Posted on

Telugu remedies to remove the acne scars – మొటిమ మచ్చలు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

సాధారణంగా మొటిమలు ముఖం మీద మెడ, వీపుపై, భుజాలపై వస్తాయి. మొటిమలు అనేవి మన చర్మం పై చీముతో కూడిన వాపు వలే వస్తాయి. ఖచ్చితంగా చెప్పలంటే ఈ సమస్యకు కారణం అధికంగా శ్లేషపటలము క్షయము కలిసిన మిశ్రమము స్రావంగా సెబాషియస్ గ్రంధుల వల్ల ఈ విధంగా చర్మం పై వస్తాయి. ఇది అంతా పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఆకర్షణారహితంగా కనిపించటం ఒక్కటే ఇబ్బందికర విషయం. మొటిమలు సాధారణంగా ఒక లేత గులాబీ రంగులోనూ మచ్చతిత్తి వలే కనిపిస్తాయి.

కొందరిలో మాత్రం తీవ్రంగా ఈ సమస్య ఉంటే అవి మాత్రం తెల్లటి చీము స్రావం వాటి ద్వార కారటం కూడా చూస్తాం. సాధారణంగా మొటిమలు కొన్ని రోజులకే ఎండిపోయి తగ్గిపోతాయి కానీ ఆ మొటిమలకు సంబంధించినా ఆ మచ్చలు మాత్రం మాత్రం పోవు. కానీ  వాటిని తొలగించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మచ్చల్ని తొలగించుకునేందుకు ఈ రోజు మార్కెట్లో చాలా క్రీములు వచ్చాయి. కానీ ఏ ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫ్ఫెక్ట్లు లేకుండా త్వరగా తగ్గలంటే కొన్ని గృహ చిట్కాలున్నాయి. ఇవి చాలా చక్కగా పని చేస్తాయి.

ఇవి తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

సాధారణంగా మొటిమల మచ్చలను తొలగించుకునేందుకు బయట దొరికే కాస్మెటిక్స్ అలాగే వివిధ రకాల ప్రాడక్ట్స్ వెతికి మరీ వాడతారు. అయితే ఇవి చర్మంపై ఎలాగ పనిచేస్తాయో మాత్రం చెప్పటం మాత్రం కష్టం. అదీ టీనేజర్లపై ఎలాంటి ప్రభావముంటుందో చెప్పటం కష్టం ఎందుకంటే వీరిది చర్మం లేతగా ఉండటం కూడా ఓ కారణం. ఇలాంటి సమస్యలు తలెత్తటం అనేది సహజం. అందుకే మంచి గృహ చిట్కాలను అవలంభించటం మంచిది.  

సుగర్ స్క్రబ్

మొఖంపై మొటిమల మచ్చలు తొలగించుకునేందుకు సుగర్ స్క్రబ్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మం మెరుగుగా మృదువుగా ఉండేలా చేస్తుంది. 3 టీస్పూన్లు పంచదార, 1 టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె ను తీసుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుని చక్కగా ముఖానికి పట్టించుకుని 15 నిముషాల తర్వాత శుబ్రంగా కడుగుకుంటే చాలు.

గుడ్డు

గుడ్డులో చాలా రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయ్. అందుచేత గుడ్డు తెల్ల సొన చాలా అద్భుతంగా మొటిమల మచ్చలపై పని చేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగల కొట్టి దానిలో నుంచీ తెల్ల సొనను వేరు చేయాలి. దానిని రాసుకోవటం వల్ల చాలా చక్కగా మచ్చలు పోతాయి. అంతేకాక గుడ్డు చర్మం లోనీ సెల్స్ లోకి వెల్లి మరీ పనిచేసి మచ్చల్ని పోగొడుతుంది.  

వంటసోడ

వంటసోడ మొటిమమచ్చలు తొలగించేందుకు చాలా దోహదపడుతోంది. 1 టేబుల్ స్పూన్ వంటసోడ తీసుకుని  అందులో కొన్ని చుక్కలు నీరు కలిపి రాసుకుంటే చక్కగా మచ్చలు పోతాయి. ఈ మిశ్రమం చర్మం లోలోపలి వరకూ పని చేస్తుంది. ఈ పేస్ట్ ని కనీసం 5 నిముషాలు ఉంచిన తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

టొమొటొ

టొమొటొ విటమిన్ ఏ, లైకొపిన్ లను కలిగి ఉంటుంది. దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్ ఏ చర్మాన్ని అరోగ్యంగా తయారు చేయటమేకాక మచ్చలను తెలగించేందుకు సాయపడుతుంది. టొమోటో ని తీసుకుని ఆ గుజ్జుని చర్మంపై రాసి 20 నిముషాలు అయ్యాక కడుగుకోవాలి. అంతేకాక టొమోటో తోపాటు అవకాడోలు లేదా దోసకాయను కూడ కులుపుకుని రాసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. అరగంటపాటు ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి. ఇలా ప్రతి రెండు రోజులూ వేసుకోవాలి. ప్రతి వారానికి ఇకా రెండు రోజులు వేసుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చు. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. 

అలోవేరా, పసుపు

అలోవేరా చాలా పోషకాలు, ఎంజైములు పాలీసాకరైడ్స్ కలిగి ఉంటుంది. ఇది యంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియా గా చర్మంపై పనిచేసి చర్మాన్ని జీవం గా ఉంచటమే కాక చర్మ మృదుత్వాన్ని అలాగే నిలుపుతుంది. ఇక పసుపు ఓ మంచి సహజ ఓషధం. ఇది వ్యతిరేకసోధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే దానిలో అలోవేరా గుజ్జును కలుపుకుని పేస్ట్ లా తయారు చేసుకుని వేసుకోవాలి. 

టీ ట్రీ ఆయిల్

తేయాకు నూనె యాంటి బ్యాక్టీరియా గానే కాక మచ్చల్ని తొలగిస్తుంది. తేయాకు నూనె ను 2-3 చుక్కలు మమ్ములు నూనెతో కలిపి దానిని ఆయా ప్రదేశాలలో రాసుకోవాలి. కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత పల్చటి దూదితో చక్కగా శుభ్రపరచుకోవాలి.

నిమ్మ

నుమ్మ ఓ మంచి యాంటిసెప్టిక్. నిమ్మ మొటిమ మచ్చలపై చాల ప్రభావవంతం గా పని చేస్తుంది. నిమ్మలో విటమిన్ ఛ్ ఉంటుంది. ఈ విటమిన్ చర్మ సౌదర్యాన్ని చాలా ఇనుమడింపచేస్తుంది. ఒక నిమ్మకాయను సగానికి కోసి సగం చెక్కను పిండి తర్వాత దానికి రెండింతలు ఎక్కువ గ్లిసరిన్ వేసి మిశ్రమంగా చేసుకుని రాసుకోవాలి. 10 నిముషాల తర్వాత కడుగుకోవాలి.ఇలా రెండ్రోజులకొకసారి చేయటం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.