Posted on

Telugu tips to remove facial hair – ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించే చిట్కాలు

ముఖం మీద అవాంచిత రోమాలను ఎవరూ ఇష్టపడరు. మహిళలు తమ ఇతర శరీర భాగాలలో అవాంచిత రోమాలకు  వాక్సింగ్ మరియు హెయిర్ రిమూవర్ లను ఉపయోగిస్తుంటారు. మహిళలు ముఖ సంబందిత హెయిర్ రిమూవర్ లను ఒక్కసారి ఉపయోగించినట్లయితే అది జీవితకాలం పాటు కొనసాగించాల్సి వస్తుంది.అవాంచిత రోమాలు ఎంతో చిరాకు కలిగిస్తాయి. దీనినుండి ఉపశమనం పొందాలని ప్రజలు నిరంతరం కోరుకుంటూ ఉంటారు.

అవాంచిత రోమాల నివారణకు కొంతమంది వాక్సింగ్ ను మరికొందరు హెయిర్ రిమూవర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించడానికి సులభమైన మరియు త్వరితమైన మార్గాలను గురించి తెలుసుకుందాం.

అవాంచిత ముఖ రోమాలు మహిళలకు సంభందించిన ఒక సమస్య. ఇది మహిళలు వారి యొక్క రూపానికి గానూ సిగ్గు పడుతూ ఉండేలా చేస్తుంది. కొంతమంది నల్లని గజిబిజి రోమాలు ముఖం మీద పెరగడం జరుగుతూ ఉండగా మరికొందరికి స్వల్పంగా గుర్తించగలిగే రోమాలు పెరుగుతూ ఉంటాయి. ఈ ముఖభాగ రోమాలు వంశపారంపర్యంగా గానీ, ఒత్తిడి వలన గానీ, హార్మోనుల మార్పులు వలన గానీ కలగవచ్చు.  మొటిమలు లేదా అధిక బరువు వంటి హార్మోనుల లోపాలు కూడా ముఖభాగ అవాంచిత రోమాలు పెరుగుదలకు కారణం కావచ్చు.

మీరు ముందుగా వాక్సింగ్, షేవింగ్, మరియు ఇతత చికిత్సలు తీసుకోవడం వలన క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉండే  అవాంచిత రోమాల సమస్య ఒక దీర్ఘ కాలిక సమస్యగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనలేనప్పటికీ  మీకు చాలా రకాలుగా సహాయం చేసే కొన్ని సులభమైన గృహ చిట్కాలను ఇక్కడ మీకు అందించడం జరిగింది.

ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించడానికి గృహ చిట్కాలు

ముఖ రోమాలు తొలగించడానికి పసుపు

భారతీయ కుటుంబములలో పసుపు ఎన్నో అందమైన వాస్తవాలతో మీ ముందుకు వస్తుంది. పసుపు తరుచుగా మీ ముఖానికి రాసుకోవడం వలన మీ ముఖ కాంతి పెరుగుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మానికి మంచి కాంతిని అందించి ఇబ్బందికరంగా ఉన్న రోమాలను తొలగిస్తాయి. పసుపు వెంట్రుకల పెరుగుదలను నివారించే లక్షణాలను కలిగి ఉన్నట్లు పేరుగాంచింది.

అవాంచిత రోమాలకు శనగ పిండి

ఇది గొప్ప ఫేస్ మాస్కుగా భారతీయ కుటుంబాలలో సంప్రదాయకంగా ఉపయోగించబడుతోంది. దీనిలోని ధర్మాలు చర్మం యొక్క కాంతి హీనతని తొలగించడంలో అత్యధిక లాభాలను కలిగి ఉన్నాయి.  శనగ పిండి, పసుపు మరియు పెరుగుల మిశ్రమము ఇతర ముఖ సౌందర్య చికిత్సల అన్నింటికంటే ప్రభావవంతంగా ఉంటుంది.  సహజ నివారణలు దుష్ప్రభాలను కలిగి ఉండవు అని మనకి తెలిసినట్లుగా ఈ మిశ్రమం చిన్నగా పెరుగుతున్న అవాంచిత రోమలను తొలగించే చికిత్సకారిణిగా నిలిచిపోయింది.

ముఖ రోమాల నివారణకు పంచదార మిశ్రమం

మీరు ఇంటిలో తయారు చేసుకునే ఈ  వాక్స్ వంటి పదార్ధము, వాక్స్ క్వాలిటీలను కలిగి స్వల్ప  నొప్పి లేదా ఎటువంటి నొప్పి లేకుండా  మంచి ఫలితాలను అందించగలదు. అయితే ఈ పద్దతి అధికంగా ప్రభావవంతమైనది అయినప్పటికీ స్వల్ప పరిమాణంలో నొప్పిని కలిగించ వచ్చు.  ప్రతిక్షేపము అయిన తేనె  మరియు నిమ్మల మిశ్రమము ముఖం మీద చిన్న పాటి చికాకుతో ఒక బ్లీచ్ లాగా పని చేస్తుంది. నిమ్మరసం, తేనె, పంచదార లను తీసుకుని మధ్యస్థ వేడి వద్ద వాటిని వేడి చేయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని అవాంఛిత ముఖ రోమాల వద్ద అప్లై చేయండి. ఆ మిశ్రమాన్ని తొలగించేటప్పుడు అక్కడ కనిపించే రోమాలను అది తొలగిస్తుంది.   వాక్సింగ్ ఇక్కడ అమలు చేయబడుతున్నందువలన ఇది   ఒక వొలిచిన క్రమంలో తొలగించబడుతుంది.

ముఖం పై అవాంఛిత రోమాల తొలగింపునకు కోడి గుడ్డుతో మాస్కు

గుడ్డులోని తెల్ల సొనని తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు ఒక అర టేబుల్ స్పూన్ జొన్న పిండిని కలపండి. పేస్టు ఏర్పడే వరకు బాగా కలపండి. తర్వాత ముఖ రోమాలు కలిగిన చోట దానిని అప్లై చేయండి. దానిని మాస్క్ వలె  ఏర్పడే వరకు ఆరనివ్వండి. అప్పుడు అది ముఖంపై అవాంఛిత రోమాలను సులభంగా తెంచి తొలగించగలుగుతుంది. ఈ గుడ్డు మాస్కు యొక్క  నివారణ సాధారణంగా గృహంలో అధికంగా ఉపయోగించే పధార్ధాలతో మంచి ఫలితాలను అందిస్తుంది.

మీ ఆహారంలో ఫైటోఈస్ట్రోజెన్స్  ఉండేలా చూసుకోండి

ఒక సంపూర్ణమైన ఆహారం  ముఖముపై అవాంచిత రోమాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖరోమాల సమస్య సాధారణంగా హార్మోనుల అసమతుల్యం వలన మరియు ఆహారపు అలవాట్లు పరిగణలోకి తీసుకోకపోవడం వలన తీవ్రతరం అవుతుంది.  పరిశోధకులు పేషేంట్లలో హార్మోనుల అసమతుల్యతలతో  ఫైటోఈస్ట్రోజెన్స్ యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధిక ఫైటోఈస్ట్రోజెన్స్ కలిగిన ఆహారం తీసుకుంటున్న వారిలో అవాంఛిత రోమాలు తక్కువగా పెరగడం గమనించారు.     అవిసె గింజలు, సోంపు, అల్ఫాల్ఫా (రాజిక) మరియు గొంటు కల (ఉత్తర భారత దేశంలో  బ్రహ్మి) మొదలైనవి ఫైటోఈస్ట్రోజెన్స్ అధికంగా కలిగి ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఆశించదగ్గ మార్పులను పొందవచ్చు.

వాక్సింగ్ లేదా థ్రెడింగ్ లేకుండా ముఖంపై అవాంచిత రోమాలను తొలగించుటకు గృహ చిట్కాలు

ముఖముపై  రోమాలు తొలగించడం ఒక నొప్పికరమైన ప్రక్రియ. ఎందుకంటే శరీరంలో ఇతర భాగాల చర్మం కంటే ముఖ భాగ  చర్మం మరింత సున్నితమైనది.  వాక్సింగ్, థ్రెడింగ్, ట్వీ-జింగ్, ఎలెక్ట్రోలైసిస్, లేజర్, ఎపిలేటర్స్ మరియు హెయిర్ రిమూవల్ క్రీమ్లు అవాంఛిత రోమాలు తొలగించే కొన్ని పద్ధతులు. అయితే ఇటీవలి సంవత్సరాలలో అనేక గృహ నివారణలు ఈ సమస్య చికిత్స విషయంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొనబడ్డాయి.

ఓట్స్ పిండితో ముఖ రోమాలు తొలగించడం

ఓట్స్ పిండి దాని నిర్మాణ రీత్యా గట్టి దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది అవాంఛిత రోమాలను తొలగించి చర్మాన్ని మృదువుగా హైడ్రేట్ గా  ఉంచడానికి సహకరిస్తుంది.ఓట్స్ పిండి, తేనె మరియు నిమ్మరసంల కలియికల మిశ్రమాన్ని పేస్టు లాగా చేసుకుని ముఖానికి అప్లై చేయండి. 15 నిముషాలపాటు వదిలేసి వెంట్రుకలను తొలగించే దిశలో మృదువుగా రుద్దండి. తర్వాత వేడి నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోండి.

ముఖం మీద రోమాలకు మంచి ఉపాయం మెంతులు

అవాంచిత రోమాలు వంటి మహిళా సమస్యలకు చక్కనైన పరిష్కారం అందించే సహజ వైద్య మూలిక మెంతులు. మునుపటి రోజు రాత్రి నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతీ రోజు తీసుకోవాలి. దీనిని ముఖానికి వేసుకునే మాస్కు లాగా కూడా ఉపయోగించవచ్చు.  సమాన భాగాలుగా మెంతుల పొడి మరియు  పెసర పొడి తీసుకుని నీళ్ళతో కలిపి పేస్టు లాగా తాయారు చేసుకోండి. దీనిని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. ఆరిపోయాక మెత్తని పొడి గుడ్డతో మృదువుగా రుద్ది పేస్టుని తీసివేయండి.

బార్లీ స్క్రబ్

బార్లీ స్క్రబ్  అనేది ముఖం మీద అవాంఛిత రోమాలను తొలగించడంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది.ఇది ముఖముపై రోమాలను తొలగించడంతో  పాటుగా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది.   బార్లీ గుండ, పాలు మరియు నిమ్మరసం కలిపి పేస్టు లాగా తయారు చేసుకుని ముఖానికి పట్టించండి. 30 నిముషాల పాటు వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.

ముఖం మీద రోమాలను  తొలగించడానికి గోధుమ ఊక స్క్రబ్

గోధుమ ఊక అనేది గోధుమల శుద్ధి ప్రక్రియ తరువాత మిగిలు పదార్ధము. ఇది సాధారణంగా జంతువుల మేతకు ఉపయోగించే గోధుమల బాహ్యపు పొర. దీనిని వివిధ మాస్కులకు మరియు స్క్రబ్ లకు కూడా ఉపయోగపడుతుంది. పేస్టు తయారు చేయడానికి గోధుమ ఊకని పాలు మరియు రోజ్ వాటర్ లతో కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఎండిపోయేవరకు వృత్తాకారంలో స్క్రబ్ చేయండి. చల్లని నీళ్లతో కడిగేసుకోండి.

ముఖంపై అవాంఛిత రోమాల తొలగింపుకు నేరేడు మరియు తేనెల స్క్రబ్

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రధానంగా నేరేడు మరియు ద్వితీయంగా తేనెలను ఉపయోగించి స్క్రబ్ తయారు చేసుకోండి. దీనిని ముఖానికి రాసుకుని వృత్తాకారంలో 20 నిముషాలపాటు మృదువుగా రుద్దండి. అప్పుడు నీళ్లతో కడిగేసుకోండి.

నారింజ-నిమ్మ తొక్కల మాస్కు

శుభ్రపరచడం, బ్లీచింగ్ మరియు చర్మాన్ని పొరలుగా వలచడానికి కొన్ని సహజ పదార్ధాల కలయిక అవాంఛిత రోమాలను తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మాస్కును తయారు చేయడానికి కొన్ని ఎండిన నారింజ తొక్కలు, నిమ్మ తొక్కలు, ఓట్స్ పిండి,బాదం, ఆలివ్ నూనె మరియు రోజ్ వాటర్ లను తీసుకుని పేస్టులాగా కలుపుకోండి. దీనిని ముఖానికి పట్టించి 5 నిముషాలపాటు వదిలేయండి.అప్పుడు మృదువుగా వృత్తాకారంలో 10 నిముషాలపాటు రుద్దండి. నీళ్లతో కడిగేసుకోండి.