటం. జ్వరము, తలనొప్పి, అలసట వంటివి దీని యొక్క ఇతర లక్షణాలు.

ఇది సుమారు రెండు వారాల పాటు ఉంటుంది. ఈ వ్యాధి భౌతిక సంబంధాల వలన కూడా వ్యాపిస్తుంది. ఈ సంక్రమణ బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు మరింత తీవ్రంగా ఉంటుంది.

వ్యాక్సినేషన్ కనుగొన్న తర్వాత టీకాలు వేయడం ద్వారా చికెన్ పాక్స్ నుండి పిల్లలకు రక్షణ కల్పించబడింది. ఈ వ్యాధి యొక్క కారణాలు మరియు లక్షణాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

చికెన్ పాక్స్ యొక్క కారణాలు

చికెన్ పాక్స్ వరిసెల్లా జోస్టర్ వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఫిసికల్ కాంటాక్ట్ ద్వారా, లేదా జలుబు, ఫ్లూ మరియు దగ్గు వలన వ్యాపించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వలన చర్మంపై బొబ్బలు ఏర్పడుతాయి. బొబ్బలలోని ద్రవంతో కాంటాక్ట్ వలన కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ సంక్రమణ రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ రెండోసారి రాదు.

వాక్సినేషన్ చేసుకోని వారికి మరియు ఇదివరకు ఈ ఇన్ఫెక్షన్ రాని వారికి ఈ వైరస్ తొందరగా అంటుకునే ప్రమాదం ఉంది. కలుషితమైన వస్తువులను మరియు ఉపరితలాలను తాకడం ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశించవచ్చు.

చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు

వైరస్‌కు గురైన 10 నుండి 21 రోజుల తర్వాత చికెన్ పాక్స్ పైకి కనిపిస్తుంది. ఇది సాధారణంగా 5 నుండి 10 రోజుల వరకు ఉంటుంది. చికెన్ పాక్స్ యొక్క ముఖ్య సూచన దద్దుర్లు. క్రింద చెప్పిన ఇతర సంకేతాలు మరియు లక్షణాలు దద్దుర్లు వచ్చే ఒకటి రెండు రోజుల ముందు కనిపించవచ్చు:

 • జ్వరం
 • ఆకలి లేకపోవటం
 • తలనొప్పి
 • అలసట మరియు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించటం (ఆయాసం)

చికెన్ పాక్స్ వచ్చిన తరువాత మీకు నయం అయ్యే ముందు దద్దుర్లు మూడు దశల వరకు వెళ్తాయి

 • మీ శరీరంపై ఎరుపు గడ్డలు అభివృద్ధి చెందుతాయి.
 • గడ్డలు స్రావంతో నిండిన బొబ్బలుగా అవుతాయి.
 • ఆ బొబ్బలు తిరిగి గరుకుగా మారి, గడ్డకట్టి ఆ తరువాత నయం అవ్వటానికి ప్రారంభమవుతుంది.

ఈ సంక్రమణ ఎక్కువగా ఎవరికి వ్యాపిస్తుంది

ఇదివరకే ఈ వైరస్ సంక్రమణ కలిగి ఉంటే లేదా టీకా వేసుకొని ఉంటే చికెన్ పాక్స్ ప్రమాదం ఉండదు. వైరస్ నుండి ఇమ్యూనిటీ ఒక తల్లి నుంచి శిశువుకు పంపబడుతుంది. పుట్టిన శిశువుకు సుమారు మూడు నెలల వరకు ఈ ఇమ్యూనిటీ ఉంటుంది.

ఇదివరకు ఈ ఇన్ఫెక్షన్ కలగని వారికి క్రింద చెప్పిన సందర్భాలలో చికెన్ పాక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి:

 • చికెన్ పాక్స్ సోకిన వ్యక్తితో మీకు ఇటీవల ఫిసికల్ కాంటాక్ట్ కలిగి ఉన్నప్పుడు.
 • మీకు 12 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.
 • అనారోగ్యం లేదా మందుల కారణంగా మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు.

చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వాటి నుండి ఉపశమనం పొందేందుకు క్రింద చెప్పిన కొన్ని ఇంటి నివారణ పద్దతులను అనుసరించండి.

చికెన్ పాక్స్ ను నివారించడానికి హోం రెమెడీలు

ఆపిల్ సీడర్ వినిగర్

దురద మరియు వాపును అరికట్టడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పదార్ధాలలో ఆపిల్ సీడర్ వినిగర్ ఒకటి. మీరు చేయాల్సిందల్లా, ఒక గ్లాసు నీటిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని కలుపుకొని ఒక పత్తి లేదా శుభ్రమైన వస్త్రాన్ని ముంచి చర్మంపై రాయాలి. లేదా స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని చుక్కల వినిగర్‌ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు.

కలేమైన్ లోషన్

చర్మంపై చికెన్ పాక్స్ ఏర్పడినప్పుడు కలేమైన్ లోషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దురదను తగ్గిస్తుంది. ఒక పత్తిని ఉపయోగించి మృదువుగా కలేమైన్ లోషన్‌ని చర్మంపై రాయండి.

చమోమిలే టీ

చికెన్ పాక్స్ ని క్యూర్ చేసేందుకు చమోమిల్ టీ ఒక మంచి పరిష్కారం. కొద్దిగా చమోమిలే టీ ని సిద్ధం చేసి, దానిలో పత్తిని ముంచి చర్మంపై రాయండి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు క్రిమినాశక లక్షణాలు ఉన్నందున, చర్మంపై దురదను తగ్గిస్తుంది.

విటమిన్ డి

చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఇది అంటువ్యాధి అయినందున మనం ఇంటిలోనే ఉంటాము. కానీ అటువంటి సమయంలో సూర్య కిరణాలు మన శరీరంపై పడటం చాలా మంచిది. సూర్య కిరణాలలోని విటమిన్ డి చికెన్ పాక్స్ తొందరగా తగ్గేందుకు సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ కొద్ది సమయం సూర్య కిరణాలలో కూర్చోండి.

లావెండర్ ఎస్సెంటిల్ ఆయిల్

చికెన్ పాక్స్ ని గుణపరిచేందుకు మరొక ఉత్తమ పరిష్కారం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. చికెన్ పాక్స్ వలన కలిగే వాపు, దురద, మరియు చికాకు లావెండర్ ఆయిల్ ని ఉపయోగించటం ద్వారా తొలగిపోతుంది. ఒక గిన్నెలో లావెండర్ ఆయిల్తోపాటు కొబ్బరి నూనె లేదా బాదం నూనెని సమాన భాగాలుగా కలుపుకోండి. చికెన్ పాక్స్ ప్రభావితం అయిన చర్మంపై రాసి ఆరే వరకు ఆగండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

మరొక పద్దతి: మీరు స్నానం చేసే వెచ్చని నీటిలో చమోమిలే ఎస్సెంటిల్ నూనె మరియు లావెండర్ నూనెని సమాన భాగాలలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి.

సాండెల్ వుడ్ ఆయిల్

సాండెల్ వుడ్ ఆయిల్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది చికెన్ పాక్స్ వలన ఏర్పడే స్కార్స్ ని తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక స్పూన్ బాదాం నూనె మరియు మూడు చుక్కల సాండెల్ వుడ్ ఆయిల్ ని కలుపుకొని చర్మంపై రాయండి. ప్రతి రోజూ రెండుసార్లు ఇలా చేయడం వలన స్కార్స్ తొందరగా తొలగిపోతాయి.

విచ్ హాజెల్

చికెన్ పాక్స్ వలన ఏర్పడే దద్దుర్లు, చికాకు, దురద మరియు మంటని తగ్గించేందుకు విచ్ హాజెల్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ విచ్ హాజెల్ మరియు రెండు స్పూన్ కాలెందుల పువ్వులను వేసి కవర్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం దీనిని ఒక మృదువైన పేస్ట్‌లా రుబ్బి చికెన్ పాక్స్ ప్రభావితం అయిన చర్మంపై రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు ఒక సరి చేసి మంచి ఫలితాలను పొందండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చికెన్ పాక్స్ వలన కలిగే బొబ్బలపై చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి చర్మంపై రాయండి. ఈ పద్ధతిని తరచూ ఉపయోగించవచ్చు. లేదా మీరు స్నానం చేసే నీటిలో బేకింగ్ సోడాని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు. ఈ పద్దతులను చాలా సార్లు రిపీట్ చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

తేనె

చికెన్ పాక్స్ వలన కలిగే అసౌకర్యం నుండి ఉపశమనాన్ని పొందేందుకు తేనె ఉపయోగపడుతుంది. ఇందులో యాంటి బ్యాక్టీరియల్ లాంటి లక్షణాలు ఉన్నాయి. తేనెని డైరెక్ట్ గా దద్దుర్లపై రాసి కొంత సమయం ఉంచి కడగండి.

వేప ఆకులు

ఇది ఎన్నో సంవత్సరాలుగా చికెన్ పాక్స్ ని క్యూర్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. వేప ఆకులో యాంటీ వైరన్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలకు చికెన్ పాక్స్ వచ్చినట్లయితే వేపాకు పేస్ట్‌ని డైరెక్ట్ గా చర్మంపై రాయటం వలన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన వేపాకులను డైరెక్ట్ గా చర్మంపై రాయకుండా నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేయించండి.

బ్రౌన్ వినిగర్

వినిగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చికెన్ పాక్స్ బాధితుల విషయంలో బొబ్బలను త్వరగా పొడిగా చేయడానికి మరియు చర్మంపై శాశ్వత మచ్చలను నివారించడానికి వినిగర్‌ని ఉపయోగిస్తారు. సగం కప్పు వినిగర్‌ని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు ఈ పద్దతిని కొనసాగించండి.

వోట్మీల్ మరియు ఎస్సెంటిల్ ఆయిల్స్

వోట్మీల్ కూడా చికెన్ పాక్స్ వలన ఏర్పడే చికాకుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వోట్మీల్ను పొడి చేసి, స్నానం చేసే నీటిలో కలపండి. దీనికి ఉత్తమ మార్గం ఒక వస్త్రంతో చేసిన బ్యాగ్లో వోట్మీల్ పొడిని వేసుకొని స్నానపు తొట్టె నీటిలో బ్యాగ్‌ని ముంచి బాగా కలపండి. నీరు నెమ్మదిగా పాల రంగుకు మారుతుంది. ఇలా 15 నిముషాల పాటు నానబెట్టి ఆ నీటితో స్నానం చేయండి.

వోట్మీల్ బాత్ యొక్క ప్రభావాన్ని మరింత పెంచుటకు, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, రోమన్ చమోమిలే ఆయిల్, లవంగ నూనె, రోజ్మేరీ ఆయిల్ మరియు నౌలోయి ఆయిల్ లాంటి ఎస్సెంటిల్ ఆయిల్‌ను చేర్చుకోండి. లావెండర్ మరియు చమోమిల నూనెను వాడుతున్నట్లయితే 4 చుక్కలు వేసుకోవచ్చు, మిగిలిన నూనెల్ని 2 చుక్కలు వేసుకోవచ్చు. ఈ నూనెలు చర్మ కణాల పునరుజ్జీవనంలో తోడ్పడుతుంది మరియు మచ్చలు ఏర్పడకుండా సహాయపడతాయి.

ఎప్సోమ్ సాల్ట్

ఎప్సోమ్ సాల్ట్ యొక్క ఔషధ లక్షణాల వలన దీనిని వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఎప్సోమ్ ఉప్పు యొక్క బేసిక్ కాంపొనెంట్మెగ్నీషియం సల్ఫేట్. ఇది శరీరంలోని ఒత్తిడిని మరియు నొప్పిని తగ్గిస్తుంది. రెండు కప్పుల ఎప్సోమ్ ఉప్పుని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన దురదను తగ్గించి సౌకర్యమైన అనుభూతిని అందిస్తుంది.

కూరగాయలు మరియు అల్లం

బాహ్య చికిత్సలు మాత్రమే కాకుండా, కొన్ని పదార్ధాలను తినటం వలన కూడా చికెన్ పాక్స్ యొక్క లక్షణాలను తొలగించవచ్చు. క్యారట్ మరియు కొత్తిమీర ఆకులు శరీరాన్ని చల్లబరుస్తాయి, వీటితో సూప్ తయారు చేసుకొని తీసుకోవచ్చు. చికెన్ పాక్స్ వలన కలిగే దురదను తగ్గించడానికి గ్రీన్ పీస్‌ని ఉపయోగించవచ్చు. ఒక కప్పు ఉడికించిన బఠానీలను చూర్ణం చేసి చర్మంపై రాయటం వలన ఉపశమనాన్ని ఇస్తుంది.

అల్లం కూడా శరీర వ్యవస్థపై వివిధ సానుకూల ప్రభావాలను చూపుతుంది. నీటిలో అల్లం వేసి బాగా ఉడికింది అందులో తేనె మరియు నిమ్మరసం కలుపుకొని త్రాగటం వలన చికెన్ పాక్స్ బాధితులకు చాలా ఉపశమనంగా ఉంటుంది. అల్లంను పొడి చేసి స్నానం చేసే నీటిలో కలుపుకొని ఉపయోగించటం వలన కూడా ఉపశమనాన్ని పొందుతారు.

ఔషధ పుష్పాలు

జాస్మిన్ మరియు మ్యారిగోల్డ్ వంటి పువ్వులలో వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి చికెన్ పాక్స్ కి వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. రోజుకు 3 నుండి 4 సార్లు జాస్మిన్ టీ త్రాగండి మరియు ఎండబెట్టిన జాస్మిన్ పొడిని స్నానపు నీటిలో చేర్చుకోండి. మ్యారిగోల్డ్ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఒక టీస్పూన్ విచ్ హాజెల్ ఆకుల మరియు కొన్ని మ్యారిగోల్డ్ పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్‌లా రుబ్బు కొని చర్మంపై రాయండి. బాగా ఎండిన తరువాత నీటితో కడగండి.

చికెన్ పాక్స్ సమయంలో చక్కని చిట్కాలు

 • చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అత్తి పండ్లను తినవచ్చు.
 • తాజా కూరగాయలు మరియు పండ్లతో తయారు చేసిన ఫల రసాలను ఎక్కువగా తీసుకోండి.
 • స్కార్స్ ని తొలగించడానికి, విటమిన్ ఇ నూనెని ఉపయోగించండి.
 • ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
 • ఎక్కువ నీటిని త్రాగాలి.
 • విటమిన్ ఏ, సి మరియు డి సప్లిమెంట్స్ ని తీసుకోవచ్చు.
 • మాంసం వంటివి ఘన ఆహారాన్ని తగ్గించండి.

ఈ గృహ నివారణలు చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. వీటితో పాటు బాధితులు సరైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు కాన్డ్ పానీయాలను నివారించాలి. వీటన్నిటితో పాటు చికెన్ పాక్స్ బాధితులు అధిక విశ్రాంతి తీసుకోవాలి.